నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
*******************
కవివరుల జాబితా
1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు
3.డా.బల్లూరి ఉమాదేవి గారు
4.కవిత వేంకటేశ్వర్లు గారు
5.ధనాశి ఉషారాణి గారు
6.మన్నె లలిత గారు
7.సునంద వురిమళ్ల గారు
8.గొర్రె పాటి శ్రీను గారు
9.తరణికంటి సూర్య లక్ష్మి గారు
10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు
12.తాతపూడి సోమశేఖర శర్మ గారు
౧౩.సునంద వురిమళ్ల గారు
14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
15.గుండ్ల సౌజన్య గారు
16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు
17.పిన్నక నాగేశ్వరరావు గారు
18.అపరాజిత్ గారు
19.డా.పాండాల మహేశ్వర్ గారు
20.జంపని శ్రీ నివాస మూర్తి గారు
21.బేతి నాగ లక్ష్మి గారు
22.సునంద వురిమళ్ల గారు
23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు
24.శివునూరి లలితా కృష్ణ గారు
**************""***
[14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️
కవితాగానం
నేటి అంశం
*గోరింట*
ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు
అంశానికి కవితలతో
స్పందించగలరు.
ఆ సమయంలో ఎలాంటి
ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.
❇️❇️❇️❇️❇️❇️
1
కవితాగానం
అంశం; గోరింట
శీర్షిక:
" దివ్యౌషధం "
ఆషాడ మాసాన
వరుణుడి కరుణతో
తొలకరిజల్లుల ఆగమనంతో
చెట్లన చిగురిస్తుంది గోరింట
ఆనక పండుతుంది అతివల అరచేత!
ఎర్రగా పండితే
మంచి మొగుడోస్తాడని
అరచేయి ఎర్రగా పండాలని
కోరుకుంటుంది ప్రతి పడతి!
వానాకాలం రాకతో
వనితల పై పనిభారం మరెంత పెరిగి
కాలిపాదాలు,అర చేతులూ
వర్షం నీటిలో నానుతూ ఉన్నందున
వచ్చే చర్మవ్యాదు ల నివారణకు
గోరింటాకు లేపనమే దివ్యౌషధం!
పండుగలకు పడతులు చేసుకునే అలంకరణలో
ప్రముఖ పాత్రను పోషిస్తూ.
బాహ్య సౌందర్యానికి వన్నెలద్దుతూ
మగువుల మనో సౌందర్యానికి
మెరుగులద్దుతూ
భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షిణి గోరింట
ఆషాడమాసాన కొలువై ఉంటుంది ప్రతి ఇంట!
.................. ........................
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం
సెల్ నెంబర్.7416638823
..........................................
పై వచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను
[14/07, 8:19 pm] Aalla Nageshwar Rao Poet: కవితాగానం
2.
కవితా గానం
నేటి అంశం : గోరింట.
తేదీ 14 . 7. 21.
రచన: కే దేవికారాణి రత్నాకర్ తెనాలి.
++++++++++++++++++++
నేల మట్టిని చినుకు నాగళ్లు తొలిచి
విత్తు మత్తును కుదిపి మొలకలె త్తించినట్లు
పాలపొంగు లో బియ్యం గింజలు వేసి
బెల్లం పప్పు తో ఉడికిస్తే పాయసం అయినట్టు
రకరకాల పదార్థాలు కలగాపులగంగా ఉడకపెడితే
రుచికరమైన వంటకాలు చవులూరించి నట్లు
పాల సముద్రాన్ని మధిస్తే
అపురూప అమృతం జన్మించినట్లు
నిన్ను దూసి మజ్జిగ చుక్కలు పోసి నిమ్మ రసం వేసి
మెత్తగా రుబ్బితే ఎన్ని అందాలు చిందే వు.
ఎన్ని సొగసులు మా ఒంటిపై చిలికేవు
చేయంతా ఎర్రగా పండించే వు
పాదాలకు పారాణి వై అలరించేవు
గులాబీ చేతిలో పగడాల కాంతులు నింపే వు
మెత్తని చేతికి హత్తుకునే రంగునిచ్చి మెప్పించే వు .
జుట్టు కుదుళ్ల ని గట్టిపరిచే వు
కెంపు సింగారం తో శృంగార మొలికేవు.
వే ళ్ళ చివర ఎర్రటి ముఖమల్ టోపీల్లా
కలువరేకుల పై పెట్టిన కెంపు కిరీటాల్లా...
మనసును ఇంపుల పెంపులతో నింపి
ఉల్లాస పు కలల్లో తేలిం చేవు
మనసును మాటలలో తెలుపలేని చెలి... వలపును
గోరింట చేతితో చూపించే ను
నీ మరుల ఎరుపుతో....
ఆషాఢ మైనా...అనురాగ మైనా
ఆహ్వాన మైనా. .. ఉద్వాహ మైనా...
నీ అలంకారమే అలరారు భూమిపై
మనిషెలా వెతికెనో??
నీ అంతస్సారం...
అంటుకుంటే చాలు రాగాలు చిలికే వు
అరచేతిలో పూచి అనురాగమొ లికేవు
గోరింట నీ పంట అందాల సిరి అంట
చలువ చందాలలో నీ సాటి ఎవరంట??!!
3.
