Skip to main content

ప్రతి హింస 25082020

నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
మెరుగు మధు
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు
*********
కవివరుల జాబితా
1.ఇంద్రావత్ రాహుల్ గారు
2.డాక్టర్ ఆంజనేయులు గారు
3.శ్రీలక్ష్మి గారు
4.స్వర్ణ సమత గారు
5.అపరాజిత రెడ్డి గారు
6.కోరాడ నరసింహారావు గారు
7.వల్లాల విజయ లక్ష్మి గారు
8.సునంద వురిమిళ్ళ గారు
9.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
10.రాపోలు అరుణ గారు
11.మర్రి జయశ్రీ గారు
***********
1

*కవిత గానం*
============

అంశం : ప్రతిహింస
తేది : 25/08/2020



            🇮🇳 *ప్రతిహింస*🇮🇳


మనిషి నిత్యజీవితంలో
హింసతో పోరాటం చేస్తూ
అందరిలో సంతోషంగ
ఉంటూ బ్రతుకుతున్నాడు
హింసకి కావచ్చు
కారణం ఏదయినా
కానీ అది కాదు
 జవాబు దేనికయినా
హింసని వీడుదాం
బ్రతుకుదాం బ్రతకనిద్దాం
గాంధీ మార్గంలో
నడుద్దాం శాంతిని
నెలకొల్పుదాం...
మేరా భారత్ మహాన్...



*ఇంద్రావత్ రాహుల్*
      *కొత్తపేట్*
 *నిజామాబాద్*
9848054079..
2.
[25/08, 8:20 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: హింస ప్రతి హింస ల మధ్య
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు

హింసనచణ ధ్వంసరచన ఒకరినొకరు విమర్శించుకోవడం హింసించు కోవడమే హింస వల్ల పరస్పరం 
చంపుకోవడం వల్ల భయం 

భయంకరమైన హింస వల్ల వ్యవస్థ చెడిపోతుంది
ఎవరు హింసకు పాల్పడిన
అది కష్టాలను తెస్తుంది ఇరుపక్షాలకు
న్యాయాన్యాయాల ను తేల్చాల్సిందిన్ 
హింస మంచిది కాదు అయితే అన్నింటికన్నా మంచిది హింసా తత్వం
శాంతిదూతగా నెహ్రూ చెప్పిన
జాతిపితగా మహాత్మా గాంధీ చెప్పిన

ఎవరు చెప్పినా శాంతి సమతా సౌభాగ్యాలతో ఈ జగత్తంతా 
అహింస జిందాబాద్ హింస ముర్దాబాద్
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు బోనగిరి ఖమ్మం 7702537453
3
[25/08, 8:45 PM] శ్రీ లక్ష్మి విజయనగరం: కవితా గానం 
అంశం: ప్రతి హింస 
పేరు: చివుకుల శ్రీలక్ష్మి

హింస- ప్రతిహింస 
రెండూ ఒకే భావం 
దెబ్బకు దెబ్బ!
భారతదేశం శాంతి భూమి! 
ఇచట హింస వర్జనీయం!
గౌతమ బుద్ధుడు చెప్పినా 
మహాత్మా గాంధీ చెప్పినా 
పరమ గురువులు తెలిపినా
అహింసా పరమో ధర్మః
ఒక చెంప కొడితే
వేరొక చెంప చూపించమనే
సంస్కృతి మనది!
స్వీయ రక్షణే మన విధానం! 
ఎదురుదాడి వికృత మార్గం!
సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి!
సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్ఛతి!
నీలోను నాలోను ఉన్నది శివుడే! 
అని తెలిసిన నాడు 
సర్వమానవ సౌభ్రాతృత్వం సాధ్యమే!
విశ్వమానవ కళ్యాణం వైపుగా వేసే 
భారతీయ పదముద్రలు 
ఆదర్శవంతం! ఆచరణీయం!
4
[25/08, 8:58 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*
*25/08/2020*

