నిర్వహణ
వీరా గుడిపల్లి the mathematics teacher and poetసమన్వయం
శివునూరి లలితాకృష్ణ
సహకారం
మెరుగు మధు
అవధాని
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు
**********
కవివరుల జాబితా
1.శ్రీమతి అయిత అనిత గారు
2.శ్రీ.డాక్టర్ రామక కృష్ణ మూర్తి గారు
3.శ్రీ శివ లక్ష్మి రాజశేఖరుని గారు
4.శ్రీమతి స్వర్ణ సమత గారు
5.శ్రీ కోరాడ నరసింహారావు గారు
6.శ్రీమతి సత్య నీలిమ గారు
7.శ్రీమతి నాగ జ్యోతి శేఖర్ గారు
8.శ్రీ. సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
9. శ్రీమతి డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
10.శ్రీమతి గంజాం భ్రమరాంబ గారు
11.శ్రీమతి వల్లాల విజయ లక్ష్మి గారు
12.శ్రీమతి కందూరి సుజాతా రాణి గారు
13.శ్రీమతి YK సంధ్యా శర్మ గారు
14.మర్రి జయశ్రీ గారు
***************
1
[21/07, 8:02 PM] Anitha Aitha Poetess: *కవితా గానం*
అంశం : సేవాదృక్పథం
శీర్షిక: *మంచితనంతో మనుగడ సాగించు*
ఎప్పుడు ఎక్కడ పుడుతామో తెలియదు!
ఎన్నడు ఎలా మరణిస్తామో తెలియదు!!
వచ్చేటప్పుడు ఏమి తెచ్చామని...
వెళ్లేటప్పుడు ఏమి తీసుకెళతామని...
ఆస్థులు అంతస్తులు
ధనము దర్పము
ఇవేవి మనవి కావు మనతో ఎన్నటికీ రావు!
ఈర్ష్య అసూయ కామం క్రోధం ఆవేశం ఆహార్యం
అన్నీ!
భ్రమలే అని తెలిసినా... భ్రాంతిలోనే బ్రతుకీడుస్తున్నావ్!
మిధ్యను భద్రపరచగ... మూర్ఖంగా ఆలోచిస్తున్నావ్!!
ఇహ సుఖాలు శాశ్వతమని గుడ్డిగా నమ్ముతున్నావ్!
కనులు తెరిస్తే జననం
కనులు మూస్తే మరణం
ఈ లిప్తపాటు జీవన కాలాన్ని
బంధాలు అనుబంధాలు ఆప్యాయతలతో రంగరించు!
ఆత్మీయతానురాగాలతో జీవితాన్ని అనుభవించు!!
తోటివారికి కొంచెమైనా సాయపడి గర్వించు!
ఆపదలో ఉన్నవాడిని హత్తుకొని ఓదార్చు!!
పరోపకార ఫలాలను అందరకీ అందించు!
మహోన్నత కార్యాలకుశ్రీకారం చుట్టు!!
నీ పలుకుల్లో సతతము అమృతమునే చిందించు!
నీ కను చూపుల్లో అవిరళముగా కరుణనే కురిపించు!!
మానవత్వంతో మనీషిగా మనుగడ సాగించు!
మంచితనంతో అందరి హృదయాల్లో శాశ్వతంగా జీవించు!!
జగతికి ఆదర్శమై పరిఢవిల్లు,!
రచన
అయిత అనిత
జగిత్యాల
8985348424
హామి పత్రం
ఇది నా స్వీయ రచన
దేనికి అనువాదం కాదు
[21/07, 8:11 PM] Ramaka: ⭐కవితా గానం⭐
20
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:21-7-2020
అంశం:సేవాదృక్పథం
ప్రక్రియ: వచనకవిత్వం
శీర్షిక: పరమధర్మం
**************************
నిస్వార్థంగా,నియమబద్ధతతో
చేసే మహోపకారం
కులం,మతం,ప్రాంతం,వర్ణం,
వర్గం,పక్షపాతం లేకుండా
ఆపన్నులకు అందించే సహాయం
మానవునిలో మాధవుని చూపే సంకేతం
దయ,సానుభూతి,జాలి,ప్రేమ,ఔదార్యాలకు మచ్చుతునక.
అవసరమేదైనా అందించే ఆపన్నహస్తం
ఎలాంటి ఆశ లేకుండా చేయాల్సిన పరోపకారం
పరిణతి చెందిన మనుషుల కర్తవ్యం
హృదయవైశాల్యానికి,
నిర్మలతకు ఆలవాలం.
సేవే పరమధర్మమని నమ్మే
మహనీయుల కార్యరంగం
లోకంలో ఉన్నతమైన కర్మల చిహ్నం
ఆలోచన అద్వితీయమై కీర్తివంతమవుతుంది.
మనసులను గెలిచి కార్యోన్ముఖులను చేస్తుంది.
3
కవితా గానం
ప్రక్రియ: వచన కవిత
అంశం: సేవాధర్మం
పేరు: శ్రీ శివ లక్ష్మీ రాజశేఖరుని
శీర్షిక: నా మూలాల్లో నేనెక్కడ
సాటిమనిషికి సాయం చెయ్యడానికి
వెనకాడే నాలో లేని నా కోసం
నేను ఎక్కడో వెతుకుతూ వెళుతున్నాను
సవరించుకున్న నైతిక సూత్రాల పత్రాన్ని
అవసరార్థం అనుకూలంగా మలుచుకుని
మరచిపోయిన మూలాల మలుపుల్లో
మౌనంగా నన్ను నేను వదిలేసి
మళ్లీ కొత్తగా నా కోసం నేను ఎక్కడో వెతుకుతున్నాను
నాగరికత ముసుగులో
సాంప్రదాయ సిద్ధాంతాన్ని తగలేసి
తగిలించుకున్న బాధ్యత భావోద్వేగాల్లో
కొని తెచ్చుకున్న ఆవేశకావేశాల కోరల్లో
అంతరిస్తున్న సేవాధర్మాన్ని అనాధగా వదిలేసి
నాలో లేని నా కోసం
నేను ఎక్కడో వెతుకుతూ వెళుతున్నాను
రంగురంగుల మాయలోకపు వలలో చిక్కి
విలువల పునాదులపై
విచ్చలవిడి తనపు సమాధులు కడుతూ
పెచ్చుమీరిన స్వార్థపు సౌధాల పై
వికృత నాట్యం చేస్తున్న
కలుషిత హృదయపు శిథిలాల్లో
నన్ను నేను వదిలేసి
నాలో లేని నా కోసం ఇప్పటికీ పిచ్చిగా
నేను ఎక్కడో వెతుకుతూనే వెళుతున్నాను
4.
