Skip to main content

సరిహద్దు రేఖ 19/08/2020

నిర్వహణ
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
శివునూరి లలితాకృష్ణ
మెరుగు మధు
ఐతగోని వెంకటేశ్వర్లు
*************************
కవి వరుల జాబితా
1.డాక్టర్ ఆంజనేయులు గారు
2.కోరాడ గారు
3.వురిమళ్ళ సునంద గారు
4.నారాయణ భాగ్యలక్ష్మి గారు
5.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
6.ఇంద్రావత్ రాహుల్ గారు
7.శ్రీమతి స్వర్ణ సమత గారు
8.విజయ లక్ష్మి యాదాద్రి గారు
9.శ్రీలక్ష్మి గారు
10.మర్రి జయశ్రీ గారు
***************
1
[18/08, 8:16 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: మానవాళికి సరిహద్దు రేఖలు
భాష

మానవాళికి హద్దులు పెట్టడం సరైనది కాదు మానవాళి మహత్తరమైన ఎటువంటి దేశానికి సరిహద్దులు పెట్టడం సాధ్యం కాదు అసాధ్యం కాదు అనుకోవడం తప్పు

చైనా భారతానికి మధ్య సరిహద్దులు పెట్టుకున్నాం
మన సరిహద్దులను ఆక్రమించడానికి ఎన్నాళ్లుగానో ప్రయత్నం చేశాడు చేస్తూనే ఉన్నాడు ఆయన భారతం కొడుతూనే ఉంది
సరి హద్దు మీరితే తప్పనిసరిగా మనం ముందుకు సాగి పోతున్నాం
వద్దులే గానీ ఎటువంటి ప్రేమ ఎవరికైనా మంచిది కాదు హద్దులు హద్దులు ఉన


హద్దులు దాటిన మనిషీ ఆగమాగం అయిపోతాడు అందుకే అది మీ రాకూడదు ఎవరి సుది తీయకూడదు
సరిహద్దు లేని జగజ్జన లారా
మానవుడి నా సంగీతం మనుష్యుడే నా సంగీతం జీవన సంగీతమే మానవాళికి మధురం మధురం మధురం అపూర్వ అనుబంధం సరిహద్దు తో సాధ్యం కాదు

ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537454
2
[18/08, 9:02 PM] Korada: కవితాగానం
అంశం:-సరిహద్దురేఖ
కోరాడ నరసింహా
రావు;
@హద్దులుమీరితే@
    @@@@@@
ఎవరి హద్దుల్లో...వా ళ్ళుంటేనేకదూ...అందరూ హాయిగా వుం డేది....!
మనిషికీమనిషికైనా..
దేశానికీ దేశానికైనా...
అందరిక్షేమంకోసం...
పరస్పరఅంగీకారంతో ...ఏర్పరచుకున్నవే కదా ఈ హద్దులు!
హద్దులనుఅతిక్రమించటమంటే...నియమాలనుఉల్లఘించ    టమే కదూ !
నైతికతను నాశనం చెయ్య టమే కదూ!
పరస్పరంహక్కుల్ని గౌరవించి హద్దుల్ని మీరానంతవరకే...
ప్రశాంతత...!
దురాశతో హద్దులను అతిక్రమించి...దురాక్రమణలకుపాల్పడితే
ఉపేక్షించట మనేది
చేతగాని తనమే గా!
అప్పుడుయుద్దామనివార్య మే గా...!
అపార ధన,ప్రాణ నష్టాలు తప్ప ఎవరికి మాత్రం వొరిగేదే ముంది  ...!?
ఇంతవిజ్ఞానాన్నిసము పార్జించిన ఈ మనిషికి ఈ సూక్ష్మ విషయం బోధపడ లేదా...?!
దేశాలమధ్యసరిహద్దురేఖలంటే...ఎవరిహద్దుల్లోవాళ్ళుహాయిగా...పరస్పరస్నేహసుహృద్భావాల్తో
సహకరించుకుంటూ బ్రతుకమనేహెచ్చరికరేఖలే  గా !పట్టించుకోకపొతే పరిణామాలు తీవ్ర రూపం దాల్చావా !?
అలెగ్జాన్డర్లాంటి వాళ్ళ జీవితాలను పరిశీలిం చిన పిదపనైనా ఈ
మనిషికిబుద్ధిరాలేదా
ఈ మూర్ఖ నరులకు  బుద్దొచ్చేదెప్పుడు...
ఎప్పుడు!?!?
****************
......కోరాడ.
3

