Skip to main content

మనిషి తత్వం feb 19/2021

 నిర్వహణ శివునూరి లలితాకృష్ణ

******************

1.దీపక్ న్యాతి గారు

2.కోరాడ నరసింహారావు గారు

3.శ్రీ శివ లక్ష్మి రాజశేఖరుని గారు

4.సునంద వురిమళ్ళ గారు

5.భరద్వాజ రావి నూతల గారు

6.సుధారాణి కృష్ణం రాజు గారు

7.కె.సి నరసయ్య గారు

8.డా.సిహెచ్ ఆంజనేయులు గారు

9.పరాంకుశం రఘు నారాయణ గారు

*********

[19/02, 8:03 PM] Lalita Sister

కవితాగానం

సమూహసభ్యులకు శుభోదయం


నేటి అంశం

*మనిషితత్వం*



ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు

అంశానికి కవితలతో స్పందించగలరు.


ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకూడదు.


✳️✳️✳️✳️✳️✳️✳️✳️

1

[19/02, 8:08 PM] దీపక్ న్యాతి: *కవితా గానం* 

పేరు : డా.దీపక్ న్యాతి

తేది : 19-02-2021

అంశం : మనిషి తత్వం

శీర్షిక : మనిషివౌతావు


మనిషి తత్వం మానవత్వం కావాలి

రాక్షసత్వం కారాదు కిరాతకమది

మోసపూరితం కారాదు నేరమది

సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవాలి

తెంచుకో కూడదు జీవతత్వం కాదది

ప్రకృతిని గౌరవించి పూజించాలి

నిర్లక్ష్యము మేలు కాదు నిషేధమది

జంతువుల ప్రేమించాలి లేదా కృరత్వమది

నీతి నియమాల పాటించాలి తప్పదది దోచుకో చూడకు దోషమౌతుందది

హింసించాలని చూడకు దానవునివౌతావు

న్యాయాన్ని వీడకు చెఱసాల పాలౌతావు

సంప్రదాయాల పాటించు అవివేకివికాకు

సంస్కృతిననుసరించలేదా చరిత్ర హినుడవౌతావు

సౌమ్యుడివవ్వు లేదా కిరాతకుడివౌతావు

ఆదరించందర్ని లేదా అనామకుడివౌతావు

నిజాన్ని నమ్ముకో నిలబడతావు లేదా నిందించబడతావు

మనితత్వాల పాటించు మనిషివౌతావు


డా.దీపక్ న్యాతి

హైదరాబాద్

2

[19/02, 8:18 PM] Korada: కవితాగాన0:-*మనిషితత్వ0*

   కోరాడ నరసింహా రావు...!

     "అప్పుడే...నీ జన్మకు....!"

     ********************

ఆహారం కోసం...సంచారజీవు లమై...దోరికింది తింటూ....

పసువుల్తో.... పసువుల్లా...

బతికినవాల్ల0...!

ఆ మార్గాన్ని వీడి.... స్వయం పోషకత్వ0తో... నరులమ య్యా0....!

ఈ మార్గాన్నీ వీడి.... యుక్తా యుక్త విచక్షణా మార్గాన్ని పట్టి

నాలుగుమార్గాల కూడలిలో ...

నిలబడి ఉన్నాం....!!

మనుషుల మనిపించు కుంటు న్నా0....!

ఈ మనిషి తత్వం తో... మనం

మహోన్నతత్వానికి చేరుకో వాలోయీ...!

మనిషి తత్వమంటే... మానవత్వమే నోయీ....!!

మనలో... జాలి, దయ, ప్రేమ

లాంటి మానవీయ గుణాలే కదా... మనిషితత్వ మంటేను!

అవి లేకపోతే...మనం మనుషులమే కాము.... యింక

మనిషి తత్వ మేక్కడ....!?

పరిపూర్ణ మనిషి తత్వం తో...నిష్కామ సేవాభావాన్న లవరచుకుని మనం... మహోన్నతమైన.... మహత్మ్యత్వాన్నిచేరుకోవలసిన వాళ్ళం....!

ఈ మార్గం వైపు పురోగమించక

 తిరోగమిస్తూ...పసుత్వ0 వైపు

పరుగులా....!?

