నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
Author of vennela shilpam
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
********"*************
కవివరుల జాబితా
1.కోరాడ గారు
2.వల్లాల విజయ లక్ష్మి గారు
3.భరద్వాజ గారు
4.డా.పాండాల మహేశ్వర్ గారు
5.మన్నె లలిత గారు
6.డా.ఆంజనేయులు గారు
7.ఇంద్రవత్ రాహుల్ గారు
8.మర్రి జయశ్రీ గారు
9.సునంద వురిమిళ్ళ గారు
10.డా.రామక కృష్ణ మూర్తి గారు
11.వినీలమ్మ
12.సుధారాణి కృష్ణం రాజు గారు
13.డా.షరీఫ్ గారు
14.
15. డాక్టర్ రామక కృష్ణ మూర్తి గారు
16.భరద్వాజ గారు
**************
1
అమ్మనుస్తుతిస్తూ గేయం
కోరాడ నరసింహా రావు! * జయము...జయము *
****************
జయము-జయము....
దుర్గమ్మా...జయము నీకు మాయమ్మా...!
చల్లనైన తల్లివి నీవే
అసురిని జంపగ నీవు
ఉగ్ర రూపు దాల్చినావే!
జయము జయము
దుర్గమ్మా...జయము నీకు మా యమ్మా...!!
ఆ ఆది శక్తివే నీవు....
ముగురమ్మలవైనావు!
ఆ పరాశక్తి వే నీవు ....
నవ రూపుల..... దాల్చినావు...!!
లోక ములను గాచెడి తల్లీ ...ఈ జగత్జనని నీవె గదమ్మా ...!
జయము-జయము...
దుర్గమ్మా...జయము నీకు మా యమ్మా...!!
చదువుల తల్లివి నీవే
సంపదల శ్రీ లక్ష్మీ...!
కండబలం-గుండెబలం
నీవే పార్వతి మాత...! ముగురమ్మల మూల రూపి వే...ఓ యమ్మ...,
త్రిమూర్తులనే గన్న తల్లి వీ...మాయమ్మ...!
జయము.... జయము
దుర్గమ్మా...జయము నీకు మాయమ్మా....!!
ఆ మహిషునిసంహరింప భీకర రూపును దాల్చి...
దుష్ఠుని పరిమార్చినీవు
విజయదుర్గవైనావు...!
ఇపుడేరూపమునవచ్చెద
వో...ఓయమ్మా...,ఎటుల
మమ్మురక్షించెదవో మా యమ్మ....!
వింత-వింతవ్యాధులతో ముంచెత్తే వరదలతో...
అల్లాడే నీ బిడ్డల పై కరుణనుజూపించు .,
మము రక్షించి కలకాలం సల్లంగా సూడు తల్లి...!
జయము-జయము...
దుర్గమ్మా....,జయము నీకు మాయమ్మా...!!
******************
........కోరాడ.
2
[23/10, 8:07 PM] విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక:*శ్రీ చక్రసింహాసినీ*
-------***************------
అమ్మలగన్న అమ్మవు నీవమ్మా
ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా
ఇలలోని ఈశ్వరి!చిన్ని వినతిదే
ఉమాచండీ నీ రూపు ఊహాతీతమే!
ఎన్నగలనా నీ అన్ని దివ్యరూపుల!
ఏవేవో వేవేల నామధేయముల!
ఒకటోవందో కావు నా తల్లి!
వేల పేర్ల ఓంకారేశ్వరి వందనాలివే!
ఔరా!అనిపించే అద్భుత౦ నీవమ్మా
అంబా!నీ దయ అంబరమేనమ్మ!
కన్నుల్లో నీరూపు కొలువుతీరనివ్వు!
కాలస్వరూపిణి మూలశక్తి జగాన నీవు!
గణనీయం గాయత్రీమాత నీదు చరితమ్ము
గణగణ గంటల వీరరస భరితమ్ము!
చరాచరములకు చలనమునొసగు సావిత్రీ!
జగమును నడిపించే మా ప్రియ జనయిత్రి!
