నిర్వహణ
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
సమన్వయం
శివునూరి లలితాకృష్ణ
సహకారం
మెరుగు మధు
అవధాని
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
********"""*********
1.సత్య నీలిమ గారు
2.కంచి రవి కుమార్ గారు
3.ఇంద్రావత్ రాహుల్ గారు
4.స్వర్ణ సమత గారు
5.శ్రీహరి ఏలె గారు
6.డాక్టర్ ఆంజనేయులు గారు
7.డాక్టర్ రామక కృష్ణ మూర్తి గారు
8.కోరాడ నరసింహారావు గారు
9.మర్రి జయశ్రీ గారు
10.జె.బ్రహ్మం గారు
11.అపరాజిత రెడ్డి గారు
12..కందూరి సుజాతా రాణి గారు
13.పాల్వంచ హరి కిషన్ గారు
14.శ్రీమతి వల్లాల విజయ లక్ష్మి గారు
**************
1
[05/08, 8:03 PM] కె. సత్యనీలిమ
వృత్తి : ఉపాధ్యాయురాలు ప్రవృత్తి :: కవితాగానం
అంశః:సహనం
శీర్షిక: మాతృభూమి
ఓ భరతదేశమా! మా
మాతృదేశమా!
ఎన్నెన్నో జన్మల మేం చేసిన పుణ్యాల ఫలితమా
ఎందరెందరో నిన్ను పరిపాలించినా
నీ గొప్పతనము కించిత్తు అయినా తగ్గలేదు సుమా
ప్రకృతి విళయాలకు ఎదురొడ్డి నిలిచి
నీ రూపురేఖలను కాపాడుకుంటివి
నీ కడుపులోని ఖనిజాలను
నీ గర్భస్థ జలాలను
నీ ఎదపై పండించిన పంటలను
మా కందించి మా జీవనానికి
నీవు తోడుగా వున్నావు
పరాయి దేశస్తులు నీ సొత్తును
దోచుకెళ్ళినా
అందరినీ సమానంగా కరుణించావు
సహనం నీ సహజగుణం
దాతృత్వం నీలోని దయాగుణం
కన్నతల్లి ఋణం తీర్చుకోగలమేమో కానీ
నీ ఋణం ఎన్నటికీ తీర్చుకోలేము
భవనాలకు, బోరులకు నీ గుండెను చీల్చినా
బావురుమనకుండా మా
బాగోగులు చూస్తావు
కన్నతల్లి మోసేది నవమాసాలు
నేలతల్లి మోసేది శతవత్సరాలు
నీకన్నా సహనం ఇంకెవరికి
ఉంటుంది నీతో సమానమైన
అతివకు తప్ప ఆమెను మాత్రమే
నీతో పోలుస్తారు
అందుకే అన్నారు పెద్దలు
జన్మభూమి కన్నా వేరే స్వర్గంబు లేదని
ఇది నా స్వీయరచన.
✍......సత్యనీలిమ,
2
[05/08, 8:04 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 05.8.20.
కవితా గానం,
అంశం, శీర్షిక:
_*'సహనం'*_
నా కవిత్వం-230,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
➖➖🙂➖➖
సహనమొక్కటబ్బ చాలా కష్టంబురా.....
వేమన మాట నిజమే
ఆయన నోట పలికిన పద్యం
వాస్తవమే....
కానీ...
భారతీయులు సహన పరీక్షలో
ఎప్పుడో నెగ్గారు
ఇంకా గెలుస్తూనే
ఉన్నారు
సహనంతో
ఆంగ్లేయుడి ఏండ్ల
హింస భరించి
చివరకు పారద్రోలారు
సహనంతో
శాంతియుత
సమరంతో
తెల్లవాడి అసహన
చితి పేర్చారు
పక్కలో బల్లెంలా
నక్కిన శత్రుదేశాల
దురహంకారాలు
సహిస్తూనే
కొడుతున్నాం
భిన్న సంస్కృతుల ఆచారాల శృతి గతి
తప్పినా సహనంతో గెలుస్తున్నాం
గెలుస్తూనే ఉంటాం....
మనం భారతీయులం...
సహనమే మన
ఆభరణం
సహనమే మన ఆయుధం.
