నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
*****************************"****
కవి వరుల జాబితా
1.కొంపెల్లి రామయ్య గారు
2.దోసపాటి వెంకటరామచంద్రరావు గారు
3.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
4.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
5.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
6.తిప్పావఝల నరసింహ మూర్తి గారు
7.మేకల రామస్వామి గారు
8.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు
9.ముత్యం వెంకటేశ్వరరావు గారు
10.మొహమ్మద్ అఫ్సర వలీషా గారు
11.మద్ది పుల్లారావు గారు
12.తరణికంటి సూర్య లక్ష్మి గారు
13.డాక్టర్ ఆంజనేయులు గారు
14.కవిత వెంకటేశ్వర్లు గారు
15.కవిత వెంకటేశ్వర్లు గారు
16.ఎ.భూపతి గారు
17.కోరాడ గారు
18.పిన్నక నాగేశ్వరరావు గారు
19.వనపర్తి గంగాధర్ గారు
20.సునంద వురిమళ్ల ఖమ్మం గారు
21.తాతపూడి సోమశేఖర శర్మ గారు
22.నీలా రంగనాధం గారు
23.ఆపరాజిత్ గారు
24.జంపని శ్రీనివాస మూర్తి గారు
25.మన్నెలలిత గారు
****************
1
అంశం:మనోబలం
శీర్షిక: మనోబలం మించిన మందు లేదు
_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం
ప్రతి మనిషి జీవితంలో
చీకటి వెలుగు ఎలాగో
గెలుపు ఓటములు
ఆటు పోటులు
కష్ట సుఖాలు
ఎత్తు పల్లాలు
సహజ సిద్ధమైనవి
వీటికి భయ పడ్డావో
సమస్యల సుడిగుండంలో
కూరుకు పోయి నామ రూపాల్లేకుండా కొట్టుకు పోతాం
అందుకే మనిషికి మనోబలం మించిన మందు లేదు...!
కష్టాలు మనిషికి రాకపోతే మాను కొస్తాయా
సూర్యుడు ఉదయించడం ఎంత సహజమో
సాయంకాలానికి అస్తమించడం
అంతే సహజం
మొదటి అడుగు ఎంత తడబడు తుందో
తరువాతి అడుగు ముందుకు సాగుతూ ఉంటుంది
అందుకే మనిషికి మనోబలం మించిన మందు లేదు...!
వంద మైల్లైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది
ధైర్యం తో సాగితే ఆటంకాలు మనకు తివాచీలై స్వాగతం పలుకుతాయి
అందుకే మనిషికి మనోబలం మించిన మందు లేదు...!
విజయం నీ లక్యమైతే
గెలుపు నీ వాకిట సెల్యూట్ చేసి నిలబడుతుంది
మనుగడ కోసం పోరాటం నీ నిర్ణయమైతే
అంతిమ జయ కేతనం
ఆకాశంలో రెపెరెపెలాడుతుంది
అందుకే మనిషికి మనోబలం మించిన మందు లేదు...!
కన్నీటి సంద్రం నీ కంటి రెప్పలను అలలతో స్పర్శిస్తే
పడిలేచే కడలి తరంగం
పిడికిలి బిగించి విజయ తీరాలకు చేరుస్తుంది
అందుకే మనిషికి మనోబలం మించిన మందు లేదు
అనారోగ్యం నిన్ను దహించి వేస్తుంటే
మానసిక ఉల్లాసం నిన్ను ఇంద్ర ధనుస్సు ఉయాలలో నిద్రపుచ్చుతుంటే
మనస్సు తేలికై పోతుంది
అందుకే మనిషికి మనోబలం మించిన మందు లేదు
ముసలి తల్లి దండ్రులను అనాధాశ్రమాల్లో ఉంచి
అందరుండి అనాథలను చేస్తుంటే
ఆదుకునే ధర్మాత్ములు ఆశ్రమం కలిపించి తల్లి దండ్రులు గా ఆదుకుంటున్నారు
అందుకే మనిషికి మనోబలం మించిన మందు లేదు
ప్రపంచంలో మనో బలం మించన మందులేదు
ఆరోగ్యం కన్న ధనం లేదు...!
హామీ పత్రం
ఈ కవిత నా స్వయ రచన అని హామీ ఇస్తున్నాను
2
తేది30072021,శుక్రవారం
అంశం:మనోబలం
శీర్షిక:ఆత్మశక్తి
ధనమెంతవున్న నీకు సరిపోదు
దానమెంతచేసినా పొందలేవు
కండబలం నీకు బలంకాదు
వాపుబలంకాదు
శక్తికన్న యుక్తిమేలు
శక్తి అనగ ఆత్మశక్తియే మేలు
మనోబలమున్న కొండను డీకొనగలవు
సముద్రపులోతును తెలుసుకొనగలవు
అంతరిక్షమునందు విహరింపగలవు
హిమాలమునెక్కగలవు
జబ్బుచేసిందని మందులెన్ని వాడినా
మనోబలము లేకున్న అవి పనిచేయవు సుమా
మానసిధౌర్యమే మంచి ఆరోగ్యకరము
మనోనిబ్బరమే మంచి ఔషదము
కష్టనష్టములందు ధనము పోవును
మనోబలమున్న మళ్ళి పొందవచ్చును
కావడికుండలే సుఖదుఃఖాలు
మనసును చిక్కబెట్టిన దాట వచ్చును
ఆత్మీయులెందరున్నను అవసరమునకాదుకొనరు
సన్నిహితుడొక్కడున్న చాలును
హితుడిచ్చిన మనోబలమె నీకు తోడుండును
ఆపదలో అక్కరకు వచ్చేది ఆత్మబలమే!
ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం,శ్రీకాకుళంజిల్లా
చరవాణి7780594995
3
నేటి అంశం.
కవితాగానం
మనో బలం
******"****
మనిషికి
మనోబలం అద్భుతమైన ఆయుధం
కఠిన పాషాణాన్ని సైతం పాలమీగడలా
మలచగల మంత్రం
మద గజాశ్వాల నధిరోహించి. దౌడు తీయగల నైపుణ్యం
వేద వేదాంగాలన్నిటిని ఔపోసన
పట్టిన చాతుర్యం. మనోబల విన్యాసాలె
మహాభారతం భాగవతం రామాయణం ఉద్గ్రంధాల
రచనా వ్యాసంగం
మనోబలానికి తార్కాణం
అసాధ్యాలను సుసాధ్యం చేసిన
శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు
మానవ మేధస్సుకు వారి మనోబలనికి
మైలు రాళ్ళు
ఉత్తుంగ తరంగాలై యెగిసి పడె సాగరాన్ని అవలీలగా ఈదగలిగే
సామర్ధ్యం
అంతరిక్షంలో సుదూర గ్రహాల శోధించడం చంద్రుడి మీద మనుషుల
దింపడం , మనుషులు దిగటం
మనోబలమే
జైల్లో బంధించినా దేశం కోసం పండ్ల బుట్టలో కూర్చోని తప్పించుకున్న
సాహసం
ఒడ నుంచి దూకి సముద్రం లంఘించి
తప్పించుకున్న ఈ దేశ వీరుడి రోషం పౌరుషం
శాంతి అహింస సత్యము ధర్మము
సత్యాగ్రహం వజ్ర సంకల్పం ఇదే
మనోబలం ఎగరేసింది జయ కేతనం
స్వీయ రచన:::కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.3072021
4
[30/07, 8:09 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవన గానం సీజన్ 2 నిర్వహించు కవితా మాలిక
అంశం: మనో బలం
పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
*ఆత్మస్థైర్యం*
ముందడుగు వేసే ప్రతి అడుగుకు అనంతమైన ఆత్మవిశ్వాసం కావాలి!
పిరికితనం వెనక్కులాగకుండా ముందుకు త్రోసే మంత్రదండం ఒకటుండాలి
ఉత్సాహం ఊపిరిగా జీవించిన బతుకులో
ఒంటరి పోరాటంలో
ధైర్యమే మహత్తర ఆయుధం
సన్నిహితుడైన సహధర్మచారిణియైన
గుప్పెడు సహకారం అందించగలిగితే ఎదురేముందీ!
కొండల్ని పిండి చేసే
సంకల్పం గుండె నిబ్బరంకు తలవంచాల్సిందే!
***
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు ప్రసారం కాని ప్రచురణ కాని కాలేదు అని నేను హామీ ఇస్తున్నాను.
//సయ్యద్ జహీర్ అహ్మద్//
5.
అంశం; మనోబలం
శీర్షిక:
"" కృషితో నాస్తి దుర్భిక్షం ""
మానవ జీవన పోరాటం
నిత్యం సమస్యలమయం
ఆరాట పోరాటాల
ఉరుకుల పరుగుల జీవన పందెంలో
జయాపజయాలు సహజం
ఆ సహజపు నిత్యకృత్యంలో
కష్టాలకు కృంగక
సుఖాలను పొంగక
మనోధైర్యాన్ని కోల్పోక
మొక్కవోని మనోబలంతో
పడి లేచే తరంగాల స్పూర్తితో
విజయం సాధించే వరకు విశ్రమించక
శ్రమనే ఆయుధంగా చేసుకుని
ఎడిగేకొద్ది ఒదిగి ఉంటూ
ఎదిగొచ్చిన మూలాలను మరువక
స్వయంకృషితో స్వయం ప్రకాశకులమై
మనోబలంతో సమస్యలను ఎదుర్కొందాం
కృషితో నాస్తి దుర్భిక్షమని చాటుదాం!
...........................................
రచన
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం
చరవాని సంఖ్య; 7416638823
........................................
పై వచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను
6
[30/07, 8:32 pm] తిప్పావఝల నరసింహ మూర్తి Poet Nellore: మనోబలం తో మానసిక ఒత్తిడి అ వుతుంది మాయం.
మనోబలం శూన్యమయితే ఆత్మహత్యలే శరణ్యం.
