నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
Singer and poetess author of vennela shilpam
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
**************************
కవి వరుల జాబితా
1.కోరాడ గారు
2.అయిత అనిత గారు
3.కోమండూరి నీల గారు
4.సత్య స్వరాళి గారు
5.స్వర్ణ సమత గారు
6.సునంద వురిమిళ్ళ గారు
7.గుగుమ్మన్నగారి బాలసరస్వతి సిద్దిపేట గారు
8.మన్నె పిన్నక లలిత గారు
9.జల్లిపల్లి బ్రహ్మం గారు
10.డా.రామక కృష్ణ మూర్తి గారు
11.వై.కె.సంధ్యా శర్మ గారు
12.మర్రి జయశ్రీ గారు
13.సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
14.డా.సి.హెచ్ ఆంజనేయులు గారు
15.కోరాడ గారు
16.డా.రామక కృష్ణమూర్తి
17.సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
18.స్వర్ణ సమత గారు
19.అయిత అనిత గారు
20.సునంద వురిమిళ్ళ గారు
21.కొలచన విజయ భారతి గారు
22.భరద్వాజ గారు
23.వై.కె.సంధ్యా శర్మ గారు
24.కందూరి సుజాత గారు
25.మర్రి జయశ్రీ గారు
26.కె.ఇ.నిలమంగై గారు
27.గాజుల భారతి శ్రీనివాస్ గారు
28.వల్లాల విజయ లక్ష్మి గారు
29.జ్ఞాన ప్రసూనా శర్మ గారు
30.స్వర్ణ సమత గారు
31.కోరాడ గారు
32. సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
33.డా.ఆంజనేయులు గారు
34 . డా.రామక కృష్ణమూర్తిగారు
35.డా.బల్లూరి.ఉమాదేవి గారు
36. మర్రి జయశ్రీ గారు
37.మన్నె పిన్నక లలితగారు
38భరద్వాజ రావినూతల
39,కందూరి సుజాతారాణి గారు
40.వల్లాల విజయలక్ష్మి గారు
****************************************
1
[05/10, 8:01 PM] Korada: కవితాగానం
అంశం :- విశ్వాసం
కోరాడ నరసింహా రావు!
* విశ్వాసిదే...విజయం!*
*****************
ఎదురు చూసి...చూసి...
నిరాశతో వెను దిరుగు తాడేమో...నమ్మినవాడు
ఎదురు చూస్తూ అలా...
జీవితాంతం నిరీక్షిస్తాడు విశ్వాసి !
నువ్వున్నావా...లేవా!?
నువ్వుంటే రా...! అని
ప్రశ్నిస్తే...నీవో అల్ప విశ్వాసివే ! నువ్ భక్తుడ వేలా కాగలవు !?
అతడున్నాడు...ఖచ్చితంగావస్తాడు అని జీవి తాంతం నిరీక్షించగలిగే వాడే గా విశ్వాసి....!!
విశ్వాసి అంటే ....ఓ ప్ర హ్లాదుడు ! ఓ...శబరి!!
నమ్మకం నట్టేట్లో వది
లెయొచ్చేమో...గానీ...
విశ్వాసం తీరం చేరుస్తుం దన్నది..తిరుగులేని సత్యం...!
నమ్మకంతో నడిచేవారికి ఎండమావే ఎదురు కా వచ్చు...!
విశ్వాసంతో సాగేవారికి
సెలయేరే ఎదురై ఆర్తిని తీర్చు తుంది !!
గాంధీజీ కి ...సత్యము,అహింసలపై గల ప్రగాఢ విశ్వాసమే
మనకు...స్వతంత్ర,స్వరాజ్యాలను తెచ్చి పెట్టింది!
విశ్వసించు...,!ఎట్టి అర మరి కలకూ తావీయక పరిపూర్ణంగా విశ్వసించు
ఏ సమస్య నైనా ఛేదించి
విజయాన్నిసాధిస్తానని
దృడంగా విశ్వసించు ,
నీవిశ్వాసమే ...నిన్నుగెలిపిస్తుంది...! విజయునిగా నిన్ను.... నిలబెడుతుంది !!
********************
........కోరాడ.
2
: *కవితా గానం*
అంశం : విశ్వాసం
గేయం
విశ్వాసం విలువెంతో తెలుసునా సోదరా
నమ్మకమే ఊపిరిగా మసులుకొనుము నీవురా
*చ*
వేదనలే ఆవహించి
చిమ్మచీకటి కమ్మినప్పుడు
రోదనలో కనులేమో
అశ్రుధారలిడినప్పుడు
పరులునిన్ను మోసగించి
పతనం చవిచూసినప్పుడు...2. *విశ్వాసం*
*చ*
మొదలెట్టిన పనిలోన
ఆటంకం వచ్చినప్పుడు
దరిచేరే విజయాల్లో
దూరాన్ని కన్నప్పుడు
నిరాశలే నిలువునా
నిను ముంచెత్తినప్పుడు..2.. *విశ్వాసం*
*చ*
ఆత్మవిశ్వాసమే ఆయువుగా
తలువు మెప్పుడు
సడలని సంకల్పమే
గుండెకు పొదువుమెప్పుడు
ఆశించిన ఆశయాలు
అతిథులుగా వచ్చిచేరు..2.. *విశ్వాసం*
*చ*
మహాత్ముని వ్యక్తిత్వమె
అణువణువు నింపుకొని
గాంధేయ మార్గమునే
జీవితాన అనుసరించి
నలుగురికి ఆదర్శమై
ఇలలోనా కొలువుండు..2. *విశ్వాసం*
రచన
అయిత అనిత
8985348424
హామీపత్రం
ఇది నా స్వీయరచన
3
కవితా గానం
అంశం: *విశ్వాసం*
05/10/2020
గేయ రచన
పల్లవి: విలువ తెలుసుకో చెల్లీ తెలిసి నడచుకో విశ్వాసం విలువెంతో అడిగి తెలుసుకో
విశ్వాసం విలువెంతో తెలిసి మసలుకో..2. ||విశ్వాసం||
చరణం1:కొద్ది పాటి గాలికిదీ వాలిపోనిది..హిమాలయపు పర్వతంలా స్థిరమైనది..
అచంచలం అమేయం ఇది తెలుసుకో మరీ..తెలుసుకొని మసలుకో ఇది నిజమైనది..2..||విలువ||
చరణం2:గాంధీ చూపిన మార్గమే ఇదీ ఘనమైనది
మంచి దారి చూపి మనల నడిపించునిదీ..2..
దారి తెన్ను కానరాని దీనులకిదే
మనసులోన కొలువుండి నడుపు నిజమిదీ..2..||విలువ||
పేరు: కె.ఇ.నిలమంగై
కలం పేరు:నీలా రంగనాధం
ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.
చరవాణి సంఖ్య:8897155600.
*ఈ పై గేయ కవిత ఈ సమూహం కోసం రాసినవేనని హామీ ఇస్తున్నాను.*
4
[
చీకటిలో చిరుదివ్వై వెలిగిందట విశ్వాసం
మనిషి మదిన సిరి మువ్వై పలికిందట విశ్వాసం
పేదధనిక భేధమేది లేనిదిగా ఆతత్వం
గుండెగుండె సడిచేస్తూ మోగిందట విశ్వాసం
నడిచేటీ దారిలోన నిరాశలను తరిమేస్తూ
చిరు ఆశల దీపాలై వెలిగిందట విశ్వాసం
మనిషితనపు మూలాలకు మట్టిగంధాలనుపూసి
మరు మల్లెల మాలలుగా విరిసిందట విశ్వాసం
నిదురించే హృదయాలను తట్టిలేపి స్వచ్ఛంగా
సిరివెన్నెల జల్లులుగా కురిసిందట విశ్వాసం
నాలుగుదిక్కుల్లోనా నింగిని చుక్కల్లోనా
మధుమాసపు కోయిలగా కూసిందట విశ్వాసం
సత్యమనసు నడుచుకునే నిత్యమైన దారుల్లో
తననుతనకు చూపిస్తూ నడిపిందట విశ్వాసం
సత్య స్వరాళి
ఈ గజల్ నా స్వీయ రచన. కవితాగానం సమూహం కోసం రాయబడినది
5
*శీర్షిక:విశ్వాసం*
*ప్రక్రియ:గేయం*
*విశ్వాసం*
విశ్వాసమే విజయానికి నాంది
విఖ్యాతి నొందుటకు పునాది
విశ్వ మానవ ప్రేమ కది ఆది
విరుల తావి వలె ఉండున ది.