జనులను కరుణించుమా జగద్ధాత్రి!
కరోనాను పారదృోలవే శుభదాత్రి!
నవరాత్రి వేడుకల్లో నిను దర్శించలేని
దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము మాయమ్మ!
తల్లుల గన్న లోకాల పావనమా!
దయచూపవే ప్రపంచ పెద్దమ్మ!
నవనీత హృదయిని అమ్మా పార్వతీ!
నీ కథ పాడగ ఈయవే ఆనతి!
భయమును తరుమవే మా భువనేశ్వరి
మహామహివై మసలుచు కాపాడు
ఆయుస్సునిచ్చి ఎల్లర దీవించు!
రమ్యమైన పరిపూర్ణ జీవిథమివ్వు!
సరస్వతీ సకలజనులకు సద్బుద్ధినీయమ్మా!
*సింహవాహిని*! చెడును దునువవమ్మా
త్రిమూర్తిరూపిణీ విపరీత వానలెంటమ్మ ?
పంచభూతముల శాంతింపజేయవే *శ్రీ చక్ర సింహాసినీ*!
::వల్లాల విజయలక్ష్మి,,,,
ఆలేరు,,
యాదాద్రి భువనగిరి
3
[23/10, 8:07 PM] భరద్వాజ గారు: 🎊🙏కవితాగానం🎊🙏
పేరు -భరద్వాజరావినూతల
ఊరు- కొత్తపట్నం
అంశం-శ రన్నవరాత్రులసందర్భంగా
శ్రీ దుర్గాదేవి పై కవితలు
కవిత తేదీ-23-10-20
రచన సంఖ్య -14
ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ -
భక్తుల కాచేటి చల్లని తల్లివి నీవమ్మ -
శక్తిస్వరూపిణివైన దుర్గవు -
ముగ్గురమ్మలమూలపుటమ్మవు -
కీలు పర్వతానా వెలసినదేవత వీవు -
మహిషాసురుని మట్టుబెట్టిన మహిమగలతల్లివీవు -
ఇంద్రాది దేవతలు భక్తితో నిన్ను కొలిచెదరు -
కోరికలు తీర్చేటికొంగుబంగారమై -
శక్తిరూపుణి గా నిండుమనసుతో నిన్ను కొలిస్తే -
భక్తిశ్రద్ధలని ను పూజిస్తే కాచేవు మమ్ము -బ్రోచెవుమమ్ము -
త్రిశక్తిమయమైననీరూపం కమనీయం -
క్షీరసంద్రాన పుట్టిన జననీ -
ఎఱ్ఱనివస్త్రాల ధరించి దుష్టుల శిక్షించి శిష్టులరక్షించి -
కాపాడే కనకదుర్గా నమోస్తుతే -
నవరాత్రి దినాల చందాన కుంకుమ శోభితమౌ -
నిదర్శనం సర్వపాపహరం --!
ఇదినాస్వీయరచన
భరద్వాజ రావినూతల (RB)🖋️
4
[23/10, 8:34 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: *** నవదుర్గలు ***
✍️ డా.పాండాల.
ధరలోన "శైలపుత్రిగ"
పరమేశునిరాణిగాను పాపులద్రుంచన్
కరమున ఖడ్గము బూనియు
తరిమితివిల దుర్గుణములు
తల్లిగగౌరీ!1
శ్రీ "బ్రహ్మచారిణీ" శివ
శ్రీ భ్రమరాంబగ వెలసియు క్షేమమునొసగన్!
విభ్రమమొందగ దుర్గుణ
మా భ్రమలనుతెంచినట్టి మంగళగౌరీ!2
శ్రీ "చంద్రఘంట"నమ్మితి
నీచరణము నాకుదిక్కు నిజహృదికెపుడున్!