*కవితా గానం*
తేదీ:18-08-2020
పేరు వురిమళ్ల సునంద,ఖమ్మం
అంశం:: సరిహద్దు రేఖ
********************
దాయాదులైనా 
దాచుకున్న సంపదైనా
పెంచుకున్న ఆస్తి అయినా
ప్రేమగా పెంచుకున్న బిడ్డలైనా
వెయ్యేళ్ళయినా వేరుపడక తప్పదంటూ..

అందరి పెద్దల ముందు వాటాలు వేసుకొని
హద్దులు సరిహద్దుల లక్ష్మణ రేఖలు గీసుకున్నా
సామరస్య భావనతో బ్రతికితే
సమాజంలో గౌరవం!
ఇరు పక్షాలకు శుభకరం!

అఖండ భారతావనియైనా
అనంత ప్రపంచమైనా 
ఖండాలుగా విడివడిన సందర్భం
పరస్పర అంగీకారంతో
ఏర్పాటు చేసుకున్న సరిహద్దు రేఖల ఒప్పందం!

ఆయా దేశాల సార్వభౌమత్వంతో 
భూభాగాలను కాపాడుకునేందుకు
గీసుకున్న సరిహద్దు రేఖ
దేశాల అస్థిత్వాన్ని చూపించే ప్రతీక!

శాంతి సహనం స్నేహంతో మెలగాల్సిన మస్తిష్కంలో పెంచి పోషించిన విషపూరిత భావనలు!
పర దేశాలను ఆక్రమించుకోవాలనే
కుట్ర పూరిత ఆలోచనలు!
యుద్ధానికి కాలుదువ్వి చేస్తున్న విధ్వంసాలు!

ప్రతి క్షణం కంటి రెప్పలా దేశాన్ని కాపాడే
వీర జవానులకు కత్తి మీద సాము అవుతున్నా
వెన్ను చూపని సాహసమే
వెన్ను దన్నుగా నిలిచి కాపాడుతోంది 

అటు చైనా ఇటు పాకిస్తాన్ ముష్కరుల బారి నుండి..
4
కవితా గానం 
నారాయణ భాగ్యలక్ష్మి 
అంశం: సరిహద్దురేఖ 
కవిత శీర్షిక:

లక్ష్మణ రేఖ 
*********
అది దేశానికి సరిహద్దు రేఖ 
అదే మన మనుగడకు లక్ష్మణరేఖ

సౌభ్రాతత్వం మాని 
అసూయ ముసుగులో 
కవ్వింపు చర్యలకు పాల్పడు 
పాక్ అహంకారులకు 

మన దేశ సరిహద్దు రేఖ 
నిజంగా లక్ష్మణ రేఖే కధ

ఒక నోట శాంతి వచనాలను వల్లిస్తూ 
ఒక చేత ముష్కరులను మోహరించి

ఏమార్చి అదను చూసి 
తుది ముట్టించ తలపోసే

గోతికాడ నక్కలా కాచుకున్న 
చైనా పాక్ వంటి వెన్నుపోటు 
మేకవన్నె కుక్కల పాలిట 

మన దేశ సరిహద్దు రేఖ 
ముమ్మాటికి లక్ష్మణ రేఖ కధ 

నేడు మనం మన ఇంట్లో ప్రశాంతంగా 
ఇంత సురక్షితంగా ఉన్నామంటే..
అది ఈ సరిహద్దుల పుణ్యమే

