Skip to main content

మాతృ భాష 2021 feb 21

 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ

***************************

కవి వరుల జాబితా

1.డా.ఆలూరి విల్సన్ గారు

2.డా.పాండాల మహేశ్వర్ గారు

3.డా.మహ్హద్ షరీఫ్ గారు

4.సుధారాణి కృష్ణం రాజు గారు

5.దేశపతి మోహన్ శర్మ గారు

6.దీపక్ న్యాతి గారు

7.శివ లక్ష్మి రాజశేఖరుని గారు

8.డా.బల్లూరి ఉమాదేవి గారు

9.కోరాడ గారు

10.కొలచన విజయ భారతి గారు

11.శివునూరి లలితా కృష్ణ గారు

12.ఇంద్రావత్ రాహుల్ గారు

13.సంధ్యాశర్మ గారు

14.పరాంకుశం రఘు నారాయణ గారు

15.మర్రి జయశ్రీ గారు

************

1

[21/02, 6:55 AM] Aluri Wilson Poet: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా...


కవి పేరు: డా.ఆలూరి విల్సన్

చరవాణి:9396610766

ఈ-మెయిల్: aluriwilson55@gmail.com


కవితా శీర్షిక:  *"తెలుగు ఖ్యాతి మనది"*


విశ్వవ్యాప్త సంప్రదాయ సంస్కృతికి నిలయం తెలుగు భాష

అమ్మ పిలుపుల ఆత్మీయత మధుర పదముల

తేనె లొలుకు తీయని

స్వర జీవ భాష 

మనసు కదిలించు పవిత్ర  జీవ ప్రాణాక్షరం 

మహా భారత రచన  నన్నయ్య తిక్కన్న ఎర్రన

ప్రతిభా శైలికి పునాది తెలుగుభాష  గురజాడ ,జాషువా

రచనలో మెరుపులా మెరిసిన స్వచ్చమైన తెలుగుభాష        

అమృతము కురిపించగ దివినుండి భువి కేగిన దివ్యభాష  తెలుగు భాష

త్యాగయ్య గొంతులో తారాడిన నాదము తెలుగు భాష 

గ్రాంధికమై వ్యావహారికమై అపురూప నెమలి

అంద చందాల తెలుగు భాష

తెలుగు అక్షరముల అతి దీప్తి రమ్యముల

కవిత్వ రూపాంతర తెలుగు భాష

పాఠ్య గ్రంధ‌మున గ్రాంధికమై జాన పదమున వ్యావహారికమై

మేఘముల మెరుపు తీగవలె  నవ్య పదకేళి

ప్రభవించు మేలిమైన తెలుగు భాష

కృష్టరాయలచే కీర్తింపబడిన అపురూప

అంద చందముల

ముత్యముల ముదు‌ ముద్దు  తెలుగు భాష

అన్ని భాషల కన్న తీయనైన తెలుగు భాష మనది

తెలుగు ఖ్యాతి మనది

2


[21/02, 7:52 AM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: ***  తెలుగు వెలుగు ***

                                ✍️డా.పాండాల


ఉదయించురవివోలె

నులివెచ్చమనురాగ

కొంగ్రొత్త వెలుగుల కోర్కెతెలుగు!


చిరుగుండె లోగిల్లొ జిజ్ఞాస చిగురోలె

ఓలలాలించెడి ఊహతెలుగు!


సింధూరపువ్వులా 

చిరునవ్వునెమరేయు

సొట్టబుగ్గలమెర్గు సోకుతెలుగు!


గుండెలోతుల్లోను గణమును సరిజేసె

నయగారములతావి నవ్యతెలుగు!


నిత్య నూతనంబైనిల్చి నిగ్గుదేల్ఛు

ఇటలి భషకే ధీటైన తేటతెలుగు!


జుంటితేనెల తీపిచ్చె కంటి వెలుగు

శక్తియుక్తుల రక్తియే ముక్తి తెలుగు!


✍️డా.పాండాల మహేశ్వర్

గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి.

