Skip to main content

స్వాతంత్ర్య దినోత్సవం 15/08/2020



నిర్వహణ
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
శివునూరి లలితాకృష్ణ
మెరుగు మధు
ఐతగోని వెంకటేశ్వర్లు
********************

Singer మన కవితా గానం సమన్వయకర్త
శివునూరి లలితాకృష్ణ గారు.

కవి వరుల జాబితా
1.ఇంద్రావత్ రాహుల్ గారు
2.శ్రీహరి ఏలె గారు
3.పురుషోత్తం రెడ్డి గారు
4.స్వర్ణ సమత గారు
5.సునీల్ యాదవ్ గారు
6.వల్లాల విజయ లక్ష్మి గారు
7.సర్ఫరాజ్ అన్వర్ గారు
8.డాక్టర్ ఆంజనేయులు గారు
9.మర్రి జయశ్రీ గారు
****************
1.ఇంద్రావత్ రాహుల్ గారు
2.
[14/08, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం*
✳️✳️✳️✳️✳️✳️


*అంశం* :  స్వాతంత్ర దినోత్సవం
 *శీర్షిక* : మన స్వాతంత్రం
  *తేది*:  14/08/2020

  *మన స్వాతంత్రం*

స్వాతంత్రం వచ్చింది
సంబరాలు తెచ్చింది
పసిడి వెలుగు నింపింది
దేశం ఎంతో మెరిసింది
మన జెండా ఎగిరింది
దేశభక్తి ఎగిసింది
నవశక్తి కదిలింది
అది మనకు ఎంతో నచ్చింది
జాతిపిత గాంధీజీ
మన నేత నెహ్రూజీ
వీర శక్తి అల్లూరి
వీర నేత నేతాజీ
ఆగస్టు 15 అందరికీ నవోదయం దేశానికి శుభోదయం
భరతవని  పర్వదినం
చరిత్ర చూస్తే వీరగాధ....

*హామీపత్రం* : ఈ కవిత నేను స్వయంగా రాశాను... అని హామీ ఇస్తున్నాను...


*ఇంద్రావత్ రాహుల్*
     *కొత్తపేట్*
   *నిజామాబాద్*
   9848054079
2
[14/08, 8:03 PM] Sreehari Ale: జై హింద్  !              జై భారత్ !!

పేరు :శ్రీహరి. ఏలె
ఊరు :నల్లగొండ
చరవాణి : 96406 91884
శీర్షిక : స్వాతంత్ర్య భారతి - సాహిత్య హారతి