*కవితా గానం*
*21/07/2020*
*సేవా దృక్పథం*
సేవలో ఉన్న గొప్పతనం
మరెక్కడా లేదు,
అధో తియ్యదనం,
అదియే పరమార్థం,
*మానవ సేవే మాధవ సేవ*
అన్నారు,
గాంధీ గారు
పరులకు సేవ చేసే భాగ్యం
కలిగితే దానికన్నా ఉత్కృష్టమైనది మరొకటి
లేదు,
ఓ మదర్ థెరిస్సా...
దేశసేవ లో తరించిన వాళ్ళు
ఎందరో
అందులైన తల్లితండ్రులు కు
సేవ చేసిన శ్రవణుడు,
సేవించడం ఓ యోగం
సేవలో ఓ ఆనందం ఉంటుంది,
సేవలో ఓ తృప్తి దొరుకుతుంది,
ఆకలి గొన్నవారికి,
పట్టెడన్నం పెట్టడము సేవే,
వృద్ధులకు చేసే సేవ,
వ్యాధిగ్రస్తులకు చేయునది
విశిష్ట సేవా,
మన జన్మకు సార్థకత
కలగాలంటే సేవా భావం
ఉండాలి,
సాహిత్య సేవ ఆ తల్లి భారతిని
సేవించడం,
అనాథలకు చేసే సేవ,
అందులకు చేసే సేవ,
అత్త మామలకూ సేవ చేయడం
కర్త్యవ్య ము నెరవేర్చుకోవడానికి
భగవంతుడు మనకు అవకాశము ఇచ్చినపుడు
దానిని ఖచ్చితంగా
చేసే ప్రయత్నము చేయాలి,
పసిపిల్లలకు చేసే సేవ,
ఇలా,
సేవా తత్పరత ఎంతో విశిష్టమైనది.
*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
5
కవితాగానం
అంశం:సేవాదృక్పధం
కోరాడ నరసింహా రావు;సేవనుప్రేమతో
************
బిడ్డకు ఎంత సేవ చే సినా,తల్లిఆనందాన్నే
ఎలాపొందుతుంది ?
......ప్రేమ...!
సత్యసాయి...ప్రేమసహితసేవనుచెయ్యాలన్న ప్రబోధం తో...
విద్య,వైద్య,ఆధ్యాత్మికతలతోసహా...అవసరమైన వారికి అన్ని విధాలా సేవను చేసి ,
చేయిస్తూ...భగవాన్ గా ఖ్యాతిగాంచి ఎలా తరించారోచూసాంగా
ప్రతిఫలాక్ష రహిత
నిస్వార్ధసేవలో నున్న మహత్తే అది...!
ఆ తృప్తి ,ఆనందం...
ప్రకటించ గలిగే భాష లేదు !
ఈ
సేవాదృక్పధమేకదూ
తెరీసాను మదర్
థెరిస్సాను చేసింది !
పతిసేవతో...సక్కుబాయి.,మాతా పిత రుల సేవతో శ్రావణ కుమారుడూ ప్రభు సే వతోహనుమ,పరమాత్మ సేవలో ఎంద రెండరోభక్తులూతరిం
చి,శాశ్వతత్వాన్ని పొంద లేదూ...!
బూటకపు సేవానాట కాలతో...కొందరిని,కొంతకాలమే మోస గించగలవ్ !
నిస్వార్ధసేవాతత్పరుల మూలం గానే ...
దీనజనోద్దరణ...మహిళాభ్యుదయం...
సమాజసంస్కరణలు
సాధ్యమయ్యాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం...!
నిర్మలమైనమనసులే
ప్రేమించగలవ్...!
స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే...సేవించగలదు!
*****************
.......కోరాడ.
6
*కవితా గానం*
*అంశం: సేవా దృక్పథం*
సాఫీగా సాగే జీవితంలో
ఎగుడుదిగుడు పరిస్థితుల
కష్టనష్టాలు సామాన్య ప్రజలకు
కలిగే పరిణామాలతో ఎదురుదెబ్బలు తగులుతుంటే
ఆటుపోట్లకు ఎదురీగి
అంతులేని శక్తిసామర్ధ్యాలనూ
కూడదీసుకుని వాటికి ధైర్యంగా
ఎదురొడ్డి చేసే పోరాటం
చేసే సమయంలో పక్కన ఎవరూ లేకుంటే
ప్రకృతివైపరిత్యాలతో నిరంతరం
పోరాటం చేస్తూకూడా
తన చేసే వ్యవసాయం
వదలని కర్షకుని ఆత్మవిశ్వాసం
పరిస్థితులతో చేసే
పోరాటాలతో అలసిన
మనసుకు ఆలంబనగా
నేనున్నానంటూ మన కష్టాలలో
భాధలలో భాగంపంచుకుని
తనకు ఉన్నదాంట్లోనే
ఇతరులకు సహాయంచేసే
గొప్పమనసు కలవారు
ఎందరుంటారు ఈలోకంలో
అటువంటి సేవాదృక్పథం
కల మహనీయులు నడిచిన దారిలో
నడిచి చరిత్రలో చిరస్థాయిగా
నిలిచిపోవాలి..
సత్యనీలిమ
7.
*కవితా గానం*
*అంశం:సేవా దృక్పథం*
******************
*తప్పదు!*
ఆత్మకు నిప్పు ముట్టించక తప్పదు!
అతడు నా ఉనికిని ములుకై పొడుస్తున్నాడు!
నన్ను శల్య పరీక్ష చేస్తున్నాడు!
తప్పదు జవాబుకై
గుండెను శోధించక తప్పదు!
నాకోసం....!
నా జీవన పరమార్ధం తెలుసుకొనేందుకు...!
అతన్ని ఓడించాలని....
మనసు గదిలోకి తొంగిచూస్తే ...
నేర్చుకున్న నీతికథల నీడల్లో
మూలనెక్కడో
ముడుచుకున్న మిణుగురు అంత మంచితనం మినహా
అంతా చీకటి శూన్యం....!
