నిర్వహణ
*******
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
శివునూరి లలితాకృష్ణ
మెరుగు మధు
ఐతగోని వెంకటేశ్వర్లు
*****************
1.ఇంద్రావత్ రాహుల్ గారు
2.స్వర్ణ సమత గారు
3.డాక్టర్ మహ్మద్ షరీఫ్ గారు
4.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
5.భూపతి గారు
6.సత్య నీలిమ గారు
7.వురిమళ్ళ సునంద గారు
8.ధనాశి ఉషారాణి గారు
9.డాక్టర్ ఆంజనేయులు గారు
10.శ్రీహరి ఏలె గారు
11.మర్రి జయశ్రీ గారు
12.డాక్టర్ ఆంజనేయులు గారు ఖమ్మం
13.కోరాడ నరసింహారావు గారు
14.రాపోలు అరుణా స్వామి గారు
15.శ్రీలక్ష్మి గారు
16.అపరాజిత రెడ్డి గారు
17.అయిత అనిత గారు
**************
1
[12/08, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం*
-------------------------------
అంశం : దేశభక్తి
తేది : 12/08/2020
*దేశ భక్తి*
సువిశాల భారత్ దేశం
పచ్చని ప్రకృతి వాతావరణం
స్వచ్ఛమైన మనుషులు
దేశ భక్తితో స్వాతంత్ర
సమరయోధులు ఎంతో
పోరాడి శాంతికి నిలయం
భారత్ దేశం
అణువణువునా నరాల్లో
రుధిరంలో దేశ భక్తితో
పోరాడుతూ చెరగని
ముద్ర వేస్తూ
భారత్ దేశం భక్తితో
దేశ భక్తి కలిగి ఎప్పుడు
సంతోషంగా వర్ధిల్లును..
*ఇంద్రావత్ రాహుల్*
*కొత్తపేట్*
*నిజామాబాద్*
9848054079
2
[12/08, 8:03 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*
*12/08/2020*
*దేశ భక్తి*
మనకు సమాజం ఏమి
ఇచ్చింది?
అనేది ముఖ్యం కాదు,
మనం సమాజానికి ఏం
ఇవ్వాలి?
మాత పిత లకు,
మాతృ భూమికి ఎలా?
సేవ చేయాలని,
మనల్ని మనం ప్రశ్నించుకుంటే
సమాధానము లభిస్తుంది,
దేశ మాత సేవలో తరించాలి,
దేశ భక్తి తో జీవించాలి,
దేశం కొరకు పాటు పడాలి,
ఈ మట్టికి సేవ చేసి,
ఋణం తీర్చుకోవాలి,
నేల తల్లి ఒడిలో సేద తీరాలని
తపించు,
తల్లి సేవ చేసే తరుణం కయి
వేచి చూచి ,
దేశ భవితకు బంగారు బాట
వేయాలి.
*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
3
[12/08, 8:05 PM] Sharief Sir: 🌹 కల్పవల్లి 🌹
1కం:
హారతి నిచ్చెదమమ్మా
భారతి మాకల్పవల్లి బంగరు
రాణి!
కోరిన వరముల నిచ్చెడి
ధారుణి నీకెవరు సాటి ధన్యుల
మమ్మా!
2ఉ:
భారతి కల్పవల్లి సమభావన జూపెడి దివ్యధాత్రి సం
స్కారము సద్గుణమ్ములను సంస్కృతి నేర్పిన పాలవెల్లి సత్
గారము జేయు వారలకు కామ్యము దీర్చెడి కామధేణు శ్రీ
కారము విశ్వమందు, మమకారము పంచెడి భారతావనిన్!
డా.మహ్మద్ షరీఫ్
4
[12/08, 8:16 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: **పాడవేకోకిలా పాడవే**
--డా.పాండాల
ఆడవే..ఆడవే..(ఘంటసాల గానం)
ప!! పాడవే.. పాడవే..
పాడవేకోకిలాపాడవే2
గారాల రాగాల్లో సరిగమలుసవరిస్తూ..
తేట తేనియ తీపిమోజులోమురిపిస్తు
లోకమందు పుణ్యవరదాయి
భారతనీ----!!పాడవే !!
1)తలమానికమ్ముగా కాశ్మీర్ సుందరం గుజరాత్ బెంగాలుబాహులుగ వర్థిల్లు
కెరళ తమిళ కన్నడ పాదపీటమ్ముగా
వెలుగొందుహైందవాసంస్కృతి
మిన్నయని..!!పాడవే!!
2)సిద్దార్థుని తపస్సులు ఫలించిన నేల
జైనశిక్కుమతములుద్భవించినవిచట
బహుభాషసొగసుతో భిన్నభావాలతో
వేదాలురంజిల్లు ఇతిహాసధరణని2
!!పా!!
మౌర్యగుప్తశౌర్యమొగలాయికళలతో
వ్యాస వాల్మికికాళిదాసాది కవులకు2
గంగగౌతమియమునకృష్ణతీరాలలో
అద్భుతా పట్టణా శిల్పసంపదగూర్చి2
!!పాడవే!!
డా.పాండాలమహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి
5
[12/08, 8:46 PM] Bupathi Sir: .........దేశ భక్తి......
సరి హద్దు సైనికుని త్యాగం లో
నాగలి పట్టిన రైతు శ్రమ చెమట ధార లలో,
దేశాన్ని నడిపించే దిశా
నిర్దేశకులలో, సామాజిక జీవన
మార్గాలను సానుకూల స్పందన లలో దేశ భక్తి
ఇమిడి జాలువారిన నాడు
యుద్దాలు, కుయుక్తులు
కనిపించవు...
నాటి భగత్ సింగ్ ,బోస్ ,గాంధీ దేశ భక్తి కి అనువాలు.....
ఏ దేశ ప్రగతి కైనా ఆ దేశ భక్తి
పై ఆధార పడి ఉంటుంది...
మరి మన దేశ భక్తి పాలకుల
ఎలిక పై సాగుతోంది....
నాటి ధన, మాన ప్రాణ త్యాగలే
దేశ భక్తి....నేటి చైతన్య
పురోభివృద్దే దేశ భక్తి...