3

[21/02, 8:21 AM] Sharief Sir: -:జై తెలుగు జై జై తెలుగు:-

తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు

ఆ.వె:

చక్కనైన భాష చక్కెర మూటరా

మాటలాడుచుండ మధురముండు

కావ్యభాష మనది కాపాడవలెనురా

వీణమీటినటుల వినగసొంపు

ఆ.వె:

తెలుగు భాష నాది తేనెలూరించురా

పలుకు చుండ మేను పరవశించు

రాజ పూజ్య భాష రాజిల్ల వలెనురా

జగతి నున్న వరకు జాతి మెచ్చు

ఉ:

తీయని భాషనాది రుచి తేనియ ద్రావిన తీపినుండగన్

రాయగ గుండ్రమైన లిపి రమ్యత నొప్పగ

జూడచక్కగా

హాయిని గొల్పు మాటలను యంబర మందున దేలినట్లు బల్

సోయగ మొప్పగా తెలుగు సొమ్ముగ శారద యమ్మవారికిన్!


                             డా.మహ్మద్ షరీఫ్

                                     సంగారెడ్డి

4


[21/02, 8:54 AM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో🙏సుధారాణి కృష్ణంరాజు🙏21-02-2021(ఆదివారం)

*తెలుగు భాష తేనెలూరు

తీయనైన అమ్మ భాష

మయూరాల నాట్యం చేసిన

మత్త కోకిల రావాలు

తీయగా మత్తెక్కించిన

అలల సోయగంతో

ప్రకృతి పరవశించిన

భూమిక పచ్చని రంగులు

అద్దినట్టుగా పంట పోలాలను

చూసి మనసుకు కలిగే ఆహ్లాదం

ఎదలోతులోని భావాలను అక్షర లక్షల గా పేర్చి ఆ వాణికి

మన భావ సుమాలను కవన

మాలలు అల్లి సమర్పించే తెలుగు భాష మనది

ప్రకాశ వంతంగా తెలుగు వెలుగు కు మరేది సాటి

అమ్మ లోని ఆత్మీయతాను రాగాలు నాన్న లోని అనురాగాలు మన తెలుగు జిలుగులతో వెదజల్లే పలుకులే

వాణికి వీణా పాణికి శర్వాణికి

మధురమైన సౌరభాలు సమర్పించే మన భాష అధ్బుతం దానికి పోటీ లేదు

సాటి రాదు 

🍯 తేనె కన్నా తీయనిది తెలుగు భాష ‌

ప్రపంచానికే వెలుగు లు పంచే

వెలుగు భాష నవరసాల భావాలను భావగర్భితంగా నినదించే భావాల పరిమళం

మన తెనుగు 🙏🙏👍

5

[21/02, 9:07 AM] Deshapathi Mohan: దేశపతిమోహన్ శర్మ(మెదక్)

ప్రక్రియ:మణిపూసలు

అంశం: తెలుగు భాష

★★★ తెలుగు భాష ★★★


1.అమ్మలాంటి తెలుగు భాష 

    అచ్చనైైన తెలుగు భాష 

    ఉగ్గు పాలతో అమ్మ 

    నేర్పు నట్టి  మాతృభాష 


2.తెలుగే మనకు వారధి 

   తెలుగే మనకు సారధి

   తెలుగు కవుల కలం లోన ..

   దాగిన కవితల జలధి 


3.తెలుగు భాష వ్యాకరణం 

   తెలుగుకు పచ్చతోరణం 

    ఆచంద్రతారార్కం 

   తెలుగుకు ఉండదు మరణం 


4. తెలుగు భాష అమృతమే 

    పూర్వజన్మ సుకృతమే 

    తెలుగుభాష భూషణమై..