నీచుడ కుటిలాత్మజుడను
నీ చల్లని కృపను జూపు నిర్మల గౌరీ!3
శివసతి" కూశ్మాండవు" సుమి
నవదుర్గగనిన్నునిలిపి నవరసముక్తిన్
భవసతి లీలామృతమిల
యువకులకునుశక్తిపంచె యుక్తివిగౌరీ4
దానవ రాజగు దుర్గుని
కానగ జాలని క్రియలకు గావగ జగమున్
జాణగ నసురుని జంపిన
మానిని "శ్రీ స్కంధమాత"మంగళగౌరీ!5
శరణంటిని" కాత్యాయని"
పరనిందలుయేల?నాకు పరమేశ్వరివీ!
నెరనమ్మితి నీపదముల
నరకము స్వర్గంబు నీవె నగజా గౌరీ!6
శ్రీ "కాళరాత్రి "జగతిని
నాకిక దశదిక్కునీవె నళిన దళాక్షీ!
శ్లోకము నీదే శాంభవి
శ్రీ కర సుగుణాల దీప్తి శివసతి గౌరీ!7
శ్రీరమ భవాని భార్గవి
సారస"మహగౌరిదేవి"సద్గుణయుక్తిన్
ప్రేరణమెల్లనునీదే
కారుణ్యముతోడమమ్ము గావుము గౌరీ!8
శ్రీ సర్వ "సిద్దిదాతగ"
దాసుల కరుణించుమమ్మ
దయగుణశీలా!
బాసటగా కంకణమే
మా సర్వము నీవెరక్ష మంగళగౌరీ!9
✍️డా.పాండాల మహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి.
5
[23/10, 8:37 PM] +91 74168 63289: పేరు మన్నె పిన్నక లలిత
తేదీ 23/10/2020
అంశం దుర్గ అమ్మవారు
శీర్షిక ముగ్గురమ్మల మూలపుటమ్మ
అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ
నవదుర్గ గా పేరొంది నవ రూపాలతో నవ రుచుల నైవేద్యాలతో నవ్యతెచ్చే నవదుర్గా
ఆశ్వయుజ పాడ్యమితో ప్రభవించే దుర్గమ్మ "వందే వాంఛితలాభాయ శైలపుత్రి యశస్వనీమ్"
బాలా త్రిపుర సుందరి అలంకారం
నైవేద్యం కట్టు పొంగలి వర్షాకాలం ఆరోగ్య ప్రదాయిని సామాన్యునికి సాధ్యమయ్యేది
విదియ గాయత్రి రూపం ,తదియ అన్నపూర్ణ రూపం ,
చవితి కామాక్షి రూపం, పంచమి లలితా రూపం
షష్టి కాత్యాయని రూపం
సప్తమి సరస్వతీ రూపం అష్టమి మహాగౌరి రూపం దుర్గా రూపం నవమి మహిషాసురమర్దని సిద్ధిదాత్రి రూపాలతో, నైవేద్యాలతో అతి సామాన్యులు సైతం సునాయాసంగా ఖర్చు తక్కువ వరుణుడి ప్రతాపానికి ఆరోగ్యాన్ని ,ఆనందాన్ని ఇచ్చే అమ్మ దుర్గమ్మ
దుష్టసంహార సంకేతం సిద్ధిధాత్రి
నేటి కామకాసురులను మహిషాసురునిలా మర్దించి
నీ వాహనమైన గాడిదపై ఊరేగించి ,నశింప జేయుటకు కదలిరా! నవదుర్గవై కదలిరా !!
