Skip to main content

ప్రత్యూషం 10/2020



 నిర్వహణ

వీరా గుడిపల్లి

The mathematics teacher and poet

శివునూరి లలితాకృష్ణ

singer and poetess ,author of vennela shilpam

సహకారం

మెరుగు మధు గారు

ఐతగోని వెంకటేశ్వర్లు గారు

అవధాని

*****************-***

కవివరుల జాబితా

****

1.కోరాడ నరసింహారావు గారు

2.మన్నెపిన్నక లలిత .

3గుమ్మన్నగారి బాలసరస్వతి,

4.డా.బల్లూరి ఉమాదేవి.

5.వినీలమ్మ 

6.స్వర్ణ సమత గారు

7.కందూరి సుజాతా రాణి గారు

8.భరద్వాజ రావినూతల🖍️(RB)

9.డి.ఉషారాణి గారు

10.శ్రీలక్ష్మి చివుకుల గారు

11.కె.సి నరసయ్య గారు

12.: కె.ఇ.నిలమంగై గారు

13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు

14.పరుచూరి రామ్ సుందర్ గారు

15.సంధ్యా శర్మ గారు

16.కొలచన విజయ భారతి గారు

17.మర్రి జయశ్రీ గారు



****************"

1

కవితాగానం

       * ప్రత్యూషం *

          *********

కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష 

పవనాలు....!

మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు !

ఆ పక్షుల సందడికి  ...

ఎండిన పెరటి చెట్టు ఆకుల గల గల లు!

ఉలికి పాటున కొక్కొ రొక్కోయని...పల్లె ను

మేలుకొలుపు కోడి కూతలు...!

మేలు కున్న పల్లె ...వడి

వడిగ వ్యవసాయ పనులకై పరుగులు !

ప్రత్యూష  సమయాన పల్లె అందాలు తిలకించు  మదిన పులకింతలు !!

*******************

.......కోరాడ.

2.

కవితాగానం

 పేరు : మన్నెపిన్నక లలిత .

 తేదీ: 8/10/2020.

అంశము: ప్రత్యూషము .

శీర్షిక: ఆవిర్భావం.

***************************

 గాఢాంధకారాన్ని తోసివేసి ,తెలి మేలిముసుగు తొలగించి వచ్చే ఉషోదయం నిత్య శోభితం.

 కెంజాయ స్వర్ణ కాంతులు వర్ణింప తరమా !

ప్రత్యూష వేళ తూరుపు తెల తెలవారే  వేళ 

పక్షుల కలకలా రావములు చేసే వేళ 

తూర్పు గవాక్షము మంచు తెర తొలగించి, జలతారు కాంతులు ప్రసరించి  ఉదయించుబాలునికి ప్రత్యూష పవనాలు స్వాగతిస్తున్నాయి

 కలువ మూతి ముడిచింది 

కమలం పరవశిస్తూ ఒక్కో రేకు విప్పుతుంది 

రెండు కొండల నడుమ ఎర్రని బొట్టు పెట్టుకున్న సింధూర తిలకం రాత్రి కురిసిన తుషార బిందువు లు తామరాకుపై గాలికి సయ్యాటలాడుతున్న నీటిలో పడి

ి జీవితం ఇంతే అన్నా వేదాంతాన్ని గుర్తుకు తీస్తుంటే ఉషోదయపు శుభవేళ భూమి తల్లి  పచ్చలమణిహారం మంచు ముత్యాల దండలతో మమేకమైన ప్రకృతిహేల    

సుశోభితమై , సుమ కాంతలు ,   హ్లాదముతో , స్వాగతింప  వచ్చింది.

3

కవితాశీర్షిక:ఉదయిని

*************

గుమ్మన్నగారి బాలసరస్వతి,

కవిత సంఖ్య:12


లక్షారుణ ప్రభలు చిమ్మేటి ప్రమిదలో

లక్ష దీప్తులు పరిచి

వెలిగించి రెవ్వరో...


రజతాద్రి సానువుల

తుహినార్ద్ర యవనికకు

చిరు వెచ్చదనము నాకల్పించి రెవ్వరో...


కారు చీకటి రెక్క లల్లార్చి పారుటకు

కాంతి పుంజపు శరము

నెవరు సంధించిరో...