14/7/21
కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి
అంశం:గోరింట
మగువులఅందాన్నిపెంచేది గోరింట
పతికి ఆయుష్షు నారోగ్యమిచ్చునంట
ఎంత యెర్రగ పండబ్రతుకంత పండునట
త్యాగానికి మరో పేరు యీ చక్కనిగోరింట
తాను నలుగుచు పడతుల పాణి..పాదాలపై
హోయలను చిలికించి అందాన్ని పెంచుచూ
తానునేలరాలి పరుల బ్రతుకు పండించునంట
పచ్చని యాకులు దెచ్చి వక్కను లవంగాలను
కాచుముక్కను వేసిపచ్చడల్లె రుబ్బి
ఆడపిల్లల కరచేత నుంచ హెచ్చేను
సొగసెంతొ మెచ్చేరుజనులెల్ల
శుభకార్యమేదైన ఇంట నిది హాజరూ
నవవధువుముస్తాబు గోరింటతో ముగియు
కమనీయమైనట్టి చిత్రములతో కరములు
కమనీయ మౌనంట కన్నులపంటగా
ఆషాఢమాసాన అరచేత గోరింట
అందంగ దిద్దంగ ఆనందమౌనంట.
బాహ్య సౌందర్యానికి వన్నెలద్దుతూ
మగువుల మనో సౌందర్యానికి
మెరుగులద్దుతూ
భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షిణి గోరింట
ఆషాడమాసాన కొలువై ఉంటుంది ప్రతి ఇంట!
.................. ........................
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం
సెల్ నెంబర్.7416638823
..........................................
పై వచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను
౪
కవితా గానం (సీజన్-2)
అంశం..గోరింట
గోరింటాకు
ఎంతో ఇష్టం ఆడపిల్లలకు
పండుగలకు పబ్బాలకు
పర్వాదినాలకు వ్రతాలకు
నోములకు ఇంట జరిగే
ఫంక్షషన్లకు పెండ్లిండ్లకు
పెర0టాలకు
పెట్టించుకుంటారు ఎంతో సంబరంగా
స్నేహితులకు చూపి
ముచ్చటించుకుంటారు
ముచ్చటగా
అందరికి చూపిస్తూ సంతోష
పడతారు
చేతులు అరచేతులు చూపుతూ ఇల్లంతా తిరుగుతారు
వాన కాలంలో గుబురుగా
పెరుగును గోరింటా
పడితే చాలు నారి కంట
ఆకులు తెంపుకొచ్చి
వాటిని దంచి లేక రుబ్బి
మెత్తగా జేసి ఒకరికొకరు
పెట్టుకుంటారు
ఎర్రగా పండిందంటే పిల్లలు
ఎంతగానో సంతోషిస్తారు
పెద్దలు ముసిముసిగా
నవ్వుకుంటారు
ఆడవాళ్లు వంట పనులు
ఇంటపనులు చేస్తారు
ఎక్కువగా నీళ్లలో తడుస్తారు
అందుకు వారికి చర్మవ్యాధులు
రావచ్చు అవి రాకుండా
అవుతుంది గోరింటా
కాళ్లకు చేతులకు గోరింట
పెట్టుకొని నడుస్తుంటే
ఇంట లక్ష్మీదేవి నడిచినట్టే
ఉంటుంది
పతికి ఆయురారోగ్యాలు
సుఖశాంతులు కలిసి ఉంటాయి
బ్యూటీపార్లర్లు వచ్చే
గోరింటాకును ప్యాక్ ల్లో తెచ్చే
అవన్నీ అతివలకు నచ్చే
పార్లర్లకు పోయి పెట్టుకోవడం మెచ్చే
నేటి కాలానికి వన్నె తెచ్చే
ఇదే మేలనిపించే!!
కవిత వేంకటేశ్వర్లు
కర్నూలు. 8309920625
పై కవిత నా స్వీయ రచన అని
హామీ
౫
శీర్షిక.గోరింట
......
ఆడపిల్ల సిoగారానికి
వన్నెలు అద్దును ముద్దుగాను
రెక్కలు విప్పినట్టి
నులువెచ్చని మగువ అందాలకు
అలా అలా రంగులు అద్దును
సీతాకోక చిలుకలుగాను
ఎగిరేటి కురులు లోగిలిలో
ముద్దు ముద్దుగా ఎర్రని రంగులుతోను
మొమునందు సొగసులు దిద్దు
గోరింట సింగాల పొదరిల్లు
మనసును దోచేటి రంగుల పొదరిల్లు
భువిని వయ్యారముగా తాకేటి
సున్నితమైన పాదాలపై
తలుక్కుమనేటి గోరింట వయ్యారాలు
మగువ అందాలకు మకుటంలా
కుర్రకారు అందాలను దోచును
అలా హాయిగాను
గోరింట మగువసొగసులు అద్దును
భువిలో వెలిసిన ఔషధముల కల్పవల్లి
ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
౬
కవితా గానం
తేదీ :14/ 7 /21 -బుధవారం
అంశం :గోరింట
శీర్షిక: ఆషాఢం చెట్టు
పేరు: మన్నె లలిత
హైదరాబాదు
చరవాణి సంఖ్య: 741 686 32 89.
*********************************
ఆషాఢం చెట్టు
అతివలు మెచ్చే చెట్టు
చీగురు లేకుండా దూసే చెట్టు
అతివల ఆరోగ్యానికి అదే తొలిమెట్టు
అదే ...అదే ......గోరింట చెట్టు!