6
[23/10, 8:52 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: నవదుర్గా వెలసితివి
ముగ్గురమ్మల మూలపుటమ్మ నీవు
శివుని సతిగా పార్వతి వి
దుష్టులను దునుమాడి శక్తి వైతివి
అమ్మ శైలపుత్రి వి కైలాసములో శివతాండవము చేయ లాస్యం ఆనందం తాండవం అతనిది
నటరాజు సతి వై గౌరీదేవిగా కొలువబడే ది నీవే
అమ్మ గాయత్రి ఇ సంధాత్రి
కాళికాదేవి దుర్గమ్మ దుష్ట సంహారము చేయ ఇంకెప్పుడూ ఒక చేతిలో ఖడ్గం మరో చేతిలో రక్త పాత్ర రాక్షసులను దునుమాడి తల్లి వందనం వందనం
నవదుర్గ వు నీవే ఈ కరుణ వేళ
కష్టాలు ది తొలగింప దిగి రావమ్మా మహిషాసురమర్దని
కాముక అసురులను తరుమ మర్దించి తగిన గుణపాఠం నేర్పారు తల్లి దుర్గమ్మ తల్లికి వందనం
మైసమ్మ పోచమ్మ పెద్దమ్మ గుడి నీవే
నవ దుర్గ ల తో వర్ధిల్లాలి
జనులను కావగ రావమ్మా పార్వతి శక్తి శాలిని మనోహరమైన తల్లి
గౌరమ్మ మునివే సదా గా వగా రావులమ్మ తల్లి సిద్ధిదాత్రి అనేక రూపాలలో అనేక ప్రసాదాలు భక్తులకు అందజేస్తూ దీవెనలు ఆశీర్వాదాలు పొందుతాము తల్లి మిమ్మల్ని సేవించి
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
7
[23/10, 8:55 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం*
============
అంశం : దుర్గా మాత
శీర్షిక : ఆదిశక్తి
తేది : 23/10/2020
*ఆదిశక్తి*
నవరాత్రులు దేవి
అమ్మ దర్శనం
కల్మషం లేని భక్తులం
కరుణించి మన్నించి
రక్షించే కల్పవల్లివమ్మ
శక్తిని ప్రసాదించు కాళికా దేవి
భక్తుల కోరికలు తీర్చే భవాని
విద్యను ప్రసాదించే సరస్వతి
సిరి సంపదలను
ఇచ్చే మహాలక్ష్మి
గృహమును కాపాడే గజలక్ష్మి
మహా దుర్గ రుద్రాని
విజయవాడ వాసినీ
విజయ దుర్గ అమ్మ
రావమ్మా కదిలి రా
మమ్మల్ని కాపాడు తల్లి....
*ఇంద్రావత్ రాహుల్*
*కొత్తపేట్*
*నిజామాబాద్*
9848054079..
8
[23/10, 8:58 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..దుర్గా అమ్మవారు
శీర్షిక..మా కల్పవల్లి
అంబా అని తలచినా
ఆదుకునే తల్లివి
కోరిన కోర్కెలు తీర్చేటి కొంగుబంగామై
వెలసితివి దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై
మహిమలెన్నో జూపు మా కన్నతల్లి
కరుణ తో జూచు మా కల్పవల్లి
ఉగ్రస్వరూపిణి
శక్తి స్వరూపిణి
దుష్ట శక్తులను దునుమాడే ఆదిపరాశక్తి
దుర్గుడిని సహరించి దుర్గవైనావు
నవ రాత్రి పూజలందుకో మా తల్లి దుర్గ
అభయము నీవుమా బంగరు దుర్గ
ప్రకృతి విపత్తుల నుండి లోకాన్ని రక్షించు
భక్తితో కొలిచేము తల్లి
భయములు తొలగించు అభయము నోసాగుమా
నవ విధ నామాల నవదుర్గమ్మ
సకల కార్యములలో
విజయములు చేకూర్చవమ్మా.
9
[23/10, 9:17 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*
తేదీ:23-10-2020
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: దుర్గా మాత
*********************
మంగళ రూపిణీ దుర్గామాత
శరన్నవరాత్రులలో శక్తి స్వరూపిణియై
దినమున కొక అవతారంతో అలరించే తల్లీ
మొదటి రోజు బాలా త్రిపుర సుందరియై
శక్తి నిచ్చే దేవదేవీ!
రెండో రోజు గాయత్రీ మాతయై
మహిమాన్వితమైన గాయత్రి మంత్రాన్ని ఉపదేశించిన మాతా!
మూడో దినమున ఆకలి తీర్చే అన్నపూర్ణ దేవి స్వరూపమై
నాల్గవ రోజు కనుల పండువగా దర్శనమిచ్చే కాత్యాయని దేవ్యై
ఐదో రోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే మోక్షమిచ్చే లలితా మాతవై!