ఏ. భూపతి
6
[12/08, 8:50 PM] కె. సత్యనీలిమ
వృత్తి : ఉపాధ్యాయురాలు ప్రవృత్తి :: *కవితా గానం*
*దేశభక్తి*
ఈదేశాన్ని తమ ఇల్లుగా
భావించి భారతీయులందరినీ
తమ సోదరిసోదరులుగా
అభిమానించి అందరి క్షేమం
కోసం అందరి రక్షణ కోసం
ప్రాణాలను లెక్కచేయక
సరిహద్దుల్లో కాపుగాసి
శత్రుసైనికులను అంతంచేసి
భరతమాతకు రక్తతిలకం
దిద్దిన జవానులది దేశభక్తి
అన్యాయం చేసిన వారిని శిక్షిస్తూ
న్యాయం చేసేవారిని రక్షిస్తూ
అరాచకాలను అంతంచేస్తూ
ప్రజలందరినీ రక్షించే
రక్షకభటులది దేశభక్తి
స్వార్థం అన్నది లేకుండా
అందరికీ అన్నంపెట్టేందుకు
తాను పస్తులుంటూ
అప్పులపాలయినా
వ్యవసాయం వదలని
రైతన్నది దేశభక్తి...
వలిపే సత్యనీలిమ
వనపర్తి
7
[12/08, 9:02 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*
తేదీ::12-08-2020
పేరు: వురిమళ్ల సునంద ఖమ్మం
శీర్షిక:: దేశభక్తి
**********************
తలుచుకుంటే చాలు
ఎదలో ఉప్పొంగే భక్తి భావం
నా దేశ దేహంలో నేను
శత్రు మూకలపై పోరాడేందుకు
ఓ వీరోచిత రక్త కణమై నందుకు!
ఆశయాల కోసం అసువులు బాసిన
అమర వీరుల త్యాగం
ఉరితాళ్ళను ముద్దాడిన సాహసం!
నరనరానా ప్రవహిస్తూ..
అహర్నిశలు కంటి రెప్పలా కాపాడే
సరిహద్దు సైనికుల దేశభక్తి!
ఆరుగాలం కష్టపడి పండించే రైతన్నల
శ్రమ భక్తి!
దేశ పౌరుల సుఖ సౌఖ్యాల కోసం
రెక్కలు ముక్కలు చేసుకునే శ్రామికుని
సేవా భక్తి!
ఇదే నన్ను నడిపించే విలువల శక్తి!
ఈ నేలపై మన జన్మ అపురూపమైన వరం
నింగిన రెపరెపలాడే మువ్వన్నెల! జెండా సాక్షిగా
సోదర తత్వంతో మెలుగుతూ
సానుభూతి సానుభూతి వక్తీకరిరిస్తూ
వేద వేదాంగాలు పురాణాలు వెలసిన
ఈ చోట పుట్టడమే మహా అదృష్టం!
8
[12/08, 9:11 PM] ధనాసి ఉషారాణి తలకోన: కవితా గానము
అంశం.దేశభక్తి
.......
తన కోసము మాత్రము
నిత్యము ఆలోచించి స్వార్థము చూపేటి కళికాలపు మాయలో
బారతీయుల భవితకు
ప్రాణము దారపోయుటకు
దేశ సరిహద్దు ప్రాంతాల్లో
నిత్యము ప్రహరకాసే సైనికుడిది
నిజమైన దేశభక్తి భువిలో
దేశ సేవకోసము నిత్యము సేవ కార్యక్రమంలో నిలిచిన
నిస్వార్థ పరుల్లో దాగి ఉన్నది
నిజమైన మానవత్వము
దేశభవిత కోసము నిలిచిన
ప్రజల ఛైతన్య పరిచే నిజమైన
ప్రజల్లో దాగింది దేశభక్తి
చక్కని కవితా కుసుమాలను అల్లి అన్యాయంను ఎదురించే కవిలో దాగుంది నిజమైన దేశభక్తి భావము
భరతమాత సేవలో ప్రాణములు అర్పించిన ఎందరో అమరుల జీవిత గాధలో నిజమైన దేశభక్తి దాగివుంది
దేశభక్తికి నిజమైన దేశభవిత ఆయుధము
జైహింద్
ధనాశి ఉషారాణి
భాకరాపేట. చిత్తూరు జిల్లా
ఆంద్రప్రదేశ్
9
[12/08, 9:14 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: కోకిల పాడిన పాటలు
మయూరి ఆడిన ఆటలు
తెలుగు నాట భక్తి రసం
ఆ సేతు హిమాచలం నుండి డి
సకల జనావళికి స్వాగతిస్తున్న ది
కోకిల పాడిన కమ్మని పాటల వెల్లువ
కోకిల అయిన కమ్మని పాటల కమనీయ ప్రతిధ్వనులు
కొండకోనలు వెల్లువలై సాగి వచ్చే
అలనాటి గౌతమ బుద్ధుని జాతక కథలు బుద్ధుని బోధనలు వెల్లువగా సాగే నాగార్జునకొండలో
ఆ అమరావతి స్తూపము చూడు
ఆ చైత్యము లో తొలి పదం నాగబు వెల్లివిరిసే
ధర్మ అశోకు గా మారే ఏరులై పారిన కళింగ రక్తపాత యుద్ధము తరువాత
శాంతి శాంతి స్వప్న సందేశమును
సంఘమిత్ర ను తన కుమారుని
పంపించి అందజేశాను కథ మహనీయుడు అశోకుడు
ధర్మచక్ర మే అతని జ్ఞాన చక్ర మై వెల్లివిరిసే భారతావనిలో
బుద్ధుని బోధనలు ముఖ్యమైనవి
కోరికలకు మూలము దుఃఖము గా
మహనీయ బుద్ధ బోధనలు వెల్లివిరిసే యావత్ భార
ఈ పాటల్లో ఈ గానములో లో ప్రజలందరికీ
10
[12/08, 9:14 PM] Sreehari Ale: కవితా గానం
తేది : 12/08/2020
పేరు : శ్రీహరి. ఏలె
అంశం : దేశ భక్తి
శీర్షిక : దేశ భక్తి - యువతకి స్ఫూర్తి
********************************
నాటి స్వాతంత్ర్య సమరపు ఆశయ శక్తి
మన ఎదలో దాచుకొన్న ఋణభావమే దేశ భక్తి
ఎందరో జాతీయ నాయకుల ఆత్మర్పణం
త్యాగజీవుల అవిరళ తర్పణం
ఆసేతు హిమాచలం నినదించే జనము
భారతీయుల ఆణువణువు ఉత్సాహం ఘనం
వందేమాతరం, దండి సత్యాగ్రహం