మస్తిష్క పొరల్లో
చదువులు నింపిన విలువల అరలు మకిలిపట్టి
స్వార్ధం బీగం బిగించుకొని
దర్పం కోసం విదిల్చిన అహం సాయాలు తప్ప
అన్నీ రిక్తహస్త ముద్రికలే!
అంతస్థుల నింగిలో ఉంటూ
మనిషితనం
ఆనవాలు మరచిన
నా చూపులెందుకు ఇప్పుడు ....
అతని సంతృప్తి బతుకు చిత్రం నుండి వెలువడుతున్న కాంతులకు
చెదిరి
నిజాల నేలను చేరాలని యత్నిస్తున్నాయి....!
నా కరెన్సీకి లేని
కన్సర్న్ అతని చేతలకున్నందుకా...
నా చేతుల్లో సైతం మొలవని
కరుణ అతని
ఆపాదమస్తకం పచ్చని ప్రవాహమై
ప్రభవిస్తున్నందుకా....!
రాశులు పోసిన నా కాసులు
అతని సత్క్రియల వాసి ముందు వెలవెల బోతున్న వెందుకు....!
తీరని వేదనేదో
వేరు పురుగై నన్ను తినేస్తుంటే....
శకలాలౌతున్న హృదయ తంతుల్ని ఒక నిశ్చల తాటికి ముడేసి....
నాలోకి నేను తొంగి చూసుకున్నా....!
ఖాళీ గా ఉన్న నా మది లోగిలిలో
గుప్పెడు *సత్కార్యాల ముద్దర్లు* దిద్దుకోవాలని
అపుడే తెలుసుకున్నా....!
ఇదిగో...
ఇప్పుడు అతని పుణ్య జాడల్లో నన్ను నేను ఆవిష్కరించుకుంటున్నా!
నిజమైన ధనవంతుణ్ణి అయ్యేందుకు!
మానవ జన్మను మానవతతో సార్ధకం చేసుకొనేందుకు!
🌹✍ *డి.నాగజ్యోతిశేఖర్*....
మురమళ్ల.
8
సేవాభావము అన్నది మానవత విలువలను ప్రతిబింబిస్తుంది
మంచితనముతో తోటివారిని గౌరవించుము
ఆపదసమయములో ఉన్నప్పుడు సాటిమనిషికి సాయము చేయడము మానవతకు నిదర్శనము
నీకు కలిగినంత శక్తానుసారము సేవభావముతో సమాజములో అనాధలను చేరదీసి కరుణతో వారిని ఆదరించుము
సేవలోనే దేవుడు కొలువై యున్నాడు
దేవుడు మనము చేసే మంచిపనులలో దాగియున్నాడు
గుడికిపోయి పూజలకు లక్షలుఖర్చుపెట్టినా దగ్గనిపుణ్యఫలము
సేవాధృక్పదములో కొలువైయున్నాడు
మనిషి నిత్యము ఈర్ష్యద్వేషాల మధ్య బతుకుతూ
గాఢాంధకారములో మానవత విలువలు మరిచి మమతలు విడిచి
పాశవికముగా ప్రవర్తిస్తున్నాడు
మానవసేవయే మాధవసేవ అన్నారు
పెద్దలు
అందరిపట్ల ఆత్మీయానురాగాలు కురిపించి మానవతా మల్లెలు మనసులోపూయాలి
శీర్షిక... మానవతాదృక్పధము
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి
9494162571
9.
డా. బల్లూరి ఉమాదేవి
అంశం: సేవా దృక్పథం
మానవసేవే మాధవసేవ అని
చేతనైనంత పరులకు ఉపకారం చేయడమే
మానవత్వం అదే కావాలి మనిషి తత్వం
ఎంత ఇచ్చాం ఏమిచ్చామని కాదు
ఇవ్వాలని కొన్న సేవా దృక్పథం ముఖ్యం
మన పురాణాలు మనకు నేర్పిన పాఠమిదే
రామసేతు నిర్మాణంలో అల్ప ప్రాణినని
నిరాశ పడకఉడుత చేసిన సహాయం
అయింది మానవాళికి ఆదర్శం
అన్నార్తులకు అనాధలకు ప్రేమతో ఇచ్చే
తృణమైనా పణమైన కలిగిస్తుంది
అంతులేని ఆత్మానందం
ప్రార్థించే పెదవుల కన్నా
సాయం చేసే చేతులు మిన్న
అన్న మదర్ తెరిసా మాటలే ఆదర్శం
స్వార్థరహితంగా సేవ చేస్తే చాలు
అదే అవుతుంది మనకు శ్రీరామరక్ష
డా. బల్లూరి ఉమాదేవి
10.
కవితా గానం
22-7-2020
సేవా దృక్పథం
మదర్ థెరీసా...
ఆమెకెవరు సాటి
గంజాం భ్రమరాంబ
తిరుపతి
వీరువారనియెడి భేదము చూపక
సకలజనుల కెపుడు సాయపడెను
మరువ లేము మనము మదరు థెరిస్సాను
విశ్వమాత వోలె ప్రేమ జూపె
దీనులయెడ తాను దేవతగా మారి
కుష్టు రోగి సేవ కోరి చేసే
చేరదీసి మార్చె చితికిన బ్రతుకుల
ఆదరించె వారి నమ్మ వోలె
ఆమె విశ్వమాత
అనాథలకు అమ్మ
కుష్ఠురోగులకు తల్లి
రోగిష్టులకు కల్పవల్లి
ఆమెకు
అసహ్యం అనిపించదు
ఎవరినీ
చీదరించుకోదు
తన అమృతహస్తాలతో
అనాధలకు సేవజేసిన పుణ్యమూర్తి
ప్రపంచం లోని ప్రజలందరూ
తన బిడ్డలే అని నమ్మిన మాతృమూర్తి
కోట్ల అభాగ్యుల పెదవులపై
నవ్వుల పూతోటలు
పూయించిన స్నేహమూర్తి
తన జీవితం మొత్తం
పరులసేవకే అంకితమిచ్చిన
అసలుసిసలైన మానవ మూర్తి
ఆ అమృతమూర్తికిదే
నా కవితాభివందనాలు
గంజాం భ్రమరాంబ
తిరుపతి
11.
