Skip to main content

హరివిల్లు Feb 4/2021

 నిర్వహణ : శివునూరి లలితాకృష్ణ

*******

1.కొలచన విజయ భారతి గారు

2. మన్నె లలిత గారు

3.కోరాడ నరసింహారావు గారు

4.డా.సి.హెచ్ ఆంజనేయులు గారు

5.పరాంకుశం రఘు నారాయణ గారు

6.సునంద వురిమళ్ళ గారు

7.కె.ఇ.నిలమంగై గారు

8. అపరాజిత రెడ్డి గారు

9. దీపావళి ఉషారాణి గారు

10.సంధ్యా శర్మ గారు

11.కె.సి.నరసయ్య గారు

12. వల్లాల విజయ లక్ష్మి గారు

13.మర్రి జయశ్రీ గారు

14.డా.బల్లూరి ఉమాదేవి గారు

15.సుధారాణి కృష్ణం రాజు గారు


*****

1

[04/02, 8:11 PM] కొలచన విజయ భారతి Poetess: కవితా గానం

పేరు: కొలచన విజయ భారతి

ఊరు: హైదరాబాద్

అంశం: హరివిల్లు

తేదీ:4-2-2021

******************

ఎండా వానా కలయికలో

పుట్టిన రంగుల విల్లు

మబ్బుల మెరుపులను

వాన జల్లుల విరుపులను

పొదుపుకుని జనియించిన

జలతారు తీగల వీణియ

నింగీ నేలను  ఏకం చేసిన 

చిరుజల్లుల హరివిల్లు

గగనాన వెలసిన బొమ్మరిల్లు

ప్రేమికుల హృదయాల్లో

మరుల శరాలను సంధించే

మరుని విల్లు

చిన్నిపాపల కన్నుల్లో

మెరుపులు మెరిపించే

పన్నీటి జల్లు

నింగిలో  పూసినా

ఇంటి లోగిళ్ళలో సందడి చేసే

సప్త వర్ణాల సిరిమల్లి

      🌹🌹🌹🌹🌹

2

[04/02, 8:14 PM] +91 74168 63289: 

కవితా గానం

 తేదీ :4 /2 /21

 అంశం: హరివిల్లు.

 శీర్షిక: సప్తవర్ణాల సింగిడి

 పేరు  :మన్నె పిన్నక లలిత.

**********************************************.


  అందాల హరివిల్లు

 ఆకాశానికి ఆతపత్రం

 భూమిలోనుండి మెులుచుకు వచ్చినట్లున్న 

రంగు రంగుల చాపం

 అర్థ వృత్తాకార రత్న వర్ణ చాపం

 సూర్యుడు  ఎరుపును  ప్రతిబింబించే

 అరుణ వర్ణ ఇంద్రధనస్సు

 అరుణ వర్ణంలో ఇమిడిన సప్త వర్ణాలు

 వర్ష సూచకంగా వచ్చే  ఇంద్రచాపం 

 రైతుకు హర్షాన్నిచ్చే హరివిల్లు

 హరివిల్లు చూచిన బాల్యం

 ఆనందంతో కేరింతలు  వేస్తుంటుంది

 ఆబాల గోపాలానికి  అందాల హరివిల్లు 

  ఆనందాన్నిస్తుంది

  సప్తవర్ణాలతో  సమయం తక్కువైనా

 ఎల్లరకు   మోదాన్ని ఇస్తున్న  ఇంద్రధనుస్సు 

 ఆకాశంలో రంగుల  అర్థ చాపం 

 వేస్తుంది ప్రజల మనస్సుల్లో 

  తెల్ల పూల చినుకుల బాణం

3

[04/02, 8:14 PM] Korada: కవితాగాన0

 అంశం :-  🌈హరివిల్లు🌈

  కోరాడ నరసింహా రావు...!

  🌈* పదిల పరచుకో....*🌈

       🌈🌈🌈🌈🌈🌈

గగన మంత విశాలమైన...

విస్త్రుత సృష్టి లో.....

క్షణం మేరిసి...మాయమై పోయే...హరివిల్లే గా జీవితం!

సప్తవర్ణ శోభితమే....,ఐనా...

