నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
Author of వెన్నెల శిల్పం
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
*******************
కవి వరుల జాబితా
1.కోరాడ నరసింహారావు గారు
2.అపరాజిత రెడ్డి గారు
3.వై.కె.సంధ్యా శర్మ గారు
4. కోరాడ గారు
5.డి.ఉషారాణి గారు
6.స్వర్ణ సమత గారు
7. భరద్వాజ గారు
8.వల్లాల విజయ లక్ష్మి గారు
*****************
1
నేటిఅంశం:- సత్యశోధన
కోరాడ నరసింహా రావు !
* నిలబెట్టాల్సిందే.....!*
****************
ఈ ప్రపంచంలో....నిత్యమూ
శాశ్వతమూ ఐనది..... కేవలం సత్యం ఒక్కటే..!
కేవలసత్యవాక్పరిపాణయేకదా....హరిశ్చంద్రుని
సత్యహరిశ్చంద్రుని చే సి
చరిత్రలోచిరస్థాయిగా.... నిలబెట్టింది....!
వివాదాలలో...సత్యశోధనయే కదా కీలకం !
సత్యాన్నిశోధించి,న్యాయాన్నివాదించి....ధర్మాన్ని నిలబెట్టి నపుడే ....
ఈ కాల చక్ర గతి సక్రమం గా సాగేది...!
సత్యాన్ని మరుగునకు తోసేసి...అసత్యంపెత్త నం చలాయించ జూసి నపుడు..,తప్పదు....,అసత్యపు తెరలను చీల్చొ
కాల్చో...సత్యాన్ని ఈ లో కానికి సుస్పష్టం గా విం చాల్సిందే...! ధర్మాన్ని కాపాడి.... నిలబెట్టాల్సిందే!!
********************
ఈ కవితను కేవలం కవితాగానం పోటీ కొరకు వ్రాసిన నా సొంత రచన!
ఏ ఇతర రచనలకూ అనువాదం ,అనుకరణ కాదనిహామీయిస్తున్నాను .......! భవదీయ
కోరాడ నరసింహా రావు,
***************
2
[13/10, 8:09 PM] Aparajith: ప్రశ్న !
గిరి గీసుకుని బ్రతకడం
అది నాకు పడని విషయం !
నా చుట్టూ కట్టుకున్న గోడల్ని
కూల్చుకుని బయటపడాలని ఆత్రుత !
ముందుకెళ్ళకుండా క్రూరంగా వెనక్కి లాగే లోకం !
నిరంతరం పోరాటం ఆరాటం
విధిని సైతం లెక్కచేయను !
నా గళం విప్పకుండ
గొంతు గొంతు కలపకుండా
పొంచివున్న విషనాగులు !
శివుడు సైతం గరళం మింగాడు
మృత్యువు కాటేస్తుందని తెలిసీ !
కంటక భూయిష్ట దారినే నా పయనం !
వేదాంతం ఎంతసేపు పాప పుణ్యాలను
అడ్డుపెట్టుకుంటుంది
విజ్ఞత నెరిగిన వాడు
హృదయంలో దేవున్ని ప్రతిష్టించుకుంటాడు
నేను అనే అహం తొలగినా
ఈ ప్రపంచ నరకకూపంలో మనలేడు !
కనిపించే దృశ్యం వెనుక
ఎన్ని నరకయాతనలో !
కమ్యూనిస్ట్ లు చెప్పే గతి తర్కం
పోరాట యోధుల జీవన ఆక్రందనలను చిత్రీకరించదు !
గోడలను కూల్చుకుని బయటపడు
అంటుందే తప్ప ఎలానో తెలుపదు !
నేను నేనే !అంటే నీవెవరు !?
స్త్రీ పురుషుల సంయోగంలో పుట్టిన వాడివే గదా !
మరి నీ ఆత్మ, పరమాత్మ ఎక్కడ?
అది నీ అభూత కల్పన మాత్రమే !
శోకగ్రస్తుడైన అభాగ్యునికి ఇవేమి పట్టవు
కేవలం జీవించి మరణించడం తప్ప
పట్టెడన్నం పెట్టని ఆధ్యాత్మికత, తత్వచింతన
ఆకలిగొన్న నిరుపేదకు అనవసరం !
విజ్ఞానం ఎంత వికసించినా
విశ్వంతరాళాల్లోకి చొచ్చుకెళ్లినా
నిరంతరం కొత్త పోకడలు పోయినా
తన మనస్సు పొరల్లో దాగివున్న
నిగూఢత్వాన్ని సమూలంగా ఛేదించలేడు !
