నిర్వహణ
వీరా గుడిపల్లి the mathematics teacher and poet
సమన్వయం
శివునూరి లలితాకృష్ణ
సర్ఫరాజ్ అన్వర్
మెరుగు మధు
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
*******************
కవివరుల జాబితా
💎💎💎💎💎💎💎💎
*అంశం :భారతస్వాతంత్రోద్యమం*
*ఆషాఢ మాసం పౌర్ణమి పురస్కారాల పోటీకి స్పందించిన*
*కవి మిత్రులు*
1.ఇంద్రవత్ రాహుల్ గారు
2.రవికుమార్ గారు
3.డాక్టర్. రామకకృష్ణ మూర్తి గారు
4.మహమ్మద్ షరీఫ్ గారు
5.కందూరి సుజాతగౌడ్ గారు
6.స్వర్ణ సమత గారు
7.విజయకొలచనభారతి గారు
8.తిరువెంకటాచార్యులు గారు
9.కోరాడనరసింహారావు గారు
10.సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
11.సంధ్యా శర్మ గారు
12.గుండ్ల రాజు గారు
13.శివ లక్ష్మి రాజశేఖరుని గారు
14.అనుముల తేజస్విని గారు
15.పాల్వంచ హరికిషన్ గారు
16.డాక్టర్. పాండాల మహేశ్వర్ గారు
17.డాక్టర్. బల్లూరి ఉమాదేవి గారు
18.సామల ఫణికుమార్ గారు
19.చివుకుల శ్రీలక్ష్మి గారు
20.వురిమిళ్ళ సునంద గారు
21.గంజాం భ్రమరాంబ గారు
22.స్వర్ణలత గారు
23.లక్కిరెడ్డి విజయ శుభాకర్ రెడ్డి గారు
24.ధనాశి ఉషా రాణి గారు
25.అయిత అనిత గారు
26.
27.శ్రీకాంత్ కడార్ల గారు
28.మర్రి జయశ్రీ గారు
29.వల్లాల విజయ లక్ష్మి గారు
30.దీపక్ న్యాతి గారు
********************
💎💎💎💎💎💎💎💎💎
1
[05/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *అందరికి నమస్కారం*
➖➖➖➖➖➖➖➖
🌕🌷🌕🌷🌕🌷🌕🌷🌕
*కవిత గానం పౌర్ణమి పోటీలు*
★★★★★★★★★★★★★★
అంశం : స్వాతంత్య్రోద్యమం
రచన తేది : 05/07/2020
వారం : ఆదివారం
శీర్షిక : స్వాతంత్ర్య ఉద్యమ కొలిమి
🌕 *పౌర్ణమి*🌕
🇮🇳 *స్వాతంత్ర్య ఉద్యమ కొలిమి*🇮🇳
మట్టి వాసన తట్టిలేపగ
పురుడు పోసుకునె ఉద్యమం
ఒక్క అడుగు వందలు వేలవగ
కదిలేనే సంగ్రామ రధం
రథసారధి లేడు వారధి మనమే
రుధిరముప్పోంగగా కదిలే సైన్యం మనమే
మండుతున్న అగ్నికణాలవి
అగ్నికణాలన్ని దావానలమై దహిస్తే
తెల్లరాక్షసులు మాడిపోయారు
విజేతలమని విర్రవీగిన
అంగ్లమూకలు అగమయ్యరు
ఆ అగ్నికణాలు పుట్టిన కొలిమి
హిందూస్తాన్ రిపబ్లికన్ ఆసోసిసియోషన్ అదో
అరని విప్లవ కొలిమి
అదో అగని స్వాతంత్ర్య ఉద్యమ కొలిమి
ఆ విప్లవ కొలిమిలో రాజుకున్న
కణం రాంప్రసాద్ బిస్మిల్
రగులుకున్న రవ్వ రాజేంద్ర లాహిరి
అరని మహజ్వాల ఆజాద్ చంద్రశేఖర్
భగ భగ మండే కణం భగత్ సింగ్
రివ్వున ఎగిరే రవ్వ రోషన్ సింగ్
ఆగని అగ్నిజ్వాల అష్పకుల్ల ఖాన్
ఆ విరగ్నిజ్వాలలు సెగ
స్వేచ్ఛ కోసం పరుగులెత్తించింది
దేశం కోసం ఉద్యమింపజేసింది
స్వతత్ర్య సంగ్రామం రాజేసింది..
*హామీ పత్రం*: ఈ కవిత నేను స్వయంగా రాసాను... అని హామీ ఇస్తున్నాను....
ధన్యవాదములు.. 🌷
🎯 *కవి పరిచయం*🎯
★★★★★★★★★★★★★
కవి పేరు : ఇంద్రవత్ రాహుల్
ఊరు : మల్కాపూర్
జిల్లా : ఇందూర్ /నిజామాబాద్
మండలం : ఇందూర్ /నిజామాబాద్
చరవాణి : *9848054079*
2
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[05/07, 8:00 PM] Kanchi Ravi Kumar Poet: 05.7.2020.
🌺 _'కవితాగానం'_
(ఆషాఢ మాసం పౌర్ణమి కవితల పోటీలు.. 05.7.2020.)
🔸అంశం,
శీర్షిక : _*"భారత స్వాతంత్ర్యోద్యమం*"._
నా కవిత్వం-183,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
🌺🕊️🇮🇳✊🌺
భిన్న సంస్కృతుల భిన్న కులమతాల
విభిన్న సంస్థానాల విభిన్న ఆశయాల
భారత సామ్రాజ్యం
తెల్లవాడి అకృత్యాలకు
విధ్వంసాలకు
అతలాకుతల మయింది
భిన్నత్వంలో ఏకత్వం సాధించి
స్వేచ్ఛా స్వాభిమాన సార్వభౌమ
ఆలోచనలు చిగురించి
అతివాద మితవాద అహింసా హింసా
విధానాలతో
సహాయ నిరాకరణ స్వదేశీ ఆచరణ
ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాలతో
ఆయుధ నిరాయుధ పోరాటాలతో
బ్రిటిష్ వాడి తూటాలకెదురునిల్చి
నియంత నిరంకుశ
దౌర్జన్యాలనెదిరించి
సింహ గర్జనలతో
'ఉరి'కురికిన
భారత
స్వాతంత్ర్యోద్యమం
ప్రపంచ చరిత్రలో ప్రత్యేకస్థానంపొందింది.
_*జై హింద్*_.✊
_-రవికుమార్ కంచి_
🙏🌸.
🌺💠🌺.
3
[05/07, 8:01 PM] Ramaka: ⭐కవితా గానం⭐
*ఆషాఢమాసం పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీ*
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:5-7-2020
అంశం:భారత స్వాతంత్ర్యోద్యమం
ప్రక్రియ: వచనకవిత్వం
శీర్షిక: జాతీయోద్యమం
**************************
దాస్యశృంఖలాలను తెంచుకొనేందుకు
సాగిన మహోద్యమ సంగ్రామం
బ్రిటిషు దురహంకారానికి వెల్లువెత్తి ఎగిసిన ప్రజా ఉద్యమం
నింగినంటిన త్రివర్ణపతాకాల అస్తిత్వ అజరామర యజ్ఞం
అఖండ భారతావని ఐక్యమై సాగించిన చరిత్రాత్మకమైన జాతీయోద్యమం
అహింస,శాంతి,సహనం,
ఐకమత్యాలు ఆయుధాలుగా
సాగిన ధర్మపోరాటం
వీరుల త్యాగాల బాటలపై నడిచిన
సిద్ధాంత కురుక్షేత్ర యుద్ధం
ఎన్నో ఉద్యమాలతో నిర్మితమై
నిరంతరం సాగిన స్వేచ్ఛాకదనం
అణచివేత, దౌర్జన్యాల నుంచి పుట్టిన జనచైతన్య సమరం
సమావేశాలు, చర్చలు,
విన్నపాలు విఫలమై
ప్రపంచం కళ్ళు తెరిపించిన భారతీయం
వందేమాతర స్ఫూర్తితో
భరతమాత చెర విడిపించిన
మాతృవందనం
విభజించి పాలించిన రాజకీయాలను
కూకటివేళ్ళతో పెకిలించిన భూకంపం
ఎందరో త్యాగధనుల ప్రాణత్యాగాలతో
ఉదయించిన నవోదయం
స్వాతంత్ర్య పోరాటం జాతి అస్తిత్వ జాతీయగీతం.
హామీపత్రం:
పై వచనకవిత నా స్వంత రచన.దేనికీ అనువాదం, అనుకరణ కాదు.
4
[05/07, 8:01 PM] Sharief Sir: -:కవితా గానం సమూహ పౌర్ణమి నగదు పురస్కారమునకై:-
అంశము:"భారత స్వాతంత్ర్యోద్యమం"
ఉపాంశము: "అమరులు"
1కం:
అతివాదులు మితవాదులు
సతతము పోట్లాడు చుండ్రి
సఖ్యతలేకన్!
గతి దప్పెను సంగ్రామ
మ్మతి లాభము గూర్చెనపుడు
నాంగ్లేయులకున్!
2ఉ:
ఒప్పము పన్నుగట్టుటకు నుప్పును దీతుమటంచు యోధు లా
ముప్పురి గొన్న కోపమున ముందుగ నిర్ణయ మైన చోట నే
నిప్పుల యెండలో మడులు నేర్పుగ గట్టిరి దండి ప్రాంతమున్
దప్పని తెల్లవారు బహుదండన
జేయుచు జైలుకంపిరే!
3సీ:
ఆజాదు హిందుఫౌజపురూప
సైన్యంబు
గొప్పగా నేతాజి గూర్చినడిపె
సత్యాగ్రహమ్ముతో నిత్యమ్ము గాంధీజి
తెల్లవారందరిన్ నుల్లమనిచె
బాలగంగాధరున్ భర్మదేశమ్మున
మాండలే జైలులో మ్రగ్గజేయ
యతివాదు లందరు నాంగ్లేయులను జంప
దేశమంతట నొక్క దినము బెట్ట
తే.గీ:
పంది యావుల నెయ్యిని పట్టు
కొనుట
నపవిత్రమ్మనిసైనికుల్ నెపముబెట్ట
తప్పదని జెప్ప సర్కారు గొప్ప గాను
ఎదురు తిరిగెను సైన్యంబు నొదగ లేక
4కం:
బెదిరించిన నాంగ్లేయుని
నెదిరించియు చంపె "పాండె"
నేమరు పాటున్!
కదిలిరి సైనికులప్పుడు
బెదిరిరి నాంగ్లేయులంత భీతిని
చెందన్!
5కం:
అభివృద్ధిని జేయక వా
రబలల శీలమ్ము దోచి రాంగ్లే
యాదుల్!
విభజించిరి దేశమ్మును
కబలించిరి సంపదలను
కనకము నంతన్!
6చం:
సమరము జేసినారు తమ సంపద నంతయు ధారబోసి వా
రమరులు భారతావనిని రాజస
మొప్పెడి పుత్రరత్నముల్
విమలము వారి జీవనము విశ్వము నంతయు మారుమ్రోగగా
హిమగిరి మేరు పర్వతము లెత్తుగ కీర్తిని బొంది రందరున్!
" ప్రతిభారత్న"
డాక్టర్. మహ్మద్ షరీఫ్
సంగారెడ్డి-9866560527
5
[05/07, 8:01 PM] కందూరి సుజాత Poetess: కవితాగానం.. పున్నమి పోటి
అంశం..బారతస్వాతంత్ర్యోద్యమం
శీర్షిక...🌷 స్వేచ్ఛా శిల్పం. 🌷
....... ......... ........... .....
భారత స్వాతంత్ర్యోద్యమం /
స్వేచ్ఛ అధ్యాయ అంకుర ఆరంభం /
పురిటిగడ్డ త్యాగ,తెగింపుల నెత్తురద్ది- ఉద్యమాల పురుడు పోసుకున్నది /
వీరోచిత పొత్తిళ్లలో ధీరత్వం రంగరించి , చనుపాలతో హృదయానికి ఐక్యతనే అమృతాన్ని అందించినదీ/
హిందుత్వాన్ని కాలరాస్తూ,
దేశ సంపదలను కొల్లగొడుతూ, పంఛభూతాలను అనుభవించు స్వేచ్ఛానూ కభళించి,
ప్రతిదానికి పన్నులు బిగించీ-
హింస ధండనలిచ్చు శ్వేత జాతి రాక్షస రాబందు పై -
అహింస నినాదంతో విరుచుకుపడిన -
వీరాపవనమే సత్యాగ్రహదీక్ష ఉద్యమాలు
జలియన్వాలా బాగ్ మారణకాండకు ,
క్విట్ ఇండియా మెగా అస్త్రమై హోరెత్తిన ఘన సంగ్రామం/
రక్తసిక్తములు ఏరులై పారిన -
ఇరుజాతుల వైరం/
ఆక్రమితం ,అరాచకం పరదేశి వాదం /
స్వరాజ్యం జన్మహక్కు,నిష్క్రమించమనీ స్వదేశీ ప్రతివాదం /
ఎగిసిపడే కెరటాలై ఆగక సాగిన స్వేచ్ఛా ఉద్యమమాలు/
అతిథి కానీ ఆంగ్లేయ పరాన్నజీవితో- ఉండలేక, ఊపిరాడక ,
తూటాకు దీటుగా గుండె నిలిపి,
సంద్రాన ఉప్పు కాచి,
నూలు ఉడికి పోగులాగి- వస్త్రమళ్లీ , సిస్తూ నిలిపి, పరదేశి వస్తువులను -
తెగనరకగ ఏక ఖంఠమున -
వీరులు మ్రోగించిన శంఖారావంమే -
స్వేచ్ఛా ఉద్యమాలు/
స్వార్థం అన్నది లేదు నాడు/
ఐక్యత అన్నది అల్లుకున్నది /
రాజుకున్నది స్వరాజ్య కాంక్ష /
దేశం ధావాళమై దహించినదీ పరదేశిని/ స్వేచ్ఛ చినుకులొచ్చి - ఊరట ఇచ్చే ఉద్యమాలకు/
రణమున విజయాభరణం పొందిన భారతమ్మకు హారతి ఇచ్చే/
ఘోర రుధిర కణము, ఆంగ్లేయ వనము -
పెరకించిన ఖద్దరు దేశ బలం/
"శృంఖల భారత శిలను-
స్వేచ్చా శిల్పముగా తీర్చిన ఘనం"
కందూరి సుజాతరాణి
రాజేంద్రనగర్, హైదరాబాద్
9292162822🌷
6
[05/07, 8:02 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*
*05/07/2020*
*ఆషాఢ మాసం*
*పౌర్ణమి పురస్కారాల పోటీ*
*భారత స్వాతంత్ర్యోద్యమ ము*
1857 లో ప్రథమ స్వాతంత్ర్య
పోరాటం ఆరంభమై
సిపాయి తిరుగు బాటుతో
తొలి అడుగు వేసి
ఎందరో త్యాగధనులు
నెహ్రూ, గాంధీ, తిలక్,
లాలలాజపత్ రాయ్,
భగత్ సింగ్,సుభాష్ చంద్రబోస్,
గోపాల కృష్ణ గోఖలే,దుర్గాబాయి దేశము ఖ్
మరెందరో వీరులు_శూరులు
ధనాన్ని_ప్రాణాన్ని
లెక్కచేయకుండా
స్వాతంత్ర్య సమరంలో
సమిధలై
భారత జాతికి ప్రమిదల కాంతిని
పంచిన యోధులు
ఉప్పు సత్యాగ్రహం_
సహాయ నిరాకరణ ఉద్యమం,
క్విట్ ఇండియా ఉద్యమం
ఇలా
ఉద్యమాలకు ఊపిరి పోసి
భారత మాత సంకెళ్లను త్రుంచి
భారత భూమి ఖ్యాతిని నిలిపారు.