ముకుళించుకున్న చిరు కోరకము పై మంచు

ముత్యమును రత్నము గ

దీ పించి రెవ్వరో...


ఆమెనే ...తను ఉదయిని

ఆమెదే... ఈ రసధుని

4

[08/10, 9:27 PM] Umadevi: కవితా గానం

డా.బల్లూరి ఉమాదేవి.

అంశం:ప్రత్యూషం


పక్షులుకిలకిలా రావాలతో

వేకువకు స్వాగతం పలుకుతున్నాయ్

అంధకారాన్ని మెలమెల్లగా ఆవలకు నెట్టుతూ

ఉదయభానుడు ప్రాచీదిశలో

రావడానికి సమాయుత్తమవుతున్నాడు

విద్యార్థులకైనా ఆధ్యాత్మవిదులకైనా

సాధనకిదె సరైన సమయమంటూ సమాయుత్తమగు

శుభసమయమిదే

రైతన్నలు పొలంపనులుచూడ

అరకచేతబట్టి సాగు సమయమిదే

కలతనిద్దురేయైనా కమ్మని నిద్దురైన

కోడికూతతోనే లేచి

మరల ముసుగు పెట్టు వేళ ఇదే

నిన్న అనే గతంకరిగి

నేడు అనే వేకువ పిలుస్తోంది

మంచిని కోరుతూ

మంచినిపెంచే

వేకువరాకనాహ్వానిద్దామా/

అంశం:ప్రత్యూషం


పక్షులుకిలకిలా రావాలతో

వేకువకు స్వాగతం పలుకుతున్నాయ్

అంధకారాన్ని మెలమెల్లగా ఆవలకు నెట్టుతూ

ఉదయభానుడు ప్రాచీదిశలో

రావడానికి సమాయుత్తమవుతున్నాడు

విద్యార్థులకైనా ఆధ్యాత్మవిదులకైనా

సాధనకిదె సరైన సమయమంటూ సమాయుత్తమగు

శుభసమయమిదే

రైతన్నలు పొలంపనులుచూడ

అరకచేతబట్టి సాగు సమయమిదే

కలతనిద్దురేయైనా కమ్మని నిద్దురైన

కోడికూతతోనే లేచి

మరల ముసుగు పెట్టు వేళ ఇదే

నిన్న అనే గతంకరిగి

నేడు అనే వేకువ పిలుస్తోంది

మంచిని కోరుతూ

మంచినిపెంచే

వేకువరాకనాహ్వానిద్దామా/

5

[09/10, 8:11 PM] Vineelamma: కవితాగానం

పేరు: విజయదుర్గ

కవితా శీర్షిక : ప్రత్యూషం

కవితా సంఖ్య: 31

తేదీ: 09/10/20 


ఎన్ని ఆమని వసంతాలను

పోగేసిందో

మంచుతెరలలో దోరదోరగా

హోయలొలుకుతూ

కనుల లోగిలిలో కాంతులను నింపుతుంది....!!


చల్లని సమీరాలపై ఊయలలూగుతూ

కుసుమ కోమలిల పరిమళాలను

నిండుగ మోస్తూ

తెరదీపికలా మెరుస్తూంది.....!!


శరత్ ఛంధ్రికలను తన ఒడిలో

నింపుకొని

తూర్పమ్మ ప్రసవానికి నాంది పలుకుతూ

తుమ్మెదలా తారట్లాడుతున్నది....!!


ప్రత్యూషం హృదయాలను 

కదిలించే మానసవీణ

మనిషి జీవన చక్రానికి చైతన్యగీతిక

మత్తువదిలించే కువకువల నాదం....!!



                             🌹వినీల🌹

6

[09/10, 8:21 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*

*09/10/2020*


     *ప్రత్యూషం*


తమస్సు లోని ఓ కాంతి పుంజం

ఉషస్సు గా మారిన ప్రత్యూషం

లాక్షరుణ కిరణాల పయనమే

ప్రత్యూషం

దివ్వెలోని దివ్యత్వం

భవ్యంగా వెలి గె డి ప్రభ

ప్రత్యూషం

హిమ నగమును స్పృశించి

మేల్కొలిపే భానుని ప్రకాశమే

ప్రత్యూషం 

తరువు తనువును తాకుతూ

వెళ్ళే తేజో మయ సూర్య కిరణ మే ప్రత్యూషం

పృథ్వి నీ సుతి మెత్తగా చుంభించే వెచ్చని కాంతే

ప్రత్యూషం

నదిలో హృది లో నక్షత్రమై

మెరిసే మెరుపే ప్రత్యూషం

జీవకోటి నీ జాగృతం చేసే

ప్రభాతమే ప్రత్యూషం

ఎద కుహరం లోని భావాలను

తట్టి లేపే శక్తి శరమే ప్రత్యూషం.