[23/07, 8:10 PM] విజయ లక్ష్మి యాదాద్రి: To
కవితాగానం
శీర్షిక **సేవా దృక్పథం*
**ప్రశాంతచిత్తుల నిస్వార్థచింతన*
*సహృ'దయ'మున్న వారి ఉన్నతయోచన*
*చేతనైనంతలో చేయూతనివ్వాలనే సాలోచనే*
*మానవసేవే మాధవసేవ* *అనే భావన*
*చేసే సాయం చిన్నదా?పెద్దదా?- అనవసరం*
*సకాలాన సహృదయంతో స్పందించుట ప్రథమం*
*మనుషుల మానవత్వాన్ని నిరూపించే పత్రం*
*కష్టంలో ఉన్నవారినాదుకునే ఆపన్నహస్తమే*
*మాటల్లో చెప్పలేం సేవలోని గొప్పదనం*
*మానవతాసుమపరిమళమే తరగని ధనం*
**సేవాదృక్పథo మనకుండాల్సిన మంచి గుణం*
*సాయఫలమాధుర్యం సుమాల్లోలేని తీయదనం*
*పవిత్రహృదయంతో వేసే పరోపకారనాట్లు*
*స్వర్గలోకానికి వేసుకునే చెదరని మెట్లు*
వందల వేలమందినాదుకునుట అద్భుతమే
అంతటి మహానుభావులజన్మ తప్పక ధన్యమే
*మన జీవితాలు చేయకున్నా త్యాగం*
*మనమూ చేద్దాం ఉడతాభక్తి సాయం*
*కాల్చేద్దాo కరుణలేని కఠినభావాలను*
*చంపేద్దాం అతి స్వార్థపుశలభాలను*
*మదర్ థెరీసా అనంత సేవాస్ఫూర్తి కాగా*
*ప్రతి మాత ఆత్మీయ సేవామూర్తి అగుగా*
*తల్లిదండులను వృద్ధాప్యాన పిల్లలు*
*అనాధల్లా మార్చక చేతికర్రలై ఊతమిస్తే మేలు*
*వల్లాల*విజయలక్ష్మి*
*ఆలేరు*
12
[23/07, 8:18 PM] కందూరి సుజాత Poetess: 🌷సేవా కవనము🌷
******* ****** ******
సూర్య కిరణం వేకువ కాగా -
సేవా గమనము కవనము కాదా /
మానవత్వపు జల్లులో -
జాలువారరు సేవలు /
తేనెతత్వపు సేవలు-శ్వేతవర్ణ కాంతులు/
అడవికాచు వెన్నెల వృధా కాదు-
బాటసారి సేవలో కాగడగును/
నిరాకారమున సడిచేయు గాలి నిస్వార్థ సేవలు/
జలతారు సెలయేరు సేవకే అంకితాలు /
చేయు మనసున సేవ యశస్సు -
కోరు మనసున సేవ ఉషస్సు/
చిన్నవిత్తు లో దాగున్న మహాశక్తి లా -
సేవాతత్వము మహోన్నతము/
సేవభావముఅనిర్వచనీయం/
వసుదైక కుటుంబం- విషాదాలనేకం / పరమౌషధం సేవ- పరమపదం సేవ/ నిరంతరం సేవ నింగిలోని తార/
సేవ అంకితభావమున మదర్ తెరిసా- రవీంద్రనాథ్ ఠాగూర్ సేవలు
మహాగొప్ప దారులు అన్యులకు ఆదర్శములు/
భరతమాత ముంగిట్లో అడుగడుగునా ఆర్థులు-
అంత కాదు కొంత సేవలోన జీవించు/
మానవ మనుగడకు అర్థం ప్రసాదించు /
ఆత్మపరిసీలనతో
సేవాశిఖరరం- అధిరోహించవచ్చు/సేవాధృక్పదం-
ధృవతారగ వెలిగింపవచ్చు/
కందూరి సుజాత రాణి
రాజేంద్రనగర్, హైదరాబాద్
9392162822🌹
13
కవితా గానం
వై.కె.సంధ్యశర్మ
*అంశం:సేవాదృక్పథం*
మనసు గది మూలల్లో దాగిన
మానవతను చాటే ఆపస్సమయం
అడుగడుగునా తారస పడుతోంది
నేడు...
వలసల వెతలతో
దేశమంతా కానరానంత దూరం
తరలుతుంటే ఆ పాదాలకు
ఆశ్రయమిస్తూ...
గుండె నిబ్బరంతో
అనుక్షణం
వైద్యసేవలందిస్తూ
వైద్యులు....
పరిశుభ్రతా పరిరక్షకులైన
పారిశుద్ధ్య కార్మికులు
నిత్యం వాడవాడలా
విస్తరించే మహమ్మారిని
అవరోధిస్తూ...
వృత్తి ధర్మంలో
సంకెళ్ళు వేసే ఆ చేతులు నేడు
అనేక ప్రాణ సంరక్షణ చేస్తూ
రక్షకభటులు...
అలుపెరుగక విశ్రమించే
అనేక సేవా సంస్థలు
ఆశ్రమాలు....
నిరంతరం సేవా దృక్పథంతో
చేయూతనిస్తూ
పదుగురికి మార్గదర్శకులుగా
నిలుస్తున్నారు!