_*-రవికుమార్ కంచి*_
🌻🌸🏵️
➖➖👍➖➖
3
[05/08, 8:09 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం*
✳️✳️✳️
తేది : 05/08/2020
శీర్షిక : సహనం
*సహనం*
భారత పుడమిలో
ప్రతి మనిషికి కావాలి సహనం
ప్రతి ప్రాణికి కావాలి సహనం
ఏదైనా పని చేసే ముందు
ఆలోచన కి కావాల్సింది
సహనం
నడిచేందుకు కాళ్లు ఉంటే
నడకకి స్నేహం సహనం
గెలిచేందుకు నువ్వుంటే
ఓటమికి నేస్తం సహనం
పుడమికి ఉంది సహనం
గగనానికి ఉంది సహనం
మరి మనిషికి ఎందుకు
సహనం ఉండదు
ఎందరో మహాత్ములు
సహనంతో పోరాడారు
గాంధీజీ సహనానికి
గగనమే తలవంచింది
మనము కూడా సహనంతో ఉంటూ మానవ ధర్మంను కాపాడుదాం..
ధన్యవాదములు.. 🌹
*ఇంద్రావత్ రాహుల్*
*కొత్తపేట్*
*నిజామాబాద్*
*9848054079*
4
[05/08, 8:20 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*
*05/08/2020*
*సహనము*
సౌశీల్య ముతో జీవించాలన్న
సమగ్ర నైపుణ్యం తో
మెలగా లన్న,సమష్టి బాధ్యత తో పనులు చేయాలన్న,
నిగ్రహము తో బ్రతకాల న్న
ఓర్పు_నేర్పుతో కూర్పు గలిగి
ఉండాలన్న,
ఉన్నత శిఖరాలు అధిరోహించా
లను కున్న కావల్సింది
సహనము,
సహనంతో సమస్యలు
తొలగి పోతాయి,
సత్ సాంగత్యం లభిస్తుంది
భగవత్ సాన్నిధ్యం
పొందవచ్చు,
వ్యక్తిత్వ వైఖరి ఉన్నతంగా
ఉంటుంది,
పరిశీలన సామర్థ్యం
అలవడుతుంది,
పరిశోధనలు సాధ్యం
అవుతాయి,
మానసిక వత్తిడికి గురికావడం
జరగదు,
ఆరోగ్య _ఆయుష్షు బాగుంటుంది,
ఆనందము_ఆహాల్లాధ ము
కలుగుతాయి,
పరిపూర్ణత లభిస్తుంది,
ఫలితము పొందుతాము,
సంకల్పము నెరవేరుతుంది.
సకల కార్యములకు
సహనము సహాయ కారిగా
ఉంటుంది.
*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
5
[05/08, 8:31 PM] Sreehari Ale: కవితా గానం
తేది : 05/08/2020
పేరు :శ్రీహరి. ఏలె
అంశం : సహనం
మనిషికి నిజమైన ఆభరణం సహనమే
జీవితానికి ఇది ఒక నందన వన0
లేకపోతే జీవితం దహనమే
ఎన్నో ఆటు పోట్లను తప్పించేది
చీకటి నుండి వెలుగువైపు నడిపించేది
మనిషిని మనీషి గా మార్చేది
సమాజంలో గుర్తింపు నిచ్చేది
అక్షర యఙ్ఞానికిదే ప్రధాన సమిధ
అనుబంధములకు ఇంధనం సహనమే
విజయ శిఖరాలకు చేర్చె సోపానం
అంతర్జాల మాయాజాలంలో పడి
కాంక్రీట్ మయ జీవన గమనంలో బంధీ అయి
సహనం కాల పరీక్షకు నిలిచి గెలిచింది
మహాత్ముల ఉన్నత లక్ష్యములకు ఇదే ఆధారం
అందుకే, మన సహనమే మన జీవిత సోపానం
హామీ పత్రం : ఈ కవిత నా స్వయం లిఖితం.
