Skip to main content

వేడుక Feb 5/2021

 నిర్వహణ: శివునూరి లలితాకృష్ణవేడుక

*********************

కవివరుల జాబితా

1.సుధారాణి కృష్ణం రాజు గారు

2.పరాంకుశం రఘు నారాయణ గారు

3.కోరాడ గారు

4.డా.బల్లూరి ఉమాదేవి గారు

5.డా.సి.హెచ్ ఆంజనేయులు గారు

6.కొలచన విజయ భారతి గారు

7.మన్నె లలిత గారు

8.మర్రి జయశ్రీ గారు

9.సి.హెచ్ విజయ లక్ష్మి గారు

*****************

1

[05/02, 8:20 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏

🙏 సుధారాణి కృష్ణంరాజు🙏

*నేటి అంశం*వేడుక*

05-02-2021(శుక్రవారం)

*తెలుగు వారి సంస్క్రుతి సాంప్రదాయాలలో వేడుకలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది పండుగలలో దీపావళి, సంక్రాంతి, రాఖీ పూర్ణిమ దసరా

మొదలైన వాటిని అందరూ కలిసి వేడుకలు చేసుకుంటారు

అలాగే పుట్టిన రోజులు, పెళ్ళి ళ్ళు మొదలైన వాటిని కూడా

ఎంతో సంతోషంగా జరుపుకుంటారు

ఇంతకుముందు ఎవరింట్లో నైనా పెళ్ళి వేడుకలు జరిపితే

ఊరందరికీ పండుగ సందడిలా

అందరూ పాల్గొనే వారు ఆడపిల్ల ను పెళ్ళికూతురుని

చేసినప్పటినుండి వివాహం జరిగి అప్పగింతల వరకు ఊరందరి వేడుకలా భావించే వారు బంధువులు స్నేహితులు

సన్నిహితులు అందరూ వారం

రోజు ల పాటు వేడుకలలో పాల్గొనేవారు

ఊరిలో అమ్మాయి వివాహం అయితే ఊరందరికీ అమ్మాయిలా భావించేవారు

అమ్మాయిని అప్పగింతల కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు అందరూ

కంటతడి పెట్టి అమ్మాయిని

జాగ్రత్తగా చూసుకోవాలి అని

వియ్యాల వారికి విన్నవించుకునేవారు

బంధువులు వారం రోజులు ఉన్నా కూడా ప్రేమ, అభిమానం, ఆత్మీయతలతో

వారు తిరుగు ప్రయాణం లో జ్జాపకాలను మూటకట్టుకుని

వెళ్ళేవారు అప్పుడుకూడా వారి పాదరక్షలు తీసి దాచేవారు మరొక రోజు ఉండాలన్న ఆరాటం కనిపించేది

కుటుంబం మొత్తం ఈ వేడుకలలోని అనుభవాలను

ఆరునెలల వరకు ఇరుగు పొరుగు వారితో పంచుకునే విధంగా ఉండేవి పెళ్ళి వేడుకలు

నేడు అలాంటి వేడుకలు ఆప్యాయత లు మచ్చుకైనా

కనిపించవు ఏ వేడుకలు జరిగిన ఒక గంట ఉండటం

చాలా కష్టం

ఉన్నంత సేపు సెల్ ఫోన్ లతోనే

కుస్తీ పడుతుంటారు తప్ప తాము వచ్చిన సందర్భం ఏమిటన్న విషయం మరిచి పోయే విధంగా ఉంటాయి వీరి

వ్యవహార శైలి పిలిచిన వారు

అలాగే వచ్చిన వారు అలాగే

ఆడంబరాలు చూపించడం

వారు చేస్తే తమ హొదాలకు

ఎక్కడ భంగం కలుగుతుందో

అని వచ్చిన వారు చాలా జాగ్రత్త పడుతుంటారు

ఏది ఏమైనా నాడు ఉన్న వేడుకలు సంబరాలు అభిమానం ఆత్మీయతలు నేడు

కనుమరుగవుతున్నాయి అనేది

మాత్రం వాస్తవం🙏🙏👍

2

[05/02, 8:22 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: కవితాగానం


    అంశం: వేడుక


*కవితా శీర్షిక: కుటుంబం సంరంబం*


మనసు లోని కల్మషాలను

నిర్మూలించే క్రమంలో..,


బంధుత్వాల యోగక్షేమాలూ..