*స్వర్ణసమత*
*నిజామాబాద్*
7
[05/07, 8:08 PM] కొలచన విజయ భారతి Poetess: కవితా గానం
ఆషాఢ మాసం
పౌర్ణమి పురస్కారాల పోటీ
అంశం:భారత స్వాతంత్రోద్యమం
తేదీ:5-7-2020
*************************
తెల్లదొరలు కొల్లగొట్టిన
స్వాతంత్య్రపు హక్కుకై
బుడతకీచులు దోచుకెళ్ళిన స్వేచ్ఛా వాయువులకై
ఎందరెందరో స్వాతంత్ర్య సమర యోధుల ఉద్యమ
పోరాటాల సమాహారమే
భారత స్వాతంత్ర్యోద్యమం
కర్రచేతపట్టి కొల్లాయిగుడ్డ కట్టి
అహింసే ఆయుధంగా
ముందుకు కదలిన
మన జాతిపేత మహాత్మాగాంధీ
ఆధ్వర్యంలో
సహాయనిరాకరణోద్యం,
ఉప్పుపై విధించిన పన్నుల
అధికారం తిప్పికొట్టి
దండియాత్ర సాగించి
లాల్ ,బాల్,పాల్ లు మూకుమ్మడిగా విదేశీ వస్తు బహిష్కరణోద్యమం సాగించగా
నేతాజీ నడుంకట్టి అజాద్
హిందూ ఫౌజ్ పేరుతో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునివ్వగా
విప్లవ వీరులు అల్లూరి గుండుకు గుండె
ఎదురునిల్పి ప్రాణత్యాగమేసల్పగా
ఎందరెందరో పోరాటయోధుల
ఉద్యమపోరాట స్ఫూర్తి తో
తెల్లదొరలను పొలిమేరలకు
తరిమి తరిమి కొట్టి
సాధించిన భారతస్వాతంత్రోద్యమాల
పోరాటం ఫలంతో
ఊపిరిపీల్చుకున్న భారతం
☘️🌹☘️🌹☘️
కొలచన విజయ భారతి
హైదరాబాద్
8
[05/07, 8:08 PM] Tiru Venkatacharyulu Ks6: ********కవితాగానం*******
('శార్వరీ' ఆషాఢ "పౌర్ణమి")
తేదీ : 05-07-2020.
అంశం: భారత స్వాతంత్ర్య ఉద్యమం.
*అనాదికాలమునుండి ధనధాన్యముల దూగు, భరతభూమిపైని కన్నుబడిన
'వి'జాతులెల్ల చేరినవి చేరుపుజేయ,
చెరువునిండిన చేరు భేకములవోలె,
బెల్లముచుట్టుమూగు మక్షికములవోలె.
* కొండలదారినుండి, కడలిమార్గమును0డి, శరణార్థులమనుచు,
వ్యాపారనెపమునను,
భరతసంపదనెల్ల కొల్లగొట్ట కుతంత్రములుచేసి,
తిష్ఠ వేసినారు ముష్కరులెందరో
స్థిరముగాను.
* "వసుధైకకుటుంబ"మను భావనగలజాతి,
ఇట్టి వలసజీవుల
దయదలచి స్వాగతించే;
కుట్రలెన్నోచేసి,
కుతంత్రముల నేరపి,
జాతిఏకతను చిన్నభిన్నము చేసే తెల్లమూక.
*ఎన్నో తిరుగుబాటు,
లెన్నో ఉద్యమము,
లేన్నో విప్లవములు
గావించి వీరులు,
భరతమాత
కంఠహారమునందు మణిపూసలై మెరిసి, బలిపీఠములనెక్కి, చరితకెక్కి,
త్యాగపురుషులై నిలచి, ధన్యులైరి.
* తుద'కహింస'యే
మార్గమని యెంచి, "సత్యాగ్రాహులై" ఉద్యమించి, తెల్లదొరల తలబిరుసుమెడలు వంచి, సాధించిరి భారతస్వాతంత్ర్య ధనము.
*ఉద్యమవీరులార!
త్యాగధనులార!
భరతమాత భుజకీర్తులార! రిత్తవోదు మీదుత్యాగమ్ము, మరువదు మిము భరత జాతి, ఆచంద్రతారార్క పర్యంతమ్ము మా చేతులడ్డు పెట్టి, నిరతము రక్షించెదము భారత ప్రగతిజ్యోతి.
*********####*********
రచన: ముడుంబ తిరువెంకటాచార్యులు ,
టీచర్, వరంగల్.
9505802353.
***ఇది నా స్వీయరచన. అముద్రితమనీ, అనుసరణ, అనుకరణ, అనువాదము కాదనీ ధృవీకరిస్తున్నాను.
9
[05/07, 8:10 PM] Korada: కవితాగానం
పోటీకవితాంశం:-స్వాతంత్ర్య
దినోత్సవం!
కోరాడ నరసింహా
రావు.
పండుగచేసుకుందాం
*****************
విభ జించి....పాలిం
చటమే కాదు .....,
పోతూ...పోతూ....
స్వాతంత్ర్య రొట్టె ను
పడేసి...ఒక్కటిగావున్నవువాళ్ళను ...దాయాదులుగావిడగొట్టి
యింకవీళ్లెలా కొట్టు కుంటారో చూడండి అనుకుంటూ...ముసి ముసి నవ్వులతో....
ముఖంచాటేసుకుపో
గలగటమూ ఆ తెల్ల వాళ్ళకే చెల్లింది !!
వాళ్ళపాచిక పారింది
అఖండ భారతం రెం డు గా చీలిపోయింది
హమ్మయ్య...ఏదియేమైతేనేం...ఎలాగోలా
స్వాతంత్య్రంసాధించాం...అని చంకలు గుద్దుకున్నాం !
నవ్వుతూ సాధించాం
పాకిస్తాన్! లడాయి తో గెలుస్తాంభారత్ను
అంటూ ఒక రైలు బండితో బండెడు
హిదువుల శవాలను
గాంధీ ,నెహ్రూ లకు
స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా పాకిస్తాన్ నుండి వస్తేనేం ...,
మనకుస్వాతంత్య్రం
వచ్చిందిగా....!
ఆనాటినుండి నేటి
వరకూ...కాశ్మీర్ రావణ కాష్టమై కాలి తేనేం...మనకు స్వా తంత్రం వచ్చిందిగా !
ఇంకెన్నాల్లో ...ఈ రగులుతున్నభారతం లో ...జాతీయజెండా
రెప రెప లు !?
అయినా.....,మనం
ప్రతి ఆగష్టు 15 కూ
స్వాతంత్ర్యదినోత్సవం చేసుకోవద్దా ?!
బ్రతికేది పర తంత్రం లో నైనా...,
మనకుస్వాతంత్య్రం
వచ్చేసిందిగా...ఉత్సవం చేసుకో వలసిందే
గాంధీజీఆత్మమాత్రం ....నిజమైనస్వాతంత్ర్యాన్ని తేలేకపోయా నేఅనిపాస్చాత్తాపంతో పిచ్చెక్కి దేశ మంతా...కలియ దిరుగు తోంది ,!!
@@@@@@@@
........కోరాడ.
10
[05/07, 8:14 PM] +91 94941 62571: అంశం...భారతీయ స్వాతంత్ర్యోద్యమం
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
స్వాతంత్ర్య ఉద్యమంలో మొదటి
సారిగా సిపాయిలతిరుగు బాటు జరిగింది
సైనికులలో ఉద్యమస్పూర్తి రగులుకుంది
ఒకేసారి దాడిచేయాలను బ్రిటిష్ వారిని ఎదురించాలని దృఢసంకల్పముతో ఉద్యము లేచింది
ఆ ఉద్యమాన్ని బ్రిటీష్ వారు ముందుగానే పసిగట్టి ఉద్యమాన్ని నిర్వీర్యము చేసారు
రాజ్యసంక్రమణ సిద్ధాంతం సృష్టించిన డల్హౌసీ రాజులులో కలకలము రేపింది
దత్తత స్వీకారపద్ధతి ద్వారా పుత్రులు లేని రాజ్యాలను బ్రిటిష్ ప్రభుత్వం వశపరచుకుంది
దీన్ని ఝాన్సీ లక్ష్మీబాయి తిరస్కరించి
స్వాతంత్ర్య పోరాటము చేసింది
అతివాదుల,మితవాదుల యుగము ప్రారంభమైంది
మితవాదుల నిరసల ద్వారా ప్రభుత్వానికి వినపత్రం సమర్పించేవారు
అతవాదులు బ్రిటిష్ ప్రభుత్వముపై
తిరుగుబాటు చేసారు ప్రాణాలు అర్పించారు
గాంధీజీ అహింసా మార్గము ద్వారా
11
బ్రిటిష్ వారిని ఎదురించి స్వాతంత్ర్యము దేశానికితెచ్చాడు
[05/07, 8:25 PM] Lalita Sister: కవితా గానం
ఆషాడ పౌర్ణమి కవితా గాన కవన వెన్నెల
పేరు:వై.కె.సంధ్యశర్మ
అంశం: భారత స్వాతంత్ర్యం
శీర్షిక: చెక్కని చిరునామా!
అది కాలం చెరపని చరిత యవనికపై
గీసిన హోరెత్తే జ్ఞాపక సముద్ర కెరటాలు
శ్వేత దళాలు విష వర్తక విత్తులు నాటే
ప్రభంజనంలో దశాబ్దాలు మగ్గిన
విప్లవ చైతన్య శంఖారావాలు...
జవసత్వాలుడిగినా
జీవఛ్ఛవాలై రుధిరం ఏరులై పారినా
బానిస సంకెళ్ళు తెంచే ఆగని మహోజ్జ్వల జ్వాలల
శిబిరాల్లో...
నిప్పుల కొలిమి రాజేసినట్టు
దేశం యావత్తు.... అస్త్రశస్త్రాలకు బలై
అమరులై ఆమరణ నిరాహారులై
సర్వం శూన్యపు కోశంలో శల్యులై
చిక్కిన భారత వీరులు...త్యాగధనులే
ఏనాటికైనా...
ఆంగ్లేయుల ఆటవిక సంగ్రామంలో
ఆత్మగౌరవపు సాక్షీ సంకేతంతో
నా దేశం స్వతంత్ర భారత దేశమని
ఎలుగెత్తి పాడే భారతీయుడి గుండె తడి
స్వరాజ్య సాధనలో
కన్నీటి వర్షంలో తడిసిన ఆకలి చూపులెన్నో
ఆవిరైన ఘటనలు...
స్వేచ్ఛా సౌభ్రాతృత్వాన్ని హరించిన
ఆగ్రహావేశాలకు అడ్డుకట్ట వేస్తూ
అహింసా వాదాన్ని ఆలపించే
వందేమాతర విప్లవ గీతం
ఉప్పు సత్యాగ్రహ పీఠాలు
విదేశీ వస్తు బహిష్కరణా తంత్రాలతో...
మహాత్ముని అడుగుజాడలో ఘనీభవించిన
ఆత్మస్థైర్యపు అర్థనిమీళిత
నేత్రాలకు దాస్యశృంఖాలాలు
తెంచిన వేయి సూర్యోదయ తరంగాలు
నా భారతీయ స్వాతంత్ర్య పోరాటం
దిక్కు దిక్కునా అజరామరమై
ప్రపంచ శాంతి పటంలో చెక్కని చిరునామాగా స్వర్ణాక్షరాలతో లిఖించిన చరిత్ర బాహుటా...!
12
[05/07, 8:25 PM] Gundla Raju Sir: కవితా గానం
ఆషాఢ మాసం పౌర్ణమి పురస్కార పోటీ
అంశం : *భారత స్వాతంత్రోద్యమము*
శీర్షిక :
మహోజ్వల భరితం భారత స్వాతంత్ర్య పోరాట చరితం...
భరతమాత దాస్యశృంఖలాలు తెంచడానికి ఎందరో వీరమాతల *గర్భశుక్తి ముక్తాఫలము* లతో కుంఫిణి దౌర్జన్యాలను, దాష్టికాలను బట్ట బయలు చేసి మీరట్ సైనికులలో సమరోత్సాహానికి అంకురార్పణ గావించి ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామానికి సమర శంఖము పూరించిన భరతమాత ముద్దుబిడ్డ వీరనారీమణి *ఝాన్సీరాణి* కాదా !!
దేశమే ప్రాణమై, తల్లియై తండ్రియై, శ్వాసయై, ధ్యాసయై తూటాలకు తూటాయే సమాధానమని, రక్తానికి రక్తమే సిద్ధాంతమని గర్జించిన ధీరసింహాలు *లాల్, బాల్, పాల్ లు* కారా...
మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యము ఇస్తాను అని శపథం చేసిన పరాక్రమ కిశోరం మన *నేతాజీ* కాదా!!
ఆసేతు హిమాచల పర్యంతం గాంధీ పిలుపుకు కదనోత్సాహంతో భారతావని కదలి తెల్ల వారి తోకలు కత్తిరించి చల్లచమటలు పుట్టించింది *సహాయ నిరాకరణోద్యమము* కాదా!!
స్వాతంత్ర్య సిద్ధికై శాంతి అహింసలతో ఉప్పు పై పన్నును ధిక్కరిస్తూ తుపాకీ గుళ్ల వర్షానికి ఎదురొడ్డి నిలిచిన సాహస పోరాటం *శాసనోల్లంఘనోద్యమము* కాదా!!
చేయండి లేదా చావండి అని పూజ్య బాపూజీ రణ తూర్యం బ్రిటిష్ వారి పునాది రాళ్లను కదిలించింది *క్విట్ ఇండియాఉద్యమం* కాదా!!
మహాభారత యుద్ధానికి కురుక్షేత్రమే ధర్మక్షేత్రమైతే
భారత స్వాతంత్ర్య సంగ్రామానికి ప్రతి ఇసుకరేణువు ధర్మక్షేత్రమైదద్దరిల్లింది...
