Skip to main content

సామాజిక బాధ్యత 22082020

శివునూరి లలితాకృష్ణ గారు
వురిమిళ్ళ సునంద గారు

కోరాడ నరసింహారావు గారు


డాక్టర్ ఆంజనేయులు గారు



నిర్వహణ
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
శివునూరి లలితాకృష్ణ
మెరుగు మధు
ఐతగోని వెంకటేశ్వర్లు
*****"""""
కవివరుల జాబితా
1.స్వర్ణ సమత గారు
2.డాక్టర్ ఆంజనేయులు గారు
3.కోరాడ నరసింహా రావు గారు
4.శ్రీహరి ఏలె గారుఊ
5.సునంద వురిమిళ్ళ గారు
6.డాక్టర్ ఆంజనేయులు గారు
7. అపరాజిత రెడ్డి గారు
8.ఇంద్రవత్ రాహుల్ గారు
*******

[21/08, 8:00 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*
*21/08/2020*

*సామాజిక బాధ్యత*

ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత తో మెలగాలి,
సమాజం తో కలిసి జీవించాలి,
ఒంటరిగా ఏది సాధ్యం కాదు,
గ్రీకు రాజు అలెగ్జాండర్
ప్రపంచ విజేత ను అవుతానని
కలలు కని,
చివరకు ఏమయ్యాడు?
నేను అనునది
సత్యం_నిత్యం కాదు,
మనం అనే భావనతో
బ్రతుకు బాటలో
ముందుకు సాగాలి,
కుటుంబం_పాఠశాల,
సమాజం వీటి పట్ల
నైతిక బాధ్యతతో
వ్యవహరించాలి,
నీవు పుట్టినపుడు,
గిట్టినపుడు నీకు
సమాజం తో పని ఉంటుంది,
బ్రతికున్నంత కాలం సజ్జనునిగా
సమాజం తో కలిసి జీవించు
సామ్రాట్ గా పేరు గాంచు.

*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
2
[21/08, 8:29 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: సామాజిక బాధ్యత ఉన్నప్పుడే
మానవీయ సంబంధాలు పెంపొందుతాయి సమాజమంతా ఒకరికి ఒకరు పరస్పర సహకారం చేసుకున్నప్పుడే
మానవీయ సోదరభావం అందుతుంది

సమాజ సంబంధాల విశ్లేషణ లో
పేదా సాదా ధనవంతుల మధ్య

తారతమ్యాలు అవగాహన తెలుస్తుంది
నిన్ను నీవు తెలుసుకునేందుకు సమాజమే నీకు అండదండలు అందించే ఒక విశాల వేదిక
సామాజిక న్యాయం అందరికీ అందినప్పుడే
సమ సమాజ నిర్మాణమే మా లక్ష్యం
సకల జనుల ఆశయమే ఫలవంతం

జనాన్ని సంక్షేమ పథకాలు సమాజంలో అందించినప్పుడు అధినేతల బాధ్యతగా భావించండి

సమాజమే నీకు రక్షణ నీకు న్యాయం చేకూర్చే వేదిక అన్యాయాన్ని ఎదిరించే టువంటి ఒక ఆత్మీయ మిత్రులకు కలయిక అందుకే నేనంటాను సమాజం బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలుసుకో మిత్రమా

సమ సమాజ నిర్మాణమే నీ లక్ష్యం నీ బాధ్యత సకల జనుల జీవనమే అత్యవసరం తెలుసు కదా

సమాజమనే గుడిలో నివసించేది నీవు ఒక్కడివే కాదు అందరూ ఒక సహజీవనంలో మెలుగుతారు అని అందరిలో నీవు నీలో అందరూ
జీవించే సుగుణం అదే నీ బాధ్యత


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు భువనగిరి ఖమ్మం 7702537453
3
[21/08, 8:45 PM] Korada: కవితాగానం
అంశం:-,"సామాజిక
            బాధ్యత !"
కోరాడ నరసింహా రావు;దోహదపడాలి!
*****************
సమూహాలుగా ....
పశువుల్లా బ్రతికేటో
ళ్ళం....!
మనో వికాశంతో ....
పరిణతిచెంది...సమాజాలుగాస్థిరపడిపోయాం !
హక్కులు.....బాధ్యతలు,నియమాలు...కట్టుబాట్లు ! జీవన విధానంలో...ఎన్నెన్ని విశేషమార్పులో.....!
ఎవరిబాధ్యతవారు
సక్రమంగా నిర్వర్తిస్తేనే
కదా,అందరిహక్కులూ పరిరక్షించబడేది
      చట్టం - న్యాయం
ఈ వ్యవస్థ లెన్నున్నా
ప్రధానంగా ఉండవల సిందినైతికతే కదా !
అదిలేనిదే...ఎన్నున్నా...ఫలితంసూన్యమే...కదా...!
స్వీయక్రమశిక్షణ ....
నియంత్రణలు లేనిదే
సామాజికబాధ్యత...
పగటి కలే కదూ...!
నీ బాధ్యతను నీవు
శక్తివంచన లేకుండా
నిర్వర్తిస్తే...హక్కును
నువ్వడగక్కర్లేదు.,
దానికదే...వెదుక్కుంటూ వస్తుంది !
సామాజికులు గా...
బ్రతుకుతున్న మనుషులం మనం !
సామాజికబాధ్యతను
గుర్తెరిగి ప్రవర్తించాలి!
సామూహికఆనందానికి...వికాసానికి... దోహద పడాలి...!!
*****************
..........కోరాడ.
4