   సు"వర్ణ " అలంకృతమే


5. పద్యమైన,గద్యమైన 

    భారతి నైవేద్యమైన 

    తెలుగే ..కవి వైభవాన్ని 

    నిలుపు తన అక్షరమైన


★తెలుగు మనది,తెలుగు మా నది..తెలుగే మా నిధి★

6

[21/02, 9:39 AM] Lalita Sister: ✳️✳️✳️✳️✳️✳️✳️✳️


కవితాగానం

సమూహసభ్యులకు


అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ

శుభాకాంక్షలు


ఈ సందర్భంగా

ప్రత్యేకకవితలకు ఆహ్వానం పలుకుతుంది

మన సమూహం


రాత్రి 

ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు

స్పందించగలరు.


✳️✳️✳️✳️✳️✳️✳️✳️

[21/02, 10:00 AM] దీపక్ న్యాతి: *దివిటీలు 196*



                  మాతృభాషను

           తృణప్రాయంగా తలచకు

                  అమ్మ కనులను

           చెమ్మమయంగా చేయకు



 *మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు* 


                                   డా.దీపక్ న్యాతి

                            నంది అవార్డు గ్రహీత7

7

[21/02, 1:38 PM] Lakshmi Chamarthi Khammam: పేరు: శ్రీ శివలక్ష్మీ రాజశేఖరుని

 శీర్షిక: తీయనైన అమ్మ భాష


 నే తొలిపలుకులు పలికినప్పుడు

 అమ్మ కళ్ళలోన ఆనందం అంత అద్భుతం 

 నా మాతృభాష

 వివేకం నేర్పిన పెద్దబాలశిక్ష

 వినోదం పంచిన చందమామ కథ

 ఆరుబయట వెన్నెల్లో

 బామ్మ చెప్పిన ఇతిహాస గాథ

 వేమన పద్యాల నీతి

 సుమతి శతకాల ఖ్యాతి

 వింటూ ఎదిగిన నా పయనంలో

 పదాల ప్రమిదల్ని  వెలిగిస్తున్నప్పుడు

 నాలో పొంగే భావాల జ్యోతి

 కలం పట్టిన ప్రతి సారీ

 నా కలల్ని చిందించి 

 కవితల్ని పలికించే 

 అద్భుతమైన అక్షరాల స్రవంతి


 శ్రీ శివ లక్ష్మి రాజశేఖరుని

8

[21/02, 1:49 PM] Balloori Umadevi Poetess: డా.బల్లూరి ఉమాదేవి.

పద్య సంఖ్య:-15 పద్యములు

అంశం:మాతృభాష

ఛందస్సు:ఆ.వె,కం:


1.ఆ.వె : అమ్మ భాషలోన కమ్మగా భాషించ 

             తెలుగుతల్లి మెచ్చిదీవె నొసగు 

             తెలుగుభాష నేర్చిదేశదేశములందు 

             మహిత కీర్తిగనుము మంచిగాను. 


2.ఆ.వె :తెలుగుభాష లోని తీయందనము నెల్ల 

           పూర్వకవులు వ్రాసి పొగడినారు 

           వారి బాట నడచి వాసిగా పేరొంద 

            కీర్తి కల్గు ప్రజకు స్ఫూర్తి కల్గు. 


3.ఆ.వె:వాసి కెక్కినట్టి వ్యాసభారతమును

            నాంధ్రభాషయందు ననువదించి

            రాజరాజు చెంత రాణించె నన్నయ

           ఆదికవియు నయ్యె నవనియందు


4.కం:కౌరవ పాండవ కథగల

       భారతమున్ యనువదించి ప్రథితిని గనుచున్

       సారము దెలుపుచు తిక్కన

    భారతమును పూర్తిచేసి వాసిని గాంచెన్.


5.ఆ.వె:శంభుదాసుడనగ జనులనుతిని పొంది

       ఖ్యాతికెక్కినట్టి కవివరేణ్యు

     డనువదించి శేష మాంధ్ర భారతమును

    మూడవ కవియయ్యె ముచ్చటగను.


6.ఆ.వె:తాళ్ళపాక కవులు తన్మయత్వము తోడ

    వ్రాసినారు మంచి పాటలెన్నొ

     వాని మధురిమలకు భగవంతుడే మెచ్చి

    సేవగైకొనెనట శీఘ్రముగనె.


