Skip to main content

దాశరథి 2021

నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
*************
కవివరుల జాబితా
1.తాతపూడి సోమశేఖర శర్మ గారు
2.కొంపెల్లి రామయ్య గారు
3.డా.కమలాదేవి గారు
4.మద్ది పుల్లారావు గారు
5.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు
6.డా.సి.హెచ్. ఆంజనేయులు గారు
7.కవిత వేంకటేశ్వర్లు గారు
8.ముత్యం వెంకటేశ్వరరావు  గారు
9.వనపర్తి గంగాధర్ గారు
10.నీలా రంగనాధం గారు
11.ధనాశి ఉషారాణి గారు
12.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
13.ఇంద్రవత్ రాహుల్ గారు
14.జక్కని గంగాధర్ గారు
15.మన్నె పిన్నక లలిత గారు
16.నాన ..గారు
17.సునంద వురిమళ్ల గారు
**********
1
తాతపూడి సోమశేఖర శర్మ: కవితా గానం (సీజన్ 2)

అంశం.....దాశరథి గారి జయంతి
శీర్షిక.. అభ్యుదయ ధ్రువతార 
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336

సినీ యుగంలో  అఖంఢ ధ్రువతార
సినీ ప్రపంచంలో పాటల మాంత్రికుడు
వెండితెర వినీలాకాశపథ సృష్టివిరించి
విశ్వానికే మకుటాయమాయమైనకవివి 
నీవేనయ్యా!దాశరథీకరుణాపయోనిధీ!

అభ్యుదయభావాలు విరిసినకవిమణి
ఆంగ్లంలోకూడా ఔపాసన పట్టినధీమణి
ఆక్రందనాగ్నిధారకురిపించినమహామణి
అందుకోవయ్యా మానమస్సుమాంజలి
నీకేనయ్యా!దాశరథీ కరుణాపయోనిథీ!

దాశరధి రంగాచార్యుగా నీవిష్ణునామం
ధీశాలి తెలంగాణబిడ్డగా నీ పౌరుషాగ్ని
దినదినము నీగీతాలే మాహృదయగీతి
దివ్యగీతాలు మేముమరువలేమయ్యా
ఓకృష్ణమాచార్యా ! దాశరథీ కరుణాప యోనిధీ!
 
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,832807933
2
: అంశం: దాశరథి
శీర్షిక: అభ్యుదయ పుష్పం...!
_ కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం
తెలంగాణ ప్రజల  కన్నీళ్ళను
అగ్నిధారగా  మలిచి 
నిజాం నిరంకుశ పాలన పై
ఎక్కు పెట్టిన విప్లవ శరధి...!

పద్యాన్ని పదునైన ఆయుధంగా ధరించి
తెలంగాణ విముక్తి కోసమై
ఇందూరు కోటలో ఖైదీ ఐన
అభ్యుదయ ఆంధ్ర కవితా సారథి...!

నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని
గర్వంగా తల ఎత్తి గర్జించిన కంఠీరవం
బడాచోర్ రజాకార్ల దౌర్జన్యాల పై సమర శంఖం పూరించి
రుద్ర వీణ మీటిన తెలంగాణ వారధి...!

ఇదే మాట ఇదే మాట పదే పదే  అనేస్తాను
వద్దంటే గద్దె ఎక్కి పెద్దరికం చేస్తావా అంటూ
భావ ప్రేరిత ప్రసంగ జ్వాలతో రగిలించిన చైతన్య దివిటి 
చిన్న గూడూరు లో వికసించిన అభ్యుదయ పుష్పం
తెలంగాణ సాహితీ నిధి దాశరథీ..!

