Skip to main content

Doctors day

 నిర్వహణ 

శివునూరి లలితా కృష్ణ

వీరా గుడిపల్లి

**********************

1.కొంపెల్లి రామయ్య గారు

2.తాతపూడి సోమ శేఖర శర్మ గారు

3.మేకల రామ స్వామి గారు

4.ఆళ్ళ నాగేశ్వరరావు గారు

5.గొర్రెపాటి శ్రీను గారు

6.పిల్లి హజరత్తయ్య గారు

7.చేబియ్యం శ్రీనివాసరావు గారు

8.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు

9.

10.

11.

12.

13.

14.

15.

16.

17.

18.ధనాశి ఉషారాణి�చిత్తూరు గారు

19.డా.బల్లూరి ఉమాదేవి గారు

***********************

1

Kompelli Ramaiah Poet Kmm: అంశం:జాతీయ వైద్యుల దినోత్సవం

శీర్షిక:అడుగడుగున వందనం...!

_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

చరవాణి:7032504646


తిమిరంలో వేగు చుక్కలు 

చందమామ స్టేతస్కోప్ గా ధరించి

సూర్యోదయపు కాంతి పుంజాలుగా

కరోనాను కరవాలంతో అంతం చేసే వైద్యులు యోధులుగా

క్షణ క్షణం మృత్యువుతో యుద్ధం చేస్తుంటే

దేశమంతా వెలుగు దివ్వెలై 

నిలబడి కలబడుతూవుంటే

కరతాళ ధ్వనులు చేస్తూ

శంఖారావం పూరుస్తూ

ధన్యవాదాలు చెబుతూవుంటే 

ఈ సంక్షోభ సమయంలో అవమానించిన 

ఓ కంట కనిపెడుతూ 

రాత్రింబళ్ళు శ్రమిస్తూ ఉంటే

భౌతిక దాడులకు పాల్పడుతున్నారు !

మహమ్మారి సోకిన రోగికి చికిత్స  చేస్తే

వైద్యుడు సహితం మరణిస్తే 

అంతిమ క్రియకు ఆరడుగుల జాగ  ఇవ్వని 

నిస్సిగ్గు నీచ సమాజంలో బతుకుతున్నాం

వైద్యులను దేవుళ్ళని పొగడకున్నా పర్వాలేదు

వాళ్ళ విధులను సక్రమంగా చేయనిద్ధాం!

వాళ్ళ సేవకు అడుగడుగున వందనాలు తెలియ చేద్దాం...!

2

తాతపూడి సోమశేఖర శర్మ: కవితా గానం ( సీజన్ 2 )


అంశం.. జాతీయ వైద్యుల దినోత్సవం    


శీర్షిక.. ఆరోగ్యప్రదాతలు -ప్రాణదాతలు 



దేశానికి వెన్నెముక ప్రాణదాత 

రోగికి ఆయుష్షును పోయడానికి 

తనఆయుష్షును లెక్కచేయకుండా 

పణం పెట్టి రోగిని బ్రతికించేవాడే 

సమయానికి వైద్యాన్ని అందించే

నిజమైన వైద్యశిఖామణి డాక్టర్ 

అటువంటి భగవత్స్వరూపులైన 

డాక్టర్స్ అందరికీ మనం నిజంగా 

ప్రణామములు అందించవలసిందే 

వైద్యో  విష్ణో: నారాయణో హరీ !


