నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
*************************
కవివరుల జాబితా
వీరా గుడిపల్లి
1.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు
2.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
3.సింహాద్రి వాణి గారు
4.అయ్యల సోమ యాజుల ప్రసాద్ గారు
5. కవిత వెంకటేశ్వర్లు గారు
6.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
7.తరణికంటి సూర్య లక్ష్మి గారు
8.గజవెల్లి శ్రీ నివాసాచారి గారు
9.వేదాంతం సురేష్ బాబు గారు
10. జోషి పద్మావతి గారు
11.తిప్నావఝల నరసింహ మూర్తి గారు
12.ముత్యం వెంకటేశ్వరరావు గారు
13.బి.నాగేశ్వర రావు గారు
14.సునంద వురిమళ్ళ గారు
15.డా.తంగిరాల నాగ లక్ష్మి గారు
16.శివునూరి లలితా కృష్ణ
********
గాన కోకిల
..................వీరా గుడిపల్లి
యే
పర్వత సానువుల నడుమనో
దట్టమైన
వనాంతరాలలోనో
నిర్జన ప్రదేశాలలో
ఏకాంతంగా ఉన్నప్పుడు
నీకు మాత్రమే
వినిపించే లయను
జలపాతాల హోరును
వన్య ప్రాణుల జోరును
మేఘాల తేరు
పలికే రాగాల
ప్రకృతి భాషను
పరిమళ భరితంగా మార్చగల
స్వయం సిద్ధ నాదాలు
సహజసిద్ధ స్వరాలు
స్వచ్ఛమైన స్వనాలు
జనాలకు పంచి
సెలవంటూ వెళ్లిన
దైవ దూత
...... వీరా గుడిపల్లి
1
[08/02, 8:10 pm] +91 90594 38068: గజవెళ్ళి శ్రీనివాసాచారి
అంశం: స్వర కోకిల
...
లతా మంగేష్కర్
పరిచయం అవసరం లేని
స్వర కోకిల
హిందీ పాటలపై
చెరగని ముద్ర వేసిన గాయని
ఆమె గళానికి తెలిసింది ఒక్కటే
మాధుర్యం
ఐదో ఏట మొదలైన
గాన ప్రస్థానం
నేటితో ముగిసింది
భువిని వదిలి దివికి వెళ్ళింది
నైటింగేల్ ఆఫ్ ఇండియా
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
పద్మభూషణ్, భారత రత్న
ఎన్నో ఎన్నెన్నో అవార్డులు
స్వీకరించిన గాయని
2
[08/02, 8:12 pm] +91 6281 697 982: లతా మంగేష్కర్
**************
ఆగిందిలే ఆ పాట ఇలలో
మూగ బోయిందిలే ఆ వెదురు గళము
రాలిపోయిందిలే రాగాల తార
నింగి చేరిందిలే నవరసాల సాలబంజిక
హృదయాలలోన మెదిలేటి లయలు
ఎదలోయలోన కదిలేటి శృతులెన్నొ
మది మడుగులోన ఉరికేటి స్వరాలు
మనసు మూలల్లోన కూని రాగాలు ఎన్నో
పాటకు పట్టవు చావు పుట్టుకలు
కళలను ముట్టవు ఈతి బాధలు
మరిపించనూ లేదు కాలము
కరిగించలేదు కాలచక్రం
లతను మించిన మహిళ మహి లోన
దొరకదు
చావు లేనిది చావు రానిది చిరకాలం
చిరంజీవి
పాటకోసం పాటచేత పాటకే పట్టం కట్టిన
పట్టమహిషి
గానం అమేయం
పాట అజరామరం
గాత్రం చిరస్మరణీయం
లతా మంగేష్కర్
మన మధ్యలోనే
నిత్యం మనతోనే
ఆ గాన సరస్వతీ
స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు
3.