[21/08, 9:01 PM] Sreehari Ale: శ్రీ గురుభ్యోనమః :

పేరు : శ్రీహరి. ఏలె 
ఊరు : నల్లగొండ 
అంశం : సామజిక బాధ్యత 
శీర్షిక : వసుధైక కుటుంబం 

సమాజం పట్ల ఎదలో ఉప్పొంగిన మానసిక 
మధురమైన సేవ భావనయే సామజిక బాధ్యత !

అడవులకు తిరిగి జీవం పోయుటకై 
పురారంకితమవుదాం మరో హరిత హారానికి !

అజ్ఞాన తిమిరాలను రూపుమాపుటకై 
ప్రతినబూనుదాం సంపూర్ణ అక్షరాస్యత యజ్ఞం కై !

పేదల సంసారాలను కూల్చే నిషా రాకాసిని అంతం జేయుటకై 
నడుంబిగించుదాం సంపూర్ణ మద్యపాన నిషేధం కై !

కాలుష్య కంపు కాసారాలను తొలగించుటకై 
కదం తొక్కుదాం పర్యావరణ సంరక్షణ కై !

ప్రకృతి ఒడిలో నశించిపోయే జీవకోటి 
తిరిగి స్వాగతం పలుకుధాం జీవ వైవిధ్యానికై !

తోటి వారి క్షేమమే, మన కర్తవ్యంగా 
పాటించుదాం మాస్క్, శానిటైజర్ కరోనాను తరుముటకై !

దూరం చేయాల్సింది కరోనాను, కానీ రోగులను కాదు 
అవగాహనతో, సోదరభావంతో  సాధనంపుదాం !

ఉపాధిని, గూడును కోల్పోయి రోడ్డెక్కిన 
ఆదుకుందాం రక్తమోడిన పాదముద్రలను !

మనిషి సంఘజీవి, ఒంటరి కాదు సామజిక 
బాధ్యతతో నిర్మిద్దాం వసుధైక కుటుంబాన్ని !

హామీ పత్రం : ఈ నా కవిత స్వయం లిఖితం. ఇది దేనికి అనుకరణ, అనువాదం గాని కాదు.
5
[21/08, 9:17 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*
తేదీ:21-08-2020
పేరు:వురిమళ్ల సునంద,ఖమ్మం
అంశం: సామాజిక బాధ్యత
**********"********"*****
హక్కుల కోసం అనుక్షణం రగులుతూ
పిడికిలి బిగించి పోరాటానికి సిద్ధమయ్యే సమాజంలో 
అంతరంగం బాధ్యతను సదా
గుర్తు చేస్తూనే ఉంటుంది!

!మనమో అక్షర వృక్షమై ఎదిగేలా
స్వయంగా తలెత్తుకుని నిలబడేలా 
ఉనికి పరిమళాలు అంతటా విస్తరించేలా
చేసేది ఈ సమాజమే..

ఎందరో మహానుభావుల సమిష్టి కృషి మన ఉన్నతికి వెన్నెముక!
ఎందరో నిస్వార్థుల సేవా తత్పరత 
మన స్వేచ్చా స్వాతంత్ర్య ఫలాల భూమిక!

ఏడిస్తే ఓదార్చే నవ్వితే ఆనందించే
ఉన్నతికి చేయూత నిచ్చి
గెలుపును అభినందించే పౌరుల సమాజం ఇది!

సమాజం నాకేమిచ్చింది కాదు సమాజానికి మనమేం ఇచ్చామన్నదే ముఖ్యమన్న  పెద్దల మాటలను శిరసావహిద్దాం!

సామాజిక బాధ్యత గల పౌరులుగా
 మన వంతు సహకరిద్దాం!
మనసు గుండంలో
 మరిగే కన్నీటి చుక్కలకు స్పందించే గుణం నేర్పుదాం!

 ఎదుటి వారి గుండెల్లో నిబిడీకృతమైన  బాధకు మాటల లేపనమవ్వడం

బాధా తప్త   హృదయాల్లో నిండిప చీకటిని తొలగించేందుకు కొవ్వొత్తులం అవుదాం!

