Skip to main content

బాల్యం Oct 2020

 నిర్వహణ

శివునూరి లలితాకృష్ణ

Author of vennela shilpam

వీరా గుడిపల్లి

The mathematics teacher and poet

***********

1 భరద్వాజ గారు

2.కె.సి.నరసయ్య గారు

3.కోరాడ గారు

4.అపరాజిత రెడ్డి గారు

5.సుధారాణి కృష్ణం రాజు గారు

6.బల్లూరి ఉమాదేవి గారు

7.డా.ఆంజనేయులు గారు

8.మన్నె పిన్నక లలిత గారు

9.సునంద వురి మిళ్ళ గారు

10.వల్లాల విజయ లక్ష్మి గారు

11.అయిత అనిత గారు

12.దండమూడి గారు

***************

1

[30/10, 8:35 PM] భరద్వాజ గారు: కవితాగానం (కవితలపోటీ )

30-10-20

అంశం-బాల్యం 

పేరుఃభరద్వాజ

ఊరు-కొత్తపట్నం

రచనః18

శీర్షిక - తిరిగిరాని బాల్యం 

చిన్నతనాన కోల్పోయాను బాల్యం 

చెల్లిస్తున్నాను బ్రతుకంతా మూల్యం -

ఎవరియింట నాతొలి ఏడుపు కూత మోగిందో తెలియదు -

వారికులం అంతస్తు ల ఆనవాలె తెలియదు -

మారాంచేస్తూ,  గారాలుపోతూ -

అమ్మవొడిలోఆడుకుంటూ -

బోసినవ్వులతో ఆడుకుంటూ 

వచ్చీరానీ మాట లతో -

వేసే తప్పుటడుగులను -

తప్పటడుగులుగా మార్చి నన్ను నడిపే ఆమ్మ నాప్రక్కన 

ఉందన్న ఆలోచనాబలంతో  ఆనాడు -

ఆమె నాదైర్యం -నేనెరుగను తొలిప్రాణి ఆమె 

కోపం ,ఈర్ష్య తెలియని నావయసుకు తెలిసింది ఒక్కటే -

అలక -అడిగింది సాధించుకోవాలన్నకోరిక -

పగలంతా ఆటలాడుతూ తిరిగిన కష్టం 

అమ్మపక్కలోపడుకోగానే  నిద్రలోకి జారిపోతుంది -

చిలిపిచేష్టలు ,కోతిగంతులు వేస్తూ స్వేచ్చావిహంగం లా తిరిగే నేను -

రేపేమిటి అన్న ద్యాస లేక లేక -

సీసామూతలతో మట్టిముద్దలతో ఆడుకుంది నాబాల్యం -

అమ్మాఅన్న నాతొలి పిలుపు విని పుడమిలా పరవశించింది  అమ్మ -

ముద్దులవానతో పులకించింది నా మోము -

గోరుముద్దలుపెడుతూ చందమామను చూపిస్తూ-

 అమ్మచెప్పేపాటాలు పెద్దబాలశిక్ష

చిటికిన వెలుపట్టుకుని నన్నునడిపించే నాన్న -

నాకు పెద్దసెక్యూరిటీ గార్డు -

మగబిడ్డకన్నందుకు ఆయన -

చెయ్యి మీసం మీద ఉందని నాబాల్యానికి తెలియదు -

రానికోపాలు -

తెలియని తగాదాలు -

ఎవరికీఇవ్వకుండా దాచుకునే బొమ్మలు నాఆస్ధి -

కాలి కి కట్టిన వెండి కడియం -

మెడలో ఆంజనేయస్వామి తాయెత్తు నాకున్న సొత్తు -

కల్మషం లేని నవ్వు నవ్వే నన్నునాబుగ్గలను--

చూసి ముద్దెట్టుకునే అమ్మలక్కలు కందిపోయాలా చేస్తే -

దిష్టికోసం అమ్మకట్టిన వెంట్రుకలతాడుశ్రీరామరక్ష

వచ్చీరానీ కోపం మందలించే అమ్మకోపం -

నా బాల్యాన  ఓ జ్ఞాపకం -

కుళ్ళుకుంత్రాలు తెలియని నావయసు -

కుల మతాలెరుగని నా మనసు -