వేల వేల ప్రశ్నలు నన్ను ప్రశ్నిస్తుంటాయ్ !
అపరాజిత్
3.
కవితా గానం
అంశం : సత్యశోధన
నిరంతర గమనంలో
మస్తిష్కపు పుటలో చెలరేగే
అంతర్యుద్ధంలో సాగే అన్వేషణలో...
అవగాహన లేమితో
అనాలోచితంగా ఎగసే భావాలలో
ముళ్ళ రెమ్మల్లో దాగిన
స్వార్థపు తీగలను తొలుచుకుంటూ
అసత్య మార్గాలకు కంచె వేస్తూ
ఆత్మ బలమే... ఆయుధమై
నిర్మలమైన మనసును
సత్యం వైపు నడవమనే....
ఆత్మ కథను వ్రాసుకున్న
సత్య సంధాత మహాత్ముని అడుగులో
అడుగై... అరక్షణమైనా ముందడుగై
సాగుదాం... !
వై.కె.సంధ్యశర్మ
4.
[14/10, 8:02 PM] Korada: కవితాగానం
నేటిఅంశం:- సత్యశోధన
కోరాడ నరసింహా రావు !
* నిలబెట్టాల్సిందే.....!*
****************
ఈ ప్రపంచంలో....నిత్యమూ
శాశ్వతమూ ఐనది..... కేవలం సత్యం ఒక్కటే..!
కేవలసత్యవాక్పరిపాణయేకదా....హరిశ్చంద్రుని
సత్యహరిశ్చంద్రుని చే సి
చరిత్రలోచిరస్థాయిగా.... నిలబెట్టింది....!
వివాదాలలో...సత్యశోధనయే కదా కీలకం !
సత్యాన్నిశోధించి,న్యాయాన్నివాదించి....ధర్మాన్ని నిలబెట్టి నపుడే ....
ఈ కాల చక్ర గతి సక్రమం గా సాగేది...!
సత్యాన్ని మరుగునకు తోసేసి...అసత్యంపెత్త నం చలాయించ జూసి నపుడు..,తప్పదు....,అసత్యపు తెరలను చీల్చొ
కాల్చో...సత్యాన్ని ఈ లో కానికి సుస్పష్టం గా విం చాల్సిందే...! ధర్మాన్ని కాపాడి.... నిలబెట్టాల్సిందే!!
********************
ఈ కవితను కేవలం కవితాగానం పోటీ కొరకు వ్రాసిన నా సొంత రచన!
ఏ ఇతర రచనలకూ అనువాదం ,అనుకరణ కాదనిహామీయిస్తున్నాను .......! భవదీయ
కోరాడ నరసింహా రావు,
***************
5
[14/10, 8:03 PM] Usha Rani Poetess: కవితా గానము
శీర్షిక.సత్యశోధన
అన్యాయము రాజ్యమేలు వేళ
న్యాయానికి సంకెళ్లు వేసి
మంచితనాన్ని సమాధి చేస్తూ
ప్రతిభను అమాంతము తొక్కేస్తూ
మూసపోత ధోరణిలో సాగిపోతూ
స్వార్థపు ముసుగును తొడుక్కోని
అనునిత్యం సాగుతూ ఉంటే ఎలా మరి
సత్యాన్ని గ్రహించి బతుకు మిధ్య అని తెలుసుకునే
ఓ క్షణము కోసము ఎదురు చూసి సత్యము గృహించుట జీవితము అని గ్రహించు లోగా
చితికి పోయే జీవితాలు ఎన్నో
మనో నిగ్రహము కలిగి
సత్యమును నమ్ముకోని
జీవితము చరితార్థము చేసుకోవడమే ధర్మం
సత్యమే మనిషికి దారి
శోధన మనిషికి మార్గదర్శకము
గాంధీజీ సత్య మార్గము
స్వాతంత్ర్య సంగ్రామంకు ఊపిగా నిలిచింది గెలిచింది
సత్యమే మానవాళికి నిజమైన జీవము
హామీ పత్రము.ఇది నా స్వంతము అని హామీ ఇస్తున్నాను
డి.ఉషారాణి
ఆంధ్రప్రదేశ్
6
[14/10, 8:14 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*
*14/10/2020*
*సత్య శోధన*
జగతిలో జ్యోతిగా వెలిగేది
సత్యం ఒకటే
నిత్యము ,శాశ్వతము అయినది,
క్రాంతి నీ,ఖ్యాతిని పంచేది
ఆచంధ్ర తారార్కం నిలిచేది
బతుకును మలిచేది
పరమాత్మలో కలిసేది
మోక్షం కల్గించేది
జ్ఞానం పెంపొందించేది
ప్రజ్ఞను ఇనుమడింప జేసేది
అసామాన్య మైన ది
ధర్మ రాజు, హరిష్చంద్రు డు
శిబి,యయాతి,నలుడు
ఇలా ఎందరో మహానుభావులు
సత్య మార్గాన్ని ఎంచుకుని
మోక్షాన్ని పొందారు.