సామూహికంగా తెలుసుకునే కోణంలో!


 పరస్పర అవగాహనతో..,


 లభ్యమయ్యే ప్రయోజనాలతో ..,


నూతనోత్సాహాన్ని నింపుతూ..,


జవ సత్వాలకు ఊపిరిపోస్తూ,


 పసందైన విందులతో!


 కనువిందైన పందిళ్ల నడుమ


భాతాఖానీలు కొడుతూ..,


 పరాచకాలు ఆడుతూ..,


 సరదాలు పంచుకుంటూ..,


 సంస్కారాలు నేర్చుకుంటూ..,


 అవినాభావo పెంచుకుంటూ..,


తనువు నిండా తన్మయం పొందుతూ..,


 అపార్థాలను తొలగించుకుంటూ.. ,


 ముత్తైదువులకు తాంబూలాలిస్తూ..,


బాజా భజంత్రీల సవ్వడితో!


 ఆత్మీయతకు విలువనిస్తూ..,


 సాగిపోయేది సాంప్రదాయ వినోదం !


ఇది వేడుకల సంరంబం!


 అది సంతోషాలకు నిలయం!


 సదా సర్వ కళాశోభితo!!


పరాoకుశం రఘు నారాయణ  

       మహబూబాబాద్

3

[05/02, 8:28 PM] Korada: కవితా గానం

  అంశం :-     * వేడుక *

  కోరాడ నరసింహా రావు....!

  *కాసులుగల-గలలాడితేనే*

    **********************

 మనిషి పుట్టుక తోనే....

వేడుకలు  మోదలు...!

మనకు యేన్నేన్ని వేడుకలో!

ఈ వేడుకల కూడికల్లో...

యేంతేంత ఉత్సాహం...

ఉల్లాసం... ఆనందం !!

బారసాల తో మోదలై....

అక్షరాభ్యాసం...,యేటికేడూ...

జరుపుకునే...

 పుట్టినరోజు వేడుకలు...! 

పాప పుష్పవతి యైతే... చుట్టాలు, పక్కాలూ.... స్నేహితులతో... సందడిగా...జరుపుకునేసరదా వేడుక...!

జీవితంలో.... కన్నుల పండు వగా...అంగ రంగ వైభోగమ్గా

ఆనందోత్సాహాలతో జరుపుకునే వేడుక వివాహమేగా....!

జీవితాన్ని విజయవంతంగా

పరి పూర్ణం చేసుకుని....

కోడుకులు...కూతుళ్ళు....

అల్లుళ్ళు... కోడళ్ళు....

మనుమలు... మనుమరాన్డ్రు

చుట్టాలు, స్నేహితులతో...

త్రుప్తిని పోందే వేడుక....

సశ్టిపూర్తి గాక మరింకేది!?

జరుపుకో గలగాలే గానీ...

వేడుకగా జరుపుకునేందుకు

మనకేన్నేన్ని పండుగలు లేవు?!

వినాయక చవితి... దసరా...,

దీపావళి...హోలీ... శ్రీరామ నవమి...సంక్రాంతి, ఉగాది...

చేప్పుకుంటూ పోతే చేంతాడంత అన్నట్టు

కలిగిన వాళ్ళకు....

 అడుగడుగునా వేడుకగా జరుపుకునే పండుగలే...!

లేనోల్లకు..... కడుపునిండా కమ్మని కూడు దోరికితే...