14
కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..సేవా దృక్పథం
స్వార్థమన్నది ఎరుగకనే
తోటివారికి సహాయపడాలన్న భావన
మంచి మనసున్న ప్రతి మనిషిలో ఉదయించే గొప్ప ఆలోచన
సాటి మనిషి ఆపదలో ఉంటే
స్పందించే వారే నిజమైన సేవకులు
అదే వారి మానవత్వానికి నిదర్శనం
ఆర్థిక సహాయమన్నదే కాదు సహయ మంటే
మాట కూడ ఓ సహాయమే
అడగకున్నా చేయాల్సింది
చేతనైనంత సహాయం అందించడం ఎంతో పుణ్యఫలం
ఈర్ష్య ద్వేషాలు విడిచిపెట్టి
ఆత్మీయతానురాగాలు పంచుతూ
మానవత్వమున్న మనిషిగా
మానవ సేవే మాధవ సేవగా జీవించాలి
బాల్యం నుండే మానవతావిలువల బీజాలు నాటితేనే
మానవత్వం పరిఢవిల్లి
సేవాదృక్పదం వెల్లి విరుస్తుంది
మహావృక్షమై ఎదుగుతుంది
వీరా గుడిపల్లి the mathematics teacher and poetసమన్వయం
శివునూరి లలితాకృష్ణ
సహకారం
మెరుగు మధు
అవధాని
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు
**********
కవివరుల జాబితా
1.శ్రీమతి అయిత అనిత గారు
2.శ్రీ.డాక్టర్ రామక కృష్ణ మూర్తి గారు
3.శ్రీ శివ లక్ష్మి రాజశేఖరుని గారు
4.శ్రీమతి స్వర్ణ సమత గారు
5.శ్రీ కోరాడ నరసింహారావు గారు
6.శ్రీమతి సత్య నీలిమ గారు
7.శ్రీమతి నాగ జ్యోతి శేఖర్ గారు
8.శ్రీ. సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
9. శ్రీమతి డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
10.శ్రీమతి గంజాం భ్రమరాంబ గారు
11.శ్రీమతి వల్లాల విజయ లక్ష్మి గారు
12.శ్రీమతి కందూరి సుజాతా రాణి గారు
13.శ్రీమతి YK సంధ్యా శర్మ గారు
14.మర్రి జయశ్రీ గారు
***************
1
[21/07, 8:02 PM] Anitha Aitha Poetess: *కవితా గానం*
అంశం : సేవాదృక్పథం
శీర్షిక: *మంచితనంతో మనుగడ సాగించు*
ఎప్పుడు ఎక్కడ పుడుతామో తెలియదు!
ఎన్నడు ఎలా మరణిస్తామో తెలియదు!!
వచ్చేటప్పుడు ఏమి తెచ్చామని...
వెళ్లేటప్పుడు ఏమి తీసుకెళతామని...
ఆస్థులు అంతస్తులు
ధనము దర్పము
ఇవేవి మనవి కావు మనతో ఎన్నటికీ రావు!
ఈర్ష్య అసూయ కామం క్రోధం ఆవేశం ఆహార్యం
అన్నీ!
భ్రమలే అని తెలిసినా... భ్రాంతిలోనే బ్రతుకీడుస్తున్నావ్!
మిధ్యను భద్రపరచగ... మూర్ఖంగా ఆలోచిస్తున్నావ్!!
ఇహ సుఖాలు శాశ్వతమని గుడ్డిగా నమ్ముతున్నావ్!
కనులు తెరిస్తే జననం
కనులు మూస్తే మరణం
ఈ లిప్తపాటు జీవన కాలాన్ని
బంధాలు అనుబంధాలు ఆప్యాయతలతో రంగరించు!
ఆత్మీయతానురాగాలతో జీవితాన్ని అనుభవించు!!
తోటివారికి కొంచెమైనా సాయపడి గర్వించు!
ఆపదలో ఉన్నవాడిని హత్తుకొని ఓదార్చు!!
పరోపకార ఫలాలను అందరకీ అందించు!
మహోన్నత కార్యాలకుశ్రీకారం చుట్టు!!
నీ పలుకుల్లో సతతము అమృతమునే చిందించు!
నీ కను చూపుల్లో అవిరళముగా కరుణనే కురిపించు!!
మానవత్వంతో మనీషిగా మనుగడ సాగించు!
మంచితనంతో అందరి హృదయాల్లో శాశ్వతంగా జీవించు!!
జగతికి ఆదర్శమై పరిఢవిల్లు,!
రచన
అయిత అనిత
జగిత్యాల
8985348424
హామి పత్రం
ఇది నా స్వీయ రచన
దేనికి అనువాదం కాదు
[21/07, 8:11 PM] Ramaka: ⭐కవితా గానం⭐
20
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:21-7-2020
అంశం:సేవాదృక్పథం
ప్రక్రియ: వచనకవిత్వం
శీర్షిక: పరమధర్మం
**************************
నిస్వార్థంగా,నియమబద్ధతతో
చేసే మహోపకారం
కులం,మతం,ప్రాంతం,వర్ణం,
వర్గం,పక్షపాతం లేకుండా
ఆపన్నులకు అందించే సహాయం
మానవునిలో మాధవుని చూపే సంకేతం
దయ,సానుభూతి,జాలి,ప్రేమ,ఔదార్యాలకు మచ్చుతునక.
అవసరమేదైనా అందించే ఆపన్నహస్తం
ఎలాంటి ఆశ లేకుండా చేయాల్సిన పరోపకారం
పరిణతి చెందిన మనుషుల కర్తవ్యం
హృదయవైశాల్యానికి,
నిర్మలతకు ఆలవాలం.
సేవే పరమధర్మమని నమ్మే
మహనీయుల కార్యరంగం
లోకంలో ఉన్నతమైన కర్మల చిహ్నం
ఆలోచన అద్వితీయమై కీర్తివంతమవుతుంది.
మనసులను గెలిచి కార్యోన్ముఖులను చేస్తుంది.
3
కవితా గానం
ప్రక్రియ: వచన కవిత
అంశం: సేవాధర్మం
పేరు: శ్రీ శివ లక్ష్మీ రాజశేఖరుని
శీర్షిక: నా మూలాల్లో నేనెక్కడ
సాటిమనిషికి సాయం చెయ్యడానికి
వెనకాడే నాలో లేని నా కోసం
నేను ఎక్కడో వెతుకుతూ వెళుతున్నాను
సవరించుకున్న నైతిక సూత్రాల పత్రాన్ని
అవసరార్థం అనుకూలంగా మలుచుకుని
మరచిపోయిన మూలాల మలుపుల్లో
మౌనంగా నన్ను నేను వదిలేసి
మళ్లీ కొత్తగా నా కోసం నేను ఎక్కడో వెతుకుతున్నాను
నాగరికత ముసుగులో
సాంప్రదాయ సిద్ధాంతాన్ని తగలేసి
తగిలించుకున్న బాధ్యత భావోద్వేగాల్లో
కొని తెచ్చుకున్న ఆవేశకావేశాల కోరల్లో
అంతరిస్తున్న సేవాధర్మాన్ని అనాధగా వదిలేసి
నాలో లేని నా కోసం
నేను ఎక్కడో వెతుకుతూ వెళుతున్నాను
రంగురంగుల మాయలోకపు వలలో చిక్కి
విలువల పునాదులపై
విచ్చలవిడి తనపు సమాధులు కడుతూ
పెచ్చుమీరిన స్వార్థపు సౌధాల పై
వికృత నాట్యం చేస్తున్న
కలుషిత హృదయపు శిథిలాల్లో
నన్ను నేను వదిలేసి
నాలో లేని నా కోసం ఇప్పటికీ పిచ్చిగా
నేను ఎక్కడో వెతుకుతూనే వెళుతున్నాను
4.