మమతల కోవె లై నిల్చున ది
సమతకు సారూప్యత ఇచ్చున ది
సమైక్యతా భావం కల్గినది
సామరస్య ముతో నిండిన ది
హిమశిఖర ము వలె ఉంటుంది
ఉత్కృష్ట మై ఉన్నత మై నది
కౌముది కోమలత్వం గల ది
శాసించేది శ్లాఘిం చ బడేది
వెండి కొండ వలె ఉండున ది
పసిడి వన్నె వలె విలువైనది
భవితకు బాటవుతుంది
ముసి ముసి నవ్వుల మూటవుతుంది!!
*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
6
తేదీ:05-10-2020
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
ప్రక్రియ: గేయం
అంశం: విశ్వాసం
*******************
పల్లవి:-
విశ్వాసం విలువెంతో తెలుసుకుని మసలుకో
నమ్మకం కోల్పోవు బతుకు నరకమనీ తెలుసుకో
1చరణం:-
విశ్వాసమే విజయానికి పునాది అవుతుంది
నమ్మకమే నలుగురిలో గుర్తింపును తెస్తుంది
గాంధీజీ పై విశ్వాసమే గమ్యాన్ని చూపింది
స్వాతంత్ర్య పోరాటానికి సాయుధగా నిలిచింది!
*!! విశ్వాసం!!*
*చరణం 2*
విశ్వాసం వీగిపోయే తాలుగింజ కాదు
గాలి వాటుకు నేల జారే చెట్టు కొమ్మ కాదు
హిమగిరి శిఖరమంత అచంచలమైనది
సంద్రమంత సహనంతో హృదయాలను గెలిచేది!
*!! విశ్వాసం!!*
*చరణం -3*
వివేకానందుని విశ్వాసమే
చికాగోలో వెలిగింది
హనుమపై నమ్మకమే సీతమ్మ జాడ తెలిపింది
మనసు మనసు ముడి వేసే
మానవతా బంధమది!
మానవీయ చరిత్రలతో భాసిల్లిన గ్రంథమది!
*!! విశ్వాసం!!*
7
గాంధీ జయతి వారోత్సవాల సందర్భంగా,పోటీ కోసం..
ప్రక్రియ: *గేయకవిత*
శీర్షిక:. *విశ్వాసం*
*************†***†
*పల్లవి*
చిరుగాలి కి తడబడుతుందా
జడివాన కు పడిపోతుందా..
విశ్వాసము మహావృక్షమై
చిరకాలము నిలుచును గానీ......
*తన నీడను పరుచును గానీ*
*చరణము 1*
నీరెండకు ఆవిరి అయ్యే
చెలమ కాదు *విశ్వాసం*
పల్లముకై పరుగులు తీసే
జల్లుకాదు *విశ్వాసం.*.
బడబాగ్నులు లోన దాగినా..
ఆటుపోటులెన్ని తరచినా
భంగపడక నిలువరించెడి
అలల కడలి *విశ్వాసం*
*చరణం 2*
సుడిగాలికి ధూళిన కలిసే
మట్టి కణం కాదునమ్మకం
ఉలిదెబ్బకు ఉనికిని వదిలే
శిలకాదూ.. *విశ్వాసం*
తర తరాల మంచిచెడులను
తన ఎదలో పదిలము చేసీ
శిరమొగ్గని ధీర మేరువు
శిఖరమే .... *విశ్వాసం*
****"*"*"*************
ఇది నేటి అంశం కోసమే నేను స్వయంగా రాసాననిహామీ ఇస్తున్నాను....
*గుమ్మన్నగారి బాలసరస్వతి సిద్దిపేట*
8
: కవితా గానం
పేరు మన్నె పిన్నక లలిత.
అంశం :విశ్వాసం.
గేయం:
ముందడుగు.
******************
గాంధీ గారు విశ్వాసంతో వేసిన ముందడుగు
వేయించింది లక్షలు కోట్లమందిని మలి అడుగులు
నమ్మకం పునాదిగా ముందుకు సాగి
నిరాయుధుడవైనా, నిర్భీతి ,నిజాయితీ గెలిపించి
అందలం ఎక్కిస్తుంది ఆనందంగా
స్నేహంలో నమ్మకం ,విశ్వాసం
పూయిస్తుంది స్నేహపరిమళాలను
మహాత్ముని అహింసాయుత మార్గము
తెచ్చిపెట్టింది భారతీయులకు స్వాతంత్ర ఫలం
మహాత్ముని బోధనలు విశ్వసించి
సంఘం గౌరవాన్ని పెంపొందించుకుని
పలువురితో ప్రశంసించుకో.
9
కవితా గానం
------------------
గేయం
౼౼౼౼౼
సడలని అడుగుల గమనం జీవిత గమ్యం
ప్రతి అడుగులొ విశ్వాసం ప్రగతికి మార్గం౹౹సడ౹౹
ధర్మానికి అడవి మొదలు దైవముకైనా
విజయానికె కద పూజలు దేవుడి కైనా౹౹సడ౹౹
ఏరుపారు ఎపుడైన ఎదురు రాళ్ళను దాటి
పక్షి ఎగురు గగనానికి గాలిని నేలకు అదిమి
మొక్కవోని ధైర్యమె కదా మనిషికి ముఖ్యం
విశ్వాసము కరిగించును రాళ్ళను సైతం౹౹సడ౹౹
మట్టిని పెకిలించి ఎదుగు మొక్క నింగికి
మేఘాన్ని పిండి చినుకు రాలు క్రిందికి
ఏదైనా చేసి మేలు చూపు జగతికి
పేరైనా కోరకుండ తిరుగును గాలి౹౹సడ౹౹
నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి నిలవడం
ఆటుపోటులెదురైనా నావ ఒడ్డు చేరడం
జీవితాన్ని నడిపించుము చిత్తశుద్ధితొ
మహాత్ములను తలచి ముందు సాగు జగతిలో౹౹సడ౹౹
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
జల్లిపల్లి బ్రహ్మం
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
10
1గాంధీజయంతి వారోత్సవాలు*
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:5-10-2020
అంశం:విశ్వాసం
ప్రక్రియ:గేయం
శీర్షిక: నమ్మకం
**************************
పల్లవి:
రగిలిస్తుంది నమ్మకం
గెలిపిస్తుంది రణం
చరణం:1
అచంచల నమ్మకమే
నడిపించు మార్గము
సాధనము సత్యనిష్ఠే
ఇచ్చును విజయము
:రగిలిస్తుంది నమ్మకం:
చరణం:2
మనిషి మీద ఏర్పడు అభిప్రాయము
దారి చూపును నిరంతరము
సాధ్యము చేయును కర్తవ్యము
విశ్వాసము అత్యంత కష్టము
:రగిలిస్తుంది నమ్మకం:
చరణం:3
ఒక్క మాట కదిలిస్తుంది
ఒక్కఆచరణ కనికట్టు చేస్తుంది
ఒక్క అడుగు ముందు పడితే
వేల అడుగులు అనుసరిస్తాయి
:రగిలిస్తుంది నమ్మకం:
చరణం:4
చేతన చేయును మాయాజాలం
ఆవాహన చేస్తుంది సందేశం
అది మహాత్ముల గుణము
అధములకు తెలియని శీలము
:రగిలిస్తుంది నమ్మకం:
చరణం:5
గొప్ప పనులకు అది ఆధారము
కార్యశీలుర అజేయ మంత్రము
అమూల్యమైన మానవసంబంధము
అందించును విజయకేతనము
:రగిలిస్తుంది నమ్మకం:
హామీపత్రం:
పై గేయము నా స్వంత రచన.దేనికీ అనువాదం, అనుకరణ కాదు.ఎక్కడా ప్రచురింపబడలేదు.
