Skip to main content

KUTUMBA VYAVASTHA OCT 2020

 

నిర్వహణ

శివునూరి లలితాకృష్ణ

Author of vennela shilpam

వీరా గుడిపల్లి

The mathematics teacher and poet 

*******************************************

కవివరుల జాబితా

1.సుధారాణి కృష్ణం రాజు గారు

2.కొలచన విజయ భారతి గారు

3.డా.ఆంజనేయులు గారు ఖమ్మం

4.భరద్వాజ గారు

5.డా.పాండాల మహేశ్వర్ గారు

6.కె.ఇ.నిల మంగై గారు

7.భూపతి గారు

8.కె.సి.నరసయ్య గారు

9.సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు

10.మర్రి జయశ్రీ గారు

11.వినీలమ్మ

12. వల్లాల విజయ లక్ష్మి గారు

13.సునంద వురిమిళ్ళ గారు

14.డా.బల్లూరి ఉమాదేవి గారు

15.శివునూరి లలితా కృష్ణ గారు

16.అపరాజిత రెడ్డి గారు

17.కోరాడ గారు

18.అయిత అనిత గారు

19.రాపోలు అరుణా స్వామి గారు

********

1

[27/10, 8:02 PM] +91 74165 92715: 🙏🙏కవితాగానం🙏🙏

🙏సుధారాణి కృష్ణంరాజు🙏

**నేటి అంశం : కుటుంబ వ్యవస్థ"

27-10-2020(మంగళవారం)

కుటుంబవ్యవస్థను పరిశీలిస్తే నేడు అస్తవ్యస్తంగా చిన్నా భిన్నం అయిందని చెప్పవచ్చు

దానికి అనేక కారణాలు నాటి కుటుంబాలతో పోల్చినపుడు

ఇంటి యజమాని కుటుంబ పెద్దగా అందరి మంచి చెడ్డలు

తన భుజ స్కందాలపై మోసేవారు భార్య మాత్రం ఉత్తమ గృహిణి గా భర్త అడుగు నడుస్తూ ఇంటి పరువు మరియాదలు కాపాడుతూ అత్త మామ భర్త ఆడబడుచు మరిది ఇలా అందరి అవసరాలు గమనించి వారికి అన్నీ సమకూర్చటంలోను వచ్చిన బంధువులను ఆచరించటం లో ముందుండేది

ఉమ్మడి కుటుంబం పితృ స్వామిక వ్యవస్థ ఉండేది

అందరూ కుటుంబ పెద్ద మాటను గౌరవించి నడుచుకునే వారు ఏ శుభ కార్యాలు చేసినా అందరు కలిసి ‌ఘనంగా నిర్వహించేవారు

కూతురు, కోడలు అనే తేడా లేకుండా అందరూ ఆకుటుంబం గురించి గొప్పగా చెప్పుకునే విధంగా ఉండేది

జన్మదిన వేడుకలు పెళ్ళి వేడుకలు వారం ముందు నుంచి వారం తరువాత వరకు

అందరూ ఎంతో సంతోషంగా చూడ ముచ్చటైన కుటుంబం లాగా ఉండేది

రాను,రాను గా ఆడబడచులు , అత్తమామలు పడకుండా అసూయ, ద్వేషాలు పెరిగి

ఎవరికి వారు గా విడిపోయి వేరు కుంపటి పెట్టిన కుటుంబాలు ఎన్నెన్నో

ఇలా కాకుండా కూడా ఉన్నత విద్య ను అభ్యసించి తమకు తగిన ఉద్యోగం మరొక ప్రదేశంలో ఉండటం వలన వలస వెళ్లిన కుటుంబాలు ఉన్నాయి మరికొన్ని కుటుంబాలలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగి దానికి తగిన ఉద్యోగం మనదేశం దొరకక విదేశాల్లో స్థిరపడిన వారు మరికొందరు

నేడు స్త్రీ,పురుష బేధం లేకుండా ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు అలాంటప్పుడు పిల్లల ఆలనాపాలనా చూడటానికి తల్లిదండ్రులను తెచ్చి పెట్టుకునే వారు కొందరు అయితే 

ఆయాలకు అప్పగించి ఉద్యోగం నిర్వర్తించే వారు కొందరు ఇవన్నీ భరిస్తూ మారిన 

వ్యవస్థ కు అనుగుణంగా కుటుంబ వ్యవస్థను మార్చడంలో తమ పిల్లల తప్పేమి లేదని అవకాశాలు అంది పుచ్చుకోవాలి అంటే కుటుంబాలు విడిపోయిన వారి భవిష్యత్తు బాగుండాలన్న తల్లిదండ్రుల ఆలోచనలు హర్షణీయం

ఇప్పటికీ ఏమాత్రం సెలవులు దొరికిన వారికుటుంబాలతో కలిసి గడపాలని ఎంతో మంది ఆశగా ఎదురు చూసే వారు ఉన్నారు 

రక,రకాల మనుషులు ఉన్న ఈ వ్యవస్థలో కుటుంబ వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఉంది సమాజం మారింది మేము మారుతున్నాము అంటారు అందులో ఏమాత్రం నిజం లేదు