6
[05/08, 8:35 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: కొత్త ఎత్తులు
కొత్త ఎత్తులు వేస్తోంది కరోనా
కరోనాతో పూర్వపు జ్వర లక్షణాలు కాదు ఇప్పుడు దద్దుర్లు మంటలు వాంతులు విరోచనాలు రకరకాల రూపాల్లో దరి చేరుతుంది దేహం
కుడ్యంపై మనం కరోనాతో యుద్ధం చెయ్యాల్సిందే నిశ్శబ్ద యుద్ధం దానితో ఎదురు పోవాల్సిందే మందులు మాకులతో తీసుకోవడమే మన అంతర్ సారాంశం
ఆనాడు అర్జునుడు శబ్దభేది తో మచ్చ యంత్రం పడగొట్టాడు
నేడు నిశ్శబ్ద వ్యాధితో ప్రయోగించాడు
కన్ఫ్యూషన్ తిరి అధ్యయనం చేసిన వాడు నేడు కుట్ర కుటిల యంత్రాంగం మంత్రాంగం నడుపుతూ నా దేశం పై సామ్రాజ్యవాద యాత్ర అ దండయాత్ర గా మార్చిన వాడు అప్పుడప్పుడు పావులు కదుపుతూ ఉంటాడు అంతా నిశ్శబ్దంగా అడుగులు సాగి వస్తున్నాయి జాగ్రత్త మా వీర సైనికులు ఎప్పుడూ సిద్ధమే .
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు భువనగిరి ఖమ్మం 7702537453
7
[05/08, 8:50 PM] Ramaka: 🎯కవితా గానం🎯
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:5-8-2020
అంశం:సహనం
ప్రక్రియ: వచనకవిత్వం
శీర్షిక: *న తితిక్షామపి మస్తి సాధనమ్*
**************************
భూదేవికి ప్రతిరూపమై
కన్నతల్లికి మారుపేరై
సీతమ్మకు అలంకారమై
స్త్రీకి తరగని చిరునామై
విజయాల రహస్య నిధై
ఫలితాల పరమమంత్రమై
పరిశోధనల మహాసూత్రమై
సహనం సార్థకమవుతున్నది.
బాధలను భరించుటకు
కష్టాలను ఎదుర్కొనుటకు
దుఃఖాలను దాటుటకు అపజయాలను అవలోకనం
చేసుకొనుటకు
ఈర్ష్య,అసూయలను పారద్రోలుటకు
పక్షపాతాలను పాచిపెట్టుటకు
అహంకారాలను అణగద్రొక్కుటకు
ఆధిపత్యాలను వదిలించుటకు
దౌర్జన్యాలను నిరసించుటకు
ఆగ్రహాలను ప్రక్కకు తిప్పుటకు
తితిక్షయే తీర్మానం.
రాక్షసాన్ని భూస్థాపితం చేసేందుకు
పాపాన్ని పరిహరించుటకు
దుర్మార్గాన్ని క్షమించుటకు
అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుటకు
సహనమే సాధనమై ఉపకరిస్తుంది.
8
[05/08, 9:20 PM] Korada: కవితాగానం
అంశం:- * సహనం *
కోరాడ నరసింహా రావు ; ఓర్పే...నేర్పు
**********
శారీరకంగా అనుభ విస్తున్న బాధనైనా...
మానసిక వేదననైనా తట్టుకుని...సహనంగా ఉండగలిగావం టే ....పరీక్షల కోర్చి తపస్సులోవిజయంపొందిన ఋషివే... నువ్వు !
శీతోష్ణసుఖ,దుఃఖాదుల కతీతుడవైన
స్థితప్రజ్ఞుడవైపోయినట్టే !
అది.....,అంతసులువా!?
దాని కెంత కఠోర సా ధన కావాలి ?!
నీవూ...ఓసహనశీలివి కావాలంటే భూదేవి వంటి అమ్మగానో...మహాత్ముడనిపించుకున్న ఓ గాంధీగానో క్రిందటి జన్మల్లో...ఎప్పుడో...
ఎక్కడో...కనీసంఒకసారైనా నువ్ ....
పుట్టుండాలి!
*****************
........కోరాడ.
