నిర్వహణ : శివునూరి లలితాకృష్ణ
***************************"
1. కోరాడ నరసింహారావు గారు
2. డాక్టర్ ఆంజనేయులు గారు
3.సుధారాణి కృష్ణం రాజు గారు
4.చెన్నా విజయ లక్ష్మి గారు
5.సునంద వురిమిళ్ళ గారు
6. భరద్వాజ గారు
7.పరాంకుశం రఘు నారాయణ గారు
8. కందూరి సుజాతా రాణి గారు
9.కొలచన విజయ భారతి గారు
10. మన్నె పిన్నక లలిత గారు
11.కె.సి నరసయ్య గారు
12. దీపక్ న్యాతి గారు
13.విజయ లక్ష్మి యాదాద్రి గారు
14.డా.బల్లూరి ఉమాదేవి గారు
15.మర్రి జయశ్రీ గారు.
***************
1
[10/02, 8:01 PM] Korada: కవితాగాన0
అంశం :- 🔥కవన జ్యోతి🔥
కోరాడ నరసింహా రావు....!
* సత్సమాజ నిర్మాణం *
*****************
మానవ మేధో క్షేత్రం లో.....
రగిలిన అక్షర నిప్పు రవ్వలు
అఖండ కవన జ్యోతి యై...
ప్రజ్వరిల్లి.... సమాజ చీకట్లను
పారద్రోలి... తన కవన వేలుగులలో...సత్యాన్ని దర్సిమ్పజేసి...న్యాయమార్గమ్లో...ధర్మ బద్దులుగా...
నడి పిన్చాలోయీ....!
కవనమే... అభ్యుదయ దిక్సూచి....!
కవనమే... వికాస మార్గం...!
ఈ కవన జ్యోతి వేలుగులలో
సుగమమవును గమ్యం..!
యిదే కదా సురక్షితం...!!
కవనమన్న సంస్కరణ...!
జీవన శాంతి... సౌఖ్యము
కవనజ్యోతి వేలుగులోనే..!!
అందుకే....!
పరిశీలించు... సమాజాన్ని...
గమనించు... సమస్యలను...
శోధించు ....పరిష్కారాలు....
జ్వలించు కవన
నిర్మించు...సత్సమాజాన్ని...!!
********************
.............కోరాడ.
2
[10/02, 8:10 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: జ్యోతిగా గమనమై రమణ మై
కవన జ్యోతి గా వెలుగొందిన
అక్షర భావాలను శరములు గా అందించే కవన వనం
సమాజంలోని కష్టసుఖాలను శోధించి సాధించి
జీవితం కలకానిది అని
విషాదంలో మునిగి
ఆనందంలో తేలి
మరో కవన మెడను కడదాం
జీవితం అనేక మజిలీలు మజిలీలు గా సాగిపోయే దృశ్యం అద్భుత కథ సాగిపోతుంది
విశ్వంలో మానవతా సందేశం అందించే అక్షరం ఎప్పటికీ నిలిచిపోయేది తరతరాల యుగ యుగాల ప్రజా చరిత్రకు సాక్ష్యం అది
మానవుడు అక్షరం విలువ అమోఘం దాన్ని ప్రతిభతో నిర్మించు అద్భుత సాహిత్య శిఖరాన్ని అందుకో జీవన సందేశాన్ని నిలుపు రేపటికి ఉషోదయాన్ని
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు
3
[10/02, 8:24 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏
🙏 సుధారాణి కృష్ణంరాజు🙏
*నేటి అంశం*కవన జ్యోతి*
10-02-2021(బుధవారం)
కవనాలు కవి హృదయం లోని
అమృత భాండాగారాలు నిత్య
నూతనంగా కవన సేద్యం చేస్తున్న కవులకు కవనాలే