*జైహింద్! జై భారత్ మాతా!!*
*గుండ్లరాజు*
*సిద్దిపేట*
13
[05/07, 8:50 PM] Lakshmi Chamarthi Khammam: కవితా గానం
శ్రీ శివలక్ష్మి రాజశేఖరుని
అంశం: భారత స్వతంత్ర సంగ్రామం
శీర్షిక: చరిత్ర చెక్కిన భారతం
తూర్పు నుంచి వీచిన వర్తకపు విషపు గాలి
పెత్తనానికి సిద్ధపడితే
సామ్రాజ్యవాద రాబందులు పీడిస్తుంటే
సుధీర్ఘ అవమానాల నీడలు విదిలించుకుని
రగులుకున్న స్వాతంత్ర కాంక్షలో
భగ్గుమన్న నిరసన జ్వాల
భారత స్వతంత్ర సంగ్రామం
నరనరాల్లో ఊపందుకున్న దేశభక్తి గుండెల్లో
స్వాతంత్య్ర కాంక్ష సింహగర్జనలా మార్మోగింది
పాశ్చాత్య పాలన కూకటివేళ్ళతో పెకలించి యజ్ఞానికి
బిగుసుకున్న పిడికిళ్లలో
ఐక్యత నినాదాలు మిన్నంటాయి
మేలుకొన్న నిప్పురవ్వలు
అణువణువునా కణకణమండే ఆత్మగౌరవ నినాదాలుగా
జయ జయ భారతానికి జనగణమన అంటూ
జనగళములలో దిక్కులు దద్దరిల్లాయి
సత్యాహింసలు ఆయుధాలైన విముక్త పోరాటంలో
సంఘటిత శక్తిగా ఒక్కటైన స్వదేశీ స్వరాలు
సహాయ నిరాకరణమై సాగిన శాసనోల్లంఘనలు
అస్తమించని రవి విస్తుపోయేలా
తరిమికొట్టిన ధీరత్వం
సాధించిన విజయం
సువర్ణాక్షరాలతో చరిత్ర చెక్కిన భారతం
14
[05/07, 8:50 PM] అనుముల తేజస్విని Poetess: 🌺కవితా గానం🌺
ఆషాడ మాసం
పౌర్ణమి పురస్కారాల పోటి
***************
అంశం:భారత స్వాతంత్రోద్యమo
తేదీ:5-7-2020
ఏమని చెప్పాలి...
ఎంతని చెప్పాలి....
ఉద్యమానికి నాంది పలికింది
బానిసత్వపు సంకెళ్ళను తెంచేలా చేసింది
మనకంటూ ఉనికిని ప్రకటించింది
మనిషి తల్చుకుంటే ఏదైనా సాదించొచ్చు అని తెలిపింది
దోచుకునే వారికి బుద్ధి చెప్పింది
భారతం అంటే భావితరాలకు ప్రాణం
ఆ ప్రాణాన్ని, మానాన్ని దోచే దుర్మార్గులకి ఈ ఉద్యమం ఊతమిచ్చింది
1857 లో మొదలై
సాయుధ పోరాటపటిమతో నడిచి
భారత పౌరుల సైన్యమే ఒక మెరుపై,
అతివాదులు-మితవాదులు కూడి
గాoధి సారథ్యంలో
నెహ్రు సలహాలతో
లాల్, బాల్, పాల్ల సందేశంతో
భగత్ సింగ్ త్యాగంతో
నేతాజీ క్విట్ ఇండియా
ఉద్యమంతో
అల్లూరి వీరత్వంతో
తెల్ల దొరల పాలిట కొరడా జులిపించి
స్వదేశీ అనే మాటకు కట్టుబడి
ఒకే జాతిగా ఒకే మాటగా నడిచి
అందరికి వందేమాతరం నినాదం నరాల్లో నింపి
దేశభక్తిని పండించి
అర్ధరాత్రి విదేశీ పాలకులను
తరలిగొట్టేలా చేసి
స్వరాజ్యమే జన్మ హక్కుగా
స్వాతంత్య్రమే ద్యేయంగా
పోరాడిన సమరయోధుల
ఉద్యమం భారత స్వాతంత్ర్య ఉద్యమం
19వ శకంలో స్వేచ్ఛాయుత భారతానికి పునాది వేసింది
ఎంతో మంది బతుకులలో పున్నమి తెచ్చింది
జన్మభూమి స్వర్గం వంటిదని తెలిపింది........
******************
అనుముల తేజస్విని
నర్సంపేట
ఇది నా స్వీయరచన.దేనికి అనువాదం కాదు.
ధన్యవాదములు🙏
15
[05/07, 8:51 PM] పాల్వంచ హరికిషన్: కవితాగానం
ఆళాఢ పౌర్ణమి కవితా పోటి
అంశం: భారత స్వాతంత్ర్యోధ్యమం
శీర్షిక: అహింసా సూత్రం.!
ఆంగ్లేయుల ఆకృత్యాలంతరించగ
బానిస సంకెళ్ళన్నీ బధ్ధలవ్వగ
స్వేఛ్ఛా కుసుమాలెన్నో సంచరించగ
ఉవ్వెత్తున ఎగసిన ఆగ్రహ జ్వాలయే
సత్యాగ్రహమనే సాధనమాయెగ
విప్లవం తిరుగుబాటు ఉద్యమంచే
ఎందరో వీరులు త్యాగధనులాయెగ
కుతంత్రాలు నెరిపి కుట్రలెన్నో చేసినా
తెల్ల దొరల సాగనంప ఏకమాయెగ
గాంధీ మహాత్ముడీ మార్గ నిర్ధేశనంతో
అహింసనే ఆయుధాన్ని అనుసరించెగ
శాసనోల్లంఘనం సహాయ నిరాకరణం
క్విట్ ఇండియ ఉద్యమం వందేమాతర రణం
స్వర్ణాక్షర లిఖితం అహింసా సూత్రం..!
మహాభారతం మించిన స్వాతంత్ర్యోద్యమం ..!!
-- పాల్వంచ హరికిషన్
16
[05/07, 8:54 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: *** భారత స్వాతంత్రోద్యమం ***
✍️డా.పాండాల.
పవిత్రభారతాన
వ్యాపారంకొరకు వచ్చి రాజకీయ అనైక్యత ఆసరాతో హస్తగతం చేసుకొని పరిపాలనను చేపట్టి సంపదను కొల్లగొట్టి సంస్కృతిని చిదిమేసి
ఆంగ్లేయుల కుయుక్తులు ఇంతింతై హిందుదేశం వ్యాపించె...
తెల్లదొరల్ని కుటిలనీతి
వెల్లగొట్టె ప్రయత్నం సిపాయిల
తిరుగు బాటుపోరుజేసి అమరులైన వీరులకు జోహార్లు...
జీవించడమే హక్కుని
స్వేచ్ఛా వాయువులకొరకు
స్వాతంత్ర్యపు సమరపోరు
పోరాటపు సమాహారమే...!
భారత స్వాతంత్ర్యోద్యమం..!
మితవాదం అర్జీలతో కాంగ్రెసుగ కూటమెట్టి సాగింది కొన్నాళ్ళు..!
వందేమాతరమంటు స్వదేశీ అభిమానంతో గ్రంథసృజన పాటలుగా
గేయాలుగా సభలు సమ్మెలుచేయ
దేశాటనమెంచి తిరిగి భారతీయతాభవం
ప్రతి హృదిలో మేల్కొల్పిన
లాల్ పాల్ బాల్ త్రయం...!
బారిష్టర్ చదివొచ్చిన
మోహన్ దాస్ కరమ్ చంద్
కొల్లాయి కట్టితేమి కర్రతో నడిచితేమి
అహింసయే ఆయుధంగా
చెడు వినకు చెడు కనకు
చెడుమాటాడకుయంటూ
జాతినేత గాంధీగిరి
నేతృత్వంలో సాగిన
సహాయ నిరాకరణోద్యమం,ఉప్పు సత్యాగ్రహం
అధికారం తిప్పికొట్టి దండియాత్ర సాగించి
క్రాంతి పథం నడిచిన భగత్సింగ్
నేతాజీ అజాదులు కలిసిచేసె
క్విట్ ఇండియా మూమెంటు..!
విప్లవవీరులు శాంతి కాముకులు
తుపాకీగుండ్లకు గుండెను నిల్పి
ప్రాణత్యాగమే బలిదానంగా
ఎందరెందరో? పోరినయోధుల
ఉద్యమమే పోరాట స్ఫూర్తిగా
తెల్లదొరలను తరిమికొట్టినా
భారత స్వాతంత్రోద్యమం ..!
ఆశలు సఫలం స్వేచ్చాఊపిరి
"స్వతంత్ర భారతికి జై బోలో "యనె
వందేమాతరం మనదే రాజ్యం...!!!
✍️డా.పాండాల మహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి.
9912180054
17
[05/07, 9:02 PM] Balloori Umadevi Poetess: ఆషాడ మాసం పౌర్ణమి కవితల పోటీ
కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి
అంశం: భారత జాతీయోద్యమం
భరతమాత దాస్య శృంఖలాలను త్రెంచ
ఉవ్వె త్తున ఎగసిన ప్రజాగ్రహం
చినుకుగా మొదలై ఉప్పెనలా సునామీలా
చుట్టుముట్టి తెల్లవారి గుండెల్లో చిచ్చై
గుబులును పుట్టించగా రగిలిన కాష్ఠమే
జాతీయోద్యమమునకు నాంది యయ్యె
భారతీయ ఐక్యత భిన్నత్వంలో ఏకత్వం
బాపూజీఅహింస సిద్ధాంతం
ప్రముఖ పాత్రలు కాగా
ఉత్తరాది దక్షిణాది తేడాలేకుండా
లాలు పాలు పాలు మన్యం వీరులు
అతివాదులు మితవాదులు చేరి చేసిన
తిరుగుబాటు సాధించెను ఘన విజయం
సిపాయిల తిరుగుబాటుతో ఆరంభమైన ఉద్యమం ఝాన్సీ లక్ష్మీబాయి ఆదిగా మహిళలందరూ బరిలో దిగి
మేము సైతం అంటూ కదం తొక్కి
ఎగుర వేయ తిరుగుబాటు బావుటా
చెరసాల వాసాన్నిలెక్కించక చేసిన
వీరుల త్యాగఫలం కవుల కలం బలం
కాంతి పుంజమై ఎగయగ
మువ్వన్నెల పతాకాం రెపరెపలాడుతూ
వినువీధులలో ఎగిరేలా చేసె నాడు
మన ఉప్పే తింటూ దానిపై పన్ను వేసినట్టి ఆంగ్లేయులు దాష్టికం ఎదిరించిన
సత్యాగ్రహం తెల్లదొరల తరిమికొట్టే
ఆయుధమైతేజరిల్లె దేశమెల్ల
ఎందరో నేతల పోరాట ఫలం
మన కందిన నేటి స్వాతంత్ర్య ఫలం.
ఆషాడ పౌర్ణమి కవితల పోటీ కోసం వ్రాసిన కవిత స్వీయ రచన దేనికి అనువాదం కానీ అనుసరణ కాని కాదని హామీపత్రం జత పరుస్తున్నాను
డా. బల్లూరి ఉమాదేవి
డల్లాస్/ అమెరికా.
18
[05/07, 9:02 PM] Veera Gudipally: *కవితాగానం కవిమిత్రులకు/నిర్వాహకులకు నమస్సులు🙏🏻*
శ్రీ శార్వరీ నామ సంవత్సరం ఆషాఢమాసం *"పౌర్ణమి పురస్కారాల"* పోటీ కొరకు.
*05.07.2020*
అంశం : *భారతస్వాతంత్రోద్యమం*
శీర్షిక : *భారత స్వతంత్ర సమర వీరగాథ*
*✍🏻సామల ఫణి కుమార్*
ఊరు,జిల్లా: *తేరటుపల్లి,నల్లగొండ*
చరవాణి : 6303716577
*************************************
ఓ పసిడి భారతదేశమా!!!
పరుల పాలనలో మెలిగి నరక యాతన ఒలిగి
మౌనం వీడి గళం ఎత్తి
బ్రిటీష్ పాలన సంకెళ్ళు తెంచుటకై
నీ బిడ్డలు కన్నీళ్ళను వదిలి ఆయుదాన్ని చేతపట్టి
*సిపాయిల తిరుగుబాటుతో* సంగ్రామానికి నాంది పలికి
ఉవ్వెత్తున ఎగసిపడే అలలా కదిలి
నిండైన దేశ భక్తి నిండూ మనసుతో గౌరవించి
వందల ఏళ్లు ప్రజలను పీడించిన బ్రిటీష్ పాలకుల గుండెల్లో గునపం గుచ్చినారు
దండెత్తి వచ్చిన పాలకులను దండించినారు వారి ఆయుధాలతోనే వాళ్ళకు చితి పేర్చినారు
ఒక పక్క అహింస అనే అస్ర్తాన్ని ఆయుధంగా మలిచినారు
మరోపక్క కత్తి,తూపాకులను పట్టి కన్నెరజేశారు
ఎన్నో ఉద్యమాలతో వీర మరణం పొందారు
*చచ్చుడ ఇక చావుడంటూ* వీరోచింగా పోరాడినారు.
స్వేచ్ఛా వాయువులను భరతమాతకందిచారు
భారతమాత బానిసత్వానికి విముక్తి కల్పించారు
*🙏🏻ఎందరో మహనీయులు అందరికి వందనాలు🙏🏻*
అమర వీరుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్రం
స్వేచ్ఛా వాయువుల దీపం కోసం మీ రక్తాన్ని చమురుగా అందించారు....
కోట్లాది హృదయాల్లో నిత్యం మెలుగుతున్నారు
*************************************
హామీ పత్రం: ఈ *భారత స్వతంత్ర సమర వీరగాథ* కవిత నేను స్వంతంగా ఈ పోటి కోసం రాసినది.
*🙏🏻నిర్వాహకులకు ధన్యవాదాలు🙏🏻
19
[05/07, 9:11 PM] శ్రీ లక్ష్మి విజయనగరం: కవితా గానం:
ఆషాడ మాసం
పౌర్ణమి పురస్కారాల పోటీ
అంశము: భారత జాతీయోద్యమం
తేదీ: 5-7-2020
పేరు: శ్రీలక్ష్మి చివుకుల
కవితాశీర్షిక:
సమైక్య భారతి
శృంఖలాలను తెంచి స్వేచ్ఛగా బ్రతుకు!
స్వేచ్ఛ లేని బ్రతుకు మృత సమానం!
నలువైపులా ముట్టడించిన విదేశీ మూకలు
భరత భూమిని అల్లకల్లోలమ్ము చేయ
మనలో మనకే చిచ్చునుపెట్టి
రాజ్యాల మధ్య వైరాలు పెట్టి
వేదము, నాదము, విద్యా, వైద్యము
నిర్లజ్జగా కొల్లగొట్టిన
శ్వేతజాతీయుల కుయుక్తుల ముందు వెలవెలబోయెను స్వదేశీ!
మితవాదులు అతివాదులు ఏకమై
ఉద్యమాల పరంపరకు ఊపిరిలూదిరి
బెంగాల్ విభజనతో
వందేమాతర ఉద్యమమై నినదించిరి!