11
కవితాగానం
వై.కె.సంధ్య శర్మ
అంశం :.విశ్వాసం
శీర్షిక : జానపద గేయం( ఓరోరి తమ్ముడా)
ఓరోరి తమ్ముడా... ఒగలమారి తమ్ముడా
గెలుపు పిలుపు అందుకో తమ్ముడా
గుండెలోన దిగులెందుకు తమ్ముడా
ఓటమంటె భయమెందుకురా తమ్ముడా
ఓరోరి తమ్ముడా... ఒగలమారి తమ్ముడా..
కథలెన్నో విన్నావు-కన్నతల్లి ఒడిలోనా పెరిగావు
కష్టమైతే కలసిమెలసి- నడువురా
కలకాలం ఆత్మవిశ్వాసం వీడి పోకురా...
ఓరోరి తమ్ముడా.. ఒగలమారి తమ్ముడా
ఆటలంట పాటలంట చక్కగా నేర్చావు
అడుగడుగునా ఎదురయ్యే బాటలెన్నో నడిచావు
ఆకాశం అంచులు తాకే విజ్ఞానం తెలుసన్నావు
ఓరోరి తమ్ముడా ఒగలమారి తమ్ముడా
గురువు చెప్పే సుద్ధులు
నాన్న చెప్పే బుద్ధులు పెద్దలు చెప్పె నీతులు
ఒద్దికతో వినరా... కాదని కాలదన్నకురా..
ఓరోరి తమ్ముడు ఒగలమారి తమ్ముడా..
ఆత్మహత్యలొద్దురా... ఆత్మస్థైర్యం వీడకురా
బాధైనా .. బంధమైనా నీ వెంటె నేనురా
నమ్మకం నీవైతే... విజయం నీ సొంతమే...
గమ్యం నీ దాసోహమే....
ఓరోరి తమ్ముడా ... ఒగలమారి తమ్ముడా!
12
గాంధీ జయంతి వారోత్సవాల లో భాగంగా పోటీలకు గేయరచన.
కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..గేయరచన
శీర్షిక..విశ్వాసమే బలం
పల్లవి..
ఓ సోదరా! కదలి రమ్మురా
రగిలిపోతున్న ద్వేషాల చీకట్లను పారదోళ
స్నేహ దీపాల వెలుగులు పంచేందుకు కదలి రమ్మురా..2సార్లు..
చరణం.
కులమంటూ
కుమ్ములాటలు ఎందుకు
మతమనే పేరుతో
మారణహోమాలెందుకు
మనవులంతా ఒక్కటేనని చాటి
స్వార్థం,అహంకారం అనే మాయ పొరలు కమ్మిన మనుషుల కళ్ళు తెరిపించేందుకు రా.....ఓ సోదరా..
చరణం.
సంకల్పబలంతో ముందుకు సాగాలి
చేసే పని మీద విశ్వాసముంచితేనే
లక్ష్యం నెరవేరును
అనుకున్నది సాధించి తీరుతాము
విశ్వాసమే లేకుంటే సర్వం శూన్యం సోదరా....ఓ సోదరా...ఆ..ఆ..ఆ..ఆ.
చరణం.
నాయకుడివై ముందుకు నడవాలన్నా
కావాలి ఆత్మ విశ్వాసం
విశ్వాసంతో ముందుకు సాగితేనే
విజయం వరించి తీరును
సహనమే నీ సుగుణమై
మానవత్వ పరిమళం వెదజల్లుతూ సాగిపో సోదరా...ఓ సోదరా....
ఓహోహో... ఆ..ఆ..ఆ..ఆ
చరణం..విశ్వాసం గాలికి వాలిపోయేది కాదు
అది అచంచలమైంది
హిమశిఖరాలంతా స్థిరమైనది
ఆ విశ్వాసమే కదా మహాత్ముని ముందుకు నడిపినది.
స్వాతంత్ర్య సంగ్రామంలో విజేతగా నిలిపినది.
అందుకే ధీరుడివై సాగిపో సోదరా
విజయమే సొంతమవును రా.
ఓ సోదరా! కదలి రమ్మురా....
లా..లా..లా..లా..లా.
ఈ గేయం నా సొంత రచన.దేనిని అనుసరించలేదని హామీ ఇస్తున్నాను.
్సం(గేయము)
విశ్వాసమే మనకురక్ష
విశ్వాసమే మమతల ద్రాక్ష//విశ్వాసమే//
చేయుపనులయందున ఆత్మనిగ్రహము కావాలి
ముందుఅడుగు వేయాలి
ప్రగతిబాటను పట్టాలి
విశ్వాసముతో పనిచేయాలి
అదే మనకు జీవితానికి పూలబాట
//విశ్వాసమే//
నీమీద నీకు నమ్మకము ఉండాలి
ఎదుటి మనిషిని మీద విశ్వాసముండాలి
కలిసిమెలసి మానవత్వము పరిమళించాలి
మేఘాల పల్లకిలో ఊరేగాలి
//విశ్వాసమే//
సంకల్పముతో ముందుకు ఉరకాలి
అడుగుఅడుగు చైతన్యముబకావాలి
ఆత్మవిశ్వాసముతో సాగిపోవాలి
ఆత్మవంచన లేకుండానసుకు కలవాలి
మనుషులంతా ఆనందముగా మురవాలి
//విశ్వాసమే//
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి
14
విశ్వాసం మానవాళికి ఒక ఉత్తేజం
విశ్వాసాలు సన్నగిల్లి నప్పుడు అనుబంధాలు కరువు అవుతాయి
స్నేహానికి గుర్తు ఒక విశ్వాసం
విశ్వాసాలు ముందుకు నడిపించే చోదక శక్తులు విశ్వాసాలు సన్నగిల్లుతోంది
మనిషిని మనిషి ప్రేమించడం ఒక విశ్వాసం మనిషి ముందుకు సాగాలంటే విశ్వాసాల ఉత్తేజం కావాలి
యుద్ధభూమిలో విజయమో వీరస్వర్గమో అది నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది
విశ్వాసాలు పరస్పరం సందర్శించ కూడదు విశ్వాసాలు నైతికతకు మార్గదర్శకాలు
విశ్వాసంతో ముందుకు పదండి పోదాం పైపైకి విశ్వాసంతో ప్రపంచంలో దేనినైనా జయించ వచ్చు
పరస్పరం జీవితంతో ఆ సంకల్ప శక్తియుక్తులతో మహాత్ముని దీక్షను నడిపించింది స్వాతంత్రం ఉద్యమంలో
మనిషికి సత్యాగ్రహం హింస స్వాతంత్ర ఫలానికి మార్గదర్శకమైంది
విశ్వాసం ఒక నవ ఉత్తేజం
విశ్వాసం వీరునికి దీక్షా సంతకం
విశ్వాసాలు ఆత్మీయ సంతకాలు
విశ్వాసం స్నేహానికి కొండగుర్తు
విశ్వాసానికి సదా స్వాగతం
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
15
[06/10, 8:32 PM] +91 74168 63289: కవితా గానం
తేదీ :6/10/2020.
అంశం: మాటల కంటే చేతలకే ఎక్కువ ప్రాముఖ్యత నివ్వాలి అన్న గాంధీ సూక్తి ధ్వనించేలా కవిత.
శీర్షిక: మహానుభావులు
విత్తు మొలకై ,మొక్కై , చెట్టై, వృక్షమై మానవుని మనుగడకు ....మనుగడనిచ్చి
మౌనంగా నిష్క్రమించినట్లే పుట్టి ,గిట్టినా మనీషులుగా గుర్తింపు కొందరికే
ఇతిహాసాలు చెప్పాయి ఎన్నో నీతులు
చేతల్లో ఆచరించి అమరులైనారు ఎందరో
శ్రావణుని కథ చదివి గాంధీ గారు పొందిన స్ఫూర్తి తల్లిదండ్రులని దైవా లుగా భావించి తెచ్చుకున్న కీర్తి
బిడ్డ కడుపు నిండిందో లేదో అమ్మ చూసే విషయం సామాన్యం
తల్లి తిన్నది లేనిది చూచి ,,ఉన్న దానిలో, అమ్మతో తినటం అసామాన్యం
చేత పైసా లేని కలాం స్పుత్నిక్ ,రాకెట్ తయారీలో విజయం, మాటలు కాదు చేతల్లో చూపించిన దార్శనికుడు .