దేశ రక్షణే ధ్యేయంగా
ప్రాణాలను పణంగా పెట్టి 

దేశ సరిహద్దుల్లో అహర్నిశం 
భరతావని రక్షణ కవచంగా నిలిచిన

భరతమాత ముద్దుబిడ్డలైన 
భారత సైన్యం మిలటరీ దళాల

రక్షణ వలయ ధైర్య శౌర్య ప్రతాప  నిలువుటద్దమే ఈ సరిహద్దు రేఖ 

ఇంకా .....
పసిపాపకు అమ్మ ఒడిలా 
చంటి బిడ్డడికి నాన్న భరోసాలా 

వానకు గొడుగులా 
ఎండలో తరువునీడలా 

కంటి పాపకు కనురెప్ప కావలిలా
ఇంకా ఇంకా ఎన్నో మరెన్నో విధాల

కనిపెట్టుకుని కాపాడే అమర త్యాగాల
ఔనత్యాల శత్రు దుర్భేక్షమగు ధృడ కంచె

ఈ సరిహద్దు రేఖ 

అదే మన పాలిట లక్ష్మణ రేఖ.
5
[19/08, 9:08 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: *** బార్డర్ రేఖ***
                      ✍️ డా.పాండాల.

రక్తబంధానికే 
ఎన్నాళ్ళున్న ఏరువడక తప్పదు.. 
చిననాడు ప్రేమలు పెద్దయ్యాక పగలు
కూడేసిన సొమ్మైనా సంపాదించిన కారు బంగ్లాలు ఎకరాలభూములైనా
సమతావాదంతో గిరగీసుకొని ఇది నాదనే భావన బలపడేవరకు 
నలుగురిలో స్థిమంతున్నని అనిపించుకోవడమేఆశగా అస్థిత్వం ఆత్మవిశ్వాసం..!

పెద్దలముందు వాటాలేసుకొని
హద్దులే సరిహద్దులుగా లక్ష్మణరేఖగా బండగుర్తులేసుకొని  నలుగురితో నారాయణంటూ
సామరస్య సమభావనతో 
మెదలడమే సంఘంలో  గౌరవం!
మనుషులందరికి శుభకరం!

అఖిల భారతం
అనంత ప్రపంచం 
ఖండాలు ఉపఖండాలుగా వివిధదేశాలుగా విడివడినవేళ
పరస్పరం ఆమోదంతో 
సరిహద్దు రేఖల ఒప్పందం!
తమ సార్వభౌమత్వంతో 
భూభాగాన్ని రక్షించే రక్షణరంగం
బార్డర్ రేఖ దేశాల అస్థిత్వాన్ని చాటిచెప్పె ప్రతీక!

శాంతిస్నేహంతో మెలిగే మస్తిష్కంలో విషపూరిత భావనయే!
పరదేశాలను ఆక్రమించాలనే కుళ్ళు కుతంత్రాల విస్తరణ లోచనం!
కయ్యానికి కాలుదువ్వే  విధ్వంసక చేష్టలు!
కంటిరెప్పలా దేశాన్నికాపాడే
జవానులకు కత్తిమీద సామైన 
వెన్ను చూపని ధైర్యసాహసమే
ఊపిరిగా వెన్నుదన్నుగా త్రివిధదళాల విద్యుక్తధర్మమే సైన్యం శౌర్యం
చైనా పాక్ ముష్కరుల బారినుండి సదావిద్యుత్ కాంతులే సరిహద్దు రేఖ.!

✍️డా.పాండాల మహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి.
6
[19/08, 9:23 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం*
------------------


అంశం : సరిహద్దు రేఖ 
తేది : 19/08/2020



         🌺 *సరిహద్దు రేఖ*🌺





మానవ జీవనం 
ఆడిన మాట తప్పకపోవడం 
దేశం సరిహద్దు రేఖ 
లక్ష్మణుడు గీసిన రేఖ 
హద్దులు హద్దులు సరిహద్దులు 
వీటి వాళ్లే బేధాలు విబేధాలు 
అల్లర్లు అలజడులు 
గాయాలు రక్తాలు వీటి వల్లే 
అమ్మ కడుపునా పుట్టి 
భారత రక్షణగా 
సరిహద్దులు దాకా వెళ్లి 
తమ ప్రాణాలు అర్పిస్తున్న 
జవాన్లకు వేల వేల వందనాలు...
7
*కవితా గానం*
*20/08/2020*