*స్వర్ణ సమత*

*నిజామాబాద్*

7

అంశం.. ప్రత్యూషం

శీర్షిక... 🌷కిరణాభరణం🌷

..........  ..............  ........ 

ధరణి  భ్రమణమున జలతారు 

తుషార బిందువుల ప్రత్యూషం .

చీకటి వెలుగుల సమరం అంతిమ కాంతి విజయ తోరణం ప్రత్యూషం .


కోడిపుంజుకెలా తెలిసిందో వేకువ అడుగులకు పరవశించు కూసింది .

పవన అలలు కలుషితాన్ని  విదిలించి సుప్రభాత సేవకు ఉత్తేజమై వీచినవి. 

సుమబాల వికసించి మురిసింది 

వెకువొచ్చి తన సొగసును కౌగిలించుకున్నదని. 

సవ్వడుల గుడిగంటలు 

సుప్రభాత గీతాలు వేకువకు స్వాగతాలు పలికినవి.

 

కాటుకలద్దుకున్న చీకట్లను  తుడిచేస్తూ తొలిపొద్దు ముద్దులొలక పోసింది. కాలరాత్రి సందిట్లో ముడుచుకున్న కనురెప్ప వేకువ చప్పుడుతో 

పురివిప్పిన మయూరిలా విచ్చుకున్నది .

కంటిపాప కదలి ఆడింది

ప్రత్యూషం నిషాలో.

 

వస్తు వస్తు ఉషస్సు భక్తిసాగరాన్ని 

మీటింది 

దైవానికి అభిషేక హారతులిచ్చి నీరాజనాలద్దినదీ.  

ఉషస్సుకై ఎదురుచూసు ప్రతిప్రాణికి సరికొత్త శక్తి పులిమింది ప్రత్యూషం. 


నిర్మల నిశబ్ద ప్రత్యూషం  సాధన సామ్రాజ్యమై నిలిచింది .

సేదతీరిన దేహానికి చేయూతగా నిలిచి

శ్రమశక్తిని తట్టిలేపింది .

అశ్వంపై పరుగులు తీస్తూ    యావత్ విశ్వానికి ఉషస్సు పోగులిస్తూ సాగింది. 

కాలం కానుక మది సమ్మోహన బాణం ప్రత్యూషం.

పరుగులుతీసే కిరణానికి ఆభరణం ప్రత్యూషం.

కిరణాభణం రవికోమల తేజం ప్రత్యూషం


కందూరి సుజాతారాణి 

రాజేంద్రనగర్, హైదరాబాద్ 

9392162822🌷

8.

🙏🎻 *కవితాగానం* 🙏🎻

పేరుఃభరద్వాజ

ఊరు-కొత్తపట్నం

గురువారం

🌹అంశంః *ప్రత్యూషం* 🌻

శీర్షిక- *రేపటి* *కోసం* 

నిభిఢాంధకారపు రాత్రికి మేలు కొలుపు-

సుషుప్తావస్థన జోగుతున్న జీవనావళికి సుప్రభాతం-

తూరుపు కనుమల‌చీల్చుకు‌వచ్చే కాంతి కిరణం-

రానున్న వెలుగులకు శంఖారావం-!

