Skip to main content

నిశ్శబ్దం feb20/2021

 నిర్వహణ:శివునూరి లలితా కృష్ణ

వీరా గుడిపల్లి

****************

1.కొమురవెల్లి అంజయ్య గారు

2.కోరాడ గారు

3.డా.సి.హెచ్ ఆంజనేయులు గారు

4.భరద్వాజ గారు

5.శివ లక్ష్మి రాజశేఖరుని గారు

6.వల్లాల విజయ లక్ష్మి గారు

7.దీపక్ న్యాతి గారు

8.అపరాజిత్ గారు

9.సుకన్య వేదం గారు

10.మర్రి జయశ్రీ గారు

11. ప్రమోద మునిమడుగు గారు


***********


1

20/02, 8:19 PM] +91 98480 05676: కొమురవెల్లి అంజయ్య 

అంశం మౌనం 

శీర్షిక ..మౌనాన్ని ప్రేమిస్తేనే 


శబ్దాలు గుర్రాల్లా పరుగెత్తితే

రైలులా కూత కూస్తుంటే 

సైరన్ లా మోత మోగుతుంటే 

ఎంత మాటల వస్తాదైనా, చమత్కారైనా 

సభలో మౌనం కోసం దేబిరించాల్సిందే 


అంగీకరిస్తే, అర్థవంతంగా సాగాలనుకుంటే 

మాటకు మాటకు మధ్య 

నిలబడే మౌనాన్ని ముద్దులతో ముంచెత్తాలి

మాటలతో లాలించాలన్నా, శాసించాలన్నా

అందరి చెవుల్లో తిష్ట వేయించాలన్నా

చుట్టూరా మౌనం మౌనిలా  జపం చేసుకోవాలి   


కవిత్వం కాగితం మీద బందీ చేయడానికి 

చప్పుడు నోరు మూయించి కూర్చోబెట్టాల్సిందే 

పదాల పగ్గాలు పట్టుకోడానికి 

వాక్యాలలో శ్వాసించే నేత నేయడానికి 

మౌనం ఎంత తపన పడుతుందో, తల్లడిల్లుతుందో

మౌనంలో మాగితేనే కదా 

శబ్దాలు సత్తువ సంతరించుకునేది 


అలికిడి ఎల్లకాలం రాజ్యమేలితే 

చిక్కటి చీకట్లో పాకులాడినట్లే

అలిసిపోయిందేదైనా కునుకు కోసం తపిస్తది

విరామాలు, విశ్రాంతి చుక్కలు లేని 

కథాకథనం వరదలా పారితే ఫలితం పెంటపాలే

మనిషైనా, ప్రకృతైనా 

మాటల్ని , మౌనాన్ని ప్రేమించాలి సమానంగా 

............      .....................     .................

కొమురవెల్లి అంజయ్య 

సిద్దిపేట 

తేదీ..20-02-2021

2

[20/02, 8:30 PM] Korada: కవితాగాన0

   అంశం : - *మౌనం *

       కోరాడ నరసింహా రావు!

  యేన్నేన్ని కబుర్లు చేబుతోంది

    ********************

యేంత మాటలాడుతుందీ...

ఈ మౌనం....!

యేన్ని కబుర్లు... యేన్నేన్ని ఊసులు...!!

 గతాన్ని తన వీడియో లో...

చూపిస్తూ వాదిస్తుంది... వేధిస్తుంది...ఏడుపుతేప్పిస్తుంది...నవ్వును రప్పిస్తుంది ...!

ఊహల్లో ముంచి ఉక్కిరి-బిక్కిరి చేస్తుంది...!

అల్ల కల్లోల పరచి అలజడు లే న్నో...సృష్టిస్తుంది....!

లోంగదీసుకుని క్రుంగదీస్తుంది!!

మౌనం లో మనసు కళ్ళేం లేని

గుర్రమే కదూ...!

దాన్నలా వదిలేస్తే.... గమ్యం చేర్చని మార్గాలనేన్నో పట్టి

అలా తిరుగుతూనే వున్టున్దికదా....!!

అందుకే... ఈ మౌనానికి మంచి

మేత పడేస్తే... దాన్ని అలా...

మేసుకుంటూ... బుద్దిగా కూచున్టున్ది....!