కవితా గానం సీజన్--2
లతామంగేష్కర్ గారికి అశృనివాళి
ప్రక్రియ:-- గజల్
రచన:--సింహాద్రి వాణి
ఊరు:-- విజయవాడ
చరవాణి:--7569820872
సరిగమలను గానములో నింపెనులే మంగేష్కర్
హృదయాలను కొల్లగొట్టి దోచెనులే మంగేష్కర్
వేలలోన గీతాలను వినిపించెను జగమునకూ
నవరసాలు కంఠంలో మోసెనులే మంగేష్కర్
పద్మభూషణై వెలిగెను ప్రతిభెంతో పరిమళించి
భరతదేశ కోకిలయై పాడెనులే మంగేష్కర్
భాషాభేదము లెరుగని గానఝరీ ప్రవాహంలొ
భావాలను పలికించీ సాగెనులే మంగేష్కర్
చిన్నతనం నుంచి మిగులు సాధననూ చేసిందీ
తండ్రే తొలిగురువు కాగ తరించెలే మంగేష్కర్
లతతానై పైకిసాగి పల్లవించి పుష్పించెను
గానామృత ధారలలో
ముంచెనులే మంగేష్కర్
కీర్తి కాయమును విడిచీ కన్నుమూసి తరలిపోయె
భరతరత్నమై వెలిగీ నిలచెనులే మంగేష్కర్
మధురమైన పాటలనూ స్వర్గంలో పాడేందుకు
ధరను వీడి పయనమయీ వెళ్ళెనులే మంగేష్కర్
అదుపుతప్పి యెంతగానొ శోకించెను వాణి మనసు
ప్రపంచాన్ని దుఃఖంలో త్రోసెనులే మంగేష్కర్
4.
అంశం:-
భారతరత్న లతా మంగేష్కర్
శీర్షిక:-
గానకోకిల లతామంగేష్కర్ కు నా అక్షర నివాళి
(28 సెప్టెంబర్1929 -
06 ఫిబ్రవరి 2022)
పేరు:-
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
9963265762
...............................
సంగీతానికి వయస్సుతో సంబంధం లేదని తొమ్మిది పదుల వయస్సులో కూడా
తన గాన మాధుర్యం తో హిందీ జగత్తు నే గాక ప్రపంచాన్నే అలరింప చేసిన భరతమాత ముద్దుబిడ్డ లతా మంగేష్కర్ .......!!
సంగీతానికి హద్దులు లేవని ముప్పదిఆరు భాషలలో ముప్పది వేలకు పైగా పాటలు పాడి ప్రపంచాన
సంగీత సామ్రాజ్ఞి గా పేరుగాంచి,గిన్నిస్ బుక్ కె
వన్నెతెచ్చిన గానకోకిల...!!
బాల్యంలో పదమూడు సంవత్సరాల ప్రాయంలోనే తన పాటతో ప్రేక్షకులను అలరించిన సంగీత సరస్వతి. శాస్త్రీయ సంగీతానికి ప్రాధాన్యతనిచ్చి,
మహల్ సినిమా లో
ఆయేగా ఆయేగా ఆయేగా ఆనేవాల అని,
గైడ్ లో ఆజ్ కి జీనే కి తమన్నా హై, ఆజ్ కి మర్ నే కి తమన్నా హై అని
హే మేరే వతన్ కె లోగ్ అని సైనికుల గురించి పాడినా
తెలుగు లో నిదురపో నిదురపో నిదురపోరా తమ్ముడా అని
గాతా రహే మేరే దిల్ అని
మూడు తరాల వారికి డెబ్భై సంవత్సరాలు పాడిన ఏకైక సంగీత సినీ గాయని వసుదైక కుటుంబాన అన్నది అక్షరసత్యం.....!!
సినీనిర్మాతగా, సంగీతదర్శకురాలిగా,
మూడు తరాల దర్శకులతో
మూడు తరాలవారికి పాటలు పాడిన లతా మంగేష్కర్ పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ పాల్కే దేశ అత్యున్నత పురస్కారం
భారతరత్న కే వన్నె తెచ్చిన
గానకోకిల భరతమాత ముద్దుబిడ్డ, సంగీత సామ్రాజ్ఞి కి నా అక్షర నమఃస్సుమాంజలి.....!!
