Skip to main content

ఆత్మీయ బంధం Feb 3/2021

 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ

*******************

[03/02, 6:29 PM] Lalita Sister: ✳️✳️✳️✳️✳️✳️


కవితాగానం

నేటి అంశం

03.02.2021

ఆత్మీయ బంధం


ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు

అంశానికి కవితలతో స్పందించగలరు.


ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకూడదు.

✳️✳️✳️✳️✳️✳️

కవివరుల జాబితా

1.మన్నె లలిత గారు

2.కోరాడ గారు

3.సుధారాణి కృష్ణం రాజు గారు

4.డా.సి హెచ్ ఆంజనేయులు గారు

5. సునంద వురిమిళ్ళ గారు

6.కందూరి సుజాతా రాణి గారు

7.డా.బల్లూరి ఉమాదేవి గారు

8., అపరాజిత్ గారు

9. పరాంకుశం రఘు నారాయణ గారు

10.వల్లాల విజయ లక్ష్మి గారు

11. మర్రి జయశ్రీ గారు

**********



1

[03/02, 8:01 PM] +91 74168 63289: కవితాగానం .

తేదీ :3/2 /21. 

నేటి అంశం :ఆత్మీయబంధం.

 శీర్షిక :బంధాలు- బంధుత్వాలు.

 పేరు :మన్నె పిన్నక లలిత.

***********************************


 పుట్టీ పుట్టగానే పేగుతో 

పెనవేసుకున్న బంధం అమ్మ

  ఆప్యాయతతో హత్తుకున్న నాన్న బంధం

 తోడబుట్టిన వారితో రక్తసం'బంధం'

 ఉమ్మడి కుటుంబాన  అను'బంధా'ల 

'బంధాల'   పిలుపు లెన్నో...

 ప్రాణ స్నేహితుల అనుబంధాలు 

ఆప్యాయతలు ఎన్నో

 పెళ్లయ్యాక పిలుపులు 

మారిన బంధాలెన్నో

 వివాహ బంధాలు 

అమ్మానాన్నల బంధాలై

 చర్విత చర్వణాలు

 గురుశిష్యుల బంధాలు

విడి వడని బంధాలు

 సాహితీ సంస్థలు ,సాహితీ మిత్రుల

 బంధాలు చిరకాల బంధాలు

 బంధాలు ఎన్నున్నా

 'బంధాలను బంధుత్వాల'ను నిలుపుకోవడమే 

ఆత్మీయ'బంధం'.

2

[03/02, 8:06 PM] Korada: కవితా గానం

 అంశం :- ఆత్మీయ బంధం

   కోరాడ నరసింహా రావు..!

         * చివురిస్తుంది *

            **********

రక్త సమ్బంధాలైనా....

స్నేహ బంధాలైనా....

అది యే బంధమైనా...

ఆత్మీయ బంధమైతేనే...

అంద మోయి....!

యే స్వార్ఢాలూ....విడగోట్ట  లేనిదే... నిజమైన బంధం !

భార్యా భర్తలు గా....

ముడి పడ్డ బంధం...

అనురాగ బంధమై...

ఆప్యాయతల అందం తో...

హాయి నందించ గలిగితే....

అది ఆత్మీయబంధ మై...

అలరారుతుంది...!

యే సంబంధమూ... లేక

పోయినా... మనసులు

కలసిన స్నేహ బంధం ను...

యే స్వార్ధ ప్రయోజనాలూ

విడదీయ లేనపుడే...అది

ఆత్మీయ బంధమై కల కాలం

నిలుస్తుంది...!

ఆత్మీయబంధము... మోలకేత్తి

చివురించ గలిగే దేక్కడ...!?

యే హ్రుదయము...దయ, జాలి, ప్రేమ... తన ప్రతి రూపమై నిలుస్తుందో...

అక్కడే ...ఆత్మీయ బంధం...

సేవ రూపం లో...మోలకేత్తి

చివురించి... విరబూస్తుంది!!