చేత ఆయుధం పట్టక, సత్యాగ్రహం చేతల్లో చేసి సాధించిన స్వాతంత్ర్యం
ప్రపంచ చరిత్రలోనే అనితర సాధ్యం
తిలక్ ,పటేల్ ,నేతాజీ ,వీరసావర్కర్
ఉరితాడును ముద్దు పెట్టుకున్న వీర కిశోరాలు ఎందరెందరో. మాటలతో కాక, చేతలతో చూపించి ,చిరస్థాయిగన్న అమరవీరులు ఎందరో
మాటలు కట్టిపెట్టి ,మౌనంగా ,చేతలతో ముందుకు నడుద్దాం.
గాంధీ గారు కన్న కలల్ని కల్లలు చేయక కలిసి నడుద్దాం
16.
[06/10, 8:46 PM] Ramaka: 🥏కవితా గానం🥏
*గాంధీజయంతి వారోత్సవాలు*
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:6-10-2020
అంశం:మాటల కన్నా చేతలు అవసరం
ప్రక్రియ: వచనకవిత్వం
శీర్షిక: ఆచరణే అసలు యోగం
**************************
మాటల మూటలు మత్తెక్కిస్తాయి.
అందంగా పందిళ్ళు వేసేస్తాయి.
మాట మంత్రమే.......
కానీ....చేత శాశ్వతమవుతుంది.
ఒక్క మాట విశ్వాసం నింపి
నడిపిస్తే,
చేసిన పని నిదర్శనమై శాశ్వతమవుతుంది.
చెప్పిన గొప్పల కన్నా.......
కొట్టిన చప్పట్ల శబ్దాల కన్నా.....
నిర్వహించిన చేతలే చరిత్రవుతాయి.
మనిషి పోయినా..........
ఆతని మాటలు మరుగున పడినా...........
చేతలు శిలాక్షరాలై కనిపిస్తాయి.
త్రికరణశుద్ధితో చేసే గొప్పపనులే
ప్రజల మనసుల్లో గూడుకట్టుకుంటాయి.
చెప్పిన మాట కన్నా.......
వేసి చూపిన అడుగు.......
చైతన్యం నింపి నడిపిస్తుంది.
చేత చేతనమై,అంకురమై,
మహావృక్షమై నిబద్ధతతో నిలబడుతుంది.
జయానికి మంత్రమై,
జగజ్జేగీయమానమై అలరారుతుంది.
హామీపత్రం:
పై వచనకవిత నా స్వంత రచన.దేనికీ అనువాదం, అనుకరణ కాదు.ఎక్కడా ప్రచురింపబడలేదు.
17
[06/10, 8:51 PM] STTRao Kama Reddy Poet: కవితాగానం
అంశం..మాటలుకంటెచేతలకే ఎక్కువ ప్రాముఖ్యత నివ్వాలి అన్న గాంధీ సూక్తి ధ్వనించేలా కవిత
మనముచేసేపని మాటలుకన్న చేతలకే ఎక్కువ సమయము ఇవ్వాలి
గాంధీ ఛిన్నవయసులో ఉన్నప్పుడు
సత్యహరిశ్చంద్ర నాటకము చూసి
సత్యముయొక్క విలువెంతో నేర్చుకున్నాడుదానిని మాటలలో కాకుండా జీవితాంతము చేతలలో చేసి చూపించాడు సత్యాన్ని ఆచరణలో పెట్డడానికి కృషిచేసాడు
సత్యాన్ని తన దేహములో జీర్ణించుకొన్నాడు సత్యమునకు ఒక ఉన్నతమైన స్థితిని ఇస్తాడు
ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధముబాడరాదు
ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా సత్యాన్ని వీడరాదు సత్యము కోసము ప్రాణాలు సైతము ప్రాణముగా పెట్టాలి
సత్యముకున్న మహోన్నతమైన భావన సమాజానికి అందించడం జరుగుతుంది
శ్రావణుని కధను విని తల్లిదండ్రులు పట్ల ఎంత గౌరముగా ఉండాలో నేర్చుకున్నాడు
తల్లిదండ్రుల రుణము తీర్చలేమని,వారిని కంటికి రెప్పలా కాసుకోవాలని చాటి చెప్పాడు
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి
18
[06/10, 8:56 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*
06/10/2020*
*మౌనంగా నే ఎదగ డం*
తరువు ను గురువుగా భావించి
మనము హాయిగా ఎదుగుతూ
ఇతరుల ఎదుగు దల కు తోడ్పాటు కావాలి,
మాటలు కోటలు దాటడం కాదు,
చేతలలో చైతన్యం తో ముందుకు సాగాలి,
మన ఖ్యాతి జగమంతా పొగడాలి
విశ్వ విజేత గా పుడమి న
వెలగాలి
గగనము న నక్షత్ర మై మెరవా లి
జ్యోతి వలె ఇలలో నిలవాలి
ఆచంద్ర తారార్కము మన పేరు
మెర వాలి
పరుల చింతనతో పరమత్ముల
ము కావాలి.
*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
19
[06/10, 8:57 PM] Anitha Aitha Poetess: *కవితా గానం*
శీర్షిక:: *మౌనంగానే ఎదగమని..!*
కంచు మ్రోగినట్లుగా
కనకం మ్రోగదు కదా
ఏమిలేని విస్తరాకు ఎగిరిపడ్డట్టు
అన్ని ఉన్న విస్తరాలకు ఎగిరపడదు కదా
నిండు కుండ తొణకనట్లు
గొప్పవారెప్పుడూ ఆర్భాటాలకు పోరు!
నిదానమే ప్రదానమంటూ
ఒక్కో మెట్టు ఎక్కుతూ
విజాయాలను ముద్దాడుదాం!
ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ
అందరికీ ఆదర్శప్రాయమవుదాం!!
పరోపకారంలో నదీనదములను
మౌనంగా ఎదుగుటలో తరువులను
నిస్వార్థంలో భూమాతను
అనుకరిద్దాం!
మౌనంగానే ఎదగమని
సర్వజనావళికి చాటుదాం!
రచన
అయిత అనిత
20
[06/10, 9:12 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*
తేదీ:06-10-2020
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: మాటల కన్నా చేతలు అవసరం
******************
మనసున్న మనిషిగా
మహిలో నిలబడేందుకు
ఉబుసుపోని మాటలు
ఉచ్చరించే పెదవుల కన్నా
హృదయాన్ని తట్టి ధైర్యము చెప్పే చేతలే ..
పదుగురిలో మార్పు తెచ్చే సన్మార్గపు బాటలవుతాయి!
బతుకు మధురిమను తెలిపే
శ్రమ జీవన సౌందర్య రూపమవుతాయి!
కల్లంలో గింజ పల్లెంలో మెతుకై నోటిని చేరే వెనకాల కష్టం
కళ్ళముందు మెదిలినప్పుడే
మనకు తినే హక్కుందని తెలియాలి!
నడిచే దారిని చూసి నవ్వే నోళ్ళు
ఆపై చేసే అవరోధాల యుద్ధాలు
ఎన్నైతేం అంతిమ విజయం ఆత్మ విశ్వాసంతో వేసిన అడుగుదేనన్న మహాత్ముడు..
సత్యం ఎప్పుడూ పులుగడిగిన ముత్యమే
అది నడిపించే మార్గమెపుడూ
సన్మార్గమే..
అహాన్ని నెత్తికెత్తుకున్నామా ఆ క్షణం నుంచి పతనమే నంటూ..
మౌనంగా ఎదిగే మొక్క
మంచితనపు నీడనిస్తూ
పరోపకార ఫలాలు పంచుతూ
జీవిత పరమార్థం ఏమిటో తెలుపుతాయి!
ఏదీ శాశ్వతం కాదీ లోకంలో
ఎప్పుడు ఏ క్షణం మృత్యువు ముంచుకొస్తుందో...
అందరితో కలివిడిగా ఉండి
మరణించినా
మన బాపూజీలా ఎద ఎదలో
సజీవంగా ఉండటమే దైవత్వం!