హామీ  పత్రం
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
3
[22/07, 8:34 pm] +91 98710 96566: దాశరథి పై ప్రత్యేక కవిత
పేరు : డా.కమలాదేవి
శీర్షిక :ప్రజావాణి
ప్రజావాణి, ప్రజాకవి  దాశరథి
కృష్ణమాచార్య
సాహిత్యసారథి, కవితాపయోనిథి దాశరథి
అభ్యుదయ కవితా పుష్పం
'తిమిరంలో సమరం చేసిన'
ఉద్యమకారుడు
'రుద్రవీణను' మోగించిన వైతాళికుడు
పద్యమే ఈతనిపదునైన ఆయుధం
తనకలమే గళంగా విప్లవ శంఖాలు పూరించిన విప్లవకవి
'నాతెలంగాణ కోటిరతనాల వీణ 'అని గర్వంగాప్రక టించిన 
మహాకవి దాశరథి 
తనవాణి ప్రజావాణి
పీడితప్రజల గొంతే తనగొంతుగా ఉద్యమాలు నడిపిన ఉద్యమకారుడు
పలుగ్రంథ రచయిత
కథలు,నాటకాలు, కవితలు
సినీగేయాలు పలు ప్రక్రియలు రచించిన మహాకవి
మహబూబాబాద్ జిల్లా వాసి
ఉపాధ్యాయుడు ఉపన్యాసకుడు
పంచాయతీ ఇన్స్పెక్టరు
ఆకాశవాణిప్రయోక్త ఆస్థానకవి
బహుభాషా కోవిదుడు
తెలంగాణ రచయితల సంఘా
ధ్యక్షుడు
'ఎవడు కాకతి ఎవడు రుద్రమ 
ఎవరు రాయలుఎవరుసింగన'
అంటూ ఎదురొడ్డి నిలబడగల ధైర్యశాలి 'అంతానేనే అన్నీ నేనే
అలుగునేనే పులుగు నేనే
వెలుగునేనే తెలుగునేనే'
అనగలవాడొక్కడే
అతడే మన దాశరథి 
దాశరథి కృష్ణమాచార్య.
అందుకోవయ్యా
మాసాహితీ సమీరాల 
నమస్సుగంధాలను.
4
పేరు-మద్ది.పుల్లారావు
ఊరు-నందిగామ
-----------------------------
శీర్షిక :కవి శ్రేష్ట దాశరథి రంగాచార్య
ప్రక్రియ:ఇష్టపది
తేదీ:22-7-2021
---------- 
1)

చిట్టిగూడూరులో....పుట్టిన దాశరథీ
రంగాచార్య పేర....రాణించినాడుగా

ఉద్యమ రూపశిల్పి...ఉపాధ్యాయుని గాను
గ్రంధ పాలకునిగా...ఘనమైన కవిగాను

ప్రసిద్ధి పొందినట్టి... ప్రముఖ తెలుగు రచయిత
ఆంధ్రమహాసభయూ...ఆర్య సమాజముయూ

అభ్యుదయ భావాల..యాకర్షించెయపుడు
రాయుదును ఇష్టపది.. రామచంద్రుని తలచి

2)
నిజాం పరిపాలన ను...నిగ్గదీసె రచనలు
ధారుణ బానిసతను...దాశరథి నిరసించె

మోదుగపూలు నవల...ముచ్చట గొలిపినదీ
చిల్లర దేవుళ్ళ తో..సిద్దహస్తుడనిపించె

అమృతంగమయ నవల...యధ్బుతముగా రాసె
ఇక్బాల్ కవితలతో..యిష్టుడయె యందరికి

సాయుధ పోరాటం.. సాహిత్యం తొ కలిసి
రాయుదును ఇష్టపది.. రామచంద్రుని తలచి

3)

ప్రభంజనం  సృష్టికి..బాటలు వేసినదీ
సర్వవిధ రచనలతొ..సర్వ శ్రేష్ట కవియాయె

వెండి కిరీటంతో..దండి సత్కారంతొ
దాశరథి దంపతులు.. తరియించె ఖమ్మం లో
 
చాల సత్కారాలు..చాల సన్మానాల
ఆంధ్ర సాహితి లోక...యభినవ వ్యాసుడాయె

దాశరథి జన్మముతొ... తరించె తెలుగు నేల
రాయుదును ఇష్టపది.. రామచంద్రుని తలచి
----------------------------
హామీ పత్రం- ఇది నా స్వంత రచన
5.
కవితా శీర్షిక:-
అభ్యుదయ కవితా చక్రవర్తి
..................................
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని
'దగాకోరు బటాకోరు ,రజాకారు పోషకుడవు దిగిపొమ్మని జగతంతా నగారాలు కొడుతున్నవి దిగిపోవోయ్, దిగిపోవోయ్ ' అని నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పీడిత వర్గాల ప్రజలగొంతుకై  నినదించిన పోరాటవీరుడు...!!

తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి గాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోనికి అనువదించి 
తల్లి తెలంగాణ మీద రచించిన గాలిబ్ గజళ్ళు ఎందరికో స్ఫూర్తి ...!!

ఎవరు రాయలు!ఎవరు సింగన!
అంతా నేనే!పులుగును నేనే! వెలుగును నేనే!
తెలుగును నేనేనని చెప్పి
అగ్నిధార, తిమీరంలో సమరం వంటివెన్నో రచించి
రాష్ట్ర,కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను అందుకొన్న  సరస్వతీ పుత్రుడు...!!

నడిరేయి ఏ జాములో 
తిరుమల మందిర సుందరా అని వేంకటేశ్వరుని పై 
దివినుండి భువికి దిగి వచ్చే దిగి వచ్చే 
గోదారిగట్టుంది గట్టుమీద చెట్టుంది
వ్రాశాను ప్రేమలేఖలెన్నో అందాల బొమ్మతో ఆటాడవా అని ఎన్నో ఎన్నెన్నో మధురమైన, మరపురాని సినీగీతాలనందించిన
దాశరధి కృష్ణమాచార్య
బహుముఖ ప్రజ్ఞాశాలి 
అభ్యుదయ కవితా చక్రవర్తి
వారికి శతకోటి వందనములు..!!
...............................
పేరు:-
     సాహిత్యరత్న
అయ్యలసోమయాజుల ప్రసాద్
రసాయనశాస్త్ర విశ్రాంత శాఖాధిపతి
బి.వి.కె కళాశాల
విశాఖపట్నం
చరవాణి:-9963265762
..................................హామీపత్రము:-
ఇది నా స్వీయ కవిత అనువాదం కాదు
..................................
6.
అతడు తెలంగాణ జన సారథి

నా పేరు ప్రజా కోటి నా ఊరు ప్రజా వాటి గుడగుడ


హుక్కా తాగి పడతుల మానాలు దోచిన నిజాం  మెడలు వంచిన మహాకవి


నిజామాబాద్ జైల్లో బంధించిన లెక్క చెయ్యని ప్రజా రవి


నా హృదయంలో కోటి భావాల జలపాతాన్ని గ్రహించిన కవి సింహం


నా కంటి పాపలో నిలిచిపోరా.. సినీ గేయం తో ఆరంగేట్రం.. దేశభక్తి గీతాలు అతని సొంతం


వేయివేణువులు వీణలు మ్రోగే మించిన కవి
ఎల్లరి శబ్దాన్ని గ్రహించిన కవి జనం అంతర్ నాదం వినిపించిన కవి రవి అతడు కవితా ప్రభాతం


చిన్న గూడూరు లో పుట్టిన దేశమంతా వ్యాపించి కళాప్రపూర్ణ డు

గౌరవ డాక్టరేట్ లకు కొదవలేదు

జైలు గోడలు దూకి నెల్లికుదురు అడవుల్లో నుంచి గుర్రంపై స్వారీ చేసి అంగీకారం శృంగారం మేళవించిన నా కవితల చెలికాడు


అగ్నిధార రుద్రవీణ లు మ్రోగించి కవితాపుష్పకం విరబూయించారు

మహాంధ్రోదయం లో కి నడిపించి

తిమిరంతో సమరం చేసిన కవి నా తెలంగాణ కోటి రత్నాల వీణ
తన గర్వముతో నిజాము పిశాచమా న్ని అతని పరిమాణాన్ని ఫార్మా నా దిక్కార గల మై స్వరమై మారుమ్రోగిన కొండలు కోనలు అరణ్యాలు అతడు నిజాము గుండెల్లో నిద్రపోయిన కవి

అతడే శరధి దాశరధి ఖమ్మం కవిత గుమ్మం అని ప్రకటన చేసిన ధీశాలి

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట
నిజాం నవాబును గద్దె దింప పోరు సల్పిన
ప్రజయోధుడు దాశరథీ...!