**********************************

రవి అస్తమించని సామ్రాజ్యంపై చైతన్య చేతనం
సత్యాగ్రహ, అహింసల జయ కేతనం

వందేమాతర గీతం విజయానికి ఆనతి
స్వాతంత్ర్య భారతికి సాహిత్య హారతి

కాంతులీనే కాశ్మీరం భారత మాత అలికం
శోభిల్లెను విశ్వమంతా త్రివర్ణ తిలకం

నాటి స్వాతంత్ర్య సమరపు ఆశయాల యుక్తి
మన ఎదలో దాచుకున్న ఋణభావమే దేశభక్తి

సమర భేరిలో జాతీయ నాయకుల ఆత్మర్పణం
వారి అసమాన త్యాగనిరతికిదే దర్పణం

జన వాహిని నినదించే నిత్యం ఆసేతు హిమాచలం
ఆణువణువూ భారతీయుల ఉత్సహం అచంచలం

పరాయి పాలనకు పలాయనం గావించిన వేదిక
అవనికి అందించెను స్వేచ్ఛ, స్వాతంత్ర్య గీతిక

చాటుదాం భారత స్వాతంత్ర్యోద్యమ కీర్తి
నేటి యువతరపు నవతరానికి స్ఫూర్తి

హామీ పత్రము :
ఈ నా వచన కవిత స్వయం లిఖితం. ఇది దేనికి అనుకరణ, అనువాదం గాని కాదు.
3
[14/08, 8:12 PM] Purushottam Reddy Utf Poet: "స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు"
నేడే మనకు పర్వదినం!
----------------
నేడే ఈనాడే మనకు పర్వదినం!
అదే అదే స్వాతంత్ర్య దినం!
ఈ స్వాతంత్య్రోత్సవం!
మన మదిలో నింపెను ఆనందపరవశం!
బ్రిటీష్ పిశాచ పాలన అంతం
స్వేచ్ఛా వాయువుల శుభతరుణం
లాల్ ఖిల్లాపై మెరిసిన త్రివర్ణకేతనం
ఎందరో వీరుల త్యాగఫలం
మన పింగళి సృష్టించిన ఈ పతాకం
స్వాతంత్ర్య యోధుల ఆకాంక్షలకు ప్రతిరూపం
ఈ పతాకాన్ని గౌరవించడం భారతీయుని బాధ్యతాయుతం
హిమాద్రి మొదలు కన్యాకుమారి వరకు
మత, భాషాభేదాలను విడుద్దాం
మనమంతా ఒకటేనన్న భావనతో నడుద్దాం
మన బాపూజీ అహింసావాదం ఎంతో ఘనమని చాటుదాం
చాచాజీ సామ్యవాదం పేదలపాలిట పెన్నిదని నిననిద్దాం
బ్రిటీష్ భూతాన్ని నడ్డివిరచిన మనం
కరోనా కర్కోటాన్ని క్రమశిక్షణతో కడతేరుద్దాం
స్వాతంత్ర్య సముపార్జనలో అశువులు బాసిన
ధీరయోధుల త్యాగచరి తను
భావితరాలకు చాటి చెబుదాం
దేశభక్తిని పెంపోద్దిద్దాం!

రచన:పైల పురుషోత్తం రెడ్డి
తెలుగు ఉపాధ్యాయులు
ZPHS కంచిలి
4
[14/08, 8:15 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*
*14/08/2020*

*అంశం:స్వాతంత్ర్య దినోత్సవం
*శీర్షిక:స్వాతంత్ర్య వేడుక

*స్వాతంత్ర్య వేడుక*

పరాయి పాలనలో బానిసల మై
సత్యధర్మశాంతి తో పోరాడి
సర్వస్వం త్యాగం చేసి,
దేశ భక్తితో,దేశ సేవకు కృషి
చేసిన మహాత్ముల పుణ్య ఫలమే ఈ స్వాతంత్ర్య వేడుక
ప్రాణాలను పణంగా పెట్టీ,
మాతృ భూమి కొరకు అహర్నిశలు శ్రమించి,రక్తము
ధార పోసి,జైలు జీవితం గడిపి,
భారత మాత సంకెళ్లను త్రుంచి
ఉద్యమాలు,సత్యా గ్రహాలు,
యుద్ధాలు చేసిన వీరుల
త్యాగ ఫలమే ఈ స్వాతంత్ర్య
వేడుక,
వీర సావర్కర్,గాంధీ,లాల్,బాల్
పాల్,రాజాజీ, సుఖదేవ్,తిలక్
ఇలా ఎందరో వీరుల అకుంఠిత
దీక్షా ఫలమే ఈ స్వాతంత్ర్య
వేడుక,
స్త్రీలు సైతం ఖాదీ వస్త్రాలు
ధరించి మేము పోరాడు తాం
అని,
ధైర్య _శౌర్య వీరుల పోరు
ఈ స్వాతంత్ర్య వేడుక.

*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
5
[14/08, 8:22 PM] Suneel Yadav Poet  Bhoopala Pally: *కవిత గానం...*

🇮🇳🌹🇮🇳🌹🇮🇳🌹🇮🇳🌹🇮🇳
అంశం;- *స్వతంత్ర్య దినోత్సవం*
శీర్షిక  ;-  *తివర్ణ పతాకం..*

భారతీయ ప్రజల గుండెలా నిండా
నా మూడు రంగుల జాతీయ జెండా....