మిన్నువిరిగి మీద పడ్డా చాలించారు కొందరు.
కొండలపై నా పిండి చేయగలం
అనే నమ్మకముంటుంది కొందరికి
జీవితంలో ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని నిలబడగలరు మరి కొందరు.
మనోబలం ఉంటేనే సమాజంలో మనుగడ.
రైతన్నలు చేస్తారు చిన్న చిన్న అప్పులు పాపం.
మనోబలం లేకుండా భయంతో చేసుకొంటారు ఆత్మ హత్యలు.
ప్రతి సమస్య కు ఉంటుంది పరిష్కారం.
మనోబలం తోనే పరిష్కారం లభ్యం.
రండిరా,కల్చుకొండిరా అని చొక్కా గుండీలు విప్పి గుండె లిచ్చిన ప్రకాశం పంతులు
కావాలి. మనందరికీ ఆదర్శం.
కవితా గానం30-7-2021
శీర్షిక ,: మనోబలం
తిప్పా వఝల నరసింహమూర్తి
బుచ్చిరెడ్డి పాలెం.నెల్లూరుజిల్లా
[30/07, 8:47 pm] Mekala Ramaswamy Poet: నా బలం మనోబలం
*****************
క్షణక్షణం ఆరాటంతో
అనుక్షణం పోరాటంతో
ఏదో చేయాలని తలుస్తూ
మరేదో సాధించాలని నిలుస్తూ
గుహల నుండి మహలు దాకా
ఎదిగినవైనానికి
అడుసునుండి అంతఃరిక్షము దాకా
ఎగిరిన జవనానికి
మనోబలమేను ఆయువుపట్టు
నిత్యాన్వేషణతో తెలుసుకునే గుట్టు
దైనందిన జీవితంలో
ఎదురుదెబ్బలు తగిలితే
బ్రతుకు సమరంలో
యోచించినది జరగకపోతే
క్రుంగి కృశించి నీరసించి
కుంఠనంతో క్రుంగినా
మనసు విచలితమై
తునాతునాకలైనా
వెలుగు దారి చూపేది
వేకువ జాడ తెలిపేది
వెన్నుతట్టి ప్రోత్సహించేది
ఉన్నతంగా నిలపెట్టేది
ఎదలో ఉబికిన మనోబలం
మదిలో మెదిలిన ఆత్మస్థైర్యం
ఎన్ని పోయినా మరెన్ని దూరమైనా
ఉన్నవన్ని ఊడ్చుకొనిపోయినా
సన్నని ఆశగా రేకెత్తి
మన్నన దిశగా వేలెత్తి
పునరుజ్జీవనం కలిగించే
పునర్బలనం అందించే
ఒకే ఒక రసగుళిక
అదే మనోబలమనే ఔషదగుళిక
వీడొద్దు మనోబలాన్ని
విడనాడొద్దు ఆత్మస్థైర్యాన్ని
************************
మేకల రామస్వామి- చెన్నూర్
8.
అంశం: మనోబలం
శీర్షిక: దైవబలం
...
మనోబలం
మనసులో జనించిన బలం
ఇది దైవబలం
దేహబలం ఎంతున్నా
బుద్ధి బలం ఎంతున్నా
మనోబలం ముందు దిగదుడుపే
పురాణాలు పరిశీలించినా
చరిత్ర తిరగేసినా
ఎందరో మహానుభావులు
ఎందరో మహాపురుషులు
మనోబలం సాయంతో
విజయాలు సాధించిన వాళ్ళే
మనోబలం తోడుగా
శతయోజనాలు లంఘించి
లంకను చేరుకుని
లంకాదహనం చేసే మారుతి
నాటి మన ప్రధాని శాస్త్రి
పొట్టవాడైతేనేమి
గట్టివాడే
మనోబలం సాయంతో
దాయాది దేశానికి
బుద్ధి చెప్పిన ధీశాలి
మనోబలంతోనే
వైకల్యాన్ని జయించిన
దివ్యాంగులెందరో
...
హామీ పత్రం
...
ఈ కవిత నా స్వంత రచన
...
గజవెళ్ళి శ్రీనివాసాచారి
కాజీపేట హన్మకొండ జిల్లా
9.
[( సీజన్ 2)
నేటి అంశం: మనోబలం
***********************
శీర్షిక: ఆత్మ విశ్వాసం
ఆత్మ విశ్వాసమే ముందుకు నడిపిస్తుంది
మనోబలం ఉంటే చీకటిని పారద్రోలి
జ్ఞాన జ్యోతులు వెలిగించవచ్చు
సప్త సముద్రాలను దాటవచ్చు
ఆటుపోట్లను ఎదురించ వచ్చు
బంధాలను కలపవచ్చు
ఆత్మీయులను అనురాగం పంచవచ్చు
అభాగ్యులకు ఆదరించవచ్చు
భయమే బద్ద శత్రువు
భయపడితే అది నిన్ను బస్మం చేస్తుంది
భయాన్ని వీడి ధైత్యంతో జీవించు
మనోబలమే మనిషికి రక్షణ కవచం
ఆత్మ విశ్వాసమే నీకు ఆయుధం
ఆయుధంతో ముందుకు పయనించు
ఆనందంతో విజయాన్ని సాధించు!