తల్చుకుంటూ... మురిసి పోయే

క్షణా లో...వేదనతో కుమిలి పోయే... అనుభవాల గ్న్యాప

కాలో... ఏవరి కేరుక...!?

యేవరి జీవితం... వారికే....

తేలియని ఓ వింతే కదూ...!

అంతా బుద్బుద ప్రాయమే !!

అసాస్వత మే... అనుకోకు !

అసాస్వతానికి...సాస్వతత్వాన్ని చేకూర్చట0 లోనే ఉందోయి

మనిషి ప్రతిభ...!

నీ జీవితంలో... ను వ్వేసే...

ప్రతి అడుగూ... ఓ మనోహర

వర్ణ రంజితము గా దిద్దుకో....,!

నీ జీవిత హరివిల్లును...ఓ చేరి

గి పోని... చిరస్తాయి పేజీగా...

చరిత్ర పుస్తకంలో పదిల పర చు కో....!!

  ***********************

       ........కోరాడ.

4

[04/02, 8:18 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: హరివిల్లు

ఇతనే ఒక రంగుల హరివిల్లు

మనోహర సౌందర్య దృశ్యం జీవితం

రంగురంగుల సప్తవర్ణ సంతకం

జీవితం వలయం


అందాల దృశ్యంగా ఆనందమై సాగిపోతుంది

విషాదాలు విచారాలు లేని కాలంగా రావాలని కావాలని

మనసారా హరివిల్లై

విరియాలని

మనిషి అంతులేని ఆనందంలో మునిగి నప్పుడు వెన్నెల స్నానం చేసినప్పుడు


సౌందర్యం ఒక అపూర్వ రంగురంగుల దృశ్యం




వర్షంలో కురిసీ 


జీవితమంతా హరివిల్లై సాగని


సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453 సింగిడి

5

[04/02, 8:31 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితా గానం*


      అంశం :హరివిల్లు 


*కవితా శీర్షిక :హరివిల్లు శోభ* 


ఆకాశంలో సప్తవర్ణాలు

ఒలకబోస్తూ ...


హరివిల్లు విరిసింది !


బాలల్లో ఆనందపు హొయలు


ముచ్చటగా ముద్దు లొలికింది!


 చిరుహాస్యపు జల్లులతో

చిందులు తొక్కింది!


 ఆ అల్లరి చేస్టలే కదా!


వారిలో నూతనోత్తేజపు బీజాలు !


ఆ అపురూప దృశ్యాలు!


 అమ్మానాన్నలకు కడివెడు ఆనందాలు !


వాకిట్లో చిటపట చినుకులు! 


అరమరికలు లేని హాస్యపు జల్లులు!


 పరాంకుశం రఘు నారాయణ

    మహబూబాబాద్

6

[04/02, 8:40 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*

తేదీ:04-02-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: హరివిల్లు

*******************

ఎండల కోపతాపాలకు తల్లడిల్లి అలిగిన అవనమ్మను

నాలుగు చినుకుల చుంబనాలతో 

ప్రేమగా హత్తుకుని 

తడిపొడి వెలుగుల చిరునవ్వులు చిందిస్తాడు.


ఆనందం ముప్పిరిగొని  ఆశ్చర్య పోయేలా

హరివిల్లు వర్ణాల హారాన్ని

అనురాగంతో  కంఠాన  అలంకరించే దృశ్యం!


నయనానందకరంగా

నరులకు ఇచ్చిన  అపురూప వరం... 

 శాస్త్రీయ విజ్ఞానం .. కాంతి వక్రీభవన సూత్రం ప్రతిపాదించిన 

యథార్థాన్ని కళ్ళకు కట్ఠించినా

ఎదలో నింపుకున్న తరతరాల భావాలకు నిలయమవుతుంది..

ఏడు రంగుల ఆంధ్ర ధనుస్సై

ఎదలో ఉప్పొంగే  సంతోషాల వెల్లువ అవుతుంది...

 రంగు రంగుల బూరల వేడుకవుతుంది!


 రంగు రంగుకో రమణీయత

సంతరించుకున్న హరివిల్లు

 ఆబాల గోపాలాన్ని 

ఆనంద డోలికల్లో ఊరేగిస్తుంది!