*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
7
[14/10, 8:31 PM] భరద్వాజ గారు: 🎊🌱కవితాగానం 8🎷🎻
నేటిఅంశం- సత్యశోధన ఎదుగుతుంది.
శీర్షిక - .ఏకాగ్రతకావాలి .!
జీవన పోరాటం కోసం మనిషి మనిషి బ్రతుకు -
నిరంతరం అబద్దాలాడితేనే మెతుకు -
అది సత్యమా అబద్దమా అన్నఆలోచనకు అవుతాడుదూరం -
అందుకువేస్తాడు బహుకృతవేషం -
అతని ఆకలికి సత్యశోధన లుండవు -
ఎలాగై నాబ్రతకాలి అన్న ఆలోచనతప్ప -
ఎందుకంటె -
సత్యాన్ని నమ్మినహరిచంద్రుని కధ అతనుచదివి ఉంటాడు -
తండ్రికోరిక తీరుస్తానన్న రాముని కధ అతనికి తెలుసు -
సత్యమాడితేపడే బాధగురించి తెలిసి పిచ్చి పని చెయ్యడు -
ఎందుకంటె అతడు మనిషి -
సత్యశోధన చెయ్యాలంటే మనసుఅదుపులోఉండాలి -
తనపట్ల తనకు నమ్మకం కలగాలి -
నిరంతరసాధన కావాలి -
ఎంతకష్టమైనా భరించే శక్తికావాలి -
దానివల్ల పొందే లాభాలు గెలుచుకునే విజయాలు అతనుతెలుసుకోవాలి -
దానిలో ఉండే పరమార్ధత తెలియాలి -
ఆడిపాటిస్తే మనిషి మనీ షి అవుతాడన్న
తార్కికత తెలిస్తే సత్యశోధనాసాధించవచ్చు -
ఇదినాస్వీయరచన
భరద్వాజరావినూతల (RB)🖊️
కొత్తపట్నం 9866203795
ప్రకాశంజిల్లా
8
[14/10, 9:19 PM] విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక::**సత్యశోధన***
-----------**********---------------------
*సత్యమే శివం సుందరం*
సత్యవర్తనులమవుదాం అందరం
*సత్యమేవ జయతే* అనుకుందాం
సత్యమేదో అవగాహన చేసుకుందాం
సత్యశోధనలో గొప్పోలెందరో
నిత్యపరిశ్రమ గావించిరి!
అసత్యాలను ఒప్పుకొనక
సత్యనిరూపణకు సాహసించిరి
హరిశ్చంద్రoటి సత్యవాదులు
సిద్ధార్థుడంటి రాజయోగులు
సోక్రటీసు వంటి తత్వవేత్తలు
గెలీలియో వంటి శాస్త్రవేత్తలు
విస్మరించలేం ఏ సత్యమూర్తులను!
'నవ'దారులేసిన మార్గదర్శులను
ఆ అందరి ఉమ్మడిరూపు *బాపు* జీవితం
జాతిపిత హృదయమే సత్యశోధనకoకితం
ఎంత గొప్ప నిరంతరసాధనo!
ఎంత నిరాడంబర జీవనవిధానం!
ఎంత ఉన్నత(వ్యక్తి)సత్యశోధనo!
అది మహాత్ములకే సాధ్యమేమో!
సత్యంకై సర్వస్వం చేయకున్నా త్యాగం
సత్యశోధనా సన్మార్గాన సాగుదాం
సత్యవాక్కుల విలువను గౌరవిద్దాం
సత్యం పలుకగ మనస్ఫూర్తిగ ప్రయత్నిద్దాo
:వల్లాల*విజయలక్ష్మి*
*ఆలేరు*

Comments
Post a Comment