******************************
ముత్యం వెంకటేశ్వరరావు
గురజాల, గుంటూరు జిల్లా
చరవాణి: 7997840591
హామీపత్రం: ఈ రచన నా స్వీయ రచన ఎటువంటి అనువాదం కానీ అనుకరణ కాదని హామీ ఇస్తున్నాను
౧౦
[30/07, 9:21 pm] అఫ్సర్ వలీషా గారు: కవితా గానం (సీజన్ 2)
అంశం....మనోబలం
శీర్షిక....ధైర్యపు చెప్పులు
ఆత్మీయ ఆలింగనాలు
అల్లంత దూరాన విసిరేసి
చేతులెత్తి దండం పెడుతున్నాం...
ఆప్యాయతల అల్లికలు
విడదీసుకుని పరిగెడుతున్నాం...
కలలతో కదలని ఒంటరి మౌనంతో
ఊహకందని ఉదాసీనతతో
బరువుకాని బరువేదో మోస్తూ
కంటి రెప్పలపై దైన్య చిత్రాలను గీస్తున్నాం...
దయా జాలి లేకుండా
మరణ మృదంగాన్ని
మ్రోగిస్తున్న కరోనా
భయభ్రాంతులు కలిగిస్తున్నా...
కంటికి కనబడని కరోనా శత్రువుతో
ఆగని పయనానికి అంతిమ ఘడియ ఏనాడో తెలియక పోయినా....
భౌతిక దూరం పాటిద్దాం
ముఖాన మాస్క్ ధరిద్దాం
శానిటర్ రాసేద్దాం
ఆత్మ విశ్వాసపు పునాదులు కడదాం....
గుండె గడులను పెనవేసుకున్న
దిగులు నరాల తంత్రులు
లాగేసి సంతోష ముడులు వేద్దాం....
మూగబోయిన మనసు వీణను
సుమధుర భావాల మరమ్మతు చేద్దాం....
అందరూ మనోబలపు ధైర్యపు చెప్పులు ధరిస్తే
తలచుకుంటే ఏమైనా చేయగలిగే మానవ శక్తి యుక్తుల ముందు
తోక ముడవదా కరోనా తిరోగమనంతో తిరిగి రాని లోకాలకు....!!
హామీ....నమస్తే ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను 🙏
మొహమ్మద్. అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ గో జి)
౧౧
[31/07, 8:01 pm] +91 99512 87113: కవితాగానం
మద్ది. పుల్లారావు
నందిగామ
శీర్షిక:మనోబలం
వచనకవిత
తేదీ:31-7-2021
--- ----------
మనోబలం మనుజులకు నిలకడనిచ్చు
సర్వసంపదలున్నా
కండబలమెంతున్నా
బంధుగణములున్నా
ప్రాణస్నేహితులున్నా
మనోబలం లేని మనుజుడు
దేనినీ సాదించలేడనుట నిక్కము
మనోబలం లోపించిన గాండీవికి
మాధవుడు మార్గదర్శనం చేసెను
మనోబలమే మనుజుని నిజబలము
మనోబలముతో ఎంత ఆపదలనైనా దాటవచ్చు
మనోబలంతో చుట్టూ గల చీకట్లు పారద్రోలవచ్చు
మనోబలం తో అసాధ్యాలు సుసాధ్యాలవుతాయి
మనోబలం ఆనందమయజీవితానికి వారది
మనోబలాన్ని కలిగి ఉందాం
జీవితాలను సుసంపన్నం చేసుకుందాం.
- --
ఇది నా స్వీయరచన.
౧౨
[31/07, 8:24 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్ 2 ) 31/7/2021/ శనివారం
అంసం:- " మనోబలం "
సీ! మనసున పుట్టిన మన మనో ధైర్యమే
అన్నివేళలయందు నండదండ
ఆత్మబలముతోడ నవరోధములనన్ని
దాటుకురావచ్చు ధీటుగాను
మనపనులన్నియు మనమనోబలమున
నెరవేర్చుకొనగాను నేర్పుగలుగు
అంగవైకల్యము నాత్మలోగాంచకు
తొలగించునీమనో బలముతోడ
ఆ! ఒంటరితనమందు వోర్పుమ నోబల
మంత, గలుగజేయు మార్గ మెరుగు
మనమనోబలమున మనవిజయంబును
తప్పకనెరవేరు తద్యమెపుడు!
తరణికంటి సూర్యలక్ష్మి.