వైస్ ప్రిన్సిపాల్ కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల
7702537453
7.
[22/07, 9:00 pm] +91 83099 20625: కవితా గానం సీజన్ - 2
అంశం..దాశరథి

అగ్నిధారతో  అట్టుడికించావు
నవాబు గద్దెను
జైలు పాలయిన ఆదరక బెదరక బొగ్గుతో నా తెలంగాణ
రతనాల వీణ అని లిఖించినావు
ప్రజల వాణిని నీ వాణిగా జేసు
కున్నావు
పీడిత ప్రజల తరపున పోరాడినావు
చిట్టి గుడూరు వెలసినోడు
చిచ్చర పిడుగై నిజా0ను
గడగడలాడించే
సినీ వినీలాకాశంలో ధృవతారగా నిలిచే
ఎన్నో పాటల పరిమళాలను
సినీ లోకానికి అందించే
మృదుమధురాలను
విషాదగీతాలను
హాస్య రస పాటలను
సందర్భానుసారంగా
సమయస్ఫూర్తి గా
ఎన్నో గీతాలు రచించే
గాలిబ్ గీతాలను విరచించే
దాశరథి యువకవులకు స్ఫూర్తి
కవితల కావ్యాల చక్రవర్తి
జ్ఞాన విజ్ఞాన దీప్తి
చిరస్థాయిగా నిలిచే నీ కీర్తి
దాశరథి అందుకో మా సహస్ర వందనాలు!!
                  కవిత వేంకటేశ్వర్లు
8
[22/07, 9:02 pm] +91 79978 40591: దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా 

శీర్షిక: సాహితీ కుబేరుడు 

ఓ మహాకవి దాశరథీ 
నీ కలం ఒక జీవనది 
మండుతున్న అగ్నిజ్వాల 
పరుగెడుతున్న రేసుగుర్రం 

ఓ మహాకవి దాశరథీ 
అభ్యుదయ భావాలతో 
ప్రజల్లో చైతన్యం పరచి 
వెలుగుబాట వేసావు 

ఓ మహాకవి దాశరథీ 
ఆంధ్ర సారస్వత పరిషతకు నెలరాజువు 
మాటలతో పాటలల్లి మనసులు దోచిన 
కరుణా సాగరుడు మహాకవి దాశరథీ 

సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా 
ప్రసిద్ది చెంది,ఎన్నో బిరుదులు సత్కారాలు 
పొందిన తెలుగు తేజం మన దాశరథీ 

యువతరాన్ని ఉర్రూతలూగించే 
ప్రసంగాలుచేసి 
ప్రజలను చైతన్యం పరచి,
నిజాం నిరంకుశత్వాన్ని 
పారద్రోలి 
బంగారు తెలంగాణను తీర్చిదిద్దిన 
ఘనత దాశరథీ గారిదే 

అక్షర సేద్యంతో అన్యాయాన్ని ఎదురించి 
నిజాం ప్రభుత్వ దురాగతాలను  ఎండగట్టి 
అన్నదాతలకు అండగా నిలిచిన 
భరతమాత ముద్దుబిడ్డ మన దాశరథీ 

తీయ తీయని పలుకులతో 
నా తెలంగాణ కోటి రత్నాల వీణ 
అని చాటిన అక్షర శిల్పి మన దాశరథీ 
అందుకో మా అరుణారున వందనాలు 
*************************
ముత్యం వెంకటేశ్వరరావు 
గురజాల, గుంటూరు జిల్లా 
చరవాణి: 7997840591 
హామీపత్రం: ఈ రచన నా స్వీయ రచన ఎటువంటి అనువాదం కానీ అనుకరణ కాదని హామీ ఇస్తున్నాను
9
[22/07, 9:03 pm] Vanaparthy Gangadhar Poet: *కవితా గానం(సీజన్ 2)*
******************************
*అంశం:దాశరథి కృష్ణమాచార్యులు*
*శీర్షిక:నిత్య చైతన్య శీలి*

తెలంగాణ విప్లవ కెరటం అతడు
నిజాం గుండెల్లో నిప్పు కణిక అతడు
తెలంగాణా సాహితీ వనాన్ని
చైతన్య వంతం చేసిన సాహితీ వేత్త