మాటల కన్నా చేతలు మిన్న అయిన
మానవత్వమే శాశ్వతం
21
[06/10, 9:14 PM] కొలచన విజయ భారతి Poetess: కవితా గానం
పేరు: కొలచన విజయ భారతి
ఊరు: హైదరాబాద్
అంశం:మాటల కంటే చేతలకే
ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి
శీర్షిక:ప్రార్థించే పెదవుల కన్న
సేవించే చేతులే మిన్న
తేదీ:6-10-2020
**********************
ఈ పవిత్ర భారతావనిలో
ఎందరెందరో మహానుభావులు
తమ జీవితాలను ,ప్రాణాలను
దేశం కోసమే ధారపోసారు
ఎందరెందరో స్వాతంత్ర్య సమర యోధులు
భారతావని స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకై అసువులు
బాసారు
ఏ ప్రతి ఫలాలు ఆశించి వారు
దేశసేవకై పాటుపడ్డారు
మాటలతో కోటలు కట్టడం కాదు
చేతలతో దడిగా నిలబడితే చాలు
మౌనంగా ఎదగమని మొక్కచెపుతుంది
ఒదిగి ఉండటంలోనే
ఉన్నత వ్వక్తిత్వం గోచరిస్తుంది
చేసే ఉపకారం ప్రతిఫలాక్ష
లేకుండా చేయాలి
ప్రార్థించే పెదవుల కన్నా
సేవించే చేతులే మిన్న
చేసే సేవలే చిరంజీవులుగా
చరిత్రలో నిలబెడతాయి
మహానుభావుల ప్రబోధనలే
మార్గదర్శకాలౌతాయి
🌹🌹🌹🌹🌹
22
[06/10, 9:16 PM] భరద్వాజ గారు: 🙏కవితాగానం 5🙏
నేటిఅంశం- *మహావృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది. *
🌹శీర్షిక - మౌనం నిజంగా మౌనమే ..!🌻
ప్రపంచంలో మనిషి తప్ప అందరూ మౌనవ్రతమే -
వీచే చిరుగాలి -
పూసే పూలు -
వెదజల్లే సుగంధం-
ప్రవహించే నది -
పండే ఫలము -
ఎదిగే చెట్టు -
వచ్చేమరణం -
అన్నే మౌనంగానే తమ వంతు పనులు చేస్తున్నాయి -
మౌనం ఒకవింత అనుభూతి -
మౌనం ఒక మహాఉద్యమం -
అది ఒక పెద్ద సంగ్రామం-
మౌనం ఎదుటి వాడి కోపాన్ని హరించే మంత్రం -
శాంతికి చిహ్నం -
ప్రశాంతతకు ఆనవాలు -
మౌనంతో సాధించ వచ్చు ముక్తి -
మౌనాన్ని జయించే ఆయుధం లేదు -
మౌనధ్యానం దైవదర్శనానికి ఒకమార్గం -
మేధావులమౌనం విజ్ఞాన భాండాగారం -
రవిఅస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి పునాదులు కదిలించింది ఈమౌనమే -
గాంధీజీని జాతిపితను చేసింది ఈమౌనమే -
మౌనం ఆరోగ్యదాయకం -
తగాదాలు లేని జీవితానికి అమృత తుల్యం -
ఇదినాస్వీయరచన
భరద్వాజరావినూతల (RB)🖊️
కొత్తపట్నం 9866203795
ప్రకాశంజిల్లా
23
[06/10, 9:16 PM] Sandya Sharma Poetess: గాంధీజీ జయంతి సంధర్భంగా
కవితాగానం
అంశం : మాటల కంటే చేతలకే ప్రాముఖ్యం
వై.కె.సంధ్యశర్మ
చిత్తూరు.
శీర్షిక: మౌన ముద్ర!
రాలిపడ్డ వేదనా వాక్యాలు
కఠిన శిలలై గుండె లోతుల తడుముతున్నా
ఆవేదనా తీగలు
తనువంతా పులుముతున్నా...
ఓటమి చెలిమి వేలెత్తి చూపుతున్నా...
ఓ జ్ఞాన కెరటపు జల్లును
నిశ్శబ్దంగా అరచేతిలో
ఒంపుకుని స్వాంతనా రేఖలతో
మరో శుభ ఘడియకు
స్వాగతమిస్తాం....
అనాలోచిత చర్యల్లో
వాడిపోయే మస్కిష్క పూరేకులకు
ఒద్దికగా స్వచ్ఛ గంధాలను అద్థి
ఓ ప్రహేళికలా మార్గనిర్దేశికమవుదాం...
భారపు గుబులును తీర్చే
ఛత్రమై సంయమన క్షేత్ర పాలకులై
వృక్షమై ఎదిగే నేర్పుతో
మౌన ముద్ర పొదిగిన
మహాశయుల జీవన పాఠాలన్నీ
వల్లెవేద్దాం... జ్ఞాన పంజరంలో
విజ్ఞాన సుమాలను... వికశింపజేద్దాం!
24
[06/10, 9:17 PM] కందూరి సుజాత Poetess: కవితాగానం పోటి
శీర్షిక..🌷 ఎదిగి ఒదుగుట 🌷
........... ........... ......
పలుకురాని ప్రచండ సూర్యకిరణం సమస్తసుఖ భవ భయహారం.
నీలినింగి వడ్డాణం రంగుల హరివిల్లు ఒదుగుటలోనే శ్రీకారం .
నిరాకారమున సడిచేయు గాలి
విశ్వవ్యాప్తి సంచలనం .
సరళగుణాల గాంధీ తపం విశ్వశాంతి వికాసం .
మౌనప్రభాసం ఎదిగి ఒదుగుట .
తరులు గిరులు దాటి తరలివచ్చు జలతరంగిణి సస్యశ్యామల
ఉత్ప్రేరకారిణీ.
అంతర్భాగాన భూతాపనివారిణి.
ఉన్నత ఆశయాల గాంధీ వాక్ తరంగిణి అరాచక స్వార్థ విచ్ఛిన్నకారిణి. అంతర్భాగాన చైతన్యకారిణి .
మహాపంచభూతాల మౌనవ్రతాలు.
మహాసముద్రుడి వడిలోంచి ఉప్పును
తోడి ఎదిగిన గాంధీ.
ప్రాణాలను భలిగొన్న జలియన్వాలాబాగ్ దాడిలో ఓడక ఒరిగిన గాంధీ .
సత్యాగ్రహాల తరంగాలచే యావద్భారత శక్తితుఫాను రేకెత్తించి శత్రు వినాశనంచే నింగికేదిగిన గాంధీ .
ఎదిగి ఒదిగిన మౌనాక్షర మంత్రం గాంధీ.
స్వేచ్ఛనొసగిన కీలక పురుషుడు గాంధీ. కీలుగుఱ్ఱంల పదవులను వదిలి
మహిళా స్వేచ్ఛను ఆశించి
యువతను ప్రోత్సహించి
సబర్మతి ఆశ్రయాన శాంతి ప్రదాతగా
నిలిచి
రూపాయల పైన బోసినవ్వులు వొలకించి.
ఆశయంలో ఎదిగి అహంలోఒదుగుట
ప్రశాంతతని తలచి.
ఎదిగి ఒదిగె వృక్ష రాజుకు నిలువెత్తు నిదర్శనము వలచి
దేశహితం కోరు మౌన తపోనిధి మహాత్మా గాంధీ.
మౌనప్రయాగ కీర్తన ఎదిగి ఒదగడం .
