Skip to main content

పతాకం


నిర్వహణ
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
శివునూరి లలితాకృష్ణ
మెరుగు మధు
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు
**********
కవివరుల జాబితా
1.ఇంద్రవత్ రాహుల్ గారు
2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
3‌.కంచి రవికుమార్ గారు
4.కోరాడ నరసింహారావు గారు
5.దీపక్ న్యాతి గారు
6.దిడ్డి మారుతి గారు
7.పోలా కిషోర్ కుమార్ గారు
8. తిరు వేంకటాచార్యులు గారు
9.సత్య నీలిమ గారు
10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
11.గుండ్ల రాజు గారు
12. కందూరి సుజాత గారు
13.కొలచన విజయ భారతి గారు
14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
15.పాల్వంచ హరి కిషన్ గారు
16.అనుముల తేజస్విని గారు
17.స్వర్ణ సమత గారు
18. భూపతి గారు
19.వల్లాల విజయ లక్ష్మి గారు
20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
21. తిరు వేంకటాచార్యులు గారు
22.సంధ్యా శర్మ గారు
23.సునంద వురి మిళ్ళ గారు
24.గుండ్ల రాజు గారు
25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు
26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు
27.అయిత అనిత గారు
28.మర్రి జయశ్రీ గారు
29.కాల్వ రాజయ్య గారు
******************
[07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం*
✳️✳️✳️
తేది : 07/07/2020
 శీర్షిక :   త్రివర్ణ పతాకం
       🇮🇳 *త్రివర్ణ పతాకం*🇮🇳
 మూడు రంగుల జెండా
 ముచ్చటైన జెండా
 త్రివర్ణాలను మేళవింపు
 తయారు చేసిన జెండా మనది
 మూడు ముత్యాల అంతరార్థం
 కాషాయం
 త్యాగనిరతి ఆత్మస్థైర్యానికి తేజస్సుకు ప్రతీక

 తెలుపు
  స్వచ్ఛత కి శాంతికి నిజాయితీకి నిదర్శనం

 ఆకుపచ్చ
 విశ్వసనీయత ప్రకృతి శోభ పాడిపంటలు సంపదను ప్రతిబింబిస్తుంది

 అశోకుని ధర్మచక్రం
 నీలి రంగు అశోకుని ధర్మచక్రం

 నిజాయితీ నిబద్ధతను తెలియజేస్తుంది

 అందుకే
 ఏకత్వంలో భిన్నత్వం ...
         ధన్యవాదములు.. 🌹


*ఇంద్రవత్ రాహుల్*
    *మల్కాపూర్*
   *నిజామాబాద్*
  *9848054079*
2
[07/07, 8:25 PM] STTRao Kama Reddy Poet: అంశం..త్రివర్ణపతాక
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి

త్రివర్ణపతాకము స్వేచ్ఛగా రెపరెపలాడుతూ
స్వాతంత్ర్యంపు భావాలను రంగరించి
గగనమంత ఎత్తుగా పైకెగురుతూ  ఉరకలేస్తూయున్నది
శాంతి,సహనానికి గుర్తుగా దవళవర్ణము
పాడిపంటలతో పచ్చదనముగా వర్ధిల్లుతూ పచ్చదనము ఒలకపోస్తూ
త్రాగనిరతికి గురుతుగా కాషాయము
అశోక ధర్మనిరతికి‌ గుర్తుగా అశోకచక్రము తెలుపు రంగు మధ్యలో శోభాయమానంగా వెలుగొందుతున్నది
అహింసా మార్గానికి అధర్మాన్ని విడనాడి శాంతియుత సహజీవనము కోరుతున్నదీ‌ మువ్వన్నెల జండా
భాషాద్వేషాలు మాని,దాయాదులు
ప్రేమగా మెలిగి,రక్తపాతాన్ని విడనాడి శాంతియుత వాతావరణము నెలకోవాలని
వేడుకతో భావిస్తుంది

సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి
3
[07/07, 9:04 PM] Kanchi Ravi Kumar Poet: 07.07.2020.

*కవితా గానం*

అంశం,
శీర్షిక: 🇮🇳 _*త్రివర్ణ పతాకం*_

నా కవిత్వం-187,
 రవికుమార్ కంచి, ఉపాధ్యాయులు,
9494345594.

  ✊🌸🇮🇳🌸✊

   మువ్వన్నెల జెండా ముద్దులొలికే జెండా
  భరతజాతి నంతటిని కదిలించిన జెండా
    ఆంగ్లేయుడి
గుండెలపై గురిపెట్టిన
    జెండా

  సార్వభౌమాధికారమె ఊపిరిగా
   స్వేచ్ఛా స్వతంత్రమె శ్వాసలుగా
   నిలబెట్టిన జాతి ప్రతీక

    కాషాయం ధైర్యానికి
తెలుపేమో శాంతికి
   ఆకుపచ్చ సస్యశ్యామలం
     మధ్యన నీలి ప్రగతి చక్రం సంకేతాలై
     రెపరెపలాడే త్రివర్ణ పతాకం
     మన అత్యున్నత గౌరవం
 
      ఏ.. కులం కాదు మతం కాదు
    అందరిదీ జెండా
జాతి గౌరవ జెండా
   ముద్దులొలికె జెండా

    పింగళి చేతుల్లో
  రూపొందిన
అద్భుతమీ జెండా

అందుకో వందనం
   అభినందనం
మువ్వన్నెల జెండా.

*జై హింద్*✊.

_-రవికుమార్ కంచి_.

 🌿🌻🌿🌻🌿.
4
[07/07, 9:22 PM] Korada: కవితాగానం
అంశం:త్రివర్ణపతాకం
 * స్వేచ్ఛా ధ్వజం *
కోరాడ నరసింహా రావు;
      ***********
గగనతలంలో  రెప రెప లాడే ఆ త్రివర్ణ
పతాకమే...మన
జాతీయ జెండా...!

స్వాతంత్ర్యసంగ్రామంలో ...పింగళివెంకయ్య చే రూపొందిం చబడి,పెద్దలందరిచే  ఆమోదింప బడి.....
ముందుండి తనవెను క...అశేష భారత జన వాహినినీ నడిపించి ఎందరెందరో దేశ భ క్తులప్రాణత్యాగాలకూ...సాక్షిగానిలిచి...
విజయ కేతన మై...
స్వాతంత్య్ర  సము పార్జనతో...స్వరాజ్యాన్ని స్థాపింపజేసి మూడు మతముల సామరసఅయ్త తో
త్యాగ,శాంతి,సస్యశ్యామలంవిజయ చిహ్నమై...ప్రజా సం క్షేమ ధర్మచక్రం  స్థాప నతో...సర్వసత్తాక స్వరాజ్య విజయ పతాక గా...స్వేచ్ఛా ధ్వజమై నిలిచింది
మనత్రివర్ణ పతాకం!
చేద్దాముమనమందరం...వినయపూర్వక వందనం...🙏🌷🙏🌷🙏కోరాడ .
5
[07/07, 9:27 PM] దీపక్ న్యాతి: కవితా గానం
పేరు : డా.దీపక్ న్యాతి
తేది : 07-07-2020
అంశం : త్రివర్ణ పతాకం
శీర్షిక : ధర్మ సంప్రదాయ ఆచారాల ఉనికి

