Skip to main content

మౌన పాఠాలు అక్టోబర్ 2020


నిర్వహణ

లలితా కృష్ణ

వెన్నెల శిల్పం సృష్టి కర్త

వీరా గుడిపల్లి

The mathematics teacher and poet

**************************

1.వీరా గుడిపల్లి గారు

2.కోరాడ గారు

3.మన్నె పిన్నక లలిత గారు

4.సుధారాణి కృష్ణం రాజు గారు

5.కె.సి.నరసయ్య గారు

6.ఇంద్రావత్ రాహుల్ గారు

7.వినీలమ్మ 

8. సునంద వురిమిళ్ళ గారు

9.మర్రి జయశ్రీ గారు

10.శివునూరి లలితా కృష్ణ గారు

11.కోరాడ గారు

12.భరద్వాజ గారు

13.భూపతి గారు

14. నారాయణ భాగ్యలక్ష్మి గారు

15. సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు

16.సంధ్యా శర్మ గారు

17. సుధారాణి కృష్ణంరాజు గారు

18.రాపోలు అరుణా స్వామి గారు

19.వల్లాల విజయ లక్ష్మి గారు

*************

1
*ఇది వీరా గుడిపల్లి కవిత*
16102020
అంశం ః మౌన పాఠాలు
***********************
ఈ రోజు మా ఆవిడ పుట్టినరోజు
అంశమేమో...మౌన పాఠాలు
ఎలా కనెక్ట్ చేయాలో ఆలోచించా ప్రయత్నించా..... ఫలించిందో లేదో...
********************
శీర్షిక ః పండగే మరి
******************
ఆ నవ్వు
ఆచూపు
ఆ అలక
ఎప్పుడూ ఒక పాఠమే నాకు
అర్థం కాని ప్రశ్న గా దర్శనమిస్తుంది
మౌన పాఠాల కర్మాగారం తాను
ఆన్లైన్ లో పాఠం మల్లే...
నిరసన కూడా నిర్మలంగా తెలిపే సాహసి
శిక్ష వేసేందుకు కూడా వెనుకాడదు

రెండు కన్నీటి బొట్లు రాల్చి
నన్ను నిలువునా వణికిస్తుంది
అలా రెప్పలు వాల్చి భయపెడుతోంది
పెదాలు విప్పకుండా
పాఠాలు చెప్పడం తనకే తెలుసు

కాదనకుండా
మెప్పించడం తెలిసిన కళ్ళు
అనుకున్నది
సాధించడం తెలిసిన ఆ నవ్వు

ఆ మౌన పాఠాలకు సెలవన్నది లేదు
ఈ విద్యార్థికి
ఫెయిల్ అవడం తెలియకుండా చేసిన
తన పుట్టినరోజు

*అక్టోబర్ పదహారంటే*

నాకు పండగే మరి.
జీవిత భాగస్వాములమే ఐనా
కృష్ణ సాందీపుల, ద్రోణార్జునుల
బంధం మాది
ఎవరి పాత్ర యేమిటనేది ఎప్పటికీ సందేహమే
అటీటవుతుందెప్పుడూ
.....  *వీరా గుడిపల్లి*

2

[16/10, 8:03 PM] Korada: కవితాగానం

అంశం:- 

మౌన పాఠాలు(కవిత)

కోరాడ నరసింహా రావు !

"వినిపించుకుంటుందా.!"

 ******************

గతాను భవా లన్నీ....

మౌన పాఠము లై....

మనసుకెంత బోధిస్తున్నా  

దాని గోల దాని దే....!

దాని కాంక్ష తీరదు.....

ఆ తీరు మారదు....!!

జీవితం నేర్పిన పాఠా లెన్నో....గుణ పాఠా లవి

ఎన్నెన్నో....!

ఆ సించిందొకటి.....

చేసిన పని మరొకటి ....

అనుభవించవలసిన 

ఫలితం వేరొకటి గాక ...

 మరేమవుతుంది...!!