9
[05/08, 9:25 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..సహనం
శీర్షిక..యజ్ఞం
మానవ జీవన ప్రయాణంలో
ఎన్ని ఆటుపోట్లు, అవాంతరాలు ఎదురైనా
ఆత్మస్థైర్యంతో,పట్టుదలతో ఎదుర్కోవడం
పొగడ్తలకు పొంగిపోతే
విమర్శలకు కృంగిపోతే
గమ్యాన్ని చేరలేము
భావోద్వేగాలను అదుపులో నుంచుకొని
నిరంతరం అంకితభావంతో చేయాలి కృషి
లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి
కావాలి నిర్దిష్టమైన ప్రణాళిక
ఎంత ప్రతిభ ఉన్నా
విజ్ఞాన సంపదకు కొదవ లేకున్నా
సహనం లేనిదే
సఫలీకృతులం కాలేము
ఉన్నత శిఖరాలు చేరాలంటే
చేయాలి సహనమనే యజ్ఞం
సహనం జ్ఞానద్వారం తెరిచి
మంచిని స్వాగతించి
విజయతీరాలు చేర్చుస్తుంది
మధుర ఫలాలను అందిస్తుంది
విలువైనదేది అంత సులువుగా అందుకోలేము
అసహనంతో వ్యవహరిస్తే
ఓటమి తప్పదు
సరైన వైఖరి, ఆత్మవిశ్వాసం
నిస్సహాయ స్థితిలో ఉన్నా
సహనంతోనే అద్భుతమైన మార్పు
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో
మహాత్ముడి విజయానికి మూలం సహనమే
సహనమే సంస్కృతీ.
10
[05/08, 9:27 PM] +91 96428 92848: కవితా గానం
అంశం:సహనం
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
జె.బ్రహ్మం గారు
మొగ్గ సహనంతోనే ఉంటుంది
పువ్వై నవ్వడానికి
సహనంతోనే విత్తనం భూమిలో నక్కి ఉంటుంది మొక్కై మొలకెత్తడానికి
బంగారం సమ్మెట దెబ్బలను సహనంతో సహించి నగలా మారి ఊరేగుతుంది
సహనమే దొంగను ఋషిని చేసింది
సహనంతోనే శబరి రామున్ని చూసింది
సహనంతోనే బండరాయి దేవుడైంది
సహనమే మనిషిని మహనీయుణ్ని చేసింది
సాధించాలంటే సాహసమే కాదు
సహనం కూడా ఉండాలి
పరుగులు పెట్టడమేకాదు ప్రతి అడుగు సహనంతో సమర్ధవంతంగా వేయాలి
తొందర పడితే అందేది విషమే
అమృతం దక్కాలంటే సహనంతో ఆగాలి మరి
మథనం చేసేది దేవతలైనా సరే!
ఇంతెందుకు
సహనంతోనె నా ఈ కలం
నాలుగు కవితా పంక్తుల్ని ప్రకటించింది
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
11
[06/08, 8:06 PM] Aparajith: సహించు నేస్తమా !
నిద్ర రాని ఈ నిశిరాత్రి
ప్రపంచ వేదనంతా
నా హృదిలో ప్రోద్వి చేసుకొని
నిలువెత్తు అన్వాయుధమై
జగత్తు నలుమూలల విరుచుకుపడితే
ఈ పృథ్వి నా అరచేతిలో పూబంతి
అవకాశాలన్నీ జారవిడుచుకున్నాక
పుష్పించిన గాయాల సెగ నా దేహం
అడవి కాచిన వెన్నెలలో
పక్షుల కిలకిలా రావాలు
కోయిలల కమ్మని పాటల ఊటలు
వేసంగి చదువుల జ్ఞాపకాలు మై మరచి
వేదనలు రోదనలు దౌర్జన్యం ఒక కలగా గాంచి
భవిష్యత్ ద్వారాలు తెరిస్తే
అలుపెరుగని శ్రామికుల స్వేద బిందువుల తడి
మై మరచి నిద్రించే శ్రమల కోడ్చిన మనీషి
ఆకాశంలో దేదీప్యమానంగా వెలుగొందే సూరీడు
ప్రగతి రథ చక్రాల్లో ఆకలి కేకలు
సాగర గర్భంలో ఆణిముత్యాలెన్ని వున్నా
తీరం తాకే కెరటాల్లో తెలివచ్చే ఆల్చిప్పలే
కుబేరుడైన తాను అనుభవించే దాంట్లో
మిగిలిన నాలుగు మెతుకులే పంచేది
మనిషికి అత్యాశ అమానుషమే
దిశమొల సన్యాసి ఎన్ని ప్రార్ధనలు చేసినా
కలో గంజో తాగకపోతే జీవితం ఆగిపోతుందక్కడే
పట్టభద్రుడు పట్టా లెన్నో పుచ్చుకున్న
తన చదువు కు సంబంధం లేని నౌకరీనే సాధించేది
సర్దుకుపో ఉన్నదాంట్లోనే సర్దుకుపో
ఆర్థిక వెసులుబాటు కల్పించుకో
కొన్ని కొన్ని విలువలకు రాజీపడక తప్పదు
ఓర్పు తో సహించు నేస్తమా !!