సౌభాగ్యవతి నుదుటున బొట్టులా
అశోక చక్రం త్రివర్ణ పతాకాన్నా
సుందరం అది సుందరం త్రివర్ణం
ప్రపంచ  పతాకాలలో శ్రేష్టం
భారత జెండా భారతీయులకు అండ
 భరత మాత ప్రతిరూపం అం
నా దేశ త్రివర్ణపతాకం
భారతీయ ఆచారాల మకుటం
భారతదేశ సువర్ణ పతాకం
ఉన్నత సాంప్రదాయాల పరిచయం
ఉన్నత శిఖరాలనెగిరే త్రివర్ణ పతాకం
త్రిమూర్తుల పుణ్య దేశం భారతదేశం
త్రివర్ణ పతాకం భారతదేశ వేదం
స్వతంత్ర సమరయోధుల
ప్రాణత్యాగ చిహ్నం త్రివర్ణపతాకం
చూస్తే ఒళ్ళు గగుర్పొడుచు
శరీరం నిట్టనిలువుగా నిలుచు
త్రి ధర్మాల కుటీరం త్రివర్ణపతాకం
వీర సైనికుల శౌర్యానికి
ప్రతిపదార్థం త్రివర్ణపతాకం
సస్యశ్యామల హరితానికి
శాంతినాశించే ఉత్తమ ధర్మానికి
సమ సమాజ నూతనత్వానికి
బహు భాషాల బంధానికి
భిన్నత్వంలో ఏకత్వానికి
సర్వ మతాల గౌరవానికి
చిహ్నం నాదేశ త్రివర్ణపతాకం

డా.దీపక్ న్యాతి
హైదరాబాద్


6
[08/07, 8:31 PM] Maruthi Diddi Poet Tp: *కవిత*
====
         ~~~~~~~~
       *త్రివర్ణ పతాకం*
         ~~~~~~~~

పతాకం పతాకం
త్రివర్ణ పతాకం

మన దేశ ఖ్యాతిని
నింగికి చేర్చిన జాతి పతాకం

దేశ ప్రజల తలలు
పైకెత్తించు పతాకం

పాడి పంటలను
చూపు పతాకం

శాంతికి చిహ్నం
మన జాతి పతాకం

శౌర్యము నిండుగ
నింపు పతాకం

ధర్మ మార్గమే ఆయుధ మంటూ
ముందుకు పొమ్మని తెలుపు పతాకం

భారత భువిలో జన్మ నెత్తిన
ప్రతి వ్యక్తి గుండెలో ఎగురు పతాకం

అవని కంతకు ఆదర్శంగా
నిలిచినట్టి మన జాతి పతాకం

నింగి లోన నిండుగ రెపరెప లాడె
మన జాతి పతాకం త్రివర్ణ పతాకం.

**********************
        *దిడ్డి మారుతి* ,
               *కంగ్టి.*
7
[08/07, 8:32 PM] +91 99633 77273: 08 July 2020
16:43

కవితా గానం
వారంశం : త్రివర్ణ పతాకం
శీర్షిక : జెండా ఊంచా రహే హమారా

మూడురంగుల జెండా
ముఛ్ఛటైన జెండా
ఆసేతు హిమాచలం భరతజాతి
కీర్తి పతాకమీ జెండా

భారతీయ సంస్కృతికి సనాతన ధర్మానికి
త్యాగనిరతికి ప్రతీకగా కాషాయ వర్ణం
భారతీయుల సహనం అహింసా ధర్మం శాంతికి సర్వసమ భావనకు ప్రతీకగా తెలుపు వర్ణం
భారత దేశ సౌభాగ్యానికి సహజ సంపదకు
సంవృద్దికి వ్వసాయానికి ప్రతీకగా ఆకుపచ్చ వర్ణం
భారతీయుల నిజాయితికి ధర్మ నిరతరకు
అకుంటిత దీక్షకు ప్రతీకగా నీలిరంగులో
అశోకుని  ధర్మచక్రం

ఈ మూడు రంగులు మధ్యలో
అశోక చక్రాన్ని సూచిస్తూ
ప్రతి భారతీయుని గుండెల్లో
దేశభక్తిని నింపేదే మన
భారతదేశ మువ్వన్నెల జెండా

భరతమాత ముద్దుబిడ్డ తెలుగువాడైన
పింగలి వెంకయ్య చేనేత వస్త్రంతో
తయారు చేసిన త్రివర్ణ పతాకం
భారతీయ స్వదేశీ భావనకు ప్రతీక

ఎందరో త్యాగమూర్తులు ప్రాణాలర్పించగ
విదేశి పాలనకు చరమగీతం పాడి
విదేశి బానిస సంకెళ్ళు తెంచి
స్వరాజ్యం మా జన్మ హక్కు అని
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు
యావత్ భారతం నినదించగ
స్వాభిమానంతో రెపరపలాడెను
భారతదేశ త్రివర్ణ పతాకం

అదే స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి తో
మనమంతా కలిమెలసి ఒక్కటిగా నిలచి
సబ్కా సాత్ సబ్కా వికాశ్ ప్రతిన భూని
మేకిన్ ఇండియా నినాదంతో
దేశాభివృద్ధికి పాటుపడుతూ
దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతూ
ప్రపంచానికి గొంతెత్తి చెపుదాం

తీన్ రంగ్ కా జెండా హమారా
జెండా ఊంచా రహే హమారా
హిందుస్తాన్ హమారా హమారా


-----భారత్ మాతాకి జై------

రచన : పోలా కిషోర్ కుమార్
ఇది నా స్వంత రచన అని
హామీ ఇస్తున్నాను
8
[08/07, 8:34 PM] Tiru Venkatacharyulu Ks6: కవితాగానం
ముడుంబ తిరువే0కటాచార్యులు, టీచర్, వరంగల్.
08-07-2020.
నేటి అంశం: త్రివర్ణ పతాకం.

గగనంలో ఎగురనీ ఘనత్రివర్ణపతాక,
గర్వంగా ఎగురనీ జయత్రివర్ణపతాక, మురిపెంగా ఎగురనీ
మన త్రివర్ణపతాక,

నిరతం మనలో ధైర్యంనింపేది,
మదినిండా త్యాగగుణంనింపేది,
 వీర సైనికులకు
ప్రియమైనది,
తన తనువును దేశానికి
ప్రతీకగా నిలిపేది,
శత్రువు నెదిరించే సమరొత్సాహాన్ని,
మనసులో జయాన్ని నిశ్చయించే సందేశాన్నిచ్చేది, దర్శించినంతనే
స్ఫూర్తినిచ్చేది,
సకలజనులకు
ప్రియమైనది,
సర్వజనులచే ఆమోదించబడినది.

కాలానికి నిలిచిన
త్యాగానికి గురుతుగా కాషాయాన్ని,
శాంతి అహింసలకు
సాక్ష్యాధారంగా శ్వేతవర్ణాన్ని, సస్యశ్యామల ధాన్యాగారానికి ప్రతీకగా హరితవర్ణాన్ని, ధర్మరక్షణకు ధ్యేయస్వరూపంగా ధర్మచక్రాన్ని తనలో చూపుతున్నది.