కోరుకున్న కోరికను ఎలా గైనా తీర్చేసు కోవాలను కునే తపన...పెడత్రోవలు  పట్టిస్తుంటే ...ఆశించినఆనందపు హర్మ్యం  ఎలా చిక్కుతుంది  !? దుఃఖ భోజనమే దక్కుతుంది!

అందుతుందికదా అని...

అడ్డ గోలుగా...అడ్డూ  -అదుపూలేకుండా...ఆబగాతినేస్తే ....అజీర్తిచెయ్యక...మరేమవుతుంది...!!

అది నిండు జీవితాన్నే నాశనంచేసేసి ...ప్రాణాలనే  హరించేయ వచ్చు !!

కళ్ళముందు...ఎన్నెన్నిజీవితసత్యాలు...పాఠాలై 

పరోక్షంగా బోధించినా...

ప్రత్యక్ష గుణపాఠాలై...  వేధించినా !,వినిపించు కోలేదు కదా ఈ మనసు!

యిప్పటికైనా...ఈ మన సు చెప్పే మౌన పాఠాల నైనా...వినిపించుటుందా......ఈ మనసు...!  

********************

.....కోరాడ.

3

[16/10, 8:13 PM] +91 74168 63289: కవితాగానం.

 పేరు:మన్నె పిన్నక లలిత.

తేదీ:16 /10 /2020

 అంశము :మౌన పాఠాలు.

 శీర్షిక :మనో పోరాటం.


 ఒంటరి తనముతో మనసులో ,మనో పోరాటం చేస్తున్నా/

 మనసులో  ఉన్మాదపు వ్యధ,ఒళ్ళంతా అనుభవిస్తుంది లిపి లేకుండా/

 అనునిత్యం ప్రాణం మౌన వ్యథ  /

 శుష్కించిన శరీరము, ఆక్రోశిస్తున్న ఆత్మ/

  వీడని బాసటకై పరితపిస్తూ / 

ఉద్వేగభరితమైన మనసు,  కల్లోలము రేపుతూ ఉంటే /

అలసిన నా ప్రాణములో ఆశల గూడు  కట్టుకున్నా/

 మాటల తూటాలు తూట్లు పడి రక్తం స్రవిస్తున్న వేళ/    రుధిరాగ్ని ధారను ఏవగించుకుని /

గుండెలో  పెరిగి కకావికలైన హృదయఖండాలను చిక్కబట్టుకుని / 

"పునరపిజననం, పునరపి మరణం" జీవిస్తూ మరణించు మరణంలో జీవించు" /

  బంధుమిత్రులందరితో మౌన పాఠాలు నేర్చుకుని /

 మనోపోరాటం చేస్తూ, ప్రాణము లేక జీవిస్తున్నా.

4


[16/10, 8:48 PM] +91 74165 92715: 🙏🙏 కవితా గానం🙏🙏

సుధారాణి కృష్ణంరాజు

అంశం:"మౌనపాఠాలు"