అన్నిరకాల రోగాలను నయంచేసేది 

ఆధునిక వైద్యాలు అన్నీ అందించేది 

శస్త్ర చికిత్సలు చేసి ప్రాణంపోసేది 

నూతన వైద్య విధానంలో వచ్చిన 

విధివిధానాలు అందించే గొప్పప్రక్రియ


ఇవన్నీ తన జీవితకాలంలోనే పూర్తిగా 

నేర్చుకుని వచ్చి అన్నిరకాల రోగాలను 

నయంచేసిరోగికి పూర్తిఆయుష్షునుపోసి  

బ్రతికిస్తూ  జీవితాన్ని ఇచ్చేవాడే డాక్టర్ 


ఆవైద్య మహానుభావులకి ప్రణామాలు 

అందిద్దాం ప్రాణదాతలకు నమస్సులు 

ఆరోగ్యప్రదాతలకు అంజలి ఘటిద్దాం 

వైద్యుడే భగవత్స్వరూపుడు మనకు j

పునర్జన్మను యిచ్చి ఆయుష్షు పోసే 

వైద్యులందరికి మాశతకోటిప్రణామాలు


తాతపూడి సోమశేఖర శర్మ 

యానాం, పాండిచ్చేరి స్టేట్


హామీ పత్రం 

                  ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం , 8328079336

3

: జాతీయ వైద్యుల దినోత్సవము సందర్భముగా

*****************************************

తే"గీ

నిత్య సమరమొనర్చెడి నెనరుతోడ

ప్రాణములను రక్షించెడి ఫథమునడిచి

దినమురాత్రంబుల శ్రమించు తీరుగలిగి

వైద్యనారాయణుండయ్యి వరములొసగు

కందము

*******

కష్టమ్మునకెనకాడరు

నిష్టముగదలచు చికిత్స యే వ్యాదైనన్

స్పష్టత జీవనమునకై

దృష్టిని కేంద్రీకరించు దేవుళ్ళీరే

తే"గీ"

****

జఠిలమౌ వ్యాదులదరిమె జాగృతమ్ము

కఠినమౌరోగముల ద్రుంచు కౌశలమ్ము 

పఠన పాఠ్యమే ప్రతిరోగి వాలకమ్ము

కంఠతయేను ప్రతిమందుది ఘనతనెద్దొ

ఆ"వె"

****

ఈ కరోన దెచ్చెనెన్నియో కష్టముల్

చిక్కనిబ్రతుకంత ఛిద్రమాయె

పవలురేయి యనక ప్రాణాలు రక్షించె

వైద్యులార మీకు వందనాలు

*****************

మేకల రామస్వామి-చెన్నూర్

9912747214

4

Aalla Nageshwar Rao Poet: 

సందర్భం;  జూలై...1...ప్రపంచ వైద్యుల దినోత్సవం

కవితాశీర్షిక;

    "" కలియుగ దైవాలు ""


శ్వేతవర్ణపు దుస్తులతో

మెడలో  స్టేతస్కోపుతో

మోముపై  చిరునవ్వుతో

మది నిండా ఆత్మస్తైర్యంతో

మానవసేవే మాధవసేవ అనే తలంపుతో

ఆరోగ్యమే మహాభాగ్యమనే దృక్పధంతో

ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆరోగ్య ప్రదాతలు వైద్యులు!

కొందరికి కొందరే దేవుళ్ళు

జనులందరికి కలియుగ దైవాలు వైద్యులు!

సంస్కరవంతులైన వైద్యులకు

నమస్కారములు సమర్పిద్దాం

కుసంస్కరులైన వైద్యులను

ఛీత్కారాలతో తిరస్కరిద్దాం!

సృస్తికర్త ఆ బ్రహ్మ

ప్రతిసృష్టికర్త ఈ అపరబ్రహ్మ

ఆయన రాసేది తలరాత

ఈయన తిరగరాస్తాడు ఆ రాత

పోయే ప్రాణాలని అవుతాడు

జీవితకాలాన్ని పెంచుతాడు!

ఈ కరోనా కష్ట కాలంలో

ప్రాణాలను ఫణంగా పెట్టి

నిరంతరం సేవలందించే వైద్యులకు

వైద్యోనారాయనో హరి అంటూ

కలియుగ దైవాలైన వైద్యులకు

పాదాభివందనములు సమర్పిద్దాం!

............................................రచన

ఆళ్ల  నాగేశ్వరరావు

తెనాలి

గుంటూరు...జిల్లా

ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం

సెల్ నెంబర్.7416638823

.........................................