కందూరి సుజాతారాణి
రాజేంద్రనగర్, హైదరాబాద్
9392162822🌷ల
25
[06/10, 9:19 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..సూక్తి కవిత
శీర్షిక..మహావృక్షం
ఎన్నో జన్మల పుణ్యఫలం
మనం పొందిన మానవ జన్మం
ఆలోచించే మేధా శక్తి మనకే సాధ్యం
మాటలతో చిత్తు చేసే మహా శక్తివంతులమూ మనమే
మాటలకే పరిమితమై
ఆచరణలో పెట్టని మహానుభావులు మనలో కొందరు
మాటలు విశ్వాసాన్ని మాత్రమే నింపగలవు
ఆచరణ చేకూర్చును
కార్య సఫలతను
అదే చిరస్థాయిగా నిలుచును
చిరు బీజానికి తడి తగిలితేనే
మట్టి పొత్తిళ్లలోంచి మొలకై లేచి
మౌనంగా ఎదుగుతూ
మానవత్వం పరిమళించే
మహావృక్షమై నిలబడుతుంది
మాటలు కోటలు దాటునని
మాటలనేవి లేకుండానే
మౌనంగానే ఉంటూ
బోసినవ్వులే మంత్రంగా
సత్యాహింసలే ఆయుధాలుగా
స్వాతంత్ర్య సంగ్రామంలో ధీరుడై నిలిచి
సమరం సాగించిన మహాత్ముడు
స్వేచ్చా ఫలాలను అందించి
చరిత్రలో నిలిచిన యుగపురుషుడు
భారతీయులకు సదా పూజ్యనీయుడు.
26
[06/10, 9:22 PM] Komandoori Neela Poet: కవితా గానం
అంశం: *విశ్వాసం*
06/10/2020
వచన కవిత
శీర్షిక:మహానుభావులు
మనిషి మహా వృక్షంలా మౌనంగా ఎదుగుతూ ఒదగాలి..!
జీవిత చక్రం తెలిపే జీవన సత్యమిదే..!
మహానుభావుల మేథకిదే ముఖ్య సూత్రం..!
మాటల మనిషై పేరొందక చేతల మనిషై నిరూపించుకోగలగాలి..!
విలువల వలువలను నడిబజార్లో విప్పుతూ..,
కృూరత్వపు ముసుగును తగిలించుకొని మహామనీషనిపించుకోవటం..,
అడుగులకు మడుగులొత్తే వారలకే పట్టం కట్టడం కన్నా దుష్టత్వము వేరేలేదు..!
ఎంత ఎదిగినా భేషజాలు లేక ఒదిగి వృక్షంలా తోటి వారలకు నీడనివ్వడమే ధ్యేయమైతే అతడే మహానుభావుడై జనుల హృదయాలలో చిరంజీవై నిలుస్తాడు మన్ననాపాత్రుడై...!!!!
పేరు: కె.ఇ.నిలమంగై
కలం పేరు:నీలా రంగనాధం
ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.
చరవాణి సంఖ్య:8897155600.
*ఈ పై వచన కవిత ఈ సమూహం కోసం రాసినవేనని హామీ ఇస్తున్నాను.
27
[06/10, 9:26 PM] Gajula Bharati KS 20: కవితగానం
*********
పేరు:గాజుల భారతి శ్రీనివాస్
అంశం:మాటల కంటే చేతలకే ప్రాముఖ్యత ఇవ్వాలి
శీర్షిక:మౌన ముని
మౌనంగానే ఎదగమని
మొక్క చెపుతుంది
శాంతంగా ఉండాలని కాలం చెబుతుంది
కంచు మోగినట్లు
కనకంబు మొగునా
అన్నట్లు
గాలిలో కలిసిపోయే
మాటల కంటే చేతలే గొప్ప
అరుదైన,వ్యక్తుల్లో
మహాత్మగాంధీ మహోన్నతుడు
సర్వజనీయమైనది
సర్వకాలీయమైనది
సర్వజనహితమైన
పనులే గాంధీజీ వి
సమస్త ప్రపంచం గుర్తించిన మేధావి
వివిధ సందర్భాలలో
ప్రవేశపెట్టిన ప్రణాళికలు
ఆచరించిన నిర్ణయాలు
వ్యవస్థలకు,వ్యక్తులకు
అనుకూలంగా మౌనంగానే అమలు చేసినవే
సంపూర్ణంగా ఎదిగిన,ఒదిగిన మూర్తిమత్వం
జీవిత సారానంత అతి చేరువగా
చేసినవారు
మితభాషి
ఒక జ్ఞాని
దాని తాలూకు మౌనం అది
ఎదిగిన ఒదిగి ఉండే
నిలువెత్తు నిదర్శనం
జాతిపిత-శాంతి దూత
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
*****************
28
[06/10, 9:30 PM] విజయ లక్ష్మి యాదాద్రి: *ఆచరణల పిత*
****************
చిన్ననాడే పాఠశాలలో గురువునే
ఆశ్చర్యపరిచే నిజాయితీ వెన్నెలలు
కనబరిచిన కరంచందుడా!
తల్లికిచ్చిన మాట కొరకు
జీవితాంతం శాకాహారిగా నిలిచిన
కలియుగ హరిశ్చంద్రుడా!
సత్యాగ్రహం అహింసా మార్గాలలో
తొలినాళ్ళలోనే మిల్లు కార్మికులకు
నీలి'రైతులకు న్యాయాన్నందించిన నేతా!
సహాయ నిరాకరణను మధ్యలో ఆపినా
సమాజ రుగ్మతల నిర్మూలనలకు కృషిచేసినా
ఆగడాల సహించినా అది నీ ఆచరణావ్రతమే బాపూ!
నువ్వు చేసిందే జనులకు సూచించావు
సామాన్యులూ చేయగలిగిందే చెప్పావు*
చెరగని నీ ముద్రను మౌనంగా వేశావు
ప్రజల మనస్సుల్లో దేశభక్తివిత్తుల నాటి
వటవృక్షాలయ్యేలా ఆచరణ చూపావు
పదవులకు దూరముండి మనసులకు దగ్గరయ్యావు
బ్రహ్మచర్యం గ్రామీణ స్వయంసమృద్ధి
స్త్రేల భాగస్వామం అన్నిటా నీ కార్యధీక్షనే
ప్రపంచానికే కొత్త జ్యోతిగా నిలిపావు
ప్రాచీన ధర్మమార్గాన్ని నడిపిన నేతా!
పాదయాత్రతో లక్ష్యాన్ని సాధించిన స్ఫూర్తిదాతా!
నీకు సాటి నీవే- వేరెవ్వరు లేరు జాతిపితా!
వల్లాల విజయలక్ష్మి
ఆలేరు
29
[06/10, 9:30 PM] +91 80748 15328: ఈసృష్టి అనంతకోటి జీవరాసుల సమ్మేళనం
మానవుడు అందరిలో అగ్రగామి
ప్రకృతిని ఆస్వాదిస్తూ శాసిస్తూ
ప్రకృతిని గురువుగా భావిస్తూ
జీవనయానం
సాగించగల సమర్ధుడు
*ఎదిగిన కొద్దీఒదగమనీ మొక్కనీకు చెబుతుంది*
అన్నాడో సినీకవి
రెండుచేతులు,రెండుకాళ్ళు,రెండుకళ్ళు,రెండు చెవులు రెండునాసికారంధ్రాలు,
ఉన్న ఈ మానవశరీరానికి ఒకటే నోరుంది
అంటే
అన్ని పనులు అధికంగా చేసినా
నోరునుమాత్రం అదుపులో పెట్టుకోమనే.
మానవుని మహనీయునిగా మారమనేగా
lసృష్టి రహస్యo
ప్రసూనశర్మ
30
[07/10, 8:01 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*
*07/10/2020*
*గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది*
అహం మనిషిని అదః పాతాళానికి నెట్టేస్తుంది
మనిషిని మృగం కంటే
హీనము గా మారుస్తుంది
విచక్షణను రూపు మాపుతుంది
ఆలోచనలను అనగ దొక్కు తుంది
ఆదర్శాలను మాయం చేస్తుంది
ఆప్యాయతను ,అనురాగాన్ని
అణచి వేస్తుంది
మంచిని త్రుంచి చెడును పెంచును
ఆత్మను పరి శుద్ధంగా ఉంచదు
అంతః పరిశీలన ఉండదు
కళ్ళకు మాయ పొరలు
కమ్ముకుంటా యి
చాంచల్యం పెరుగుతుంది
స్థిరత్వం తగ్గుతుంది
పరీక్షిత్తు గర్వము చే సర్వము
కొల్పోలే దా
బలి గర్వ ము బలిని పాతాళానికి పంప లేదా!
గర్వము వినాశనానికి మూలం.