పరిశుభ్రత తెలియని నాదేహం -

నాయనమ్మపెట్టె  గోరుముద్దలు -

నులకమంచం లో పక్కన పడుకోబెట్టుకుని -

తాత చెప్పేచందమామ కధలు -

నాకు బాల్యాన అనుభవైకనైవేద్యాలు-

నాబాల్యం ఆనందాల సంద్రం -

దేవుడు కనిపిస్తే అడగను ఆస్తిపాస్తులను -

కోరుకుంటాను నాబాల్యాన్నితిరిగి 

ఇదినాస్వీయరచన 

భరద్వాజరావినూతల (RB)✒️

9866203795

కొత్తపట్నం 

ప్రకాశం జిల్లా

2

[30/10, 8:37 PM] KC Narsaiah KS 26: కవితా గానం


పేరు: కట్టెకోల చిన నరసయ్య

చరవాణి: 7981814784

అంశం: బాల్యం 

శీర్షిక: అమృతతుల్యం



 బాల్యం అమూల్యం

 అమ్మ లాలనలో

 బాల్యం అమృతతుల్యం

 నాన్న ఆదరణలో

 కమ్మనైన ప్రేమామృతం

 పాపపుణ్యాలెరుగని బాల్యం

 కంటికి కనిపించేదంతా

 నా సొంతమనే పంతం

 చుక్కల్లో తేలిపోవాలని

 చంద్రుని కోసం మారాం

 చిటపట చినుకులతో

 చెట్టాపట్టాలేసుకోవాలని

 వర్షంతో హర్షం

 ఆకసమున విరిసిన

 హరివిల్లులో తొంగుండాలని

 దోబూచులాటలు

 కళ్ళు కప్పి

 మన్ను తినాలనే తపన

 బోసి నవ్వుల చిన్నారి

 ముసి ముసి నవ్వుల మురిపెం

3

[30/10, 8:39 PM] Korada: కవితాగానం

అంశం:-*** బాల్యం ***

కోరాడ నరసింహా రావు!

మొగ్గలోనేతృoచేయొద్దు 

##############

బాల్యం....!

అరవిరిసిన పువ్వులా...

చిరునవ్వుల పరిమళం తొ...ఆటా,పాటలహాయి

నొందుతూ.,కలిమీ-లేము

ల ఊసే తెలియక...అ ఆ ఇ ఈ...చిలుక పలుకుల తో...కల్మషమెరుగని...

 నిర్మల మైనది...!

అమ్మపాలు తాగుతునే.,

అన్నీ యిట్టే పెట్టేస్తూ ...

చూస్తూనే...గ్రహించేస్తూ 

వింటూనే నేర్చేసేబాల్యం!

జీవితానికే...గొప్పవరం!!

ఆహ్లాద కర బాల్యాన్ని...

అయోమయంపాలుచెయ్యొద్దు...!,బాల్యాన్ని

 అనాధనుచేసి...వీధుల్లో

కి విసిరేయొద్దు !!

కాసులకోసం శ్రమనుదోచ గా...కార్మికులుగ.,మార్చేయొద్దు...!

బడిబాట బాల్యాన్ని బం డల దారి పట్టించొద్దు !!

నేటి బాలలే కదా రేపటి పౌరులు...!

బాల్యం అవిటిదైతే ...,

భవిష్యత్తు లేకిదైపోదూ!!

కొందరికే....వారమైన...బాల్యం!ఎందరికో...శాప మైపోతే ఎలా....!?

ఆ హక్కును అందరూ...

హాయిగా పొందాలిగా  ?!

సమాజకల్పవృక్షానికి....

విరిసిన పువ్వుకదా...

బాల్యం !

దాన్ని...పిందై...కాయై,పండై.,పరిమళించనిద్దాం

మొగ్గలోనే త్రుంచేయొద్దు

********************

.........కోరాడ.

[30/10, 8:45 PM] 

4

Aparajith: స్నేహమాధుర్యం

చిన్నప్పుడు 

జిల్లగోనే ఆటలో 

అంతన్న కొట్టిన జిల్ల 

సర్రున వచ్చి 

నా కంతకు తగిలి 

రక్తం కారుతుంటే 

నాకంటే వాడే ఎక్కువ ఏడ్చాడు !