పై వచనకవిత నా స్వీయారచనేనని హామీ ఇస్తున్నాను

5

 వీరాస్ కవి సమయం

అంశం:  జాతీయ వైద్యుల దినోత్సవం

పేరు : గొర్రెపాటి శ్రీను

శీర్షిక :  దైవస్వరూపులు


రాత్రనక పగలనక శ్రమిస్తూ రోగి కష్టాన్ని కనిపెట్టి

పేషంట్ కి స్వాంతన చేకూర్చాకే

సంతృప్తి చెందే మహోన్నత మానవతామూర్తి.. డాక్టర్ !


తట్టుకోలేని బాధ కు గురవుతూ ఇక్కట్లన్నీ ఏకరువు పెడుతున్న

రోగి మాటల్ని శ్రద్దగా ఆలకిస్తూ తగిన వైద్యం చేసి

ప్రాణం నిలిపే ప్రాణదాత.. డాక్టర్ !


కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రాణాన్ని సైతం  నిలబెట్టి

ఆయుష్యునిచ్చే అపర బ్రహ్మ.. డాక్టర్ !


కనిపించని దైవం..

కనిపిస్తే..

ఆ ప్రత్యక్ష రూపం ..డాక్టర్ ! 


జగతికి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ దైవ మూర్తులని  సత్కరిద్దాం !

 

సమాజంలో ఉన్నత స్థానమిచ్చి  గౌరవిద్దాం !


                                                - గొర్రెపాటి శ్రీను ,హైదరాబాద్ .  

************************

"దైవస్వరూపులు" అను కవిత నా స్వంత రచన అని  హామీఇస్తున్నాను.

6

కవితాగానం(సీజన్ 2)


అంశం: సెల్యూట్ టు డాక్టర్స్

శీర్షిక: వైద్యో నారాయణో హరి 


మొక్కు వోని గుండె నిబ్బరం

అలుపెరుగని అంకితభావం

విసుగెరగని వృత్తి ప్రేమతో

వైద్యం చేసే పవిత్ర రూపమతడు..!


స్వచ్ఛమైన శ్వేత వస్త్రధారియై

ఆత్మీయమైన చెరగని చిరునవ్వుతో

తన ప్రాణాలను పణంగా పెట్టి

పునర్జన్మనిచ్చే  దైవ స్వరూపమతడు.!


కాలయముడుతో యుద్ధం చేస్తూ

ఆరిపోతున్న దీపాలకు

జీవితమనే వెలుగును ప్రసాదించే

కాంతి స్వరూపమతడు..!


సేవచేయడమే వృత్తి ధర్మంగా

ప్రాణాలు కాపాడటమే దైవ కార్యంగా 

అహర్నిశలు శ్రమించే సేవకుడు

సేవాతత్పరతకు నిలువెత్తు రూపమతడు..!


ఊపిరి ఊయల లూగూతున్నప్పుడు

నేనున్నానంటూ  భరోసా నిచ్చి

జారిపోతున్న ప్రాణాలను నిలిపే 

పరబ్రహ్మ స్వరూపమతడు..!


ఇది నా స్వంత కవిత ఎక్కడ ప్రచురించలేదు అనువాదం కాదని హామీ ఇస్తున్నాను


పేరు :పిల్లి.హజరత్తయ్య

ఊరు:శింగరాయకొండ

జిల్లా:ప్రకాశం

చర వాణి: 9848606573

7

చేబియ్యం శ్రీనివాసరావు గారు: కవితాగానం ( సీజన్ -- 2 )


శీర్శిక : విధానాలు వేరైనా విధి ఒక్కటి ( డాక్టరు బాబులు మీకు వందనాలు )




ఆకుపసరు పూసి 

వెదురుకఱ్ఱలు కట్టి 

వేపముద్దలు రాసి 

వేరుమందిచ్చి 

హోమియోపతి ,అలోపతి ,నేచురోపతి గా 

యోగాసనాలతో 

ఆహార నియమాలతో 

భక్తి ప్రపత్తులతో 

మార్గాలు వేరయినా 

విధానాలు మారినా 

రోగాన్ని పోగొట్టు మహనీయులు మీరు 

వైద్యో నారాయనో హరిః అనుచు 

భగవంతుని మీలో చూచు జనులు 

వేయేళ్లు చల్లగ ఉండండి బాబూ 

జనులకు ఆరోగ్య దాతలుగా మీరు 


రచన   : చేబియ్యం శ్రీనివాసరావు 

ఊరు    : గుజరాతిపేట ,శ్రీకాకుళం

8

[ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు

 Poet Vizag: అంశం:- వైద్యో నారాయణో హరి 

శీర్షిక:-పరమేశ్వరుని ప్రతిరూపాలు

............................