ఎందుకంటే మనిషి లేకుండా సమాజం లేదు దానిని మార్చాలన్న అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలి అన్న కారణం ముఖ్య కారకులు వ్యక్తులు అందుకే ముందు కుటుంబ వ్యవస్థకు న్యాయం చేసిన ప్రతివ్యక్తి సమాజానికి న్యాయం చేయగలడు కుటుంబ వ్యవస్థ ఎప్పుడూ అనురాగం, ఆత్మీయత అభిమానం ,అన్ని కలిగి ఉండి

కుటుంబ వ్యవస్థ బలమైన వ్యవస్థ గా రూపొందాలని కోరుకుందాం🙏🙏🙏👍

2.

[27/10, 8:10 PM] కొలచన విజయ భారతి Poetess: కవితా గానం

పేరు:కొలచన విజయ భారతి

ఊరు: హైదరాబాద్

అంశం: కుటుంబ వ్యవస్థ

తేదీ:27-10-2020

**************************

మానవుని జీవన పయనంలో

కుటుంబ వ్యవస్థ 

సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక

అనుబంధాల ,అనురాగాల కలయిక

నాటి రోజుల్లో పెద్దల ఉవాచ

ఆరోగ్యమే  మహాభాగ్యం

సంతానమే సౌభాగ్యం

ఉమ్మడి కుటుంబం

ఉన్నత కుటుంబం

పదుగురున్న లోగిలి

పసిడి సిరుల వాకిలి


మరి నేటి నానుడి

చిన్న కుటుంబం 

చింతలులేని కుటుంబం

మేమిద్దరం..మాకిద్దరు

ఇంకా ఇంకా రేపటి తరం

ఇద్దరు వద్దు ..ఒక్కరే ముద్దు

అనేది  వారి అభిమతం


కాలమాన పరిస్థితుల్లో

కుంచించుకు పోతోంది 

కుటుంబ వ్యవస్థ

కనుమరుగైపోతోంది

తరాల  అంతరాల మధ్య

ఆప్యాయతానురాగాల

3.

[27/10, 8:20 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: కుటుంబం భార్య భర్తలు ఇద్దరూ కలిస్తే కుటుంబం

కుటుంబంలో కలతలు లేకుండానే ఆవలి ఒడ్డుకు చేరుకోవడమే

ఆనంద సాగరం అవుతుంది


అమ్మానాన్నలు కలిసిపోయి

సంతోషముతో గడపడమే కుటుంబ లక్ష్యం ఆ లక్ష్యాన్ని నెరవేర్చడమే

పితామహుని బాధ్యత


తండ్రి కష్టము తో కుటుంబానికి కి

సౌఖ్యం లభిస్తుంది 

భార్యాభర్తలిద్దరూ సమతుల్యతను కాపాడటానికి చాలా చక్కగా

సాగిపోవడమే కుటుంబ ధర్మం


నేడు ఉద్యోగపర్వంలో భార్యాభర్తలిద్దరూ

ఒకరు మరో ఊరు ఇంకొకరు ఇంకో ఊరు ఈ విధంగా కుటుంబ జీవితమే అస్తవ్యస్తం అవుతుంది


ఉద్యోగాల వేటలో ఎక్కడెక్కడో తిరుగుతుంటారు

పిల్లలను పట్టించుకుని పరిస్థితులు నేడు కనుమరుగవుతున్నాయి

అందులో దుర్వ్యసనాలకు బానిసలు అవుతూ విద్యా సుగంధాన్ని మర్చిపోతున్నారు


ఆదర్శ బాలలుగా తీర్చిదిద్దడంలో

గురువుల బాధ్యత ఎంత నెరవేర్చిన ప్పటికీ తల్లిదండ్రుల బాధ్యత ఉందని మరువకూడదు


ఎవరు ఎంత గారాబం చేసినా నా తల్లిదండ్రులు ఎంత ప్రేమ కురిపించిన

పిల్లల విద్య పట్ల కఠినంగా వ్యవహరించిన అప్పుడే

వాళ్ల భవిష్యత్తు వెలుగుబాట అవుతుంది వాళ్లు గొప్ప స్థాయిలో శిఖరాయమాన స్థితికి చేరుకుంటారు


వలన వారి కుటుంబం ఆదర్శప్రాయం అని అందరూ వారిని అనుసరించే స్ఫూర్తిదాయకంగా ఉన్నప్పుడే ఆ కుటుంబానికి ఆ వూరిలో గౌరవాదరాలు లభిస్తాయి


వారి పిల్లలను చూసుకొని

పదిమంది నేర్చుకుంటారు


ఆ కుటుంబమే సమాజంలో

ప్రగతి దాయకంగా పదుగురికి

కొత్త పాట కొత్త పాట కొత్త జీవన విలువలను అందిస్తుంది


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453

4

[27/10, 8:24 PM] భరద్వాజ గారు: 🙏🎊కవితాగానం 🎊☘️

అంశం-కుటుంబవ్యవస్థ 

పేరు భరద్వాజ రావినూతల 

కొత్తపట్నం 

రచన-17

శీర్షిక- అదిఒక మల్లె పందిరి -!