 ఇదే మనసా వాచా చేసే సామాజిక సేవ!
ఇదే సమాజంలో  భాగంగా చేసే

 సామాజిక బాధ్యత!
6
[23/08, 8:04 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: సమాజం లో మనిషి
సామాజిక బాధ్యత
సంఘము నుండి వేరు పడితే
అతడు ఒడ్డుకు చేరిన చేప లాంటి వాడు
సంఘ శక్తి అన్నింటికంటే గొప్పది

సంఘం శరణం గచ్చామి
బుద్ధం శరణం గచ్చామి
ధర్మం శరణం గచ్చామి
బుద్ధుడు ప్రవచించాడు

ఎవడైతే సంఘం నుండి 

 దూరమవుతాడు
[23/08, 8:07 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: సంగం మనల్ని కాపాడుతుంది
సంగం నిరంతరం నీకు వెన్నుదన్నుగా నిలిచింది
సంగం అవసరానికి ఆదుకుంటుంది
సంఘంలో లేని మనిషి
ఒంటరిగా యుద్ధం చేసేవాడు

సంఘంలోని ఐక్యమత్యమే
బలం
సంఘంలో లేనివాడు బలహీనుడు అవుతాడు

సంఘం నుంచి దూరం కాకు శక్తిని కోల్పోకుండా ఉండాలంటే
అది ఏ సంఘమైన నీవు చేరు అందులో అప్పుడే నీకు శక్తి యుక్తి

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు భువనగిరి ఖమ్మం 7702537453
7
[23/08, 8:09 PM] Aparajith: బ్రతుకు బ్రతికించు !

గుండెల్లో గుబులు 
సెగలు సెగలుగా !
ఈ లోకంపై కసి 
దుష్ట దుర్మార్గ కామాందులను 
దునుమాడాలని కాంక్ష !
విషనాగుల లోకం 
ముళ్లును ముళ్ళుతోనే తీయాలి 
ధర్మానికి కాల్లే లేవిపుడు !
ధర్మాత్ముల సాత్వికుల 
గుండెలు ముక్కలవుతుంటే 
సహనం సర్వం కోల్పోయి !
ఏ ఆంబోతులు కన్నాయిరా మిమ్మల్ని? !!
ఆడపిల్లలను చెరబట్టి 
వాళ్ళ రోదనలే మీకు 
మరణ మృదంగాలుతాయిరా !
చంటి పిల్లల ఆకలి చూళ్లేక 
ఒళ్ళమ్ముకునే అభాగ్యులు !
దుఃఖితుల రోదనలు 
వేల వేల సంవత్సరాల 
అణచివేతలు వెతలు 
మీ అమ్మలకు ప్రతిరూపాలు రా వెర్రివాడా !
గుళ్ళు గోపురాల్లో 
వేలకు వేలు లక్షలకు లక్షలు 
ముడుపులు కట్టి సమర్పించే వెర్రివాళ్ళు !
అవే డబ్బులతో 
నిరుపేదలు, నిర్భాగ్యులకు 
మానవత్వంతో ఉపాధి కల్పించండి రా 
మీలోనే దేవుళ్లను చుస్తార్రా వీళ్ళు !
దోపిడీ చేసి కూడబెట్టే 
తరతరాలు తరగని ఆస్తి దేనికిరా? !!
అందరం ఏదో ఓ రోజు పోయే వాళ్ళమే !
తరువాత నీ ఆస్తి ఏమైతే ఏం? 
మనిషి లా మానవత్వంతో 
బ్రతుకు బ్రతికించు 
అన్నార్తుల ఆకలి తీర్చు !!

అపరాజిత్
8
[23/08, 8:12 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం*
============

అంశం : సామజిక బాధ్యత 
తేది : 23/08/2020



         *సామజిక బాధ్యత*



రేపటి తరాల గురించి 
ఇవాళ ఆలోచించడం 
మానేసాము.. 
ఇవాళ్టి జాగ్రత్త 
రాబోయే తరాలకు 
పునాది రాయని 
మరిచిపోతున్నాము 
నేటి జనాభా పెరుగుదల 
రేపటి వారి సౌకర్యాల 
తరుగుదలగా 
గుర్తించలేకపోతున్నాము 
దేశ సౌభాగ్యాన్ని మరిచి 
మన బాధ్యతను 
పక్కకు నెట్టి 
ఇది ప్రభుత్వ కర్తవ్యంగా 
తలచి 
జనాభా నియంత్రణలో 
మనల్ని మనం 
మోసం చేసుకుంటున్నాము 
రాబోయే ఉపద్రవాలను 
విస్మరిస్తున్నాము.. 



*ఇంద్రావత్ రాహుల్* 
      *కొత్తపేట్*
 *నిజామాబాద్*

9848054079..

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...