16-10-2020

మౌనం అనేది అనేక సందర్భాల్లో ఒక ఔషధంగా పని చేస్తుంది

మౌనం అంగీకారం అని

మౌనేన కలహం నాస్తి

ఎవరైనా ఇతరులతో గొడవ

పడినప్పుడు ఎదుటివారు

మౌనం వహించి నట్లయితే

ఆ గొడవ సమసి పోయే అవకాశం ఉంది

అలా అని పోలీసులు దొంగ తనం చేశాడన్న అనుమానం తో అరెస్టు చేసి నప్పుడు

మౌనం వహించి నట్లయితే

లాఠీలతో పాఠాలు నేర్చుకోవాల్సిందే

చేయని నేరం మౌనం కారణంగా అతని జీవితంలో

గుణ పాఠం అవుతుంది

మౌనం అనేది పాఠానికి

గుణ పాఠానికి కారణం

అవుతుంది

గొడవ పడే భార్య మౌనం వ్రతం

కారణంగా

నోరు విప్పలేదు అంటే ఆరోజు

ఆ భర్తకు మహదానందం

రోజు భార్య మౌన వ్రతం

చేస్తే బాగుంటుంది కదా

అనుకునే భర్త

పక్కింటావిడ వచ్చి అప్పు

అడిగి నప్పుడు

భర్త మౌనం వహించి నట్లయితే

తీసుకున్న డబ్బు వెనక్కి రాక

పోతే ఆ మౌనం గుణపాఠం

నేర్పినట్టే

మౌనం అనేది సందర్భాన్ని

బట్టి పాఠాలు నేర్పుతుంది

అనటంలో ఏమాత్రం

సందేహం లేదు🙏👍

5

[16/10, 8:55 PM] KC Narsaiah KS 26: కవితా గానం


 అంశం: మౌన పాఠాలు

 కట్టెకోల చిన నరసయ్య

 చరవాణి: 7981814784


  రాజ్యంలో

 ఇప్పుడంతా మౌనమే

 ఇష్టా రాజ్యపాలనలో

 కష్టాలకు అలవాటు పడ్డ వాళ్ళం

 ప్రశ్నించే ప్రతిపక్షం

 అవకాశవాదంతో

 ఆచితూచి వ్యవహరిస్తోంది

 ప్రార్థనలు చేస్తున్న ప్రతిజ్ఞలు

 ఆత్మ విమర్శ చేసుకోలేక పోతున్నయి

 నీతి అవినీతి చర్యలలో

 ఇప్పుడు

అవినీతి రాజ్యాన్ని శాసిస్తుంది

 అవును

 ఓటుకు నోటు గాంభీర్యతలో

 ఓటు మౌనం వహించి

 సీటు కింద చేరి

 కుక్కిన పేనులా పడివుంది

 చట్టసభల ప్రమాణ స్వీకారాలు 

 కరెన్సీ తులాభారంలో సవాల్ చేస్తున్నయి

 ఇప్పుడందరూ

 మౌన పాఠాల శిక్షణా తరగతులకు

 సమాయత్తమవుతున్నారు

6

[16/10, 9:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం*

============


అంశం : మౌనపాఠం 

శీర్షిక : మౌనం 

తేది : 16/10/2020


 

         *మౌనం*        



మౌనం మామూలు మనుషులకు

పరమ చిరాకు పదం

మహానుభావులకు  మహా అద్భుత భావం

మహర్షులకు మౌనమే లోకం

మాటలు మంత్రాలు అయితే

మౌనం వేదం అవుతుంది

అర్థాయుష్షుకు కారణం 

అధిక ప్రసంగం అయితే

నిశ్శబ్దం నూరేళ్ళ  ఆయుష్షును నిలబెడుతుంది మొరిగే కుక్క కరవదు అన్నట్లు

అతిగా వాగే వారి దగ్గర

అసలు విషయం ఉండదు 

అందుకే మౌనమే సమాధానం.. 



*ఇంద్రావత్ రాహుల్* 

      *కొత్తపేట్*

 *నిజామాబాద్*

9848054079..

7

[16/10, 9:09 PM] Vineelamma: కవితాగానం

పేరు: విజయదుర్గ

కవితా శీర్షిక : మౌనపాఠాలు

కవితా సంఖ్య: 32

తేదీ: 13/10/20 


అలుపెరగని కాలం బడిలో

ఎన్ని పుస్తాకాల పుటలో

శాశ్వత ముద్రలేసుకొని

హృదయగగనాన అర్దం కాని పాలపుంతే....!!


అక్కడ నిశ్శబ్ద మే పరుచుకొని

వేల ప్రశ్నలకు జవాబై

అంతర్గత శోధనల పేజీలే....!!


ప్రకృతి చలనరహితమైనా

మానవులకు సందేశాత్మక పాఠశాలలు

మౌనపాఠాలను తెలిపే జీవనగతులు....!!


అర్దం చేసుకునే మనసు

మౌనాన్ని మాటాడించే హృదయం

బతుకు బండిని ఆ బాటలో

నడిపే సాహస తేజం....!!