వయోభేదం లేక అతివలు పెట్టుకునే గోరింట
ఇస్తుంది కాళ్లు చేతులకు అందాలు
లంగా, వోణి వేసుకొని
ఎర్రటి పారాణిి పాదాలకు
ఘల్లు ఘల్లుమనే గజ్జలు పెట్టుకొని
అమ్మాయి నట్టింట తిరిగితే
కనక మహాలక్ష్మే!!
నీటిలో వర్షానికి నానే పాదాలకు
చర్మ వ్యాధి రాకుండా పెట్టే గోరింటాకు
తీస్తుంది ఒంట్లోని వేడిని
సరి చేస్తుంది కాళ్ళ పగుళ్లు ,గోళ్ళను
ఏ పండుగ వచ్చినా పెళ్లిళ్లలో శుభకార్యాలలో
అట్లతద్దెకు పెడతారు అందంగా చేతులకు
సూర్యచంద్రులునే దింపుతారు చేతులకు
ముచ్చటైన ముగ్గులు అందమైన ఆకృతులు
తీర్చిదిద్దుతారు కాళ్ళకు ,చేతులకు
మైనపు చుక్కలు ,ధాన్యం గింజలు ,అందమైన ఆకులు
నైపుణ్యంగా పెడతారు అరచేతులలో
"మెహిందీ ఫంక్షన్ "ఈనాటి వివాహాలలో "ఫ్యాషన్"
జుట్టు పెరుగుటకు గోరింట పొడి
ఆకురుబ్బి పెట్టకుండా "గోరింటశంకు" లు
రకరకాల రంగురంగుల గోరింట పొడులు
అంటించ గోరింట ఆకృతిే కాగితాలు
వచ్చాయి నవీన యుగాన
ఏదేమైతేనేం ప్రతి ఒక్క స్త్రీ గోరింట
పెట్టుకునే మాసం ఆషాఢ మాసం
*******************************
ఇది కేవలం ఈ సమూహము కోసం వ్రాసినదేనని హామీ ఇస్తున్నాను
7.
*కవితా గానం సీజన్ 2*
తేదీ:14-07-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: గోరింట
******************
ఆషాడ మాసంలో ఇంటింటా
నిన్ను తలుచుకుంటేనే
కన్నెపిల్ల బుగ్గల్లో సిగ్గుల పంట
అరుణారుణ కాంతులన్నీ
అరచేతుల్లో వచ్చి చేరే ముచ్చట!
తొలకరి చినుకు తాకగానే
అణువణువూ నింపుకున్న కొంగ్రొత్త ఆశల చివుర్లతో
ఉషోదయ కిరణాల మెరుపును
ఎదనిండా ఒంపుకున్న గోరింట!
ఆకుపచ్చని జీవితాన్ని త్యాగిస్తూ
ఆడవారి కళ్ళలో ఆనందం ఉప్పొంగేలా
కొమ్మ లేకుండానే పూచే
కమనీయమైన దృశ్యం
రేతిరి కలలకు రూపమిచ్చి
సూర్య చంద్రులను దోసిట్లో నిండే సుందర రూపం!
8.
[15/07, 8:12 pm] +91 96528 32290: కవితా గానం
తేదీ: 15.07.2021.
అంశం: గోరింటాకు
రచన : గొర్రెపాటి శ్రీను
శీర్షిక : గోరింట
ఆషాఢ మాసం లో అమ్మాయిలు,మహిళలు విధిగా గోరింటాకు పెట్టుకుంటారు !
ఎర్రగా పండిన అరచేతులు చూసుకుని మురిసిపోతారు !
గోరింటాకు చేతులకి,కాళ్ళకి పెట్టుకోవడం
అందంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదని
పూర్వం నుండి పెద్దలు చెబుతున్న సత్యం ..!
మన తెలుగు లోగిళ్ళలో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాల్లో ఇదీ ఒకటి !
పెండ్లిలో "పెళ్లి కూతురి" ని మెహందీ తో అందమైన డిజైన్స్ తో అలంకరిస్తుంటే ..
నగల సింగారానికి తోడైన మెహందీ అందాలు
పెళ్ళికూతురి అందాన్ని రెట్టింపు చేస్తుంది !
ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకుని
భర్తతో ఎడబాటుకు గురై...
గోరింటాకు తో చేతులు ఎర్రగా పండితే తమ సౌభాగ్యానికి సంబరపడుతూ
భర్త క్షేమాన్ని తలుస్తుంటారు !
శుభసందర్భం ఏదైనా అతివలు మొదట అలంకారానికి వాడేది.. గోరింట !
"గోరింట" అను కవిత నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను.
9
[15/07, 8:16 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్2 )15/7/2021/ గురువారము
అంశము:- " గోరింట "
సీ! గోరింట పూసింది కొమ్మ లేకుండగ
అతివలకదిచేతి కందజేసె
ఆనందములదెచ్చె ఆషాఢమాసము
పచ్చని ఆకులు యిచ్చెనెరుపు
అరుణకాంతులతోడ నరచేతులన్నియు
భామలచేతుల భాగ్యమనగ
ఐదోతనమనుచును ఐశ్వర్యమనుచును
వయసుచూడరెపుడు వనితలంత
ఆ! అతివలంతబెట్టు నరికాలినందున
పతికిఆయువిచ్చు పండగాను
అందమైనపంట నరుదైన గోరింట
ఆడపిల్లలకును నందజేసె!