తెలంగాణా ప్రజల కన్నీటిని
తుడిచి విముక్తికై పోరాడిన
ప్రజల మనిషి దాశరధి

నిజాం నిరంకుశ పాలనపై
తన అక్షర శరాలను సంధించిన
విప్లవ కవి,నిత్య చైతన్యశీలి

అభ్యుదయ కవిత్వ రథసారధి
తన కవనాన్ని ఆయుధంగా చేసి
నిజాం రాజును ఎదుర్కొన్న మహామనిషి

ముసలి నక్కకు రాచరికము దక్కనేల
జన్మ జన్మాల బూజు నిజాం రాజు
అంటూ అగ్నిదారై గర్జించి మహాకవి

నా కవనం ప్రజల పక్షం
నా జీవనం న్యాయ పోరాటం
ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనుంటా
నా బాట సమరం అని చాటినవాడు దాశరధి

నా తెలంగాణ కోటి రతనాల వీణ
అని ధైర్యంగా ప్రకటించిన సాహసి
తెలంగాణను శ్వాసించి,జీవించిన వ్యక్తి
వెన్ను చూపింది లేదు,వెనుకడుగు వేసింది లేదు
తన జీవితమే ఓ ఉద్యమం


*పేరు:వనపర్తి గంగాధర్*
ఊరు:హన్మకొండ
చరవాని:9440146435
తేదీ:22.07.2021

హామిపత్రం:ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
10.

కవితా గానం (సీజన్1)
పేరు:కె.ఇ.నిలమంగై
కలం పేరు:నీలా రంగనాధం
ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.
శీర్షిక: *అక్షర సంథాత*    
తేది:22/07/2021
        వచన కవిత్వం
చరవాణి సంఖ్య:8897155600

తిమిరంతో సమరం చేసి..,
నిజాం రాజుల గుండెల్లో గుబులు పుట్టించిన అక్షర సంథాత..!

అగ్నిధారలు కురిపించి..,
రుద్రవీణ మ్రోగించిన కవివరుండు..!
కలమనే హలాన్ని పట్టి సమసమాజ స్థాపనకై పోరాడిన కర్షకుడు..!

పీడిత,తాడిత ప్రజల పక్షాన నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశీలి..!

బహుభాషావేత్తై..,
వివిధ రచనా ప్రక్రియలలో రచనలు సల్పిన  సాహిత్య కృషీవలుడు..!

మహాశరథై చిత్ర సీమలో పాటల,మాటల మాంత్రికుడై  పాఠకుల మనసున నిల్చిన ఓరుగల్లు బిడ్డడు మన దాశరథి కృష్ణమాచార్య..!!!!
*ఈ కవిత ఈ సమూహం కొరకే రాసానని హామీ ఇస్తున్నాను.*

*నీలా రంగనాధం*
11.
శీర్షిక.దాశరథి
.............
 మకుటాయమాయమైనకవివి 
నీవేనయ్యా! విరిసినకవిమణి
ఆక్రందనాగ్నిధారకురిపించినమహామణి
నీకు సాటిలేదు బువిలోన ఎవరూ

 కవితాపయోనిథి దాశరథి
పద్యమే  ఆయుధంగాను నిలిపి
'నాతెలంగాణ కోటిరతనాల వీణ 'అన్నావు
మహాకవి దాశరథి 


మహబూబాబాద్ జిల్లా వాసి
పంచాయతీ ఇన్స్పెక్టరు
ఆకాశవాణిప్రయోక్త ఆస్థానకవి
బహుభాషా కోవిదుడు
తెలంగాణ రచయితల సంఘా
ధ్యక్షుడుగా వెలిగావు


వ్యతిరేకంగా పీడిత వర్గాల ప్రజలగొంతుకై  నినదించిన పోరాటవీరుడువు.!!
తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి గాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోనికి అనువదించినావు
తల్లి తెలంగాణ మీద రచించిన గాలిబ్ గజళ్ళు ఎందరికో స్ఫూర్తి గా నిలిచి

ఎవరు రాయలు!ఎవరు సింగన
రాష్ట్ర,కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను అందుకొన్న  సరస్వతీ పుత్రుడువు
జోహార్ జోహార్ అయ్యానీకు


ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
12.