లాల్ బాల్ పాల్ త్రయం
కారాగారమున మగ్గారు
తుపాకుల ముందు ఎదురు నిలువలేని
మిరపకాయ బాణాలు నేలకొరిగెను
అల్లూరి రూపమై!
వందలాదిగా ఉరి త్రాటికి వేలాడిరి
వేనవేలుగా కారాగారమున చిక్కిరి
అహింసాయుధమును చేపట్టి గాంధీ
ముందు నడిచాడు ఉద్యమాల నేతగా
సత్యాగ్రహమూ, శాసనోల్లంఘనమూ,
విదేశీ వస్తు బహిష్కరణా,
సంపూర్ణ స్వరాజ్యమూ,
ఉప్పు సత్యాగ్రహము,
క్విట్ ఇండియా ఉద్యమం
వందలాది ఉద్యమాలు
ప్రజల ముందు నిలిచినవి.
ప్రత్యక్ష పోరుకు పిలిచినవి.
మాకొద్దీ తెల్ల దొరతనమూ
పాటలూ, నినాదాలూ, కవిత్వమూ,
ప్రసంగాల సారాంశమే సాహిత్యమై నిలిచింది
స్వతంత్ర పతాక చేకొని
బాలలూ, స్త్రీలూ ముందు నడిచారు.
శత వత్సరాల ఉద్యమం
వేల సంవత్సరాల బానిసత్వపు
శృంఖలాలను తెంపి
స్వేచ్ఛావాయువులు ఇచ్చింది
స్వాతంత్ర్యఫలం అందించింది
విభజన చట్టం విషపూరితమై
హిందూ ముస్లిములను విడదీస్తూ
అఖండ భారతావనిని
మూడు ముక్కలు చేసింది
పింగళిచే రూపుదిద్దుకున్న పతాకమే
జాతీయ పతాకమై ఎగిరింది
అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే
భారత రాజ్యాంగమై నిలిచింది
సార్వభౌమ సర్వసత్తాక
ప్రజాస్వామిక రిపబ్లిక్ గా
అవతరించింది.
భారతీయులందరిని ఒకటిగా చేసింది
ప్రపంచాన అగ్రగామిగా నిలిపింది.
భరత మాతా వందనం!
శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము!
తల ఎత్తి పతాకకు జై కొడుతున్నాము!
హామీ పత్రము
ఈ పోటీ కోసం నాచే రాయబడినది.
దేనికి అనుసరణ కాదు. ఏ మీడియాకు పంపలేదు. అని తెలియజేయుచున్నాను. శ్రీలక్ష్మీ చివుకుల
20
[05/07, 9:39 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*
తేదీ::05-07-2020
పేరు::వురిమళ్ల సునంద,ఖమ్మం
అంశం::భారత స్వాతంత్ర్యోద్యమం
శీర్షిక:: ప్రపంచ యవనికపై...
:::::::::::::::::::::::::::::::::::::::::
అదో చారిత్రాత్మక ఘట్టం
అఖండ భారత ఉపఖండంలో
జరిగిన
అద్భుతమైన అహింసా యుత పోరాటం!
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య
పాలనకు చరమగీతం పాడిన
మహోజ్వల ఉద్యమం!
సిపాయిల తిరుగుబాటు
ఝాన్సీ లక్ష్మీబాయి వీరోచిత స్వాతంత్ర్య పోరాట పటిమను గుండెల్లో నింపుకుని..
స్వరాజ్యం నా జన్మ హక్కు అంటూ
తిలక్ మాటలను అస్థిత్వ ఎజెండాగా చేసుకుని..
వందేమాతరం మాదే భారతం అని ఎలుగెత్తి చాటుతూ
తెల్లవాళ్ళ కుట్రలు కుతంత్రాలను
అమానుష డయ్యర్ దుశ్చర్యలను ఖండిస్తూ..
భరత మాత దాస్య విముక్తి కోసం
యావత్ భారతీయులందరూ
ఉవ్వెత్తున ఎగిసిపడే విప్లవ కెరటాల్లా బ్రిటిష్ పాలకులను ఎదిరించి
ప్రాణాలను సైతం బలిదానం చేసిన
అల్లూరి త్యాగం!
ఉరికొయ్యలను ముద్దాడిన
భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుల
బలిదానం!
యావత్ ప్రపంచం ఆశ్చర్య చకితయై
భారతీయుల పోరాట స్ఫూర్తిని
అభినందించిన సమయం!
మహాత్ముని సారథ్యంలో పాదుకున్న
అహింసా సహనం బీజాలతో
బ్రిటిష్ ప్రభుత్వంపై
శాంతియుతంగా సాగించిన పోరాటం
ప్రపంచ యవనికపై సువర్ణాక్షరాలతో లిఖించుకున్న భారతీయుల ఆత్మగౌరవ నినాదం!
జాతిపిత గాంధీజీ ఇచ్చిన దివ్య సందేశం
హింసపై అహింస సాధించిన అఖండ విజయం!
ఎర్రకోటపై రెపరెపలాడిన త్రివర్ణ పతాక
కోటానుకోట్ల భారతీయుల ఆశలూ
ఆశయాల బావుటా!
ఎందరో వీరుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్ర్యం!
ఆనాటి రోజులు తలుచుకుంటే
అణువణువూ అవుతుంది రోమాంచితం,
21
[05/07, 9:41 PM] Ganjam Bhramaramba: గురు పౌర్ణమి కవితల పోటీ
కవితా గానం సమూహం
భారత స్వాతంత్రోద్యమ చరిత్ర
5-7-2020
గంజాం భ్రమరాంబ
తిరుపతి
9949932918
*మన స్వాతంత్ర్యోద్యమ ఉజ్వల చరిత్ర.*
అమ్మల్లారా... అక్కల్లారా...
భారతావనిలో పుట్టిన మగువల్లారా...
మీ కడుపులో బిడ్డ ఊపిరందుకొని
కదలాడుతున్న రోజునుండే...
మీ బిడ్డ పుట్టి చనుబాలు కొరకు ఏడ్చినప్పటి క్షణం నుండే..
పాలబువ్వ తినమంటూ ముద్ద నోటికందించిన పొద్దునుండే..
దేశంలోని ప్రతి బిడ్డా వినాల్సిన తొలి సాహస గాథ
*మన స్వాతంత్ర్యోద్యమ ఉజ్వల చరిత్ర.*
తక్కెడ పట్టుకుని కూటి కొరకు వచ్చి
ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని
ఆసరా చేసుకొని తూటాలతో రాజ్యమేలి
రెండు వందల సంవత్సరాల పరాయిపాలనలో
భరత మాత అనుభవించిన కష్టాలను
మన వనరులను, ముడి సరుకును దోపిడీ చేసి
వస్తురూపంలో అధిక ధరలకు
మన నెత్తిన వడ్డీతో సహ గుమ్మరిస్తే
మన మంచితనాన్ని చేతకానితనంగా
భావించి, హింసించి, హేళన చేస్తుంటే...
ఎక్కడో మీరట్ లో పుట్టిన చిన్న కదలిక
ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియాతోపేల ఆగమనం
అంతులేని ఆదోళనలన్నీ
ఒక స్వదేశీ ఉద్యమంగా రూపుదాల్చడం
మితవాద, అతివాద, ఉక్రోషవాద
సమూహాలు ఏర్పడి వ్యూహాలు పన్నడం
విభజించి పాలించు ఆంగ్లేయుల తీరును
ఎదురించి నిలిచే నాయకులు పుట్టడం
సామాన్యులు కూడా అతివీర భయంకరులై
ఆత్మవిశ్వాసాన్ని అందిపుచ్చుకోవడం
సత్యాన్ని, ధర్మాన్ని, అహింసను
ఆయుధాలుగా మలచుకున్న గాంధీజీ
దేశ ప్రజలందరినీ ఒక తాటిపైకి తేవడం
సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన,
ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం
ఎందరెందరో మహనీయులు చిందించిన
రక్తంతో తడిసిన మన నేల
త్యాగధనుల సాహసంతో
స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్న పుడమి
ఎన్నెన్ని గాయాలను తట్టుకుందో
ఎన్నెన్ని అవమానాలను ఎదుర్కొందో
మన బిడ్డలకు గాథలుగా వినిపించండి.
ఉగ్గుపాలతోనే దేశభక్తిని రంగరించండి.
మన దేశ పతాకాన్ని గర్వంగా ఎగురనివ్వండి.
అణువణువునా భారతీయతను
సమర్థవంతంగా నిండనివ్వండి.
గొప్ప పౌరులై దేశానికి సేవ చేయనివ్వండి
గంజాం భ్రమరాంబ
తిరుపతి
9949932928
హామీ పత్రం
************
నేను వ్రాసిన *మన స్వాతంత్ర్యోద్యమ ఉజ్వల చరిత్ర.*
అను కవిత కేవలం నా స్వీయ రచన మాత్రమే. దేనికి అనువాదం కానీ, అనుసరణ
కానీ కాదు అని హామీ ఇస్తూ
ఉన్నాను.
.. ఇట్లు
గంజాం భ్రమరాంబ
తిరుపతి
9949932918
bhramarambaganjam22@gmail.com
22
[05/07, 9:42 PM] Swarna Latha Poetess: కవితా గానం
అంశం...స్వాతంత్ర్యోద్యమం
పేరు..ఎం.టి.స్వర్ణలత
శీర్షిక....ఉద్యమాల సమాహారం
తేదీ...05/07/2020
బానిస బతుకులకు విముక్తి కావాలని
స్వాతంత్ర్య సముపార్జనకై పిడికిలి బిగించిన
ఉద్యమాల సమాహారం
సాయుధపోరాటాలు అహింసా యుత పోరాటాలు అలుపెరుగని పోరాటాలు
అందులోని భాగాలే
పోరు మొదలైంది మొదలు పోర్చుగీస్ వారితో
అబ్బక్క రాణి ఆధ్వర్యంలో
ఈస్టిండియా కంపనీ పై సాగించిన సాయుధ పోరాటాలు ఉద్యమాలు వెల్లువెత్తగ
ఉద్యమాలకు ఊపిరిలూదుతూ పురుడుపోసుకుందీ భారత జాతీయ కాంగ్రెస్
కాంగ్రెస్ అతివాదులైన లాల్ బాల్ పాల్
రక్తానికి రక్తం మా సిద్ధాంతమని గర్జిస్తూ
విదేశీ వస్తువుల బహిష్కరణ సమ్మెతో
కూడిన స్వావలంబన పద్ధతులాచరించ
అరబిందో లాంటి వారు తీవ్రవాద మార్గాన
పోరాటం సాగించగ తిలక్ లాంటి వారు
స్వాతంత్ర్యం నా జన్న హక్కు అని చాటారు
గదర్ పార్టీ ఆవిర్భావం తో అందరూ సంఘటితమై
సిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో తెచ్చిన మార్పు
మహాత్మాగాంధీ నాయకత్వాన అహింసాయుత
పోరాటం ఊపిరందుకుందీ
శాసనోల్లంఘనమైతేనేమీ సహాయనిరాకరణ ఉప్పుసత్యాగ్రహం అంటూ సాగింది పోరు
సుభాష్ చంద్రబోస్ సాయుధపోరాటమే
సరియైనదంటూ...
ఆజాద్ హింద్ పౌజ్ అనే జాతీయ సైన్యాన్ని
ఏర్పాటు చేసి పోరాటానికి సిద్దమయ్యాడు
భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా
ఉద్యమానికి పిలుపునిచ్చి
తెల్లదొరలను తరిమి కొట్టారు వందేమాతరం అంటూ..
వందేమాతరం !వందేమాతరం!!వందేమాతరం!!!
23
[05/07, 9:45 PM] +91 93936 65222: అంశము: భారత స్వాతంత్ర్యోద్యమము
శీర్షిక: కలియుగ భారత మహాసంగ్రామం
రచయిత: లక్కిరెడ్డి విజయ శుభాకర్ రెడ్డి
ప్రపంచ ఉద్యమాలలో మేటి ఉద్యమం
ప్రపంచాన మనది సాటి లేని ఉద్యమం
జాతిని ఒకే తాటిపై నడిపిన ఉద్యమం
భారతీయుల ఆత్మగౌరవ ఉద్యమం
ఆయుధమే కానరాని అహింస ఉద్యమం
జాతిని ఏకం చేసిన జాతీయోద్యమం
దేశభక్తి ముంచెత్తిన స్వాతంత్రోద్యమం
తరతరాల బానిసత్వ నిర్మూలన ఉద్యమం
మంత్రదండ మేఘ వందేమాతర ఉద్యమం
మనసు మనసు కలిపెను ఖిలాఫత్ ఉద్యమం
క్షణంక్షణం క్విట్ ఇండియా ఉద్యమం
కణం కణం దేశభక్తి దండి ఉద్యమం
ఘనముగా ఘనకీర్తి సాటిన ఉద్యమం
ప్రపంచ స్ఫూర్తి ప్రతీక మన ఉద్యమం
అదే అదే భారత స్వాతంత్రోద్యమం
కలియుగ భారత మహాసంగ్రామ
24
[05/07, 9:49 PM] ధనాసి ఉషారాణి తలకోన: *కవితా గానo*
*భారత స్వాతంత్ర్యఉద్యమం*
భాపూజీ బాటలోన రూపుదిద్దుకున్న భారతీయుల స్వరాజ్యపు పోరాటం
భరతమాతను దాస్యశృంఖలాల నుండి విముక్తిని చేయుటకు
ఆకాశమును అంటే తిరుగుబాటుతో
సత్యాగ్రహము నిత్య సాధనగా
తెలుగు జాతి ఒక్కేమాటపైన నిత్యము నడిచి
వందేమాతరం నినాదమును నరాల్లో నింపి
స్వరాజ్యము మా జన్మహక్కుఅంటూ
సింహములా గర్జించిన భారతీయుల ధాటికి
తాళలేక పోయిన తెల్లదొరల ఆధిపత్యం
జాన్సీబాయ్ కత్తిపట్టి కథన రంగము వీరత్వమును చాటింది
ఎన్నో ఉద్యమాలు చేసినా ఎన్నో ప్రాణాలు తీసిన తెల్లదొరల అన్యాయం
ఎందరో నేతల త్యాగాల ఫలమే మనకు సిద్ధంచిన నేటి స్వేచ్ఛ ఫలము
అందరి బతుకుల్లో పున్నమి వెలుగులు వేదజల్లిన నేతలకు
చేద్దాము ప్రణామాలు చేతులు జోడించి
జై భారత్ జైజై భారత్
ధనాశి ఉషారాణి
25
[05/07, 9:49 PM] Anitha Aitha Poetess: *కవితా గానం*
05.07.2020
అంశం: భారత స్వాతంత్రోద్యమం*
శీర్షిక: *ఉద్యమ దీప్తి*
స్వేచ్ఛా శ్వాసనాళాలను మెలిపెట్టి అస్తిత్వాన్ని ఉరికంబమెక్కించినదో అహంకారపు అధికారం..!