ఉచ్ఛ్వాస,నిశ్వాస లు తీయ తీయని తెనెల తెలుగులో తమ
కవనాలను కలమే ఆయుధంగా ప్రకృతి అందాలను సామాజిక అంశాలను ఏ వైనా విజ్జాన కిరణాలను కవన జ్యోతులుగా
వెలిగించి అజ్ఞాన అంధకారాలను రూపు మాపే కవనాలను సృష్టించి పాఠకుల
మనసులో తమ దైన శైలిలో
కవన కుటీరాలను నిర్మించుకుని చైతన్య జ్యోతులను వెలిగించే కవనాలే
శ్వాస గా పరితపించే కవుల హృదయాలు సరస్వతీ నిలయాలు
రవి కాంచనిది కవి కాంచును
అన్ని విషయాలను అధ్బుతంగా చెప్పగలిగే వారు
తమ కవితా సుమహారాలను
అలవోకగా అందించే కవులందరూ సరస్వతీ పుత్రులే
కవన జ్యోతులను వెలిగించే
గగన కుసుమాలు🙏🙏
4
[10/02, 8:38 PM] Vijayalakshmi Ch KS 38: కవితా గానం
తేది :10-02-2021
చెన్నా విజయలక్ష్మి, బీర్కూర్
అంశం :కవనజ్యోతి
శీర్షిక :మార్పుకు ఆయుధం
********************************
హృదయం ఆర్తితో జ్వలిస్తే
బాధావీచికలు అలజడి చేస్తే
మస్తిష్కంలో పోటెత్తిన ఆలోచనాగ్ని
అక్షరమై పదమై భావానికి రూపమై
పద్యంగానో
కవితగానో
గేయంగానో
జానపదంగానో
అవతరిస్తుంది కవన కుసుమమై
ప్రకృతిలోని కమనీయ దృశ్యాలు
నిత్య జీవితంలోని నిజ సంఘటనలు
పాలకోసం పరుగులెత్తే లేగదూడ
పడిలేచే కడలి కెరటం
గల గల పారే సెలయేరు
అనేకానేక సుందర చిత్రాలు
చెత్త కుండీ ప్రక్కన ఆకలితో చేసే పోరాటాలు
అనాధల ఆర్తనాదాలు, హక్కులకోసం ఉద్యమాలు
అమాయకుల కష్టాలు, మోసగాళ్ళ అక్రమాలు
చిరు చిరు ఘటనల సమాహారాలు
విత్తులై
పదునెక్కిన ఆలోచనలు ఎరువై
కాగితపు చేలో అద్భుత పంటై
హృదయాన్ని కదిలించే ఉత్తేజమై ఆనందాన్ని పంచే అరవిందమై
విప్లవ బాటలో కాగడాయై
సంతోష లహరుల సంగీతమై
ప్రజల మది మందిరాలను చేరి
మస్తిష్కంలో సాగిన మథనంతో
కవన జ్యోతి ప్రజ్వ రిల్లి
అరాచక విషాగ్నులను చల్లార్చి
అమృత భా0డా విర్భావానికి పలుకుతుంది నాంది
మార్గ దర్శ జ్యోతియై బాటలు వేస్తుంది ప్రగతికై
సమాజానికి స్ఫూర్తియై మార్పుకు వారధి యై
నవీన సంఘ నిర్మాణానికి పునాదియై
ముందడుగు వేస్తూ సాగుతుంది మున్ముందుకు
వెలుగులు పంచుతూ కవన జ్యోతియై.
5
[10/02, 8:42 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*
తేదీ: 10-02-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: కవన జ్యోతి
*****†*************
మది సంద్రంలో మెదిలే స్పందనలను
ఆలోచనల కవ్వంతో చిలికి తీసిన
కవిత్వపు వెన్నను
మధురమైన పదాలతో కాచి
వెలిగించిన కవన జ్యోతి కాంతులు
రస హృదయాలలో భావ దీప్తులవుతుంటే
కవి ఎద ఉప్పొంగిన భావోద్వేగ
పయోనిధి అవుతుంది!