...........................
హమీపత్రం:-
ఇది నా స్వీయకవిత
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
...............................
5.
కవితా గానం 2
అంశం::గాన కోకిల లతామంగేష్కర్
రచన:: కవిత వెంకటేశ్వర్లు
ఊరు:: కర్నూలు
తేదీ:: 8.2.22..మంగళవారం
సెల్:: 8309920625
శీర్షిక:: అమృత గాన కోకిల
లతా మంగేష్క్ ర్
ఆమె సంగీత సామ్రాజ్ఞి
సరిగమల విద్వత్ మణి
సినీ వినీలాకాశ రాణి
సంగీత దర్శకుల పాటల
ఊటల గని
ఆ గళములో పారింది అమృతం
అద్దాన్ని ఆస్వాదించి
తన్మయులైనారు
సంగీత ప్రేమక జనం
ఆ కంఠములో ఉరికింది
గాన జలపాతం
ఆ స్వరములో సంగీతం ఏరులై
పారింది
ఆమె 'ఆ' పాటలో తలమునకలయింది
పాడే పాటలలో ఆనందం
వెతుకుంది
సంగీత లయలో లయమయి0ది
జతులతో జత కట్టింది
గమకాలతో మమేకమయింది
సంగతులతో సమ్మేళనమయి0ది
అందుకే ఆమె అంతగా రాణించింది
సంగీత లోకాన మణిదీపమయి0ది
ఆణిముత్యమై నిలిచింది
అవార్డులు రివార్డులు ఎన్నో
ఆమెను వెతుకుంటు వచ్చాయి
మూడు జాతీయ అవార్డులు
అందుకున్న అపూర్వ గాయని
పద్మభూషణ్ పద్మవిభూషణ్
దాదాసాహెబ్ పాల్కే అవార్డు
ఎన్.టి.ఆర్.,ఏ.ఎన్.ఆర్
అవార్డులు
విశిష్టమైన అత్యున్నతమైన
"భారత రత్న" అవార్డు అందుకున్న'భారత నైటింగేల్'
కాళ్లకు చెప్పులు లేకుండా
పాటలు పాడే ఏకైక నిబద్ధత
గల సింగర్
ప్రపంచ ప్రఖ్యాతి గాంచే
లతామంగేష్క్ ర్
భేషజాలు లేని సింగర్
అందుకే అయింది ఎంతో పాపులర్
తీర్చిలేరు ఎవరు ఆమె లేని లోటు
92 సంవత్సరాలు మరణించిన
జీవించడం గ్రేటు
అందుకే ఆమెకు హృదయ పూర్వకమైన సెల్యూట్
పై కవిత నా స్వీయ
రచన అని హామీ
6.
కవన గానం సీజన్ 2 నిర్వహించు కవితల
మాల
తేది: 08-02-2022
అంశం: లతా మంగేష్కర్ సంతాపంగా
పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి: 9505152560
***********************
*నివాళి కోరిన స్వరం*
ఆ గొంతులో ఏముందో మర్మం
కోయిల అరువు తీసుకుందోగాని
పల్లవించింది మధుర స్వరం
పసిపాప నుంచి పండు ముదితకు పెనవేయు పుష్పలత
ఏ గంధర్వగాయకునికైన
జత కుదిరిన మోహనరాగము
కుహు కుహు బోలే కోయలియా
సావన్ కా మహీనా
పవన్ కరే షోర్
పాట పల్లకినెక్కి గాలితో ఊసులాడింది వసంత ఋతువై...
అయ్ మేరే వతన్ కే
లోగోఁ ౙర ఆంఖ్ మే భర్ లో పానీ
మేరీ యాదేఁ తాజీ కర్లో
జరాసీ ఆఁసూ బహాలో...
ప్రకటించింది వినతిచేసుకుంది.