బానిస వేదికపై వెతలనాట్యమాడించినదో స్వార్థ మస్తిష్కపు నాయకత్వం..!
రెండువందల వత్సరాల ఏకఛత్రాధిపత్యమై అణగదొక్కిందో రాజ్యాధికారపు ఇనుపపాదం..!
సహనం నశించిన ఓ అబ్బక్కరాణి ధిక్కార స్వరమే పోరాటానికి తొలిఅడుగై ఫోర్చుగీసువారిపై ధ్వజమెత్తింది..!
హింసను భరించలేని ఓ సిపాయి తిరుగుబాటు ప్రథమ స్వతంత్ర సంగ్రామమై మీరట్ ను పావనమొందించింది...!
సామంతరాజ్యాలను పన్నులపేరిట దోచుకునే కుటిలతత్వపు తత్వానికి వ్యతిరేకంగా జనించిందో ధీరవనిత ఝాన్సీ సమరం.!
అతివాద మితవాద వ్యూహాలు విదేశీవస్తు బహిష్కరణలై స్వావలంబనకు పునాదులు వేసాయి..!
ఆజాద్ హిందు ఫౌజు ఆవిర్భావం సాహసానికి ప్రతిరూపమై క్విట్ ఇండియా పిలుపునిచ్చింది..!
గాంధేయవాదం భారతజాతీయకాంగ్రెస్ గా మార్గదర్శకమై వందేమాతర ఉప్పుసత్యాగ్రహాలకు పురుడుపోసింది..!
భరతజాతంతా ఏకమై స్వాతంత్ర్య సముపార్జనా అస్త్రమై బ్రిటీష్ సామ్రాజ్యమూలాలను పెకిలించింది..!
నేటి భారతం ఉద్యమాల దీప్తికి తార్కాణమై స్వతంత్రతా జిలుగులతో ఎద ఎదను మీటింది..!
భారత స్వాతంత్రోద్యమ ఘట్టం చరితలో సువర్ణాక్షరమై నిలిచింది..!!
రచన
అయిత అనిత
8985348424
జగిత్యాల
హామిపత్రం
ఇది నా స్వీయరచన
26
[05/07, 9:50 PM] ధనాసి ఉషారాణి తలకోన: *కవితా గానo*

ఇది నా స్వంతము అని హామీఇస్తున్నాను
27
[05/07, 9:52 PM] శ్రీకాంత్ కడార్ల Poet: *కవితాగానం*
అంశం :భారత స్వాతంత్రోద్యమం
శీర్షిక :మన గుండెల స్పందన
పేరు :శ్రీకాంత్ కడార్ల
ఊరు :హన్మకొండ
---------------------------------
ధనరాశులు, ధాన్యరాశులు సిరిసంపదలు ప్రకృతి శోభతో పూనీతమైన పుణ్యభూమి
ఆ నాళ్ళలోనే నాగరికతకు కాణాచి
వేదవేదాలకి పుట్టినిల్లు దేశ దేశాల్లో
ఘనమైన సంస్కృతిని భవ్యమైన సంప్రదాయాలను కలిగియున్న కర్మభూమి మన దేశం, భారతదేశం....
తల్లి భారతావనికి చేసిన గాయాలెన్నో
అవని అన్నపూర్ణపై జరిగిన దురాక్రమణలెన్నో... పొర్చుగ్రీసు మొగలులు , డచ్చి వారు, బహుమనీ సుల్తానులు ఇలా....
వ్యాపార నిమిత్తమై అడుగుడి
మన అనైక్యతనె పెట్టుబడిగా మలచి
తెల్లదొరలు ఆ ఆంగ్లేయులు అందర్నీ
మన అందరిని అణచివేసిన తీరు
గుండెలవిసేలా చేసింది
కన్న భూమి లోనే, ఉన్న నేలపై
కట్టు బానిసలను చేసింది ..
వేదనలు భరించి రోదనలు దిగమింగి
తుదకు ఉగ్ర రూపమై ఎగిసింది..
సిపాయిల తిరుగుబాటుతో మొదలైన ఉద్యమం స్వాతంత్ర కాంక్షను రగిల్చి
తదనంతరం రూపుదిద్దుకున్న వందేమాతర ఉద్యమంతో మహోజ్వలమైంది....
మితవాదులు, అతివాదులుగా సాగిన ఈ స్వాతంత్ర సంగ్రామం లో అసువులు బాసిన హృదయాలెన్నో
తనువులు కోల్పోయిన త్యాగధనులుఎందరో....
క్విట్ ఇండియా ఉద్యమం సహాయనిరాకరోనోద్యమం
గాంధీ మహాత్ముని సారథ్యంలో
అహింస మార్గం లో సాగి
అన్నీ వైపులా ఊపిరి సలుపనీయకుండా ఉక్కరిబిక్కిరి చేసిన కృషితో సమిష్టిగా సాగిన ఉద్యమాలతో భారతీయుల బలమైన స్వతంత్ర కాంక్షతో
నిర్మల ఆకాశంలో మువ్వన్నెల జెండా
తెల్లవాని పీచమనుస్తూ
జాతి గౌరవాన్ని జాగృతం చేస్తూ
సగర్వంగా రెపరెపలాడింది....
భారత స్వాతంత్రోద్యమం మన గుండెల స్పందన.... ఎప్పటికి
గుప్పెడంత మన గుండెల్లో
ఎప్పటికి చెక్కు చెదరని ప్రేమ దేశభక్తి ఉండాలి దేశంపై...
ఆ త్యాగధనులకు సదా ప్రణామములతో
జై హింద్
28
[05/07, 9:56 PM] మర్రి జయశ్రీ: కవితాగానం పౌర్ణమి పురస్కారాల కోసం కవిత
మర్రి జయశ్రీ
అంశం..భారత స్వాతంత్ర్యో ద్యమం
శీర్షిక...మహోజ్వల ఘట్టం
వర్తక వ్యాపార నెపంతో దేశంపై కన్నేసిన శ్వేత ముఖులు
భారతదేశ అస్థిత్వాన్ని అణచిపేసి
భారతీయుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి
చేస్తున్న అరాచక చర్యలను నిరసిస్తూ
మీరట్ సైనికులు పూరించిన యుద్ధ శంఖారావం
సిపాయిల తిరుగుబాటుగా మారి ఉద్యమాన్ని ఉదృతం చేసే
ఒక సామాన్యుడు ధరించిన ఆయుధాలు
వలసపాలకుల గుండెల్లో గుబులు రేకెత్తించాయి
సత్యాహింసా మార్గ జ్యోతి మహాత్ముడి శాంతి పోరాటం
అఖండ భారతావని నేకం చేసే
చరఖా యంత్రమే సూత్రంగా
స్వదేశీ ఉదయమే లక్ష్యంగా సాగిన సమరోత్సాహం
భారతీయుల ఆత్మస్థైర్యాన్ని సడలనీయక
పరదేశీయుల పారదోళ ఉత్ప్రేరకమయ్యే
అపర బోధిసత్వుడు గాంధీజీ నాయకత్వంలో సాగిన సమరం
అనేక వలస పాలనకు గురియైన దేశాలకు ప్రేరణ గా నిలిచి
శాస నోల్లంఘనం
క్విట్ ఇండియా ఉద్యమం ప్రతి మదిని కదిలించిన ధర్మపోరాటాలు
వందే మాతర ఉద్యమం ఉప్పెనలా ఉప్పొంగి వేల భారతీయులలో దేశభక్తిని పెంపొందించింది
ఎందరో వీరుల త్యాగం భారత కీర్తిపతాకాన్ని రెపరేపలాడించింది
మహోజ్వల ఘట్టమై సువర్ణాక్షరాల్తో
ప్రపంచ చరిత్రలో లిఖించబడింది భారత స్వతంత్ర్యోద్యమం
29
[05/07, 9:57 PM] విజయ లక్ష్మి యాదాద్రి: To
కవితాగానం పౌర్ణమి పోటీలు
శీర్షిక:***భారత *స్వాతంత్రోద్యమo*
------------**********************----
దేశమాత దాస్యశృంఖలాల తెంచగ
ధైర్యసాహసాల సుతుల సుదీర్ఘయత్నం
తెల్లోళ్ల పాలనాచీకట్ల పారద్రోలగా
పోరాటయోధులు జ్యోతులై దారిచూపిన ఘట్ట0
పరాయిపాలనాపడగ నీడ నుండి బయటపడ
భారతచలిచీమలు అలుపెరుగక జరిపిన పోరాట0
మనప్రజలు ఐకమత్యబలం చూపిన సందర్భం
చాందసాలుకులమతాలను చెరిపిన మహత్తరకాలం
బ్రిటిష్ సామ్రాజ్యపతాకాన్ని అవనతం చేయగ
కోట్లపిడీకిళ్లు బల0గా బిగుసుకున్న ఉద్యమం
స్వతంత్ర పాలనావెలుగుకిరణాల చూడగ
కోట్లకన్నులు ఎదురుచూసిన తపస్సమయం
ప్రథమస్వతంత్రసంగ్రామానికి మునుపే మొదలై
స్వతంత్రసముపార్జన వరకు తొంబయ్యేళ్ళకు పైగా
కొనసాగిన అజరామర చారిత్రక దేశభక్తిఘట్టం
మూడుముఖ్యదశలుగా కొనసాగిన త్యాగాలపర్వం
మేధావుల మితమైన ఆకాంక్షల మితవాదయుగం
దేశభక్తులెందరినో ఉరకలెత్తించిన అతివాదయుగం
ప్రజలందరినీ భాగస్వాముల గావించిన గాందీయుగం
నాటి నేతల ప్రజల అంతులేని 'త్యాగాలయాగం' స్వాతంత్రోద్యమ0
:;వల్లాల *విజయలక్ష్మి*
*ఆలేరు*
30
* *కవితా గానం*
*ఆషాడ మాసం పౌర్ణమి*
నగదు బహుమతుల పోటీకి
పేరు : డా.దీపక్ న్యాతి
తేదీ : 05-07-2020
అంశం : భారత స్వాతంత్ర్యోద్యమము
శీర్షిక : ఇండియన్స్ కాదు మనం
భారతీయులం
ప్రకృతి సహజంగా బతుకుతున్న మనకు
ఇండియన్స్ అని నామకరణం చేశారు
మన అమాయకత్వాన్ని ఆసరాగా సంపదంతా దోచుకున్నారు
మన గడ్డ మీద మన గుడ్డ చుట్టి మహా చెడ్డగ మనమీద పెత్తనం
చలాయిస్తూ పన్నుల పైకాన్ని తమ దేశాలకు తరలిస్తూ
నియంత నిరంకుశ చట్టాల పెట్టి బానిస సంకెళ్లు మనకు చుట్టి
నిర్దాక్షిణ్యంగా రాజరిక పాలన చేస్తుంటే
విసిగి వేసారి అలసిన భారతీయుల ఆగ్రహావేశాలు
కట్టలు తెగి దివిటీలయి సంఘటితం అయ్యాయి
అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్
లాలాలజపతిరాయ్ సర్దార్ వల్లభాయి పటేల్ మహాత్మాగాంధీ
సామ దాన భేద దండోపాయాల ప్రయత్నించి
అహింసను అస్త్రం గా భావించి సమోపాయంతో
బ్రిటిష్ గుండెల గడగడలాడించి వందేమాతర నినాదంతో
సహాయ నిరాకరణ స్వదేశీ ఉప్పు సత్యాగ్రహం పరాయి పాలకులరా తిరిగి వెళ్లిపోండి అంటూ తరిమి తరిమి కొట్టి
స్వపరిపాలన సమసమాజం కోసం పరువు కోసం అం
భావి భారత పౌరులు స్వేచ్ఛ వాయువు కోసం
సంఘటితంగా పోరాడిన భారత స్వాతంత్రోద్యమం
బానిస సంకెళ్ల తెంచి స్వతంత్ర భారతీయులను జేసింది
ఆనాటి ప్రతి భారతీయుడి బలిదానం గౌరవించి
స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలి సమ సమాజాన సమ న్యాయం పాటించాలి
డా.దీపక్ న్యాతి
నంది అవార్డు గ్రహీత
********"***********
సమీక్షలు
[09/07, 9:46 PM] Sarphraj Anwer Poet: *కవిత గానం పౌర్ణమి పోటీలు*
★★★★★★★★★★★★★★
1️⃣ ఇంద్రవత్ రాహుల్ 💐
అంశం : స్వాతంత్య్రోద్యమం
రచన తేది : 05/07/2020
వారం : ఆదివారం
🇮🇳 *స్వాతంత్ర్య ఉద్యమ కొలిమి*🇮🇳
మట్టివాసన తట్టిలేపగా, కన్నతల్లి జన్మభూమి రుణం గుర్తొచ్చి కణకణం రణానికి ఉద్యుక్తమవగా,
హృదయం దేశభక్తితో ఉప్పొంగగా ఒక్క అడుగుతో ప్రారంభమై లక్షల, కోట్ల అడుగులతో సాగిన అప్రతిహత ప్రస్థానం కొనసాగిందని;
రుధిరముప్పొంగి, ఉత్తేజం ఉరకలెత్తి స్వాతంత్రోద్యమ విప్లవకొలిమిలో ఎగిసిన నిప్పుకణికలైన బిస్మిల్, ఆజాద్, భగత్ సింగ్, రోషన్ సింగ్ మరియు అశ్ఫాఖుల్లాఖాన్ ల అనవరత త్యాగాల వల్ల స్వాతంత్ర్య సంగ్రామం విస్తృతమై తెల్ల రాక్షసులు పారిపోయారని భారతదేశం విముక్తమైనదని..
*ఇంద్రవత్ రాహుల్ గారు ఇంపైన తన అక్షరాలతో ఇంద్రధనుస్సును సాక్షాత్కరింపజేసి, పదాలతో* *ఉద్యమకొలిమిని రాజేసి, సంగ్రామ సెగను పుట్టించిన దేశభక్తుల వీరోచిత పోరాటాల్ని విరచితం చేయడం* అభినందనీయం..
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 9:47 PM] Sarphraj Anwer Poet: 2️⃣ రవికుమార్ కంచి,
శీర్షిక : _*"భారత స్వాతంత్ర్యోద్యమం*"._
భిన్న సంస్కృతులు,కుల,మత, ప్రాంతాల సమ్మిళితమై, చిన్నచిన్న సంస్థానాలు, రాజ్యాల సమ్మేళనమైన అఖండభారతం తెల్లదొరల ఆకృత్యాలకు, నిరంకుశత్వానికి అతలాకుతలమైతే, వీటన్నింటికతీతంగా భిన్నత్వంలో ఏకత్వంతో స్వాభిమాన సార్వభౌమ ఆశలు చిగురించాయని,
సాయుధ, నిరాయుధ పోరాటాలతో, అతివాద, మితవాద, జాతీయవాదులు సాగించిన జాతీయోద్యమ స్ఫూర్తి దేశమంతటా ప్రాకి బ్రిటీష్ వారి నిరంకుశ తూటాలకు ఎదురునిల్చి, ఆ దౌర్జన్య దాష్టీకాల్ని ఎదుర్కొని స్వాతంత్ర్య పోరాటవీరుల అమూల్యమైన త్యాగాల వల్ల, హోరెత్తిన ఉద్యమాలతో సాగిన భారతస్వాతంత్రోద్యమం
ప్రపంచ చరిత్రలో ప్రసిద్ధికెక్కిందని..