గుండె గుండెలో ఆవేదనా చీకట్లను తొలగించి
ఆత్మ స్థైర్య వెలుగులు పంచే
కవన జ్యోతి
సమస్యలను పరిష్కరిందే దారి దీపమై
తెలుగు వెలుగులను దశదిశలా
పంచుతూ ఉంటే..
కవన జ్యోతి సృజన మరింత పదునుతో
చదువరుల హృదయాలను గెలుచుకుంటుంది.
6
[10/02, 8:51 PM] భరద్వాజ గారు: 🦚☂️కవితాగానం 🦚☂️
అంశం- కవనజ్యోతి --!
శీర్షిక- ----- !
పేరు-భరద్వాజరావినూతల
కొత్తపట్నం
రచన-49
********************************
%%%%%%%%%%%%%%%%%
*****************************
నాకవనం -
అక్షరాల సమాహారం
పదాలతో రూపుదిద్దుకున్న అక్షరతోరణం -
మూగబోయిన అక్షరాలకు ప్రాణం పోసి -
పలుకాడ ని పదాలకు జీవంపోసి -
భావపు గుబాళింపులతో పరవిస్తుంది -
భాషకు ఊపిరిగానిలుస్తుంది -
అక్షరజ్యోతిగానిలుస్తుంది
అంబారాన్ని పలకరించే నాకవిత -
సంద్రాలాఘోషల కు బాషనిచ్చేనాకవిత -
పర్వాతాలనుపలకరిస్తుంది -
వెన్నెలతో ఆడుకుంటుంది -
గాలి గలగలలకు పరవిస్తుంది -
చైత్రగాలుకు చిగురిస్తుంది
నాగుండె లోతు స్పందన -నాకవనం
బీటలుపడ్డ భూమికి తొలకరినాకవనం
గ్రీష్మపువేడికి ఆషాఢం నాకవనం
కూలివానిసేదతీర్చు
సానిదానికి ఓదార్పు నాకవనం
పట్టపగలు సిరివెన్నెల నాకవనం
ముసళ్ళకు చేయూత నాకవిత -
విప్లవాన్ని చేధించే విధాత నాకవనం
ఆకలితో ఎండిపోయిన బక్కడొక్కల కన్నీటికదలను -
అడుగుబడుగులఆర్తనాదాలు రాయటానికి నాకలం -
కవితరాద్దామని కలం అందుకున్నాను -
కదలివచ్చింది సిరా కన్నీటి వేదనతో కవితయై --
వెలిగింది అక్షరజ్యోతిగా -
వెలిగింది కవనజ్యోతిగా
*******************************
********************************
ఇదినాస్వీయరచన
✍️భరద్వాజ రావినూతల ((RB)🖍️
కొత్తపట్నం
9866203795
7
[10/02, 9:04 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: కవితాగానం
అంశం :కవనజ్యోతి
*కవితా శీర్షిక :కవనజ్వలితo*
కలాలకు పదను పెట్టించి !
అవినీతిని మట్టు పెట్టించి!
నిజాయితీని అందలమెక్కించి!
దురహంకారాన్ని దునుమాడి !
అహంకారాన్ని తొలగించి!
అంధకారాన్ని తుదముట్టించి!
సమతా మమతలను పెంచి!
మహిళల్లోస్ఫూర్తిని రగిలించి!
అన్యాయాన్ని కూకటివేళ్ళతో పెకలించి !
అజ్ఞానాంధకారాన్ని అటకెక్కించి!
శాస్త్రీయ కోణాన్ని ఆవిష్కరించి!
అసమానతను నిగ్గుతేల్చి!
సాంకేతికతను ఆహ్వానించి!
బాంధవ్యాలను పెంచి పోషించి!
మహిళా సాధికారతను సాధించి !
పౌరుని బాధ్యతలను తెలిపి!
నాయకగణానికి దిశానిర్దేశనం చేసి!