ఆప్ కీ నజరోఁనే సంఝా
ప్యార్ కీ ఖాబిల్ ముఝే
ఎంత గాఢమైన భావన
నిద్ర పుచ్చే జోల పాట లాలన
మనోవ్యధకు గురైన ప్రేమికునికి స్వాంతన
హుస్ను హాజిర్ హై
మొహబత్ కీ సజా పానేకో
కోయిల పత్దర్ నా మారో మేరే దీవానేకో...
వశం తప్పిన ప్రియునికి
తూ జహా చలేగా
మేర సాయి సాథ్ హోగా..
అని అభయమిచ్చింది
ఈశ్వర్ సత్య హై...
సత్యహీ శివ్ హై...
శివ్ హీ సుందర్ హై...
ఆధ్యాత్మిక చింతనలో
భక్తి భజనలో పారవశ్యం నింపింది
హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం గాని
గౙల్ కాఫియత్ గాని
లత దీదీ కే చెల్లింది
నాటి నుంచి నేటి వరకు
కోయిల గానంతో
మరో కోకిలమ్మ పుట్టలేదు...
ఎన్ని పురస్కారాలు ఆమె గొంతుకు
సాష్టాంగ పడాలి!
మరణం చివరి పలుకు కూడా
ఓలలాడు పసిపాపే!
తుమ్ హీ మేరీ మంజిల్
తుమ్ హీ మేరీ పూజా
తుమ్ హామీ దేవతా
పతి-భక్తిని ఆవిష్కరించింది...
లత అందరికీ దీదీ..
****
అంకితం
ఈ అక్షరాలను లత దీదీ కే అంకితమిస్తున్నాను.
7.
కవితాగానం ( సీజన2) 8/2/2022/ మంగళవారము
గానకోకిల లతామంగేష్కర్
చిత్రసీమను పెనవేసె మాలతీ లత
పైకిప్రాకుతూతనతోపాటు చిత్రసీమనే పైకి ప్రాకించె
భామలందరి వెనుకనుండి గానమాధుర్యమున
వారినటనలకు జోహార్లు పలికించె
భామినులనటనలోనాణ్యతచూపించె
పసిడిపాపనుండి పండుముసలివరకు మధురముగ లతమ్మపాడినపాటలవినగానె పరవసించు
మనతోడుగాయని మనలనువిడచి గగనానికిచేరెననుచు మావిచిగురుమాధుర్యమువదలి
కోయిలమ్మలన్ని
కూ.... కూ..... అంటూవిలపించసాగె
దివికేగిన గానకోకిల భువిలోనతనకీర్తినంతవదలె
భారతరత్నబిరుదునందుకొన్న
భరతమాత బిడ్డ
భారతీయ ఆడబడచు
అధికారలాంచనాలతోఅంతిమ యాత్రసాగె
కడసారిచూపుకై కదలెను జనవాహిని
పాటయున్నంత కాలము
మధుర గాయని మనకు మరపురాదు
తరణికంటి సూర్యలక్ష్మి.
-----------
8.
గజవెళ్ళి శ్రీనివాసాచారి
అంశం: బుర్రా సుబ్రమణ్య శాస్త్రి గారి జయంతి సందర్భంగా రాసిన కవిత
...