నీకు మిగిలిఉన్న... ఆ నాలుగవ మార్గం వైపు పురోగమించి నీగమ్యాన్ని నువు చేరుకోగలిగి తేనే నీ ఈ

మానవ జన్మకు సార్ధకత....!!

    ******************

          .....కోరాడ.

3

[19/02, 8:19 PM] Lakshmi Chamarthi Khammam: శ్రీ శివ లక్ష్మి రాజశేఖరుని 

కల్లూరు 

ఖమ్మం జిల్లా 

అంశం :మనిషి తత్వం 


శీర్షిక :నా దాకా వచ్చేదాకా…… 




 అప్పుడు ఒక మనిషి

 విశ్వాంతరాళాల పై విజయ కేతనాలు ఎగరేసి

 అజేయగర్వంతో విర్రవీగడం చూశాను


 ఇప్పుడు అదే మనిషి

 కంటికి కనిపించని పరమాణువు తరుముతుంటే

 పరిగెత్తి దాక్కోవడం చూశాను


 నిర్బంధంగా హృది వాకిలిని మూసేసినా 

 అంతే పదిలంగా అక్కడ కొన్ని

 గుండె గతుకుల్లో రాలిపోయిన అనుబంధాలను

 చిగురించడం చూశాను


 అక్కడ కొన్ని కళ్ళు

 దహించే చూపులను

 దిగంతాల వాకిలికి వేలాడదీసి

 ఆకలి పేగులు కొన్ని అలమటిస్తుంటే చూశాను


 అక్కడే ఇంకొన్ని కాళ్ళు

 పిడికెడు మెతుకుల కోసం భగ్గుమన్న ఎండల్లో కూడా

 మండే కడుపు కోసం నడవడం చూశాను


 ఖాళీ రహదారులపై

 ప్రమాద ఘంటికలు ఆగిపోయాయి అనుకునేలోపే

 వేల మైళ్ళ వలస పాదాల రక్తాన్ని పూసుకుంటే చూశాను


 సుదీర్ఘ విశాల స్వప్నాల నిజం చేస్తూ

 కొత్త గీతమై జన్మనెత్తిన 

 కాలుష్య రహిత ప్రకృతిని చూశాను


 ఎదురులేదని విర్రవీగిన మనిషి గర్వమణస్తూ 

 అయిన వాళ్లకు ఆఖరి చూపు అందకుండా

 దహన మవుతున్న దేహాన్ని చూశాను


పీడకలనుకుని మేలుకుని చూశాను 

అబద్దమేమోనని కళ్ళునులుముకుని చూశాను 

మేలుకోని జనాల వెర్రి పరిహాసం 

చాపకిందనీరులా విస్తరించే 

కరోనా వికటాట్టహాసం 

బహుశా నాదాకా వచ్చేదాకా చూస్తూనేఉంటానేమో!!

[19/02, 8:26 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏

🙏 సుధారాణి కృష్ణంరాజు🙏

*నేటి అంశం*మనిషితత్వం*

19-02-2021(శుక్రవారం)

మనిషి మనిషిగా జీవించాలంటే అతని తత్వం

మానవత్వం కావాలి.సమస్త కోటి జీవరాసులలో మానవ జన్మకు ఉన్న ప్రాధాన్యత మరే

జీవులకు లేదు 

సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా దానికి మనిషి మేధస్సు ప్రధాన కారణం

మరమనిషిని కంప్యూటర్ మొదలైన వాటిని తయారు చేసిన మానవుడు ఎంతో శక్తియుతుడుగా, యుక్తి పరుడుగా ఘనత కెక్కిన

మనిషి కొన్ని సందర్భాలలో

మనసును అహంకారం అనే

దానికి బందీ అయిపోయి తను

చేసే విధానాల వలన ఎదుటి

మనిషి పడే వేదనను చూసి

రాక్షస ఆనందం పొందగలడు

అలాంటప్పుడు అతని తత్వం

విషాదాంతం అందరిలో అపనిందల పాలవుతారు

జీవితం అనే రంగుల వలయం లో ఏదీ శాశ్వతం కాదని తెలిసినా తన పంథాను మార్చుకోకుండా అతని తత్వం లో మార్పు రాకుంటే జీవితంలో