క్విట్ ఇండియా ఉద్యమ స్వాతంత్ర్య గీతిక
ప్రభాత కాల మువ్వన్నెల జాతీయ జెండా
భారతావని ఉప్పొంగే ఎదనిండా
నాటి భారత స్వాతంత్ర్యోద్యమ కీర్తి
నేటి యువతరం నవతరానికి స్ఫూర్తి
11
[12/08, 9:16 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..దేశభక్తి
మనమందరం మనుషులమే
అందరం భారతీయులమనే భావన
ఒకే దారనికి అల్లిన పువ్వుల వలె ఒకటే భావం
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా
ఎంత దూరంలో ఉన్నా
నా దేశం అనే గౌరవం
ప్రతి భారతీయుడి మదిలో ఉప్పొంగి
దేశం నాకేమి చేసిందని కాకుండా
నేను దేశానికేమి చేశానని తలచి
మన సంస్కృతీ సంప్రదాయాల్ని కాపాడుకోవడమే దేశభక్తి
దేశభక్తి నిరంతరం ప్రవహించే జీవనది
భారతీయుల నిండైన ఆత్మాభిమానం
దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికులది దేశభక్తి
నా దేశం అనే స్వార్థం ఉండడం దేశభక్తి
తాను పస్థులున్నా రైతన్న
లోకానికి అన్నం పెట్టాలన్న తపనతో చేసే కృషే నిజమైన దేశభక్తి
దేశంకోసం ప్రాణాలు అర్పించేంతటి త్యాగం లేకున్నా
హాని చేయకపోవడమే దేశభక్తి
మంచి చేయడమే నా మతం
మానవత్వం పరిమళం వేదజల్లడమే నా కర్తవ్యం అంటూ ఇతరుల దేశభక్తి అర్థం చేసుకోవడమే
అసలైన దేశభక్తి
12.
దేశభక్తి గీతాలు
దేశభక్తి ఈ దేశపు నిజమైన హక్కు
సరిహద్దులు మంచుకొండల్లో
రాత్రింబగళ్ళు కాపలా కాసే
చలికి వర్షానికి ఎండకు తట్టుకుని నిలబడే బార్డర్ లో సైనికుడా
ఈ దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతాడు
అమర జవానుల అందరూ ఈ దేశ ప్రజల రక్షణ కోసమే తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్షిస్తారు
అలాంటి మహనీయులను పరమవీరచక్ర లతో సన్మానించడం మన దేశపు కర్తవ్యం
అదిగో గుడారాలు వేసుకొని ని ఇటు వస్తున్న సామ్రాజ్యవాద దేశం
గాల్ వాన్ కొండల్లో తిప్పి కొట్టిన మన ట్యాంకర్లు ఆకాశంలో డేగకన్ను వేసి తిరిగే విమానాలు
పైలెట్లకు వందనం మన డోన్ లకు వందనం అభివందనం
చైనా కుట్రలకు త్వరలోనే బుద్ధి చెబుతున్నాం చెప్పాను అయినా
వాడి కుటిల బుద్ధి మారలేదు దు
ఈ స్వాతంత్ర దినోత్సవ వేళ
వందనం వందనం జాతీయ జెండాకు అభివందనం సెల్యూట్
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు భువనగిరి ఖమ్మం 7702537453
13.
కవితాగానం
అంశం:- * దేశభక్తి *
కోరాడ నరసింహా రావు ;* వారసులం *
***********
దేశమంటే..."మట్టే " నోయ్...!
ఈ మట్టినుండే అన్నీ పుట్టాయిగా...!
ప్రతి ప్రాణీ రూపు గ ట్టింది...ఈ మట్టి నుం డే...!
ఇక్కడి గాలిపీల్చే బ్ర తుకుతున్నాం...!
ఈ నేలమీది తిండి తినే...పెరిగిపెద్దగామారి,ప్రయోజకులు మై...చివరికి ఈ మట్టిలోనేకలిసి...పో
తున్నాం!
ఒక్కోనేలకీఒక్కోసార ముంటుందికదోయ్!
ఏ నేల మహత్తు ఆ నేలదే...!
మనది కర్మ,ధర్మ,త్యా గ,యోగ భూమోయ్!
ఎన్నో జన్మల పుణ్య ఫలం చేతనే మన మీ పవిత్ర భూమిలో పుట్టాం...! ఈ దేశం కోసం,ఈ దేశస్వాతం త్య్రంకోసం...ఎందరో
మనపూర్వులు తమ సర్వస్వాన్నీ ...ప్రాణాలతోసహా త్యాగం చే సారు ! ఆ మహాత్ము లకు వారసులం మనం !
ఏ చిన్న ఉపకారాని కైనా...కృతజ్ఞతనుతెలిపేవివేకమున్నమనుషులం...ఈ భూఓ నుండి యిన్నిన్ని పొం దు తున్నందుకుమన
దేశంపట్ల మన కెంత ప్రేముండాలి...గౌరవముండాలి...మననరనరాల్లో దేశ భక్తి రక్త మై ప్రవహించ వద్దూ!
ఈ మన దేశ స్వేచ్ఛ కోసం...స్వాతంత్య్రం
కోసం,సార్వ భౌమాధి కారంకోసం,సమగ్రత కోసం...నిరంతరం పా టు పడే దేశ భక్తిమన
లోప్రపూరితమైవుండొద్దా... !?
అప్పుడే కదూ మనం నిజమైన దేశ భక్తుల మవుతాం...!అప్పుడు కదామనం నిజమైన భారత దేశ పౌరులం అనిపించు కుంటాం !!
*****************
......కోరాడ.
14
[13/08, 8:25 PM] Rapolu Aruna Siripuram Poet: నిర్వాహకులకు నమస్సులు
*భాగ్యసీమ*
ఆ. వె.
ఆది శంకరార్యు లవతరించెనిచట
ఉపనిషత్తు లిటనె యుద్భవించె
విష్ణు రూపుడైన వేదమూర్తుని గన్న
భరత భూమి కనగ, భాగ్యసీమ
ఆ. వె.
మతములన్ని గూడి మానవత్వము బెంచు
సర్వమత హితమ్ము సమ్మతమ్ము
అంతరాలు నాడె అంతరించెను గాన
భరత భూమి కనగ భాగ్యసీమ
ఆ. వె.