[22/07, 9:17 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం సీజన్ 2 నిర్వహించు కవితా మాలిక

అంశం: దాశరథి

పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు

పోరు గడ్డ మీద పోటెత్తిన ఎర్రజెండా
తెలంగాణ పీడిత ప్రజల ఉద్యమ సారథి
అగ్నిధార కురిపించి 
రుద్రవీణ తంత్రుల్ని మీటి
తిమిరంతో సమరం సాగించి
ఆలోచనాలోచనాలు
రేకెత్తించి
ధ్వజమెత్తిన ప్రజతో 
విప్లవ స్ఫూర్తి!

రైతుదే తెలంగాణము
రైతుదే ముసలినక్కకు
రాజరికంబు దక్కునే

దగాకోరు బటాచోరు
రజాకారు పోషకుడవు
దిగి పొమ్మని జగత్తంతా నగరాలు కొడుతున్నది, తెగిపోవోయ్
గర్జించిన సింహం

తెలుగు సినిమా తెరపై విస్తృతమైన
పాటలకు చిరునామా
తనివితీర లేదు
ఏ దివిలో విరిసిన పారిజాతమో
దివి నుండి భువికి దిగి వచ్చిన పారిజతమో
మధురమైన సాహిత్యమందించిన
దాశరథి
సినిమా పరిశ్రమకు
తెలంగాణ పోరుకు
మధ్య ఉద్యమం వారధి
జైలు శిక్ష అనుభవించిన ఖైదీ
నా తెలంగాణ కోటి రతనాల వీణ!
నినదించిన కార్యశీలి!
      ***
           హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు అని నేను హామీ ఇస్తున్నాను.

//సయ్యద్ జహీర్ అహ్మద్//
13
[22/07, 9:17 pm] Indravat Rahul Poet Ks 11: ➖🌺➖🌺➖🌺➖


*శీర్షిక :* నాపేరు ప్రజాకోటి 

అగ్ని పిడుగు దాశరథి 
ప్రజా కోటి దాశరథి 
గాలిబ్ గీతాల మాంత్రికుడు 
బాల గేయాల పిల్లవాడు 
కళామతల్లికు ముద్దు బిడ్డ 
పీడిత ప్రజల వాణికి 
తన కవిత్వాన్ని మైక్గా
అమర్చిన ప్రజా కవి 
బహుభాషా వేత్త 
సాహిత్య సృజనకారుడు 
బాల్యం నుండి కవిత రచన 
చేసిన బహుభాషా కోవిదుడు
తెలంగాణలో కోటి 
ధీరుల గళ ధ్వనినీ మోగించిన వీరుడు
నాపేరు ప్రజాకోటి 
నా ఊరు ప్రజావాటి అని 
శంఖం మోగించిన ధీరుడు 
నా తెలంగాణ కోటి రత్నాల విణ 
చెప్పిన మహానుభావుడు దాశరథి..

*హామీ పత్రం :* స్వీయరచన 
  
       ధన్యవాదములు.. 🙏🌹

*ఇంద్రావత్ రాహుల్*
       కొత్తపేట్ 
    నిజామాబాద్ 
   9848054079
14.
శీర్షిక: దండి దాశరథీ
ప్రక్రియ: ఇష్టపది
తేది: 22-7-2021
————————————
పేరు: జక్కని గంగాధర్ 
ఊరు: ముంబాయి
చరవాణి: 90763 52347
————————————
1)
ప్రజాకవి దాశరథి-ప్రజల గుండెలొనుండె
సాహిత్యసారథీ-సద్గుణ సంపన్నుడు

అభ్యుదయకవివరుడు-అతడు సమరం చేసె
పద్యాలు యీతనీ-పదును యాయుధాలుగ

కలమే గళంగాను-కదిలె శంఖమూదియు
నా తెలంగాణనే-నా కోటి రతనాలు

ప్రజా వాణిగానూ-ప్రకటించిన దాశరథి
పీడితా ప్రజలనూ-పిలిచెను గొంతెత్తీ...