7

[04/02, 8:48 PM] Komandoori Neela Poet: కవితా గానం

అంశం: *హరివిల్లు*

తేది:04/02/2021

          వచన కవిత్వం


నీలాకాశం నిండు ముత్తైదువులా సింగారించుకొని మురిసిపోతోంది..!

వేకువ సూర్యబింబం నుదుటి సింధూరమై సొగసులీనుతోంది..!


ఎండా,వానల మేలు కలయికలో నీరెండ పడుతూ సప్తవర్ణాల హరివిల్లు శృంగారం అంబరానికి ఆనందపు మెరుపులు దిద్దుతోంది..!


తారా,చంద్రులు రాత్రివేళ మిలమిలల సొగసునద్ది..

ఆనంద సాగరంలో ఉర్రూతలూగిస్తూ జీవులందరి మనసులలో చైతన్య గీతాలాపనలు పలికిస్తూ ఊయలూగిస్తోంది..!!!!!

     

పేరు: కె.ఇ.నిలమంగై

కలం పేరు:నీలా రంగనాధం

ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.

చరవాణి సంఖ్య:8897155600.

*ఈ పై  కవిత ఈ సమూహం కోసం రాసినదేనని హామీ ఇస్తున్నాను.*

8

[04/02, 8:59 PM] Aparajith: లోకమెల్లా ప్రశాంతత నెలకొన్నటుల!


పాల సంద్రం చిలికి నటుల 

చిన్ని కృష్ణుడు వెన్న దొంగిలించినటుల 

నిండు చంద్రుడు వెన్నెలారబోసి నటుల 

నింగిలోని తారలన్నీ కలబడి నటుల 

పాలుగారే పసిపాప నవ్వి నటుల 

శివపార్వతులు నాట్యమాడి నటుల 

దివారాత్రులు ఏకమై నటుల!

సీతా సమేతంగా రఘురాముడేతెంచి నటుల 

వాల్మికి రామాయణం గాణం చేసి నటుల 

లేగదూడకు గోమాత పాలు కుడిపి నటుల 

మామిడి తోపు లేతచిగుళ్లతో కళ కళలాడి నటుల 

కృష్ణమ్మ పరవళ్లు గళ గళలాడి నటుల 

చీకటి వెలుగులు సమ్మిళితమై నటుల!

సన్నటి వేణు గానం వీణుల విందు చేసి నటుల 

కోయిలల కు కూరవాలు సన్నాయి వాయించి నటుల 

తెల్లని కొంగలు పంటపొలాలపై రెక్కలల్లార్చుతున్నటుల 

తెల తెలవారగనే పడతులు రంగవల్లుల్లో మునిగి నటుల 

బృందావనిలో మురళీధరుడు గోపికలతో నాట్యమాడి నటుల 

ఆనందభైరవి రాగం జగత్ జనని గానం చేసి నటుల 

చదువరి పుస్తకంలో లీనమై నటుల!

ఉషా కిరణాలు సమస్త జగత్తును మేల్కొలిపి నటుల 

పక్షుల కీల కీలలతో ప్రకృతి పరవశించి నటుల 

సప్తాశ్వాలను పరుగులెట్టిస్తూ భానుడు ఏతెంచి నటుల 

చిరు చిరు జల్లుల్లో సప్త వర్ణాల హరివిల్లు విరిసినటుల 

లోకమేల్లా ప్రశాంతత నెలకొన్నటుల!!


ఆపరాజిత్

9

[04/02, 9:00 PM] +91 70755 17538: 

శీర్షిక.హరివిల్లు

.....