నాటకాలలో
స్త్రీ పాత్ర పోషణలో
సాటిలేని మేటి నటుడు
మెరిసే వర్చస్సు
ముదిమి లేని సొగసు
స్త్రీత్వంలోని సొబగు
నటనా తపస్సు
ఈ లక్షణాలు దేవుడి ఆశీస్సు
సతీ సక్కుబాయి
మధురవాణి
శశిరేఖ,సత్యభామ
విభిన్న పాత్రలలో
పరకాయ ప్రవేశం చేసిన బుర్రా
ఆయన నిరాడంబరుడు
నిగర్వి, ఆధ్యాత్మికవేత్త
బహుముఖ ప్రజ్ఞాశాలి
నాట్యమయూరి
నాట్యాచార్య బిరుదాంకితుడు
9
**********************
అంశం:- గాన కోకిల స్వరలత
""""""""""""""""""""""""""""""""""""""""""""
కలకలా రావాల గాన కోకిల
గొంతు పలుకనని మూగపోయింది
సుదూర తీరాలకు చేరాలంటూ
తాను సాగిపోయింది
రాగాల రేవులో సేద తీరాలని
గీర్వాణి పాదాల చెంత చేరాలని
గంధర్వ లోకాలలో మధురామృత
గాంధర్వ గానం వినిపించాలని
కళామతల్లి ఒడిలో నిదురించాలని
వాణీ వీణా నిక్వణమై నిలవాలని
తరలి పోయింది స్వర లత
రాగాల రస ప్లావిత
ఆ గానం గాంధర్వం
ఆ గానం మాధుర్యం
ఆ గానం జలపాతం
ఆ గానం స్వర పాతం
ఆ గానం కల కోకిల కూజితం
ఆ గానం విశ్వ విరాజితం
సరిగమలకు చిరునామా
స్వర జతులకు లేదు కామా
పాటకు కట్టింది పట్టం
రస హృదయులకు ఆమె చుట్టం
భరతమాత గారాల పట్టి
శృతి లయలకు ఆమె జగజెట్టి
ఆమె గానం రమణీయం
నిలిచింది చిరస్మరణీయం
నిరంతర రాగ తరంగణి
లతా మంగేష్కర్ విద్వన్మణి.
🖋️ వేదాంతం సురేశ్ బాబు
చంద్రపూర్
మహారాష్ట్ర
10
జోషి పద్మావతి గారు
*కవితాగానం (సీజన్ 2)*
తేది : 09/02/2022 బుధవారం
అంశం : లతామంగేష్కర్ కు అశృనివాళి
*శీర్షిక: గగనాని కెగసిన గానకోకిల*
******************************
గళమధురిమకే మురసిన ఇల
కళకళలను కంఠానదాచినకోయిల
అమ్మలోని అనురాగం ఆలూమగల ప్రేమగానం
అక్కాచెల్లెళ్ళతమ్ముళ్ళ అన్నాచెల్లెళ్ళ తమ్ముళ్ళ
ఆత్మీయానురాగపు గానం
భక్తిని,అనురక్తిని,ఆసక్తిని
మేళవించిన మేలిమిగీతం
వీనులవిందైనరాగం చేలల్లోపాడేజానపదగీతం
దేశభక్తిని ప్రస్ఫుటించుఉత్తమగానం
వీరజవానులను స్మరించు చక్కనిగానం
దేవతలను కీర్తించు భక్తిగానం
సంస్కృతీ సాంప్రదాయాలకు పట్టేనద్దం
ఆకృతులకే జీవంపోసే గానకళానైపుణ్యం
చాచాజీకే కంటతడిపెట్టింటిందట ఒకగానం
స్వామీజీలనుమెప్పించినదొకవైరాగ్య గానం
ఆత్మీయతనుచాటిచెప్పేలా అమ్మపాడినజోలపాట
ఆట పాటల చదువుసంధ్యల మెప్పించుపిల్లలపాట
పాటలపల్లకిలో ఊరేగుతూ
గగనతలానికెగసిందిలా గానకోకిల
ప్రతిహృదినీతాకి కృతులనేఅల్లుకొని
ఆకాశమునే చేరినదీలత
అంతర్యామికంకితమైనదామె తనూలత
ఆమె పవిత్రఆత్మకు శాంతిచేకూర్చాలి అనంతుడు
పసిపాపలా అనతికాలంలోనే మళ్ళీజన్మించాలని
వేలుపులను వేడుదమా నేడు!
(గానకోకిల లతామంగేష్కర్ కీర్తి స్మృతి)
11.
కవితా గానం సీజన్ 2
అంశం:లతా మంగేష్కర్
హైకూలు
తిప్పావఝల నరసింహమూర్తి
1)లేదు వృద్ధాప్యం
లతమ్మ గాత్రానికి
శరీరానికే.