ఎందరో స్వరాజ్య సమరయోధుల రుధిర ప్రవాహమే కాషాయంగా, సత్యాహింసలే ఆయుధాలుగా
శ్వేత వర్ణాన్ని,
మన జీవనదులు గంగా, యమున, గోదావరి, కృష్ణల పరీవాహక వరప్రసాదంగా హరితవర్ణాన్ని,
ధర్మానికి ప్రతిరూపంగా అశోకుని ధర్మచక్రాన్ని
తనలో పొదువుకున్నది. మువ్వన్నెల మన జాతీయ జెండా ఉన్నతమై ఎగరాలి, జండా స్ఫూర్తితో మనజాతి ఉజ్జ్వలమై ఎదగాలి,

నిర్భయంగా
స్వతంత్రనాదం చేస్తూ, సురాజ్యసాధనకోసం నిశ్చయమైన కృషి చేస్తూ, ప్రాణత్యాగమెదురైనా వెనుకడుగు వేయక,
స్వరాజ్యశ్రేయమే ధ్యేయంగా, పతాకఘనతను  చాటడమే లక్ష్యంగా,
ఐక్యంగా ప్రతిజ్ఞచేద్ధాం,
మన జాతీయజెండా ఉన్నతంగా ఎగారాలి,
జండా స్ఫూర్తితో
మనజాతి ఉజ్వలంగా ఎదగాలి.
9
జై హింద్: జై హింద్: జై హింద్.
[08/07, 8:43 PM] కె. సత్యనీలిమ

వృత్తి : ఉపాధ్యాయురాలు ప్రవృత్తి :: *కవితాగానం*
*అంశం:త్రివర్ణ పతాకం*
*సత్యనీలిమ*

ప్రాణాలను లెక్కచేయక
దేశభక్తులు రక్తాన్ని చిందించి
ఆయువును ధారపోసి
ఊపిరివదిలిన
ఉసురుఫలితం ఈపతాకం

మతాలు వేరైనా అందరూ
ఒకటేనని భరతమాత
ముద్దుబిడ్డలై కలిసిమెలిసి
ఉండాలనే ఉద్దేశ్యమే ఈపతాకం

ప్రతిఒక్కరు ధర్మపరాయణులై
ధర్మం తప్పకుండా అధర్మానికి
పాటుపడకుండా నీతి
నిజాయితీ కలవారిగా
చేయాలనే సంకల్పమే ఈపతాకం

ఒకేమాట ఒకేబాట ఒకేగీతం
ఒకేగానం ఒకేజెండా ఒకేదేశమై
నిరంతరం సంతోషంగా
సస్యశ్యామల అవనిపై
హరితవనం వెల్లివిరియాలనే
ఆకాంక్షే ఈపతాకం
అదే అదే త్రివర్ణ పతాకం...
10

*** జాతీయ జండా ***

(విశ్వనాథ కిన్నెరసాని పాటలోలే)
----------- -- ------✍️డా.పాండాల.

        ఎగిరింది ఎగిరింది
        ఎగిరింది ఎగిరింది
మూడురంగులజండ ముదముతో ఎగిరింది
శతకోట్ల హైందవులు సాల్యూట్ చేయంగ
సరిగమా పదనిసలు  సల్లాపమాడంగ
         స్వాతంత్ర్య వేడుకగ
         ఘనతంత్ర దీప్తిగా.....!ఎగి!1

వేదోపనిషత్తులితహాస పుడమిది
ఉత్తరార్థాగోళమున్నతైనా జనులు
విజ్ఞాన సుజ్ఞాన వినయసంపన్నులూ
         వందెమాతరమంటు
         జనగణామనిపాడ......!ఎగి!2

విశ్వమానవజాతి శ్రేయస్సు కాంక్షగా
శాంతినాదాలనూ శ్రావ్యంగ పాడింది
ఆత్మజ్ఞానపు విత్తనాలనూ వెదజల్లె
          జండపండుగరోజు 
          జయకవాతులమధ్య.!ఎగి!3

పింగళీవెంకయ్యపిలపెంతొ మధురమో
అఖిల భారతజాతి
ఆమోదమును పొందె
తేటతెలుగుల ఆత్మగౌరవమ్మదియనగ
       జయము శుభము జయహే
       జగమంత జేజేలు..!ఎగి!4

స్వాతంత్ర్య కాంక్షతో సమర క్రాంతిని బూని
శ్రమలకోర్చి ప్రాణ త్యాగమర్పించినా
అమరవీరులశౌర్య ప్రతీకగ పైనున్న
         అరుణకాంతుల తేజ
         కాషాయపురంగు..!ఎగి!5

మల్లెకన్నాతెలుపు మామనశ్శాంతము
సర్వేజనాసుఖీభవ మాది నైజమూ
విరయబూయునెపుడు ఎదలోన
స్నేహము
        ఈ అవని గోళమే
        మా ధర్మచక్రమని..!ఎగి!6

సుఫలాము సుజలాముమలయజా శీతలాం
హిమశిఖరములనుండి హిందు సంద్రము వరకు
గుజరాతు మొదలుగా అరుణాచలము వెల్గు
         పరమపావనిచరిత
         ఘనమైన మనభవిత..!ఎగి!7

మూడురంగులపూలముస్తాబుసరిదిద్ది
వక్రమార్గము నాకు వలదంటు హృదినమ్మి
శాంతంగ నిలబడీ సక్రమార్గంబంటు
        అదిగదిగొ అల్లదిగొ
        ఆకాశ వీధుల్లొ..!ఎగి!8

మూడుతిన్నెలమిద్దె నడిబొడ్డుతానిల్చి
తిన్నెతిన్నెలకునూ తీరురంగులు మెరియ
హంగు ఆర్బాటాల ఉప్పొంగు సౌదమై
       ఆకాశమే హద్దు
       ఆ జండ కర్రకూ..!ఎగి!9

ఎదురులేదని ముద్దుగాఎగురుచున్నది
పిల్లగాలులుఎంతొప్రియముగాఊపంగ
ఒయ్యారములనెంతొ ఒలకబోస్తున్నది
        ధీరవీరా శౌర్య
        విజ్ఞాన కాంతుల..!ఎగి!10

అమరవీరుల త్యాగ ఆత్మబలగానమో
స్వర్ణభారతమందు మువ్వొన్నె రెపరెపలు
త్యాగనిరతినినేర్పె ఆధ్యాత్మచింతనకు
         దేశభక్తిని చాటె
         దేదీప్య వంద్యులకు     !ఎగి!11

✍️డా.పాండాల మహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి.
11
[08/07, 9:03 PM] Gundla Raju Sir: కవితా గానం
అంశం : *త్రివర్ణ పతాకం*
శీర్షిక :

శతాబ్ధాల శృంఖలాలు ఛేదించడానికి
జాతి జీవితాన నూతన చైతన్యం నింపడానికి
గణతంత్రభారతానికి భాగ్యోదయరేఖగా
మహోజ్వల భారత చరితకు ఆనవాలుగా
పురుడు పోసుకుని
శ్వేత జాతీయుల సామ్రాజ్య వాదానికి ఎదురునిలచి
భారతీయుల ఐక్యతనుఆధునిక ప్రపంచానికి తెలియ పరచి
గగన తలాన గంభీరంగా రెపరెప లాడుతోంది *త్రివర్ణ పతాకం*