అన్న దమ్ముల వలె నందరు నొక్కటై
ఐకమత్య మండ్రు యవని జనులు
విశ్వ మానవాభివృధ్ధికై తపియించు
భరత భూమి కనగ భాగ్యసీమ
ఆ. వె.
శాంత్యహింస తోడ స్వాతంత్ర్య మును దెచ్చు
భూరి చరిత గలది పుణ్య ధాత్రి
కన్నతల్లి కన్న మిన్నయౌ నీ భూమి
భరత భూమి కనగ , భాగ్యసీమ
✍️రాపోలు అరుణా స్వామి
సిరిపురం , యాదాద్రి జిల్లా
8328277215
15
[13/08, 8:27 PM] శ్రీ లక్ష్మి విజయనగరం: కవితా గానం
తేదీ: 13-08- 2020
అంశము: దేశభక్తి
పేరు: శ్రీలక్ష్మి చివుకుల
ఆసేతు హిమాచలం తూర్పు పశ్చిమ కొండలు
జీవనదులు పచ్చని పంటల మైదానాలు
అన్నీ కలసిన నా భారత భూమి
తలచుకుంటే చాలును
దేశభక్తి కలుగుతుంది
అందరి మదినిండా!
ఎన్నెన్ని రాష్ట్రాలు రాజధానులు
ఎన్నెన్ని భాషలు నాగరికతలు
ఆలయాలు శిల్పాలు పుణ్యక్షేత్రాలు
వింత వింత కట్టడాలు
పురాణాలు ఇతిహాసాలు
అన్ని జాతులకు వేరు వేరు నాగరికతలు
అన్ని మతాలకు వేరువేరు సంప్రదాయాలు
అన్నీ కలిసిన సమైక్య భారతావని
భిన్నత్వంలో ఏకత్వం
తలచుకుంటే చాలును
దేశభక్తి కలుగుతుంది
అందరి మదినిండా!
శతకోటి భారతీయుల రాజ్యాంగము ఒక్కటే!
ప్రజల విలువలను హక్కులను కాపాడుట కొరకే!
ప్రజాస్వామ్య సర్వసత్తాక
లౌకిక సమాఖ్యరాజ్యమిది
నా దేశ చరిత్ర ఎంతో ఘనము
నా దేశ వర్తమానము అనుసరణీయం
నా దేశ భవిష్యత్తు స్వర్ణ యుగము
నా దేశ ప్రజలంతా దేశభక్తులే!
దేశమంతా పచ్చటి పంటలను
పండించే రైతన్నలు
దేశ వాసులకు అన్నదాతలు
సైనిక నౌకా వాయుసేనలలో
అసంఖ్యాక జవానులు
నిదురెరుగక గస్తీ తిరిగేది మా కోసమే
జై జవాన్! జై కిసాన్!
ఏ నోట విన్నా జై భారత్ నినాదాలు
జై భారత్ ! జై జై భరత మాత !
అందుకొనుము మా వందనాలు!
16
[13/08, 8:57 PM] Aparajith: నాయకుడు
పరుగెత్తే గోదారిలా
ఉద్యమం ఊపిరిగా
వెన్నంటే అనుచరులతో
జాతి మనుగడ కోసం
వేగిరమే మేల్కొని
సాగిపో !
దిశానిర్దేశం చేస్తూ
నాయకునివి గా
సర్వం దిగమింగే
వినాయకునివి గాకు !
జనాన్ని జాగృతం చేస్తూ
మానవాళి మనుగడ కోసం
రహదారివై నడువు !
అన్నార్తుల ఆకలి తీర్చు
చీకటి జీవితాల్లో
వెలుగు రేఖవు గా !
చదువులు రాని
పల్లెటూళ్ళ లో
అక్షర జ్ఞానం కలిగించు !
వెలుగు పూలు పూయించు
మదిని మందిరం చేయి
చీకటి హృదయాలలో
దీపాలు వెలిగించు !
అజ్ఞానాన్ని ఆమడ దూరం
తరిమేయ్ !
ముళ్ల దారులైన
కన్నీటి ధారాలైన
నీ నాయకత్వపు లక్షణంలో
తేడా రానీకు !
పొంచి వున్న శత్రుమూక
నీ దారి కడ్డు వస్తే
నా దారి కరుణా సముద్రమని
నిక్కచ్చికగా చెప్పు !!
అపరాజిత్
17
[13/08, 9:00 PM] Anitha Aitha Poetess: *కవితా గానం*
తేది: 13.08.2020
అంశం : దేశభక్తి
శీర్షిక: *దేశభక్తి అంటే ఏంటి..?*
మహోన్నత హిమగిరులతో
పవిత్ర నదీమతల్లుల ప్రవాహాలతో
వేదాలు వెలిసిన జ్ఞానభూమిని పొగడ్తలతో
ముంచెత్తడమా?
స్వాతంత్ర సమరయోధులను
సరిహద్దు సైనికులను
వైజ్ఞానిక తత్వవేత్తలను
స్మరిస్తూ నమస్కరించడమా?
జాతీపర్వదినాలలో
నాయకుల జన్మదినాలలో
వేదికలు దద్దరిల్లేలా ఉపన్యసించడమా?
స్మృతి చిహ్నాలను నిర్మిస్తూ
విగ్రహాలను ఆవిష్కరిస్తూ
పూలదండలతో పూజించడమా?
దేశసంపదను కాపాడక్కరలేదా?
మహానుభావుల అడుగుజాడల్లో నడవక్కరలేదా?
జాతీయజెండాను దర్శించగానే
అణువణువు పులకరించిపోవక్కరలేదా?
నా వంతుగా ఏమిచేయాలని ఆలోచించక్కరలేదా?
జాతీయసమైక్యతా యజ్ఞంలో సమిధవ్వక్కరలేదా?
భారతావని సమగ్రతకు చేయూతవక్కరలేదా?
మానవత్వం పొదువుకో
కర్తవ్యదీక్ష బూనుకో
సాయపు కరములను పరులకు అందించి ఆదుకో!
నీ మాతృభూమిని స్వచ్ఛంగా తీర్చిదిద్ది
పుట్టిన గడ్డ ఋణం తీర్చుకో!