ఆరో రోజున సిరిసంపదలనొసగే శ్రీ మహాలక్ష్మీ దేవి స్వరూపమై సంపద సౌభాగ్యం ఇచ్చే తల్లీ!
ఏడో రోజు మహా సరస్వతీ దేవివై అక్షర జ్ఞానం విద్యా విధేయత నొసగే తల్లీ!
ఎనిమిదో రోజు మహిషాసుర మర్దినివైన దుర్గా దేవి!
దుష్టశిక్షణ శిష్టరక్షణ కై అవతరించిన నవ నామాల దేవతా మూర్తివీ!
నీ కటాక్ష వీక్షణలు మాపై ప్రసరించుమా!
ఎల్లప్పుడూ మాకు తోడూ నీడగా
అభయమునిమ్మూ దుర్గామాత!
10
[23/10, 9:21 PM] Ramaka: 🔱కవితా గానం🔱
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:23-10-2020
అంశం:దుర్గాదేవి
ప్రక్రియ:వచనకవిత్వం
శీర్షిక:శ్రీ మాత్రే నమః
**************************
దుష్టులను శిక్షించి
శిష్టులను రక్షించే మాత.
సింహవాహినై,దుర్గమున్ని సంహరించి,దుర్గతులను
తొలగించే శక్తిస్వరూపం.
అమ్మలగన్న అమ్మై
ముగ్గురమ్మల మూలపుటమ్మై
అభయముద్రతో దర్శనమిస్తుంది.
ఇనుపముండ్ల,ఖడ్గాయుధాలతో
అపరశక్తి అవతారమై కరుణిస్తుంది.
సర్వశుభంకరియై సహస్రనామాలంకృతియై సాక్షాత్కరిస్తుంది.
దుర్గామాత దుఃఖాలను తొలగించి
విజయాలను అందిస్తుంది.
భూతప్రేతపిశాచ పీడలను వదిలించి
సర్వభూతాత్మికై అభయమిస్తుంది.
ఉపాసకుల అధిష్ఠాన దేవతై
సకలనీరాజనాలందుకుంటుంది
11
[23/10, 9:36 PM] Lalita Sister: కవితాగానం
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : తల్లీ దుర్గమ్మ
కవితా సంఖ్య: 32
తేదీ: 23/10/20
జగజ్జనని లోకాలను ఏలే
అనురాగవల్లి
దుష్టశిక్షణ శిష్ఠరక్షణలో
ఉగ్రరూపమే కాళికవై....!!
మిలమిల మెరిసే కళల
కాంతుల తెరలలో
నెల బాలుడి ని శిగలో ధరించి
పాల సంద్రం లా ఎగసిపడే
తరగల నురగలలో బింబాధరివైన
జగదాంబ నమస్తే....!!
అరుణార్ణవమైన చెక్కిళ్ళ
సొగసులతో
తెల్లని వర్చస్సుల శోభలతో
కలువకనుల కరుణా వర్షంతో
తేనెలూరు అధరాల పై చురునవ్వుల వెన్నెల తో
జగాన్ని ఏలే జగదాంబా నీకు వందనం....!!
తల్లీ దుర్గమ్మ నీ నీడలో
నీ సన్నిధిలో మెదిలే వరమీయవమ్మ
ముముక్షవులను పొందగలిగే
మనోచిత్తాన్ని ప్రసాదించు తల్లి
నవరాత్రులలో ప్రకాశించే పరమేశ్వరి.....!!