పరస్పర సహకారం, త్యాగం, ప్రేమ, స్నేహ గుణాలకు ప్రతీకగా *కాషాయపు వర్ణంతో...*

హిమశైలోన్నతమైన స్వచ్ఛత, శాంతి, దయ, సహనం, నేర్పు, ఓర్పు సుగుణాల కలబోత *తెలుపు వర్ణంతో...*

ప్రకృతి ఆరాధనతో గంగాతరంగాల సుశోభితమై పాడి పంటల సమగ్రాభివృద్ధికి గుర్తుగా *ఆకుపచ్చ రంగుతో...*

ధర్మ సంస్థాపనమే భారత ఉపఖండపు ధర్మమని ఉపనిషత్తుల సారమును తెలియ చేస్తూ... దృగ్గోచర మవుతుంది *నీల వర్ణపు చక్రం*

*భరత మాతను కాపు కాస్తుంది*
*అఖండ భారతాన్ని సాధిస్తుంది*
ఇదే *త్రివర్ణ పతాకం*
*భరతమాతకు సమర్పితం...*

*🌹🌹🌹గుండ్లరాజు🌹🌹🌹*
*సిద్దిపేట*
9885257050.
[08/07, 9:03 PM] కందూరి సుజాత Poetess: 🌷త్రివర్ణ పతాకం 🌷
..... ......   .....   .....
జయహో జయహో
త్రివర్ణ పతాకమా నీకు జయహో /
ధర్మ చక్రాన్ని నడిబొడ్డుగ-
చుట్టూరా త్రివర్ణమై -
మురిపిస్తూ మైమరిపిస్తూ-
శాంతి ,స్వచ్ఛ, త్యాగాలకు చిహ్నమై ,
దేశ ఖ్యాతి,నీతినీ ఆకశాన చాటుతూ రెపరెపలాడే త్రివర్ణ పతాకమా నీకు జయహో/

వీరులా దీరులా త్యాగాలు-పూరేకుల్లా మూడుపు మూటలా కట్టుకుని /
పురివిప్పిన నెమలల్లే,
గగనాన   విరజల్లుతూ  నృత్యించే త్రివర్ణ పతాకమా నీకు జయహో/

శివుని ఖంఠాన నాగులా ,పడగెత్తిన పవిత్రమా/
జటాజూట గంగలా,పరవళ్ళ ప్రవాహమా/
భారత ధ్వజస్థంభమా-
త్రివర్ణ పతాకమా మీకు జయహో/

స్వేచ్ఛ నినాదమా ,
స్వచ్ఛ ప్రధానమా ,
ఐక్యతా ఆరంభమా,
సూర్య ప్రభాసమా,
వెన్నెల తాండవమా,
పున్నమి నిండుదనమా ,
త్రివర్ణ పతాకమా నీకు జయహో/
12
కందూరి సుజాతరాణి
రాజేంద్రనగర్ ,హైదరాబాద్
9392162822🌷

🌷త్రివర్ణ పతాకం 🌷
..... ......   .....   .....
జయహో జయహో
త్రివర్ణ పతాకమా నీకు జయహో /
ధర్మ చక్రాన్ని నడిబొడ్డుగ-
చుట్టూరా త్రివర్ణమై -
మురిపిస్తూ మైమరిపిస్తూ-
శాంతి ,స్వచ్ఛ, త్యాగాలకు చిహ్నమై ,
దేశ ఖ్యాతి,నీతినీ ఆకశాన చాటుతూ రెపరెపలాడే త్రివర్ణ పతాకమా నీకు జయహో/

వీరులా దీరులా త్యాగాలు-పూరేకుల్లా మూడుపు మూటలా కట్టుకుని /
పురివిప్పిన నెమలల్లే,
గగనాన   విరజల్లుతూ  నృత్యించే త్రివర్ణ పతాకమా నీకు జయహో/

శివుని ఖంఠాన నాగులా ,పడగెత్తిన పవిత్రమా/
జటాజూట గంగలా,పరవళ్ళ ప్రవాహమా/
భారత ధ్వజస్థంభమా-
త్రివర్ణ పతాకమా మీకు జయహో/

స్వేచ్ఛ నినాదమా ,
స్వచ్ఛ ప్రధానమా ,
ఐక్యతా ఆరంభమా,
సూర్య ప్రభాసమా,
వెన్నెల తాండవమా,
పున్నమి నిండుదనమా ,
త్రివర్ణ పతాకమా నీకు జయహో/

కందూరి సుజాతరాణి
రాజేంద్రనగర్ ,హైదరాబాద్
9392162822🌷
13

త్రివర్ణ పతాకం

ఎగిరింది ఎగిరింది
మూడు రంగుల మువ్వన్నెల జెండా
తెల్లదొరల దాష్ఠీకాన్ని
భారత ఎల్లలకు తరిమికొట్టి
ఎర్రకోటపై ఠీవిగా ఎగిరింది
మువ్వన్నెల జెండా
ఎందరెందరో స్వాతంత్ర్య సమర యోధుల
త్యాగనిరతులు పొదుపుకుని
ఠీవిగా ఎగిరింది మన జెండా
స్వాతంత్ర్య సమర యోధుడు
పింగళి వెంకయ్య చేతిలో
ప్రాణం పోసుకున్న
మన జాతీయ త్రివర్ణ పతాకం

త్యాగనిరతి కాషాయంగా
శాంతికాముకత శ్వేత వర్ణంగా
పాడిపంటలే పచ్చదనంగా
ఇరువది నాలుగు రేకుల
అశోక చక్రం  ధర్మ సంకేతంగా
అలరారుతూ
ఎగిరింది ఎగిరింది
మన జాతీయ త్రివర్ణ పతాకం
      🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪
**కొలచన విజయ భారతి*
హైదరాబాద్
14
[09/07, 8:02 PM] Ramaka: 🇮🇳కవితా గానం🇮🇳

పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:9-7-2020
అంశం:🇮🇳త్రివర్ణ పతాకం🇮🇳
ప్రక్రియ: వచనకవిత్వం
శీర్షిక: *జెండా*
**************************

దేశ అస్తిత్వానికి చిరునామా
సిద్ధాంతాల,లక్ష్యాల వీలునామా
కర్తవ్యాలు,నిర్దేశాల కలబోత
మువ్వన్నెల మన జెండా.
ముచ్చటగొలిపే మూడురంగులు
ఎన్నో సారాంశాల కలబోతలు
స్వేచ్ఛ,సౌభ్రాతృత్వం, శాంతి సమ్మేళనాలు
త్యాగం, స్వచ్ఛత,
సస్యశ్యామల సంకేతాలు
స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను ఐక్యం చేసిన ఆధారం
పరాయిపాలనను అంతంచేసి
ఎగిరిన విజయసూచిక
దేశభక్తిని ప్రతి మనసులో
రగిలించిన దీపశిఖ
ఎత్తైన శిఖరాల్లో ఎగిరిన జెండా
ఉన్నతమైన ఆలోచనల అజెండా
రూపశిల్పుల ఆలోచనాసరళికి విషయసూచిక
మంగళమైన ఆకాంక్షలకు ఆసరా
త్రివర్ణ పతాకం‌ ప్రపంచంలో ఉన్నతమై
భారతీయుల సవినయ గౌరవమై
విశ్వానికి విజయగాథ వినిపిస్తున్నది.
భరతమాత హస్తభూషణమై
అలంకృతమవుతున్నది.