మమతలు పెనవేసుకున్న తీగ -

ఆనందాల తో అలరారుతుంది హాయిగా -

కుటుంబపెద్ద ఆధ్వర్యంలో నడిచే కుటుంబం -

ఏకలతలే లేని జీవన మకరందం -

ఒకరికొకరు తోడుగా-నీడగా -

పదిమందికి ఆదర్శంగా నడిచే కుటుంబాలు -

హిందూసాంప్రదాయాలలో మచ్చు తునకలు -

కానీ -

కాలం మారింది -

మనుషులననసులలో స్వార్ధపుమొక్కలు మొలిచాయి -

తినేవాళ్లు పదిమంది -

పనిచేవాడుఒక్కడు కావటంతో -

బీటలువారాయి కుటుంబాలు -

కోడళ్ల అభిప్రాయాలకు అత్తగారి పెత్తనాలకు పొంతన కుదరక -

మనసులలో పెద్దవిషబీజాలు మాత్రం పడకమానలేదు -

నాది నాయిల్లు అనే నాసంపాదన అనే ఆలోచనా 

వ్యక్తికుటుంబాలకు ప్రోత్సాహమిచ్చింది -

మాకిద్దరు మేమిద్దరం నేనినాదాలతో నడుస్తున్నాయి కుటుంబాలు -!

ఇదినాస్వీయరచన 

భరద్వాజ రావినూతల ((RB)🖍️

కొత్తపట్నం 

9866203795

మాయని మమత

   5.

[27/10, 8:31 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: *** అమృత తుల్యగంధం ***

                             ✍️ డా.పాండాల


అదృష్టం భార్యది ప్రయత్నం భర్తది

కలగలిసినదే అమృత తుల్యగంధం

జమాఖర్చులను సమతుల్యతగల

సౌభాగ్యవతి దొరకడం ఓ వరమే.

అహంకారిదైతె 

అంబానీ కూడా అడుక్కోవడం ఖాయం


భర్త భార్యను తల్లిగాను భావిస్తే..

భార్య భర్తను,మొదటి బిడ్డగా పరిగణించే పవిత్రబంధం...

భార్యకు సేవచేయడంబాధ్యతాగంధం

సంసారమంటే 

కష్టాలు కన్నీళ్ళొచ్చినా 

కడదాక తోడుగుండడం...!


భర్త  భార్య కళ్లలో నీరుదొర్లకుండా చూసె దొరగారి గౌరవం శాశ్వతం

అక్షింతలాప్యాయత

వడిబియ్యాల పొదరిల్లు

వడవని ముచ్చట్లచెలిమి వ్యవహారశీల గృహిణేకదా సౌమ్యశీల!


అమ్మ లేక జన్మలేదు.

భార్యలేని జన్మకు అర్థమేలేదు కదా

త్రికరణశుద్దుల అల్లిన బంధం ముదిరినతనంలో  మెరిసేదే 'మాంగల్య గంధం'....!


బానిస బంధం కానే కాదు

భర్తను రాజుగా తానురాణిగా 

ఫీలౌతూనే ఫికరును తుంచుతూ కీచులాటల కిలకిలనవ్వుతో 

పరువును నిలిపే బాధ్యత పత్నిది.

గౌరవ ధర్మం భర్తది

ప్రతిచిరునవ్వు  ప్రగతికిచిహ్నం

రెండు వైపులు కలివిడితనమే..!


సృష్టిలో తీపిగ తీర్చిదిద్దిన

కళాఖండమే- కుటుంబమిలలో

గొడవకు జడవక చిటికెన వేళ్ళతో 

ఓ తీరుగ తిరిగే అలికిడి అందం

ఏడేడు జన్మలదీ సంబంధం 

పెళ్లంటే  కలరింగులల్లన పూలవనం.

నవ్వుల పువ్వుల నయగారాలు విరివిగ బూసే పరిమళ చందం .. !


పెళ్లిరోజంటే ప్రేమ విశ్వాసాల భాగస్వామ్యం, 

ఓదార్పుల సమ్మిళితం

నేలకు జారిన ముత్యాల తలంబ్రాల తలపును ముద్దుగ తడిపే తుంటరి చూపుల జలతుంపరలు!!


సప్తపదిగను ఏడడుగులతో

అన్నం బలం ధనం సుఖం పాలన దాంపత్యం సంతుసంపదకు సుఖమయ పొందికల సర్దుబాటు..!


కలిమి లేమితో కలసిన మనసుల

కాంతుల చెలిమెగకర్తవ్యాలు

అనుబంధాల పుస్తకబంధం 

పొరపాటు గ్రహపాటు తడబాటు

పెన్సిల్ గీతల తుడిపేయడమే

నిత్యదొంతరలు  !

 

మనసులోప్రేమ,కళ్లలోబాధ

అదృష్టం తరాజు న్యాయం ...!