**********************#

........కోరాడ

3

[03/02, 8:36 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏 కవితా గానం🙏🙏

🙏సుధారాణి కృష్ణంరాజు🙏

*నేటి అంశం*(ఆత్మీయ బంధం)

03-02-2021(బుధవారం)

అమ్మ ప్రేమతో ఏర్పడిన

పేగుబంధం లోని ఆత్మీయతాను బంధాలు

వెలకట్టలేనివి

అమ్మ ప్రేమ ఆత్మీయత తన పిల్లలను ప్రాణం కన్నా వారి

భవిష్యత్తు ముఖ్య మని ఎన్ని

కష్టాలనయినా ఇష్టాలు గా

భరిస్తుంది అమ్మ

సంసారాన్ని చక్కగా నడిపించే

నావికుడు నాన్న ఎప్పుడూ కుటుంబం బాగోగులు చూస్తూ

బిడ్డలకు ఆత్మీయతాను బంధాలను పంచుతూ నిరంతర శ్రామికుడు నాన్న

రక్త సంబంధం అన్న, తమ్ముడు,అక్క,చెల్లి,వీరిమధ్య

ఆత్మీయత అనురాగాలు ఎంత

చెప్పిన తక్కువే

ఎవరు బాధ పడినా అందరికి

మానసిక వేదన ఈ అనుబంధం చాలా గొప్పది

మరొక బంధం సృష్టిలో తీయనైనది అన్ని బంధాలకన్నా గొప్ప నైనది స్నేహబంధం మంచి స్నేహితుడు దేహాలు వేరైనా

ప్రాణం ఒకటే అన్న ట్టుగా ఉండే

స్నేహం పొందిన వారు చాలా

అదృష్టవంతులు

అలాంటి మిత్రులు పంచే ఆత్మీయతాను బంధాలు 

చాలా విలువైనవి

మిత్రుల కష్టాలను తమ కష్టాలు గా భావించి వారికి

కష్టం కలిగితే ప్రాణ స్నేహితుని

కంట్లో కన్నీరు కారుస్తూ

సుఖం సంతోషాలలో తోడుగా

ఉండే ఆత్మీయ బంధం చాలా

గొప్ప బంధం🙏🙏👍

4

[03/02, 8:44 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఆత్మీయ బంధం

మనిషికి ఆత్మీయ బంధం అసమానమైనది

లోకంలో ఆత్మీయులు ప్రతి వాళ్లకు ఉండనే ఉంటారు

ఆత్మీయత లేకపోతే ఎదుటి వాళ్ల తో అనుబంధం కలగదు


అక్క చెల్లెలు అన్నదమ్ములు

బంధువులు స్నేహితులు

ఆత్మీయులు గా నిలిచిన అప్పుడే అన్ని కాలాలలో అన్ని సందర్భాలలో మన కోసం సహాయ పడతారు



ఆత్మీయత అనురాగం సదా నిలిచిపోయే ప్రేమ నిధులు


పిల్లలకు పెద్దలకు ఆత్మీయత ఉన్నట్లయితే అనురాగంతో ఉన్నట్లయితే ఆత్మీయ అనుబంధం చిరకాలంగా వర్ధిల్లుతాయి


ఆత్మీయ సంబంధం కష్టాల లోను సుఖాల లోను తోడుగా నిలిచే అనుబంధమని చెప్పవచ్చు


ఆత్మీయత బంధం అనేది విశ్వంలోనే గొప్ప అనుబంధం

మనము ఎక్కడికి వెళ్లినా

తనను కాపాడుతుంది ఆ గొప్ప అనుబంధం


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453

5

[03/02, 8:54 PM] కందూరి సుజాత Poetess: అంశం ...అత్మీయ బందం

శీర్షిక.. 🌷ఆలుమగలు🌷

...........  ............  .........

పెద్దలు వెతికి వెతికి వేసిన

 కొంగుముడులు.

అల్లుకున్న చిటికెనేళ్ళు

మూడు ముళ్ళ పెళ్లి బంధము .

ఆలుమగల ఆత్మీయ బంధము .

సుధాకలశ సృష్టి మూలము.


రెండు కళ్ళ చూపులూ 

రెండు కాళ్ల నడకలు ఓకే దిశలుగా .

సంసార నౌక గమ్యాన్ని 

చేరేవేయు అనురాగ మూర్తులు .

ఫలితాన్ని ఆశించని శ్రమదాన కర్తలు. దంపతుల ఆత్మీయబంధము 

మువ్వన్నెల పతాకము. 


గూటిలోని గువ్వలై 

ముత్యాల హారంల ముద్దులొలుకు పిల్లలతో 

ఒకరిలో ఒకరోదిగి ఓర్పు నేర్పు కలబోస్తు

ఆత్మీయ బంధాల తాంబాళం

ముందు తరాలకు అందించు 

ఆలుమగల ఆత్మీయ బంధము

 సెలయేరు చందము. 


ఇరు హృదయాల స్పందనలు ఆనంద కాపురం .

ఇరు తనువుల సంగమం అనుబంధ గోపురం .

గుడిలోని దైవంలా  పూజలోని పువ్వులా 

జన్మ జన్మ పునాదులు 

సంసార సారధులు 

ఆత్మీయ వెలుగులు ఆలుమగలు.