2)సంగీత పోటీ
అంత్య విజేత, లత
స్వర్గలోకంలో
3)ఆమె కంఠము
భావోద్వేగాలు పల్కే
ఢమరుకము.
4)లేదు మృత్యువు
చిరంజీవి, పాటగా
జనం నోళ్ళలో
5)గానామృతము
స్వర్గంలో పంచటాన్కి
వెళ్ళింది లత
12.
శీర్షిక: జగన్నాటక సూత్రధారి ధనమే!
ఎక్కడ చూసినా ఎక్కడికెళ్లినా
అక్రమాల పుట్ట అవినీతి గుట్ట
పుట్టగొడుగులై తాండవిస్తున్నాయ్
అక్రమార్జునుల అవినీతి సొమ్ము
పట్టుపరుపుల కింద దర్శనమిస్తున్నాయ్
అరాచక శక్తులను పెంచి పోషిస్తూ...
అవినీతి సామ్రాజ్యాన్ని పాలిస్తున్న
జగన్నాటక సూత్రధారి ధనమే!
మంచితనం కనుమరుగైన ఈ రోజుల్లో
డబ్బు మనల్ని ఆడిస్తున్న తోలుబొమ్మలాట
ఉన్నవాళ్లు విలాసంతో గడుపుతున్నారు
లేనివాళ్లు అర్ధాకలితో అలమటిస్తున్నారు
నోటు ఆశతో ఓటర్లను మభ్యపెట్టి
చాటుమాటున మీటింగులు చీటింగులు రేపింగులు
ధన దాహంతో మదమెక్కిన మానవ మృగాలు
నైతిక విలువలు మసకబారుతున్నాయి
మానవత్వం మంట గొలుపుతోంది
ఏది చేయాలన్నా డబ్బే ప్రధానం
మనిషికి నుదుటి వ్రాత మార్చేది డబ్బే
లంచవతారాలు ఉన్నంతవరకు
చితిమంటల సమరమే మనకు
డబ్బు ఏ పనినైనా చేయిస్తుంది
దేనికైనా తెగిస్తుంది ముగిస్తుంది
ధనమే అన్నిటికీ మూలకారణం
రక్తంతాగే జలగల్లా ప్రజలను పీడించి,
అక్రమార్జునులై జైలుపాలు అయ్యే కన్నా
అనాధల,అభాగ్యుల ఆకలితీర్చి
దానధర్మాలతో దాతలై ధన్యులై పోవడం మిన్న!
*******************************
ముత్యం వెంకటేశ్వరరావు
గుంటూరు జిల్లా
చరవాణి: 7997840591
హామీపత్రం: ఈ రచన నా స్వీయ రచన
ఎటువంటి అనువాదం కానీ, అనుకరణ
కాదని హామీ ఇస్తున్నాను
13.
[09/02, 9:14 pm] +91 88015 26321: కవితా గానం
శీర్షిక: సుమధుర గాయని
తే/గీ
ఎన్నియోఅక్షరంబులు ఎన్నియో స్వ
రంబులు తనదు మృధుమధుర గళమందు
దాల్చిఎన్నియో గానసుధలొలికించి
న సుమధుర గాయని లత మనలను వీడె!
తే/గీ
నిదుర పోర తమ్ముడు యని నిదుర పుచ్చి
తిరి నిదుర రాని తెలుగుశ్రోతైన ప్రతి యొ
కనిని మీ సుమధుర గాన గరిమ ,నేడు
మమ్ము శోక జలధి ముంచమరులయితిరె!
తే/గీ
అమరి పురికి మీ గానము యవసరమైన
దేమో యమరేంద్రుడు మిమ్ముల దేవ సభకు
తోడ్కొని చనియె అలరించ్రి తొంబది మరి
రెండు ఏండ్లు మమ్ము ,యిక సురేంద్రు వంతు!
బి నాగేశ్వరరావు
వైజాగ్ 8801526321
పై పద్య కవిత స్వీయ రచన అని తెలియజేయు చున్నాను
[09/02, 9:14 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
*తేదీ:09-02-2022*
14
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
*అంశం:గాన కోకిల లతా మంగేష్కర్*
*******************
ఆమె గానానికి కోకిలలు పరవశించి
రాగాలను మర్చిపోతుంటాయి...