*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
31
[07/10, 8:02 PM] Korada: కవితాగానం
అంశం:-@ గర్వం @
కోరాడ నరసింహా రావు! ***నిగర్వీ నరోత్తమః***
*************
ధన ముందని.....
బల ముందని....
మే ధావిని నేనేనని...
గర్వించుట తగదు
సుమా....!
దుర్యోధన,కర్ణాదులే...
గర్వమున నశించినారు!
గర్వించిన రావణునికి
ఏగతిపట్టినదోతెలియద
అణకువయే విభీషణుని
రాజునుచేసెను కాదా!
వాలీసుగ్రీవుల కథ తెలిసీ గర్వించదగిన !?
చరిత్రలో ఎన్నెన్నో సాక్ష్యాలు మనకున్నవి!!
మనకంటే...ధనవంతులు,బలవంతులు,మేధా
వులుకోకొల్లలు ! పతనమున పడద్రోసే...
గర్వము మనకెందులకు
గొప్పవారెప్పుడూ గర్విం చరు తెలుసుకో ....!
వొదిగివుండే...సామాన్యుడు ,మాన్యుడై ...
మహాత్ము డయ్యె...!
అనితర సాధ్యమునే సాధించీ...గర్వించలేదు!
ఇంతా శ్రమించీ ....ఏ
పదవులు ఆశించలేదు
కనుకనే....జాతిపితగ
ఖ్యాతినెంతో...బొందినాడు ....!!
ఏనాడూ ...దేనికీ...
గర్వించకు సోదరా....!
అందరితోకలిసిమెలిసి...
ఆనందం పొందరా...!!
*******************
.......కోరాడ.
32
[07/10, 8:14 PM] STTRao Kama Reddy Poet: కవితాగానము
అంశం..గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది
గర్వము మనిషిని అథఃపాతాళానికి
తోసివేస్తుంది నిలువెల్ల దహించి వేస్తుంది
మనిషిలో ఉన్న మంచితనాన్ని
మానవత్వాన్ని చెరిపి వేస్తుంది
మానవున్ని రాక్షసుడిగా మారుస్తుంది
మానసికముగా, శారీరకముగా కుంగిపోతాడు
ఏపనిని చేయలేదు అహంకారం అనే రక్కసి ఆవహిస్తుంది
ఎదుటి మనిషి చెప్పిన మాటలను
పెడచెవిన పెడయతుంది
అహంకారముతో విర్రవీగుతాడు
గర్వము మనిషికున్న మమతలను
లోనదాగియున్న నైతిక విలువలను
నాశనము చేస్తుంది
గర్వముతో విర్రవీగుతాడు
తనంతటి వాడు లేడని చెపుతాడు
కాబట్టి గర్వముతోఉన్న మనిషి
ఓటమిపాలవుతాడు
గర్వములేక మంచిగా యున్న వాడికి గెలుపు తలుపు తట్టుతుంది
చరిత్రలో గర్వముతో ఉన్న వారందరు ఓటమిపాలైనారు
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి
33
[07/10, 8:20 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: గర్వ తొలగిపో వినయ మా అవతరించు
వినయాలు విలువైన తేజస్సులు
వినయం విశిష్ట ఆభరణం
వినసొంపైన పుష్పం మానవీయ పరిమళాలను వెదజల్లే
మానవ మమతల లోగిలిలో వినయ సాగులో ఎన్నో పండిస్తాం మంచి ఫలాలు అవి అందరికీ ఆస్వాదన ప్రియమైనవి
అందరూ వినయ పు దండలు ధరించండి ప్రేమకు ఆనవాళ్లను పొందండి వినయం విశిష్ట సాంప్రదాయ నీకు సదా వందనాలు
వినయ్ ఏమో విజయము రెండు ఒకదానికొకటి పరస్పర పూరకాలు
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
34
[07/10, 8:33 PM] Ramaka: 🎼కవితా గానం🎼
*గాంధీజయంతి వారోత్సవాలు*
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:7-10-2020
అంశం:గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది
ప్రక్రియ: వచనకవిత్వం
శీర్షిక:అంతశ్శత్రువు
**************************
మనిషిని మరుగుజ్జు చేసి
ఆధిపత్యానికి దగ్గర చేస్తుంది.
మనసు మార్దవాన్ని ప్రక్కకు నెట్టి
అతివిశ్వాసాన్ని అక్కున చేరుస్తుంది.
ఆశను అతిగా పెంచి
అనుబంధాలను తుంచుతుంది
అందరినీ దూరం చేసి
ఏకాకిగా మిగులుస్తుంది.
పతనానికి చేరువ చేసి
విలువలకు తిలోదకాలిప్పిస్తుంది.
సర్వము తనదే అన్న భావన నింపి
సర్వనాశనం వైపు తీసుకువెళ్తుంది.
తామస గుణాన్ని అధికమొనరించి
చేయకూడని పనులెన్నో చేయిస్తుంది.
శాంతిని హరించి,
ప్రేమను మాయం చేసి,
సంకుచిత్వాన్ని బహుమతిగా ఇస్తుంది.
స్వచ్ఛతను దొంగిలించి స్వార్థాన్ని భుజకీర్తులుగా తగిలిస్తుంది.
మంచిని తుంచి,
మానవత్వాన్ని హరించి,
చరిత్రహీనునిగా మారుస్తుంది.
గర్వము దుర్గుణమై
మనిషిని మాయం చేస్తుంది.
హామీపత్రం:
పై వచనకవిత నా స్వంత రచన.దేనికీ అనువాదం, అనుకరణ కాదు.ఎక్కడా ప్రచురింపబడలేదు.
35
[07/10, 8:59 PM]Poetess: కవితా గానం
గాంధీ జయంతి ఉత్సవాలు
పేరు :డా.బల్లూరి.ఉమాదేవి
తేదీ :7/10/ 20
అంశం :గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది
నడమంత్రపు సిరి రాగానే
కళ్ళు నెత్తి కెక్క కన్ను మిన్ను కానక
తిరగడం మానవ నైజం
చదువైనా,పదవైనా,సిరియైనా
ఆదరంతో చూస్తే అందలాన్నెక్కిస్తుంది
అహాన్ని చూపితే అధఃపాతాళానికి తోస్తుంది
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి వుండమని
సంకేతాన్నిచ్చే తరువులు కాదా మనకాదర్శం
గాదెలనిండా ధాన్యమున్నా
తినేది గుప్పెడు మెతుకులేగా!
నాల్గునాళ్ళ జీవిత నాటకంలో
ఏది వెంటరాదని తెలిసినా
ఈ "ఇగో"లెందుకో ఎవరికీ అర్థంకావు
బయటి వారికి జవాబివ్వక పోయినా
అంతరంగానికివ్వాలిగా
ఏచరిత్ర చూసినా,ఎంతటి ఘనులైనా
మిడిసిపాటు చూపి
చిరంజీవులైనారా?
గర్వంతో విర్రవీగిన కంసుడైనా,
మరిసుయోధనుడైనా,శిశుపాలుడైనా జరాసంధుడైనా
మనగలిగారా కలకాలం
మిగిలిందేమిటి క్షితిలో వారికి?
గర్వాన్ని పెంచే మిడిసిపాటు వీడి
అణకువ నేర్పే వినయాన్ని
ఆచరిద్దామా!
36
[07/10, 9:11 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది.
శీర్షిక..క్షేమదాయకం
తెలిసి తెలియని అజ్ఞానం
మనిషిని విర్రవీగేలా చేస్తుంది
ఆధిపత్యం కోసం ఆరటపడేలా చేస్తూ
అత్యాశను అధికం చేస్తుంది
ఆత్మీయతానురాగాలు తుంచివేసి
అనుబంధాలను దూరం చేస్తుంది
గర్వం అవసరం లేని ఓ చెడు స్వభావం
మనిషిని దరి చేరనివ్వని అత్యంత హీనగుణం
అంతా తనదేనన్న భ్రమలో ఉండి ఇతరుల ఆలోచనలకు తావివ్వదు గర్వం
మంచి చెడుల విచక్షణ లేకుండా
చేయరాని తప్పిదాలెన్నో చేయిస్తుంది
చివరకు అధఃపాతాలనికి తోస్తుంది
ద్వేషానికి కారణం
అపజయాలకు మూలం
ప్రేమాభిమానాన్ని
మంచితనానికి,మానవత్వానికి తిలోదకాలు వదిలి
కొంతకాలం రాజ్యమేలుతుంది
గర్వాన్ని వీడి మంచితనంతో మెలగడమే
మనిషికి క్షేమదాయకం
లేదంటే తప్పదు వినాశనం
మోమున గర్వం కనబడనీయకుండా
నిరాడంబరంగా జీవిస్తూ
సత్య అహింసా మార్గంలో పయనించిన గాంధీగారి మార్గం
సదా అందరికి అనుసరణీయం.