2)
ఉద్యమాల నడిపిన-ఉద్యమకారుడుగను
పలుగ్రంథములనూ-పలు నాటకము రాసె

సినీ గేయాలనే-చిత్రముగ రాసెనూ
ఉపాధ్యాయుడుగాను-ఉపన్యాసకుడుగను

ప్రముఖ తెలుగువాడుగ-ప్రసిధ్ధిగాంచినాడు
నిజాం పరిపాలనను-నిలదీసె దాశరథి

మధురమైన గీతాలు-మరపురానివెన్నో
జక్కనార్యుని మాట-జన హితంబాయేను...
22.7.21
————— 8 —————
పై ఇష్టపదులు నా స్వంత రచన అని, హామీ.
15.
[22/07, 9:27 pm] మన్నె లలిత గారు కవయిత్రి: కవితా గానం
 తేదీ :22/7 / 21 
అంశం: దాశరథి 
శీర్షిక : ఉద్యమ సింహం
పేరు :మన్నె పిన్నక లలిత
 హైదరాబాద్ 
 చరవాణి సంఖ్య:7416863289
*******************************
" ఆ చల్లని సముద్ర గర్భం  దాచుకున్న బడబాగ్ను లెన్నో..."
 దాశరధి గారి చల్లని వాక్యము

 చిన్ని గూడూరు లో జన్మించిన పెద్ద దాశరథి
 బహుభాషావేత్త తెలంగాణ ప్రజల కన్నీళ్లు అగ్నిధార దాశరథి దొరల దాష్టీకానికి వ్యతిరేకంగా నిజాం పాలనకు కవితా బాణాలు సంధించి తెలంగాణ విముక్తి  కి ఉద్యమించిన ఉద్యమ వీరుడు
 ప్రాతఃస్మరణీయుడు
 "నా తెలంగాణ కోటి రతనాల వీణ "అని గర్వంగా 
చెప్పి,ఆనాటి ,తర్వాత ఉద్యమాలకు 
స్ఫూర్తి ప్రదాత, ప్రేరణ దాశరథి !

జైలు గోడల పై బొగ్గుతో  పద్యాలు  రాసిన  విప్లవదాశరథి  
 నిజాం రాజును ఉద్దేశించి "దిగిపోవోయ్ " ... 
 "మా నిజాం రాజు జన్మజన్మల బూజు"  
అని ప్రాణాలకు తెగించి చెప్పిన  జాతీయవాది దాశరథి!

 'ఆలోచనాలోచనాలు'తో ధ్వజమెత్తిన ప్రజను చూచి 'కవితాపుష్పకం' సమర్పించి
 'తిమిరంతో సమరం' నేత్రపర్వంగా చేసి
 'గాలిబ్ గీతాల'తో 'పునర్నవం 'పొందిన రథసారధి!
 "గోదారి గట్టుంది "....."ఏదివిలో విరిసిన.."
" ఖుషీ ఖుషీగా నవ్వుతూ .."మనసే కోవెల ..."
""రా రా! కృష్ణయ్య ..." అంటూ 
పాటలపల్లకీలో ఎక్కించి పరవశింప చేసిన దాశరథి!
 "పూలరంగడు"లా తెలంగాణ కంచుకోట 
 కవన నిర్మాణం చేసిన శ్రీమంతుడు దాశరధి.
 అవార్డులకే అందం ఇచ్చిన
 దాశరథి కృష్ణమాచార్య గారు!
**************************************
16
[22/07, 9:28 pm] +91 95422 36764: *కవితా గానం సీజన్ 2*
అంశం: దాశరథి
పేరు:నాశబోయిన నరసింహ(నాన), 
ఊరు:చిట్యాల,నల్గొండ,
చరవాణి:9542236764,
⚜️⚜️⚜️⚜️⚜️♦️⚜️⚜️⚜️⚜️⚜️

*దాశరథి!..తీయని దేశభక్తి అనుభూతి!*
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''                                                                                    
ఆ నాలుగు అక్షరాలే....                                                                   స్వాతంత్ర్య సమర యోధుడై పోరాడినయ్                     
కోటి రతనాల వీణ మీటి సృజన శీలిని చేసినయ్                                                                              
అభ్యుదయ కవితా చక్రవర్తి కిరిటా నిచ్చినయ్                                                               
సాహిత్యాన శాస్త్రీయ స్పృహ రగిలించినయ్                                                                                               
                                                                                               