                             🌹వినీల🌹

8

[16/10, 9:17 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*

తేదీ:16-10-2020

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం::మౌన పోరాటం

*****************

చూస్తున్నా ఓ తరువును

వీక్షిస్తున్నా ఓ తరుణిని

ప్రవహిస్తున్న  నదిని..

చేస్తున్న మౌన పోరాటాన్ని..

ఇంటికి దీపమై వెలుగుతూ

కంటి రెప్పలా కాపాడుతూ

వంచిన నడుమమెత్తకుండా

చాకిరి చేస్తున్నా...


కరివేపాకులా తీసేస్తున్న 

బంధాల నిర్లక్ష్యాన్ని గమనిస్తూ

పెదవి విప్పక ప్రేమ పంచుతూ

ఎప్పటికైనా మార్పు రాదా అని

అమాయకంగా ఆలోచిస్తూ

మౌన పోరాటం చేస్తుందా తరుణి!


ఊపిరికి ఉషస్సులు అద్దుతూ

కళకళలాడే జీవితాన్ని ఇవ్వడానికి

కాయలు పండ్లు ఫలాలు పంచుతూ

ఎండా వాన చలి నుండి కొమ్మల రెక్కలు చాచి  

సర్వం సమర్పించే తరువు!


సాధు సంపన్నత మణిహారంగా  

అణువణువూ ధరించిన తరువు!

సమాజానికి అమూల్యమైన కల్ప తరువు!


మహాసంద్ర మస్తిష్కంలో ఆలోచనల ఆటుపోట్లు

పెదవి విప్పితే ఉలికి పాటు 

మానవీయ ఫలితాల మార్పు కోసం

చేస్తున్న మౌన పోరాటాలు..

నోరు లేని మనసు మనసు లేని నోరు

చూడలేని హృదయం

పల్లవించే ప్రకృతి.. నేర్పే పాఠాలు..

 ఆశల పాశాలతల సాక్షిగా

చేస్తున్న మౌప పోరాటాలు..

9

[16/10, 9:21 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..మౌన పాఠాలు


మౌనం అర్దఅంగీకారం అన్నట్లు

ఇప్పుడంతా మౌనమే ఎక్కడ చూసినా

ప్రశ్నించినా జవాబు దొరకని చిక్కుముడులకు

మౌనమే సమాధానమైంది

స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా

మౌనమే గొప్పది కొన్నిసార్లు

అలాగని మాట్లాడవలసి వచ్చినప్పుడు మౌనం వహించడం

మౌనం వహించాల్సినప్పుడు మాట్లాడటం రెండూ బలహీనతలే కదా

మౌనం ఎన్నో సమస్యలకు ఔషధం

మనసుకు శరీరానికి విశ్రాంతి

మౌనముఎన్నో పాఠాలను బోధిస్తుంది

అర్థం చేసుకునే మనసులకే

ఆ పాఠాలు బోధపడుతాయి

జీవిత అనుభవాలై

మహా శక్తి వంతులను చేస్తూ

ముందు దారి చూపుతాయి

10

అంశం :మౌనపాఠాలు 

ఆ చిరునవ్వే... కదా !!!

చిత్తలూరి గంభీర స్వరానికి వరం 

ఆ మందస్మితమే.. కదా !!!

బహుముఖ ప్రజ్ఞాశాలికి అందమైన బంధం 

ఆ దరహాసమే...  కదా!!!

మేరునగధీర *వీరుడికి* స్థైర్యం 

ఆ సురుచిర దరహాసమే.. కదా !!! 

గణితావధాని ఆశయసిద్ధికి ఆలంబనం 

ఆ ప్రపుల్లహాసమే... కదా !!!