పగలనక,రేయనక

అంకితభావంతో  పనిచేస్తు

రోగగ్రస్థులకు ఆరోగ్యం చేకూరుస్తు మానవసేవే మాధవసేవ గా శ్రమిస్తున్న  వైద్యులకు వందనములు..!


ఆరోగ్యమే మహాభాగ్యం

శరీరం కడు ధర్మసాధనం

తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి రోగపీడితుల ప్రాణాలను సంరక్షిస్తున్న

ప్రాణప్రదాతలు .....!!


పోలియో, ప్లేగు, ఎయిడ్స్ వంటి ఎన్నో భయంకర వ్యాధులను నయం చేసిన

వైద్యులు ఇప్పటి మహమ్మారి కరోనా నుంచి

వాక్సిన్ ద్వారా  వసుదైవకుటుంబ రక్షణ చేసే సాక్షాత్తు పరమేశ్వర ప్రతిరూపాలే వారికి వందనములు ....!!

............................

లోకా సమస్తా సుఖినో భవంతు.

...........................

పేరు:-

అయ్యలసోమయాజుల ప్రసాద్

విశాఖపట్నం

చరవాణి:9963265762

క్రమ.సంఖ్య: 30 

.................................

హామీపత్రం:-

ఇది నా స్వీయకవిత దేనికి అనువాదం కాదు

అయ్యలసోమయాజుల ప్రసాద్

..................................

9

[01/07, 8:47 pm] మన్నె లలిత గారు కవయిత్రి: జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా ......

కవితాగానం (సీజన్ 2)

 తేదీ :1/7/ 21- గురువారం

 శీర్షిక: శ్వేత దేవతలు

  పేరు: మన్నె  లలిత

*************************

 శ్వేత వర్ణ దుస్తుల్లో ,శ్వేతవర్ణ 

శాంతి పావురాలకు సంకేతం

 చెదరని మల్లె పువ్వు లాంటి నవ్వులు

 రోగులే నారాయణులుగా 

సేవచేసే  మానవ దేవుళ్ళు

 అత్యవసర పరిస్థితుల్లో  అపరబ్రహ్మలు

 ఆకలిదప్పులు జాడ తెలియని  శ్వేత దేవతలు

 ముఖాలు అలసినా అలసిపోని మనస్సు


 ఆపదలో అవసరానికి వెంట వెంట చేసే శస్త్ర చికిత్సలు కుటుంబాలకు ,కన్నపేగుకు దూరమై 

రాత్రింబగళ్ళు సేవ చేసిన వైద్య బ్రహ్మలు

 వృత్తి ధర్మాన్ని మరువక నిరంతర సేవ చేసి 

ప్రాణాలు  అర్పించిన చరితార్థులు

 కులమత భేదాలు చూపక

 అందరి రక్తం ఒకటేనని చాటిన 

కారుణ్య మూర్తులు


 చిన్న బిళ్ళతో కొండంత ధైర్యాన్నిచ్చే  వైద్యులు

 వైద్యాలయంలో వెలసిన శ్వేత దేవుళ్ళారా!

 మానవత్వాన్ని మరువకండి 

దానవత్వానికి దూరమవ్వండి 

వందనం! అభివందనం !!

"శతమానంభవతి".