అపరాజిత్
12
[06/08, 9:09 PM] కందూరి సుజాత Poetess: 🌹సహనం🌹
******* ******* ******
సహనము ఎల్లరకు సౌఖ్యము /
సహనం సముచిత సామ్రాజ్యము /
ఓర్పు నేర్పు కూర్పునూ/
ధరణిమాత సహనము -
జీవులకు జీవనం/
సముద్రాల సహనము రాజ్యాలా- కలయికా/
మానవాళీ సహనము అభ్యుదయ- విజయము' /
మూగప్రాణి సహనము విశ్వాస- అభయము/
మంచి చెడు విశ్లేషణ సహనంతో- సాధ్యము/
ఏకాకిగా ఎట్లున్నా సంఘంలో సహనం
అణివార్యము/
ముడుచుకున్న పిడికిలి సహన - చమత్కారము/
బిగించిన నాలుక సహనానికి పెద్దపీఠ/ సహనమునకు చిరునామా సాత్వికము/
ముగ్గు చూసి మూర్చపోవు సుకుమారం-
జావను జీర్ణించుకోలేని సున్నితం -
అధిక సహనంలో చలామణి అగు -
నైతికం/
ప్రభాస కిరణం తో పరవల్ల వేకువ /
సముచిత సహనంతో సద్వినియోగ -
దారిక/
కందూరి సుజాతారాణి
రాజేంద్రనగర్, హైదరాబాద్
9392162822🌹
13
[06/08, 9:15 PM] పాల్వంచ హరికిషన్: కవితాగానం
అంశం: సహనం
శీర్షిక: ప్రకృతి
అలుపెరుగని శ్రామికులు
సూర్య చంద్రులే..
భవితెరుగని ప్రేరికులు
మానవ మాత్రులే..
ఆశ చావదు
దురాశ వదలదు
కోరికలే గుర్రాలుగ
అత్యాశే జీవనముగ
కాలమే సాక్షీభూతమై
కష్టపడక ఫలితాన్నీ
ఆశించే అనంతంగ
అనర్ధాల అంతరాలు
బోధపడక ఓర్చుకొనరు
ప్రకృతి విధ్వంసంతో
భూమాత సహనాన్ని
పరీక్షించె పరివారంగా
నవమాసాలు కడుపులో
బిడ్డను మోసే తల్లి
సహనం అవలోకించి
అలవర్చుకోవాలి మనిషి
ప్రకృతి జీవనమని తెలిసి
పుడమి పుత్రుడుగ నిలిచి
భవిత నిలుపుకోవాలి..
-- పాల్వంచ హరికిషన్
రామన్నపేట, యాదాద్రి జిల్లా
9502451780
14
*సహనం*
*మనిషికి అసలైన భూషణం*
*మానవ కర్తవ్య కారకం*
*జీవిత లక్ష్య సాధనం*
*చల్లని చక్కని *సహనం*-
*జీవనగమ్య సహాయకం*
*జీవుల అందమైన లక్షణం*
*?అద్భుత ప్రవర్తనానియమo*
*అచ్చెరుగొలుపు *సహనం*
*అన్నివేళలా ఓరిమి వహించటం*
*మనిషికి ఉన్నతినిచ్చు అంశం*
*ఓపిక వహించుట చేదయినా*
*సహనవృక్ష ఫలాలెంతో తీయన*
*ఎలాంటి పరిస్థితిలోనైనా*
*సహనాన్ని కోల్పోకపోవటం*
*మానవసంబంధాలకు కవచమగు*
*పలు ప్రమాధాలను నివారించు*
*పలువురి అభిమానులనందించు*
*గాఢ అనుబంధాలను నడిపించు*
*అపార్థచీకట్లను సదా నివారించు*
*సహనం" సహృదయాలనావిష్కరించు*
*సహనంలేనివారి భవిత అగమ్యగోచరం*
*జరిగే ఘోరనేరాలెన్నో సహనలోపఫలం*
*సహనం కోల్పోతే ఫలితం భయంకరం*
*సహనం ఉత్తమ మానవులఆయుధం*
;*వల్లాల**విజయలక్ష్మి*
*ఆలేరు*

Comments
Post a Comment