అదే గోప్ప పండుగ....!

పదిమందితో కలిసి ఆనందాన్ని 

వేడుకగా పంచుకోగలగట0...

ఓ గోప్ప అద్రుష్టమే....!

యే వేడుకలైనా... కాసుల

గల గల తోనే గా... అవిలేకున్టే

మరింత వేదనే తప్ప...

వేడుక లేక్కడ....!!

*********"************

     .....కోరాడ.

4

[05/02, 8:31 PM] Balloori Umadevi Poetess: 5/11/21

కవితా గానం

డా.బల్లూరి ఉమాదేవి

అంశం:వేడుక

శీర్షిక :వేడుక


జనన కార్యమైన నామకరణమైన

చౌలమైనా ఉపనయనమైన

వివాహమైన సీమంతమైనను

వేడుక కూర్చును జనులకు భువిలో

అలసినమనసుకు ఊరట కలిగిస్తుంది

యాంత్రికంగా సాగే జీవనయానంలో

ఎల్లవర్గాల వారికి నాటవిడుపుగ

నుత్సుకతను కూర్చునివియు సతతం

బంధుబలగమెల్ల నొక్కచోట చేర్చు

చుండు నివియు జగతి యందు

తీపిగురుతులనెల్ల నెమరవేసుకొనుచు

ముదము గూర్చు నివియు నెల్లరకును

స్తోమతను బట్టి స్థాయిని బట్టి

జరుపబడునివియు నెల్లరింట

పులిని జూచి నక్క వాత బెట్టు కొనునట్టు గాక

శక్తిమేర నాచరించ మేలుకలుగు నిజము .

5

[05/02, 8:35 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: వేడుక మనిషి జన్మించినప్పుడు వేడుక

బారసాల చేసినప్పుడు వేడుకే


పెళ్లిళ్లు చేసుకున్నప్పుడు వేడుక వేడుకలు అనివార్యం


ఇటుక వేళల్లో చుట్టాలు బంధువులు కావలసినటువంటి ఇ చక్కటి భోజనాలు ఫలహారాలు


మందు మాకులు

కోడి మాంసం మేక మాంసం ఉంటేనే శూద్ర కులాలలో

వేడుకలకు అర్హత

లేకపోతే ఎందుకు వచ్చాము రా భగవంతుడా అని తిట్టుకుంటూ వెళతారు బంధువులు చుట్టాలు పెళ్ళికి వచ్చే మిత్రులు


వేడుకలు లేని దేవుడు బహుమతులు వచ్చినప్పుడు

ఇంకా ఇంకా ప్రతి సందర్భంలోనూ వేడుకలు వేడుకలు ఆనందాల వేడుక లవి అందుకే వేడుకలు అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను


వేడుకల వేళ ఎంతో సంబరాలు నిర్వహించినట్టు గా అవుతుంది


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453

6

[05/02, 8:36 PM] +91 74168 63289: కవితాగానం 

తేదీ :5/2 /21

 అంశం :వేడుక

 శీర్షిక :వేడుకలు -వేదికలు 

పేరు : మన్నె పిన్నక లలిత

*************************

 "దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే "

"ఊళ్ళో పెళ్ళికి ఊరంతా పండుగ "(హడావుడి )