10

[01/07, 8:50 pm] +91 83099 20625: అంశం..వైద్యో నారాయనో హరి

శీర్షిక....ధన్వంతరీలు వైద్యులు


తెల్లని వస్త్రాలతో

చల్లని మనసులతో

చీకటి బ్రతుకుల్లో

వెన్నెలలు నింపే చంద్రులు


ఆశ వదులుకున్న

జీవితానికి

సరియైన మందులిచ్చి

అవసరమైతే శస్త్ర చికిత్స చేసి

కాపాడే భిషక్

చేస్తాడు చమక్


చేతిలో ఏ మంత్రము0దో

మాటల్లో ఏ మాయుందో

మాత్రల్లో ఏ మహత్యముందో

రోగికి జబ్బు నయమై

సంతోషంగా పోతాడు ఇంటికి

పయనమై


ప్రాణాలు కాపాడే పరమాత్ములు వైద్యులు

మానవతామూర్తులు

మానవ సేవే మాధవ సేవ అని

నరుని సేవ నారాయణ సేవ అని

భావించే పుణ్యమూర్తులు

లభించు వారికి ఎన్నో కీర్తులు!!

                  కవిత వేంకటేశ్వర్లు

కర్నూలు.....8309920625

పై కవిత నా స్వంత రచన అని

హామీ

****************************

11

[01/07, 8:55 pm] +91 95422 36764: *కవితా గానం సీజన్ 2*

అంశం: జాతీయ వైద్యుల దినోత్సవం

👩🏻‍⚕️🧑🏽‍⚕️🧑🏽‍⚕️👩🏻‍⚕️🧑🏽‍⚕️ 🦢🦢 👩🏻‍⚕️🧑🏽‍⚕️👩🏻‍⚕️🧑🏽‍⚕️👩🏻‍⚕️


*రాజ హంసలు*

""""""""""""""""""""''"""""""""

ఆరిపోయే ప్రాణానికి ఆజ్యం పోసే 

అపర ధన్వంతరి వారసులు 

అస్త్ర శస్త్ర చికిత్స పరంపరతో                  

నిశ్చల అవయవాలకు నడక నేర్పే సృజన శీలురు 

చిద్రమైన బతుకు చిగురింప చేసే తొలకరి జల్లులు


స్టెతస్కోప్ సర్పాన్ని సదా

మెడలో ధరించే శివుని ప్రతిరూపాలు

అందరికీ ఆరోగ్యం లక్ష్య సాధనగా 

అహరహం వైద్య సేవే పరమావధిగా 

స్వస్థత పరిచి స్వాంతన చేకూర్చే ప్రాణ దాతలు 


సమగ్ర సమాజ ఆరోగ్య పరిరక్షణకై 

నిరంతరం పరితపించే ఆదర్శ మార్గ దర్శకులు 

భేద భావాలు లేని నిర్మల గంభీర శిఖరాలు

మానవత్వ పరిమళాలు వెదజల్లే మహా వృక్షాలు 

అంతుపట్టని అంటురోగ నిషీధి తరిమే ఉషా కిరణాలు 


నరునిగా అవతరించిన శ్రీమన్నారాయణులు

ప్రాణం ఫణంగా పెట్టి పోరాడే త్యాగమయ జీవులు 

దేహమంతా ముక్కలై మరణ శయ్యపై చేరినా                                      

రోగం రొప్పితో అవయవాలు అచేతనమైనా 

స్వచ్ఛ జల ప్రవాహాన సాగిపోయే రాజహంసలు 


కరోనా కాలాన ఆసుపత్రులు కోవెలలై 

కొలువు దీరే తెల్లకోట్లతో  కోట్లాది దేవుళ్ళంతా

దీర్ఘాయుష్షు ప్రసాదించే అపర బ్రహ్మలు వైద్యులు

సంప్రదింపుల సలహాల మధుర భాషణంతో 

జబ్బుల తరిమి జాతిని రక్షించే పరం జ్యోతి స్వరూపాలు 


చెరగని చిరునవ్వుతో పగలు రేయి పరిశ్రమతో 

పవిత్ర వైద్య వృత్తి ధర్మం పాటించే జన్మ ధన్యం! 

ప్రేమ కరుణ దయతో కూడిన తెల్ల కోటుకు వందనం!

🦢🦢🦢🦢🦢🦢♦️♦️🦢🦢🦢🦢🦢🦢

(1జూలై,జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా)


రచన: నాశబోయిన నరసింహ (నాన), ఆరోగ్య పర్యవేక్షకులు, చిట్యాల,నల్గొండ,9542236764.