అధికార దర్పం కోరలు తుంచేసి!
మనిషిమహోన్నతునిగా....,
తీర్చి దిద్దే క్రమంలో..,
ఇంటింటా చైతన్య జ్యోతులు వెలగాలి!
కవన జ్యోతులను వెలిగిoచాలి!
స్ఫూర్తి ప్రదాతలుగా వెలుగొoదాలి !
పరాoకుశo రఘు నారాయణ
జిల్లా:మహబూబాబాద్
8
[10/02, 9:06 PM] కందూరి సుజాత Poetess: అంశం.. కవన జ్యోతి
శీర్షిక.. ..🌷జ్ఞాన సుధా 🌷
.......... ........... ........
రంగు రంగు పూలమాలకు
దారం ఆదారం.
నిలువెత్తు వెంకన్న విగ్రహం పూల ముస్తాబు మనోహరం .
ఒంపుసొంపుల 56 అక్షరాల పదచాతర్యంనకు కవి హృదయం
ఆదారం.
సమస్త మానవాళి మనుగడను ముగ్ధపరచు కవన వినోదం .
కవన జ్యోతి జ్ఞాన సుధా.
గలగల సెలయేరు తీరాన సేదతీరు మదిలా..
కవనాక్షర పదభంగిమల నదీతీరాన పరవశించి హృదయము.
వ్యాకరణ ఉపోద్ఘాత నుడికార వెల్లువలో ఉరకలేయు జ్ఞానము.
అక్షర విన్యాస హొయలలో తనువూగు రాసలీల గమకమూ.
తైలం ఒత్తి ప్రమిద ఏకమైన చీకటిని చీల్చు దీప కాళిక.
అక్షర పద వాక్యమేకమైన అజ్ఞానం చీల్చు భూమిక.
సమస్యల సుడిలోంచి
దుఃఖాల ఊబిలోంచి లాగు
అరగని కరగని అక్షర మత్తు
జీవ నాడులను ప్రేరేపిస్తూ
తోడుగా నిలిచిన కవన కాగడ.
వెలుగు దివ్య జ్యోతులు ఉండగా
కవన జ్యోతికై మనసు ఉరకలేయగా
కవన కావ్య గీతికల అలల ఉరవడిలో సాగు జీవనం
నిరాడంబర జ్ఞాన సుధా సాగరం.
కందూరి సుజాతారాణి
రాజేంద్రనగర్, హైదరాబాద్
9392162822🌷
9
[10/02, 9:08 PM] కొలచన విజయ భారతి Poetess: కవితా గానం
పేరు:కొలచన విజయ భారతి
ఊరు:హైదరాబాద్
అంశం:కవన జ్యోతి
శీర్షిక: వెలుగు దారి చూపింది
తేదీ:10-2-2021
*********************
ఈ మది స్పందించి
చెప్పలేని భావాలెన్నో
గుండె కుహరంలో మగ్గిపోతుంటే
కలాన్ని తోడు తీసుకొని
అక్షర దివిటీలు వెలిగించి
"కవన జ్యోతి"
వెలుగు దారి చూపింది
ఆ వెలుగు దారిలో
ధైర్యంగా ముందుకు అడుగులేసాను
అన్యాయాలను ఎదిరించాను
అక్రమాలపై ధ్వజమెత్తాను
దీనుల,బలహీనుల
చేవలేనితనానికి
నా కవితలతో జీవం పోసాను
సమాజంలో చైతన్యం నింపాను
కర్కశ మూకల కాఠిన్యంపై
కలాన్ని ఆయుధంగా చేసి
కవితల శరాలు సంధించాను
🌹🌹🌹🌹🌹
10
[10/02, 9:09 PM] +91 74168 63289: కవితాగానం
తేదీ :10 2021
పేరు: మన్నె పిన్నక లలిత
అంశం :కవన జ్యోతి
శీర్షిక :వెలుగు జ్యోతులు
********************************
నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పి
అజ్ఞాన తిమిరాన వెలిగిందో అక్షరజ్యోతి
ఒలింపిక్ జ్యోతిని చేతబట్టిన క్రీడాకారునిలా
అక్షర కవితా జ్యోతిని ఊరూరా తిప్పిందో పుస్తకం
మస్తకంతో మధనం చేసి
పుట్టాయి ఎన్నో కవితా జ్యోతులు
ఒక చిరు జ్యోతి వెలిగించింది
ఎన్నో కవితా జ్యోతులను
గడప గడపనా వెలిగాయి
పద్య ప్రమిద కవన జ్యోతులు
ఇంటింటా వెలిశాయి గ్రంథాలయాలు
తీర్చిదిద్దారు వాటిని సరస్వతి నిలయాలు
ఆబాల గోపాల కరకమలాల లో
ఇమిడాయి పుస్తక ప్రసూనాలు
కథలు ,కవితలు , విప్లవాగ్నులు , బడబాగ్నులు
హాస్యాలు ,అంతరంగాలు, అపురూప కావ్యాలు ,కథా కథనాలు, చిత్ర కథలు, వనితావాణులు..