పెళ్లంటే ఈడుజోడు తోడునీడ, ఇద్దరొకటిగా లోకోద్ధరణ 

జీవనశైల�

6

[27/10, 8:43 PM] Komandoori Neela Poet: కవితా గానం

అంశం: *కుటుంబ వ్యవస్థ*

27/10/2020 

      పద్యాల రూపంలో


ఆ.వె1:సర్వులందరుండి సంయమనంబుతో

కలసి మెలసి వున్న కాలమెల్ల

సంతసంబు తోడ సకల సంపదలెల్ల

కొలువు వుండు నచట కూర్మి తోడ!


ఆ.వె2:తల్లి దండ్రులన్న ధరణిలో దేవుళ్ళు

తలచి పిల్లలున్న తగవు లేక

లక్ష్మి వచ్చి నిలుచు లక్షణముగయింట

సౌఖ్యమెల్ల కలుగు సర్వులకును!


ఆ.వె3:ఆలుమగలు యింట యాప్యాయతలు పంచి

సంతు నందరకును శమను నేర్పి

పెద్దలందు ప్రేమ పేర్మిగా నేర్పింప

సౌఖ్యమిచ్చు లక్ష్మి సర్వులకును!


ఆ.వె4:కలతలన్ని మరచి కలసిమెలసియుండ

కూర్మి నొసగు లక్ష్మి పేర్మి నిచ్చు

సమత మమత పెంచి సకల బాంధవులపై

ప్రేమ చూప గాను పేరు కలుగు!


పేరు: కె.ఇ.నిలమంగై

కలం పేరు:నీలా రంగనాధం

ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.

చరవాణి సంఖ్య:8897155600.

*ఈ పై  పద్యాలు ఈ సమూహం కోసం రాసినదేనని హామీ ఇస్తున్నాను.*

7.

......కుటుంబ వ్యవస్థ....



సప్త స్వరాలు ,సప్త వర్ణాలు ,

సప్త సముద్రాలు ,ఇంద్ర ధనస్సు, లాగా ,మురిపించే

ఏడు తరాల ఏడు అడుగుల

బంధం లో ఆవిర్భావం

చెందిన దే కుటుంబం....

ము ముచ్చటైన ఉమ్మడి

కుటుంబాలలో సంతోష

కలయికలో ఆనందాల తెరలు

ఆచారాలు వలలు పెన

వేసుకొని సందడి చేసే రోజులు

కను మారుగై  నవి...

ప్రయాణ సాధనాలు లేని

నాడు , చేతిలో  సెల్ కనబడనంత కాలం

కుటుంబం ఉమ్మడి గా

నిండుగా ఉన్నది....

నేడు ఒకరే ముద్దు , రేపు అసలేవద్దు ..అనే చిన్న

కుటుంబ వ్యవస్థ ఇప్పుడు

మనముందు తిరుగు

తున్నది....

సహ జీవనాల చక్కదానాల

తో మానవ కుటుంబ వ్యవస్థ

ను  మాయం చేస్తుంది

నేటి ఆలోచ నల స్థితి... 

అందుకే మరుగుజ్జు ఆలోచన ,

మాని కుటుంబ వ్యవస్థ ను

కాపాడుదాం.....

8

కవితా గానం


పేరు: కట్టెకోల చిన నరసయ్య

చరవాణి: 7981814784

అంశం: కుటుంబ వ్యవస్థ

శీర్షిక: నడుం బిగించాలి



వ్యవస్థలు అవస్థలు పడుతున్నాయి

పునాదులు పెకలించి వేయబడుతున్నయి

మనుషులు మానవత్వ రూపాన్ని కోల్పోతున్నారు

 వికృత చేష్టలతో

 ప్రకృతి విధ్వంసమవుతుంది

 ఉమ్మడి కుటుంబం ఉనికి కోల్పోయింది

 కుటుంబ వ్యవస్థ కుప్పకూలింది

 డబ్బు జబ్బు పట్టిన వ్యవస్థకు

 ప్రథమ చికిత్స అందజేయాలి

 శాశ్వత రోగ నిర్మూలనకు

 సమాధులు నిర్మించాలి

 ఆలోచనలకు పదును పెట్టాలి

 యువత మానవత్వ భవిత కోసం నడుం బిగించాలి

9.