కాబట్టే కదా...,మన యోగులు

ఓ సాధనా మంత్రాన్ని

 దానికి పడేసి... వాళ్ళు యే అలజడులూ లేని ప్రశాంత చిత్తులై... హాయిగా అలా కూచో గలుగు తున్నారు...!

     ***************

       .......కోరాడ.

3

[20/02, 8:37 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: తీయ తేనియ వంటి భాష

మధుర సంగీతం వంటి భాష


ఒక శ్రీ శ్రీ యు yuga కర్తగా రాణించిన భాష


ఆప్యాయతకు సంకేతం

సమాజానికి నైతికత అందించే భాష


విశ్వం నిండా 56 అక్షరాలతో

సృజనాత్మకత అందించే భాష

అన్య భాషా పదాలను తనలో ఇముడ్చుకొని భాష


ఒక విశ్వనాధ ఒక దాశరధి ఒక ఆరుద్ర ఒక గంట సాల

ఒక నందిని సిద్ధారెడ్డి ఇ ఒక దేశపతి శ్రీనివాస్ లను

ఆల్వార్ స్వామి గీతాలను ఒక్క విమలక్క పాటలు గోరటి వెంకన్న గానం ప్రజాకళ యుద్ధనౌక గుమ్మడి విట్టల్ బాబును గాన కచేరీ చేసే భాష


తెలుగు భాష ప్రపంచ భాష 

ప్రపంచ మహాసభలను ఘనంగా నిర్వహించుకున్న తెలంగాణ యాస భాష

ఇక్కడి సంస్కృతిని ఇక్కడి విలువలను ఇక్కడి చరిత్రను నిక్షిప్తం చేసే భాష


తేట తేట తెలుగు భాష ఎంకి పాటల మధుర భాష నన్నయ్య లయాత్మక ఆదికవి భాష తిక్కన చందనాల భాష అచ్చ తెలుగు కవి సాహితీవేత్త

ఎందరో ఒడిలో నిలుపుకొన్న భాష తెలుగు వారి వెలుగు భాష జ్ఞానపీఠ పురస్కారాలు అందుకున్న భాష




రావూరి భరద్వాజ కలంలో నుండి సాగిన మంజరి పాకుడురాళ్ల భాష


విశ్వనాథ వేయిపడగలు ఐ పీవీ నరసింహారావు సహస్ర పనై సాగిపోయిన భాష


సంగీతసాహిత్యాల కలల గుమ్మం రవీంద్ర భారతి కలక భారతిగా వెలుగుతూ ఉన్న భాష రామ కథ రామాయణ కల్పవృక్షం గా అమృతాన్ని పండించిన భాష


ఎందరికో ఆదర్శం అయిన అమ్మభాష ఆత్మీయ భాష అనురాగ బంధాల తీయ తెలుగు భాష


నా గుండెల్లో సదా నిలిచిపోయే ఏడ్చిన నవీన పలికేది అమ్మ భాష లోని ఆమెకు సదా వందనాలు అభివందనాలు


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453

4

[20/02, 8:39 PM] భరద్వాజ గారు: 🦚🚹కవితాగానం 🦚♈

అంశం-నిశ్శబ్డం 

శీర్షిక- ఒక సాధన 

పేరు-భరద్వాజరావినూతల 

కొత్తపట్నం 

రచన-55

********************************

%%%%%%%%%%%%%%%%%

*****************************

మౌనం  ,

మౌనంలేని మహాయుద్ధం -

మౌనం పాటించడం  ఒకయోగం -

అది  ఓకయాగం -

ఇది  మనసు భాష 

ఆగాధమైన సముద్రం -

మాటలకందని మౌనం -

మాటలులేనిది నిశ్శబ్ద్హం -

వ్యక్తిస్థిరమైన  ఆలోచలకు రూపం -

భాధ గుండెకు పట్టినప్పుడు ఆవహిస్తుంది-

వ్యక్తి స్థిరమైన ఆలోచన్లోనిలబడితేఅవుతాడు ముని-

మౌనం అంతర్దర్శనానికి మనిషికి దీక్ష కావాలి-

మనసునియంత్రణకు మౌనం  ఒక ఆయుధం 

మౌన సాధన ప్రశాంతను కాంక్షించేవారికి  ఇస్తుందిబలం -

మనిషినిఅహంకార రహితుడ్ని చేసి మనిషిని చేసేది ఇది -

ఏకాగ్రతను పెంచుతుంది -

మౌనంగా ఉండటం చేతకాని తనం కాదు -

పట్టించుకోకపోవటం పిరికితనం కాదు 

నిశ్శబ్ద్హం అంటే ధ్యానం-ముక్తిసాధనకు మార్గం 

సమయమే అవసరంలేని చేరవేతమార్గం ఇది -

సాధనా నైవేద్యమే నిశ్శబ్ద్హం -

******************************

ఇదినాస్వీయరచన

✍️భరద్వాజ రావినూతల ((RB)🖍️

5

కవితా గానం 

 పేరు: శ్రీ శివ లక్ష్మి రాజశేఖరుని

 శీర్షిక: మౌనం కన్నా…..