*స్వాతంత్ర్య* పోరాట వీరుల విజయ పతాకం..
గగణతలన ఎగురుతున్న *తివర్ణ పతాకం..*

సుభాష్ తిలక్ లా తిరుగుబాటు ఫలితం...
టంగుటూరి ఆవేశం..కందుకూరి సందేశం..
జాతిపిత శాంతిదూత అందించిన *స్వాతంత్ర్యం...*

గడగడలాడెను తెల్లదొరల సామ్రాజ్యం...
పోరాట ప్రతిఘటనతో సాధించినం *స్వాతంత్ర్యం....*


*బేతు సునీల్ యాదవ్..*✍️✍️
*భూపాలపల్లి*

🇮🇳🌹🇮🇳🌹🇮🇳🌹🇮🇳🌹🇮🇳
6.

శీర్షిక: *స్వాతంత్ర్య దినోత్సవం*

స్వాతంత్ర్య దినోత్సవం అంటే కేవలం
విద్యాలయాల్లో జాతీయఝoడాలెగరేయటం
విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేయటం
ముఖ్యకార్యాలయాల్లో మొక్కుబడిగ చేయటం
కొందరు ఉపాధ్యాయులే ఉపన్యాసాలివ్వటం
జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించటం
చర్వితచర్వణ యాంత్రిక కార్యక్రమం
వలె మారటం భారతజాతి దురదృష్టకరం

ఎందరో వీరులత్యాగం ఫలించినరోజు
జాతీయనాయకుల ఆశయాలు నెరవేరినరోజు
వందేళ్ల పోరాటాలు ఫలించిన మంచిరోజు
తెల్లోళ్ల చీకటిపాలన అంతమై స్వతంత్రజ్యోతి వెలిగిన రోజు

కులం మతం ప్రాంతం ప్రాయం వర్గం లింగబేధం
మరచి ఉత్సవంగా జరుపుకోవాల్సిన శుభదినం
పార్టీలు భాషలు ప్రాంతీయ కుత్సితాలజాలం
వదిలిoచేసుకోవాల్సిన జాతీయ పర్వదినం

ఎంత చారిత్రాత్మక శుభదాయకదినం!
ఎందరి స్వప్నాలు సాకారమైన పర్వం!
ఎన్ని ఉద్యమాలు సాదించిన విజయమో!
ఎందరి ప్రాణత్యాగాలకు దక్కిన ఫలమో!

ఆ సుదీర్ఘఉద్యమాలు జగాన ప్రసిద్ధం!
ఆ అహింసావ్రతాలు ప్రపంచాన అపూర్వం!
ఆ గాంధీ శాంతిమార్గసూత్రాలు లోకానికి రక్షలు
ఆ అమూల్యవిజయాలు అవనికి కొత్తవెలుగులు

మరువకూడనిది సశేషజయాల స్వతంత్రదినోత్సవం
తలచినంత మదిని పులకరింపజేయు పుణ్యదినం
దేశమాత దాస్యశృంఖలాలు తెగిన శుభప్రదదినం
దేశభక్తులత్యాగాలు ఫలించిన మహత్తరపర్వదినం


:;వల్లాల *విజయలక్ష్మి*
ఆలేరు
7

[15/08, 9:04 PM] Sarphraj Anwer Poet: 🌸 *కవితా గానం సమూహం..*🌸

అంశం : స్వాతంత్ర్య దినోత్సవం..

🌸 *నింగినంటిన త్రివర్ణం..*🌸

నూతన ఉషోదయాన
నింగికెగిసిన *కాషాయాన్ని* చూసి
హృదయం దేశభక్తితో ఉప్పొంగితే
రుధిరం ఉత్తేజితమై అణువణువుని
ఉద్యుక్తపరుస్తుంది..

ప్రశాంత దృక్కుల శాంతి దూత,
శ్వేతాంబర స్ఫూర్తిప్రదాతయైన
*శ్వేతవర్ణం* శాంతి సౌభ్రాతృత్వాల్ని
లోకానికి చాటిచెపితే..