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
15
[09/07, 8:10 PM] పాల్వంచ హరికిషన్: 🏹కవితాగానం🎯
తేది: 09-07-2020
అంశం:🇮🇳 త్రివర్ణ పతాకం🇮🇳
శీర్షిక: భారత పతాకం..

ఎగురుతున్నది త్రివర్ణ పతాకం..
జనగణమన అంటూ.. జన గణములూ గొంతెత్తగా...
మూడు వర్ణములతో భరతజాతికి అండగ నిలువగా..
భారతావని ఖ్యాతిని దిగంతాల చాటిన పతాకం..
తెలుగు నేల పులకించగ పింగళిచే రూపొందిన పతాకం....
జాతీయ సమైక్యతకు నిదర్శన సరోత్తం
భరతమాత బిడ్డలకు మేలు కొలుపు వీరోత్తం
భరత జాతి భావాలను వెదజల్లే మనోత్తం
నర నరాన దేశ భక్తి రెపరెపమనిపించే పతాకం
ఎగురుతున్నది త్రివర్ణ పతాకం..
ధైర్యమూ.. త్యాగమూ.. స్వఛ్ఛత ఆధ్యాత్మికమూ......
కర్తవ్యాన్నీ తెలిపే.. కాషాయ వర్ణమూ...
శాంతీ.. సత్యమూ... సౌభ్రాతృత్వమూ.....
ప్రవర్తనకు వెలుగు నింపే.. తెల్లనీ వర్ణమూ..
సాఫల్యతా...  సస్య సమృధ్ధీ...
పచ్చదనాన్నీ పంచే ఆకుపచ్చ వర్ణమూ...
మూడు వర్ణాల సంగమం మన పతాకం
భరత పతాకం.. త్రివర్ణ పతాకం...
కాలాన్నీ నిరంతరం గుర్తు చేసేదిగా...
కాలచక్రమును తనపై ఒదిగించిన పతాకం...
నాలుగు పాదాల నడిచె ధర్మానికి ప్రతీకగా..
అశోక చక్రం నడుమన నిలిపిన పతాకం...
గాంధీ నెహ్రూలు నడిపించిన ఉద్యమం..
నేతాజీ ఉప్పెనతో రగిలించిన యుద్దం...
భగత్ ఆజాదుల్లా ప్రబలిన సంచలనం..
అల్లూరీ పోరాటం వెలుగొందిన విప్లవం...
మరెందరో యోధుల ప్రాణ త్యాగాలే నిదర్శనం..
నిరంతరం మిమ్ము స్మరించెదం..
తరం తరం.. మిమ్ము స్మృతించెదం..
రెపరెపలాడగ మూడురంగులా పతాకం..
మదినిండా ఉప్పొంగే చైతన్యపు తటాకం...
భారత పతాకం ... త్రివర్ణ పతాకం..
🇮🇳  🇮🇳  🇮🇳  🇮🇳  🇮🇳
-- ✍️పాల్వంచ హరికిషన్
         రామన్నపేట
         సెల్ః 9502451780
16
[09/07, 8:15 PM] అనుముల తేజస్విని Poetess: కవితాగానం
తేదీ:9/7/2020
అంశం:త్రివర్ణ పతాకం🇮🇳
శీర్షిక:మువ్వన్నెల జెండా🇮🇳  **  🇮🇳 ** 🇮🇳** 🇮🇳

మూడు వర్ణాల జెండా
ఇది ముచ్చటైన జెండా
భరతమాత ముద్దు బిడ్డకు
ఇచ్చును అండ దండా
జాతిఖ్యాతి నిలిపే
జగతిలోన వెలిసే
భావి భారత పౌరుల పౌరషపు జెండా
కాషాయం తెలిపెను త్యాగమనే విలువను
తెలుపు శాంతి కోరేను
పచ్చగా బతుకులు ఉండగా సంపదతో నిండగా
ఎగిరేను జెండా
అశోక ధర్మ చక్రమే సూచించే సుగుణాలనే
వెంకయ్య గారి చేతిలో రూపుదిద్దుకొని
మన భారత గడ్డపై రెపరెపలాడెను
జాతి అస్థిత్వాన్ని,
మనలో ఐకమత్యాన్ని,
ధర్మనిరతిని తెలిపేలే జెండా
స్వాతంత్ర్యo వచ్చే
మువ్వన్నెల జెండా ఎగిరే
ఆ పతాక వర్ణాలు
దేశ ప్రజల హృదయంలో జాతీయ స్ఫూర్తిని కలిగించే జెండా
పిల్లా, పెద్దలు కలిసి చందన వందనాలు
అందుకునే వేళ
చేసే ఆనందపు హేళ......

అనుముల తేజస్విని
నర్సంపేట
ధన్యవాదములు🙏
17
[09/07, 8:16 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*
*09/07/2020*

*త్రివర్ణ పతాకం*

మువ్వన్నెల జెండా
మనందరి హృది నిండా
గగనాన స్వేచ్ఛగా ఎగిరే జండా
సంత సం మన కన్నుల నిండా
త్యాగానికి సంకేతం కాషాయం
శాంతికి చిహ్నం శ్వేత వర్ణం
పసిడి పంటల గుర్తు ఆకుపచ్చ
త్రివర్ణ ముల కేతనం
అదియే విజయ సంకేతం
స్వాతంత్ర్య దినోత్సవ పర్వం
గణతంత్రం రోజున పండగ
భారత మాతకు ఆనంద నందన ము
భారత భువిన సంబరాల సందడి
రెపరెప లాడుతూ
ఆకాశాన ఆనందంగా
త్రివర్ణ పతాక మై
ఎగురుతోంది ఎగురుతోంది
మన జెండా.

*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
18
[09/07, 8:23 PM] Bupathi Sir: ...............త్రివర్ణ పతాకం....... పరిమితి లేని ఆనందాల ఝరి.అధ్భతమైన స్వప్నాల. సాకారం........... భారత మాత చిత్రించు కున్న కిరీటం.... మన దేశ గౌరవ ప్రదాత.......... ఉన్నతమైన ఆశయాల ఆలయం...మన ఆశయాల ప్రభ......మన గుండె సవ్వడి ..మన స్వేచ్ఛ శ్వాస.... స్వతంత్ర నాదం...మన త్రివర్ణ పతాకం........ఏ. భూపతి.....