 ఆ నాలుగు అక్షరాలే...  
జైలు గోడ పేజీలపై కన్నీటి బొగ్గుతో రాసినయ్                                             అగ్ని ధారగా వర్షించి నిప్పు కణికై మండినయ్                          సాంస్కృతిక రుగ్మతల రూపు మాపినయ్
సామాజిక దురాచారాలపై తిరగబడినయ్
                                                                                                                                                                            
ఆ నాలుగు అక్షరాలే....                                                         నిరంకుశ నిజాంపై కవి సింహాలై గర్జించినయ్                                                                 
తెలంగాణ విముక్తికై పిడికిళ్లు బిగించినై                                                                                 
ఉద్యమ దివిటీలై తిమిరంతో సమరం చేసినయ్                                                                            నిద్రాణ తెలుగుజాతిని జాగృత పరిచినయ్                                         

ఆ నాలుగు అక్షరాలే....    
అక్షరాలకు రంగు రుచి అద్ది కమ్మని కవిత లైనయ్
వాసంత కళాశోభిత మధుర రస సినీ గీతాలైనయ్
ఉద్యమ ఊపిరిగా నిర్భంధ ఊచలు లెక్కించినయ్
పరిమళ కవనాలై ఆచంద్ర తారార్కంగా నిలిచినయ్

🌀🌀🌀🌀🌀♦️🌀🌀🌀🌀🌀

*హామీ పత్రం*: ఈ కవిత నా స్వీయ రచన. దేనికీ అనువాదం అనుసరణ కాదనీ హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు.
✍️ *నాన*

17.

*కవితా గానం సీజన్ 2*
తేదీ:22-07-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: దాశరథి
శీర్షిక: అభ్యుదయ కవితా చక్రవర్తి
*********************
ఆయన కలమెప్పుడూ సమాజ హితాన్ని కాంక్షించింది‌..

నిరంకుశ  నైజాం పాలనపై
జ్వలించిన ఆవేశం 
అక్షరాలతో సానపట్ఠిన పదునైన పద్యాయుధం అయ్యింది...
భౌతిక జీవనం కోసం
ఉపాధ్యాయుడు
పంచాయతీ ఇన్స్పెక్టర్ 
ఆకాశవాణి ప్రయోక్తగా ఎన్ని ఉద్యోగాలు చేసినా...

ఆయన కోరుకున్నది ఒక్కటే
తెలంగాణ సాధన
 పీడిత ప్రజల గొంతుగా
నిజాం గుండెల్లో గుబులు పుట్టేలా
 ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించిన కవి సింహం!

తెలంగాణ విమోచనోద్యమంలో జైలు శిక్ష అనుభవిస్తూ
పళ్ళు తోముకునే బొగ్గునే
కలంగా
ఓ నిజాం పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజని నినదిస్తూ
గోడలపై యుద్ధ కవాతు చేసిన
ధైర్యశాలి!

 నా తెలంగాణ కోటి రత్నాల వీణ
నా వీణ తీగలను తెంపిన నిన్ను
ఉపేక్షించేది లేదని విరుచుకుపడిన విప్లవ కెరటం!

వివిధ ప్రక్రియలతో
 తెలుగు సాహిత్యానికి పట్టం కట్టిన కవితా సారథి!

ఆలోచనా లోచనాలతో
అగ్ని ధారలు కురిపించి
రుద్రవీణను మీటిన కళా ప్రపూర్ణ!

అభ్యుదయ భావాలతో
గేయాలు సినీ గీతాలు రాసి 
ప్రజావళిని మెప్పించిన మహా కవి!
 తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ
భాషామ తల్లికి వర పుత్రుడు
సాహిత్యం  సమాజం రెండు కళ్ళుగా చేసుకొని
నేత్ర పర్వంగా  తిమిరంతో సమరం చేసిన మహా కవి !

 దాశరథి కృష్ణమాచార్య
అభ్యుదయ కవితా చక్రవర్తి!
 తెలుగు సాహిత్య చరిత్రలో
చెరగని ముద్ర వేసుకున్న దాశరథి సాహితీ జలధి!

 *వురిమళ్ల సునంద, ఖమ్మం*

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...