 నీలో నమ్మకాన్ని నిలిపేందుకు

 చెప్పలేక నే చెప్పిన మాట

 నీ పెదవుల పైన నవ్వై  పూస్తే

 నాదేముంది


 నిరాశలో కుంగి పోతుంటే

 ఆశని వెలిగించేందుకు

 అవసరార్థం ఆడిన మాట 

సంకల్పాలకు ఊపిరి పోస్తే

 నాదేముంది


 నీ సందిగ్ధాన్ని తొలగిస్తూ

 సడలిన ఆశయాన్ని రగిలిస్తూ

 తప్పక నే చెప్పిన మాట

 సరైన దిశలో నడిపిస్తే 

 నాదేముంది


 మౌనంగా ఉండే కన్నా

 ముఖస్తుతి మంచిదే

 మాయో,  మంత్రమో

 కొంతైనా నిన్ను నీకు చూపిస్తే

 నాదేముంది

కొత్తపట్నం 

9866203795

6

మౌనభాషణ

************


నీ తలపు

అధరాలపై ధరహాససుమాలు పూయించి 

మదిలో మధురోహలు కలిగించి 

చెక్కిళ్ళల్లో రోజాలు పూయించి 

మేనులో పులకింతలు కలిగించు


కన్నుల్లో జ్యోతులు వెలిగించి 

వీనుల్లో వేణురవాలు వినిపించి 

చక్కని ఊహాచిత్రాలను ఊరించి 

మల్లెపందిరి నీడకు నను చేర్చు


నీ మనసంటి తెల్లని మల్లెసుమాలు 

నీ మమతంటి సువాసనల సన్నజాజులు 

ఈ తనువుపై మెల్లగా రాలుతుండగా 

నీ దివ్యరూపు నను మంత్రిస్థుండగా

నీపై అంతులేని అవ్యక్త ఆరాధన 

నా స్వరవీణ నుండి చిన్ని ఆలాపన 

ప్రతి నిశివేళ ఓ శశిబాల'నవ్వగ' 

నా మనసు మళ్లీ మళ్లీ పాడును


కొనసాగును మన 'మౌనసంభాషణ' 

మనలేను దినమైనా నీ సన్నిధి చేరక 

సాగలేను నేనలా కలకాలం నీతోనూ 

కల చెదురును పక్షుల కిలకిలా రవాలతోనే


;వల్లాల విజయలక్ష్మి

ఆలేరు

,[20/02, 9:24 PM] దీపక్ న్యాతి: *కవితా గానం*

పేరు : డా దీపక్ న్యాతి

తేది : 20-02-2021

అంశం : మౌనం

శీర్షిక :  మంది భాష


మూగ మనసుకు మౌనమే భాష

మౌనానికి తెలియని భాష ఉండదు

మౌనానికి అందని భావముండదు

మాటల్లేని చోట మౌనమే మంచిది

మాట పోయిన చోట మౌనమే లెస్స

మాట చెల్లని చోట మౌనం మిన్న

మనసుపడ్డ చోట మౌనం సహకరించు

మాది పిలవని చోట మౌనమే మేలు

మాది నిలవని చోట మౌనమే దారి

మంచికి ముందు మౌనమే పసందు

నిండు డబ్బ మౌనంగుంటుంది

నిండు జ్ఞాని మౌన మునిలాగ

మౌనం స్థితిమంతుడి డాబు

మేలు చేసిన చోట మౌనం ముద్దు

సాయమందిన చోట మౌనం గౌరవం

మాట గెలవాలంటే మౌనం  మౌనం వహించాలి


డా.దీపక్ న్యాతి

హైదరాబాద్

[20/02, 9:25 PM] Aparajith: నిశ్శబ్దం!