*కవితా గానం*
*21/07/2020*
*సేవా దృక్పథం*
సేవలో ఉన్న గొప్పతనం
మరెక్కడా లేదు,
అధో తియ్యదనం,
అదియే పరమార్థం,
*మానవ సేవే మాధవ సేవ*
అన్నారు,
గాంధీ గారు
పరులకు సేవ చేసే భాగ్యం
కలిగితే దానికన్నా ఉత్కృష్టమైనది మరొకటి
లేదు,
ఓ మదర్ థెరిస్సా...
దేశసేవ లో తరించిన వాళ్ళు
ఎందరో
అందులైన తల్లితండ్రులు కు
సేవ చేసిన శ్రవణుడు,
సేవించడం ఓ యోగం
సేవలో ఓ ఆనందం ఉంటుంది,
సేవలో ఓ తృప్తి దొరుకుతుంది,
ఆకలి గొన్నవారికి,
పట్టెడన్నం పెట్టడము సేవే,
వృద్ధులకు చేసే సేవ,
వ్యాధిగ్రస్తులకు చేయునది
విశిష్ట సేవా,
మన జన్మకు సార్థకత
కలగాలంటే సేవా భావం
ఉండాలి,
సాహిత్య సేవ ఆ తల్లి భారతిని
సేవించడం,
అనాథలకు చేసే సేవ,
అందులకు చేసే సేవ,
అత్త మామలకూ సేవ చేయడం
కర్త్యవ్య ము నెరవేర్చుకోవడానికి
భగవంతుడు మనకు అవకాశము ఇచ్చినపుడు
దానిని ఖచ్చితంగా
చేసే ప్రయత్నము చేయాలి,
పసిపిల్లలకు చేసే సేవ,
ఇలా,
సేవా తత్పరత ఎంతో విశిష్టమైనది.
*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
5
కవితాగానం
అంశం:సేవాదృక్పధం
కోరాడ నరసింహా రావు;సేవనుప్రేమతో
************
బిడ్డకు ఎంత సేవ చే సినా,తల్లిఆనందాన్నే
ఎలాపొందుతుంది ?
......ప్రేమ...!
సత్యసాయి...ప్రేమసహితసేవనుచెయ్యాలన్న ప్రబోధం తో...
విద్య,వైద్య,ఆధ్యాత్మికతలతోసహా...అవసరమైన వారికి అన్ని విధాలా సేవను చేసి ,
చేయిస్తూ...భగవాన్ గా ఖ్యాతిగాంచి ఎలా తరించారోచూసాంగా
ప్రతిఫలాక్ష రహిత
నిస్వార్ధసేవలో నున్న మహత్తే అది...!
ఆ తృప్తి ,ఆనందం...
ప్రకటించ గలిగే భాష లేదు !
ఈ
సేవాదృక్పధమేకదూ
తెరీసాను మదర్
థెరిస్సాను చేసింది !
పతిసేవతో...సక్కుబాయి.,మాతా పిత రుల సేవతో శ్రావణ కుమారుడూ ప్రభు సే వతోహనుమ,పరమాత్మ సేవలో ఎంద రెండరోభక్తులూతరిం
చి,శాశ్వతత్వాన్ని పొంద లేదూ...!
బూటకపు సేవానాట కాలతో...కొందరిని,కొంతకాలమే మోస గించగలవ్ !
నిస్వార్ధసేవాతత్పరుల మూలం గానే ...
దీనజనోద్దరణ...మహిళాభ్యుదయం...
సమాజసంస్కరణలు
సాధ్యమయ్యాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం...!
నిర్మలమైనమనసులే
ప్రేమించగలవ్...!
స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే...సేవించగలదు!
*****************
.......కోరాడ.
6
*కవితా గానం*
*అంశం: సేవా దృక్పథం*
సాఫీగా సాగే జీవితంలో
ఎగుడుదిగుడు పరిస్థితుల
కష్టనష్టాలు సామాన్య ప్రజలకు
కలిగే పరిణామాలతో ఎదురుదెబ్బలు తగులుతుంటే
ఆటుపోట్లకు ఎదురీగి
అంతులేని శక్తిసామర్ధ్యాలనూ
కూడదీసుకుని వాటికి ధైర్యంగా
ఎదురొడ్డి చేసే పోరాటం
చేసే సమయంలో పక్కన ఎవరూ లేకుంటే
ప్రకృతివైపరిత్యాలతో నిరంతరం
పోరాటం చేస్తూకూడా
తన చేసే వ్యవసాయం
వదలని కర్షకుని ఆత్మవిశ్వాసం
పరిస్థితులతో చేసే
పోరాటాలతో అలసిన
మనసుకు ఆలంబనగా
నేనున్నానంటూ మన కష్టాలలో
భాధలలో భాగంపంచుకుని
తనకు ఉన్నదాంట్లోనే
ఇతరులకు సహాయంచేసే
గొప్పమనసు కలవారు
ఎందరుంటారు ఈలోకంలో
అటువంటి సేవాదృక్పథం
కల మహనీయులు నడిచిన దారిలో
నడిచి చరిత్రలో చిరస్థాయిగా
నిలిచిపోవాలి..
సత్యనీలిమ
7.
*కవితా గానం*
*అంశం:సేవా దృక్పథం*
******************
*తప్పదు!*
ఆత్మకు నిప్పు ముట్టించక తప్పదు!
అతడు నా ఉనికిని ములుకై పొడుస్తున్నాడు!
నన్ను శల్య పరీక్ష చేస్తున్నాడు!
తప్పదు జవాబుకై
గుండెను శోధించక తప్పదు!
నాకోసం....!
నా జీవన పరమార్ధం తెలుసుకొనేందుకు...!
అతన్ని ఓడించాలని....
మనసు గదిలోకి తొంగిచూస్తే ...
నేర్చుకున్న నీతికథల నీడల్లో
మూలనెక్కడో
ముడుచుకున్న మిణుగురు అంత మంచితనం మినహా
అంతా చీకటి శూన్యం....!