కందూరి సుజాతారాణి 

రాజేంద్రనగర్, హైదరాబాద్ 

9392162822🌷

6

[03/02, 8:57 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*

తేదీ:03-02-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: ఆత్మీయ బంధం

********************

ఎప్పుడు నా గుండె గదుల్లోకి

వాసంత సమీరమై ప్రవహించావో...

అప్పుడే నాలో ఆశల ఆమని  విరబూసింది!


 నేనో  దిగులు మేఘాన్నై

 ఎండమావుల వెంట పరుగులు తీస్తున్నప్పుడు..


ఎప్పుడైతే మమతల ఒయాసిస్సువై  నాలో స్థైర్యాన్ని నింపావో

అప్పుడే నన్నావహించిన  నైరాశ్యం తొలిగి  హరిత వర్ణ ఆనందం పల్లవించింది!


 ఋణానుబంధ రూపమా

పరిమళ భరిత సుమ గంధమా

 నా హృదయ ప్రమిదలో నీవు  వెలిగించిన స్నేహ దీపం

ఆత్మీయ బంధమై చెలిమి కాంతులు విరజిమ్ముతోంది..

7

[03/02, 9:05 PM] Balloori Umadevi Poetess: 3/2/21

కవితా గానం

డా.బల్లూరి ఉమాదేవి

అంశం:ఆత్మీయబంధం


యుగాలుమారిన విలువలు తగ్గని

బంధమీ రక్తసంబంధం

కలిమిలేములతో పనిలేక

ఆప్యాయతతో ఒకరిని ఒకరికి

చేరువచేసేదీ పాశం

పూవులో తావిలా

పూల హారంలో దారంలా

కంటికగోచరమైనా

అంతరాంతరాలలో

అంతర్లీనంగా తళుకులీనేదీ బంధం

ఒకే తరువుకు పూచిన ఫలాలుగా

అన్నా --చెల్లి--అక్కా--తమ్ముడు

అందరిలో ప్రవహించేది

అమ్మపంచిన రక్తమే అందుకే

అది అపురూపం అనిర్వచనీయ మైన బంధం

ఎల్లలు లేని ఈసంబంధాన్ని 

కానీకు కలుషితం

మానవ జీవితాలకు పునాదిగా

అలరారే ఈ బంధం

నిలవాలందరిలో కలకాలం.

8

[03/02, 9:09 PM] Aparajith: మమతల పందిరి!


అమ్మా నాన్నలు పూజ్యులు దేవతలు 

భార్య భర్తలు ఆలంబన ఆలింగనాల్లో 

సర్వసమస్యలు మటుమాయం!

అన్నా చెల్లీ--అక్కా తమ్ముడు 

మమతల కోవెలలో హృదయ రాగం!

అత్త మామలు--కూతుర్లు అల్లుండ్లు 

ప్రేమ ఆప్యాయతల కురిసే పున్నమి వెన్నెలలు!

బావ-బావమరుదులు లౌకిక ఆనంద హేల!

ఆనందాలు తాండవించే వేళ 

పసిపిల్లలు ఇలలో దేవతా ముఖులు!

ఈ బంధుత్వాలు కలల తీరాలు చేరాలంటే 

ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొవడాలు,రాకపోకలు 

మనసు మందిరంలో వెలిగే దీపాలవ్వాలి!

కష్ట సుఖాలు కావడి కుండలు!

కష్టమైనా సుఖమైనా ఒకరికొకరు తోడై నిలవాలి!

ఇక స్నేహ మాధుర్యం కలివిడిగా 

మమతలు ఆప్యాయతల ఆలవాలం!

ఈ వెల్లివిరిసే ప్రేమల ఆనంద తరంగాలలో 

సుఖ జీవితం సౌశీల్యంగా 

సంధ్యాకాంతుల్లో కలువ పూలలా తొణికిసలాడు!!

ముక్కోటి దేవతల దయ  అనుగ్రహంతో

ముల్లోకాల వెలుగులు మనిషి జీవితంలో!

మమతల మకరందాల పూదోటలవును!!

కళ్లల్లో వెలుగుల జ్యొతులు 

దయ ప్రేమ జాలి కరుణ అనురాగం నిండిన హృదయాలలో 

మనిషి జీవనం అమృత తుల్యము!!

ఆపరాజిత్

9

[03/02, 9:12 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితాగానం*


 అoశం :ఆత్మీయ బంధం


 *కవితా శీర్షిక : ఆత్మీయబంధమే ఘనం*


  ప్రగతిని  సాధించామనీ,


 నాగరికత పెరిగిందoనీ,


 గొప్పలు చెప్పుకుంటున్నా,


అనవసర కాలయాపన చేస్తున్నా,


 ఆత్మీయుల ఎడ చూపించే!