జీవిత దారిలోన

సాగే ఎన్నో సుడిగుండాలు

మనసును తాకే ఎన్నో 

ఘాటు గాయాలు 

బతుకును రంగుల హరివిల్లు

సప్తవర్ణ శోభితము చేసేను


కష్టాలు మనిషిని

కొండంత అండను చేస్తే

బతుకును బంగారుమయము చేసెను


శృతిమెత్తని మాటలతో

మనిషిని నిండుగా ముంచే

మనుషుల మధ్యలో

గుండెకు తగిలేటి 

ఎన్నో అనుభవాలు

మనిషి బతుకును చేసెను

రంగుల హరివిల్లు


ఆకాశములో వాన తరువాత

వచ్చేటి రంగుల హరివిల్లు

ముగ్ద భావాలను కలిగించు

మదిని మురిపించు 

ముద్దు ముద్దుగాను


ధనాశి ఉషారాణి

చిత్తూరు జిల్లా

10


[04/02, 9:17 PM] Sandya Sharma Poetess: కవితాగానం


అంశం:హరివిల్లు


౪౪౪౪౪౪౪౪౪౪౪౪


ఏ అంతరంగాన్ని 


ఆవిష్కరించాలన్నా


ఆకసాన్ని 


ఒక్కసారి తడిమి చూడు...


గుండెలోతు గాయాన్ని


నీలపు రంగు నీలిమ...


తట్టి లేపుతుంది...


ఏ చినుకు


మొలకెత్తి పుడమినిండా


పువ్వుల పరిమళం విరబూయాలన్నా


పచ్చల హారం నవ్వుతూ దోసిట్లోకొస్తుంది...


ఏ మత్తేభపు గాన కోయిల


గాంధర్వ  స్వరాన్ని కదిలించాలన్నా


పుత్తడి బొమ్మకు  పారాణి పాదాలపై


పసుపు ముద్దవుతుంది... 


ఏ సుగంధం నిర్మలత్వాన్ని


ఆసాంతం హత్తుకుని 


శ్వేత వర్ణం  అమరత్వాన్ని అరచేతిలో ఒంపుతుంది...


ఏ ధ్యాన ముద్రలో 


మోక్ష మార్గపు సందేశం...


కాషాయపు కాంఛనమై 


మదిలో నిర్గుణ హితమై వెల్లివిరుస్తుంది...


వెన్నెల విరిచిన  వేకువకు


ఏ చైతన్య కిరణాలను ప్రజ్వలిస్తుందో


రుధిర ధారను ధారపోస్తూ 


మేల్కొలుపుతుంది...


నిశిని నిద్దుర లేపే మేఘ వర్ణపు సోయగం


హరివిల్లుల మణిహారపు  కెంపు కెంజాయం..


సప్తవర్ణాల సాగరం...


జీవన సౌరబాల సౌగంధం...!


౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪౩౪౩౪౪౪౪


వై.కె.సంధ్యశర్మ✍️

11

[04/02, 9:20 PM] KC Narsaiah KS 26: కవితా గానం

 అంశం: హరివిల్లు

 04-02-2021

 పేరు: కెసి నరసయ్య

 శీర్షిక: విరామంలో ఆరామం



 ఆకాశంలో ఆరబోసిన

 ఆనందాల రంగుల వలయం

 అర్థచంద్రుని రూపంలో

 ఆవిష్కరించిన

 అపురూప సప్తవర్ణాల వలయం

 సప్తసముద్రాల అలలపై

 కనువిందు చేస్తున్న

 సప్తవర్ణ అర్ధవలయాకార  విన్యాసం

 చల్లనైన ప్రకృతిలో ప్రశాంత వదనం

 ఎండా వానల విరామంలో ఆరామం

 చిన్నారులలో చిగురించిన ఆనందాల ఆశలు

 అందరి మనసుల్లో నిండుకున్న ఆహ్లాదం

 కనులలో మెరిసిన మైమెరుపు 

 హరి వంచిన విల్లు హరివిల్లు ఇంద్రధనస్సు

12


[04/02, 9:25 PM] విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక:***చిరునవ్వుల హరివిల్లు

-------***********-**---------


నీ తలపు ఎదన కదిలిన చాలు

నా అధరాలపై దరహాసచంద్రికలు


నీ మమత మదిన మెదలిన చాలు

నా కన్నుల్లో కాంతిధరహాసాలు


నీ చెలిమిసమీరం హృది మేఘాన వీచిన చాలు

నా హృదయధరణిపై విరియు *హరివిల్లు* 


నీ చిలిపినవ్వుచిరుజల్లు కురిసిన చాలు

నా మేనున విరియు పులకింతల పూలు


ఎంతటి ఒత్తిడినైనా ఉప్ అనిపించే నా చిరునవ్వుకు నీవే ప్రేరణ కానీ..