మౌనముని శిష్యునికి మౌనపాఠాలు నేర్పిన

సహృదయతకు....  ప్రసన్నతకు ప్రతిబింబం

******లలితాకృష్ణ

11

అంశం :మౌనపాఠాలు 

మధుర స్మృతులపుటల్ని మళ్ళీ మళ్ళీ తిప్పేలా చేస్తావ్ 

అనుభూతుల పరిమళాల ఆస్వాదనలో మైమరచేలా చేస్తావ్


మంద్రంగా మనసు తీరాన్ని తాకే  

ఆనందాల కెరటపు సంద్రమవుతావ్ 

మధుర జ్ఞాపకమవుతావ్

 

అంతలోనే.. 

సునామీలను సృష్టిస్తావ్

ఆగ్రహాల ఆటు పోట్లు కల్గిస్తావ్ 



మనసుకు ఎన్నెన్నో శస్త్ర చికిత్సలు చేస్తూ 

మౌనపాఠాలు నేర్పుతావ్ 


కన్నీటి జడివానలో ముంచేస్తావ్ 

నీవే... 

ఓదార్పులగొడుగులనూ...  పడతావ్  


కాఠిన్యం.. దాక్షిణ్యం..రెంటినీ  కలుపుకున్న 


కాలమా... !!!ఇంకెన్నెన్ని  చిత్రాల్ని  చూపిస్తావో... .. !!!!

************లలితాకృష్ణ

11

[17/10, 8:10 PM] Korada: కవితాగానం

అంశం:- 

మౌన పాఠాలు(కవిత)

కోరాడ నరసింహా రావు !

"వినిపించుకుంటుందా.!"

 ******************

గతాను భవా లన్నీ....

మౌన పాఠము లై....

మనసుకెంత బోధిస్తున్నా  

దాని గోల దాని దే....!

దాని కాంక్ష తీరదు.....

ఆ తీరు మారదు....!!

జీవితం నేర్పిన పాఠా లెన్నో....గుణ పాఠా లవి

ఎన్నెన్నో....!

ఆ సించిందొకటి.....

చేసిన పని మరొకటి ....

అనుభవించవలసిన 

ఫలితం వేరొకటి గాక ...

 మరేమవుతుంది...!!

కోరుకున్న కోరికను ఎలా గైనా తీర్చేసు కోవాలను కునే తపన...పెడత్రోవలు  పట్టిస్తుంటే ...ఆశించినఆనందపు హర్మ్యం  ఎలా చిక్కుతుంది  !? దుఃఖ భోజనమే దక్కుతుంది!

అందుతుందికదా అని...

అడ్డ గోలుగా...అడ్డూ  -అదుపూలేకుండా...ఆబగాతినేస్తే ....అజీర్తిచెయ్యక...మరేమవుతుంది...!!

అది నిండు జీవితాన్నే నాశనంచేసేసి ...ప్రాణాలనే  హరించేయ వచ్చు !!

కళ్ళముందు...ఎన్నెన్నిజీవితసత్యాలు...పాఠాలై 

పరోక్షంగా బోధించినా...

ప్రత్యక్ష గుణపాఠాలై...  వేధించినా !,వినిపించు కోలేదు కదా ఈ మనసు!

యిప్పటికైనా...ఈ మన సు చెప్పే మౌన పాఠాల నైనా...వినిపించుటుందా......ఈ మనసు...!  

********************

.....కోరాడ.

12

[17/10, 8:27 PM] భరద్వాజ గారు: 🎻కవితాగానం 8🎷

నేటిఅంశం- మౌనపోరాటం   

తేదీ -17-10-20

శీర్షిక - మౌనం నిజంగా మౌనమే ..!