వినీల
12
[23/10, 9:37 PM] Lalita Sister: 🙏🙏 కవితా గానం🙏🙏సుధారాణి కృష్ణంరాజు
అంశం: దుర్గా మాత
శీర్షిక:"నవదుర్గమ్మ"
సర్వ మంగళ మాంగల్యే
శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్రియంబకే గౌరి
నారాయణీ నమోస్తుతే
నవరాత్రులలో భక్తులకు దర్శనమిచ్చే మముగన్న
మాదుర్గమ్మ
బంగారు ఛాయతో ఇంద్రకీలాద్రి ఫై వెలసి విజయవాడ కనకదుర్గ వైనావమ్మా
బాలా త్రిపురసుందరి గా భక్తులను కాచితివి మా దుర్గమ్మా
గాయత్రీ మాతగా సర్వ పాపాలను హరించే శక్తి స్వరూపిణివి నీవే నమ్మా
అన్నపూర్ణా దేవిగా కొలిచి నంతనే కొంగు బంగారంగా
కరువు కాటకాలు లేకుండా
నిత్యాన్నదానేశ్వరివమ్మా
విద్య వినయ్ సంపదలకు
వాణివి మా కవన రాణివి
నీవే అమ్మా దుర్గమ్మా
లలితా త్రిపుర సుందరి గా
బాధలను బాపుదువమ్మా
సిరులు సంపదలు నొసగే
మహాలక్ష్మి వి నీవేనమ్మా
దుష్టశిక్షణ శిష్టరక్షణ చెసే
మహిషాసుర మర్దిని వి నీవే నమ్మా
దుర్గా రాజ రాజేశ్వరీ అవతారం తో విజయం దశమినాడు
విజయ కనక దుర్గమ్మ🙏🥥🍇🍒
13
[23/10, 10:11 PM] Lalita Sister: అంశము: "దుర్గాదేవి"
ఉపాంశము: "సింహవాహిని"
1కం:
అమ్మా నీదీవెనలను
చిమ్ముము మాపైన దయను సిరిసంపదలన్
కొమ్మా నీశుని ప్రియసఖి
నిమ్మా భాగ్యములనన్ని నిష్టత దీరన్!
2కం:
సింహాసనమున ఠీవిగ
సంహతి గలదేవి వీవు సాహసమొప్పన్!
సింహము నెక్కియు దుష్టుల
సంహారము జేసినావు సంగర మందున్!
3కం:
తలపై బోనము నెత్తియు
తలచెరు మదినిన్ను తల్లి దండ్రియటంచున్
కొలిచెరు నెప్పుడు నిన్నే
నిలుపుము మామనసు నందు నిష్టగభక్తిన్!
4కం:
భుక్తి నొసంగెడి దానవు
శక్తివి నీవేయటంచు శంభుని రాణీ!
భక్తిగ బోనము జేసెరు
ముక్తిని మాకొసగు మనుచు మ్రొక్కెరు నిన్నే
5కం:
గానము జేయుచు భక్తులు
బోనము తలపైన పెట్టి బొగుడుచు నిన్నే!
పూనక మొప్పగ నాడుచు
నీనామము దలచు చుండ్రు నిచ్చల భక్తిన్!
6కం:
శివ సత్తులు తన్మయమున
నవరస మొల్కంగ భక్తి నాట్యము జేయన్!
నవదుర్గవు నీవనుచును
రవలించగ జేతురమ్మ రమ్యత గొల్పన్!
7తే.గీ:
పోత రాజుల నృత్యాలు ప్రీతిగొలుప
పట్టు వస్రాలు తలపైన బెట్డుకొనియు
మంగళారతులను పట్టి మగువలంత
తరలి వచ్చేరు నాడుచు తన్మయమున
"ప్రతిభారత్న"
డా.మహ్మద్ షరీఫ్
14
[24/10, 8:00 PM] +91 74165 92715: 🙏🙏 కవితా గానం🙏🙏
🙏సుధారాణి కృష్ణంరాజు🙏
అంశం:"మహిషాసుర మర్దిని"
తేది:24-10-2020(శని వారం)
మహిశుడనే అసురుని వధించి
మహిషాసుర మర్దినివి అయినావు
దేవ దానవుల చేత మరణం లేని వరంకోరే ఆ అసురుడు మహిషాసురుడు
బహ్మ వరం ఇవ్వగానే విర్రవీగి
దేవ దానవులను బాధలకు గురి చేసెను