[27/10, 9:07 PM] STTRao Kama Reddy Poet: అంశం..కుటుంబవ్యవస్థ

సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు


కుటుంబ వ్యవస్థ సమాజానికి

శక్తివంతమైన వ్యవస్థ

కుటుంబములో విలువలు

నైతికబాధ్యతలతోకూడిన

బాధ్యత కలిగి నీతి నియమాలు

ఐక్యమత్యానికి అనురాగానికి చిహ్నం

ప్రేమ బంధాలు ముడివడి అనుబంధాలు పెనవేసుకుని

అనురాగ ఆప్యాయతలకలయిక

బంధానికి అనుబంధానికి నిలయం

కుటుంబ వ్యవస్థ ఉన్నత మైన 

ప్రామాణిక మైన విలువలు కలిగి

యుంటే మహోన్నతమైన వ్యక్తిత్వము గల మహానుబావులు

పుట్టి నవసమాజ నిర్మాణానికి పునాదులుగా పనిచేసి సమాజానికి దిశనిర్ధేశము చేస్తూ

పురోభివృద్ధి వైపు పయనింప చేస్తారు

కుటుంబవ్యవస్థ చిన్నాభిన్నముగాఉంటే

అధర్మానికి,అవినీతికి ఆలవాలముఅవుతుంది

సమాజవ్యవస్థ నిర్వీర్యం అవుతుంది

కుటుంబ వ్వవస్థయే వ్యవస్థ కు పునాది


సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు

కామారెడ్డి

10

[27/10, 9:23 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..కుటుంబ వ్యవస్థ

శీర్షిక..మల్లె పందిరి

ఒకే మాటగా

ఒకే బాటగా నడిచే

కలిసి మనుగడ సాగించే

కుటుంబ వ్యవస్థ మన భారతీయ సంస్కృతి గొప్పతనం

కుటుంబ వృక్షానికి మూలం నాన్న మాటకు విలువనిస్తూ

అమ్మ ప్రేమను ఆస్వాదిస్తూ

అన్నదమ్ములు,అక్కాచెల్లెళ్ళు

తాతయ్య నాన్నమ్మ

మనవలు మనవరాళ్లతో పెనవేసుకున్న పేగుబంధాల మాధుర్యం

ఒకరి పట్ల ఒకరికి గౌరవం

ఆత్మీయతానురాగాలతో

అల్లుకున్న మల్లెపందిరి కుటుంబం

అరమరికలకు అవకాశం లేని పరిమళాల సుమగంధం 

మానవతా విలువలు మదిలో 

నాటుకుపోయిన ఆనాటి ఉమ్మడి కుటుంబం

ఆనందాల హరివిల్లు

నేటి ఆధునిక కాలంలో

నైతిక విలువలన్నీ పతనమవుతూ

మానవ సంబంధాలన్నీ

ఆర్థిక సంబందాల మత్హులో

అస్తవ్యస్తంగా మారిపోయిన వేళ

కన్న తల్లిదండ్రులను వృద్దాశ్రమాలకు తరలించే విష సంస్కృతి దాపురించే

జీవిత చరమాంకంలో తోడుండే బిడ్డల ప్రేమకు నోచుకొని అభాగ్యులె0దరో నేడు

తల్లడిల్లిపోతున్న వేళ

 మనుషుల కళ్ళకు కమ్మిన 

స్వార్ధపు పొరలు తొలగిపోయి

అమ్మా నాన్నలే ఆది దైవాలుగా

కొలుస్తూ

కష్ట సుఖాలు పంచుకొని ఓదార్పు నిచ్చే

అనుబంధాల కోవెలని

కుటుంబమే అసలైన సంపదనే భావన ప్రతి మదిలో కలగాలి

సమతా మమతలు  వెల్లివిరిసే

శుభ తరుణం రావాలని

కుటుంబ వ్యవస్థ పరిఢవిల్లాలని కోరుకుందాం.

11

[28/10, 7:59 PM] Lalita Sister: కవితాగానం

పేరు: విజయదుర్గ

కవితా శీర్షిక : కుటుంబ వ్యవస్థ

కవితా సంఖ్య: 33

తేదీ: 27/10/20 


అనాది నుండి బంధాల

కొమ్మను పూస్తూ

అనుబంధాల కాయలను కాసే

అపురూప కానుక....!!


ఒకరికొకరు పందిరకు మల్లెతీగలా

అల్లుకుంటూ

పెద్దల తరువులకు శాఖలు....!!


కష్టమొచ్చిన కన్నీళ్ళొచ్చినా

కలిసి కట్టుగా నిలబడే చావిడిలా

ఆప్యాయతల రెక్కలతో తరిమేరు....!!