తరణికంటి సూర్యలక్ష్మి.
-------------
10
[15/07, 8:49 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం (సీజన్ 2) నిర్వహిస్తున్న కవితల సమాహారం
తేది:15-07-2021
అంశం: గోరింట
పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి:9505152560
***********************
అందానికి అందం చేకూర్చే ప్రకృతి నిచ్చే అద్భుతమైన వరం!
అతివల సొగసు చూడతరమా
అరచేతిలో ఎరుపు రంగు అద్దిన కలంకారీ నేర్పరితనం!
ఆషాఢ మాసంలో పెరిగిన ఆకుకొమ్మ
నవ వధువుల పాదాల పారాణిగా
చేతుల అరుణిమగా
అలరించు జాబిలిలా...
త్యాగమయీ అనురాగమయీ ఎరుపును పండించి
ఎరువుగా రాలిపోతావు
ఆకర్షణీయంగా అద్దుకుంటావు
అనురాగంతో అల్లుకుంటావు
చల్లదనం పెంచి ఉష్ణం తగ్గిస్తావు
వయసు ఉడిగిన
శిరసుల మీద నెరిసిన
శిరోజాల నెరుపుగ రంగరించు శోభ!
అన్ని వర్గాలకు ఆరాటం
ప్రతి ఇంటి పేరంటం
అతికి వున్నంత వరకు ప్రశాంతం
అంటుకుంటే సమ్మె ప్రారంభం!
***
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు ప్రసారం కాని ప్రచురణ కాని కాలేదు అని నేను హామీ ఇస్తున్నాను.
//సయ్యద్ జహీర్ అహ్మద్//
11
[15/07, 8:55 pm] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: గోరింట
తలపై పెట్టుకొని
చల్లదనం కలిగిస్తుంది
తల నొప్పిని తగ్గిస్తుంది
అతివలకు అందాలను ఇస్తుంది
🌃 వచ్చిందంటే ఆషాడం
గోరింటాకు కోసుకొని చక్కగా నూరుకొని పెట్టుకునే అతివల అందం కురుల చందమామ
అంత హాయి గా మారిపోతుంది
పూలన్నీ తురుముకున్న తలపై తళతళ మెరిసే
ఆ వెంట్రుకలు ఇంద్ర నీలాల మణులు
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453
ఇంద్ర నీలాల మనుషుల లా
12
[15/07, 8:12 pm] +91 96528 32290: కవితా గానం
తేదీ: 15.07.2021.
అంశం: గోరింటాకు
రచన : గొర్రెపాటి శ్రీను
శీర్షిక : గోరింట
ఆషాఢ మాసం లో అమ్మాయిలు,మహిళలు విధిగా గోరింటాకు పెట్టుకుంటారు !
ఎర్రగా పండిన అరచేతులు చూసుకుని మురిసిపోతారు !
గోరింటాకు చేతులకి,కాళ్ళకి పెట్టుకోవడం
అందంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదని
పూర్వం నుండి పెద్దలు చెబుతున్న సత్యం ..!
మన తెలుగు లోగిళ్ళలో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాల్లో ఇదీ ఒకటి !
పెండ్లిలో "పెళ్లి కూతురి" ని మెహందీ తో అందమైన డిజైన్స్ తో అలంకరిస్తుంటే ..
నగల సింగారానికి తోడైన మెహందీ అందాలు
పెళ్ళికూతురి అందాన్ని రెట్టింపు చేస్తుంది !
ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకుని
భర్తతో ఎడబాటుకు గురై...
గోరింటాకు తో చేతులు ఎర్రగా పండితే తమ సౌభాగ్యానికి సంబరపడుతూ
భర్త క్షేమాన్ని తలుస్తుంటారు !
శుభసందర్భం ఏదైనా అతివలు మొదట అలంకారానికి వాడేది.. గోరింట !
"గోరింట" అను కవిత నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను.
౧౩
[15/07, 8:16 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్2 )15/7/2021/ గురువారము
అంశము:- " గోరింట "
సీ! గోరింట పూసింది కొమ్మ లేకుండగ
అతివలకదిచేతి కందజేసె
ఆనందములదెచ్చె ఆషాఢమాసము
పచ్చని ఆకులు యిచ్చెనెరుపు
అరుణకాంతులతోడ నరచేతులన్నియు
భామలచేతుల భాగ్యమనగ
ఐదోతనమనుచును ఐశ్వర్యమనుచును
వయసుచూడరెపుడు వనితలంత
ఆ! అతివలంతబెట్టు నరికాలినందున
పతికిఆయువిచ్చు పండగాను
అందమైనపంట నరుదైన గోరింట
ఆడపిల్లలకును నందజేసె!
తరణికంటి సూర్యలక్ష్మి.
-------------
౧౪
[15/07, 8:49 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం (సీజన్ 2) నిర్వహిస్తున్న కవితల సమాహారం
తేది:15-07-2021
అంశం: గోరింట
పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి:9505152560
***********************
అందానికి అందం చేకూర్చే ప్రకృతి నిచ్చే అద్భుతమైన వరం!
అతివల సొగసు చూడతరమా
అరచేతిలో ఎరుపు రంగు అద్దిన కలంకారీ నేర్పరితనం!