వెచ్చని‌చీకటి దుప్పటి కప్పుకున్న 

పుడమి పై -

మంచు‌బిందువుల పహారాను తరిమి కొట్టి-

వస్తున్న ఆవేకువ ఝాము‌తొలి‌కోడి కూతకు స్పందనా‌గీతమై-

చిక్కని చెట్ల‌  ఆకుల‌చిరు సందులనుండి దూరి‌ -

పుడమిని‌ ముద్దాడాలని‌ ఆశపడే‌ ప్రత్యూష కిరణాలు-

తొందరపడ్తున్నాయి భూమి‌తల్లిని‌ముద్దాడాలని-

ఎక్కడ నుండి వస్తుందో‌ తెలియని‌ కిరణం చలి‌చెలికి వీడ్కోలు పలకాలనుకుంటుంటే-

నిద్రాదేవి‌నొదలి యావత్తు‌జగతి- జీవన పోరాటాల కై ఆరాట పడే‌వేళకు‌ సుమూహర్తం అని‌ సంబర పడ్తుంటే-

ప్రత్యూషమా‌ ప్రణమాలు‌ నీకు-

రేపటి ఉదయాన్ని పరిచయం చేస్తున్నందుకు---!

భరద్వాజ రావినూతల🖍️(RB)

9

కవితాగానము

పేరు. డి. ఉషారాణి

శీర్షిక..

ప్రత్యూషం 


చిమ్మచీకటిని అలుముకోని

ప్రకృతి అంధకారంలో ఉన్నవేళ

సమస్త జీవరాశులు నిద్రలోకి

అలా జారుకొన్నవేళ

రేపటి ఆశయాలకు

తియ్యని నవ్య ఆలోచనలకు

శ్రీకారము చుట్టుతూ


కోటి వెలుగుల తేజస్సుతో

పుడముని అలా వెలుగులోకి

దింపుతూ శుభోదయం  తెలుపుతున్న  నులువెచ్చని

వెలుగురేఖలు


శ్రమజీవుల రేపటి ఆశలు గుప్పుమనుచు స్వాగతము పలుకు భవిత కిరణాలు

విచ్చుకున్న తామరలా గుండెల్లో తియ్యని ఊసులుతో బాసటలా నిలిచింది

పత్రహరితముపై కూర్చున్నట్టి తుషారముకు వెలుగుపంచు ఓ కిరణము

ప్రతి గుండెకు ప్రేరణ నిస్తూను

వెలుగు నింపు ఉజ్జ్వల కిరణము వందనం

నులువెచ్చని ఊహాల పరదాలను అలా తొలిగిస్తూ 

యువతకు నవ్య ఉషోదయ కిరణమా జోహార్


డి.ఉషారాణి

ఆంద్రప్రదేశ్

10

కవితా గానం 

తేదీ: 09-10-2020 

అంశము: ప్రత్యూషము

 పేరు: శ్రీలక్ష్మి చివుకుల

కవితా శీర్షిక: 

లేవోయ్! లే!లేవోయ్!


ప్రాతఃకాలమున బ్రాహ్మీ ముహూర్తాన

ఓంకార నాద మంత్రాల నినదిస్తూ 

లో వెలుగులతో ప్రశాంతమైన చిత్తముతో

ఉత్తరాన ధ్రువ నక్షత్రానికి ప్రణమిల్లుతూ

నభో మండలాన ఆది దేవుని జూడ

వేవేగ పయనించు ముని సమూహములు!


చిటారు కొమ్మన కూర్చుని 

కోటి కాంతులతో ఉదయించు 

ఆ దినకరుని ప్రధమ స్పర్శ 

తమపై సోకాలని మౌన జపం చేస్తూ 

రవి కిరణస్పర్శతో పులకించి 

కువకువ లాడుతూ 

గగనమండలానికెగసే పిక గణములు!


చిటారు కొమ్మన భానుని స్పర్శతో

విచ్చు కోవాలని చూసే లేఁజిగురాకు

ప్రత్యూష పవనాల తాకిడికే 

విరియాలని చూస్తూ 

నవజాత శిశువు వోలె 

వణుకుతున్నది చూడు!


భూపాల రాగాన్ని ఆలపించు 

గాయక మణులు

ఆ రాగాన్ని వింటూ 

తన్మయులై ఆనందంతో 

తలలూపుతూ పరవశించిపోయే

గో గోవత్స గణములు!


కవులు తమ కలాలతో లిఖించిన 

దేశభక్తి గీతాలను 

ఉచ్చైస్వరాన పాడుతూ 

సకల జీవరాశిని మేల్కొల్పుతూ 

ప్రాభాత ప్రాంగణాన మ్రోగేను నగారా!

ఈ భారత భువి పొంగెను ముగ్ధ జీవధార!

లేవోయ్! లే!లేవోయ్!