అమ్మ చేసిన మిఠాయిలు 

ఇద్దరం చెరిసగం తింటుంటే 

మా అమ్మ 

ఆ అంతిగానికెందుకు ఇచ్చావ్ రా !

ఒళ్ళు చీరేస్తారరెయ్ !

ఇద్దరం ఒకళ్ళకొకళ్ళం నవ్వుకున్నాం !!


జిన్న పండ్ల చెట్టు 

నే నెక్కలేక పోతే 

వాడు ఎక్కి తెంపుతుంటే 

నేను కింద ఒక్కొక్కటి ఏరి 

పోగు చేస్తే 

ఆ వగరు పండ్లు ఇద్దరం తింటుంటే !!

ఆ ఆనందమే వేరు !!


పబ్లిక్ పరీక్షల్లో 

నా వెనుక లింగంగాడు 

వాడికి అన్నీ వచ్చు గాని ఇంగ్లీష్ రాదు 

నేను రాసినవి 

మక్కీకి మక్కి కాపీ కొట్టీ !!

బోర్డు పరీక్షల్లో ఇద్దరం పాసైతే !

నన్ను హత్తుకొని భోరున ఏడ్చాడు !!

ఆ స్నేహ మాధుర్యమే వేరు !


ఇంటర్ పట్టణంలో 

నేను లింగం ఒకటే రూమ్ కిరాయికి 

నేను లింగం అన్నా చెల్లెళ్ళ అనుబంధం సినిమా 

కెళ్తే ఎన్ఠీఆర్ సావిత్రి పడుతున్న కష్టాలు చూసి 

బెంచి సీటులో కూర్చొని ఒకటే ఏడుపు !!

ఆ స్నేహం ఎంత మధురం !!


డిగ్రీ లో ఇంగ్లీష్ లిటరేచర్ 

లెక్చరర్ అడిగే ట్విస్టులకు 

నేను ఠకీమని సమాధానం ఇచ్చే వాడిని 

క్లాస్ లో ఓ అమ్మాయి పొగడ్తగా 

చిరునవ్వులు చిందిస్తుంటే !!

ఇంకా ఇంకా బాగా చదవాలి 

అని చదివిన చదువులు మరువలేము !!


పి జీ ఇంగ్లీష్ చదివా 

లెక్చరర్ లనే 

తికమక పెట్టే ప్రశ్నలడిగి 

వాళ్ళు తడబడుతుంటే 

నేను వినయ్ నవ్వుకున్న తీరు 

మరువలేం !!

మరపురానిది ఆ స్నేహం !!


ఉపాధ్యాయ వృత్తి చేపట్టాక 

నేను అరుంధతి టీచర్ 

ఒకటే గదిలో పోటీలు పడి 

చదువు చెబుతుంటే !!

ఆ స్నేహ మాధుర్యమే వేరు !!


అందుకే అన్నారు 

స్నేహబంధము ఎంత మధురము,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,, అని !!


అపరాజిత్

5

[30/10, 9:03 PM] +91 74165 92715: 🙏🙏*కవితా గానం*🙏🙏🙏*సుధారాణి కృష్ణంరాజు🙏

*నేటి అంశం*బాల్యం*

బాల్యం ఒక వరం

అమ్మ తినిపించే గోరు ముద్దలు

తింటూ అమ్మ చెప్పిన కథలు

వింటూ 

గడిపిన రోజులు గుర్తుకు  వస్తే

ఎంతో సంతోషంగా ఉంటుంది

నాన్నకు కావలసిన బొమ్మ లు

వెళ్ళే ప్రదేశాలు ముందు గా ఏకరువు పెట్టి తన మాటే గెలవాలని పట్టిన పట్టు

తీరక పోతే అన్నం తింటే ఒట్టు

అపుడు నాన్న అమ్మ బుజ్జగించి అన్నం తినిపించిన

వైనం గుర్తు కు వస్తే

మళ్ళీ ఆరోజు లు తిరిగి రావని

తెలుసు 

నిష్కల్మషమైన బాల్యం

అసూయ ద్వేషాలు లేని

జీవితం బాల్యం

నాన్న అండగా ఉన్నారన్న

భరోసా

అమ్మే తను అడిగింది ఏదయినా ఇస్తుంది అన్న నమ్మకం

పాపలు మంచికి మారుపేరు

చిరు నవ్వులు చిందిస్తూ

ఏది మాట్లాడినా చిరునవ్వు తో

సమాధానం

ఇవన్నీ బాల్యం లోని జ్జాపకాలు

6

[30/10, 9:14 PM] Balloori Umadevi Poetess: 30/10/20

కవితా గానం

డా.బల్లూరి ఉమాదేవి

బాల్యం"