౧౩
----------
[31/07, 8:32 pm] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: మనోబలం
మనిషి ఇ ఒంటరిగానే
ఎంత దూరమైనా వెళ్ళవచ్చు దానికి మనోబలం కావాలి
బుద్ధిబలంతో అయితే
మనోబలం రెట్టింపవుతోంది
మనసు లోపల బలం లేకపోతే ఏ కార్యాన్ని సంపత్ వంతంగా చేయలేం
విశ్వ మానవులంతా విశ్వాసంతో మనోబలంతో అంతరిక్షంలోకి చంద్రమండలంలో కి పోతున్నారు రాకెట్లతో
అగాధము లోతుల్లోకి అరేబియా సముద్రం లోకి మనోబలం తోనే గజ ఈతగాళ్లు లోపల ఉన్న సమస్త వస్తువులను బయటికి తీసుకుని వస్తున్నారు
ఈ విశ్వంలో హెలెన్ కిల్లర్
మరో శాస్త్రవేత్త అయిన అంగవైకల్యాన్ని లెక్కచేయక
మనోబలం తోనే జీవించారు కొత్త విషయాలను కొత్త శాస్త్రీయ అంశాలను కనిపెట్టిన టువంటి
మహనీయులు మహానుభావులు ఈ విశ్వానికి గుర్తుంచుకోవాలి ఎవరైనా
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453 🌞
౧౪
[31/07, 8:33 pm] +91 83099 20625: కవితా గానం సీజన్ - 2
అంశం:: మనోబలము
శీర్షిక:: సుసాధ్యం
మనిషికి మనోబలము కన్న
మించిన మందు లేదు
మనోబలము కన్న మిన్నయైన
బలం వేరొకటి లేదు
కష్ట నష్టాలలో సుఖదుఃఖాలలో
తోడేవారు లేకున్నా
అండగా ఎవరు నిలువకున్న
చేదోడుగా ఎవరు రాకున్న
చేయూత ఎవరు ఇవ్వకున్న
మనుజునిలో మనోబలము
ఉంటే చాలు
గెలుపు ముంగిట వాలు
సమస్యలతో సతమతమవుతున్న
ఊపిరాడని ఉచ్చులో చిక్కిన
నమ్మిన వారు మోసం చేసిన
భాగస్థుడు ముంచి పోయిన
నీ గుండెలో నిండుగా మనోబలం ఉంటే
దృఢసంకల్పం దృఢనమ్మకముంటే
ఎంతటి కనాకష్టమైన
ఎంతటి భయంకరమైన
పరిస్థితులలో నైన
నిబ్బరంగా నిలువవచ్చు
గంభీరంగా గెలువవచ్చు
మనిషికి మనోబలమే ఆయుధం
అదే రక్షించే కవచం
ఇడుములను తెగ నరికే సుదర్శనం
కష్టాలను కడతేర్చే వజ్రాయుధం
అందుకే
మనోబలాన్ని విడువకు
దానితోనే బాగుపడు బ్రతుకు
అసాధ్యాన్ని సుసాధ్యం చేయునది మనోబలం
కష్టతరమైన దానిని సులభతరం చేయునది మనోబలం!!
కవిత వేంకటేశ్వర్లు
౧౫
[31/07, 8:35 pm] +91 83099 20625: కవితా గానం సీజన్ - 2
అంశం:: మనోబలము
శీర్షిక:: సుసాధ్యం
మనిషికి మనోబలము కన్న
మించిన మందు లేదు
మనోబలము కన్న మిన్నయైన
బలం వేరొకటి లేదు
కష్ట నష్టాలలో సుఖదుఃఖాలలో
తోడేవరు లేకున్నా
అండగా ఎవరు నిలువకున్న
చేదోడుగా ఎవరు రాకున్న
చేయూత ఎవరు ఇవ్వకున్న
మనుజునిలో మనోబలము
ఉంటే చాలు
గెలుపు ముంగిట వాలు
సమస్యలతో సతమతమవుతున్న
ఊపిరాడని ఉచ్చులో చిక్కిన
నమ్మిన వారు మోసం చేసిన
భాగస్థుడు ముంచి పోయిన
నీ గుండెలో నిండుగా మనోబలం ఉంటే
దృఢసంకల్పం దృఢనమ్మకముంటే
ఎంతటి కనాకష్టమైన
ఎంతటి భయంకరమైన
పరిస్థితులలో నైన
నిబ్బరంగా నిలువవచ్చు
గంభీరంగా గెలువవచ్చు
మనిషికి మనోబలమే ఆయుధం
అదే రక్షించే కవచం
ఇడుములను తెగ నరికే సుదర్శనం
కష్టాలను కడతేర్చే వజ్రాయుధం
అందుకే
మనోబలాన్ని విడువకు
దానితోనే బాగుపడు బ్రతుకు
అసాధ్యాన్ని సుసాధ్యం చేయునది మనోబలం
కష్టతరమైన దానిని సులభతరం చేయునది మనోబలం!!
కవిత వేంకటేశ్వర్లు
పై కవిత నా స్వీయ రచన అని
హామీ
౧౬
[31/07, 8:39 pm] Lalita Sister: .......కవితా గానం....
అంశం ...మనోబలం....
శీర్షిక ....మార్గదర్శకులు.......
ఏ .భూపతి...9989218154...
బలం అందరిది ....దాని ఉపయోగం కొందరిది....
శారీరక బలం కేవలం రోజువారీ
పనికే పరిమితం ....మనో బలం
భవిష్యత్తు కు మార్గం...