నిశిరాత్రి చేస్తుంది పోరాటం-

 చీకటివదిలించుకునేందుకు -

మౌనంగా వీస్తుందిగాలి తన వంతు కర్తవ్యంగా -

నిశబ్దం రాజ్యమేలుతుంది జగతిలో 

రేపటి ఉషోదయం కోసం  -

గతాలనిన్నను మరచి మౌనంగా నిదిరిస్తున్నాడు మనిషి -

రేపటిఆశల వె లుగుకోసం పోరాటంచేస్తూ -

ప్రపంచానా ప్రతిదీ మౌనంతోనే సాగుతుంది -

శబ్దం నిశ్శబ్దాన్ని భేదిస్తే -

పారిపోతుంది మౌనం -

గుండెకు మాటల గాయం అయినపుడు 

మౌనం గా  రోదిస్తుంది గుండె -

కన్నీటిబొట్లసంకేతాలనుచిమ్మి -

మౌనంఅర్ధాంగీకారం అయినా -

ఇష్టంలేని జవాబు అది -

బంధాలను బాధ్యతలను తెలుసుకుంటే -

మౌనంకంటే హాయి ఏముంది -

మునులకు మౌనం అలంకారం-

స్వాతంత్రానికి అదే మూలం -

మౌనం తెలియని మనిషి 

చెట్టు ఉండవు -

ఒక్కోసారి మౌనం మాట్లాడుతుంది -

మౌనానికి సహనం పోతే ప్రళయమే ..!

మేధావులమౌనం దేశ  వినాశనం -

సముద్రంకన్నా మౌనంగొప్పది -

మౌనపోరాటం ప్రతివానికి ఆచరణయోగ్యం -



ఇదినాస్వీయరచన 

భరద్వాజరావినూతల (RB)🖍️

కొత్తపట్నం 9866203795

ప్రకాశంజిల్లా

13

[17/10, 8:29 PM] Bupathi Sir: ......మౌన పాఠాలు.......


మనో నేత్రం మౌన పాఠం

దిశలు.... దశలు.... సాగిస్తోంది

ఒక కొత్త రూపం ఆవిష్కరించాలంటే....దానికి

మేధావుల సంస్కరణ ఆచరణ

తో కూడిన మౌనమే....

దిక్కులు పిక్కటిల్లే సంఘటనల

సంఘర్ష ణ లలో ,దిక్పాలకులైనా ,

ఎదురోడ్డే స్థితి లేనప్పుడు

మౌన యుద్ధం లో

యు

వ్యూహాలు అనివార్యం... ఒక

గెలుపుకు ఆవేశం తో అరుపులతో సాధించ లేని స్థితి

వచ్చు నేమో కానీ ,మనో

నేత్రం విప్పిన మౌన  పాఠం

ద్వారా ఎన్నో విజయాలకు

సంకేతం......

14

[17/10, 8:34 PM] Bhagya Laxmi Kanipakam Poetess KS 42: కవితా గానం

నారాయణ భాగ్యలక్ష్మి

కవితా శీర్షిక:


మౌనంపాఠం మనిషికి గుణపాఠం

****************************

వినగలిగే మనసుంటే 

జగమంతా నాదమయం 

మనసుకే కను చెవులుంటే

ప్రకృతి అణువణువు జీవనవేదం


మాటలకందని బావనలు

మనసు లోతుల్లో నిక్షిప్తం

ఎంత ఎదిగినా ఒదిగుండడం

తరువు మౌన సందేశం 

మనిషికి పాఠమేగా


ఉరుముల మెరుపుల మబ్బులతో

అంధకారం కమ్మినా మబ్బుకరిగి 

వాన కురిసాక నిర్మల నీలాకాశం 

కష్టాలు కలకాలముంవని

మనిషికి తెలిపే మౌన పాఠమేగా


నిత్యం ప్రాణికోటికి జీవనాధారమై 

సాగే నదీ ప్రవాహం నిస్వార్ధ తత్వం

మనిషికి మౌనపాఠమేగా


పరిస్థితి ఏదైనా తిమిరాన్ని తరిమి 

వెలుగులు పంచే సూరీడి దినచర్య 

బద్ధక మెరుగని క్రమశిక్షణ 

మనిషికి మౌనపాఠమేగా


నిలువునాతొలుస్తున్నా ఓర్పుకురూపమై  అతియైతే భూకంప సునామీలతో అతలాకుతలం చేసే పుడమి సహానం మనిషికి మౌనపాఠమేగా