*రవికుమార్ కంచిగారు తన కవనంలో మన జాతీయోద్యమ నాయకుల గాయాల నుండి స్రవించి దేశమంతటా హోరెత్తిన* *స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని వర్ణించి తుదకు కంచికి చేరిన బ్రిటీష్ వారి కథను* వివరించిన తీరు బావుంది..
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 9:48 PM] Sarphraj Anwer Poet: 3️⃣ డా.రామక కృష్ణమూర్తి
తేది:5-7-2020
శీర్షిక: జాతీయోద్యమం
**************************
అహింస ఐకమత్యాలు, శాంతి సహనాలే ఆయుధాలుగా బ్రిటీష్ వారి దమనకాండకు వ్యతిరేకంగా భరతమాత దాస్యశృంఖలాల్ని తెంచేందుకు సాగిన ధర్మపోరాటం,
నింగినంటిన త్రివర్ణ పతాకాల అస్తిత్వ అజరామర యజ్ఞం, స్వాభిమాన స్వేచ్చా సమరం అనీ,
స్వాతంత్ర్య వీరుల త్యాగాల బాటపై నడిచిన సిద్ధాంత కురుక్షేత్ర యుద్ధమే స్వాతంత్ర్య సంగ్రామమని,
విభజించి పాలించిన ముష్కరులను మట్టి కరిపించి, అణిచివేత, దౌర్జన్యాల నుండి పుట్టి భరతమాత సంకెళ్ళను ఛేదించిన జనచైతన్య రణం,
జాతి అస్తిత్వ సమరమే స్వాతంత్రోద్యమమనీ..
*రామక కృష్ణమూర్తి గారు రాక్షస బ్రిటీష్ పాలనను వర్ణించి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసినట్టు స్వాతంత్రోద్యమ పోరాట విధాన ప్రాముఖ్యతను క్రమబద్ధంగా వర్ణిస్తూ కవితోపదేశం* చేయడం అభినందనీయం..
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 9:49 PM] Sarphraj Anwer Poet: 4️⃣ డాక్టర్. మహ్మద్ షరీఫ్
సంగారెడ్డి-9866560527
ఉపాంశము: "అమరులు"
అతివాదులు, మితవాదులు సఖ్యత లేకుండా సదా పోట్లాడుతుంటే ఉద్యమం గతితప్పి ఆంగ్లేయులకు లాభం చేకూర్చిందనీ,
పన్నుగట్టుటకు ఒప్పుకొక ఉప్పుసత్యాగ్రహంను ఉవ్వెత్తురూపంలో చేస్తుంటే జైలులో వేశారని, వారిని విడిపించడానికి అతివాదులంతా ఆంగ్లేయుల్ని చంపడానికి ప్రయత్నించారని,
పండి క్రొవ్వు, ఆవు నెయ్యిల నెపంతో సైనికుల సఖ్యత దెబ్బతీయడానికి యత్నిస్తే వారు సిపాయిల తిరుగుబాటు చేశారని,
అభివృద్ధిని చేయక అబలలపై, సామాన్యులపై దౌర్జన్యం చేసి సంపదలు కొల్లగొట్టారని,
తమ సంపదల్ని ధారబోసి, ప్రాణాల్ని త్యజించి భరతమాత దాస్యశృంఖలాల్ని తెంచి స్వేచ్ఛను ప్రసాధింపజేసి అమరులై కీర్తిని పొందారని..
*ప్రతిభారత్న షరీఫ్ గారు ఆద్యంతం తన పద్యశరపరంపరను ప్రయోగించి, సమరవీరుల విప్లవ ద్యుతిని తెలియబర్చి, ఆంగ్లేయుల దమననీతిని ఎండగట్టి స్వతంత్ర ఉద్యమ కీర్తిని వర్ణించిన పద్యాల తీరు బహు ప్రశంసనీయంగానున్నది*..
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 9:51 PM] Sarphraj Anwer Poet: 5️⃣ *సుజాత గౌడ్ గారు*: 💐💐
శీర్షిక...🌷 స్వేచ్ఛా శిల్పం. 🌷
....... ......... ........... .....
సంస్కృతీసాంప్రదాయాల్ని కాలరాస్తూ, దేశ సంపదల్ని కొల్లగొడుతూ, స్వేచ్ఛను హరిస్తున్న శ్వేతజాతి రాక్షస రాబందులపై ఉద్యమ బందూకుల్ని ఎక్కుపెట్టి, సత్యాగ్రహదీక్షలతో సాగిన భారతస్వాతంత్రోద్యమం ఒక స్వేచ్ఛ అధ్యాయం అంకురం, పురిటిగడ్డ తెగింపుల రక్తమనద్ధి ధీరత్వం రంగరించిన చనుబాలతో ఐక్యత మంత్రాన్ని అందించిందనీ,
ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాలతో, స్వరాజ్యం, స్వదేశీ వాదాలతో ఎగసిపడే కెరటాలతో నియారంతరంగా సాగిన స్వేచ్చా ఉద్యమం,
ఆంగ్లేయపరాన్నజీవితో తూటాకు ధీటుగా నిలిచి
స్వాతంత్ర్య వీరులు మోగించిన శంఖారావమే స్వాతంత్రోద్యమమనీ,
స్వేచ్చాచినుకుల ఊరట ఉద్యమాలతో శృంఖలభారత శిలను స్వేచ్చాశిల్పంగా మార్చి, భారతమ్మకు విజయహారతినిచ్చారనీ..
*కందూరి సుజాత గారు చక్కని పోలికలు, ప్రతీకలతో సాగిన స్వేచ్చాశిల్పం కవనం అక్షరాల కనువిందు చేసి దేశభక్తి, ఉద్యమకాంక్షల సుమగంధాలను* వెల్లివిరియజేసింది..
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 9:51 PM] Sarphraj Anwer Poet: 6️⃣ *స్వర్ణసమత*
*నిజామాబాద్*
*భారత స్వాతంత్ర్యోద్యమము*
శ్వేతజాతీయుల నిరంకుశ పాలనను ప్రతిఘటించి
వివిధ రూపాల్లో సాగిన ఆ మహోద్యమం
సిపాయిల తిరుగుబాటనే చిన్న నిప్పుకణికతో ప్రారంభమైన స్వేచ్ఛాభిలాశ ఎందరో శూరులు, వీరులు, త్యాగధనుల పోరాటంతో ఉగ్రరూపం దాల్చి
మానప్రాణాల్ని లెక్కచేయకుండా సాగిన వివిధ ఉద్యమాలకు ఊపిరిపోసి ఆ నిస్స్వార్థ సమరంలో సమిధలై దాస్యసంకెళ్లను తెంపి భరతజాతికి స్వతంత్ర ప్రమిదల కాంతిని పంచిన యోధులు
మన జాతీయోద్యమ నాయకులనీ..
*స్వర్ణసమత గారు తన స్వర్ణంలాంటి పదాల మాలికలతో కవనహారాన్ని విరచించి భరతమాతకు స్వేచ్చా ఊపిర్లు ఊదిన స్వాతంత్ర్య పోరాట ఉద్యమాన్ని, పోరాట వీరుల్ని గూర్చి అక్షరాలతో మమతానురాగాల్ని ఒలకబోయడం* ప్రశంసనీయం..
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 9:53 PM] Sarphraj Anwer Poet: 7️⃣ *కొలచన విజయ భారతి గారు..* 💐💐
అంశం:భారత స్వాతంత్రోద్యమం
తేదీ:5-7-2020
*************************
అహింసే ఆయుధంగా సాగిన మహాత్ముడి సహాయనిరాకరణోద్యమం, ఉప్పుసత్యాగ్రహం, క్విట్ ఇండియా మొదలగు ఉద్యమాల జోరుతో,
జాతీయోద్యమ నాయకుల హోరుతో తెల్లదొరల కొల్లగొట్టిన స్వేచ్చావాయువులకై చేసిన పోరాటాల సమాహారమే స్వాతంత్రోద్యమమనీ,
ఎందరెందరో పోరాట యోధుల స్ఫూర్తితో,
తెల్లదొరల్ని పొలిమేరలకు తరిమితరిమికొట్టిన స్వాతంత్ర్య పోరుతో బానిసత్వం నుండి జవసత్వాలు కూడగట్టుకున్న నూతన భారతం ఆవిష్కరించబడిందని..
*కొలచన విజయభారతి గారు కొలిచి కొలిచి ఉపయోగించిన తన పదబంధాలతో తెల్లదొరల్ని తరిమి కొట్టి విజయకేతనమెగురేసిన విప్లవవీరుల శంఖారావం, అమరవీరుల అలుపెరుగని పోరాటమే స్వాతంత్రోద్యమమనీ* వర్ణించడం బావుంది.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 9:53 PM] Sarphraj Anwer Poet: 8️⃣ *ముడుంబ తిరువెంకటాచార్యులు ,*
అంశం: భారత స్వాతంత్ర్య ఉద్యమం.
అనాదికాలం నుండి ధనధాన్యాలతో తులతూగే భరతభూమిపై కన్నుబడిన విజాతులు ఆ సంపదల్ని కొల్లగొట్టడానికి కొండకోనల నుండి శరణార్ధులమని, వ్యాపారస్థులమని నెపంతో ఆంగ్లేయులు తిష్ఠవేశారని,
వసుధైక కుటుంబమనే భావనను పెంచి
ఎన్నో తిరుగుబాటులు, ఉద్యమాలు, విప్లవాలు గావించి తుదకు అహింసామార్గాన్ని అనుసరించి
సత్యాగ్రహులై తెల్లదొరల మెడలు వంచి శతాబ్దాల స్వప్నమైన స్వాతంత్ర్యాన్ని పొందారని..
*ముడుంబ తిరువెంకటాచార్యులు గారు తన కవనంలో ముమ్మరంగా పోరాడిన స్వాతంత్ర్య పోరాటవీరుల గురించి, వారి త్యాగాల గురించి* వర్ణించడం జరిగింది.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 9:54 PM] Sarphraj Anwer Poet: 9️⃣ *కోరాడ నరసింహారావు గారు..*
పండుగచేసుకుందాం
*****************
విభజించి పాలించే సూత్రాన్ని తూచ తప్పకుండా పాటించి మనలో మనల్ని విడదీసిన కుట్రకుతంత్రాల పన్నాగంతో సన్నాయిపాట పాడి
స్వాతంత్య్రం పిదప ఐకమత్యంతో ఉన్న వారిని కులమతప్రాంతాల పేరిట కుట్రలుజేసి
దాయాది దేశాలుగా విడగొట్టి రావణకాష్ఠము రగిల్చి తమాషా చూడడం ఆంగ్లేయులకే చెల్లిందని..
స్వాతంత్ర్యం సిద్దించిన పిదప జరిగిన సంఘటనల్ని తన కవితలో వివరించారు..
కోరాడ నరసింహారావు గారి *కవిత మరియు శీర్షిక రెండు కూడా కవితాగానం అంశానికి బహుదూరంగానే* ఉండిపోయాయి, *అంశం ఏమో స్వాతంత్ర్య ఉద్యమం ఉండగా తానేమో ఆ పోరాటాన్ని స్పృశించకుండానే స్వాతంత్ర్యానంతర పరిణామాల్ని తన కవితలో పేర్కొనడం గమనార్హం*..
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 9:55 PM] Sarphraj Anwer Poet: 🔟 అంశం...భారతీయ స్వాతంత్ర్యోద్యమం
*సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు..*
భారతీయుల ఆచారాలు, నమ్మకాలతో ఆడుకున్న బ్రిటీష్ వారికి బుద్ధి చెప్పడానికి ముందుగా ధైర్యం చేసి పోరాటస్ఫూర్తిని రగిల్చిన సిపాయిల తిరుగుబాటు స్వాతంత్ర్యోద్యమంలో సాధించిన మొదట మెట్టు అని,
రాజ్యసంక్రమన సిద్ధాంతం, సైన్య సహకార పద్ధతి.. మొదలగునవి కల్లోలం సృష్టిస్తే,
అతివాదులు, మితవాదులు మరియు జాతీయ వాదులు వివిధ దశల్లో వేర్వేరు కోణాల్లో
స్వరాజ్యం కోసం చేసిన ధర్మపోరాటంలో ప్రాణాల్ని కోల్పోయి బ్రిటీష్ వారి తూటాలకు ఎదురొడ్డి నిలిచి
స్వతంత్రాన్ని సాధించారని..
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు *తనదైన శైలిలో విమల విరచిత కవనంలో ఉద్యమ వీరుల పోరాట విధానాన్ని మరియు వారి ద్వారా ఆర్జిత స్వాతంత్ర్య భారతాన్ని* తన కవనంలో వర్ణించారు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 9:56 PM] Sarphraj Anwer Poet: 1️⃣1️⃣ *వై.కె.సంధ్యశర్మ గారు..* 💐💐
అంశం: భారత స్వాతంత్ర్యం
శీర్షిక: చెక్కని చిరునామా!
అది కాలం చెరపని చరిత్ర యవనికపై గీసిన హోరెత్తే జ్ఞాపకాల కెరటాలు,
ఎన్నడూ మరవజాలని మస్తిష్కంలో ఎప్పటికీ తాజాగా ఉండే పోరాట కాంతులు,
బానిససంకెళ్లు తెంచే మహోజ్వలఘట్టంలో శ్వేతదళాల కుత్తుకల్ని కోసిన విప్లవ చైతన్య శంఖారవాలు అనీ,
ఆంగ్లేయుల ఆటవిక సంగ్రామంలో ఆత్మగౌరవసాక్షిగా
స్వేచ్ఛాసౌభ్రాతృత్వాల్ని హరించే కుట్రలపై
అమరులై, ఆమరణ నిరాహారదీక్షాపరులై, అపార త్యాగధనులై వివిధ ఉద్యమాల పేరిట ఉద్యమించారనీ,
మహాత్ముని అడుగుజాడల్లో ఘనీభవించిన ఆత్మస్థైర్యపు నిరాయుధపోరాటం భారతీయుల్లో కోటి ఉషోదయాల్ని లిఖించిందనీ..
*సంధ్యాశర్మగారు తన కవనంలో భారతస్వాతంత్ర ఉద్యమంలో తమసర్వశక్తులొడ్డి పోరాడిన విప్లవ వీరుల్ని, స్వేచ్చా కాంక్షపరుల త్యాగలవల్ల ఉదయించిన సంధ్యారాగం గురించి, చక్కని పోలికలు,ప్రతీకలతో వర్ణించిన తీరు* బావుంది..