జీవిత చక్రానికి ములాధారమై

మనిషికి అందాల హరివిల్లై

పొగడపువ్వల్లే మెరిసేదే

కుటుంబవ్యవస్థ

నేటి తరాలు చెదరనీక కాపాడాలి

ఈ అమూల్య శక్తిని....!!           వినీల

12

[28/10, 8:42 PM] విజయ లక్ష్మి యాదాద్రి: *కుటుంబం*

***********


ఇటుకల కట్టడమొక్కటే ఇల్లు కాదు

మనుషుల గుంపే కుటుంబమవదు

మమతాలతలు అల్లుకున్న పూపొదరిల్లు 

ప్రాణసమాన రక్తబంధాల హరివిల్లే ఇల్లు


కమనీయ బాంధవ్యాల కూటమి *కుటుంబం*

మనిషి కోరుకునే తొలిఆస్తి మంచికుటుంబం

మనసు సేదతీరే ఆత్మీయతల చలువపందిరి

హృదయం ఉత్సాహపడే ప్రేమ ఊయల 


కుటుంబమే మన బలమైతే చాలు

అనవసరం అంతకన్నా ఆస్తిపాస్తులు

దేశానికి చిన్నినమూనా కుటుంబం

అది క్షేమమైతే దేశమంతా సంక్షేమమే


ప్రపంచాన మన దేశ ప్రత్యేకతను

నిలిపే సగర్వాoశం కుటుంబవ్యవస్థ

మంచి కుటుంబoనందలి సభ్యుడు

కాగలడు బాధ్యత గల పౌరుడు 


అవినీతికి ఆజ్యం కాకూడదు కుటుంబం

మన కుటుంబ క్షేమసంతోషాల కోసం

పరాయి కుటుంబపతనాన్ని కోరకపోవటం

వసుధైక కుటుంబభావనతో ఉండటం ధర్మం


:వల్లాల విజయలక్ష్మి

ఆలేరు

13

[28/10, 9:02 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*

తేదీ:28-10-2020

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: కుటుంబ వ్యవస్థ

*******************

గుహల నుంచి గృహాల్లోకి 

పయనించిన  జీవనం

నిర్మించుకున్న అందమైన కుటుంబం!

పరిమళ కుసుమ కదంబమై

గుబాళించిన అనాది జీవన వేదం!


వైవాహిక బంధంలో మాధుర్యం

చవి చూస్తూ 

వారసత్వంతో మురిసే అనుబంధాల నిధి 

రేపటి తరానికి అందించే విలువల వారధి!


భావోద్వేగాల పొట్లాలు విప్పుకుని

షడ్రుచుల సమ్మేళనంతో సాగే

ఆత్మీయ ప్రదేశం!


ఆర్థిక,హార్థిక త్యాగ భావనలతో

పరిమళించే ఉన్నత సంస్కారం

 సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణా కేంద్రం!


నిండు ముత్తైదువలా గౌరవింప బడిన

భారతీయ కుటుంబ వ్యవస్థ

ప్రపంచానికి పరిచయం చేసిన

కుటుంబ విలువల మాధుర్యం!


పశ్చిమ గాలులు సోకి

ఆధునీకరణ లో కొట్టుకు పోయి

వసుధైక కుటుంబ భావన  మరచిన వేళ

సప్త స్వరాలు వర్ణాల కుటుంబ జీవనం 

కాదా వేదనా భరితం!


 కాపాడు కుందాము..

మన అత్యున్నత జీవన విధానాన్ని!

అందమైన  బతుకు పొదరిల్లును!

14

[28/10, 9:30 PM] Balloori Umadevi Poetess: కవితా గానం 

 పేరు: డా. బల్లూరి ఉమాదేవి 

అంశం: కుటుంబ వ్యవస్థ


అనుబంధాలను ఆప్యాయతలను

  అందించే అందమైన పొదరిల్లు

 కలసిమెలసి ఉన్న కుటుంబమే

  ఇంటి పెద్దగా నాన్న నిలువెత్తు రూపం   

 గుండె నిండా ప్రేమ పొంగుతున్న

 చూపుల్లో  శాసించే గాంభీర్యం

  మమతానురాగాలను ఉగ్గుపాలతో   

  అందించే అమ్మ అమృతమయి

 బెదిరిస్తూ బుజ్జగిస్తూ పిల్లలందరినీ  

 క్రమశిక్షణతో పెంచే శక్తి స్వరూపిణి అమ్మ  

 తాత బామ్మ అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల  

 అనుబంధంతో కొనసాగేది

   కుటుంబ  వ్యవస్థ ఒక కుటుంబం నుండి  

 ఎన్నో కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ   

  పిల్లలు ఇలా తరతరాలుగా   

 వేళ్ళూనుకున్న అందమైన వ్యవస్థ 

 మన కుటుంబ వ్యవస్థ 

 కొలువు రీత్యా దూరప్రాంతాల్లో ఉన్నా  

 పండగలకు పబ్బాలకు కలవడం  

 ఆనందాన్ని పంచుకోవడం నేటికీ

 కుటుంబాల ప్రత్యేక లక్షణం

  కాలంతో పాటు

  కుటుంబ వ్యవస్థలో  కూడా 

 మార్పులు అనివార్యం 

 సలహాలిచ్చే పెద్దలకు దూరమవుతున్నాం 

 ఆ వ్యవస్థ పునరుజ్జీవనం కావాలి  

 అనుబంధాల విలువ  తర్వాతి తరాలకు  

 తెలిపేవారధులం మనమే కావాలి

15

[29/10, 8:22 PM] Lalita Sister: అంశం :కుటుంబవ్యవస్థ

బాధ్యతలు, బంధాల వేళ్ళూనుకుని 

వేల సంవత్సరాలుగా 

నేలతల్లిని అంటిపెట్టుకున్న వటవృక్షం... 

 

మమతానురాగాల పచ్చని శాఖలపై  ఆప్యాయతల  కిలకిల రావాలతో 

కళ కళ లాడే   

కమనీయ దృశ్యకావ్యం


 ఉమ్మడి గా ఊగే 

 ఊడల ఊయలలో

 ఉల్లాసాన్ని నింపుతూ.. 