మితిమీరిన అత్యాశ చెరువులకబ్జాతో మేడలుగా వెలసిన వాడల ఆవాసం

వాననీళ్ళ వరదకు గుర్తుకొచ్చె తమవసం

ఇదీ మనిషికి మౌన పాఠమేగా


తల్లిగర్భంలో పిండందశ నుంచే

పసికందు మౌనం బాషాజాలం

ప్రేమికుల కనుల మౌన చేతలు

అంతుచిక్కని అదో మాయాజాలం 


మాటలురాని పసి బుజ్జాయిల 

బోసి నవ్వుల యోగమాయలో 

మురిసిపోని మనసుండదుగా 

మౌనపాఠం మనసుకు గుణపాఠం.

15

[17/10, 8:40 PM] STTRao Kama Reddy Poet: అంశం...మౌనపోరాటం

శీర్షిక.. మౌనము


మౌనము శక్తివంతమైనది

మౌనపోరాటము ద్వారా విజయాలు

సాధించవచ్చు సమస్యలను చేధించవచ్చు

మౌనముగా ఉన్న మనిషి చేతకాని

తనానకి వారసత్వము కాదు

మౌనములో అంతర్ధానం ఎంతో ఉంది

కొన్న కష్టాలలో మౌనముగా ఉండాలి

మౌనమేగా అంతరాలను కలుపుతుంది

మౌనము అణచివేతను హరిస్తుంది

ఏ ఆయుధము లేకుండా మౌనము

అనే ఆయుధము ద్వారా మనస్సును

చేదిస్తుంది అనుకొన్న లక్ష్యాన్ని సాధిస్తుంది

మౌనము మనసు శక్తిని పెంచుతుంది

గుండె గాయాలను మాన్పుతుంది

మౌనము అల్లకల్లోలము సృష్టించిన

బాధలకు ఉపశమనం కలిగిస్తుంది 

మౌనముగా ఉన్న మునీశదవరులకు

ముల్లోకాలను శాసించేశక్తి లభిస్తుంది


సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు

కామారెడ్డి

చరవాణి9494162571

16

[17/10, 8:46 PM] Sandya Sharma Poetess: కవితాగానం


అంశం: మౌన పాఠాలు


వై.కె.సంధ్యశర్మ



చంద్రుడు ....


మౌనపు వెన్నెల వాహిని


నిన్న నేడు రేపు


రాత్రులెన్నైనా...మనసు పలకపై


చుక్కల కుంచెను


సరిచేస్తూ తారా తీరంలో


మౌన ముద్రలో సడి చేయక


ప్రేమ యుగాలను ధార పోస్తుంటాడు...


సూర్యుడు....


వెలుగుల కిరణాల గని


నిత్యం  ఎదురు చూసే నేస్తాలకు


ఉదయాస్తమయాలను


మౌనంగా పరిచయం చేస్తూ...


గగన చుబుకంతో


మబ్బులను తప్పుకుని


సేదతీరుతుంటాడు......


ప్రకృతి...


ఇంద్రజాలపు ఒరవడి


చిగురాకుల చిద్విలాసం


పండుటాకుల పరిమళం


పొదువుకున్న వసంతాల కేళిని


... ఆస్వాదిస్తూ


అనుభవాలసారాన్ని


అజ్ఞాన పరాభవాన్ని మోస్తూ


మౌనంగా విత్తు రాలిన చోటే

పచ్చల హారంతో 

అమృతాన్ని కురిపిస్తుంది!

జీవిత పాఠాలన్నీ మౌనంగానే

నసు తెమ్మెర సమీక్షిస్తుంది!