ఆషాఢ మాసంలో పెరిగిన ఆకుకొమ్మ
నవ వధువుల పాదాల పారాణిగా
చేతుల అరుణిమగా
అలరించు జాబిలిలా...
త్యాగమయీ అనురాగమయీ ఎరుపును పండించి
ఎరువుగా రాలిపోతావు
ఆకర్షణీయంగా అద్దుకుంటావు
అనురాగంతో అల్లుకుంటావు
చల్లదనం పెంచి ఉష్ణం తగ్గిస్తావు
వయసు ఉడిగిన
శిరసుల మీద నెరిసిన
శిరోజాల నెరుపుగ రంగరించు శోభ!
అన్ని వర్గాలకు ఆరాటం
ప్రతి ఇంటి పేరంటం
అతికి వున్నంత వరకు ప్రశాంతం
అంటుకుంటే సమ్మె ప్రారంభం!
***
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు ప్రసారం కాని ప్రచురణ కాని కాలేదు అని నేను హామీ ఇస్తున్నాను.
//సయ్యద్ జహీర్ అహ్మద్//
[15/07, 8:55 pm] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: గోరింట
తలపై పెట్టుకొని
చల్లదనం కలిగిస్తుంది
తల నొప్పిని తగ్గిస్తుంది
అతివలకు అందాలను ఇస్తుంది
🌃 వచ్చిందంటే ఆషాడం
గోరింటాకు కోసుకొని చక్కగా నూరుకొని పెట్టుకునే అతివల అందం కురుల చందమామ
అంత హాయి గా మారిపోతుంది
పూలన్నీ తురుముకున్న తలపై తళతళ మెరిసే
ఆ వెంట్రుకలు ఇంద్ర నీలాల మణులు
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453
ఇంద్ర నీలాల మనుషుల లా
13
*కవితా గానం సీజన్ 2*
తేదీ:15-07-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: గోరింటాకు
**********†*******†***
ఆకుల మాటున అణిగిమణిగిన
చిన్ని చిన్ని ఆకుల చిత్రమైన రూపం
ముట్టుకుంటే మెత్తని ముల్లుతో చేసుకునే ఆత్మ రక్షణం..
ఆ భగవంతుని వద్ద తెచ్చుకుందో వరం
మగువలకే తన జీవితం అంకితం కావాలని...
అరుణకాంతుల సోయగంతో
ఆషాఢం మాసాన
అతివల ప్రియ నేస్తమై..
సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ
అరచేతుల్లో నిండుగా పూచే *గోరింఠ*
రంగవల్లికయై అరచేతి ముంగిట్లో మురుస్తుంది..
ప్రేమ చిహ్నమై అనురాగం కురిపిస్తుంది..
ఔషధ దళమై అనేక రుగ్మతలను నయం చేస్తుంది!
ఆకాశంలో సూర్యునిలా
అరచేతుల్లో ఇనబింబమై ప్రకాశిస్తుంది..
నవవధూవరులకు
అందమైన మెహందీ..
కళ్ళు తిప్పుకోలేని అందాలతో....
గోరింటా! నిన్ను ఇష్టపడని వారు ఉంటారా పిల్లలు
అరచేతుల్లో ఆకాశమే కదిలివస్థుంది..
చుక్కల తోరణాలు కడుతూ
సూర్య చంద్రులను స్వాగతిస్తూ....
*వురిమళ్ల సునంద, ఖమ్మం*
14.
[16/07, 8:20 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం (సీజన్ 2) నిర్వహించు కవితల సమాహారం
అంశం: *_గోరింట_*
పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి: 9505152560
********************
*పండితే పండుగ*
తమలపాకు గుణం
పోక సున్నం మిళితమతేనే
నోరు ఎర్రగ పండు
గోరింట తమలపాకు
జాతులు వేరైనా ఎరుపుదనం ఇచ్చే గుణం ఒకటే!
గోరింట గోరంత అట్టి పెడితే
చేయి గనుక అద్దుకుంటే
చిత్రమైన ఎరుపు రంగు
మగువకైనా మగవానికైనా...
పెళ్ళిళ్ళ పేరంటాలకు
వధువు తోడు చెలికత్తెలకు అలంకార ప్రియం గోరింట....
ఆషాఢ మాసంలో ఉబికి వస్తున్న విరహంతో చేతులంతా రక్తవర్ణం
దాలుస్తుంది తనెలా
రాలిపోతానని!
తడి ఆకుగాని
పొడి ఆకుగాని
గోంగూర పచ్చడిలా
చేతులకు చరణాలకు
వింత శోభ నిస్తుంది!
తన ప్రాణాన్ని త్యాగించి
అరుణరాగం పలుకుతుంది
పీల్చి పిప్పి అయి
నేల రాలుతుంది!
కన్నె సొగసుల
వన్నె సోయగం తెచ్చిన అరవిరిసిన
మందార అందం...
కులం లేదు మతం లేదు దానికి
అహంలేదు వైరం లేదు దానికి
ఔషధంలో వేడి తగ్గించు వైఖరి
రంగవల్లులు అద్దడమే దాని ఉనికి
***
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు ప్రసారం కాని ప్రచురణ కాని కాలేదు అని నేను హామీ ఇస్తున్నాను.