మస్తిష్క పొరల్లో
చదువులు నింపిన విలువల అరలు మకిలిపట్టి
స్వార్ధం బీగం బిగించుకొని
దర్పం కోసం విదిల్చిన అహం సాయాలు తప్ప
అన్నీ రిక్తహస్త ముద్రికలే!
అంతస్థుల నింగిలో ఉంటూ
మనిషితనం
ఆనవాలు మరచిన
నా చూపులెందుకు ఇప్పుడు ....
అతని సంతృప్తి బతుకు చిత్రం నుండి వెలువడుతున్న కాంతులకు
చెదిరి
నిజాల నేలను చేరాలని యత్నిస్తున్నాయి....!
నా కరెన్సీకి లేని
కన్సర్న్ అతని చేతలకున్నందుకా...
నా చేతుల్లో సైతం మొలవని
కరుణ అతని
ఆపాదమస్తకం పచ్చని ప్రవాహమై
ప్రభవిస్తున్నందుకా....!
రాశులు పోసిన నా కాసులు
అతని సత్క్రియల వాసి ముందు వెలవెల బోతున్న వెందుకు....!
తీరని వేదనేదో
వేరు పురుగై నన్ను తినేస్తుంటే....
శకలాలౌతున్న హృదయ తంతుల్ని ఒక నిశ్చల తాటికి ముడేసి....
నాలోకి నేను తొంగి చూసుకున్నా....!
ఖాళీ గా ఉన్న నా మది లోగిలిలో
గుప్పెడు *సత్కార్యాల ముద్దర్లు* దిద్దుకోవాలని
అపుడే తెలుసుకున్నా....!
ఇదిగో...
ఇప్పుడు అతని పుణ్య జాడల్లో నన్ను నేను ఆవిష్కరించుకుంటున్నా!
నిజమైన ధనవంతుణ్ణి అయ్యేందుకు!
మానవ జన్మను మానవతతో సార్ధకం చేసుకొనేందుకు!
🌹✍ *డి.నాగజ్యోతిశేఖర్*....
మురమళ్ల.
8
సేవాభావము అన్నది మానవత విలువలను ప్రతిబింబిస్తుంది
మంచితనముతో తోటివారిని గౌరవించుము
ఆపదసమయములో ఉన్నప్పుడు సాటిమనిషికి సాయము చేయడము మానవతకు నిదర్శనము
నీకు కలిగినంత శక్తానుసారము సేవభావముతో సమాజములో అనాధలను చేరదీసి కరుణతో వారిని ఆదరించుము
సేవలోనే దేవుడు కొలువై యున్నాడు
దేవుడు మనము చేసే మంచిపనులలో దాగియున్నాడు
గుడికిపోయి పూజలకు లక్షలుఖర్చుపెట్టినా దగ్గనిపుణ్యఫలము
సేవాధృక్పదములో కొలువైయున్నాడు
మనిషి నిత్యము ఈర్ష్యద్వేషాల మధ్య బతుకుతూ
గాఢాంధకారములో మానవత విలువలు మరిచి మమతలు విడిచి
పాశవికముగా ప్రవర్తిస్తున్నాడు
మానవసేవయే మాధవసేవ అన్నారు
పెద్దలు
అందరిపట్ల ఆత్మీయానురాగాలు కురిపించి మానవతా మల్లెలు మనసులోపూయాలి
శీర్షిక... మానవతాదృక్పధము
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి
9494162571
9.
డా. బల్లూరి ఉమాదేవి
అంశం: సేవా దృక్పథం
మానవసేవే మాధవసేవ అని
చేతనైనంత పరులకు ఉపకారం చేయడమే
మానవత్వం అదే కావాలి మనిషి తత్వం
ఎంత ఇచ్చాం ఏమిచ్చామని కాదు
ఇవ్వాలని కొన్న సేవా దృక్పథం ముఖ్యం
మన పురాణాలు మనకు నేర్పిన పాఠమిదే
రామసేతు నిర్మాణంలో అల్ప ప్రాణినని
నిరాశ పడకఉడుత చేసిన సహాయం
అయింది మానవాళికి ఆదర్శం
అన్నార్తులకు అనాధలకు ప్రేమతో ఇచ్చే
తృణమైనా పణమైన కలిగిస్తుంది
అంతులేని ఆత్మానందం
ప్రార్థించే పెదవుల కన్నా
సాయం చేసే చేతులు మిన్న
అన్న మదర్ తెరిసా మాటలే ఆదర్శం
స్వార్థరహితంగా సేవ చేస్తే చాలు
అదే అవుతుంది మనకు శ్రీరామరక్ష
డా. బల్లూరి ఉమాదేవి
10.
కవితా గానం
22-7-2020
సేవా దృక్పథం
మదర్ థెరీసా...
ఆమెకెవరు సాటి
గంజాం భ్రమరాంబ
తిరుపతి
వీరువారనియెడి భేదము చూపక
సకలజనుల కెపుడు సాయపడెను
మరువ లేము మనము మదరు థెరిస్సాను
విశ్వమాత వోలె ప్రేమ జూపె
దీనులయెడ తాను దేవతగా మారి
కుష్టు రోగి సేవ కోరి చేసే
చేరదీసి మార్చె చితికిన బ్రతుకుల
ఆదరించె వారి నమ్మ వోలె
ఆమె విశ్వమాత
అనాథలకు అమ్మ
కుష్ఠురోగులకు తల్లి
రోగిష్టులకు కల్పవల్లి
ఆమెకు
అసహ్యం అనిపించదు
ఎవరినీ
చీదరించుకోదు
తన అమృతహస్తాలతో
అనాధలకు సేవజేసిన పుణ్యమూర్తి
ప్రపంచం లోని ప్రజలందరూ
తన బిడ్డలే అని నమ్మిన మాతృమూర్తి
కోట్ల అభాగ్యుల పెదవులపై
నవ్వుల పూతోటలు
పూయించిన స్నేహమూర్తి
తన జీవితం మొత్తం
పరులసేవకే అంకితమిచ్చిన
అసలుసిసలైన మానవ మూర్తి
ఆ అమృతమూర్తికిదే
నా కవితాభివందనాలు
గంజాం భ్రమరాంబ
తిరుపతి
11.