నిరహంకార ,నిర్మల మనస్కులు, 

ఆత్మీయ పిలుపులు  ఆనాడు  

   పెళ్ళికొ ,పబ్బానికో ఇల్లు కదిలే వారు

 ఊరంతా సందడి 

చెంబులు, గ్లాసులతో నీళ్లతోభోజనాలకు

 అరటి ఆకులో వడ్డించే బంతి భోజనం 

పాలు ,పెరుగు ,కూరగాయలు పెళ్లి వారి ఇంటికి 

 ఈనాడు

ఏ ఇంటి వేడుకైనా ,చరవాణి 

 పిలుపులు,వేడుకలు

 పుట్టిన రోజులు పెళ్లి రోజులు 

చరవాణి ,గూగుల్లో దృశ్య వీక్షణలు

 బంధాలు దూరమైన పిల్లలు

   జాతీయ, అంతర్జాతీయ

 కుల మతాల ప్రమేయం లేని వివాహాలు 

కన్న తల్లిదండ్రులను వివాహ వేడుకకు

   నొప్పించే తల్లిదండ్రుల్ని ఒప్పించే పిల్లలు

 వేడుకలకు కోట్లు  ఖర్చు పెట్టే వారు కొందరు

 వివాహమైన  మరో రోజు నుండే

 ఆఫీసులకు వెళ్లే వారు కొందరు 

 వేడుకలకు  దూరమవుతున్న యువతరం 

రావాలి నేటి తరానికి ,ఆనాటితరం వేడుకలు.

7

[05/02, 9:21 PM] కొలచన విజయ భారతి Poetess: కవితా గానం

పేరు: కొలచన విజయ భారతి

ఊరు: హైదరాబాద్

అంశం:వేడుక

శీర్షిక:

తేదీ:5-2-2021

************************

నాటి పెళ్లి వేడుకలు

ముంగిట తాటాకు చలువ  పందిళ్ళలో

సన్నాయి మేళ తాళాలతో

వేదమంత్రాల సాక్షిగా

వేల్పుల లందరిని పిలువగా

వధూవరులు లక్ష్మీ నారాయణులై కల్యాణ వేదికకు 

తరలిరాగా

ముత్తైదు భాగ్యాల ఆశీస్సులే

అక్షంతలై కురవగా

ముహూర్త బలంతో

మూడుముళ్ల బంధంతో 

ఒక్కటైన వధూవరులు

పెళ్ళి పీటలపై సందడి చేసే వేళ

కల్యాణం కమనీయమై కనువిందు చేసేది

అరిటాకు విస్తళ్ళు వేసి బంతి భోజనాలు పంక్తులతో

కొసరి కొసరి వడ్డింపుల

విందులు తో కనువిందుగా జరిగేవి


మరి నేడో

సిగ్గు దొంతరల మధ్య కల్యాణ వేదికకు తరలే అడుగులు

చేయి చేయి కలుపుకుని

చెట్టాపట్టాలేసుకుని

తామే వేదికపైకి తరలి వస్తున్నారు

పెళ్ళి వేడుకలో శాస్త్రీయత లేదు

ఏదో తూతూ మంత్రంగా సాగే తంతైపోయింది

వచ్చిన అతిథులు కూడా

తెచ్చిన బహుమతులిచ్చేసి

ఫొటోలకి పోజులిచ్చేసి

గొప్పలకోసం పది రకాలు 

చేయించినా పసందులేని

పళ్ళాల భోజనాలు

క్యూలో నిలబడి తినలేక ఇబ్బంది పడి

ఏదో తిన్నామనిపించి

ఎవరో తరుముకు వస్తున్నట్టు

తుర్రుమని తరలిపోయే తంతులు నేటి పెళ్ళి వేడుకలు

     ☘️🌹☘️🌹☘️

8

[05/02, 9:23 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..వేడుక

శీర్షిక..ఆచారాలు



 మానవ జీవన పయనంలో

పుట్టుకతో మొదలై గిట్టే వరకు

జరిగే వేడుకలెన్నో

కుటుంబం,బంధు మిత్రులంతా

ఒకే చోట చేరే

ఆ సందడే వేరు

ఒకరినొకరు ప్రేమతో పలకరించుకొంటూ

మనసు విప్పి మాట్లాడుకునే అపూర్వమైన కలయిక

ఆత్మీయానురాగాలకు ప్రతీక

పెళ్ళి పేరంటాలలో 

అంబరాన్నంటే సంబరంతో 

మనసులోని భావాలను వ్యక్తం చేస్తూ

ఆ ఆత్మీయబంధాలు

ఆనందంగా గడిపే క్షణాలు

మరపురాని జ్ఞాపకాలు

ప్రకృతిలోని మార్పులకు అనుగుణంగా జరుపుకునే వేడుకలన్నీ

సకల శుభాలనొసగు కారకాలు

ఆరోగ్యానిచ్చే ఔషధాలు

సామాజిక అంతరాలను వీడి

ఐక్యతను చాటే వేడుకలు

సంస్కృతీ సంప్రదాయాలకు ఆనవాళ్ళు

సర్వశోభితమై నిండుదనంతో వెలిగే వేడుకలు

అనాదిగా వస్తున్న ఆచారాలు

9


[05/02, 9:31 PM] Vijayalakshmi Ch KS 38: కవితా గానం 

తేది :05-02-2021

చెన్నా విజయలక్ష్మి, బీర్కూర్ 

అంశం :వేడుక 

శీర్షిక :ఆత్మీయత పెంచు 

****************************

మనసుకు ఆహ్లాదం కలిగించు 

బంధువులను ఒక్కటిగా చేర్చు 

రక్త బంధాలను చిక్కగా చేయు 

ఆనందాలను పంచు పండుగ 


పుట్టుక నుండి చావు వరకు 

మనిషి జీవన గమనంలో 

లెక్కలేని వేడుకలు 

పురుడు ఆదిగా అంతిమ యాత్ర దాకా 


జన్మదినం, నామకరణం, పెళ్ళి 

సీమంతం, పండుగలు ఆనందంతో 

జరుపుకొనే సంబరాలు 

బేధాలన్నీ విడిచి 

బాధలన్నీ మరచి 

ఉత్సాహం పెంచుకొనే 

సంతోషాల వెల్లువలో 

మునిగి తేలే మధుర ఘట్టాలు 


చలోక్తులసరాగాలు పాడుతూ 

అనుబంధాల తీగలల్లుకుంటూ 

కానుకలు ఇచ్చి పుచ్చుకుంటూ 

విందు వినోదాలతో ఎద పంచుకుంటూ 

మళ్ళీ మళ్ళీ ఆత్మీయతలు కలబోసుకొనే 

ఆత్మీయ సంగమాలే మన సంప్రదాయ వేడుకలు 


వేడుకల్లో దాగుంది శాస్త్రీయత 

భేషజాలకు పోకుండా 

సరైన రీతిలో జరిగే వేడుకలు 

సంతోషాలకు వేదికలు 


డాబు దర్పం ప్రదర్శించే సంబరాలు 

అప్పుల పాలు చేసి బాధలో ముంచు 

దూరం పెంచును వ్యత్యాసాలు గుర్తించు 

కూల దోయును అనుబంధాలు 

కలుషితం చేయును స్నేహ బంధాలను 

మరిచిపోవును రక్త సంబంధాలు 

మరపించును ఆత్మీయ అనురాగాలు 

నేటి వ్యవస్థ లో ఇవే వేళ్లూనుకొని 

వటవృక్షాలై ఆనందాన్ని కృత్రిమం చేస్తూ 

నిజ పరిమళాలను మరపిస్తూ 

నిజమేమో అనే భ్రమలో పడద్రోస్తూ 

వేడుకలు ప్లాస్టిక్ పూల చందంగా 

చెందాయి రూపాంతరం 


వదిలేద్దాం ఆభిజాత్యం 

పగల కొడదాం నిశ్శబ్ద బంధం 

పెనవేసుకుందాం నిత్య బంధం 

పంచుకుందాం అందర్నీ గౌరవిస్తూ 

సహజ వాతావరణంలో 

నిరాడంబరంగా 

ఆత్మీయ సంబరాలు చేసుకుందాం 

ఆనందాల లహరిలో తేలిపోదాం

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...