అనేక ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది

మనిషి తత్వం లో మార్పు వచ్చి మంచి చేయకున్నా ఎదుటి మనిషిని మనిషిలా

చూసిన ప్రతి మనిషి

మానవుడే మహనీయుడు

అని కీర్తింపబడతాడు🙏🙏👍

4

[19/02, 8:26 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏

🙏 సుధారాణి కృష్ణంరాజు🙏

*నేటి అంశం*మనిషితత్వం*

19-02-2021(శుక్రవారం)

మనిషి మనిషిగా జీవించాలంటే అతని తత్వం

మానవత్వం కావాలి.సమస్త కోటి జీవరాసులలో మానవ జన్మకు ఉన్న ప్రాధాన్యత మరే

జీవులకు లేదు 

సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా దానికి మనిషి మేధస్సు ప్రధాన కారణం

మరమనిషిని కంప్యూటర్ మొదలైన వాటిని తయారు చేసిన మానవుడు ఎంతో శక్తియుతుడుగా, యుక్తి పరుడుగా ఘనత కెక్కిన

మనిషి కొన్ని సందర్భాలలో

మనసును అహంకారం అనే

దానికి బందీ అయిపోయి తను

చేసే విధానాల వలన ఎదుటి

మనిషి పడే వేదనను చూసి

రాక్షస ఆనందం పొందగలడు

అలాంటప్పుడు అతని తత్వం

విషాదాంతం అందరిలో అపనిందల పాలవుతారు

జీవితం అనే రంగుల వలయం లో ఏదీ శాశ్వతం కాదని తెలిసినా తన పంథాను మార్చుకోకుండా అతని తత్వం లో మార్పు రాకుంటే జీవితంలో

అనేక ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది

మనిషి తత్వం లో మార్పు వచ్చి మంచి చేయకున్నా ఎదుటి మనిషిని మనిషిలా

చూసిన ప్రతి మనిషి

మానవుడే మహనీయుడు

అని కీర్తింపబడతాడు🙏🙏👍

5

[19/02, 8:29 PM] భరద్వాజ గారు: 1️⃣🦚కవితాగానం ♈☂️

అంశం-  మనిషితత్వం  

శీర్షిక-  మనోబలం --- !

పేరు-భరద్వాజరావినూతల 

కొత్తపట్నం 

రచన-54

********************************

%%%%%%%%%%%%%%%%%

*****************************

మనిషి తత్వం -

అర్థకాని అయోమయం -

అతడికేతెలియని  గందరగోళం 

ఏమిచేస్తున్నాడో

 ఏమనుకుంటున్నాడో 

ఎవరికితెలియదు -

పక్కవాడికి అర్ధం కాదు -

అతను నోరుతెరిచి చెబితేతప్ప -

చెప్పేమాటల్లో నిజముంటుందో లేదో తెలియదు -

ఉండదో తెలియదు -

అతడు ఏమిచెబుతున్నాడో తెలియదు -

అవతలైమనస్సుతెలిసే విద్యఉంటే -

రాముడు అడవికి వెళ్ళడు -

భారతయు ద్దం జరగదు -

ఇతిహాసాలు పుట్టావు -

చరిత్రమిగలదు -

మనస్తత్వాలను చదివే బ్రతుకులుంటే 

జీవితాలుస్వర్గం అవుతాయి 

ఇదినాస్వీయరచన

✍️భరద్వాజ రావినూతల ((RB)🖍️

కొత్తపట్నం 

7.

కవితా గానం

 కవి పేరు: కేసి నరసయ్య

 19-2-2021

 అంశం : మనిషితత్వం 

 శీర్షిక:


 తత్వం లేని మానవత్వం

 మానవత్వం లేని తత్వం

 తత్వంలో వితండవాదం

 మనిషి రూపం మార్చుకున్నట్లు

 అప్పుడప్పుడు

 తత్వం కూడా మార్చుకుంటుండు

 అభివృద్ధి పథంలో

 నింగికి నేలకు

 పరుగులు పెడుతున్న మనిషి

 త్రిశంకు స్వర్గంలో తేలియాడుతుండు

 పరకాయ ప్రవేశం చేసినట్లు

 మృగత్వంలో దూరిపోతుండు

 ఆడపిల్ల కనపడితే మృగాడైపోతుండు

 ఆస్తుల కుస్టీలో 

 మృగత్వంతో పోటీ పడుతున్న మనిషి తత్వం

 కొంపలు ముంచుతున్న సంపాదన పంపకాలు

 సామాజిక వైద్యంతో

 డబ్బు డబ్బును వదిలించి

 మనిషి మనిషిగా

 మనిషి మానవత్వంగా మనుగడ సాగించాలి

9866203795

8

[19/02, 8:51 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: మానవత్వం అన్నింటికన్నా మనిషి తత్వం

మనిషి స్వార్ధ తత్వమును విడనాడి

సర్వ శాస్త్రాల మేధస్సును సంపాదించిన మనిషి తత్వమే ముఖ్యమైనది


అన్నింటికంటే విశ్వంలో జ్ఞాన తత్వం గొప్పది


మనిషి తత్వం డబ్బు తత్వం కాకూడదు నిస్వార్థ తత్వం అలవర్చుకున్న మనిషి తత్వమే నిజమైనది


ఎదుటి వారిని ప్రేమించే తత్వమే మనిషి అలవర్చుకున్న రోజు అసలైన మనిషి తత్వం అదే అని నా భావన ప్రపంచం


అన్నింటికంటే ఎత్తైనది మానవత్వమే కదా అదే నిజమైన మానవీయ ప్రపంచ మనస్తత్వం మనిషి తత్వం


గ్రహాంతర లోకం లో విహరించిన మనిషిని ప్రేమించే తత్వం అలవర్చుకున్న రోజే నిజమైన మానవత్వం

మనిషి మానవతా నవతా ఋషి ఋషి


ఋషి తత్వము అలవర్చుకో మానవీయ విలువలు పెంపొందించు మనిషి తత్వం ఆవిష్కరించు

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453

9

[19/02, 8:56 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితాగానం* 

అంశం :మనిషి తత్వం


 కవితా శీర్షిక :మనిషి మానవీయ కోణం


మనిషి మరొక మనిషిని పోల్చుకోవడంతో,


 ఇబ్బంది కాస్త ముదిరి పాకాన పడుతున్నది!


 మనిషి పక్క వానికంటే మిన్నగా,


 ఎదగాలన్న అత్యాశతోనే ,


కక్ష్యలు కార్పణ్యాలూ.., పెరుగుతున్నవి!


మనిషి సంపద భ్రమణంలో

 తిరుగాడుతూ..,


 సంపదపై మోజు పెంచుకోవడంతో,


 మనిషి నైజం బయట పడుతున్నది!


 మనిషి తన అంచనాలకు మించి,


 కీర్తి కాంక్షతో పాటుగా..,



 పదవీ వ్యామోహంపై!



 కట్టలు తెచ్చుకోవడం చూస్తుంటే!


 మనిషిలోని మానవత్వం మంట కలిసిపోయిoది!


 దానవత్వం రాజుకొంటున్నది !


దనాశ పెరాశగా గూడు కట్టుకొoటున్నది !


మనుషుల్లో స్వీయసమీక్ష కొరవడుతున్నది!


 ఆడంబరతత్వం జడలు విప్పుతున్నది!


 మనిషిలో రాక్షసత్వం బుసలు కొడుతున్నది!


 మనిషిలో నైతికత దినదినo దెబ్బతింటున్నది!


 దానగుణానికి బీటలు వారాయి!


స్వార్ధపు కోరలు విషాన్ని చిమ్ముతున్నాయి!


 మనిషిలో మానవీయ కోణం మసిబారిపోయినది !


కండబలం పెరిగిపోయినది !


 బుద్ధిబలం నిర్వీర్యమైనది !


వెరసి..., వెరసి...,


మానవుడు తన సహజత్వాన్ని ,


తాను బతికుండగానే చితిలో ,


మానవకులo ఆసాoతం,


విస్మయం కలిగించే రీతిలో..,


 భస్మీపటలం చేస్తున్నాడు!


 పరాంకుశం రఘు నారాయణ 

      మహబూబాబాద్

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...