రచన
అయిత అనిత
8985348424
హామీపత్రం
ఇది నా స్వీయరచన
*******
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
శివునూరి లలితాకృష్ణ
మెరుగు మధు
ఐతగోని వెంకటేశ్వర్లు
*****************
1.ఇంద్రావత్ రాహుల్ గారు
2.స్వర్ణ సమత గారు
3.డాక్టర్ మహ్మద్ షరీఫ్ గారు
4.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
5.భూపతి గారు
6.సత్య నీలిమ గారు
7.వురిమళ్ళ సునంద గారు
8.ధనాశి ఉషారాణి గారు
9.డాక్టర్ ఆంజనేయులు గారు
10.శ్రీహరి ఏలె గారు
11.మర్రి జయశ్రీ గారు
12.డాక్టర్ ఆంజనేయులు గారు ఖమ్మం
13.కోరాడ నరసింహారావు గారు
14.రాపోలు అరుణా స్వామి గారు
15.శ్రీలక్ష్మి గారు
16.అపరాజిత రెడ్డి గారు
17.అయిత అనిత గారు
**************
1
[12/08, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం*
-------------------------------
అంశం : దేశభక్తి
తేది : 12/08/2020
*దేశ భక్తి*
సువిశాల భారత్ దేశం
పచ్చని ప్రకృతి వాతావరణం
స్వచ్ఛమైన మనుషులు
దేశ భక్తితో స్వాతంత్ర
సమరయోధులు ఎంతో
పోరాడి శాంతికి నిలయం
భారత్ దేశం
అణువణువునా నరాల్లో
రుధిరంలో దేశ భక్తితో
పోరాడుతూ చెరగని
ముద్ర వేస్తూ
భారత్ దేశం భక్తితో
దేశ భక్తి కలిగి ఎప్పుడు
సంతోషంగా వర్ధిల్లును..
*ఇంద్రావత్ రాహుల్*
*కొత్తపేట్*
*నిజామాబాద్*
9848054079
2
[12/08, 8:03 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*
*12/08/2020*
*దేశ భక్తి*
మనకు సమాజం ఏమి
ఇచ్చింది?
అనేది ముఖ్యం కాదు,
మనం సమాజానికి ఏం
ఇవ్వాలి?
మాత పిత లకు,
మాతృ భూమికి ఎలా?
సేవ చేయాలని,
మనల్ని మనం ప్రశ్నించుకుంటే
సమాధానము లభిస్తుంది,
దేశ మాత సేవలో తరించాలి,
దేశ భక్తి తో జీవించాలి,
దేశం కొరకు పాటు పడాలి,
ఈ మట్టికి సేవ చేసి,
ఋణం తీర్చుకోవాలి,
నేల తల్లి ఒడిలో సేద తీరాలని
తపించు,
తల్లి సేవ చేసే తరుణం కయి
వేచి చూచి ,
దేశ భవితకు బంగారు బాట
వేయాలి.
*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
3
[12/08, 8:05 PM] Sharief Sir: 🌹 కల్పవల్లి 🌹
1కం:
హారతి నిచ్చెదమమ్మా
భారతి మాకల్పవల్లి బంగరు
రాణి!
కోరిన వరముల నిచ్చెడి
ధారుణి నీకెవరు సాటి ధన్యుల
మమ్మా!
2ఉ:
భారతి కల్పవల్లి సమభావన జూపెడి దివ్యధాత్రి సం
స్కారము సద్గుణమ్ములను సంస్కృతి నేర్పిన పాలవెల్లి సత్
గారము జేయు వారలకు కామ్యము దీర్చెడి కామధేణు శ్రీ
కారము విశ్వమందు, మమకారము పంచెడి భారతావనిన్!
డా.మహ్మద్ షరీఫ్
4
[12/08, 8:16 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: **పాడవేకోకిలా పాడవే**
--డా.పాండాల
ఆడవే..ఆడవే..(ఘంటసాల గానం)
ప!! పాడవే.. పాడవే..
పాడవేకోకిలాపాడవే2
గారాల రాగాల్లో సరిగమలుసవరిస్తూ..
తేట తేనియ తీపిమోజులోమురిపిస్తు
లోకమందు పుణ్యవరదాయి
భారతనీ----!!పాడవే !!
1)తలమానికమ్ముగా కాశ్మీర్ సుందరం గుజరాత్ బెంగాలుబాహులుగ వర్థిల్లు
కెరళ తమిళ కన్నడ పాదపీటమ్ముగా
వెలుగొందుహైందవాసంస్కృతి
మిన్నయని..!!పాడవే!!
2)సిద్దార్థుని తపస్సులు ఫలించిన నేల
జైనశిక్కుమతములుద్భవించినవిచట
బహుభాషసొగసుతో భిన్నభావాలతో
వేదాలురంజిల్లు ఇతిహాసధరణని2
!!పా!!
మౌర్యగుప్తశౌర్యమొగలాయికళలతో
వ్యాస వాల్మికికాళిదాసాది కవులకు2
గంగగౌతమియమునకృష్ణతీరాలలో
అద్భుతా పట్టణా శిల్పసంపదగూర్చి2
!!పాడవే!!
డా.పాండాలమహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి
5
[12/08, 8:46 PM] Bupathi Sir: .........దేశ భక్తి......
సరి హద్దు సైనికుని త్యాగం లో
నాగలి పట్టిన రైతు శ్రమ చెమట ధార లలో,
దేశాన్ని నడిపించే దిశా
నిర్దేశకులలో, సామాజిక జీవన
మార్గాలను సానుకూల స్పందన లలో దేశ భక్తి
ఇమిడి జాలువారిన నాడు
యుద్దాలు, కుయుక్తులు
కనిపించవు...
నాటి భగత్ సింగ్ ,బోస్ ,గాంధీ దేశ భక్తి కి అనువాలు.....
ఏ దేశ ప్రగతి కైనా ఆ దేశ భక్తి
పై ఆధార పడి ఉంటుంది...
మరి మన దేశ భక్తి పాలకుల
ఎలిక పై సాగుతోంది....
నాటి ధన, మాన ప్రాణ త్యాగలే
దేశ భక్తి....నేటి చైతన్య
పురోభివృద్దే దేశ భక్తి...