అమ్మవారు దుర్గావతారం ఎత్తి తొమ్మిది రోజులు భీకర యుద్ధం చేసి మహిషాసుర మర్దిని గా పేరు పొందిన ది దుర్గా దేవి
పదవరోజు దశమి అదే విజయదశమి
దుష్టశిక్షణ శిష్టరక్షణకై అవతారం ఎత్తిన దుర్గా దేవి
భక్తితో కొలిచిన వారికి పిలిచిన
పలికే చల్లని తల్లి
దుష్టులను శిక్షించుటకు అవతారమెత్తిన అపరకాళికవు
ఆదిశక్తివి
జగతిని కాపాడే జగన్మాతవు
దయార్ద్ర హృదయినీ, సౌభాగ్య దాయిని, చాముండేశ్వరి వి,చండికవు,ప్రతి అవతారంలో
నీవె నిండి లోక కళ్యాణం కోసం
అవతారం ఎత్తిన కళ్యాణి కరుణాంతరంగవు
కరోనా మహమ్మారి నుండి
జగతిని కాపాడి వరుణుడి నుండి కాపాడి వరదలను అరికట్టి అందరికీ సుఖ సంతోషాలతో పాటు పగలు ప్రతీకారాలు రూపుమాపి
ప్రపంచ శాంతి దాయినిగా
ఆయుధ పూజలు చేసెదమమ్మా
నీ ఆయుధమే ప్రపంచ శాంతి సాధనం కావాలి
విజయం కలిగించు
విజయ ప్రదాయిని🙏👍🥥🍇🍒
15
[24/10, 8:36 PM] Ramaka: 🟢కవితా గానం🟢
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:24-10-2020
అంశం:మహిషాసురమర్దిని
ప్రక్రియ:వచనకవిత్వం
శీర్షిక: సిద్దిధాత్రి
**************************
సకలసిద్ధుల ప్రదాయిని
మహిష మస్తక నృత్త వినోదిని
జనన రక్షణ మోక్ష విధాయిని
శుంభ నిశుంభ నిషూదని
ఆపదలు,భయాలు తొలగించే అమ్మ.
సనాతని,త్రిపురసుందరి,దుర్గ,
గౌరి,సర్వాధిష్ఠాత్రి,శివరూపిణి,
అన్నపూర్ణ,రాజరాజేశ్వరి ఇత్యాది నామాలతో స్తుత్యమై
సత్యం,పుణ్యం,యశస్సు,
మంగళాలను ప్రసాదిస్తుంది.
మోక్షదాయిని,ఆనందప్రదాయిని,శోకనాశిని,
ఆర్తివినాశిని,
తేజస్వరూపిణి తాను.
దుష్టసంహారిణి,శిష్టసంరక్షణియై
జగములను కాపాడే తల్లి.
ఉగ్రచైతన్య స్వరూపిణి ఆ శక్తి.
మహిషాసుర మర్దినియై దర్శనమిస్తుంది.
16.
🎊🙏కవితాగానం 🎊🙏
అంశం-మహిషా సురమర్ధిని
పేరు భరద్వాజ రావినూతల
కొత్తపట్నం
రచన-15
శీర్షిక- దుష్టశిక్షణ మూర్తి
నవదుర్గారూపాలలో ఎనిమిదవరూపమై --
మహిషాసురుని యుద్దాన వధించి -
ఋషులతో జేజేలు పలికించుకున్న అమ్మా నీకువందనం -
లోకపాలకుల అంశాల తోపుట్టిన నిన్ను
దూపదీపనైవేద్యాల తో కొలిచేముతల్లి -
అష్టభుజాలాల అలరారే నిన్ను -
ప్రకృతిప్రణవస్వరూపమైన నిన్ను -
భక్తితో కొలిచేము
విపత్తులతో మమ్ము బ్రోవ -
నిత్యకుంకుమతో నిను పూజించేముతల్లి -
మహిషాసురుని సంహరించిన ఈరోజు -
మాకు మహర్నవమి -
సింహవాహినివై వచ్చే నిన్ను కన్నులార
కాంచేము కనకదుర్గమ్మ -
సకలజనులు శుభములుఒసంగ-
కాపాడవెతల్లి కనకదుర్గా ..!
ఇదినాస్వీయరచన
భరద్వాజ రావినూతల ((RB)🖍️
కొత్తపట్నం
9866203795

Comments
Post a Comment