ఒకటేమిటి సర్వ ప్రపంచం ముంగిలి చెంతకు
స్ఫూర్తి పొందిన ఆబాలగోపాలం
వెలిగించారు ఎన్నో కవన జ్యోతులు
అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలి
జ్ఞాన దీపం వెలిగించి
(దీప -ఆవళి=దీపావళి=దీపాలసమూహం)
దీపావళి జరుపుకున్నారు కవిత జ్యోతులతో.
11
[10/02, 9:11 PM] KC Narsaiah KS 26: కవితా గానం
తేదీ 10 2 2001
అంశం కవన జ్యోతి
పేరు కేసీ నరసయ్య
శీర్షిక ఉద్యమాలలో అగ్రభాగం
స్పందించే హృదయం
సమాజం పై అవగాహన
నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం
హెచ్చుతగ్గులు లేని
సమానత్వం కోసం ఆరాటం
మంచి సమాజం కోసం
బాటలు చూపిన నవయుగ వైతాళికులు
అన్ని ఉద్యమాలలో
అగ్ర భాగమై వెలుగొందిన కవన జ్యోతులు
12
[10/02, 9:14 PM] దీపక్ న్యాతి: *కవితా గానం*
పేరు : డా.దీపక్ న్యాతి
తేదీ : 10-02-2021
అంశం : కవన జ్యోతి
శీర్షిక : కవి కర ఖ్యాతి
జ్యోతి వెలుగు అంధకారాన్ని చేధించు
కవన జ్యోతి అజ్ఞానాన్ని మధించు
కవన వనాన విరబూసిన పదాలు
వీక్షించే పరిమళాలు సంధించు
కవన జ్యోతి ప్రకాశ వెలుగులు
పంచు సాహిత్య సందేశాలు
కవన జ్యోతి దివిటీల కాంతి
క్రాంతియై భవిత భాసిల్లు
సమ న్యాయం సమ సమాజం
కవన పఠన పరమార్థ ధ్యేయం
కవనం వినోద విజ్ఞాన వనం
ఆచార్యులకైనా అదములకైనా అందులకైనా
శ్రవాణానందం చమత్కార కవనం
చరిత్రకైనా వాస్తవానికైనా భవితకైనా
కవన పుటల తలపు స్మరణీయం
కవన జ్యోతి కిరణాల వెలిసిన
వాక్యాలు సువర్ణాక్షరాల హారాలు
మెప్పు పొందితే వరహాలు
మది నిండితే పలహారాలు
డా.దీపక్ న్యాతి
హైదరాబాద్
[10/02, 9:21 PM] విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక: *కవన కాంతులు*
******** ******* *****
సన్నజాజి, గులాబి గన్నేరు
మా పెరటి మొక్కలు
సాయంసంధ్య వేళల
చల్లని పవనాలకు తలలూగిస్తు
సుమ గoధాలతో సేద తీరుస్తూ
"నీ పరిమళమెట్టిద"ని ప్రశ్నించే.