ఏ. భూపతి
6
[12/08, 8:50 PM] కె. సత్యనీలిమ
వృత్తి : ఉపాధ్యాయురాలు ప్రవృత్తి :: *కవితా గానం*
*దేశభక్తి*
ఈదేశాన్ని తమ ఇల్లుగా
భావించి భారతీయులందరినీ
తమ సోదరిసోదరులుగా
అభిమానించి అందరి క్షేమం
కోసం అందరి రక్షణ కోసం
ప్రాణాలను లెక్కచేయక
సరిహద్దుల్లో కాపుగాసి
శత్రుసైనికులను అంతంచేసి
భరతమాతకు రక్తతిలకం
దిద్దిన జవానులది దేశభక్తి
అన్యాయం చేసిన వారిని శిక్షిస్తూ
న్యాయం చేసేవారిని రక్షిస్తూ
అరాచకాలను అంతంచేస్తూ
ప్రజలందరినీ రక్షించే
రక్షకభటులది దేశభక్తి
స్వార్థం అన్నది లేకుండా
అందరికీ అన్నంపెట్టేందుకు
తాను పస్తులుంటూ
అప్పులపాలయినా
వ్యవసాయం వదలని
రైతన్నది దేశభక్తి...
వలిపే సత్యనీలిమ
వనపర్తి
7
[12/08, 9:02 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*
తేదీ::12-08-2020
పేరు: వురిమళ్ల సునంద ఖమ్మం
శీర్షిక:: దేశభక్తి
**********************
తలుచుకుంటే చాలు
ఎదలో ఉప్పొంగే భక్తి భావం
నా దేశ దేహంలో నేను
శత్రు మూకలపై పోరాడేందుకు
ఓ వీరోచిత రక్త కణమై నందుకు!
ఆశయాల కోసం అసువులు బాసిన
అమర వీరుల త్యాగం
ఉరితాళ్ళను ముద్దాడిన సాహసం!
నరనరానా ప్రవహిస్తూ..
అహర్నిశలు కంటి రెప్పలా కాపాడే
సరిహద్దు సైనికుల దేశభక్తి!
ఆరుగాలం కష్టపడి పండించే రైతన్నల
శ్రమ భక్తి!
దేశ పౌరుల సుఖ సౌఖ్యాల కోసం
రెక్కలు ముక్కలు చేసుకునే శ్రామికుని
సేవా భక్తి!
ఇదే నన్ను నడిపించే విలువల శక్తి!
ఈ నేలపై మన జన్మ అపురూపమైన వరం
నింగిన రెపరెపలాడే మువ్వన్నెల! జెండా సాక్షిగా
సోదర తత్వంతో మెలుగుతూ
సానుభూతి సానుభూతి వక్తీకరిరిస్తూ
వేద వేదాంగాలు పురాణాలు వెలసిన
ఈ చోట పుట్టడమే మహా అదృష్టం!
8
[12/08, 9:11 PM] ధనాసి ఉషారాణి తలకోన: కవితా గానము
అంశం.దేశభక్తి
.......
తన కోసము మాత్రము
నిత్యము ఆలోచించి స్వార్థము చూపేటి కళికాలపు మాయలో
బారతీయుల భవితకు
ప్రాణము దారపోయుటకు
దేశ సరిహద్దు ప్రాంతాల్లో
నిత్యము ప్రహరకాసే సైనికుడిది
నిజమైన దేశభక్తి భువిలో
దేశ సేవకోసము నిత్యము సేవ కార్యక్రమంలో నిలిచిన
నిస్వార్థ పరుల్లో దాగి ఉన్నది
నిజమైన మానవత్వము
దేశభవిత కోసము నిలిచిన
ప్రజల ఛైతన్య పరిచే నిజమైన
ప్రజల్లో దాగింది దేశభక్తి
చక్కని కవితా కుసుమాలను అల్లి అన్యాయంను ఎదురించే కవిలో దాగుంది నిజమైన దేశభక్తి భావము
భరతమాత సేవలో ప్రాణములు అర్పించిన ఎందరో అమరుల జీవిత గాధలో నిజమైన దేశభక్తి దాగివుంది
దేశభక్తికి నిజమైన దేశభవిత ఆయుధము
జైహింద్
ధనాశి ఉషారాణి
భాకరాపేట. చిత్తూరు జిల్లా
ఆంద్రప్రదేశ్
9
[12/08, 9:14 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: కోకిల పాడిన పాటలు
మయూరి ఆడిన ఆటలు
తెలుగు నాట భక్తి రసం
ఆ సేతు హిమాచలం నుండి డి
సకల జనావళికి స్వాగతిస్తున్న ది
కోకిల పాడిన కమ్మని పాటల వెల్లువ
కోకిల అయిన కమ్మని పాటల కమనీయ ప్రతిధ్వనులు
కొండకోనలు వెల్లువలై సాగి వచ్చే
అలనాటి గౌతమ బుద్ధుని జాతక కథలు బుద్ధుని బోధనలు వెల్లువగా సాగే నాగార్జునకొండలో
ఆ అమరావతి స్తూపము చూడు
ఆ చైత్యము లో తొలి పదం నాగబు వెల్లివిరిసే
ధర్మ అశోకు గా మారే ఏరులై పారిన కళింగ రక్తపాత యుద్ధము తరువాత
శాంతి శాంతి స్వప్న సందేశమును
సంఘమిత్ర ను తన కుమారుని
పంపించి అందజేశాను కథ మహనీయుడు అశోకుడు
ధర్మచక్ర మే అతని జ్ఞాన చక్ర మై వెల్లివిరిసే భారతావనిలో
బుద్ధుని బోధనలు ముఖ్యమైనవి
కోరికలకు మూలము దుఃఖము గా
మహనీయ బుద్ధ బోధనలు వెల్లివిరిసే యావత్ భార
ఈ పాటల్లో ఈ గానములో లో ప్రజలందరికీ
10
[12/08, 9:14 PM] Sreehari Ale: కవితా గానం
తేది : 12/08/2020
పేరు : శ్రీహరి. ఏలె
అంశం : దేశ భక్తి
శీర్షిక : దేశ భక్తి - యువతకి స్ఫూర్తి
********************************
నాటి స్వాతంత్ర్య సమరపు ఆశయ శక్తి
మన ఎదలో దాచుకొన్న ఋణభావమే దేశ భక్తి
ఎందరో జాతీయ నాయకుల ఆత్మర్పణం
త్యాగజీవుల అవిరళ తర్పణం
ఆసేతు హిమాచలం నినదించే జనము
భారతీయుల ఆణువణువు ఉత్సాహం ఘనం
వందేమాతరం, దండి సత్యాగ్రహం