సస్యశ్యామలం, ఐకమత్యబలం
నయనాలకు నయనానందకరమైన
*హరితం* ప్రకృతి అంతటా
కూడా పచ్చటి తివాచీలా పర్చుకుంది..

మహమ్మారి కాటుతో వివర్ణమైన
మన జీవితంలో నింగి
*త్రివర్ణమవడం* ద్వారా
మళ్లి వర్ణరంజితం అవుతుంది..

దేశభక్తి పలుకులతో పాటు
సంతోషంతో ముదిరాలు కుడా
*దేశభక్తిని చినుకుల్లా మార్చి*
పుడమిపై అక్షింతల చిరుజల్లుల్ని
కురిపిస్తున్నాయి..

*దేశాభిమానం నినాదాలై*
హృదయం నిండుగా ప్రవహిస్తుంటే
*దేశభక్తి మువ్వన్నెల రూపం* దాల్చి
నింగిలోన రెపరెపలాడ్తుంది..

*స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలతో..*
🌸🌸💐💐🎊🇳🇪🇳🇪🇳🇪

*సర్ఫరాజ్ అన్వర్..*✍🏻
9440981198
8
[15/08, 9:11 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453 నిన్న వాడు నా మిత్రుడు

నిన్న వాడు నిర్మల హృదయుడు మంచి కోసం మానవత్వం కోసం పోరాడిన ఆవరణ భూషణుడు

కానీ నేడు వాడు మనకు దూరమైన మనిషి వాడు ఉదయం కోల్పోయాడు

అవినీతికి అమ్ముడుపోయి దుర్మార్గంగా
తల పొగరెక్కిన వాడు

దానవత్వం దావత్ వాన్ని పండించేవాడు
మానవత్వానికి ఎత్తిన వైజయంతిక
నిన్న వాన్ని ఆలింగనం చేసుకున్నాను
నిన్న వాడు ఆత్మీయ పురస్కార గ్రహీత

నేడు వాడు సంఘం చేత బహిష్కృతులు
నేడు వాడు అందరికీ దూరమైన వాడు

సంఘానికి దుర్మార్గానికి దగ్గరి వాడు
అందుకే వారిని బహిష్కరించాలి

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు భువనగిరి యాదాద్రి ఖమ్మం 7702537453
9
కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..స్వాతంత్ర్య దినోత్సవం

భారతీయుల ఆత్మాభిమానాన్ని
దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసి
చేసిన అరాచకాలపై ప్రతిఘటించిన సైనికుల తిరుగుబాటు ఫలితం
సత్యాహింసల మార్గజ్యోతి మహాత్ముడి ధరించిన ఆయుధాలు
రేకేత్హించినవి వలసపాలకుల గుండెల్లో గుబులు
అఖండ భారతావనిని ఏకం చేసి సాగించిన పోరాట ఫలితం
అర్ధరాత్రి ఆదమరచి
ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ
భారతావని పునరుజ్జివనంతో
స్వేచ్చ స్వాతంత్ర్య దేశంగా ఆవిర్భవించింది
ఎర్రకోటపై విజయ బావుటను ఎగరేసింది
ఆగస్టు పదిహేనున ఆనంద సంబరాల్లో తెలిపోయిన శుభదినం
కొత్త వెలుగులతో శోభాయమానంగా వెలిగింది భారతమ్మ మోము
ఎందరో వీరుల త్యాగాల ఫలితం
నేడు మనం అనుభవించే స్వాతంత్ర్య ఫలం
అదే మనకు బలం
స్వాత్రంత్యను కాపాడుకొను టయే ప్రతి భారతీయుడి కర్తవ్యం
జనగణ మంటూ జాతీయ గీతం ఆలపించి చేద్దాం జాతీయ పతాకానికి వందనం
చాటుదాం భారతజాతి కీర్తిని దిగంతాలకు.

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...