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 9:57 PM] Sarphraj Anwer Poet: 1️⃣2️⃣ *గుండ్లరాజు గారు..* 💐💐💐
*సిద్దిపేట*
అంశం : *భారత స్వాతంత్రోద్యమము*
శీర్షిక :
మహోజ్వల భరితం భారత స్వాతంత్ర్య పోరాట చరితం...
స్వాతంత్ర్య సంగ్రామనికి స్ఫూర్తినిచ్చిన తొలి స్వాతంత్ర్య సంగ్రామమైన సిపాయిల తిరుగుబాటు
రేపిన స్వేచ్చా కాంక్షల జ్వాలలు, తూటాలకు తూటా, ప్రాణాలకు ప్రాణం తోడడమే సరైన నీతియని సాగిన అతివాదుల పోరాట విధానాలు,
శాంతిసహనాలే ఆయుధాలుగా వివిధ ఉద్యమాల్ని ఉన్నతమైన రీతిలో నిర్వహించి పోరాడిన జాతీయవాదుల నిస్స్వార్థ నిర్మల త్యాగాల ఫలితమే మనం తీసుకుంటున్న ఈ స్వేచ్చా వాయువులనీ..
*గుండ్ల రాజు గారు తన అక్షర గుండ్లతో పేల్చిన కవనంలో స్వాతంత్ర్య పోరాటం గురించి, స్వేచ్చాసాధనకై వారు చేసిన త్యాగాల పోరాటాల గురించి చకజాతి పోలికలు, ఉపమానాలతో వర్ణించి, భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని కురుక్షేత్ర ధర్మయుద్ధంతో* పోల్చడం ప్రశంసనీయం..
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 9:58 PM] Sarphraj Anwer Poet: 1️⃣3️⃣ *శ్రీ శివలక్ష్మి రాజశేఖరుని గారు..*💐💐
అంశం: భారత స్వతంత్ర సంగ్రామం
శీర్షిక: చరిత్ర చెక్కిన భారతం
పాశ్చాత్య దేశాల నుంచి వీచిన వర్తకపు విషగాలి హోరులో సామ్రాజ్యవాదులు రాబందులై పీడిస్తుంటే,
రగులుకున్న స్వాతంత్ర్య కాంక్షయే స్వాతంత్ర్య ఉద్యమమనీ,
పాశ్చాత్య పాలనను కూకటివేళ్ళతో పెకిలించే ఉద్దేశంతో సాగిన మహాయజ్ఞంలో భాగంగా
నరనరాల్లో, దేశభక్తి గుండెల్లో ఉప్పొంగిన సింహగర్జనలే విప్లవ ఉద్యమమనీ,
ఆంగ్లేయుల నిరంకుశ పాలనలో మేల్కొన్న నిప్పురవ్వల అణువణువునా కణకణమండే ఆత్మగౌరవ నినాదాలుగా, సత్యాహింసలే ఆయుధకుగా సాగిన పోరాటంలో జయజయ భారతికి జయజయధ్వానాలతో విజయ మాల తన కంఠంలో అలంకరించబడిందనీ..
*శ్రీ శివలక్ష్మి రాజశేఖరుని గారు తన కవనంలో స్వాతంత్ర్య ఉద్యమకాంక్షకు ఎలా శ్రీకారం చుట్టారో వివరించి, జాతీయ నాయకుల పోరాటాన్ని, స్వాతంత్రోద్యమాన్ని చక్కని ఉపమానాలతో, శిల్పంతో చెక్కిన విధం* అభినందనీయం..
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 10:00 PM] Sarphraj Anwer Poet: 1️⃣4️⃣ *అనుముల తేజస్విని గారు..*
నర్సంపేట
అంశం:భారత స్వాతంత్రోద్యమo
తేదీ:5-7-2020
ఏమని చెప్పాలి, ఎలా వివరించాలి నింగినంటిన దేశభక్తితో కూడిన ఆ స్వాతంత్ర్య ఉద్యమజ్వాలల్ని,
వీరుల త్యాగాల రాగాల స్వరాజ్య కాంక్షల్ని,
తాము నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాల్ని ఫణంగా పెట్టిన ఆ త్యాగధనుల్ని అనీ,
1857లో సిపాయిల తిరుగుబాటు అనే చిన్ని నిప్పురవ్వతో ప్రారంభమై ఆంగ్లేయుల గుండెల్లో భయాందోళనలు పుట్టించిన స్వాతంత్రోద్యమం ఆ తర్వాత లాల్ బాల్ పాల్ ల సారథ్యంలో అతి వాదులు, మిత వాదులు మరియు గాంధీ, నెహ్రూల సారథ్యంలోని జాతీయవాదులతో సాగిన స్వరాజ్య సంగ్రామం ఉవ్వెత్తున ఉత్తుంగతరంగమై ఎగిసి
ఆంగ్లేయుల్ని పారద్రోలి స్వేచ్చా వాయువులు ఊపిర్లు ఊది భారతీయుల జీవితాల్లో పున్నమి వెలుగుల్ని తెచ్చిందని..
అనుముల అశ్వినిగారు *స్వాతంత్ర్య వీరుల అనుమితంతో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ స్వరాజ్య సాగర కెరటాల్లో తెల్లదొరలు* కొట్టుకుపోయారని, ఆ ఉద్యమ పోరాటవిధానాన్ని తన కవనంలో ఆవిష్కరింపజేశారు..
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 10:00 PM] Sarphraj Anwer Poet: 1️⃣5️⃣ *-- పాల్వంచ హరికిషన్ గారు..*
అంశం: భారత స్వాతంత్ర్యోధ్యమం
శీర్షిక: అహింసా సూత్రం.!
రామరాజ్యంగా సుఖశాంతులతో వర్ధిల్లుతున్న భారతదేశంలో అక్రమంగా చెంత చేరి ఆకృత్యాల అరాచకాల్ని గాంచి ఉవ్వెత్తున ఎగిసిన ఆగ్రహజ్వాలలే సత్యాగ్రహ సాధనమై
ఆ బానిససంకెళ్లను బద్దలుచేసి విప్లవ పొరుని కొనసాగించెననీ,
కుట్రలు,కుతంత్రాలు ఎన్నో చేసినా, దౌర్జన్యాలు, దారుణమారణకాండలెన్నో సాగించిన మహాత్ముడి సారథ్యంలో అహింసాయుత మార్గంలో భారతీయులంతా ఏకమై ప్రజ్వరిల్లింపజేసిన ఉద్యమాలతో తెల్లదొరల్ని పారద్రోలిన స్వర్ణాక్షర లిఖితమైన స్వతంత్రోద్యమం మహాభారతాన్ని మించిందని..
*పాల్వంచ హరికిషన్ గారు తన కవనంలో పరాయి పాలనలోని దౌర్జన్యాలతో మనవారి మొహాలు పాలిపోయాయని, గాంధీజీ నేతృత్వంలో ప్రజలంతా పాల్గొన్న ఉద్యమం పాలవెల్లిలా ప్రకాశించి* తెల్లవారిని పారద్రోలిందని తెలిపారు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 10:03 PM] Sarphraj Anwer Poet: 1️⃣6️⃣
*** భారత స్వాతంత్రోద్యమం ***
✍️ *డా.పాండాల..గారు..*
పవిత్ర భారతాన వర్తకం కోసం వచ్చినట్టు వచ్చి రాజకీయ అనైక్యత కారణంగా పరిపాలనను చేపట్టి
సంపదల్ని కొల్లగొట్టి నిరంకుశంగా పాలిస్తుంటే
సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమైన
స్వేచ్చావాయువులకై జరిపిన అస్తిత్వపోరాటమే
స్వాతంత్ర్య ఉద్యమమని,
అతివాదులు, మితవాదులు మరియు జాతీయవాదుల నిరంతర సమరమే ఉద్యమమని,
విప్లవవీరులు, శాంతి కాముకులు వివిధ ఉద్యమాలతో ఆంగ్లేయులకు ఊపిరాడకుండా
చేసి ప్రాణత్యాగాల బలిదానాల ఫలితమే స్వతంత్రభారతి అనీ..
*పాండాల మహేశ్వర్ గారు పాడుబడ్డ ఆంగ్లేయుల కుటిలనీతిని, జాతీయోద్యమనాయకుల అండదండలతో భారతీయులు స్వేచ్చాభిలాషులై జరిపిన పోరాటమే స్వాతంత్ర్య ఉద్యమమనీ*..
వర్ణించారు..
కానీ పంక్తుల సంఖ్య 25 మించకుండా చూసుకోగలరు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 10:04 PM] Sarphraj Anwer Poet: 1️⃣7️⃣ *డా.బల్లూరి ఉమాదేవి గారు..*
అంశం: భారత జాతీయోద్యమం
సిపాయిల తిరుగుబాటుతో ఆరంభమై భరతమాతదాస్య శృంఖలాల్ని తెంపడానికి ఉవ్వెత్తున ఎగిసిన ప్రజాగ్రహం చినుకుగా మొదలై
ఉప్పెనలా సునామీలా చుట్టుముట్టి తెల్లవారి గుండెల్లో చిచ్చుపెట్టిందని,
ఆ తర్వాత
అతి,మిత మరియు గాంధేయవాదులు కారాగారవాసాల్ని లెక్కించక, ప్రమాదాల్ని ఏంచక
త్యాగలబాటలపై ముందుకు దూసుకునిపోయి
వివిధ ఉద్యమాల్ని ఉధృతం చేసి చేసిన పోరాటాల వల్ల ఆంగ్లేయులు తోక ముడిచారని,
వీరుల త్యాగఫలం, కవులు కళాకారుల విప్లవశంఖం వల్లబిడి సాధ్యమైనదని..
*బల్లూరి ఉమాదేవి గారు తన కవితలో బరితెగించిన తెల్లదొరల నిరంకుశపాలనలో సంపదల్ని కొల్లగొట్టబడి గుల్లవుతున్న దోపిడికి చరమగీతం పాడడానికి* స్వాతంత్ర్యసమరవీరులు చేసిన పోరాటల్ని వర్ణించారు..
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 10:05 PM] Sarphraj Anwer Poet: 1️⃣8️⃣ *✍🏻సామల ఫణి కుమార్ గారు..*
శీర్షిక : *భారత స్వతంత్ర సమర వీరగాథ*
*************************************
పరాయి పాలనలో నరకయాతన అనుభవిస్తూ మౌనంగా కన్నీళ్లు కారుస్తున్న భారతీయులు
బ్రిటీష్ పాలకుల సంకెళ్లను తెంచడానికి సీఓబుల తిరుగుబాటుతో పోరుబాట పట్టారని,
స్వేచ్చా కలలు ఉవ్వెత్తున ఎగసిపడే దేశభక్తి అలలై
బ్రిటీష్ వారిని ముంచెత్తారని,
ఓ వైపు కట్టి తుపాకులు పత్తి కన్నెర్రజేస్తూనే మరోవైపు శాంతిసహనాలతో ఉద్యమాల్ని నిర్వహించి *చచ్చుడో.. చావుడో..* నినాదంతో పోరాటాన్ని ఉధృతం చేశారని,
నిస్స్వార్థ అమరవీరుల త్యాగాల ఫలితమే నేడు మనం ఈ స్వేచ్చా వాయువుల్ని హాయిగా పీలుస్తున్నామనీ..
ఫణికుమార్ గారు *బ్రిటీష్ వారి దమననీతిని తన అక్షరాలతో కాటేస్తూనే, అమరవీరుల పోరాటాల, త్యాగాల వల్లే స్వతంత్రభారతం అనే ఫలం సిద్దించిందని* తన కవితలో చాటిచెప్పారు..
*************************************
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 10:06 PM] Sarphraj Anwer Poet: 1️⃣9️⃣ *శ్రీలక్ష్మి చివుకుల గారు..*
కవితాశీర్షిక:
సమైక్య భారతి
నలువైపులా ముట్టడించిన విదేశముష్కరులు కుట్రలు, కుయుక్తులతో పరాయిపాలన సాగిస్తూ సహజసంపదలన్నింటిని కొల్లగొడుతూ భరతభూమిని అల్లకల్లోలం చేస్తుంటే స్వదేశీయులు వెలవెలబోయారనీ,
వేర్వేరుగా ఉద్యమాల్ని కొనసాగించిన అతివాదులు, మిత వాదులు ఏకమై పోరాటాన్ని ఉధృతం చేస్తే మరోవైపు గాంధేయవాదులు వివిధ ఉద్యమాల్ని చైతన్యంతో ఉధృతం చేస్తే ఆంగ్లేయులు ఉక్కిరిబిక్కిరయ్యారనీ,
పాటలు, నినాదాలు, కవిత్వము ఉరకలెత్తి ప్రవహిస్తూ జనంలో ఉత్తేజం నింపుతుంటే ఆ ఉధృతప్రవాహాన్ని ఎదుర్కోలేక ఆంగ్లేయులు పలాయనం చిత్తగించారనీ..
శ్రీలక్ష్మి చివుకుల గారు *దేశభక్తి చినుకుల రూపంలో సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమై,* *స్వాతంత్ర్య పోరాట వీరుల త్యాగాల వల్ల ఆ పోరాటం ఉధృతరూపం దాల్చి ఆంగ్లేయుల్ని పారద్రోలారని* వర్ణించారు..
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 10:07 PM] Sarphraj Anwer Poet: 2️⃣0️⃣ *వురిమళ్ల సునంద గారు..*💐💐
అంశం::భారత స్వాతంత్ర్యోద్యమం
శీర్షిక:: ప్రపంచ యవనికపై...
:::::::::::::::::::::::::::::::::::::::::
సిపాయిల తిరుగుబాటు స్ఫూర్తిని గుండెల్లో నింపుకుని భరతమాత దాస్యశృంఖలాల్ని ఛేదించడానికి స్వాతంత్ర్యం నా జన్మహక్కని చాటిచెప్పిన వీరులతో, దేశభక్తి ఉప్పొంగిన హృదయాలలో ఉరికొయ్యల్ని ప్రేమగా ముద్దాడిన విప్లవీరుల శౌర్యంతో, అతి వాదులు, మితవాదుల అనవరత పోరాటాలతో, గాంధీమహాత్ముని సారథ్యంలోని శాంతిసైన్యం వందేమాతరం, జనగణమన గీతాల హోరుతో చేసిన ఉద్యమాల ఉధృతికి రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం కూకటివేళ్ళతో కూలిపోయి కోట్లాది భారతీయుల ఆశలు, ఆశయాల ప్రతిరూపం ఎర్రకోటపై వీరుల, శూరుల త్యాగాల ఫలమైన త్రివర్ణకేతనం రెపరెపలాడిందని..
*వురిమిళ్ల సునందగారు ఆంగ్లేయుల దుష్టపాలనపై ఆక్రోశంతో కండ్లు ఉరిమి వ్రాసిన కవనంలో భారతీయుల కన్నీటి వ్యధల్ని, స్వాతంత్ర్య పోరాట వీరుల వీరోచిత గాథల్ని* వర్ణిస్తూ వ్రాయడం అభినందనీయం..