మనో బలానికి మించిన బలం
మరొకటి లేదు ....అది ధైర్యానికి
ప్రతీక , ప్రగతికి స్వాగత ద్వారం..
మాటల తూటాలకు ,ఆవేశాలకు ,
తొందర పాటు నిర్ణయాలను
నియంత్రణ ,చేసే ఆయుధం
మనోబలం .....మనోబల శాలికి
అపజయాలు భయపడతావి....
చేసే పని పై ప్రణాళిక రచించి
విజయాల వైపు సాగుతారు...
తాత్కాలిక ఉపయోగం కోసం
తబ్దుబ్బి పడరు మనో బలులు....
ఏ విజయమైనా అవలీలగా
సాదించుకోని ఉన్నత శిఖరాలు
అధిరోహిస్తారు.....
వారి దారి విజయాల మకుటం ....
ముందు చూపు ఆచి సూచి
అడుగు వేయడం , కంగారు లేని
ముందు చూపు ..ముందుడగు
మాత్రమే వారికి నియంత్రణ ,నిగ్రహం, గా, అలంకార మై అందరిలో గౌరవాన్ని
తెచ్చి పెడతావి.... మనోబలం మహా పెన్నిధి.....వారే ఐశ్వర్య
వంతులు..... ఆయుష్హు మంతులు, ఆరోగ్య మంతులు....
అందరి వారు.....మార్గదర్శకులు....
ఈ కవిత నా సొంతం.....
౧౭
[31/07, 8:39 pm] Lalita Sister: కవితాగానం :- * మనోబలం *
కోరాడ నరసింహా రావు... !
****************
" సంశయాత్మా వినశ్యతి "
ఇది సాక్షాత్తూ గీతాచార్యుని
ఉవాచ !
అనుమానము - భయము...
మనిషి ప్రగతికి తీవ్ర ప్రతి బంధ కాలే... !
ఆత్మ స్తైర్యం - మనోధైర్యం; ఇవి
ఇవే...ఘనవిజయసోపానాలు !
మ్మనోబలమంటే...., అత్యంత
విలువైన ధైర్య సంపదోయ్ !!
అష్టలక్ష్ముల్లో... ఏ లక్ష్మి తనను
వీడిపోతున్నా విచారించని
వివేకి... ధైర్య లక్ష్మిని మాత్రం తననుండి వీడి పోనివ్వడు !
నిరంతరంసాగే బ్రతుకుపోరులో మనిషికిమనోబలమేదివ్యాస్త్రం
సమస్యలను ఛేదించ గల
అద్భుత శస్త్రం మనోబలమే !!
మనోబలం గల మనిషి...
అది ఎంత క్లిష్టమైన ప్రతికూల
పరిస్థితి యైనా... సానుకూల పరచుకుని... విజ యాన్ని
సాధించగలుగుతాడు !
మనిషికి అతిశయాహంకారం
ఎంత ప్రమాదమో... తప్పో ;
ఆత్మ న్యూనత కూడా...
అంతే తప్పు.... ముప్పు !!
****************
........ కోరాడ.
౧౮
[31/07, 8:40 pm] Vanaparthy Gangadhar Poet: *కవితా గానం (సీజన్ 2)*
*అంశం:మనోబలం*
*శీర్షిక:బతుకు చుక్కాని*
తేదీ:31.07.2021
నీ జీవితాన వెలుగులు నింపేది
నీ మదికి శక్తిని ఇచ్చేది
ఆవిరౌతున్న నీ ఆశలకు ఊపిరై నిలిచేది
మనిషిని మహోన్నతునిగా మార్చునది మనోబలం
నీ అన్ని సమస్యలను చేదిస్తుంది
నిను ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది
నిన్నో శక్తిస్వరూపున్ని చేస్తుంది
నిన్నో మహాత్ముడిగా నిలుపుతుంది
నీ నిరుత్సాహానికి ఉత్సాహపు ఔషధమవుతుంది
నీ ఓటమిలో గెలుపై ఆసరా అందిస్తుంది
నీ జీవితానికి నూతన మలుపై నిలుస్తుంది
నీ ధైర్యాన్ని ఉక్కు పిడికిలై బిగిస్తుంది
మనోబలం మానవ జీవిత వికాసానికి
ఉన్నత మార్గాన్ని చూపే అమృతఫలం
*పేరు:వనపర్తి గంగాధర్*
ఊరు:హన్మకొండ
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
౧౯
[31/07, 8:56 pm] పిన్నక నాగేశ్వరరావు గారు Poet: కవితా గానం (సీజన్ 2). 31--7--2021.
పిన్నక నాగేశ్వరరావు.
అంశము :-- మనోబలం.
శీర్షిక :-- మనోబలమే ఆయుధం.