    *ప్రతి  హింస*

హింసను వీడి,అహింస మార్గంలో పయనిస్తే,
ప్రతి హింసకు తావు ఉండదు,
ప్రతి హింస చేటు చేస్తుందని
పరమ ఋషులు,మునులు,
యోగులు,జ్ఞానులు తాత్వికత
ద్వారా,ఎంతో బోధ చేశారు,
వారి ఉపన్యాసాలు మనకు
మేలు చేస్తాయి, మహాత్ముల
మహా నీయ సూక్తులు,
మనకు దిక్సూచి గా పని చేస్తాయి,ప్రతి హింసని మాని
అనర్థాలకు అవకాశము ఇవ్వకుండా,
ఓ మహర్షి గా జీవించు,
మంచి తనం పది మందికి
పంచు.

*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
5.
[26/08, 7:20 PM] Aparajith: ప్రకృతి 


తేలియాడే వనమబ్బుల కింద 
టప టప రెక్కలు కొట్టుకుంటు
వాలు వాలుగా ఎగిరే పక్షుల కోలాహలం 
లేళ్ళు, కుందేళ్లు, ఉడతలు మేత కోసం 
అటు ఇటు ఉల్లాసంగా పరుగిడుతూ 
అడవి అంతా తమదే ననే ఆశతో 
ఆదమరచి నిదురించే వేటగాడు కొదమ సింహం 
కొలను నిండా 
రంగు రంగుల పుష్పాల పరిమళాలు 
అలల తాకిడితో తలలూపుతూ 
మనుషుల జాదంటూ లేని అడవి 
కొండలపై మంచు జాలువారుతూ 
పచ్చని చెట్ల మలయమారుతాలు 
హృదయం ద్రవించేట్లు ఎండపొడ 
అంతట్లోనే సూరీడును కప్పేసి 
మబ్బులు కారుమబ్బులై 
జల జల మంటూ వాన చినుకులు 
ఏ దేవుడు  దేవత లేనిది 
ఇంతటి ప్రకృతి అందం సాధ్యమా !!
ఇంటి వద్ద ఫ్యాన్ కింద ఏ సి ల్లో బ్రతికే 
నాగరిక మానవులకు 
ఈ ప్రకృతి సోయగాలు 
ఓ జీవిత కాలం గ్యాప్ !!

అపరాజిత్
6
[26/08, 8:06 PM] Korada: కవితాగానం
అంశం:-ప్రతిహింస@
కోరాడ నరసింహా 
రావు ; ఎండమావేగా
   **************
" అహింసా....
        పరమోధర్మః "
మాట...చేతలతో ....
మనో,దేహాలను.... గాయపరచి...హింసించటం పైశాచికం!

కన్నుకు - కన్ను....
పన్నుకు - పన్ను....
కాలుకు -  కాలు ....
చెయ్యికి - చెయ్యి...
యిది న్యాయమే కా వచ్చు గానీ...ధర్మం కానేరదుగా ....!

హింసకు...ప్రతిహింస
పరిష్కారంకానేరదని 
దాశరధితన"మోదుగ
పూలు" లో సుస్పష్టం
చెయ్యలేదూ....!

ఈ రోజు వా డొక్కడు మీరు నలుగురు కా వచ్చు...,రేపు వాళ్లు
పదిమంది...ఎల్లుండి  మీరు పాతిక మంది.,
ఎల్లుండివాళ్ళు...యాభై మంది...!!
ఈహింసా-ప్రతిహింస
లకు అంతెక్కడ,పరి ష్కారమెప్పుడు...!?

ఇలా ఐతే...! మనకు స్వతంత్రమొచ్చేదా..!
స్వరాజ్యమేర్పడేదా!?
అహింసాసత్యాగ్రహాలను మించినఆయు 
ధాలు...శాంతి యు   ద్దాలూ ఉండవని...
గాంధీజీనిరూపించలేదా... !!

హింసకు ప్రతిహింస
తప్పనిసరే...! ఆ బాధఎలావుంటుందో
హింసకు పాల్పడే వా రు అనుభవించి..... 
తీరాల్సిందే...! ఐతే
ఆ ప్రతిహింసన్యాయ బద్దంగా...చట్టసమ్మతమై జరగాల్సిందే!
అప్పుడే కదా అది
ధర్మం....!