7.ఆ.వె:పిన్నవయసునందె పెద్దకావ్యంబులన్

    విరివి గాను వ్రాసి పేరు నొందె

     కవులయందు తాను గవిసార్వభౌముడై

    వెలిగి నాడు గనుడు విశ్వమందు.


8కం:వెన్నుని కథలను పోతన

   విన్నాణముతోడ వ్రాసి వెలుగులు పంచన్

    మన్నన తోడను చదివిన   

   బన్నంబులుబాయు ననుచు పఠియింతు రిలన్.


9.ఆ.వె:ఆతుకూరి మొల్ల యాదిగ మహిళలీ 

       వసుధ యందు తాము వాసియైన

      కావ్యములను వ్రాసి ఖ్యాతిని పడసిర

      టంచు మరువ బోకు మవని యందు.


10.ఆ.వె:ఆంధ్రభోజుడనుచు నందరు నుతియింప

        నాదరించె నెల్ల యాంధ్ర కవుల

      నాంధ్ర భాషలోన నాముక్త మాల్యదన్

         వ్రాసి ఖ్యాతి గాంజె వసుధ యందు.


11:ఆ.వె:నవల నాటకముల నద్భుతముగ వ్రాసి 

          కవుల చరితకూర్చె కమ్మగాను

           వెలిగె విశ్వమందు వీరేశలింగము

           తెలుగు వెలుగులనిట తేట పరచె.


12.ఆ.వె:వ్యవహరించు భాషె వ్రాయవలెనటంచు

         పలువు రొప్పునట్లు పాటు పడుచు

         గిడుగు వారు నొక్క పిడుగై విజృంభించి

        తెలుగు భాషనొక్క మలుపు దిప్పె. 

                        

    13.ఆ.వె :ఆటుపోట్ల కెపుడు నదరబోదీ భాష 

       వన్నె తగ్గ బోదు వాసి హెచ్చు 

     "దేశభాష లందు తెలుగు లెస్స"యనుచు 

           కృష్ణవిభుడు నాడె కీర్తి పెంచె. 


14.ఆ.వె:తెలుగు భాష నెవరు తేలిక చేసినా 

        నూరకుండ బోకు నుర్వి యందు 

     తెలుగు వాడినంచు దీటుగా స్పందించు 

          తెలుగు వాడి వేడి తేట పరచు. 


15..ఆ.వె: తెలుగు భాష లోని తియ్యం దనమ్మును 

       నెల్ల వారలకును నిడుట కొరకు 

     తరలి రండు తమరు తడవును సేయక 

      గోవు పాల వోలె గ్రోల గాను/వచ్చు.


16:ఆ.వె:తీయదనము నందు తేనెను మరపించు

         భాషయన్న తెలుగు భాష యనుచు

      ప్రస్తుతించి దాని బలమును పెంచుచు

              పూర్వ కవులు దీని పొగిడి నారు.

9

[21/02, 6:48 PM] Korada: మాత్రుభాషగోప్పదనం

   కోరాడ నరసింహా రావు....!

       * కన్నతల్లి సమము *

           **************

మాత్రు భాష గోప్పదనం....

మరువబోకు సోదరా...!

పరభాషా వ్యామోహం...

వీడలేవ సోదరీ.....!!


అమ్మ యనే పిలుపు లోనే...

ఉన్నదేంతో మాధుర్యం !

పులకింత తో మాతృ హ్రుదీ

పోంగి ప్రేమ పంచునుగా...!!


తీయనైనదనీ మన తేలుగును

పోగడిరి మున్నేన్దరో....!

మనతేలుగుభాషలోనే...వేలసి నవి మహోత్క్రుష్టగ్రంధాలు...!!


రామాయణ, భారతాలు...

పురాణాలు, భాగవతము

ఖ్యాతి నేంతో దేఛినవి...

తేలుగు ఘనత చాటినవి...!


పలుకులలో... ఉత్తేజం....

వినినంతనే... ఉల్లాసం...

కలిగించును తేలుగు భాష

మనం తేలిసికోనాలందర0!