బాల్యంలోనే మనసుకెత్తుకున్న బాధ్యతాయుత హృదయ వైశాల్యానికి
కరిగిపోయిన కమ్మని గాత్రం
కష్టాలు కన్నీళ్ళలో సైతం
తోడుంటానని మాట ఇచ్చి
ప్రపంచానికో సంగీత సామ్రాజ్ఞిని అందించింది!
పండిత పామరుల హృదయాలను గెలుచుకున్న ఆమె మధుర స్వరం!
గళంలో ప్రవహిస్తుంది గాన సుధారసం!
ఆబాల గోపాలానికి ఆరాధ్యమైన మనోహర గాన మాధుర్యానికి పులకించి
పద్మ భూషణ్ పద్మ విభూషణ్
దాదాసాహెబ్ ఫాల్కే
అవార్డులతో గౌరవించుకుంది భారత దేశం!
తొంభై రెండు వసంతాల జీవన ప్రస్థానంలో భారత నైటింగేల్ గా
ప్రజల ఆదరాభిమానాలు సంపాదించుకున్న లతా మంగేష్కర్
సినీ జగత్తులో సుస్వరాల సంగీత సరస్వతి!
పురస్కారాలకే వన్నె తెచ్చిన రాగ తరంగిణి
జనావళి హృదయాల్లో పాటల పల్లకిలో ఊరేగిన కళామతల్లి ముద్దుబిడ్డ!
భువి నుండి దివికేగిన అమృత లత
అమర లోకాన్ని గానంతో అలరించడానికి గగనానికి పయనమైన
లలిత లావణ్య గాంధర్వ గాయనికి అశ్రు నయనాలతో నివాళి 🙏
15.
లతా మంగేష్కర్ గారికి నివాళి
అరుణ కిరణాల అందం లతా గానం
భక్తి గీతాలలో భావాలు తొణి కే పారవశ్యం
ప్రేమ పాటలలో పరవళ్లు. తొక్కే గమకాల
ప్రవాహాలు
వినూత్న రీతి లో విషాద గీతాలు ఆల పించిన గళం మూగ బోయింది
లలిత మధురిమలు పలికించె స్వర రాణి
జీవితం తో రాజీ పడినా
చలనచిత్ర సీమకు మహా రాజ్ఞి లతా మంగేష్కర్
ప్రపంచాన్ని వీడి వెళ్లినా ఆమె గానం అమరం
భారత రతనాల హారం లో శోభిల్లు గాయనీ మణి లతా మంగేష్కర్
పై లోకాలకి పయనం కట్టిన తల్లికి
శ్రద్ధాంజలి
డా.తంగిరాల నాగలక్ష్మి
16.
*స్వర సరస్వతి*
దశాబ్దాల పాటు పాటలపల్లకిలో
ప్రపంచాన్ని మురిపించిన
అలుపెరుగని అమృతస్వరం
వందేమాతరమంటూ
తరాల అంతరాలు లేకుండా
అందరిలోనూ
దేశభక్తిని రేకెత్తించినచైతన్యపు స్వరం
నిదుర పోరా అంటూ
కమ్మని జోల పాటతో అలసిన దేహాలకు సాంత్వనలందించిన మార్దవస్వరం
చివురులు తొడిగిన
లలిత లతాంతపు
స్వరం
ఆ స్వరం
నవరసాలనొలికించే
అపురూపస్వరం
ఆ స్వరం
కల కూజిత స్వనం
విరి తేనెల గళం
సుమధుర రాగాల సందోహం
సుధా ఝరుల ప్రవాహం
నిరుపమాన గానలహరి...
స్వర సరస్వతికిదే
వందనం
**********లలితాకృష్ణ
****************
వినమ్రంగా
శివునూరి లలితాకృష్ణ
Comments
Post a Comment