37
మన్నె పిన్నక లలిత
తేదీ 7/10/2020
అంశము: గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది
శీర్షిక: గర్వభంగం
గర్వం పతనానికి నాంది
మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండి
సంఘంలో గుర్తింపు పొంది
పొందిన గుర్తింపుకు దీటుగా
బ్రతకటం నేర్చుకో
నిలబడితే నీ జీవితం చరితార్థం
" సిరిిరా మోకాలొడ్డెను" అన్న పెద్దల మాటను మదినిలిపి
ధనము వస్తుందని నీతి మాలిన పనులు చేయక
నిగ్రహించుకొని నలుగురికి సాయం చేయి
కూడు గూడు ఉంటే చాలుగా, ఉందని పొట్టకి మించి తినలేవుగా, ఉందనిబంగారం తినలేవుగా
ప్రకృతి ఏమి ఆశించి మనకు అన్నీ ఇస్తుంది పరుల కోసమే కదా
గర్వం లేని గాంధీ గారు సాదాసీదాగా ఉండే సాధించారు దేశానికి స్వాతంత్ర్యాన్ని
గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది
38
[07/10, 9:24 PM] భరద్వాజ గారు: 🙏🎻 *కవితాగానం* -7🎻🙏
🌹 *అంశంఃగర్వం* *మనిషినిఓటమివైపు* *నడిపిస్తుంది* 🌹
పేరుఃభరద్వాజ
ఊరు-కొత్తపట్నం
9866203795
శీర్షిక ః *పతనం* *తప్పదు*
మనిషి ది ఆశలజీవితం-
గెలుపు ఓటముల సంగమం-
కష్ట సుఖాల మయం-
విజయం సాధించాలను కోవటం సహజం---!
అతని నిరంతరకృషి -
పట్టుదల శ్రమఅతని- తొలివిజయానికి వేస్తాయి మెట్లు-
వినయంతోవిజయానికి
దగ్గరై అందుకుంటాడు ఊహలఉట్లు-
జనం అభినందనలు-
అభిమానుల పొగడ్తలు-
బంధువర్గం ప్రశంసలతో- అవుతాడు తలమునకలు-
చేస్తాడు ముఖ స్థుతి స్నానాలు-
వరుసవిజయాలు-
నిరంతర గెలుపులు-
అతనిమస్థిష్కపునేలలోమొలకెత్తుతాయి అహంకారపు విత్తనాలు,-
వాటిని నీరుచల్లి ఎరువేసి పెంచుతాయి అస్మదీయుల స్థోత్రాలు-
ఉక్కిరిబిక్కిరైన అహంకారపు మొక్క-
వేళ్ళూనుకుని.మానై.ఊడలుదిగేస్థాయికి ఎదిగి-
గర్వపు కొమ్మలు విస్తారంగా పెరుగుతాయి-
మితిమీరిన గర్వపుపులి
విశృంఖల రూపం బయటపెడ్తుంది-
అంతా నేనే-
అంతా నాకే తెలుసన్న గర్వాతిశయం లోఉన్నఅతనిలో
ఓటమితుఫాను అల్పపీడనం లా ప్రారంభమవుతుంది-
అదితుఫానుగాలులతో-
సునామిగా మారి
అతన్ని
ఓటమి తీరపు అంచుకు
నిస్తేజంగా పడేస్తుంది-
గర్వమెరుగని మనిషి గగనం లాంటివాడు.-
అహం కారపుమనిషి సముద్రపు లాంటివాడన్నచరిత్ర కారుడి మాట
యదార్ధం మవుతుంది--!
*భరద్వాజ* *రావినూతల* 🖊️(RB)
39
[07/10, 9:25 PM] కందూరి సుజాత Poetess: కవితాగానం పోటి
అంశం.. గర్వం
శీర్షిక... 🌷 భస్మాసుర హస్తం 🌷
............. ........... ........
మితిమీరిన గర్వం భస్మాసుర హస్తం .
హద్దులు దాటిన అహంకారమున రావణుడు
కపివరుని తోకకు నిప్పును చేర్చి
లంకా దహనం కావించుకున్న స్వీయ గర్వఫలం.
రవి అస్తమించని సామ్రాజ్య కాంక్షతో
పేట్రేగిన గర్వమున ఆక్రమనలకు అడుగులు వేసిన శ్వేత జాతి .
స్వరాజ్యం ముందడుగుగా
దేశ ఆవేశ అశ్వదండుతొ పరదేెశ అడుగులు వెనుకకు తిప్పి
గర్వం సర్వం తుంచిన గాంధీ.
సంస్కృతిపై పాదం మోపి
సంపదను సమర్పించుకుంటూ
శాసనాలతో హింసిస్తున్న ఆంగ్లేయులకు
పౌర సంపదతో దేశ ఐక్యతతో తరిమి గర్వభంగ గుచ్చము అందించిన గాంధీ.
అగ్రరాజ్యమని బందుక్ మందు గుండులే నగీషాలనీ .
శాసన ధిక్కారం సహించబోమని విర్రవీగిన బ్రిటిష్ కు
తేనెలొలుకు వేదమంత్రాల ఘాటుతో
అహింసా పలుకుల సత్యాగ్రహ
నిషాలతో
శాశనాలను ఉల్లంఘించి సాగనంపిన గాంధీ.
అన్యాక్రాంతమున సామ్రాజ్యములో
అక్రమదాడుల ఎగిసిన ఆంగ్లేయుల
గర్వచింతన చరిత
దేశ జంతువు బెబ్బులిలా పంజవిసిరి పారదోలిన గాంధీ ఘన చరిత .
పరదేశ గర్వభంగము కావించి
స్వరాజ్య పలకము అచ్చేసెను
సగౌరవంగా గాంధీ.
"మితిమీరిన గర్వం పరాబవ గాయం
శృతిమించిన అహం భస్మాసుర హస్తం"
కందూరి సుజాతారాణి
రాజేంద్రనగర్, హైదరాబాద్
9392162822🌷
40
[07/10, 9:29 PM] విజయ లక్ష్మి యాదాద్రి: *గర్వమా!నా దరికి రాకు*
***********************
సఫలమైతే ప్రయత్నాలు
వరించు సగర్వవిజయాలు
విజయసోఫానాలు ఎక్కే కొద్దీ
గర్వమవుతుందట వృద్ధి
విజయశిఖరాల అధిరోహణం
తెస్తుందట తలభిరుసుతనం.
ఎల్లరు కోరే ప్రాణవాయువు
గెలుపు
జయాల0దించాలి జీవితాన మలుపు
ఎన్ని మెట్లెక్కినా మన ఆధారం
నేల మీదనే
ఎంత పైకెగిరినా కాళ్ళుoడాల్సింది భూమి పైనే
విజయాలకు వినయాలు తోడైతేనే
మన వ్యక్తిత్వం అందంగా శోభిల్లును
అభిమానానికి అహంకారానికి
మధ్యనున్న తేడాను గమనించు మనసా!
అన్నిటా విజయాలనే ఆకాక్షించు
కళ్లు ముఖాన ముందే ఉన్నట్లు ప్రవర్తించు
పొగరు నీలో తలెత్తినపుడు
మహాత్మున్ని మనస్ఫూర్తిగ స్మరించు
పరిస్థితులేవైనా నీలాగే నువ్వుండు
జయాపజయాలను సమంగా స్వీకరించు
వల్లాల విజయలక్ష్మి
ఆలేరు

Comments
Post a Comment