మన భాషయే మనకు ముద్దు

పర వ్యామోహము వద్దు....

మన కన్నతల్లి సమముతేలుగు

తేలుగు తోనే మనకు శుభము!


వేరే భాషకూ లేని గోప్పతనము

మన పద్యమునకే దక్కేను...!

మనభాషను మనమే...

నిర్లక్ష్యము చేయ తగునా...!?


ప్రధమముగా మాత్రుభాష

సుబోధకము సోదరా...!

దిద్దించుము అ ఆ లను

సిగ్గు పడక సోదరీ....!!

*********************

      ..........కోరాడ.

[21/02, 7:02 PM] Lalita Sister: ✳️✳️✳️✳️✳️✳️✳️✳️


కవితాగానం

సమూహసభ్యులకు


అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ

శుభాకాంక్షలు


ఈ సందర్భంగా

ప్రత్యేకకవితలకు ఆహ్వానం పలుకుతుంది

మన సమూహం


రాత్రి 

ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు

స్పందించగలరు.


✳️✳️✳️✳️✳️✳️✳️✳️

10

[21/02, 8:06 PM] కొలచన విజయ భారతి Poetess: "కవితా గానం"

పేరు:కొలచన విజయ భారతి

ఊరు: హైదరాబాద్

అంశం:అంతర్జతీయ మాతృ భాష దినోత్సవం

శీర్షిక: తియ్యనైన నా తెలుగు భాష

తేదీ:21-2-2022

********************

తియ్యనైన నా తెలుగు భాష

నా మాతృభాష

అమ్మ పొత్తిళ్ళనుంచీ నన్ను

హత్తుకున్న భాష

ఉంగా ఉంగాల నుంచీ

సంగీతాలు పలికించిన భాష

అమ్మ ప్రేమంతా రంగరించి

పోసిన బంగారు భాష


అక్షరాలు ఏబది ఆరు

అచ్చతెనుగున ఉదయించిన

పదబంధాలు వేనవేలు

అచ్చతెలుగు నుడికారాలలో

సుడులు తిరిగిన భాష

క్షీరసాగర మథనం నుంచి పుట్టిన అమృతాన్ని తాగిన 

దేవభాష

పలుపలుకులో స్వాతిముత్యాలు కురిపించే భాష


అచ్చులు హల్లులు

దిద్ది నేర్చిన భాష

ఒత్తులు దీర్ఘాలతో బతుకు పాఠాలు నేర్చిన భాష


అందమైన ఛందస్సు లతో మేధస్సును మథించే భాష

అలరించే అలంకారాల భూషణాలు

సమస్యాపూరణాల తోరణాలతో తెలుగు వాకిలిలో

వెలుగుతున్న తియ్యనైన భాష


"దేశభాషలందు తెలుగు లెస్స"

అని కృష్ణ దేవరాయలచే కీర్తించబడిన  తెలుగు భాష

గ్రాంథిక వచనమై యున్న తెలుగు

గిడుగు వారి నీడలో

వాడుకభాషయై  అందమైన రూపుదాల్చిన తియ్యనైన

తెలుగుభాష  నా మాతృభాష

      🌺🌺🌺🌺🌺

11

[21/02, 8:08 PM] Lalita Sister: మధురభాష 


ఆటవెలది 


1.తేనెలొలుకునట్టితీయనయిన భాష

అచ్చులoతముండు నమృతభాష

తలపులందునిండితరగిపోకుండెడు

మాతృభాషకన్నమధురమేది? 

 


2.పలుకు లెన్నొ  గలిగి ప్రాచీనమయిన నా 

తెలుగుభాషకిలను ధీటుగలదె? 

పద్యకవనములును పలుకు బడులతోడ

పరిఢ విల్లినట్టి భాష  తెలుగు


3.చక్కనైన తెలుగుసాహిత్య సoపద

మిక్కుటముగ నున్నమేటి భాష 

దేశ దేశములనుతేజరిల్లె  తెలుగు

మాతృభాషయన్నమనసు మురియు


.