జీవితం లో మరువలేనిది మరపురానిది

 తిరిగి రానిది తీయనైనది బాల్యం

కల్లాకపటా వాసులే ఎరుగనిది 

మోసం ద్వేషం తెలియనిది

పోటీతత్వం తెలియనిది

గుండె గదిలో ఒదిగిపోయింది బాల్యం

చెంగుచెంగున గంతులేసిన బాల్యం

తొక్కుడు బిళ్ల ఆటైనా గాజప్పాటైనా 

బొమ్మల పెళ్లైనా పరుగుపందెమైనా 

 ఆటపేరు యేదైనా గెలుపోటములతో

సంబంధం లేక మేము సైతమంటూ

ఉబలాటంతో ముందుకురుకుతూ సాగిన వైనం

అమ్మ కొంగే ఆసరాగా తువ్వాలుగ, దుప్పటిగా

అనుక్షణం వదలక తిరిగిన  తీపి గుర్తులు

అమ్మ చెప్పే అపురూపమైన కథలు వింటూ

 అమ్మచేతి గోరుముద్దలు తింటూ

కథ కంచికనగానే కంచం ముందు నుంచే లేస్తూ

పరుగులు తీసిన పాతరోజుల మరపురాని

తీపి జ్ఞాపకమె అందమైన  బాల్యం

రాని ఏడుపు నేడవడం అలగడం

దాగుడుమూతలాడడం 

తోబుట్టువులతో గిల్లికజ్జాలాడడం

ఇలా ఒకటా రెండా ?ఎన్నెన్నో జ్ఞాపకాలు

ఆరు బయట వేసిన పక్క పైన ఒత్తిగిల్లుతూ

ఆకాశంలో చందమామను చూస్తూ 

చల్ల గాలి జోల పాడే వేళ అమ్మను హత్తుకు

 గడిపిన క్షణాలు జీవితాంతం మరువలేని మధురమైన తీపి గురుతులే కాదా?

నాకైనా  మీకైనా  హృదయమున్న ఎవ్వరికైనా!

******"

7

[30/10, 9:16 PM] +91 74168 63289: కవితాగానం 

అంశం బాల్యం

 పేరు మన్నెపిన్నక లలిత 

 శీర్షిక  బాల్య స్మృతి 

 

భరోసా లేని జీవితంలో భగవంతుడిచ్చిన  వరమేరా బాల్యం ఈబాల్యం మధుర బాల్యం /2/

అమ్మా నాన్నల ఆప్యాయతానురాగాలు

 తోడబుట్టిన వారితో చిలిపి కజ్జాలు  

ముప్పేటలా పెనవేసుకున్న  అందమైన బాల్యం మధురమైన బాల్యం 

వేడి వేడి అన్నంలో పప్పుా, గోంగూర ,నెయ్యి కలిపి 

అమ్మ పెట్టే అమృతపు ముద్దల బాల్యం మధుర బాల్యం 

తాటి తోపుల్లో విహారాలు,

 కాల్వ ఈది కాపలావాని కన్నుగప్పి 

మామిడి పిందెలు ,చెరుకుగడలు దొంగతనాలు చేసిన

 బాల్యం/భ/ 

అట్లతద్దిి   నెలలు దాగుడుమూతలు కోతికొమ్మచ్చి ఆటలు   కొక్కో లు కబడ్డీ లు ఆడిన బాల్యం

 వెన్నెట్లో గోరింట చేతుల అందాలు

 చేమంతుల సౌరభాలు ఆస్వాదించి ఆనందించిన  బాల్యం మధుర బాల్యం

 ఆదివారం ఆటలతో అలసి సోమవారం బడికి వెళ్ళి అయ్యవారు ప్రశ్నిస్తే తెల్లమొహం వేసి తన్నులు తిన్న బాల్యం  చదువులో   స్ఫర్ధను పెంచి పౌరుషంతో ప్రతిభను చూపి ,