//సయ్యద్ జహీర్ అహ్మద్//
15
[16/07, 8:42 pm] +91 73868 71200: కవితాగానం(సీజన్)2
అంశం:గోరింటాకు
ఆషాఢమాసం ఆరంభం
అతివలకు ఎంతో సంరంభం
పెరటిలో విరిసిన పచ్చదనం
అరచేతిలో పండిన అరుణవర్ణం
ఉదయిస్తున్న సూర్యుని ప్రతిబింబం
గౌరి ఇంటి ఆకుగా ప్రసిద్ధమైన గోరింటాకు
పెళ్లి పేరంటాలలో అలంకారప్రాయం
మహిళల సౌభాగ్యానికి చిహ్నం
గర్భాశయ దోషాలను తొలగించి,
శరీర ఊష్ణ సమతుల్యతను కాపాడే,
ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ గోరింటాకు అందానికి,ఆరోగ్యానికి ఆలంబనం
గుండ్ల సౌజన్య
చరవాణి:7386871200
16.
[
[16/07, 9:08 pm] అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు Poet Vizag: కవితాగానం( సీజన్2)
శీర్షిక:- గోరింటాకు
............................
ఆషాడం వచ్చిందంటే
అతివలకు ఆనందం
బాల్యంలో ప్రతి ఇంటా
గోరింట ఉండేది
నానమ్మ రుబ్బురోలు లో
గోరింటాకు వేసి మెత్తగా
రుబ్బి చిట్టీ నీ చెయ్యి ఇవ్వు అని మధ్యలో గుండ్రటి చందమామ చుట్టూ నక్షత్రాలు
రెండు చేతులకే గాక
రెండు పాదాలకు పెట్టి
డాబా పై నులకమంచం పై నానమ్మ తో పాటు కబుర్లు చెబుతూ పడుకునే సమయానికి గోరింట తీసి
బావిదగ్గర అమ్మ కడిగి
ఎర్రగా పండటం చూసి
పండంటి మొగుడు వస్తాడని చెప్పడం
మధురమైన జ్ఞాపకాలు...!!
అట్లతద్ది ముందురోజు
గోరింట పెట్టుకుని
ఆకు,సున్నం కలిపిన తమలపాకు నమలి
ఊయల ఊగినపుడు
నోరు,చెయ్యి ఎర్రగా పండిన వాళ్ళకు అందమైన ,ఐశ్వర్యం గల భర్త వస్తాడని పంకజం పిన్ని అన్న మాటలు
ఇప్పటికి జ్ఞాపకమే
పెళ్ళి, పేరంటాలలో
గోరింట అలంకరణ
అతివలకు ఆనందం
సౌభాగ్యానికి ప్రతీక....!!
.............................
పేరు:-
అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
9963265762
..............................
హామీపత్రం:-
ఇది నా స్వీయకవిత దేనికి అనువాదం కాదు
.................................
17
[16/07, 9:08 pm] పిన్నక నాగేశ్వరరావు గారు Poet: కవితా గానం (సీజన్ 2). 16--7--2021.
పిన్నక నాగేశ్వరరావు.
అంశము :-- గోరింటాకు.
1. తేటగీతి.
పెట్టుకొందురు గోరింట పెండ్లినాడు
మహిళలందరు తప్పక గృహములందు
కాళ్లు, చేతులకును నలంకారముగను
వివిధ ప్రక్రియలందున వింత గొలుప.
2. తేటగీతి.
తరుణు లాషాఢమందున తప్పకుండ
పెట్టుకొన వలయుననుచు పెద్దలనుట
కారణమ్ము గలదు, వర్ష కాలమందు
తఱచు కాలు,సేతులు కూడ తడచుచుండు.
3. తేటగీతి.
చర్మ వ్యాధులు కలుగుచు సహజ రీతి
నఖములున్ దెబ్బతినుచుండ నపుడుపలుచ
గాను గోరింట నట పెట్టగాను నదియె
వ్యాధులను దూరమున్ జేయు నౌషధమగు.
4. తేటగీతి.
ఒంటి వేడి తగ్గించు గోరింట గుణము
దోషముల బారి పడకుండ దూరముంచు
చర్మమునకు కలుగజేయు సహజ రంగు
నెఱుపు "లాసోన్" రసాయన మెలయు గాన.
5. తేటగీతి.
వేర్లు, పూవులు, బెరడును విత్తనములు
పొడియు నూనెల రూపాన పొందుగాను
ఔషధములను రోగుల కందజేసి
వాడుచున్నారు వైద్యులు వ్యాధులకును.
***********************************
19
[16/07, 9:17 pm] Aparajith: గోరింటాకు,,,,,!
ఆడవాళ్ళు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాక
గోరింటాకు రోట్లో మెత్తగా నూరి
అరచేతుల్లో రక రకాలు డిజైన్లలో పెట్టుకుంటారు
గోళ్ళ నిండుగా గోరింటాకు పెట్టుకుని
ఆషాడమాస శోభతో చేతులు ఎర్రగా దుర పండే వరకు ,,,,,,,,,,,,,,,
అమ్మగారింట్లో అత్తారింటి కబుర్లతో కాలక్షేపం చేస్తారు
తరువాత చేతులు కడుగుకొని మురిసిపోతారు
అందాల భరినెలు ఆడపిల్లలు గోరింటాకు ద్విగునీకృతం చేస్తుంది
తమ అత్తారింట్లోని కష్ట సుఖాలను నెమరువేసుకుంటూ,,,,,,,!