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 10:08 PM] Sarphraj Anwer Poet: 2️⃣1️⃣ *గంజాం భ్రమరాంబ గారు..*
తిరుపతి
9949932918
*మన స్వాతంత్ర్యోద్యమ ఉజ్వల చరిత్ర.*
భారత దేశంలోని ప్రతి బిడ్డ, ప్రతి ఒక్కరు వినాల్సిన తొలి సాహస గాథ
*మన స్వాతంత్ర్యోద్యమ ఉజ్వల చరిత్ర.* అనీ,
తక్కెడ పట్టుకుని కూటికై వచ్చినవారే, ఇక్కడి అమాయకత్వాన్ని, అనైక్యతను ఆసరాగా చేసుకుని
మాటలతో, తూటాలతో రాజ్యమేలి దాదాపు రెండువందలేండ్లు సంపదల్ని, సహజవనరుల్ని, శ్రమను దోచుకుని భారతీయుల్ని అష్టకష్టాలకు గురిచేశారని, మీరట్ లో పుట్టిన చిన్న కదలిక సిపాయిల తిరుగుబాటుతో ఆరంభమైన స్వతంత్రపోరాటం వివిధ ఉద్యమాలతో అహింసాయుధంతో ఏకతాటిపై సాగి ప్రభంజనంను సృష్టించి ఎందరెందరో మహనీయుల రుధిరాన్ని చిందించిన పుడమి చివరికి స్వేచ్చావాయువుల్ని పీల్చిందనీ..
గంజాం భ్రమరాంబ గారు *స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న వీరుల పోరాటాన్ని, పోరాటం సాగిన ఆ త్యాగాల్ని మన చిన్నారులకు ఉగ్గుపాలతో పాటే
నేర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనీ,
అణువణువునా భారతీయను త్రివర్ణపతాకంలా* స్వేచ్ఛగా ఎగురనివ్వాలని తన కవనంలో వర్ణించారు..
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 10:08 PM] Sarphraj Anwer Poet: 2️⃣2️⃣ *ఎం.టి.స్వర్ణలత గారు..*
శీర్షిక....ఉద్యమాల సమాహారం
తేదీ...05/07/2020
బ్రిటీషు వాళ్ళ నిరంకుశ పాలనలో మ్రగ్గిన బానిసబతుకులకు విముక్తి కావాలని పిడికి బిగించిన ఉద్యమాల సమాహారం, సాయుధ అహింసాయుత పోరాటాల సమ్మేళనమే స్వాతంత్రోద్యమమనీ,
పోర్చుగ్రీసు వారితో ముందుగా పోరు మొదలై తుదకు ఈస్టిండియా కంపెనీపై సాగించిన పోరాటాలు భారత జాతీయ కాంగ్రెస్, మహాత్ముని ఆధ్వర్యంలో వివిధ ఉద్యమాల రూపంలో విస్తృతమై విశ్వరూపం దాల్చి స్వాతంత్ర్యం నా జన్మహక్కని చాటి,
తెల్లదొరల్ని తరిమికొట్టారని..
స్వర్ణలత గారు తన కవనంలో *స్వదేశీఉద్యమాన్ని, కోట్లాది భారతీయులు స్వేదం చిందించి తమ స్వప్నాన్ని సాకారం చేసిన విధానాన్ని* వర్ణించడం బావుంది..
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 10:09 PM] Sarphraj Anwer Poet: 2️⃣3️⃣ *లక్కిరెడ్డి విజయ శుభాకర్ రెడ్డి గారు..*
శీర్షిక: కలియుగ భారత మహాసంగ్రామం
స్వేచ్చావాయువుల్ని పీల్చడం కోసం, సార్వభౌమత్వం కోసం జాతినంతటిని ఒకేతాటిపైకి తీసుకువచ్చి, భారతీయుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఉద్యమమే స్వాతంత్ర్య ఉద్యమమనీ,
శాంతిఅహింసల ఆయుధాలతో జాతినంతటిని ఏకం చేసి ఆంగ్లేయులపై పోరాడిన ఉద్యమం అత్యంత అమూల్యమైనదని,
వివిధ ఉద్యమాల్లో భాగంగా తరతరాల బానిసత్వాన్ని నిర్మూలించేందుకు ప్రపంచానికంతటికి మన జాతీయోద్యమం స్ఫూర్తిదాయకంగా నిలిచిందని అదే భారత స్వాతంత్ర్య ఉద్యమం, కలియుగ భారత మహాసంగ్రామనీ..
*లక్కిరెడ్డి విజయ శుభాకర్ రెడ్డి తన కలియుగ భారతసంగ్రామంలో ప్రపంచవ్యాప్తంగా సాగిన వివిధ సంగ్రామాల్లో భారతస్వాతంత్ర్య ఉద్యమమే మేటి ఉద్యమమనీ, మిగితా దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని శుభప్రదంగా* పేర్కొన్నారు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 10:10 PM] Sarphraj Anwer Poet: 2️⃣4️⃣ *అయిత అనిత గారు..* 💐💐💐
అంశం: భారత స్వాతంత్రోద్యమం*
శీర్షిక: *ఉద్యమ దీప్తి*
స్వేచ్చా శ్వాసనాళాల్ని మెలిపెట్టి అస్తిత్వాన్ని ఉరికంబమెక్కించిన అహంకారాన్ని, బానిస వేదికపై వెతలు నాట్యమాడించిన స్వార్థ మస్తిష్క నాయకత్వాన్ని, ఏకఛత్రాధిపత్యమై అణగదొక్కిన ఇనుపపాదాన్ని సహనం నశించిన భారతీయ అబ్బక్కరాణి, ఝాన్సీరాణిలా ధిక్కారస్వరం, నమ్మకాల్ని వమ్ముచేసినందుకు నిరసన తుపాకీనినెక్కుపెట్టిన సిపాయిల తిరుగుబాటు బ్రిటీష్ వారిని ఎదిరించిందనీ,
అతివాద, మితవాదుల వ్యూహాలు, మహాత్ముని ఆధ్వర్యంలో గాంధేయవాదుల ఉద్యమాలు ఉధృతంగా ఉవ్వెత్తున ఎగిసి సమస్త భరతజాతి ఏకమై బ్రిటీష్ సామ్రాజ్యవాద మూలాల్ని పెకిలించి స్వాతంత్ర్య జిలుగువెలుగులతో ప్రకాశించిందని..
*అయిత అనితగారు తన అక్షరాల జిలుగువెలుగులతో తన ఉద్యమదీప్తి కవితలో ధీరవనితలు, శౌర్యప్రతాప శూరుల అమూల్యమైన భరతస్వాతంత్ర్య పోరాటాన్ని* దశల వారీగా వివరిస్తూ *అమరవీరులత్యాగాల జనితమే ఈ స్వేచ్చా అని ఉద్ఘాటిస్తూ చక్కని చిక్కని కవనంతో అలరించడం ప్రశంసనీయం*..
🌺🌺💐💐💐💐
[09/07, 10:11 PM] Sarphraj Anwer Poet: 2️⃣5️⃣ *ఉషారాణి గారు..*
*భారత స్వాతంత్ర్యఉద్యమం*
బాపూజీ బాటలో భరతమాత దాస్యశృంఖలాల్ని విముక్తి చేయడానికి తిరుగుబాట్లతో, సత్యాగ్రహాలతో రూపుదిద్దుకున్న భారతీయుల స్వరాజ్యపు పోరాటం
వందేమాతరం నినాదంతో దిక్కులు పిక్కటిల్లాయని,
భారతీయుల ధాటికి తాళలేని తెల్లదొరల ఆధిపత్యం పలాయనం చిత్తగించిందని,
ధీర వనితల వీరపోరాటం, గాంధేయవాదుల గుణాత్మక పోరాటాల ఉద్యమాల త్యాగఫలితమే స్వేచ్చా భారతమనీ..
*ఉషారాణి గారు భారతస్వాతంత్ర్య ఉద్యమం కవితలో త్యాగధనుల ఊరటం ఉవ్వెత్తున ఎగిసిపడి ఉగ్రరూపం దాల్చిన సాగిన స్వాతంత్ర్య సంగ్రామం భారతీయుల జీవితాల్లో నూతన ఉషోదయాన్ని లిఖించిందని* వర్ణించడం బావుంది.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 10:12 PM] Sarphraj Anwer Poet: 2️⃣6️⃣ *శ్రీకాంత్ కడార్ల గారు..*
ఊరు :హన్మకొండ
---------------------------------
ఆకట్టుకునే ప్రకృతి ప్రాభవంతో, సహజ వనరులు, సిరిసంపదలతో తులతూగిన పుణ్యభూమి,
నాగరికత, సంస్కృతిసాంప్రదాయాలకు కాణాచియైన కర్మభూమి మన భారతదేశమనీ,
కానీ స్వార్థపరులైన విదేశీయుల దూరాక్రమణలతో, దౌర్జన్య కాండలతో భారతావనికి కల్గిన గాయలెన్నో వ్యాపారం, బతుకుతెరువు నిమిత్తం అన్నపూర్ణపై అడుగిడి చేసిన ఆకృత్యాలెన్నో అనీ,
కన్నభూమిపైన కట్టుబానిసలుగా వారు మార్చి సాగించిన దౌష్ట్యాలకు అంతే లేదని,
సిపాయిల తిరుగుబాటుతో మొదలై అతివాదులు, మితవాదుల పోరాటాలు, గాంధీజీ నేతృత్వంలో సాగిన ఉద్యమాలు ఉరకలెత్తి జనసంద్రమై ప్రవహించి ఆంగ్లేయులకు పొగబెట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తే
సమిష్టి ఉద్యమాల ఫలితంగా మువ్వన్నెల జెండా వినీలాకాశంలో రెపరెపలాడిందని..
*శ్రీకాంత్ కడార్ల గారు తన కవితలో తన అక్షర కత్తులు, కటార్లతో ఆంగ్లేయులపై సాగిన దౌష్ట్యకాండాన్ని, స్వాతంత్ర్య పోరాట ఘట్టాన్ని వర్ణించి భారతస్వాతంత్ర్య ఉద్యమం తడి ఆరని మన గుండెల స్పందన అనీ, గుప్పెడంత గుండెల్లో చెక్కుచెదరని దేశభక్తి* నిండి ఉండాలని చెప్పడం బావుంది.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 10:13 PM] Sarphraj Anwer Poet: 2️⃣7️⃣ *మర్రి జయశ్రీ గారు..*💐💐
అంశం..భారత స్వాతంత్ర్యో ద్యమం
శీర్షిక...మహోజ్వల ఘట్టం
వర్తకవ్యాపార నెపంతో భారతదేశంపై అడుగిడి భారతీయుల అమాయకత్వ, అనైక్యతల వల్ల రాజకీయంగా పెత్తనం సాధించి తమ అరాచక పాలనకు తెరలేపి తమ వికట్టహాసాల కింద భారతీయ స్వాభిమానాన్ని దెబ్బతీసారని,
అహం దెబ్బతిన్నవారుబిసిపాయిల తిరుగుబాటుతో చొరబాటుదారులకు బుద్ధి చెపితే, అంచెలంచెలుగా
అతివాద, మితవాద మరియు చర్ఖా సూత్రంపై పనిచేసిన జాతీయవాదుల నిరంతర పోరాటాలు, ఉద్యమాలు ఉప్పెనల్లా ఉవ్వెత్తున ఎగిసి ఆంగ్లేయుల పాలనను అంతమొందించిన ఆ ఘట్టం చరిత్రలో చిరస్మణీయమనీ..
*మర్రి జయశ్రీ గారు తన మహోజ్వల ఘట్టం కవితలో ఆంగ్లేయుల ఆరాచకాల వెర్రిపై గుర్రుమని తన అక్షరాలశరాల్ని వారిపై ఎక్కుపెట్టి* వ్రాసిన కవనం బావుంది..
🌺🌺🌺🌺💐💐💐
[09/07, 10:14 PM] Sarphraj Anwer Poet: 2️⃣8️⃣ *వల్లాల విజయలక్ష్మి గారు..*💐💐
శీర్షిక:***భారత *స్వాతంత్రోద్యమo*
------------**********************----
దేశమాత దాస్యశృంఖలాలు తెంపడానికి ధైర్య సాహసాల పోరాటాయోధులు విప్లవజ్యోతులై
పరాయిపాలన విషాపుపడగ నీడ నుండి బయటపడ్డ భారత చలిచీమలు ఐకమత్యంతో బలవంతమైన బ్రిటీష్ వారికి బుద్ధి చెప్పిందని,
ప్రథమస్వాతంత్ర్య ససంగ్రామనికి ముందే బీజంపడ్డ
ఈ స్వాతంత్ర్య కాంక్ష సిపాయిల తిరుగుబాటు,
అతి,మిత, జాతీయవాదుల సమిష్టి పోరాటాల ఫలితంగా రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్య పతాకం అవనతమై భారతీయుల ఆకాంక్షల ప్రతిరూపమై మువ్వన్నెల జెండా రెపరెపలాడిందని..
*వల్లల విజయలక్ష్మి గారు భారతదేశాన్ని కల్లోలితం చేసిన తెల్లదొరల పాలనను ఎండగట్టి, భారతీయ స్వాతంత్ర్య పోరాట ఘట్టాల్ని, త్యాగాల పరంపరను సాగించిన ఆ అపూర్వఘట్టం చరిత్రలో అజరామరమని* వర్ణించారు..
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[09/07, 10:14 PM] Sarphraj Anwer Poet: 2️⃣9️⃣ *డా.దీపక్ న్యాతి గారు*
శీర్షిక : ఇండియన్స్ కాదు మనం
భారతీయులం
ప్రకృతి ఛాయలో సుఖశాంతులతో బ్రతుకుతున్న మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పరిపాలనను హస్తగతం చేసుకుని సంపదనంతా దోచుకున్నారని, నియంతృత్వ నిరంకుశ చట్టాలు పెట్టి బానిస సంకెళ్లతో బంధించిబ వికట్టహాసం చేస్తూ
దేశాన్ని భ్రష్టు పట్టించారని,
దాంతో విసిగివేసారిపోయిన భారతీయుల ఆగ్రహావేశాలు కట్టలుదెంచుకుని సిపాయిల తిరుగుబాటుతో ఆరంభమై, వివిధ దశల్లో సాగిన అతి,మిత, జాతీయవాదుల సమిష్టి ఉద్యమాల పోరాటాల వల్ల తుదకు ఆంగ్లేయులు పలాయనం చిత్తగించారనీ, దాంతో కోట్లాది భారతీయుల స్వప్నం నెరవేరిందని..
*దీపక్ న్యాతి గారు తన కవితలో అక్షరాలతో దీపం వెలిగించి స్వాతంత్ర్య పోరాటాన్ని, అమరవీరుల త్యాగాల్ని వర్ణించడం* అభినందనీయం..

Comments
Post a Comment