..
19
[09/07, 8:28 PM] విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక:**త్రివర్ణ పతాకం***
-----------************-------------

మనందరి ఆశల ప్రియరూపం
మన ఆశయాల ప్రతిరూపం
మన సార్వభౌమ సంకేతం
మన స్వతంత్ర *త్రివర్ణపతాకం*

స్వతంత్రసమరవీరుల పౌరుష ప్రతీక
సదాశయ పౌరుల బలానికి వెన్నెముక
*భారతదేవాలయ*ఉన్నతధ్వజం*
*పింగళి వెంకయ్య* రూపకల్పన అద్భుతo

అగ్రభాగాన *కాషాయవర్ణం*
త్యాగాలు ధైర్యాలకు ప్రతిబింబం
నాటి జాతీయ అమరనాయకుల
నేటి వీరజవానుల స్మరింపజేయు మంత్రం

మధ్యనున్న *శ్వేత వర్ణం*
శాంతికి సమ్మిళితానికి చిహ్నం
'తెలుపు'ను మన విదేశీవిధానాన్ని
కలుపును*సకల వర్ణా(ప్రజ)లను

దిగువన ఆహ్లాదపరిచే *హరితవర్ణం*
పాడిపంటలు ప్రకృతికి 'ప్రతి'బింబ వర్ణం
వ్యవసాయ దేశమని'చెప్పును అర్థం
ప్రశాంతoగా ఉండమని ఇచ్చు సందేశం

'తెలుపు'మధ్యనున్నది ఇరవై నాలుగు
ఆకుల నీలివర్ణ *అశోకధర్మచక్రం*
చాటునది సమోన్నత సనాతన ధర్మాన్ని
హామీ ఇచ్చు'అన్నివేళలా న్యాయానికి'

మూడు రెండు వంతుల *తిరంగా*         
పొడవు వెడల్పుoడవలె కొలతలు             
నూలువస్త్రవాడకమే ఆమోదయోగ్యం
*నేతన్న* ల పనితనానికది గౌరవసూచకం

తలెత్తే ఉన్నత"పతాకమే తీర్చిదిద్దు ప్రవర్తననే
*త్రికరణశుద్ధిగా గౌరవిద్దాం త్రివర్ణపతాకాన్ని*
తప్పనిసరిగా గమనిద్దాం రాజ్యాంగనియమాలను
తప్పక ధరించేము *విజయాల మాలను*

:వల్లాల *విజయలక్ష్మి*
*ఆలేరు*
20
[09/07, 8:33 PM] Balloori Umadevi Poetess: 9/7/20
డా. బల్లూరి ఉమాదేవి
అంశం:జాతీయ పతాకం

రెపరెపలాడుతు వినువీధిన
ఎగురుతోంది మనజెండా
ముచ్చటైన మన జెండ
మూడురంగుల మనజెండా
శాంతికి వెలుగుకు చిహ్నం
స్వచ్ఛమైన శ్వేతవర్ణం
త్యాగానికి ప్రతీకయే యీ కాషాయం
పచ్చని చెట్లకు ప్రతీక హరిత వర్ణం
నడుమ నిరువది యాకులతో
నలరారు నశోక చక్రం
నదియే ప్రగతికి సంకేతం
వీటికలయికే మన త్రివర్ణ పతాకం
వ్యాపారం కోసం వలసవచ్చీ
మనపై పెత్తనాలే సాగించారు
పాలు త్రాగి రొమ్ము గుద్దినట్లు
మనసొమ్మును అనుభవిస్తూ
మనపై పెత్తనం చలాయిస్తూ
మనలనె బానిసలుగా మార్చిన
తెల్లవారిని తిప్పి పంపినదీ పతాకం
జయఘోషలతో నినదిస్తూ
ఎగిరిందీ త్రివర్ణ పతాకం
గౌరవిద్దాం మనపతాకాన్ని
పతాకస్థాయిలో నిలబెడదాం.


జైహింద్.
21
[09/07, 8:46 PM] Tiru Venkatacharyulu Ks6: కవితాగాన0.
నిన్నటి నా కవితకు మాతృక అయిన
"నా" మొదటి గేయం.

గగనంలో...., ఎగురనీ....,
గర్వంగా.... , ఎగురనీ....,

గగనంలో ఎగురనీ
ఘనత్రివర్ణ పతాక,
గర్వంగా ఎగురనీ
జయత్రివర్ణ పతాక/గగనంలో/
మురిపెంగా ఎగురనీ మనత్రివర్ణపతాక
/మురిపెంగా/....//గగనంలో//

ధీరత నిరత0 కురిపించేది, త్యాగగుణం మదినింపేది,/2/
వీరజవానులకు ప్రేరణయైనది, తనువూమనసూ దేశమే యైనది /గగనంలో/

భీకర స్వతంత్ర సమరంలో అరినేదిరించే సమరోత్సాహం, చూచినంతనే మనసుల్లో జయనిశ్చయ ప్రియసందేశం, కేవలదర్శన స్ఫూర్తిదాయకం, సర్వజనామోదితం, సకలజనాలికీ ప్రియం.
/గగనంలో/
నిర్భయ స్వతంత్ర నాదముతో,
నిశ్చయ సురాజ్యసాధనలో, ప్రాణత్యాగం ఎదురైనా, స్వరాజ్య శ్రేయమే ధ్యేయముగా,
పతాకఘనతయే లక్ష్యముగా,
ప్రతిన పూనుదాం ఐక్యముగా, ప్రతిన పూనుదాం ఐక్యముగా
గగనంలో..., ఎగురనీ..., గర్వంగా...,  ఎగురనీ...,
22
[09/07, 8:48 PM] Sandya Sharma Poetess: కవితా గానం
వై.కె.సంధ్యశర్మ
అంశం :త్రివర్ణ పతాకం
శీర్షిక: మువ్వన్నెల కెరటం

అదిగదిగో మువ్వన్నెల
ముద్దులొలుకు ముచ్చటైన
మూడురంగుల త్రివర్ణ పతాకం

శాంతి కదే చిహ్నం
శ్వేత వర్ణమై వెలిగే
శాంతికి ప్రతిరూపం
ఎగురుతుంది చూడరో
ఎర్రని కోటపై
ఎలుగెత్తి చాటి
దేశభక్తినింపే
ప్రతి భారతీయుని హృదయ కవాటం పై

అదిగదిగో మువ్వన్నెల
ముద్దులొలుకు ముచ్చటైన
మూడు రంగుల త్రివర్ణ పతాకం

పల్లె పరిమళాలు
చిద్విలాసమై చిందే
పచ్చదనపు సౌభాగ్యపు చిహ్నమై
ప్రతి బడిలో గుండె గంటలా
మ్రోగుతోంది ఔదార్యపు
స్నేహ గీతికై పచ్చాని వర్ణమై

అదిగదిగో మువ్వన్నెల
ముద్దులొలుకు ముచ్చటైన
మూడు రంగుల త్రివర్ణ పతాకం

సమతా మమత
సంస్కృతి సాంప్రదాయాలకు
నిలువెత్తు నిదర్శనం
కాషాయపు కాశ్మీరం
ఆసేతుహిమాచలం
ఒక్కటై మెలిగే
చతుర్వేద సంహితం
ప్రతి ఒడిలో బ్రతుకు బాట
వీర తిలకమై దిద్దగా...