బ్రతుకు పోరాటంలో ఎదురయ్యే
సమస్యలను పరిష్కరించటంలో
ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా
కావలసింది మనోబలం
దేన్నయినా సాధించటానికి
కావలసింది ఆత్మ విశ్వాసం
ఆటలలో జయాపజయాలు సహజమైనా
అపజయానికి కృంగిపోక
అదే గెలుపుకు సోపానంగా భావించి
ఆత్మవిశ్వాసమే ఆయుధంగా
విజయానికి వేయాలి బాటలు
జీవన సంద్రంలో
సమస్యల సుడిగుండాలను
మనోబలంతో దాటుకుంటూ
జీవితాన్ని చేసుకోవాలి స్వర్గధామం
అయినవాళ్లు అసువులు బాసినా
ఆత్మీయులు దూరమైనా
దుఃఖాన్ని దిగమ్రింగుకుంటూ
మనోబలంతో అన్నింటినీ అధిగమించి
మామూలు మనుషులు కాగలరు
అందుకే అన్నారు
మనోబలాన్ని మించిన ఆయుధం లేదని.
**************************************
౨౦
[31/07, 9:02 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ: 31-07-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: మనోబలం
******†*******†******
కేజీల కొద్దీ ఒంటిబలం ఎంతున్నా
కుందేలు పిల్ల లాఃటి గుప్పెడు
మనోబలం
విధిరాతను తప్పించుకొనే మృత్యుంజయ మంత్రం!
ఆపదలను దాటించే మహత్తర శక్తి స్వరూపం!
విజ్ఞత వివేకం సమయస్ఫూర్తి
అంశలను నింపుకున్న
మనో చేతన చైతన్య స్వరూపం!
మనో కుహరంలో వెలిగే అఖండ దీపం!
మనోధైర్య కాంతులను మనోబలపు శక్తి వత్తితో వెలిగించి
ఆత్మ విశ్వాసాన్ని విశ్వమంతా వ్యాపింప చేద్దాం!
*వురిమళ్ల సునంద, ఖమ్మం*
౨౧
[31/07, 9:10 pm] తాతపూడి సోమశేఖర శర్మ: కవితా గానం సీజన్ 2
అంశం... మనోబలం
శీర్షిక..మనకి బలం
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336
మనిషికి మనోబలమే
మనసుకి అందే బలం
మధురమైన చేతనం
మనకి నిజమైన బలం
మనస్సుకు అందే బలం
అదేపనైనా మనకిసాధ్యం
చీకటిని పూర్తిగాపోగొట్టొచ్చు
అంధకారంలో కూడా మనం
నిర్భయంగా ఏ పనినైనాసరే సాధించ వచ్చు సుసాధ్యంగా
మనోబలం లేనట్లయితే
కోల్పోతాం మననిమనమే
సంఘంలో మనుషులలో
చులకనాభావం కల్గిస్తుంది
ఈ మనో బలం లేకపోతే
జీవితాలు కోల్పోవలసిందే
కరోనా సమయంలో పాపం
ఎంతోమందిని వాటేసుకుంది
మనోబలం లేక చాలామంది
తమ ప్రాణాలనే కోల్పోయారు
ముమ్మాటికీ తథ్యమైన మాట
ప్రజలలో మనోబలం కరువైంది
కాలసర్పం నిలువునా కాటేసింది
ఇప్పటికైనా అందరూ మనోబలం
అలవరుచుకోండి మీ ప్రాణాలను
రక్షించుకోండి హాయిగాజీవించండి
ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,832807933
౨౨
[31/07, 9:14 pm] Lalita Sister: కవితా గానం (సీజన్1)
పేరు:కె.ఇ.నిలమంగై
కలం పేరు:నీలా రంగనాధం
ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.
శీర్షిక: *మనోబలం*
తేది:31/07/2021
వచన కవిత్వం
చరవాణి సంఖ్య:8897155600
కలతలెన్నొచ్చినా దరి రానీక
కష్టాల కంటకాలను దాటుకుంటూ
కన్నీటిని కనుల కడలి నుండీ జారనీయక.,
సుఖాలకు పొంగిపోక.,
జీవిత చక్ర భ్రమణంలో తీపి,పులుపు,కారం,చేదు,వగరు,ఉప్పు అనే షడ్రుచులను సమానంగా చూస్తూ..,
పెద్దలు చెప్పిన మంచి మార్గంలో నడుస్తూ
తనకి తానే ధైర్యం చెప్పుకొని
వీలైతే పరులకుపకారం చేస్తూ..,
ఏ వేళైనా మస్తిష్కం చెప్పిన మంచిని చేస్తూ మనోబలంతో ముందుకు సాగేవాడే మనిషి..!
ధైర్యాన్ని జారవిడవక పట్టిన పట్టును ఉడుములా పట్టుకొని సాధించటమే లక్ష్యంగా పెట్టుకొంటూ సాగిపోవటమే..!!!!
*ఈ కవిత ఈ సమూహం కొరకే రాసానని హామీ ఇస్తున్నాను.*
*నీలా రంగనాధం*
౨౩
[31/07, 9:14 pm] Lalita Sister: ద్విముఖి మనస్సు!
మనసు పదునైన కత్తి
అలాగే సుతిమెత్తని వెన్నపూస!