తమ భర్తలకు దూరంగా తల్లిగారి ఇళ్లల్లో
తమ తోటి స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చెయ్యడం
ఓ ఆనందాల హరివిల్లు సొయగం
గోరింట పూచిన చేతుల నిండా కడివెడు కన్నీళ్ళు
కొందరి ఆడపడుచుల జీవితాల్లో
మోదమయినా ప్రమోదమైనా గోరింట అరమరికలు లేని అనుభవాలను చవిచూపిస్తుంది
ఆపరాజిత్
20
[16/07, 9:19 pm] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: *** హమేషా గోరింటాకు***
✍️డా.పాండాల.
తల్లి గారింటి తాహతు గోరింటాకు
అరచేతులు ఎర్రగా పండాయంటే ఎంతో గౌరవం...!
అమ్మమ్మలు మనవరాళ్ళ గోరింట రంగుల్ని చూసి ముచ్చెట్లతో
మునిగి తేలేవారు
గోరింటాకు ఆడతనానికి గౌరవాలంకార ప్రతీక...!
చిన్నప్పటి జ్ఞాపకాలు
చుట్టుపక్కల వాళ్ళచలాకి కలివిడి అనుభూతులకు నిదర్శనం...!
తల్లి గారింట స్థానం మారినా గుణంశాశ్వతమైనది
అనుబంధాన్ని పదిల పరచేది
మైదాకుస్థానం...!
ఆకును దంచి పెట్టుకున్న అగచాట్ల కోలాహలం
తలచినప్పుడల్లా తన్మయత్వ భావన
తళుక్కుమంటది మనసంతా ఆహ్లాదమయంగా...!
ఎర్రటి అరచేతి వేళ్ళను
ఎంతోసంతోషంగ ఇంట్లో అందరికీ చూపుతూ మురిపాలమాటల వన్నెచిన్నెల మయూరినడకలో
జింకల ఎగురుతూ
ఎవరికెలా?పండిందో !గారాభంగ పోల్చుకుంటూ..
పొర్లిపొర్లిన ఆనందం అలుగుదుంకిన నీళ్ళలా మాటల వరవడి
ఓ తమాషా ఉంటుంది హమేషా!
మైదాకుచెట్టు వళ్ళంతా ముళ్ళున్నా
ఆకుల అంతరాత్మ భావనంత ప్రాతఃసంధ్యా ఎరుపుమయం
కరాలందానికి కురుల సౌశీల్యానికి
శరీరచలువకూ మూలబలమై జీవనంరంగుల వనంగా
మార్చేమైదాకు
మనిషి శరీరమానసిక తత్త్వాన్ని తెలుపుతుందని నానమ్మలు నవ్వుతూ చెప్పినా నిజమేకదా...!
ఆషాడమాసం మహిమ
అవనిలో పెక్కు మార్పుల్ని తెస్తుంది ఋతువులతో బతుకుల మార్పులు సహజమే కదా..!
సర్వం శ్రేయం శుభంకరం...!
✍️డా.పాండాల మహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి.
20
కవితాగానం సీజన్ 2.
*జంపని శ్రీనివాసమూర్తి* ( *జలజ* )🦜
గుంటూరు.
తేది : 16 - 7 - 2021
సెల్: 80742 97465
అంశము:,, *గోరింట*
శీర్షిక: *వలపు - పిలుపు*
రవికిరణం సోకగానే
కొలనులోని తామరకు ఆనందం.
గోరింట ఎరుపు తాకగానే
స్త్రీ చేతికి అనంత మురిపెం.
ముంగిట్లో వెన్నెల పక్కవేయగా
మురిసే సోయగాల ప్రకృతిలా
అరచేతిలో గోరింట పాన్పు
మదిలో గిలిగింతల వసంతాలు.
వలపు శిఖరాలకు నగషీ *గోరింట*
అలతి మెచ్చే సొగసరి *ఆకు*
ప్రకృతి ఇచ్చిన సౌభాగ్య చిహ్నం
కరచరణాల మెరుపుల ఆభరణం.
ఆరీ ఆరని చేతి గోరింట వాసన
ఊహల పల్లకిలో విహారపు జోరు
దిష్టి దోషాలకు అరికాలిలో బొట్టు
అది ఆరోగ్యాలకు ఖనిజాల పెట్టు.
పెదవి చిలకరించు చిరునవ్వులకు
అరచేతి అరుణ తివాచీపై
గోరింట ఎరుపు చేతి వ్రేళ్ళ నృత్యాలు
మురిపించే, మరిపించే
అరమోడ్పు నయనాలను *గోరింట ఎరుపు*.
21
కవితాగానం సీజన్ 2.
*జంపని శ్రీనివాసమూర్తి* ( *జలజ* )🦜
గుంటూరు.
తేది : 16 - 7 - 2021
సెల్: 80742 97465
అంశము:,, *గోరింట*
శీర్షిక: *వలపు - పిలుపు*
రవికిరణం సోకగానే
కొలనులోని తామరకు ఆనందం.
గోరింట ఎరుపు తాకగానే
స్త్రీ చేతికి అనంత మురిపెం.
ముంగిట్లో వెన్నెల పక్కవేయగా
మురిసే సోయగాల ప్రకృతిలా
అరచేతిలో గోరింట పాన్పు
మదిలో గిలిగింతల వసంతాలు.