శారీరక మానసిక 

ఒత్తిడులనుండి ఉపశమనం

ప్రత్యూషాంగన పరిష్వంగం!


ఇంత అందమైన 

ప్రత్యూష సమయాన్ని 

వృధా చేయకు నిదురలో !

ప్రకృతి అందాలను 

ఆస్వాదించే సమయమిది! 

లేవోయ్! లే లేవోయ్!

లేవోయ్! లే లేవోయ్!

11.

కవితా గానం

అంశం: ప్రత్యూషం 

అంశం:


దినదినం కర్తవ్య దీక్షకు సిద్ధం

పని బడలికతో వీడని మగత

కోడి కూతతో ఉలిక్కిపడ్డ వేకువజాము

కనురెప్పలు నలుముకుంటూ

తూర్పుకు కుంకుమ బొట్టు పెట్టిన ఇల్లాలు

చీకటిని చీల్చుకుంటూ తూర్పు నుండి పయణం

తరుముకొస్తున్న  ప్రత్యూషసం

చీకటి కొక్కానికి వేలాడుతున్న దోరపండు

ప్రత్యూషాన్ని పకరించిన పక్షుల కిలకిల రావాలు

చెట్ల కొమ్మల సందుల్లో నుండి

దొంగల్లా జొరబడ్డ లేలేత కిరణాలు


పేరు :  కెసి నరసయ్య 

చరవాణి: 7981814784

12.

[09/10, 9:09 PM] Komandoori Neela Poet: కవితా గానం

అంశం: *ప్రత్యూషం*

09/10/2020 

వచన కవిత


లేలేత చివురులు బాల భానుని కిరణాలకై ఎదురు చూస్తుంటే..,

నిదుర మత్తును వీడిన పత్ర భామలు నెమ్మదిగా ఒళ్ళు విరుచుకొని చూస్తున్నాయ్..!


రవి కిరణోదయానికై నిరీక్షిస్తున్న విరిబాలలు రేయంతా స్వప్న లోకంలో తేలిపోతూ హిమ బిందువుల తళతళలతో మెరిసిపోతున్నాయ్..!


ముత్యమంటి మంచు తునకలు మురిపిస్తూ స్వాగతిస్తున్నాయ్ వేకువ రేడికోసం..,


పుడమమ్మ  పచ్చకోకతో పరువాల సుమంగళై ప్రత్యూషపు వెలుగులు పంచాలని నీలాకాశపు పువ్వై మెరుస్తోంది..!


పక్షుల కిలకిలలతో పశువుల చిరుగంటల సవ్వడితో ధవళకాంతులీనుతోంది మనుషుల మదిని దోచటానికై..!!!!


పేరు: కె.ఇ.నిలమంగై

కలం పేరు:నీలా రంగనాధం

ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.

చరవాణి సంఖ్య:8897155600.

*ఈ పై  కవిత ఈ సమూహం కోసం రాసినదేనని హామీ ఇస్తున్నాను.*

13

[09/10, 9:10 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం* 

తేదీ:09-10-2020

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం::ప్రత్యూషం

********************

యామిని భామినిని కవ్విస్తూ

అలక గృహానికి దాని చూపించి

 పెదవులపై చల్లని చిరునవ్వుల కాంతులను నింపుకున్న భానుడు

సమీరాల వీవెనలతో శీతోపశమనం పొందుతున్న అవనమ్మను 

చూపుల కిరణాలతో  ఆత్మీయంగా హత్తుకునే 

అద్భుత ప్రణయ సన్నివేశం ప్రత్యూషం! 


తరువు ఒడిలోన వెచ్చ వెచ్చగా

శయనించిన 

శుకపికాలు ఒళ్ళు విరుచుకుని

గళాలను సవరించుకుని

ఆలపిస్తున్న ప్రభాత గీతాల స్వర విభావరికి పలికే ఘన స్వాగతం!


 ఆత్మీయాలింగనాలకు మధ్య వర్తిగా

తుషార బిందువుల పర్ణికను ప్రాణంగా హత్తుకుంటూ

పలికే మంచు పల్లవాలను ఎదలో దాచుకున్న ప్రత్యూషం

నింగి నుండి నేల జారిన హరివిల్లు సోయగం!