నిశ్శబ్దం ఎంత భయానకమో 

మనస్సుకు సేద తీర్చే  ప్రశాంతం!

ఒకసారి గ్రందాలయానికెళ్ళి చూడు 

అక్కడ నిశ్శబ్దం మౌన విప్లవం!

ప్రశాంతంగా చదువుకుంటూ వ్రాసుకుంటూ,,,,,,,,,,,!

ఓ ప్రచండ యుద్దానంతరం నిశ్శబ్దం 

పరమ భయానకం హేయం!

ప్రియతముల చానా కాలం తరువాత కలయిక 

నెలకొను నిశ్శబ్దం ఇరు హృదయాల ఆనంద తాండవం!

పరిపక్వ వక్త ఉపన్యసిస్తుంటే 

శరీరంపై రోమాలు నిక్కబొడిచే నిశ్శబ్దం!

శత్రు దేశాల నాయకుల కలయిక 

వారి ముఖ కవళికల్లో నిశ్శబ్దం,,,,,,!

అగ్ని కీలలు ఎగిసి ఎగిసి చల్లారుతున్న చప్పుడు,,,,,,,,,!

ఎవరూ లేని ఏకాంతం లో నిశ్శబ్దం 

ఆత్మకు అనిర్వచనీయ అనుభూతి!

ముగ్ద మనోహర సుందర దృశ్యం 

మనల్ని నిశ్శబ్దంలో కట్టిపడేస్తుంది!

ఒంటరిగా కాలినడకన దూర ప్రయాణం 

నిశ్శబ్ద బహుదూరపు బాటసారివి సుమా!

రాత్రి వేళల్లో చుక్కల్ని లెక్కిస్తూ 

సాలోచనలో నిశ్శబ్దం ఓ సుందర స్వప్నం!

మనస్సుకు వచ్చే ఆలోచనలన్నీ ఆగిపో తే 

ఆ నిశ్శబ్దం ఆత్మకు దివ్యానుభూతి!!?


ఆపరాజిత్

[20/02, 9:28 PM] +91 90002 51604: శీర్షిక...మౌనం

మౌనం.....

అనంత ఆలోచనల అంతర్మధనం

మౌనం......

ఓ ఉవ్వెత్తున ఎగిసిపడే....చేత నత్వానికి ఊతం

మౌనం....

రెప్పల మాటున దాగిన జ్ఞాపకాల గుప్తధనం

మౌనం....

 ఎన్నో సమస్యల నిశబ్ద పరిష్కారం


మౌనం.....మహర్షుల సాధనం

మౌనం ......పదునైన కత్తి లా హృదయాన్ని చీల్చే...ఓ..ఆయుధం

మౌనం.....రెండు హృదయాల ప్రేమానురాగాల సంకేతం

మౌనం.....భరించలేని వేదనా పూరిత శిక్షాపతం

మొత్తానికి...మౌనం ....

అర్థవంతమైన..మనసు...సందేశం


ప్రమోద మునిమడుగు

స్వీయరచన

[20/02, 9:30 PM] సుకన్య Vedam: కవితా గానం

పేరు:- సుకన్య వేదం

తేది:- 20/02/2021

అంశం:- మౌనం

శీర్షిక:- మౌన భాష్యం


మనసు చెప్పలేని భావాలెన్నో...

కళ్ళలో కదలాడే ఊసులెన్నో...

మౌన భాషణం చెబుతుంది...

కమ్మని మధుర స్వప్నాలనే కాదు...

బయటకు చెప్పుకోలేని బాధలన్నీ 

ఒక్క మౌనం తెలుపగలదు...

గ్రహించగల మనసే ఉంటే...

గాలికి మాట్లాడటం తెలుసా...

మరి చెవిలో ఆ గుసగుసలు చెబుతుందేమిటో...?

పూలకేం తెలుసు తమ ఉనికిని తెలపడం...?

సుమధుర సుగంధాలతో చాటడం లేదా...?

పసిపిల్లదే భాష...

అందర్నీ అలరిస్తుంది...?

కడలి తరంగాలు పలకరించడం లేదా...

తమ దూకుడుతో సుతారంగా మన కాళ్ళను ముద్దాడి...

వెతకగలిగితే ఎన్ని భాష్యాలో...

మౌనాన్నర్థం చేసుకునే మనసే మనదైతే...!!


హామీ పత్రం:- ఇది నా స్వీయ రచన. ఈ అంశం కొరకు మాత్రమే వ్రాయబడినది.