ఎంతో స్వచ్ఛంగ స్పటికంలా కనిపించే నీ చిరునవ్వుకు కారణం నేనే అవనీ.....


నీ కాటుకకన్నులకాంతిలో నను                                కననీ కమనీయ కలలలోకాలను


నీ చిన్ని నవ్వులనావలో నను

చేరనీ నవ్వుల నవ్యలోకతీరానికి


నీ స్వచ్ఛమైన చిరునవ్వువీణ                                       పలకనీ వీనులకు శ్రావ్యంగా


నీ శ్రావ్యమైన చిరునవ్వులవేణువు

పాడనీ కలకాలం హృద్యంగా


వల్లాల విజయలక్ష్మి,, ఆలేరు

13.

[04/02, 9:26 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..హరివిల్లు



మేఘాలు ఉరుములు లేనిదే

ఎక్కడిది ఆకాశన అందమైన హరివిల్లు

చిట పట చినుకులు కురిసేవేళ

నవ్వుతూ ఉండే ఉరుము పుత్రికనే కదా హరివిల్లు

ఆకాశన  సప్త వర్ణ శోభితమై

శోభను చేకూర్చుతుంది

పిన్నల పెద్దల మనసును ఆనంది0ప జేస్తూ

అంతలోనే మాయమవుతుంది

మానవ జీవన పయనం అంతే

క్షణంలోనే సంతోషం

ఆ క్షణమే అంతులేని భయం

ఎందుకో తెలియని వింత రహస్యం

ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ

ఎదురయ్యే అనుభవాలెన్నో పాఠాలుగా మార్చుకుంటూ

నైపుణ్యంతో అనుకూలంగా

 మలచుకుంటూ 

ముందుకు సాగిపోతేనే

జీవితం ఆనందాల హరివిల్లు

అవుతుంది అనుబంధాల పొదరిల్లు.

14

[04/02, 9:28 PM] Balloori Umadevi Poetess: 4/2/21

కవితా గానం

డా.బల్లూరి ఉమాదేవి

అంశం: హరివిల్లు


సప్తస్వరాలు సంగీతం 

 శ్రవణానందకరం

సప్తవర్ణాల హరివిల్లు 

నయనానందకరం

చూసే కొద్దీ చూడాలనిపిస్తూ

మైమరపించే సుందర దృశ్యం

 ఇంద్రధనస్సు వయ్యారాలొలికిస్తూ ఆనందానుభూతి లో ముంచి తేలుస్తూ వెల్లివిరుస్తోంది ఆనందాలు హరివిల్లు

అనుకున్నది సాధించినప్పుడు 

మదిలో సంబరాల హరివిల్లు కూరుస్తుంది అంతులేని ప్రశాంతతను

 ఏడు రంగుల హరివిల్లులా

 ఏడేడు జన్మల బంధం 

 అనుక్షణం ఆనందంతో సాగాలి

  వెల్లి విరియాలి  ఆనంద హేల

15

[04/02, 9:31 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏

🙏సుధారాణి కృష్ణంరాజు🙏

*నేటి అంశం*హరివిల్లు*

04-02-2021(గురువారం)

ఏడు రంగులు మానవ జీవితంలో ఆపాదించుకున్నపుడు ప్రతి రంగు కు ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక అమ్మాయి ఇంద్రధనుస్సు ను తన వయసుతో పోల్చకుంటుంది

ఆరంగులు అన్నీ కలబోసి

తన మనసుగా అలాంటి రంగులన్నీ ఒకటిగా మారి తన

మనసు మల్లె వంటి తెల్లదనంతో పోల్చుకుంటుంది

హరివిల్లు లాంటి తన మనసును దోచుకుని మల్లె వంటి మనసున్న భర్త దొరకాలని ప్రతి మగువ కలలు

కంటుంది

హరివిల్లు లోని రంగులన్నీ తమ ముంగిలిలో ఉండాలని

తమ ఇల్లు ఆనందాల హరివిల్లు కావాలని రంగుల

మయంగా సుఖం సంతోషాలలో నిండి పోవాలి

అని హరివిల్లు  దివినుండి భువికి దిగి రావాలి అని

కోరుకుంటారు🙏👍

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...