క్విట్ ఇండియా ఉద్యమ స్వాతంత్ర్య గీతిక
ప్రభాత కాల మువ్వన్నెల జాతీయ జెండా
భారతావని ఉప్పొంగే ఎదనిండా
నాటి భారత స్వాతంత్ర్యోద్యమ కీర్తి
నేటి యువతరం నవతరానికి స్ఫూర్తి
11
[12/08, 9:16 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..దేశభక్తి
మనమందరం మనుషులమే
అందరం భారతీయులమనే భావన
ఒకే దారనికి అల్లిన పువ్వుల వలె ఒకటే భావం
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా
ఎంత దూరంలో ఉన్నా
నా దేశం అనే గౌరవం
ప్రతి భారతీయుడి మదిలో ఉప్పొంగి
దేశం నాకేమి చేసిందని కాకుండా
నేను దేశానికేమి చేశానని తలచి
మన సంస్కృతీ సంప్రదాయాల్ని కాపాడుకోవడమే దేశభక్తి
దేశభక్తి నిరంతరం ప్రవహించే జీవనది
భారతీయుల నిండైన ఆత్మాభిమానం
దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికులది దేశభక్తి
నా దేశం అనే స్వార్థం ఉండడం దేశభక్తి
తాను పస్థులున్నా రైతన్న
లోకానికి అన్నం పెట్టాలన్న తపనతో చేసే కృషే నిజమైన దేశభక్తి
దేశంకోసం ప్రాణాలు అర్పించేంతటి త్యాగం లేకున్నా
హాని చేయకపోవడమే దేశభక్తి
మంచి చేయడమే నా మతం
మానవత్వం పరిమళం వేదజల్లడమే నా కర్తవ్యం అంటూ ఇతరుల దేశభక్తి అర్థం చేసుకోవడమే
అసలైన దేశభక్తి
12.
దేశభక్తి గీతాలు
దేశభక్తి ఈ దేశపు నిజమైన హక్కు
సరిహద్దులు మంచుకొండల్లో
రాత్రింబగళ్ళు కాపలా కాసే
చలికి వర్షానికి ఎండకు తట్టుకుని నిలబడే బార్డర్ లో సైనికుడా
ఈ దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతాడు
అమర జవానుల అందరూ ఈ దేశ ప్రజల రక్షణ కోసమే తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్షిస్తారు
అలాంటి మహనీయులను పరమవీరచక్ర లతో సన్మానించడం మన దేశపు కర్తవ్యం
అదిగో గుడారాలు వేసుకొని ని ఇటు వస్తున్న సామ్రాజ్యవాద దేశం
గాల్ వాన్ కొండల్లో తిప్పి కొట్టిన మన ట్యాంకర్లు ఆకాశంలో డేగకన్ను వేసి తిరిగే విమానాలు
పైలెట్లకు వందనం మన డోన్ లకు వందనం అభివందనం
చైనా కుట్రలకు త్వరలోనే బుద్ధి చెబుతున్నాం చెప్పాను అయినా
వాడి కుటిల బుద్ధి మారలేదు దు
ఈ స్వాతంత్ర దినోత్సవ వేళ
వందనం వందనం జాతీయ జెండాకు అభివందనం సెల్యూట్
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు భువనగిరి ఖమ్మం 7702537453
13.
కవితాగానం
అంశం:- * దేశభక్తి *
కోరాడ నరసింహా రావు ;* వారసులం *
***********
దేశమంటే..."మట్టే " నోయ్...!
ఈ మట్టినుండే అన్నీ పుట్టాయిగా...!
ప్రతి ప్రాణీ రూపు గ ట్టింది...ఈ మట్టి నుం డే...!
ఇక్కడి గాలిపీల్చే బ్ర తుకుతున్నాం...!
ఈ నేలమీది తిండి తినే...పెరిగిపెద్దగామారి,ప్రయోజకులు మై...చివరికి ఈ మట్టిలోనేకలిసి...పో
తున్నాం!
ఒక్కోనేలకీఒక్కోసార ముంటుందికదోయ్!
ఏ నేల మహత్తు ఆ నేలదే...!
మనది కర్మ,ధర్మ,త్యా గ,యోగ భూమోయ్!
ఎన్నో జన్మల పుణ్య ఫలం చేతనే మన మీ పవిత్ర భూమిలో పుట్టాం...! ఈ దేశం కోసం,ఈ దేశస్వాతం త్య్రంకోసం...ఎందరో
మనపూర్వులు తమ సర్వస్వాన్నీ ...ప్రాణాలతోసహా త్యాగం చే సారు ! ఆ మహాత్ము లకు వారసులం మనం !
ఏ చిన్న ఉపకారాని కైనా...కృతజ్ఞతనుతెలిపేవివేకమున్నమనుషులం...ఈ భూఓ నుండి యిన్నిన్ని పొం దు తున్నందుకుమన
దేశంపట్ల మన కెంత ప్రేముండాలి...గౌరవముండాలి...మననరనరాల్లో దేశ భక్తి రక్త మై ప్రవహించ వద్దూ!
ఈ మన దేశ స్వేచ్ఛ కోసం...స్వాతంత్య్రం
కోసం,సార్వ భౌమాధి కారంకోసం,సమగ్రత కోసం...నిరంతరం పా టు పడే దేశ భక్తిమన
లోప్రపూరితమైవుండొద్దా... !?
అప్పుడే కదూ మనం నిజమైన దేశ భక్తుల మవుతాం...!అప్పుడు కదామనం నిజమైన భారత దేశ పౌరులం అనిపించు కుంటాం !!
*****************
......కోరాడ.
14
[13/08, 8:25 PM] Rapolu Aruna Siripuram Poet: నిర్వాహకులకు నమస్సులు
*భాగ్యసీమ*
ఆ. వె.
ఆది శంకరార్యు లవతరించెనిచట
ఉపనిషత్తు లిటనె యుద్భవించె
విష్ణు రూపుడైన వేదమూర్తుని గన్న
భరత భూమి కనగ, భాగ్యసీమ
ఆ. వె.
మతములన్ని గూడి మానవత్వము బెంచు
సర్వమత హితమ్ము సమ్మతమ్ము
అంతరాలు నాడె అంతరించెను గాన
భరత భూమి కనగ భాగ్యసీమ
ఆ. వె.