4.హృద్యమైన వియగుపద్యములను గల్గు 

తెలుగు భాష ఘనత తెలుప తరమె?  

ప్రాసయతులతోడపద్యమ్ము రచియిoప 

పరవశించి మనసు పదిలమగును


5.మాతృభాషతెలుగుమాధుర్యముల పంచు

ననుభవైక వేద్యమదియు నిజము

అన్య భాష లెన్ని యవనిలో నేర్చినా 

మాతృభాషయందు మాటలాడు


కందము 


6.అన్నుల యజంతభాషగ

పన్నుగప్రస్తుతినివొందెపాశ్చాత్యులచే

కన్నులవిందగు లిపిచే

మిన్నగ నా తెలుగు భాష మేదిని వెలిగెన్


********లలితాకృష్ణ

12


[21/02, 8:14 PM] Indravat Rahul Poet Ks 11: *"కవిత గానం"*

 ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱


*శీర్షిక :* అమ్మ భాష 

 *తేది :* 21/02/2021



      *🌈"అమ్మ భాష"🌈*



అమ్మ భాష కమ్మదనం

తీయనైన తెలుగుదనం!!

మమతానురాగాల భాష

ముద్దు మురిపాల భాష!!

ప్రాంతీయత  మాతృ భాష 

యాస పలుకులతో!! 

ముందుకు సాగుతున్న భాష

జానపదం ఉట్టిపడుతున్న భాష!!

మాతృ తల్లి భాష

కమ్మనైన మధుర పలుకు!!

అమ్మ పాల భాష 

మన తెలుగు -వెలుగు!! 

మాతృ భాష ఎంత మధురం 

కాదోయ్ గరళం!! దేశ భాషలందు తెలుగు లెస్స

అన్నా రాయల వారి!! 

మాట నిజముగా తెలుగు 

భాష ఉగ్గు పాల భాష!!.... 


*ఇంద్రావత్ రాహుల్* 

        కొత్తపేట్ 

  నిజామాబాద్ 

 9848054079..

13

[21/02, 8:40 PM] Sandya Sharma Poetess: *కవితాగానం*


*అమ్మ భాష ఆవేదన*

*********************


*పరభాష*

*కోడెనాగై బుసలు కొడుతూ*

*నట్టింట నాట్యమాడుతుంటే*

*అమ్మాయని*

*అమ్మ భాష కన్నీళ్ళ*

*పర్యంతమై*

*వీధి గుమ్మం వైపు నిలుచుని*

*విలపిస్తోంది*

*"రా రమ్మని"*

*లోనికి రమ్మన్నా*

*అమ్మ భాష నాకు చోటెక్కడని*

*ఎదురు ప్రశ్నించింది*

*"మాతృ భాషయని "*

*అమ్మలు గన్న అమ్మగా*

*చూసుకొనగ*

*నేటితరం.....*

*అమ్మలను*

*ఓల్డేజీ హోములకు*

*పంపించినట్లు*

*నన్ను *"ఓల్డ్ మదర్ టంగ్"* *గా చూసుకుంటున్నారులే*


*మీ గుండెల గుడిలో*

*కొలువుంచాల్సిన*

*మీ*

*అమ్మ మీకు*

*బరువైతే*

*మరి మీకిక నేనెంత?*


*మీ పెదవులతో ఒకే ఒక్కసారి*

*అమ్మ భాషలో *"అమ్మ"*

*అని నోరారా పిలిస్తే*

*ఒక్కసారి*

*విని తరించాలని వుంది*

*అమ్మా అని పలికితే*

*నా మనసు*

*ఉత్సాహంగా*

*ఉల్లాసంతో*

*ఉరకలు వేస్తూ*

*సెలయేరు*

*పరవళ్ళలా*

*పరవశించిపోతుంది*

*నా మనసు*


*అ...అమ్మ... అమ్మా....*

*అదిగో ఎవరో .. నన్ను*

*పరదేశీయులు పిలుస్తున్నారు*..