పట్టం అందుకున్న బాల్యం మధుర బాల్యం 

జీవితంలో తిరిగిరాని భాగ్యం ఈ బాల్యం 

వెలలేని భాగ్యం తిరిగిరాని బాల్యం

 తిరిగి... రా ....నా బాల్యం

8

[30/10, 9:25 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: బాల్యము అమూల్యమైనది

బాల్యం తియ్యని కల గూడు

బాల్యం విశిష్ట దాయకమైన ది


బాల్యంలో ఆడిన ఆటలు మరువలేనివి

బాల్యంలో పాడిన పాటలు పాడుతూ

బాల్యంలో జాతర్లు పండుగలు అమ్మా నాన్న తో కలిసి పోయి నటువంటి ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ ఆనందం కలుగుతుంది



బాల్యం ఒక విశిష్ట దాయకమైన

బాల్యం బంగారు భవిష్యత్తుకు

నిలయమైంది


బాల్యంలో సాగి పోయిన ఆ పాట ఒక వసంత parimala వీచిక


బాల్యంలో చదువుకున్న తోటి మిత్రులు ఇప్పటికీ నాకు జ్ఞాపకం వస్తారు

బాల్యం విశిష్ట దాయకమైన దీవికి అర్థమైంది ఆ రోజులు తలుచుకుంటే దిగులు బుగులు కలుగుతోంది మళ్ళీ వచ్చే నా బాల్యం వెన్నెల ఇలాంటి చల్లని బాల్యం


ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537454

9

[30/10, 9:25 PM] సునంద ఉరిమిళ్ళ: *కవిత గానం*

తేదీ:30-10-2020

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

శీర్షిక:: బాల్యం

""""""""""""''""""""""""""""""""""""

ఎంచక్కా అమ్మ కొంగుతో దోబూచులాడుతూ

నాన్న గుండెలపై నడక నేర్చుకునేది

తాతయ్య మీసాల ఊయలూగుతూ

అమ్మమ్మ ఒడీలో ఊ కొడతూ 

బాదర బందీలు  లేకుండా

బిందాస్ గా తిరిగే  బాల్యం.

భగవంతుడు కూడా ఇష్ట పడే

బంగారు బాల్యం...


అదో  వెండి వెన్నెల్లు,తేనె పట్టు లాంటి 

చల్లని తీయని బాల్యం!