12

[01/07, 9:00 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం (సీజన్ 2) నిర్వహించు కవితల సమాహారం

అంశం: వైద్యులు


పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్

ఊరు: కర్నూలు

చరవాణి: 9505152560

************************

 *వైద్యనారాయణో హరి* 


ఏక రూప శ్వేత విలువల ధరించు

మల్లె మొగ్గలు!


మధుర వచనం పలికి

మనోల్లాసము పరచి

మనోవ్యాధికి సైతము

మాన్పు గుణము కల

నైపుణ్యము వారిలోనే

వుంది నిఖిల జగము!


ధన్వంతరికి వారసులు

నారాయణ సంపన్నులు


నాడీ వ్యవస్థ పరికించి

రోగం నిర్ధారణ సగము

స్టెతస్కోప్ పెట్టి విని

గుండె లయల వేగము గమనించు

సిరింజీనే ఆయుధంగా పూని

కర్తవ్యోనుఖులవుతారు!


అపాద మస్తకము

నర నరాల కేశరక్తనాళికల

రక్తప్రసరణము

ఎముకల సాంద్రత

కనిపెట్టు వైద్యులు!


దేవునికి జీవునికి మధ్య అనుసంధాన కర్తలు

ప్రాణమిచ్చు బ్రహ్మస్వరూపులు!


వారి కరస్పర్శకు 

వ్యాధి సగం నయము

చికిత్సకు పలాయనము


నిజంగా జబ్బు లేకపోయినా

డబ్బు లాగే విధిని నిర్వర్తించు వైద్యులు

వృత్తి ధర్మం స్వస్తిచెప్పిన బేహారులు!!

     ***


            హామీ పత్రం

     ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు ప్రసారం కాని ప్రచురణ కాని కాలేదు అని నేను హామీ ఇస్తున్నాను.


//సయ్యద్ జహీర్ అహ్మద్//

13

[01/07, 9:00 pm] పిన్నక నాగేశ్వరరావు గారు Poet: అంశము:-- జాతీయ వైద్యుల దినోత్సవం.

పిన్నక నాగేశ్వరరావు.            1--7--2021.  


శీర్షిక :-- అపర బ్రహ్మలు.


వైద్యునిగా, విద్యావేత్తగా, అధ్యాపకునిగా,

మెడికల్ కౌన్సిల్ అధ్యక్షునిగా, మేయర్ గా,

 శాసన సభ్యునిగా, ముఖ్యమంత్రిగా

దేశానికి విశిష్ట సేవలందించి

"భారత రత్న" పురస్కారం పొందిన

డా.బి.సి.రాయ్ జన్మదినం రోజే

" వైద్యుల దినోత్సవం " ‌

అదే రోజు ఆయన నిర్యాణం 

చెందటం విశేషం.

వైద్యరంగంలో వైద్యులకున్న విలువ అపారం

ఎందరో రోగుల జబ్బులను నయంచేస్తూ

అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేస్తూ

ఎంతమందికో పునర్జన్మను ప్రసాదిస్తూ

అపర బ్రహ్మలుగా కీర్తిని గడిస్తున్న

భగవత్స్వరూపులే వైద్యులు

మహమ్మారి కరోనా విజృంభించిన తరుణంలో

తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి

అనేకమంది రోగుల ప్రాణాలను కాపాడటానికి

ఆదర్శప్రాయంగా పనిచేసి

అసువులు బాసిన వైద్యులు ఎందరో

అందరికీ శతకోటి ప్రణామాలు అర్పిద్దాం.