*మరి నేనిక వస్తాను...*

*మీ గుండెల సవ్వడి* *నాకెపుడూ*

*ప్రతిధ్వనిస్తూనే*

*వుంటుంది*

*ఆ గుండెకు గాయం మాత్రం*

*చేయకు*

*నీ హృదయాలయంలో*

*కొలువుండేది నేనే కదా*

*జాగ్రత్త సుమా!*


*మరి ఇక శెలవా!!*


*అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సంధర్భంగా*

*************************


*యాయవరం సంధ్యశర్మ*

*చిత్తూరు

15

[21/02, 8:56 PM] 1 రఘు నారాయణ KS40: *కవితాగానం*

(అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం సందర్భం పురస్కరించుకొని )


*కవితా శీర్షిక :తెలుగు భాష ఔన్నత్యం*


 *భాషా సౌష్టవంతో భాషా సౌశీల్యంతో*


 *అశేష జనం మెచ్చిన నా తెలుగు భాష !*


*భాషా సౌందర్యంతో భాషా విశిష్టతతో*


*చరిత్ర పుటలలో వెలుగొందిన నా తెలుగు భాష!*


 *దేశభాషలందు సొగసులు వెదజల్లి !*


*లోకాన రంజిల్లుతుండే నా తెలుగు భాష !*


*అన్య భాషల కెల్ల మిన్నయై వెలుగొంది !*


*శాశ్వత ఘనకీర్తి పొందిన నా తెలుగు భాష !*


*దేశ భాషలలో వాసికెక్కిన*


*చక్కనైన చిక్కనైన నా తెలుగుభాష!*


*విభిన్న భాషా వైకల్పితాలతో,*


 *కీర్తిగాంచే నా తెలుగు భాష !*


*భాషా రసజ్ఞతతో తేనెలూరించి*


*జగతిన పరిఢవిల్లిన భాష నా తెలుగు భాష!!*


*భిన్న భాషలలో సమ్మిళితమై వెలుగు కిరణమై,*


 *ప్రజ్వరిల్లిన భాష నా తెలుగు భాష!*


*అవధాన ప్రక్రియలో మేటిగా నిలచి,*


*సర్వులూ మెచ్చిన భాష నా తెలుగు భాష!*


 *ఆశుకవిత్వాన దిగ్గజమై  సర్వామోదభరితమై,*


 *వెలిగింది నా తెలుగు భాష!*


పరాంకుశం రఘు నారాయణ

      మహబూబాబాద్

[21/02, 9:33 PM] Lalita Sister: కవితాగానం

16


మర్రి జయశ్రీ

అంశం..మాతృభాష

శీర్షిక..అందమైన పూదోట



పసిపాప బోసినవ్వులో

పరిమళించిన 

సుందరమైన  సుమాల పూదోట నా తెలుగు భాష

తొలి పలుకుల భాష

తేనెలొలుకు భాష

అమ్మ నేర్పిన భాష

కమ్మనైన భాష

మధురమైన భాష

మమకారపు భాష

సొగసైన ముత్యముల అక్షరాలతో

అందంగా కూర్చిన 

 సుందరం మాతృభాష

స్వర ఝరీ ప్రవాహమై

సాగెడి సజీవ భాష

రాజులు మెచ్చిన భాష

రమ్యమైన భాష

ఆదిత్యుని కిరణమై

తేజస్సును నింపు చైత్యనం నా భాష

పర దేశియులు ప్రశంసించిన భాష

వెన్నెల వెలుగై 

దారి చూపు మాతృభాష

అమ్మ భాషలోని మాధ్యుర్యాన్ని ఆస్వాదిస్తూ

నైపుణ్యాలను మెరుగులు దిద్దుకుంటూ

అత్యున్నత స్థాయిని చేరుమా

అన్యభాషల మోజులో

త్రిశంకు స్వర్గంలో వేలాడుతూ

అనామకుడిగా నిలిచిపోకుమా

ఆదరించుము పరిభాషలను

ఏ దేశమేగినా

మాతృభాషను మరువకుమా

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...