అదిగదిగో మువ్వన్నెల
ముద్దులొలుకు ముచ్చటైన
మూడు రంగుల త్రివర్ణ పతాకం

వివర్ణమెరుగని త్రివర్ణచక్రం
ఛత్రమై ధర్మరక్షణకు
సుస్థిర పాలనకు
భారతీయుల
భవితకు సోపానమై
శ్వాసగా ఎగురుతోంది
చూడరా ఆశల కిరణం
మానవతా ప్రతిరూపమై

అదిగదిగో మువ్వన్నెల
ముద్దులొలుకు ముచ్చటైన
మూడు రంగుల త్రివర్ణ పతాకం
23
[09/07, 9:04 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*
తేదీ::09-07-2020
పేరు::వురిమళ్ల సునంద,ఖమ్మం
అంశం:: త్రివర్ణ పతాకం
::::::::::::::::::::::::::::
జెండా ఊంచా రహే హమారా
ఆవాజ్ దో హమ్ ఏక్ హై
జై బోలో స్వతంత్ర భారత్ కి జై..
అనే నినాదాలతో
ఐక్యతా భావం అణువణువూ ఉప్పొంగేలా  ఎగరేసే  త్రివర్ణ పతాకం
 *మన జాతి జనుల అస్థిత్వ బావుటా!*

మూడు రంగుల జెండా
ముద్దు కులికెడు జెండా
మునుకోరి దీని అండానుండా
దీన్ని విడిచినా మనకేది అండ అని
ఉద్వేగంతో అలనాటి దేశభక్తులు
పాడుకునేలా చేసిన జెండా!

భారతీయుల కలలు సాకారమై
మహా భక్తుడు పింగళి వెంకయ్య గారి
దేశ భక్తికి నిదర్శనంగా
భరత మాత మహోన్నత రూపం
కనుల ముందు కదలాడగ
శ్రద్ధా భక్తులతో రూపొందించిన జాతీయ పతాకం!

2:3 నిష్పత్తిలో పొడవు వెడల్పులతో
నేతన్నల చేతుల్లో ఖద్దరు వస్త్రంతో
నేయబడిన
 *గౌరవప్రదమైన  మువ్వన్నెల జెండా!*

జాతీయోద్యమానికి స్వరాజ్య పోరాటానికి సంకేతం!
స్వదేశీ వస్త్రాల తయారీకి నిలిచిన
ప్రోత్సాహక రూపం!

భారత దేశ ప్రతిష్టకు సార్వభౌమాధికానికి  ప్రతీక
మన  జాతి పతాక!

మన దేశ ప్రజల నిరాడంబర జీవితాన్ని
జాతి నాయకుల త్యాగానికి.
సాధు పుంగవులు మునుల సాత్విక జీవనానికి మూలమైన *కషాయం* !

 సర్వకాల సర్వావస్థలందు శాంతి కోరే
స్వచ్ఛమైన హృదయానికి
 **తెలుపు * !*

సస్యశ్యామల భారతావని.. ఎప్పుడూ
ఆకుపచ్చని సూర్యులదే
వారే మన బతుకు దాతలని వినమ్రంగా చాటుకునేందుకు సాఫల్యతకు చిహ్నంగా *ఆకుపచ్చ** !

న్యాయం ధర్మం  సత్య నిష్ఠకు
పరాకాష్టగా నీలిరంగులో..
మన సంస్కార లక్షణాలేమిటో తెలిపే
ఇరవై నాలుగు ఆకులతో కూడిన *అశోక చక్రము!*

సత్యమేవ జయతే.. సత్యాన్ని కాపాడుతానని ప్రతిజ్ఞ చేయించే  జాతి పతాకం!
ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన దివ్య పతాకం!
త్రివర్ణాలతో విశ్వ విను వీధుల్లో
రెపరెపలాడే *ఆత్మ గౌరవ ధ్వజం* !

నియమ నిబంధనలతో
మన జాతి పతాకను ఎగురవేద్దాం!

మన రాజ్యాంగం ప్రకారం
దేశ వ్యాప్తంగా నిర్వహించుకునే
జాతీయ పండుగగా
జెండా పండుగ ఘనంగా జరుపుకుందాం!

రెప రెపలాడే మువ్వన్నెల జెండాలో
మన అస్థిత్వాన్ని
దేశభక్తి గీతాలాపనతో తలెత్తుకుని
సగౌరవంగా నమస్కరిద్దాం!
24
[09/07, 9:10 PM] Gundla Raju Sir: కవితాగానం
అంశం : త్రివర్ణ పతాకం
శీర్షిక : *మువ్వన్నెల ఝండ*
ప్రక్రియ : *పదాలు*

*స్నేహ గుణముకు పోత*
*త్యాగ ధనముకు దాత*
*కాషాయముకు జోత*
*ఓ నీలకంఠ!!*

*శాంతి సహనపు తలపు*
*ఓర్పు నేర్పును వలపు*
*తెలుపు వర్ణము తెలుపు*
*ఓ నీలకంఠ!!*

*స్వచ్ఛ జలముల నడుమ*
*పాడి పంటల గరిమ*
*ఆకుపచ్చని కనుమ*
*ఓ నీలకంఠ!!*

*మూడు వన్నెల ఝండ*
*జాతి జనముల కండ*
*కొలువు గుండెల నిండ*
*ఓ నీలకంఠ!!*

*గుండ్లరాజు*
*సిద్దిపేట*
9885207050.
25
[09/07, 9:11 PM] శ్రీ లక్ష్మి విజయనగరం: కవితా గానం
తేదీ: 09-07-2020
అంశము: త్రివర్ణ పతాకం
పేరు: చివుకుల శ్రీలక్ష్మి
కవితా శీర్షిక:
       ఎగురుతోంది             
     మువ్వన్నెల జెండా!

అదిగదిగో!
ఆకసాన ఎగురుతోంది
మువ్వన్నెల జెండా!
భరత జాతి గౌరవమిది
స్వేచ్ఛకు తార్కాణము!

కాషాయ తెలుపు ఆకుపచ్చలు
24 ఆకుల నీలిరంగు చక్రము
ప్రగతికి చిహ్నము చక్రము!
అదే అదే అశోకుని ధర్మచక్రం!

జాతీయ పతాక రూపకర్త
బహుభాషా పండితుడు
పింగళి వెంకయ్య!
మొవ్వ గ్రామం నుండి కొలంబో దాకా
విజ్ఞానార్జనకై
సాగిన  ప్రయాణంలో
బోయర్ యుద్ధ సైనికుడయ్యెను
జాతీయ ఉద్యమంలో చేరి
భరత జాతికి ఒక జాతీయ జెండాకై
పరితపించెను
పతాక గురించి కలలు కనెను
ఆంగ్లములో ఒక గ్రంథము రాసెను

వందేమాతర ఉద్యమంతో
కలకత్తాలో పతాక ఎగిరింది
భారతీయుల చేతుల్లో ఇమిడింది
లాఠీ దెబ్బలు కారాగారం
చవి చూపింది

వెంకయ్య చేతిలో రూపుదిద్దుకున్న జెండా
తొలిసారి లక్నోలో ఎగిరింది
మధ్యలో రాట్నం చేరి
మలిసారి జలంధర్లో ఎగిరింది
అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో
త్రివర్ణ పతాకం ఎగిరింది

భారత రాజ్యాంగంలో
రాట్నమునకు బదులుగా
అశోకుని ధర్మచక్రం చేరింది
భారతదేశ అధికార కేతనమైంది
నిర్మాత పింగళి వెంకయ్య
చరిత్ర పుటలలో చిరంజీవి అయినాడు

కాషాయరంగు త్యాగానికి గుర్తుగా
తెలుపు రంగు స్వచ్ఛతకు గుర్తుగా
ఆకుపచ్చ రంగు సాఫల్యతకు గుర్తుగా
నీలిరంగు చక్రము ప్రగతికి గుర్తుగా
ముచ్చటగా ఎగురుతోంది త్రివర్ణ పతాకం!