**************************************

14

[01/07, 9:01 pm] Indravat Rahul Poet Ks 11: కవిత గానం 

➖➖➖➖


*అంశం :* వైద్యుల దినోత్సవం 

*శీర్షిక :* కనిపించే దేవుళ్ళు 


 *"కనిపించే దేవుళ్ళు"*


కనిపించే వైద్యులే 

నిజమైన దేవుళ్ళు 

ఒక శ్వాస కోసం 

నిరంతరం అలుపెరుగనిపోరాటం 

చేసి ఒక జీవికి ప్రాణం పోసి 

తమ ప్రాణాన్ని లెక్క చేయకుండా 

మంచి మానవత్వంతో 

భయంకర రోగులను 

నయం చేసి తమ బాధ్యతను 

భుజం మీద వేసి 

ప్రజల క్షేమమే లక్ష్యంగా 

సేవా భావమే ఊపిరిగా 

వైద్యంమే మంత్రంగా 

నిండు జీవితంకు ఊపిరి పోసి 

పునర్జన్మను ప్రసాదించి

అనునిత్యం కనిపించని 

శత్రువుతో సమరo చేస్తూ 

పండుగా పబ్బం తెలియకుండా 

నేటి జీవితంకు నాంది పలికి 

నిరంతరం శ్రమిస్తున్న 

కనిపించే దేవుళ్ళే మీరు 

మీకే మా వందనాలు...


స్వీయరచన...✍️


         ధన్యవాదములు.. 🌷


  *ఇంద్రావత్ రాహుల్* 

            కొత్తపేట్ 

       నిజామాబాద్ 

🪀 9848054079..

15

[01/07, 9:03 pm] +91 99400 13300: పేరు      : VT రాజగోపాలన్ 

ఊరు     : మైసూరు 

చరవాణి: 9940013300



అలసట ఉన్నా 

ఆప్యాయతతో 

ఆదరిస్తూ 

ఇంటిని మరచి

ఈడనే ఉన్నాం 

ఉత్సాహంతో ముందుండి 

ఊయల పిల్లలనొదలి మేము 

ఎదలోనిఅలజడులను              ఏకంగా తరిమి కొట్టి 

ఐకమత్యమై మేము 

ఒక్కమాట మీద నిలచి 

ఓర్పుగా వారికి 

ఔషధములనిచ్చి 

అందరిలోనూ ధైర్యం నింపి 

అహర్నిశలు వారికి సేవలందించి 

వారిని కాపాడేందుకు కృషి చేస్తున్నాం. 



ఇది నా స్వీయ రచన..

16

[01/07, 9:07 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*

తేదీ:01-07-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: జాతీయ వైద్యుల దినోత్సవం

కవితా శీర్షిక: వాళ్ళు వాళ్ళే..

******************

మృత్యు బోనులో చిక్కుకున్న

దేహాన్ని

ప్రాణాలను పణంగా పెట్టి కాపాడే ధన్వంతరి వారసులు!


ధవళ వర్ణ వస్త్ర కాంతులతో ప్రకాశిస్తూ

మనసా వాచా కర్మణా

సేవ కోసం వృత్తిని అంకితం చేసే త్యాగధనులు!


కొడిగట్టే దీపాలకు

ఆత్మ స్థైర్య చమురు నింపి

కొత్త జీవితాలను ప్రసాదించే సంజీవని రూపాలు!


సంతోషాలు సరదాలను

రోగుల కోసం త్యాగించి

అహర్నిశలు వారి క్షేమానికై తపించే దయామయులు!


మరణం అంచున కొట్టుమిట్టాడుతున్న ప్రాణానికి

పునర్జన్మ  నొసగే బ్రహ్మ స్వరూపాలు!

పైసల కంటే ప్రాణం ముఖ్యమనీ

భావించే మహోన్నత వ్యక్తి శిఖరాలు..


వాళ్ళు వాళ్ళే.. 


కొందరు పీడించే జలగలు

వేధించే యముళోళ్ళు

జాలీ దయా దాక్షిణ్యాలు లేని

నర రూప రాక్షసుని వారసులు

వృత్తికే  కళంకం తెచ్చే అత్యాశ పరులు

భగవంతుడు కూడా క్షమించని

పాపాత్ములు..

వృత్తి నిబద్ధత మరచి

పైసల కోసం ప్రాణాలతో చెలగాటే మృత్యు రూపాలు!

 వాళ్ళు వాళ్ళే.