[23/07, 8:10 PM] విజయ లక్ష్మి యాదాద్రి: To
కవితాగానం
శీర్షిక **సేవా దృక్పథం*
**ప్రశాంతచిత్తుల నిస్వార్థచింతన*
*సహృ'దయ'మున్న వారి ఉన్నతయోచన*
*చేతనైనంతలో చేయూతనివ్వాలనే సాలోచనే*
*మానవసేవే మాధవసేవ* *అనే భావన*
*చేసే సాయం చిన్నదా?పెద్దదా?- అనవసరం*
*సకాలాన సహృదయంతో స్పందించుట ప్రథమం*
*మనుషుల మానవత్వాన్ని నిరూపించే పత్రం*
*కష్టంలో ఉన్నవారినాదుకునే ఆపన్నహస్తమే*
*మాటల్లో చెప్పలేం సేవలోని గొప్పదనం*
*మానవతాసుమపరిమళమే తరగని ధనం*
**సేవాదృక్పథo మనకుండాల్సిన మంచి గుణం*
*సాయఫలమాధుర్యం సుమాల్లోలేని తీయదనం*
*పవిత్రహృదయంతో వేసే పరోపకారనాట్లు*
*స్వర్గలోకానికి వేసుకునే చెదరని మెట్లు*
వందల వేలమందినాదుకునుట అద్భుతమే
అంతటి మహానుభావులజన్మ తప్పక ధన్యమే
*మన జీవితాలు చేయకున్నా త్యాగం*
*మనమూ చేద్దాం ఉడతాభక్తి సాయం*
*కాల్చేద్దాo కరుణలేని కఠినభావాలను*
*చంపేద్దాం అతి స్వార్థపుశలభాలను*
*మదర్ థెరీసా అనంత సేవాస్ఫూర్తి కాగా*
*ప్రతి మాత ఆత్మీయ సేవామూర్తి అగుగా*
*తల్లిదండులను వృద్ధాప్యాన పిల్లలు*
*అనాధల్లా మార్చక చేతికర్రలై ఊతమిస్తే మేలు*
*వల్లాల*విజయలక్ష్మి*
*ఆలేరు*
12
[23/07, 8:18 PM] కందూరి సుజాత Poetess: 🌷సేవా కవనము🌷
******* ****** ******
సూర్య కిరణం వేకువ కాగా -
సేవా గమనము కవనము కాదా /
మానవత్వపు జల్లులో -
జాలువారరు సేవలు /
తేనెతత్వపు సేవలు-శ్వేతవర్ణ కాంతులు/
అడవికాచు వెన్నెల వృధా కాదు-
బాటసారి సేవలో కాగడగును/
నిరాకారమున సడిచేయు గాలి నిస్వార్థ సేవలు/
జలతారు సెలయేరు సేవకే అంకితాలు /
చేయు మనసున సేవ యశస్సు -
కోరు మనసున సేవ ఉషస్సు/
చిన్నవిత్తు లో దాగున్న మహాశక్తి లా -
సేవాతత్వము మహోన్నతము/
సేవభావముఅనిర్వచనీయం/
వసుదైక కుటుంబం- విషాదాలనేకం / పరమౌషధం సేవ- పరమపదం సేవ/ నిరంతరం సేవ నింగిలోని తార/
సేవ అంకితభావమున మదర్ తెరిసా- రవీంద్రనాథ్ ఠాగూర్ సేవలు
మహాగొప్ప దారులు అన్యులకు ఆదర్శములు/
భరతమాత ముంగిట్లో అడుగడుగునా ఆర్థులు-
అంత కాదు కొంత సేవలోన జీవించు/
మానవ మనుగడకు అర్థం ప్రసాదించు /
ఆత్మపరిసీలనతో
సేవాశిఖరరం- అధిరోహించవచ్చు/సేవాధృక్పదం-
ధృవతారగ వెలిగింపవచ్చు/
కందూరి సుజాత రాణి
రాజేంద్రనగర్, హైదరాబాద్
9392162822🌹
13
కవితా గానం
వై.కె.సంధ్యశర్మ
*అంశం:సేవాదృక్పథం*
మనసు గది మూలల్లో దాగిన
మానవతను చాటే ఆపస్సమయం
అడుగడుగునా తారస పడుతోంది
నేడు...
వలసల వెతలతో
దేశమంతా కానరానంత దూరం
తరలుతుంటే ఆ పాదాలకు
ఆశ్రయమిస్తూ...
గుండె నిబ్బరంతో
అనుక్షణం
వైద్యసేవలందిస్తూ
వైద్యులు....
పరిశుభ్రతా పరిరక్షకులైన
పారిశుద్ధ్య కార్మికులు
నిత్యం వాడవాడలా
విస్తరించే మహమ్మారిని
అవరోధిస్తూ...
వృత్తి ధర్మంలో
సంకెళ్ళు వేసే ఆ చేతులు నేడు
అనేక ప్రాణ సంరక్షణ చేస్తూ
రక్షకభటులు...
అలుపెరుగక విశ్రమించే
అనేక సేవా సంస్థలు
ఆశ్రమాలు....
నిరంతరం సేవా దృక్పథంతో
చేయూతనిస్తూ
పదుగురికి మార్గదర్శకులుగా
నిలుస్తున్నారు!
14
కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..సేవా దృక్పథం
స్వార్థమన్నది ఎరుగకనే
తోటివారికి సహాయపడాలన్న భావన
మంచి మనసున్న ప్రతి మనిషిలో ఉదయించే గొప్ప ఆలోచన
సాటి మనిషి ఆపదలో ఉంటే
స్పందించే వారే నిజమైన సేవకులు
అదే వారి మానవత్వానికి నిదర్శనం
ఆర్థిక సహాయమన్నదే కాదు సహయ మంటే
మాట కూడ ఓ సహాయమే
అడగకున్నా చేయాల్సింది
చేతనైనంత సహాయం అందించడం ఎంతో పుణ్యఫలం
ఈర్ష్య ద్వేషాలు విడిచిపెట్టి
ఆత్మీయతానురాగాలు పంచుతూ
మానవత్వమున్న మనిషిగా
మానవ సేవే మాధవ సేవగా జీవించాలి
బాల్యం నుండే మానవతావిలువల బీజాలు నాటితేనే
మానవత్వం పరిఢవిల్లి
సేవాదృక్పదం వెల్లి విరుస్తుంది
మహావృక్షమై ఎదుగుతుంది
Comments
Post a Comment