      *సరిహద్దు రేఖ*

ప్రాంతానికి ప్రాంతానికి
సరిహద్దు రేఖ ఉంటుంది,
సరిహద్దు విభజన కొరకు
కాకుండా, 
ప్రాంత పొలిమేర సూచికగా
మాత్రమే ఉండాలి,
కొన్ని సూచనలు మాత్రమే
పాటిస్తూ కలిసి మెలిసి
ఉండాలి,
పూర్వము నుండి ఈ సరిహద్దుల వల్ల యుద్ధాలు
జరుగుతున్నవి,
స్థలాల కొరకు,వ్యాపారము
నిమిత్తము,
వాణిజ్యం వల్ల ప్రచ్ఛన్న యుద్ధాలు,
జరుగుతూ ఆస్తి నష్టం,
జన నష్టము జరుగుతూ ఉండేది,
సరిహద్దును భూ ప్రాంత
కొలత గా భావించి
అన్యోన్య భావన తో
ఉంటే ,
విభేదాల కు తావు ఉండదు,
ఎగుమతి _దిగుమతి
సక్రమంగా ,సవ్యంగా సాగిస్తూ
సఖ్యతతో అన్ని దేశాలు
కలిసి ఉండడము శ్రేయ స్కరము.

*స్వర్ణ సమత*

*నిజామాబాద్*



          
8
*సరిహద్దు రేఖ*

ఒక్క కడుపున పుట్టిన పిల్లలే
ఒక ఇంటిలో అన్యోన్యంగా పెరిగినా
పెద్దయ్యాక వేరు పడుట సహజం
విశాలదేశాలకు తప్పుతుందా విభజన?

పక్కపక్క కుటుoబాలకైనా దేశాలకైనా
పకడ్బందీ సరిహద్దులు తప్పనిసరి
ఇరుదేశాలకు అంగీకారమైతే సఖ్యత
ఒక్కదేశం న్యాయమార్గం వీడినా యుద్ధమే

అనాదిగా మనదేశానిది ధర్మపథం
వేలవత్సరాల రాచరిక యుగo లోనే
ఎవరిపై దురాక్రమణ చేయలేదు మనం
నవీనయుగానా మనది అదే శాంతిమార్గం

లెక్కలుకట్టి నిర్ణయించుకున్న సరిహద్దులను
పక్కదేశాలు కాదని చొరబాట్లకు పాల్పడటం 
మన భూభాగాన్ని ఆక్రమించాలనుకోవటం  
మన మంచిని బలహీనతనుకోవటం దురదృష్టకరం

మొన్నటిదాకా మనతో కలిసున్న తమ్ముడoటి
పాకిస్థాన్ ఇండియాను చూసి ఈర్షపడటం 
'ఇండియా చీనీ భాయి భాయి' అన్న కమ్యూనిస్టు
చైనా మన భూభాగంపై కన్నేయటం దుర్మార్గం

సరిహద్దుల రక్షణకై మన సైనికులప్రాణాలు
సమర్పించాల్సిరావటo దేశానికి తీరనినష్టం
మెక్ మోహన్ రేఖను చైనా సైతం గౌరవిస్తే 
ఇరుప్రాచీన అధికజనదేశాలకు అన్నిట క్షేమం

అనవరసకయ్యాలకు కాలుదువ్వటం
ఇరుదేశాలకూ పలురకాలంగా ప్రమాదకరం
ఆర్ధిక వాణిజ్య సాంకేతికరంగాల్లో ఆంక్షలు
ప్రజల అవసరాలు ఆకాంక్షలకు సంకెళ్లు