 *వురిమళ్ల సునంద,ఖమ్మం*

17

[01/07, 9:15 pm] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఆధునిక దేవుళ్ళు


పైన దైవమునకు కింద మానవునికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళు

జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన వాళ్లు

రాత్రింబగళ్ళు రోగులను కనిపెట్టుకొని ఉండే మహనీయులు


వాళ్లే ఈ జాతికి వెన్ను ముక్కలు

వారు లేని వ్యవస్థ రోగ గ్రస్తం మాత్రమే


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453

18

అంశము.జాతీయ వైద్య దినోత్సవo

పేరు. ధనాశి ఉషారాణి

శీర్షిక.మీకు సలామ్

...........

నిత్యము ప్రజల శ్రేయస్సు కోరుతూ

తెల్లకోటు వేసుకొని మల్లెపూల సొగసైన మనసుతో

నిత్యము దేవతా హృదయాన్ని కలిగి

పేదల సేవకై నిలిచిపోయేరు


గుండెల్లో గురుతర బాధ్యతను తలిచి

కోటివెలుగులు తేజస్సును గుండెల్లో నిలిపి

వైద్య సేవలో ప్రజల మంచికోరేరు


తమ బాగోగులను మరిచి

నిత్యము తపించి నిలిచేరుగా

మమతలు అన్నీ గుండెల్లో నిలిపి

సమతను కోరి సత్యము దారిలో నిలిచి


ప్రభుత్వ పాలనలో గురుతర బాధ్యతను యెరిగి

అలుపు యేరుగని నిత్య సేవకుడుగా

కన్న తల్లిగా లాలించు వైద్యలకు నిత్య నీరాజనాలు


ధనాశి ఉషారాణి

చిత్తూరు జిల్లా

భాకరాపేట

[01/07, 9:28 pm] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: నవ్వులు-పువ్వులు అయినవి నేల రాలిన నవ్వులను ఎవరో నలిపేసారు



స్వప్నాల సీమలో ఆవలి ఒడ్డుకు చేరుకోవాలని నాలో సముద్రం లోలోన ఏదో ఆరాటం


అంతరంగంలో ఆనంద విషాదాలు రెండో కూడా ఉంటాయి


మనిషి జీవితమే రెండింటి సమ్మేళనం


ఆనంద విషాదాల ను అనుభవించిన వాడే అసలైన మనిషి అతనికి మన ము

స్థితప్రజ్ఞుడు అంటాం


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453

19

Balloori Umadevi Poetess: కవితా గానం

డా బల్లూరి ఉమాదేవి

1/7/21

అంశం: జాతీయ వైద్యులదినోత్సవం

కలియుగ దైవాలు


ఆ.వె:వైద్యు డన్న నిలను వాసుదేవుడనుచు

       కొలుచుచుందురెల్ల కూర్మి తోడ

      ప్రజల బాగు కొరకు పగలు రేయి యనక

       గడుపు చుందు రెల్ల కాల మిటుల


ఆ.వె:హస్తవాసి నెంచి యారోగ్య మాశించి

       జబ్బు తగ్గుననుచు జనులు నెల్ల

    చేరి మందులుగొని చెయ్యెత్తి మ్రొక్కుచు

    దైవమునుచు సతము తలచుచుంద్రు

    

ఆ.వె:తెల్లని వలువలను తీరుగా ధరియించి

        నాడి పట్టి చూచి నయము గాను

         రుజలగూర్చితెలిపి రోగులనెల్లను

         బాగు చేయు చుండు వడిగతాను


ఆ.వె:పిల్ల వారికైన పెద్దల కైనను

     వైద్యు డనగ సతము ప్రాణదాత 

       ఎట్టి రుజల నైన నిట్టె తొలగచేసి

      ముదముకూర్చ నితడు మదికి నెపుడు.


ఆ.వె:ప్రజల సేవ యౌను పరమాత్మ సేవని

       యెంచి రోగులకును మంచి వైద్య

      మొసగి జనుల చేత నుత్తమ వైద్యుడ

     టంచు ఖ్యాతి నొందు నవని యందు.

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...