10

[31/10, 8:57 PM] విజయ లక్ష్మి యాదాద్రి: *బాల్యం*

****************

బాల్యమే అపురూప వరం

జీవితాన మధుర జ్ఞాపకo

బాల్యం చిలిపిపనుల పర్వం

భాద్యతలెరుగక చిందులేసే ప్రాయం


ఆనాటి బాల్యం అనుభూతుల స్వర్గం

ఈనాటి బాల్యం మనదృష్టిలో వ్యర్థం

'నెట్'తో గడిచే నేటి బాల్యం 

'వలలో చిక్కిన చేప'ని మన భావo


నేటి బాలలకేమో 'నెట్'సమయమే బంగారం

మారిన తరాలతో పిల్లలు మారుట సహజం

మంచి మార్పు ఎపుడైనా ఆహ్వాననీయమే

సాంకేతిక పరిజ్ఞానం ప్రశంసనీయమే


బాల్యం తన సహజ జీవ లక్షణాలను             కోల్పోతుందనేదే పాతతరాల వేదన

పిల్లలంటే ఆరుబయట ఎగరాలి దుమకాలి  

ఆడాలి ఓడాలి నవ్వాలి ఇంకెన్నో చేయాలి


చిన్నకుటుంబాల్లో అమ్మానాన్నతోనే  ఉంటూ 

అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మల వెంట

తిరిగే అవకాశం అదృష్టం-దుర్లభం

అందుకు పిల్లల్ని తప్పుపట్టడం అన్యాయం


తోటలోని మొక్కలంటి చిన్నారులు

మనమెలా పెంచితే అలా పెరిగే ప్రాణులు

మన అతి ఆశల్ని వాళ్లపై రుద్ధకుండా

చదువులతో ఉక్కిరిబిక్కిరి చేయకుండా 


పసివాళ్లను స్వచ్ఛప్రేమతో పెంచగలిగితే

మన తల్లిదండ్రులకు సంరక్షకులం కాగలిగితే

వారితో గడిపే పిల్లలకు బాల్యం మధురవరమే  

జీవితాంతo వాడిపోని సంతోషపరిమళమే


పదిలపరుద్దాం తరతరాల తీపిబాల్యాన్ని

వారసత్వంగా ఇద్దాం మనవారి అనుభవాలను

అదే కదా మనమివ్వగల అసలు సంపద

అపుడే కదా మానవజాతి బాల్యానికి భద్రత


;వల్లాల *విజయలక్ష్మి*

ఆలేరు

11

[31/10, 9:05 PM] Anitha Aitha Poetess: *కవితా గానం*

అంశం: బాల్యం

శీర్షిక: *తిరిగి ఇచ్చేద్దాం..!*


ఏటిగట్టుపై

బూగలను పట్టిన ఆ...బాల్యం!

తోటల్లో తిరుగుతూ

పూలు తెంపిన  ఆ..చిలిపితనం..!!


పుస్తకాల్లో 

నెమలీకలు దాచిన ఆ..బాల్యం!

అగ్గిపెట్టెలో

పట్టుపురుగులను పెట్టిన ఆ..అమాయకత్వం!!


కాకెంగిల్ల అనురాగం

చిట్టిపొట్టి అలకల మమకారం

అరుగుపై ఆడిన అష్టాచెమ్మలు

సోరబుర్రలతో చెరువులో ఈతలు

మధుర అనుభూలతులన్నీ మరుగనపడే..!

కంప్యూటర్లు వచ్చి ఆటలసందడి తగ్గే..!!


పుస్తకాల మోతకు వీపులు వాచే..!

ఆధునిక బోధనతో ఒత్తడిపెరిగే..!!


తిరిగి ఇచ్చేద్దాం

నేటి బాలలకు...వారి అమూల్యబాల్యం!


రచన

అయిత అనిత

జగిత్యాల

12

[31/10, 9:11 PM] Dandamudi శ్రీచరణ్: కవితాగానం

   అంశం: బాల్యం  

  శీర్షిక *పుస్తకంలో పుటలు!*

---------------------------------

బాల్యాన్ని

కడలి తీరాల్లోని ఇసుక గూళ్లలో

కోల్పోయాను!

వర్షంలో వదిలిన కాగితప్పడవల్లో

బాల్యం కొట్టుకుపోయింది!

తూనీగలు వాటి రెక్కలతో

బాల్యాన్ని తీసుకుపోయాయి!

బొమ్మ విరిగితే కార్చిన కన్నీరు,

ఇపుడు తుడుచుకుంటున్నాను,

నా హృదయం విరిగి ముక్కలైతే!

వీధుల్లో పీచుమిఠాయి కోసం వెతికితే,

కన్నీళ్లకు కాక్టెయిల్ చేసి నాకందించారు!

మంచురుతువులో వెలిగించి,

చలి కాచుకునే మంటలు,

ఇపుడు నా గుండెల్లో!

భుజాలపై చేతులు వేసుకొని తిరిగిన నేస్తాలు,

ఇపుడు ఆ చేతుల్ని జేబుల్లో దాచుకుంటున్నారు!

చిన్నప్పుడు ఇంటినుండి పారిపోయి

దాక్కున్న నా ఒంటరితనం,

ఇపుడు నా తోడయ్యింది!

చెప్పుకునేందుకు కాగితాలు,

విందామంటే వాయులీనాలు,

విషాదం ఓ జీవనస్వరమయ్యింది!

పెరటిలో పక్షుల కువకువలూ,

కిటికిలోకి చంద్రకిరణాలు

ఏకాంతంలో పలకరింపులయ్యాయి!

నేను చివరి పుటలు చిరిగిన

పుస్తకమయ్యాను!

నా నీడకు నేను

నేస్తాన్నయ్యాను!!

--- *దండమూడి శ్రీచరణ్*

9866188266

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...