అనంత ఆకాశానున్న
లెక్కలేనన్ని చుక్కలు
ఆదమరచి నేను అలా
అబ్బురంగా చూసిన వేళల
తలుకులతో మిలమిల మెరుస్తూ...
"నీ వెలుగులు ఏవ"ని ప్రశ్నించే.
ఆఘ్రాణింప చేయాలి
మా చిన్ని మొక్కలతో
నా అక్షర సుమాల
ఆరని మారని సుగంధాలను.
మార్గదర్శనం "చేయాలి"
ఆ ఆకాశ తారలకు
అన్ని కాలాలలో వెలిగే
నా *కవనజ్యోతుల కాంతుల**తో....
14
కవితా గానం
డా.బల్లూరిఉమాదేవి
అంశం:కవన జ్యోతి
శీర్షిక:కవితా పుష్పకం.
ఎందరు ఎక్కినా మరొకరికి
తావును కల్పించేది పుష్పకవిమానం
మదిలో మెదలే సుందర సుమధురోహల
కాలంబనగా నిలిచేదీ మనో వ్యోమయానం
నవరసాలను అలవోకగా చిందిస్తూ
అక్షర రూపంలో సాగే భావతరంగం
రవిగాంచనివి సైతం మనోనేత్రంతో చూచి
అందంగా ఆనందంగా అందించే కవితా జాలం
పాటలైనా పద్యాలైనా కవితాసుమాలనన్నీ
తనలో చేర్చు కొంటూ సాగే కవితా పుష్పకం
తీపి గురుతుల పేటిలా
చేదునిజాలకు నిలయంలా
హృదయాకాశంలో సాగే పుష్పకం లో
నేను సైతం అంటూ పయనించే కవన భాండం
అణువు నుండి అంతరిక్షం దాకా
అంశం ఏదైనా రంగుల హరివిల్లులా భాసిస్తూ
అలవోకగా తనతో పాటు కొనిపోయే
అక్షరాల కవితాజ్యోతి
ప్రతి కవికి
ఇదో అపురూపమైన ఆభరణం.
:వల్లాల విజయలక్ష్మి
ఆ లే రు
నాటి నేటి మేటి యుగయుగాల కవులు
అఖండ జ్యోతిగా
వెలుగుతున్న కవన జ్యోతి కాంతులు
15
కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..కవన జ్యోతి
శీర్షిక..విజ్ఞాన కాంతులు
చుట్టూరా ఉన్న పరిసరాలు
నిత్యం ఎదురయ్యే సంఘటనలు
మదిలో మెదిలే భావాలు
మస్తిష్కపు పొరలలో దాగిన తలపులు
బడబాగ్నిలా ఉబికి వస్తూ
అక్షర రూపంలో వెల్లువై సాగే కవన జ్యోతులు
కమ్ముకున్న సమాజ చీకట్లను పారదోలే విజ్ఞానపు వెలుగులు
ప్రగతికి బాటలు వేసే ప్రత్యుశ కిరణాలు
అభ్యుదయానికి వారధులు
శాంతి సౌఖ్యాలకు పునాదులు
ఆత్మవిశ్వాసం కలిగించే వెలుగు దివ్వెలు
మనోల్లాసాన్ని కలిగిస్తూ
వ్యదలనెన్నో దూరం చేస్తూ
సమస్యల సాధనలో సఫలీకృతులను చేసే మార్గాలు
సమ సమాజ స్థాపనకై జాగృతి చేసే చైతన్య దీప్తులు
కవన జ్యోతి కాంతులు అంతటా ప్రసరించాలి
నూతనోత్సాహం వెల్లివిరియాలి ప్రతి మదిలో
Comments
Post a Comment