మనం గా సాగే  మనుగడ

 ఘనమని  

మనస్సును తేలిక చేసే

మహాఔషధం 

   

ఒకరికొకరుగా తోడై

కష్టాలమండుటెండలో  ఓదార్పుల నీడనిఛ్చి

సేద తీర్చే 

 సాంత్వనల సమీరం


విత్తనం చిన్నదే అయినా...  విస్తారంమిన్నదై 

విపత్తులనెదుర్కునేలా.. 

విశాల భావాలను నేర్పే 

విజ్ఞతల సారం

***********లలితాకృష్ణ

16

[29/10, 8:29 PM] Aparajith: పల్లెటూరు ఓ మల్లెపూవు !



శ్రమజీవుల స్వేదంతో తడిసిన 

మా పల్లె ఓ చూడచక్కని మల్లెపూవు !!


హలాలతో సాలిర్వాలు దున్నే రైతన్నలు 

ఇత్తుకో చెట్టు అన్నట్టు నాగేటి సాలులో విత్తనాలు వేస్తూ తన ఇల్లాలు 

పొద్దు నడినెత్తి కొచ్చాక ఆకలితో ఆరగించే సద్ది అన్నం !

వంచిన నడుము ఎత్తకుండా పొద్దుగూకే దాక వరాలు పెట్టుడు !!

అవును దేశానికి వెన్నెముక రైతన్న 

అందుకే అదనులో పనిచేయి !!

పెద్దయ్య పెద్దమ్మ అంటూ పలకరింపులు 

తీయతేనియల ఊటలు అనుబంధాలు !!


సేటు బీర్లు విస్కీలు దందా ఎంతచేసినా 

తాటి కల్లు ఈతకల్లు అమృతంలా తాగేవాళ్ళు కోకొల్లలు !!

గీతకార్మికులు పాటందుకుంటే 

ముస్తాదుతో ప్రాకుతూ ఎంత పెద్ద తాటి చెట్టయినా 

ఇట్టే బలాదూర్ !!

ఏం మామ జర కల్లుతాగరాదె 

దీని మజా నీకు తెల్వందానే !!


వడ్లకమ్మరి    నాగళ్ళు, గుంటకలు, గొర్రులు చెక్కుతూ 

కర్రులు, మొలలు నాటుతూ,,,,,,,, !!

సత్తెయ్య తాత వానలు జోరందుకున్నాయి !!

ఈ ఏడు మోతుబరి నువేనే 

నీ అంత కష్టం చేస్తోడు ఉండా ఈ పరగణాన !!


గొర్ల మేతకు నీ కంచె కావాలె బావ 

ఇంటకిస్తావో చెప్పరాదు !!

ఎయ్యి రూపాయలకు తక్కువియ్యను బామ్మర్ది !!


సీతక్క నీళ్లు చెదుతుంటే 

దూపగొన్న ఎడ్లు బర్లు కుడితినీళ్లు తాగుతూ 

కళ్ళు మూసుకొని స్వర్గం ఇందులోనే వుంది కాబోలు !!అన్నట్లు 


తెల్లవారక ముందే రాములమ్మ 

బర్ల పాలు పిండి, సానిపి జల్లి 

ఇంటి ముందర సూడ సక్కని  ముగ్గులేసి 

వండి వార్చి చెలక్కాడికెళ్లేందుకు తయారు !!


చాకలమ్మ !అమ్మా రాములమ్మ అత్తా !

ఉతికే బట్టలు వెయ్యి 

గిట్టుబాటు లేని చాకిరీ ఆయే !సణుగుతూ 


పండుగలకేం తక్కువ !

ఇంద్రధనుస్సు రంగుల మేళవింపుల పూలు 

అందంగా తీర్చి దిద్దిన బతుకమ్మల తీరు ముచ్చటగొల్పు !!

శ్రమజీవి మహిళలు వెలుగు జిలుగుల కొత్త చీరల్లో 

అందాల భరిణెలు !!

చెరువు గట్టున ఆడే కోలాటాలు 

వన్నె తరగనిదేనాడు !!


బోనాలు, దసరా పండుగల్లో 

వీరుని కెళ్ళేవాడు కొరడా జుళిపిస్తూ !

మాదిగన్నల డప్పు వాయిద్యాల మధ్య !!

అమ్మా బయలెల్లినాదో,,,,,,,,,,, పాడుతూ !

ఊరు ఉరిమినట్లు కదిలే జనం తీరు,,,,,,,,,,,,,, !!


ఏ కల్మషం ఎరుగని పల్లెటూరు శ్రమజీవులు 

నిజంగా తెల్లని బొడ్డుమల్లెపూలే !!


Aparajith

17

[29/10, 8:33 PM] Korada: కవితాగానం

       కుటుంబవ్యవస్థ

 కోరాడ నరసింహా రావు!

 "వికాసానికి మెన్నెముక"

  *******************

జీవనసౌలభ్యం కోసం...

ఆనందమయజీవనానికి

మనం ఏర్పరచుకున్న...