వలపు శిఖరాలకు నగషీ *గోరింట*
అలతి మెచ్చే సొగసరి *ఆకు*
ప్రకృతి ఇచ్చిన సౌభాగ్య చిహ్నం
కరచరణాల మెరుపుల ఆభరణం.
ఆరీ ఆరని చేతి గోరింట వాసన
ఊహల పల్లకిలో విహారపు జోరు
దిష్టి దోషాలకు అరికాలిలో బొట్టు
అది ఆరోగ్యాలకు ఖనిజాల పెట్టు.
పెదవి చిలకరించు చిరునవ్వులకు
అరచేతి అరుణ తివాచీపై
గోరింట ఎరుపు చేతి వ్రేళ్ళ నృత్యాలు
మురిపించే, మరిపించే
అరమోడ్పు నయనాలను *గోరింట ఎరుపు*.
22.
*కవితా గానం సీజన్ 2*
తేదీ:16-07-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం గోరింటాకు
*******************
తమలపాకును చూసి గోరింటాకు అసూయ పడిందేమో..
నమిలిన నోరు ఎర్రగవుతుంటే చూసిందేమో..
ఆషాఢమాసాన్ని మొక్కు కుందేమో
తలరాతల విధాతను వేడుకుందేమో
పచ్చదనం ఆత్మలో ఎరుపుదనం కావాలనీ..
ఆడపిల్లల అరచేతుల్లో అందంగా కనిపించాలని
అరుణారుణ వన్నెతో చూపరులను ఆకట్టుకోవాలనీ
పెట్టుకున్న అరచేతులకు సొగసులద్దాలనీ
ముగ్ధ మనోహరంగా ముదితల
మదిని దోచుకోవాలని..
గోరింటా నీ మనసే మమతల పంట
23
*కవితా గానం సీజన్ 2*
తేదీ:16-07-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం గోరింటాకు
*******************
తమలపాకును చూసి గోరింటాకు అసూయ పడిందేమో..
నమిలిన నోరు ఎర్రగవుతుంటే చూసిందేమో..
ఆషాఢమాసాన్ని మొక్కు కుందేమో
తలరాతల విధాతను వేడుకుందేమో
పచ్చదనం ఆత్మలో ఎరుపుదనం కావాలనీ..
ఆడపిల్లల అరచేతుల్లో అందంగా కనిపించాలని
అరుణారుణ వన్నెతో చూపరులను ఆకట్టుకోవాలనీ
పెట్టుకున్న అరచేతులకు సొగసులద్దాలనీ
ముగ్ధ మనోహరంగా ముదితల
మదిని దోచుకోవాలని..
గోరింటా నీ మనసే మమతల పంట
23
కవనజ్యోతి కవిసమయం
అంశం: గోరింటాకు
శీర్షిక: మగువ నేస్తం
మహిళల మనసుదోచే అలంకారం
మది మెచ్చే మనిమాణిక్యం
ఆషాఢమాస అతిధి
అతివ చేతినిండా చేరి మెరిసిపోయే
మగువ మెరిసిపోయే సొగసైన సౌందర్యం..గోరింటాకు
పెళ్లికి,సీమంతానికి పెద్దపీట వేస్తూ
మెహంది హొయలతో
స్త్రీ ల ఆనంద సవ్వడులతో
పెళ్లింట్లో మేళాల సందళ్ళతో మారుమ్రోగును
వయ్యారోలీకే నెలతకు
సొగసైన చేతలకు
సౌందర్యాలద్దే తొడుగులు గోరింటాకే మరి
శుభాకార్యాలకు, పూజలకు మందరాంల మెరిసిపోయే సింధురవర్ణం సిరి
ప్రతి మగువ ప్రీతిపాత్రమైన కానుక గోరింటాకు
సంస్కృతి..సంప్రదాయాలలో..చేరిక
గోరింటాకు
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
గాజుల భారతి శ్రీనివాస్
ఖమ్మం
9849788108
******************
24
అంశం :గోరింటాకు
శీర్షిక :అరుణిమ
తొలకరి చినుకులతో
తొణికిసలాడిన
ప్రకృతి అందాలను
పొదువుకున్న ఆకృతి
అతివల అందమైన అరచేతులకు
అరుణిమల సొబగులద్దే గోరింటాకుకు
ఎన్నెన్ని వగలో!!
కన్నెల కలలు పండించ
గన్నేరు వన్నెలై...
నవ వధువు ఎదలో
మంకెనమరులై...
శ్రీమతి అరచేత
సిందూరపు సిరులై...
మునివేళ్లను మురిపిస్తూ..
పాదాలను మెరిపిస్తూ..
అప్పుడప్పుడు..
నాన్న కోపాన్ని తగ్గించడానికి
అమ్మ చేతిలో పండిన
శాంతి మంత్రమై....
పరీక్ష.. రక్షా అన్నీ తానైన
ఆషాఢపు ఆనవాయితీ..
అరచేతిలో పండుతూ
ఇంటింటా పండగై
అంబరాన్ని దింపిన
ఆకుపచ్చని ఐశ్వర్యమై...
గోరంత గోరింట సంబరాలు
సంప్రదాయపు సౌరభాలు
********శివునూరి లలితాకృష్ణ
Comments
Post a Comment