అన్న దమ్ముల వలె నందరు నొక్కటై
ఐకమత్య మండ్రు యవని జనులు
విశ్వ మానవాభివృధ్ధికై తపియించు
భరత భూమి కనగ భాగ్యసీమ
ఆ. వె.
శాంత్యహింస తోడ స్వాతంత్ర్య మును దెచ్చు
భూరి చరిత గలది పుణ్య ధాత్రి
కన్నతల్లి కన్న మిన్నయౌ నీ భూమి
భరత భూమి కనగ , భాగ్యసీమ
✍️రాపోలు అరుణా స్వామి
సిరిపురం , యాదాద్రి జిల్లా
8328277215
15
[13/08, 8:27 PM] శ్రీ లక్ష్మి విజయనగరం: కవితా గానం
తేదీ: 13-08- 2020
అంశము: దేశభక్తి
పేరు: శ్రీలక్ష్మి చివుకుల
ఆసేతు హిమాచలం తూర్పు పశ్చిమ కొండలు
జీవనదులు పచ్చని పంటల మైదానాలు
అన్నీ కలసిన నా భారత భూమి
తలచుకుంటే చాలును
దేశభక్తి కలుగుతుంది
అందరి మదినిండా!
ఎన్నెన్ని రాష్ట్రాలు రాజధానులు
ఎన్నెన్ని భాషలు నాగరికతలు
ఆలయాలు శిల్పాలు పుణ్యక్షేత్రాలు
వింత వింత కట్టడాలు
పురాణాలు ఇతిహాసాలు
అన్ని జాతులకు వేరు వేరు నాగరికతలు
అన్ని మతాలకు వేరువేరు సంప్రదాయాలు
అన్నీ కలిసిన సమైక్య భారతావని
భిన్నత్వంలో ఏకత్వం
తలచుకుంటే చాలును
దేశభక్తి కలుగుతుంది
అందరి మదినిండా!
శతకోటి భారతీయుల రాజ్యాంగము ఒక్కటే!
ప్రజల విలువలను హక్కులను కాపాడుట కొరకే!
ప్రజాస్వామ్య సర్వసత్తాక
లౌకిక సమాఖ్యరాజ్యమిది
నా దేశ చరిత్ర ఎంతో ఘనము
నా దేశ వర్తమానము అనుసరణీయం
నా దేశ భవిష్యత్తు స్వర్ణ యుగము
నా దేశ ప్రజలంతా దేశభక్తులే!
దేశమంతా పచ్చటి పంటలను
పండించే రైతన్నలు
దేశ వాసులకు అన్నదాతలు
సైనిక నౌకా వాయుసేనలలో
అసంఖ్యాక జవానులు
నిదురెరుగక గస్తీ తిరిగేది మా కోసమే
జై జవాన్! జై కిసాన్!
ఏ నోట విన్నా జై భారత్ నినాదాలు
జై భారత్ ! జై జై భరత మాత !
అందుకొనుము మా వందనాలు!
16
[13/08, 8:57 PM] Aparajith: నాయకుడు
పరుగెత్తే గోదారిలా
ఉద్యమం ఊపిరిగా
వెన్నంటే అనుచరులతో
జాతి మనుగడ కోసం
వేగిరమే మేల్కొని
సాగిపో !
దిశానిర్దేశం చేస్తూ
నాయకునివి గా
సర్వం దిగమింగే
వినాయకునివి గాకు !
జనాన్ని జాగృతం చేస్తూ
మానవాళి మనుగడ కోసం
రహదారివై నడువు !
అన్నార్తుల ఆకలి తీర్చు
చీకటి జీవితాల్లో
వెలుగు రేఖవు గా !
చదువులు రాని
పల్లెటూళ్ళ లో
అక్షర జ్ఞానం కలిగించు !
వెలుగు పూలు పూయించు
మదిని మందిరం చేయి
చీకటి హృదయాలలో
దీపాలు వెలిగించు !
అజ్ఞానాన్ని ఆమడ దూరం
తరిమేయ్ !
ముళ్ల దారులైన
కన్నీటి ధారాలైన
నీ నాయకత్వపు లక్షణంలో
తేడా రానీకు !
పొంచి వున్న శత్రుమూక
నీ దారి కడ్డు వస్తే
నా దారి కరుణా సముద్రమని
నిక్కచ్చికగా చెప్పు !!
అపరాజిత్
17
[13/08, 9:00 PM] Anitha Aitha Poetess: *కవితా గానం*
తేది: 13.08.2020
అంశం : దేశభక్తి
శీర్షిక: *దేశభక్తి అంటే ఏంటి..?*
మహోన్నత హిమగిరులతో
పవిత్ర నదీమతల్లుల ప్రవాహాలతో
వేదాలు వెలిసిన జ్ఞానభూమిని పొగడ్తలతో
ముంచెత్తడమా?
స్వాతంత్ర సమరయోధులను
సరిహద్దు సైనికులను
వైజ్ఞానిక తత్వవేత్తలను
స్మరిస్తూ నమస్కరించడమా?
జాతీపర్వదినాలలో
నాయకుల జన్మదినాలలో
వేదికలు దద్దరిల్లేలా ఉపన్యసించడమా?
స్మృతి చిహ్నాలను నిర్మిస్తూ
విగ్రహాలను ఆవిష్కరిస్తూ
పూలదండలతో పూజించడమా?
దేశసంపదను కాపాడక్కరలేదా?
మహానుభావుల అడుగుజాడల్లో నడవక్కరలేదా?
జాతీయజెండాను దర్శించగానే
అణువణువు పులకరించిపోవక్కరలేదా?
నా వంతుగా ఏమిచేయాలని ఆలోచించక్కరలేదా?
జాతీయసమైక్యతా యజ్ఞంలో సమిధవ్వక్కరలేదా?
భారతావని సమగ్రతకు చేయూతవక్కరలేదా?
మానవత్వం పొదువుకో
కర్తవ్యదీక్ష బూనుకో
సాయపు కరములను పరులకు అందించి ఆదుకో!
నీ మాతృభూమిని స్వచ్ఛంగా తీర్చిదిద్ది
పుట్టిన గడ్డ ఋణం తీర్చుకో!
రచన
అయిత అనిత
8985348424
హామీపత్రం
ఇది నా స్వీయరచన

Comments
Post a Comment