సమస్త జీవుల వెన్ను తట్టి 

నిత్య చైతన్యానికి నాంది పలికే ప్రతూషం!


ప్రాభాత ప్రాంగణాన విరిసే కుసుమోదయం!

హృదయోల్లాస ఓంకార ప్రణవ నాదం!


దిన బాలుడు దివ్య మంగళ రూపధారుడై

15

కవితాగానం


అంశం: ప్రత్యూషం


వై.కె.సంధ్యశర్మ

వేకువ తొలి కిరణం


వెండిమబ్బు తెర తీసుకుని


జాలువారే జాజిమల్లెల


జలపాతాల సోయగాల


సుస్వరంలో దాగిన ప్రకృతి జవరాల


సంకీర్తన....


ఉత్సాహ తరంగాల వెల్లువై


ప్రాతఃకాల మేథోమధనంగా

స్వయం ప్రకాశ  భావ కెరటమై

సప్తాశ్వర  గమనంలో

ఓ జ్ఞాన సింధూరమై

ప్రజ్వరిల్లే  ప్రత్యూష  పద్మాలు...

మనో నేత్రమై జీవన 


సాహచర్యంలో ...నందనవనాలకు

ఆలంబనగా... 

తిమిర సంహారమై

వెలుగు రేఖలు వెదజల్లే

అమృతవాహిని!

కిరణాల పగ్గాలను చేబూని

కాల రథాన్ని అధిరోహించే ఉషోదయ సౌందర్యం

భూపాల రాగాల ప్రత్యూషం

జగతికి వెలుగుల బహుమానం

జనావళికి  మహా ప్రమోదం!

16

కవితా గానం

పేరు: కొలచన విజయ భారతి

ఊరు: హైదరాబాద్

అంశం:ప్రత్యూషం

తేదీ:9-10-2020

**********************

తూరుపు తెలతెలవారే వేళ

మబ్బుల పరదాలు తొలగించుకుని

బాలభానుడు లేలేత  కిరణాల

చిరునవ్వులతో జగతిని

చైతన్యవంతం చేస్తుంటే

ప్రత్యూషం  వెలుగు కిరణాల

వల్లెవాటు సవరించుకుంది


ప్రతి ఇంటి లోగిలి 

తలుపు తడుతూ  

తుషార బిందువుల కళ్ళాపి

చల్లుతూ నింగినున్న

చుక్కలలన్నీ కోసుకొచ్చి

ముత్యాల ముగ్గులతో

వాకిలినిండా నిండా నింపి 


గోడెక్కి ముడుచుకుని పడుకున్న కోడిపుంజును

తట్టి లేపి

చెట్టుకొమ్మలదాగి కువకువల  గూటిగువ్వల కిలకిలా 

రావాలకు భూపాల రాగాలు జతచేసి 

విరుల రేకులు సుతారంగా 

ముద్దాడుతూ

పల్లెపల్లెనూ పలకరించింది

తొలి పొద్దు ప్రత్యూషం

     ☘️🌹☘️🌹☘️

17.

కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..ప్రత్యూష0

శీర్షిక..అందమైన చిత్రం


గాఢాంధకారాన్ని చీల్చుకొని

ముసుగేసుకున్న మంచు తెరల్ని తొలగించుకొని

సృష్టిలోని  సర్వ జీవులను జాగృతి చేసే కాంతి కిరణం

కళ్ళ కెంతో మనోహరం

సృష్టికర్త అందించే అందమైన చిత్రం ప్రత్యుషం

సర్వాంతర్యామినే మేలుకొలిపే సుప్రభాతం

కష్ట జీవులను కార్యోన్ముఖులను చేసే ప్రభోద గీతం

ప్రతి మదిలో కొత్త ఆశలు చిగురింపజేస్తూ

గుండె గుండెకు ప్రశాంతత కలిగించే వెలుగు రేఖ

క్రమశిక్షణకు ప్రతీక

ప్రకృతిలోని అణువణువూ పులకించిపోయి

ఆనందాన్ని కలిగించే ఉషోదయం చైతన్య గీతమై 

ప్రోత్సాహం అందిస్తుంది

రేపటి భవితకై దారి చూపుతూ

ఎందరికో ఇస్తుంది స్ఫూర్తి

Comments

Popular posts from this blog

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...