స్వాతంత్రానికి అర్థం చెబుతోంది
సస్యశ్యామల దేశం కోసమని
కలలు కన్న దేశభక్తుల
అహింసాయుత ఉద్యమాల
త్యాగ ఫలితమిది!

పతాక మంటే భారతదేశం!
జెండా గౌరవమే దేశ గౌరవం!
నీలో శ్వాస ఉన్నంత దాకా
నీ జాతి నిండు గౌరవము నిలుపు!
26.

*దేశభక్తి గీతం*
అంశం ;త్రివర్ణ పతాకం

శీర్షిక :ఎగుర వేద్దాం..
రచన :గుమ్మన్నగారి బాలసరస్వతి, సిద్దిపేట..


*పల్లవి*
వేగుచుక్క కనిపించినది..
వేకువ తూర్పున పొడమినది..
వేగమె రారండో జనులారా
విజయకేతనము నెగుర వేయగా..

*చ*
త్యాగనిరతి భారత భారతి
సంస్కార సహజమను కాషాయముతో...
స్వచ్ఛ శీలమే సౌభాగ్యమ్మని
తెలిపెడి తెలుపును కలుగు పతాక..
సస్యశ్యామల సంపదలను గల
ఘనతకు గురుతగు
హరిత ప్రతీక...
ధర్మయుక్తపథ గమన పాలనకు
చిన్నె చక్రమై తేజరిల్లగా...

జయపతాకమును గగన వీధిలో
ఎగురవేయగా రారండీ...
జయజయజయహో  జయభారతియని జగమంతా వినిపించండీ...
           **వేగు **

*చ*
స్వతంత్ర భావపు జలధారలలో
స్నాతములైనవి జనహృదయాలు..
పరిణత వల్కల ధారములై
సమభావము పొంగెడి జీవనమ్ములు..
సమతా చుంబిత శాంతి విధముతో
పూడిపోవునిక అగాథమ్ము లు
   జనతా చోదిత క్రాంతి రథముతో
ప్రగతి నెంచు ఊహా పథమ్ముతో..

    జయపతాకమును గగన వీధిలో
ఎగురవేయగా రారండీ...
జయజయజయహో జయభారతి యని
జగమంతా వినిపించండీ...

   ***వేగుచుక్క**
27
*కవితా గానం*

అంశం : త్రివర్ణపతాకం
శీర్షిక: *మువ్వన్నెల జెండా*

కణకణంగా విచ్ఛిత్తి చేస్తూ బానిసత్వపు శృంఖలాలను తెగనరికిన ధైర్యపు కరవాలం..!

నరనరాన ఆత్మాభిమానపు సారాన్ని నింపి
ప్రజలను ఏకతాదారానికి గుచ్చిన ఆత్మవిశ్వాసపు సూది..!

పరాయి పాలనా మూలాలను తిరుగుబాటు గునపంతో
పెకిలించిన ఉక్కుపిడికిలి..!

బ్రిటిస్ సామ్రాజ్యపు నిరంకుశ మదగజాన్ని
ధిక్కార అంకుశంతో పారద్రోలిన ఆలోచనాశక్తి..!

భారత సంగ్రామంలో వీరులకు
ధీరత్వాన్ని అవపోసనపట్టిన మాతృమూర్తి..!
మన మువ్వన్నెల జెండా..!!

శాంతికి...శౌర్యానికి..సస్యశ్యామలతకు ప్రతిరూపమై
భరతజాతికి గర్వకారణమై
జగతి సిగన రెపరెపలాడే
స్వేచ్ఛా సంకేతం మన త్రివర్ణ కేతనం!!

రచన
అయిత అనిత
8985348424
జగిత్యాల

హామీపత్రం
ఇది నా స్వీయ రచన
28.
కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..త్రివర్ణ పతాకం
శీర్షిక...దేశ ప్రగతికి సంకేతం

అసలైన ఖాదీ వస్త్రంపై
అపర దేశభక్తుడు పింగళి వెంకయ్య చేతిలో రూపుదిద్దుకున్న జండా
బానిస బతుకుల విముక్తికోసం సాగే సమరంలో
భారత ప్రజలలో దేశభక్తిని పెంపొందించింది
భారత జాతిని ఏకం చేసి సమైక్యత రాగం ఆలపించింది
తెల్లవారి రాక్షస పాలన నుండి విముక్తి పొందిన భారతీయులు విజయ గర్వంతో
ఎర్రకోటపై ఎగరేసిన జయ కేతనం
త్యాగం శాంతికి చిహన్నమై
దేశ ప్రగతికి సంకేతమై
గగన వీధిలో రెప రెపలాడుతూ
ముచ్చట గొల్పే మువ్వన్నెల పతాకం
ప్రతి భారతీయుడి సవినయ గౌరవం
దేశ ప్రగతికి సంకేతం
నిజాయితీ ధర్మ నిరతికి నిదర్శనం
మన త్రివర్ణ పతాకం.
29.

కవితా గానం
అంశం... త్రివర్ణ పతాకం 🇮🇳
కవి పేరు... కాల్వ రాజయ్య
ఊరు... బస్వాపూర్, సిద్దిపేట
చరవాణి.. 9177494235
 ప్రక్రియ..వచన కవిత

జాతి జనుల జాగృతము జేసి
భారతీయులందరిని ఏకతాటిపై నడిపించి,
భరతమాత బానిసత్వము బాపుటకు
పింగలి వెంకయ్య గారు ప్రీతి తో డను జేసె త్రివర్ణ పతాకము.
పైనున్న కాషాయము వీరుల త్యాగాలకు, సహనానికి ప్రతీకగా
క్రిందున్న ఆకుపచ్చ అభివృద్ధిని సూచించగా
మధ్యనున్న తెలుపు రంగు శాంతి సత్యములకు చిహ్నంగా
మధ్యన అశోక చక్రము ధర్మాన్ని కాపాడుటకు
హిందు ముస్లిములనేకము చేయ
మువ్వన్నెల జండాను ముద్దుగా రూపము జేసె.
నాటి ఉద్యమ కారులు వందేమాతర మంటూ జాతీయ జండాను బట్టి
జెండా భుజమున బెడితే జన్మ ధన్యమైనట్టుగ
ఆవేశముతోటి జనులు ఆంగ్లేయుల తరిమి వేసి అంధకారము తొలగించెను  జండాను పవిత్రంగా జనులంతా గౌరవించాలని చట్టము జేసిరి నాడు.
జండవందనము నాడు జయజయ నాదము జేయగా
అంబరాన రెప రెపలాడిఆనందము కలిగించు.


Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...