అలా కాక...ఎవరికి వారు...హింస,ప్రతి హింసలకు పాల్పడితే
అరాచకం తప్ప... 
పరిష్కారంఎండమావే...కదా....!!
****************
.......కోరాడ.
7
[26/08, 8:22 PM] విజయ లక్ష్మి యాదాద్రి: *ప్రతిహింస* 

మానవ పా(లో)పాల్లో ముఖ్యమైనది
సాటిజీవి పట్ల సానుభూతి చూపనిది
లోకానికెంతో కష్టనష్టం కలిగించినది
జనాన్నెంతో క్షోభపెట్టినది *హింస*

హింసకు ప్రతి'గా జరిగే నష్టం మరీ భయంకరం
హింస ప్రతిహింసలతో సాధించేది వినాశనం
వాటి ఫలితం మానవాళికి ప్రమాధకారం
వాటిని మానవప్రవృత్తులు అనలేం

పోషణార్థమే హింసకు పాల్పడును జంతువులు సైతం 
మానవులదే అతిక్రూర నిర్దాక్షిణ్య స్వభావం 
అనవసర హింస ప్రతిహింసలను విసర్జిద్దాం
అవనికి కాస్త ప్రశాంతతను కలిగిద్దాం

:వల్లాల విజయలక్ష్మి

ఆలేరు
8
*కవితా గానం*
తేదీ::26-08-2020
పేరు:వురిమళ్ల సునంద,ఖమ్మం
అంశం: ప్రతి హింస
*****************
అహింసా పరమ ధర్మమనే  
పవిత్ర భావనల అడుగు జాడల్లో 
నడిచిన దేశం మనది!

సత్యాగ్రహమే ఆయుధంగా ధరించి
గాంధీ మహాత్ముని సారథ్యంలో
శాంతియుతంగా పోరాడిన మన స్వాతంత్ర్య యోధులపై
ప్రతి హింసకు పూనుకున్న
పాపపు హృదయాల తెల్ల దొరలు!

చెక్కుచెదరని ధృడ సంకల్పంతో
ప్రతి హింసా దుశ్చర్యలను
సామరస్యంగా ఖండిస్తూనే
స్వాతంత్ర్యం సాధించుకున్న ఘనత మనది!

హింసతో ఏదైనా చేయగలమనే
అహంకారం
ప్రతిదీ పొందగలమనే మూర్ఖత్వం
అహింస  ముందు ఎప్పుడో ఒకప్పుడు
చేతులు జోడించి వినమ్రంగా నిలవాల్సిందే...
జంతు వాసాల నుండి జనావాసాలు ఏర్పరచుకున్న
 సంస్కృతి!

సహ జీవనం సహకార భావనే
సమైక్యతకు మూలమని
తెలిసిన గొప్ప హృదయం భరత జాతిది
సర్వ మతాల ఐక్యతా రాగం ఆలపిస్తూ
సంతోషంగా జీవించే భారతీయ జీవనం

ప్రపంచానికే ఆదర్శ మార్గ దర్శనం..
9
[26/08, 9:16 PM] Balloori Umadevi Poetess: కవితా గానం
బల్లూరి ఉమాదేవి
అంశం:ప్రతిహింస