17

🙏🙏కవితాగానం🙏🙏

🙏సుధారాణి కృష్ణంరాజు🙏

అంశ:"మౌన పాఠాలు"

మౌనంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి

ఒక వృక్షం ఆకులు పూవులు కాయలు పండ్లు ఇస్తుంది

కానీ ఎలాంటి సవ్వడి చేయకుండానే తన పని తాను

చేస్తుంది

దానిని చూసి తెలుసుకోవచ్చు

మౌనం గా ఉంటూనే మరొకరికి

మేలు చేయవచ్చు అని

జీవితంలో అనేక పాఠాలు మౌనం ద్వారా కూడా సాధ్యం

వెన్నెల ప్రపంచ మంతా వెలుగు ను పంచుతుంది ఎలాంటి శబ్దం

చేయకుండానే

ఏకాగ్రతతో ధ్యాన ముద్రలో మౌనం గా కూర్చొని ధ్యానం

చేసి నప్పుడు మనకు ఆ పరమాత్ముని దివ్య దృష్టితో

తిలకించుటే కాకుండా

ఆరోగ్య పరంగాను జ్ఞాపకశక్తిని

పెంచుకునే విధంగా కూడా

ఈ మౌనం ద్వారా జీవిత పాఠాలు నేర్పుకునే అవకాశం

ఉంది

మనం నడుస్తున్నప్పుడు మన వెనక మన నీడ మౌనం గానే

నడుస్తుంది

అతిగా లాగే వారికన్నా మౌనం గా పనులు చేసుకునే వారి ఆయుష్షు కూడా ఎక్కువే

ఈ‌ విధంగా మౌనం మనకు

ఎన్నో జీవిత పాఠాలను నేర్పుతుంది 🙏👍

18.

[18/10, 8:59 PM] Rapolu Aruna Siripuram Poet: *కవితాగానం*

శీర్షిక:మౌనంతో గెలువు


ఒక్కతెలువు రంగునుండి

ఏడురంగులు ఏర్పడి నట్లుగా

ఒక్క మౌనం నుండి

ఎన్ని భావాలు పుట్టుకొస్తాయో


వేళ్ళూనిన మహా వృక్షమైనా

చిన్న బీజం నుండి

మౌనంగా ఎదుగుతుంది


చల్లని చందమామ

కురిపించే వెన్నెల

మౌనమై ప్రకాశిస్తుంది


కొమ్మలో పూసిన గులాబీ

మౌనంగా 

కమ్మని పరిమళాలు గుప్పిస్తుంది


మోనం మనిషిని మనీషిగా నిలబెడుతుంది

మహర్షిని చేస్తుంది


సత్యశోధనలో

నిత్యసాధనమై

అన్వేషిస్తుంది

కొత్తదనాన్ని ఆవిష్కరిస్తుంది


మౌనం మహా సంద్రాన్ని తలపిస్తుంది

మౌనం వేయి రాగాలను పలికిస్తుంది


అసాధ్యాలను సుసాధ్యం చేయగల శక్తిని ప్రసాదిస్తుంది


అచంచల విజయాలకు దారులు తీస్తుంది

మౌనం ఓర్పు, సహనానికి పరాకాష్టగా నిలిచి వజ్రాయుధం గా పనిచేస్తుంది


మౌనం నేర్పిన పాఠాలు

మనసారా విందాం

మనగమ్యం వైవుకు

మౌనంగా సాగుదాం

✍రాపోలు అరుణాస్వామి,

సిరిపురం, యాదాద్రిజిల్లా

8328277215

19

[18/10, 9:30 PM] విజయ లక్ష్మి యాదాద్రి: *మౌన పాఠాలు*


చిన్న నాటి నుండి విన్నాను

మాటల పాఠాలెన్నో!

స్పృహ కలిగినప్పటి నుండీ

వింటున్నాను మౌనపాఠాలెన్నో


సదుద్దేశంతో పాఠాల బోధించిరి

నా గురువర్యులె0దరో!

అన్యాపదేశంగా భోధపడుతున్నవి 

జీవితాంతం మౌనపాఠాలేవో!


బుసకొట్టే స్వార్థపు మానవ నాగులు

విష0 చిందే అసూయల పడగలు

కాటేసే కనపడని విషపురుగులు

 నేర్పిస్తున్నవి మౌన పాఠాలేవో!


వల్లా ల విజయ లక్ష్మీ

ఆ లె రు

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...