[20/02, 9:31 PM] Lalita Sister: ✳️✳️✳️✳️✳️✳️✳️✳️


*కవితాగానంలో* 


నిన్న

*విజయలక్ష్మి గారి* జన్మదినమని స్టేటస్ లో చాలా ఆలస్యంగా చూసాను నేను.


వారి జన్మదినం 

సందర్భంగా మన *సమూహసభ్యుల*

*స్పందన* నాకు చాలా ఆనందంకలిగించింది.



కవితాగానం ప్రారంభం నుండి........

ఇప్పటివరకూ...


సభ్యుల

*పుట్టినరోజులకు,*


*వేడుకలకు,*


*సాధించిన విజయాలకు,*


*శుభాకాంక్షలు*,


*అభినందనలు*


తెల్పే తీరు

అద్భుతం

👏👏👏👏👏👏


*సహృదయత* 

*ఆత్మీయతల వెల్లువై సాగుతున్న *సాహితీ స్రవంతి లా* అనిపిస్తుంది.

మన సమూహం.


సమూహసభ్యుల స్పందన కు

ధన్యవాదాలతో

🙏🙏🙏🙏🙏🙏


  ********* *లలితాకృష్ణ*

[20/02, 9:32 PM] Lalita Sister: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..మౌనం

శీర్షిక..శక్తివంతం



మన ఆలోచనలు

మదిలో కలిగే వేదనలు

భావావేశాలను అదుపు చేస్తూ

కళ్ళెం వేసే సాధనం

తనకు తానే పొందే ఓదార్పు

మౌనమే ధ్యానం

అంతర్గత శక్తిని బలపరిచే కేంద్రం

మానసిక పరిపక్వతకు మూలం

మౌనమే కొన్ని వేళల శక్తివంతం

కలహాలకు దూరం

స్పష్టత లేకుండా మాట్లాడటం

ఏమి తెలియకపోయినా

అన్నీ తెలిసినా 

మౌనం వహించడమే మిన్న

మేనికి విశ్రాంతినిస్తుంది

మనసును వాడిపోనివ్వని

అత్యంత శక్తివంతమైన ఔషధం

ఆత్మవిశ్వాసాన్ని 

మంచితనాన్ని మెరుగు పరుస్తూ

బంధాలకు వారధి అవుతుంది

మౌనం ఒక అద్భుతమైన కళ

మౌనం వహించడం కష్టమే అయినా

ముక్తసరిగా మాట్లాడటమే

సర్వదా శ్రేయస్కరం.

11.

[20/02, 9:28 PM] +91 90002 51604: శీర్షిక...మౌనం

మౌనం.....

అనంత ఆలోచనల అంతర్మధనం

మౌనం......

ఓ ఉవ్వెత్తున ఎగిసిపడే....చేత నత్వానికి ఊతం

మౌనం....

రెప్పల మాటున దాగిన జ్ఞాపకాల గుప్తధనం

మౌనం....

 ఎన్నో సమస్యల నిశబ్ద పరిష్కారం


మౌనం.....మహర్షుల సాధనం

మౌనం ......పదునైన కత్తి లా హృదయాన్ని చీల్చే...ఓ..ఆయుధం

మౌనం.....రెండు హృదయాల ప్రేమానురాగాల సంకేతం

మౌనం.....భరించలేని వేదనా పూరిత శిక్షాపతం

మొత్తానికి...మౌనం ....

అర్థవంతమైన..మనసు...సందేశం


ప్రమోద మునిమడుగు

స్వీయరచన

[20/02, 9:36 PM] Lalita Sister: *కవితాగానం*

    అంశం: మౌనం 


అన్ని సమస్యలకు ఏకైక సమాధానం మౌనం !


సమస్యల పరిష్కార మార్గం  మౌనం !


సత్కీర్తిలో మౌనానిదే అగ్రతాంబూలం!


జ్ఞాని నచ్చేది, మెచ్చేది మౌనమే కదా!


 మౌనం మన సనాతన వారసత్వ సంకేతం!


 మౌనం ప్రశాంత గుణ సoపన్నం!


 మౌనం మానవీయకోణం ఆభరణం!


 మౌనం అర్ధంగీకార సూచనం!


మౌనం తపోమునుల సద్గుణం!


 పరాoకుశం  రఘు నారాయణ

మహబూబాబాద్

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...