ఉపకారం చేసిన వారికే కాదు 
 అపకారం చేసిన వారికి సైతం 
 ఉపకారం చేయాలని బోధింది
. సుమతీ శతక కారుడేనాడో
 హింస కెప్పుడు  ప్రతి హింస 
 సమాధానం కారాదిలలోన
 రక్తానికి రక్తం సిద్ధాంతం అంటూ
 ప్రతి హింసకు పాల్పడితే జరిగేది
 మానవ వినాశనం మిగిలేది రక్తపాతం
బుద్ధుడు బోధించిన అహింసా మార్గంలో  
 సాధించాడు  బాపూజీ స్వాతంత్ర్యం
 కావాలి మానవాళికి అదే ఆదర్శం
 బలముందని హింసించే వారికి 
 దూరంగా ఉండడమే ప్రతి సమాధానం
 వంద గొడ్లను తిన్న రాబందైనా
గాలివాన కు కూలికి తప్పని వైనం
 హింసలు చేసేవారు జీవితంలో
 అనుభవించక తప్పదు ప్రతిఫలం
 సామరస్య జీవనాఆనికి సౌభ్రాతృత్వానికి
 మూలం అహింసా దృక్పథం అంటూ
 ఆ బాటలో  పయనిద్దాం ఆచరిద్దాం
 ప్రతి హింసను నిరసిద్దాం నిరాకరిద్దం గేమ్స్

 అహింసయే పరమ ధర్మమని చాటుదాం.
10
[27/08, 8:12 PM] Rapolu Aruna Siripuram Poet: *కవితాగానం*
అంశం:ప్రతిహింస
శీర్షిక:శాంతి సందేశం
పేరు:రాపోలు అరుణాస్వామి, సిరివురం
చరవాణి:8328277215
ప్రక్రియ:వచనకవిత

ఇలాపోయి అలా వచ్చేదికాదు ప్రాణమంటే

ప్రాణం పొసే వైద్యునికైనా అది తీసేహక్కులేదు
అడవిలో మృగాలు సైతం ఆకలి తీరేవరకు వేటాడుతాయి
మానవసమాజంలో హింసవలన ఆకలి తీరదు
మరెందుకు ఈ హింస ప్రతిహింసలు
వర్గభేదాల పోరులో హతమైన అమాయకులందరో
తమనిండు జీవితాన్ని కోల్పోయిన అభాగ్యు లెందరో
ఈ సృష్టిలో అందరికీ జీవించే హక్కుంది
హింసవలన జరిగేది విధ్వంసమే
ప్రతిహింస వలన మిగిలేదిఅంతా శూన్యమే
ఇది మన అభిమతం కానేకాదు
విషపూరిత విద్వేషాల్ని
పూర్తిగా అంతం చేయాలి
మానవత్వమనే సాధుతత్వం
అందరికీ అలవడాలి
బిందెడుపాలలో ఒక్కచుక్క విషం కలిపితే పాలన్నీ కలుషితమైనట్లు
విషానికి ఎన్నిపాళ్లు పాలు కలిపినా దాన్ని పవిత్రం చేయలేము
శాంతి కోరుకునే దేశంలోపుట్టి
అశాంతి అలజడులను ప్రోత్సహింపక
అందరూ ఒక్కటిగా మసలుకొడమే అసలైన భారతీయత
11
[27/08, 8:41 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అమషం..ప్రతిహింస

శాంతి నాదలు పలికించిన నేల

ఎందరో పుణ్యమూర్తుల అడుగుజాడల్లో నడచిన పవిత్ర భూమి
పరపీడనలో మగ్గిపోయిన వేళ
స్వేచ్ఛకోసం సాగిన సమరంలో
సత్యం అహింసాయుధాలు ధరించి
సహనంతో
 స్వాతంత్ర్యము సంపాదించుకున్న ఘనత మనది
ప్రతిహింసతో పాప భారం అధికమువునన్న నిజాన్ని ఎరిగిన జాతి మనది
 ప్రతిహింస ధర్మం కాదని బోధించిన పవిత్ర భూమి మనది
హాని తపెట్టిన వారికే మేలు చేసే నీతి మనది
ఆత్మీయత తో  మెలిగే
ఐక్యతారాగం భారత జాతి గొప్పదనం
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు 
ప్రపంచదేశాలకే ఆదర్శం
ప్రతిహింసతో సాధించేది లేదన్నది తెలిశాక 
ప్రాణాలు తీయాలనే వెర్రి పనులన్నీ దేనికి
ద్వేషాల చీకట్లు పారదోళ 

స్నేహ దీపాలు వెలిగించడం అందరికి శ్రేయస్కరం.

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...