అనేకానేక వ్యవస్థలలో అత్యంత ప్రాధాన్యత గల దీ కుటుంబ వ్యవస్థ!

చూసిఅది చిన్నకుటుంబమైనా 

పెద్ద కుటుంబ మైనా ....

భిన్న వ్యక్తిత్వాలయిద్దరు

స్త్రీ,పురుషులు...పెద్దలసమక్షంలో...అగ్నిసాక్షిగా....మూడుముళ్ళతోతాళిని కట్టి..ధర్మేచ,అర్ధేచ,కామేచ...మోక్షేచనాతిచరామి 

అనిప్రమాణంచేసి,ఏడడుగులునడచి......ఈ కుటుంబవ్యవస్థనుపరి

 పుష్ఠం చేసేందుకు...

శ్రీకారంచుట్టి...అనురాగదాంపత్యంతో...కూతుళ్లు

కొడుకులు...అల్లుళ్ళు,కోడళ్లు...మనుమలు,మనుమరాండ్రతో...కుటుంబమై...ఈసమాజ...వికాసంలో...కీలకపాత్రవహిస్తున్నారన్నది....అక్షర

సత్యం....!

ఆప్యాయతానురాగాలు

కలగలసినఆనందమయ

జీవనానికి...కుటుంబవ్యవస్థనస్మించినఉపాయం

లేదు...!

సనాతననియమ,నిబంధనలు, కట్టుబాట్లు మన కుటుంబ వ్యవస్థకు ... మరింతపటిష్ఠతనుకలిగించాయన్నది నిర్వివా దాంశం...!అందుకే ...

ఈప్రపంచానికే ...ఆదర్శమైనది మన భారతీయ కుటుంబ వ్యవస్థా.... విధానం !కుటుంబంపటి ష్టంగా  వున్నపుడే గదా

సమాజం ప్రశాంతతతో వికాసం చెంద గలదు !!

********************

............కోరాడ.

[29/10, 8:36 PM] 

18

Anitha Aitha Poetess: *కవితా గానం*

అంశం : కుటుంబ వ్యవస్థ

శీర్షిక: *మమతల కోవెల*


చెమటచుక్కలను ముద్దాడిన ఆ..మట్టి పరిమళమే..

అనుబంధపు గోడయై!


అనురాగాల తీవెలను వీచే గడ్డితనువే.. ఆత్మీయ పై కప్పై!


విలువలు కలబోసిన జాజుద్రావణమే.. బాధ్యతల

అలుకుపూతై!


ఉమ్మడి కుటుంబ మాధుర్యాలను పంచిన సున్నపుతేటే.. ప్రేమ

రంగవళ్లై!


నైతికతను నేర్పిన నీతికథల అమృతసారమే.. ఆ ఇంటి

వసారాయై!


పెద్దరికము పెనవేసిన  పసిడిమాట...

అరుదైన అరుగై!


జనించిన మా పొదరిల్లే మమతల కోవెల!

అనుబంధాల వెన్నెల!!


రచన

అయిత అనిత

19

[29/10, 9:29 PM] Rapolu Aruna Siripuram Poet: కవితాగానం

అంశం:కుటుంబవ్యవస్ధ

శీర్షిక:వసుధైక కుటుంబం


ఈ జగమంతా ఒకే కుటుంబం

మహిలో మానవులంతా 

ఒక కుటుంబ సభ్యులే


ఏ మనిషీ తనకోసమే తాను జీవించలేడు

పరస్పర సహకారం లేనిదే

మనిషన్న వాడు బ్రతకలేడు


ఒకే ఇంట్లో నివసించేవారు ఒక కుటుంబం అనలేము

రక్తసంబంధం ఒకటే మనుషుల్ని కలిపే కుటుంబం కాలేదు


ఏమి కానివారు సైతం ఎక్కడో ఎదురుపడి సహాయం చేస్తారు

అయినవారు కూడా ఒక్కోసారి

చూసిచూడకుండా వెళ్లిపోతారు

 

బంధాలు బంధుత్వాలు ఆ ఈశుడే నిర్ణయిస్తాడు

అనుబంధాలు ఎప్పుడు ఎలా కలుస్తాయో తెలియవు


మానవ జీవిత ప్రయాణంలో

ఎవరి స్టేజి రాగానే వారు దిగిపోతారు

కోరుకున్న గమ్యం చేరేవరకు ఎందరెందరో కలుస్తారు

కొందరు గుర్తుండి పోతారు


ఒకవీధిలో ఉన్నవారు, ఒక్క ఊరిలో మసలేవారు,ఒకే పాఠశాలలో చదివేవారు

ఒకే సంస్థలో ఉద్యోగం చేసేవారు......ఇలా

అందరూ సమవర్తులై 

ఒకేకుటుంబ సభ్యులుగా కలిసి మెలిసి జీవిస్తే

 ఈ విశ్వమంతా మానవతా పరిమళాలతో గుబాళిస్తుంది

✍రాపోలు అరుణాస్వామి,

     సిరివురం,యాదాద్రిజిల్లా


Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...