:వల్లాల *విజయలక్ష్మి*

*ఆలేరు*
9
[20/08, 9:08 PM] శ్రీ లక్ష్మి విజయనగరం: కవితా గానం
తేదీ: 19 -08 -2020
పేరు: శ్రీలక్ష్మి చివుకుల
అంశము: సరిహద్దు
కవితా శీర్షిక
   *అంతరాలు తొలగించు* 
హద్దులు కంటికి కనిపించని గీతలు 
మనసుల మధ్య మనుషుల మధ్య
కుటుంబాలు ఊళ్ళూ రాష్ట్రాలు 
జాతీయ అంతర్జాతీయవిభేదాలు
గీతకు ఆవలివైపున నీవు ఈ వైపున నేను
నీ దగ్గర గ్రెనేడ్లు నా దగ్గర తుపాకులు
చేయి చేయి కలిపి దేశాభివృద్ధి కోరే మనం
దేశ రక్షణకు చెరోవైపు నిలిచాం
ఎవరు అడుగు ముందుకు వేసినా
రక్తపాతమే! మారణహోమమే!
ఎవరు చెప్పారిలా? ఏ శాస్త్రంలో ఉంది?
నువ్వు నీ దేశాన్ని నేను నా దేశాన్ని
కాపాడాలంటే సరిహద్దుల్లో కాపలా????

నూరేళ్ళకైనా చావూ వెయ్యేళ్ళకైనా వేరూ 
తప్పదనే పెద్దల నానుడి ఒక తల్లి బిడ్డలమైనా
నిన్ను నన్ను వేరు చేసింది 
పక్షి గూడులాంటి ఇంటిని 
ముక్కలు చేసి పంచుకోమంది 
పంపకాలలో తగవులు భారతాన్ని 
ఉదాహరణలుగా తెచ్చాయి 
సరిహద్దు గోడలు లేచాయి
గోడను తొలగించి చూద్దామా? 
నీ పిల్లలు నా పిల్లలు ఎంత హాయిగా
ఆడుకుంటారో కనులారా చూద్దామా?

శాంతి సహనం సమభావం అలవర్చుకో! 
విశ్వమానవ సౌభ్రాతృత్వం 
మనిషిగా నీ లక్ష్యం! 
గీతలు లేవు సరిహద్దులు లేవు 
అంతరాలు లేనేలేవు
అంతా సమానమే! మానవులంతా ఒక్కటే!
10
[20/08, 9:08 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..సరిహద్దు రేఖ

వెయ్యేళ్ళు కలిసి ఉన్నా
వేరు కుంపటి తప్పదని
ఒకే తల్లి బిడ్డలైనా
ఎవరికి వాళ్ళు రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోతామంటే ఏమంటాము
ఎక్కడున్నా క్షేమమేకదా కోరుకుంటాము
ఎవరి హద్దుల్లో వాళ్లుండమని 
అన్ని వాటాలు సమంగా పంచి ఇస్తాము
కుటుంబాలకే తప్పలేదు
దేశాలు కలిసుంటాయా
ఎప్పుడూ ఒకదేశాన్ని దెబ్బతీయడానికే పొంచి చూస్తూనే ఉంటాయి పొరుగు దేశాలు
పొట్లాడి తెచ్చుకున్న స్వాతంత్ర్యం దానికి సాక్ష్యం
అందుకే కావాలి సరిహద్దు రేఖ
చారిత్రక సంఘటనల పర్యవసానం కోసం
పరిపాలన సౌలభ్యం కోసం
తప్పదు లక్ష్మణ రేఖ
స్నేహంగా నటిస్తూనే
కవ్వింపు చర్యలకు పాల్పడే దుష్కర మూకలు చేసే కవ్వింపు చర్యలను ఆపేందుకు సరిహద్దు రేఖలే మనకు రక్షణ
చైనా,పాక్ దేశాలు ఎన్నటికీ ప్రమాదమే
నిర్ణయించుకున్నాక ఎవరి హద్దుల్లో వాళ్ళుంటేనే సరికదా
కంటికి రెప్పలా కాపలా కాస్తూ
దేశ సరిహద్దులను రక్షించే జవానుల ప్రాణాలు ఏ దేశానికైనా కావాలి
వారి రక్షణయే అన్ని దేశాలకు క్షేమం
సరిహద్దు లక్ష్మణ రేఖలను గౌరవిస్తూ ముందుకు సాగడమే

దేశాలన్నింటి కర్తవ్యం.

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...