 ఆత్మీయ బంధానికి బీటలు వారాయి !


సహకరించి ధోరణికి 

స్వస్తిపలికి,


 వ్యక్తుల సమూహంతో,


 వచ్చే ఆలోచనలను సైతం పక్కకు తోసిరాజని,


ఆ ప్రయోజనoపొందే దిశలో!


వడి వడిఅడుగులు తడబడుతున్నాయి!


 అనేది వాస్తవం! కాదా !!


వ్యక్తుల మధ్య అగాధమూ,

పెరుగుతున్నది!


 ఆత్మీయబంధం బందీ అయింది !


మరీ ముఖ్యంగా...,


 వ్యక్తుల్లో వ్యక్తిగత ఇజాలు పెరిగాయి!


ఎవరి గొప్ప వారిది అనే,


వైయుక్తిక ఆడంబరాలు మిన్నంటుతున్నాయి!


_ పరాంకుశం రఘు నారాయణ మహబూబాబాద్

10

[03/02, 9:20 PM] విజయ లక్ష్మి యాదాద్రి: కవితశీర్షిక:*స్నేహప్రభంధం***

--------******************–--------

నా ప్రాణప్రద ఆత్మీయ నేస్తమా!

పసిపాప0టి మనసున్న మిత్రమా!మమతాసౌరభాల హృదయమా!

నా అంతరంగాన్ని అల్లుకున్న స్నేహమా!


నా మానస పీఠాన్నదిష్టించిన దేవీ!

నా జన్మజన్మల ప్రియబాంధవి

నేనే  నువ్వంటుంది నా చిన్ని మది

మన స్నేహబంధమే తరగని నిధి


ఎన్నోజన్మల పుణ్యఫలం నీ చెలిమి

ఇదియే నాకు నిజమగు కలిమి

నా *కల* ను నిజం చేసిన *వరం*

ఈ లోకాన నేను గడించిన స్వర్ణం


ఎన్నిసార్లు నీపై కోపం వచ్చిందో!

అన్నిసార్లు అది తాటాకు మంటయిందేంటో!

ఎన్నిమార్లు నిన్ను మరవాలనుకున్నానో

అన్నిమార్లు ఆ విషయాన్నే మరిచానేంటో!


స్వచ్ఛ మనసుల ఆత్మీయ స్నేహం

ఆజన్మాంతం కొనసాగగలదనే  

నిజాన్ని నిరూపిద్దాo చెలిమి హసించేలా

వెలివేద్దాం అసూయను జగం హర్షించేలా 


కళకళలాడుదాo ఇలాగే గిల్లికజ్జాలతో

కీలకిలమందాం ఎలాంటిస్థితిలో అయినా 

ఉదాహరణ అవుదాం స్నేహానికి మనమే

చెరగని వాక్యమవుదాం*స్నేహ ప్రభందా*న


:వల్లాల విజయలక్ష్మి

ఆలేరు

11

[03/02, 9:29 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..ఆత్మీయబంధం

శీర్షిక..మమతల మణిహారం

పసిడి పంటలతో విలసిల్లే సౌభాగ్యం పల్లెల సొంతం

ప్రేమ ఆప్యాయతలకు నిలయం

మమతల మణిహారం

 అమాయకత్వమే ఆభరణమై సాగిపోయే పల్లె ప్రజలు

మంచితనానికి,మానవత్వానికి చిరునామాలు

శ్రమైక జీవన సౌందర్యమే పల్లె గొప్పతనం

సంసృతి,సంప్రదాయాలకు ప్రతిబింబమై నిలుస్తూ

స్వార్థం,కల్మషం ఎరుగ ఆత్మీయతతో అల్లుకుపోయే 

మమతల మల్లె తీగలు

స్వచ్ఛమైన మంచి ముత్యాలు పల్లె జనుల మనసులు

ఒకరికొకరు సహకరించుకుంటూ ఐకమత్యంగా సాగిపోయే అనుబంధాలకు వారధులు పల్లెలు

పూరిల్లు అయినా 

ప్రశాంతతకు నిలయాలు

ఆపదలో అండగా నిలుస్తూ

రక్త సంబంధాన్ని మరిపించే

ఆత్మీయాను బంధంతో పెనవేసుకున్న ఋణాను బంధాలు

ఆనాటి పల్లె ప్రజల ప్రేమానురాగాలు

మరపురాని మధుర జ్ఞాపకాలు

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...