కర్కశ పాషాణం ముళ్ల పదజాలం
మూర్ఖ ఆలోచనా తిమిరం మనసు
ధుఖిత రోదనల గుబులుకున్న అఙ్ఞానం
కత్తులు దూసే వికృత అగ్ని మనసు
కళ్ళల్లో ఎర్రని జీరతో కోపిష్టి మంటలు
దూరాన అగ్నికీలలు ఎగిసే కొండలు
మనసు పొరలు బ్లేడులా చీరుకుపోయినట్లు
ఆకాశం పగిలి జ్వాలా తరంగాల ఆక్రందనల అగ్ని
మరణంలోనే మనసు బాధ మటుమాయం!
వికృత ఆలోచనలకు స్వస్తిపలికి మనసు తీయని రాగాలలో తేలియాడనీ
మనస్సును జ్యోతిలా వెలిగించి వెలుగులు పూయించాలి
చల్ల చల్లని మలయమారుతాల్లో తేలియాడాలి
వెల్లువలా ఆనందం పొంగిపొర్లుతూ జీవితాన్ని ఆక్రమించాలి
వెలుగు నీడల మనసు గారడీ తూరుపు సిందూరమవ్వాలి !
గోదారి కెరటాలలోపాలవెల్లిలా చందమామ ప్రతిబింబించాలి
జీవితం నందనవనంలో పూచిన వెన్నెల పూలవ్వాలి!
అర విరిసిన పూల పరిమళాలు జుంటి తేనె దారలవ్వాలి
వాన కురిసి వెలిసిన తరువాత విరిసే ఇంద్రధనస్సు మనస్సు!
మనసే ఓ జాబిలి కూన!!
ఆపరాజిత్
౨౪
[31/07, 9:16 pm] +91 80742 97465: కవితాగానం ( సీజన్ 2)
*జంపని శ్రీనివాసమూర్తి* ( *జలజ* )🦜
గుంటూరు
31 - 7 - 2021
80742 97465
అంశం: మనోబలం.
శీర్షిక: *ధైర్యానికి సాగు*
*ఓ మిత్ర తేజమా*!
అనుకూలం లేని పరిస్థితుల్లో
మేధస్సుల ఖజానా తెరవవోయ్
ఆలోచన ఆక్సిజన్ పీల్చుకుంటు
జీవనట్యాగ్లో అనుకూల
రహదారులు నిర్మించవోయ్..
*ఓ ఆత్మీయ నేస్తమా*!
నీ ఆలోచన గూడులో
తేనేపట్టు నిర్మించు.
తేనె తీగవై విజ్ఞాన వంతుల
జ్ఞానంతో పట్టును నింపు.
నీ *మూర్తి* మత్వం నిలుపుకో!
లేదా నలుగురిలో నీవు
ఓ సామాన్య ఈగలా మిగిలిపోతావ్.
*ఓ స్నేహ బంధువా*!
మనోబలం సదలనీకు.
మొహమాట పడకు
దిగులు పడకు
భీతి చెందకు - సిగ్గు చెందకు
నీలోనే దాగి ఉంది చూడవోయ్
" నేర్పు, ఓర్పు, తీర్పు, గెలుపు"
నీ మనోబలంపై దృష్టి పెట్టు...
ఐరావతమై ఘిమ్కరించు
సింహమై గర్జించు
గుఱ్ఱమై పరుగులు తీయ్
అధైర్య కలుపు మొక్కలు పీకేయ్
సంకల్పంతో *ధైర్యానికి సాగు* చేయ్..
విజయమూర్తివై,
సేవామూర్తివై
మరలా నీలో ఉత్తేజాన్ని నింపేసి,
సంఘాన్ని ముందుకు నడిపేయ్ ఓ ధీరుడా!
౨౫
[31/07, 9:22 pm] మన్నె లలిత గారు కవయిత్రి: కవితా గానం
తేదీ :31/ 7 /21 --శనివారం
పేరు: మన్నె లలిత
హైదరాబాద్.
అంశం: మనోబలం
శీర్షిక: సుసాధ్యం.
******************************
శారీరక బలం ఉన్నా
మనో బలం ముందు బలహీనం
ధైర్యానికి ప్రతీక
విజయాలకు విజయకేతనం
పర్వత శిఖరాలు ఎక్కాలన్నా
పతకాలు ఆటల్లో సాధించాలన్నా
పరుగు పందెంలో పాల్గొనాలన్నా
ఆశయాలు సఫలం చేసుకోవాలన్నా
కావాలి మనోబలం
సముద్రపు లోతుల్లో
ఆకాశపుటంచుల్లో
పొలం పనుల్లో
వాహనాలు నడపడంలో
అతివ "అబల కాదు సబల"
అనిపించుకున్నది మనోబలమే!
పుట్టినింట మెట్టినింట
సమస్యల ముళ్ళ బాటలో
సతమతమవుతున్నా
పెదవి కదపక మనోబలంతో
పనులు చక్కబెట్టే అతివ
అందరికీ ఆదర్శమే!!
Comments
Post a Comment