Skip to main content

సినారె ౯౦

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
***************
కవి వరుల జాబితా
1.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
2.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
3.దోసపాటి వెంకటరామచంద్రరావు గారు
4.గజవెళ్ళి శ్రీనివాసాచారిగారు
కాజీపేట హన్మకొండ జిల్లా గారు
5.జంపని శ్రీనివాసమూర్తి ( *జలజ* )🦜
గుంటూరు గారు  
7.మద్ది. పుల్లారావు గారు
నందిగామ
8.నాశబోయిన నరసింహ(నాన) గారు
ఊరు:చిట్యాల, నల్గొండ
9.డా బల్లూరి ఉమాదేవి గారు
10.గొర్రెపాటి శ్రీను గారు
11.ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు
12.కవిత వేంకటేశ్వర్లు కర్నూలు .గారు
13.కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం గారు
14.ముత్యం వెంకటేశ్వరరావు 
గురజాల, గుంటూరు జిల్లా గారు
15.వనపర్తి గంగాధర్*:హన్మకొండ
16.తాతపూడి సోమశేఖర శర్మ, యానాం గారు
17.ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి గారు
18.కోరాడ గారు
19.డా.పాండాల.గారు
20.సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం గారు
21.నీలా రంగనాధం గారు
22.మన్నె లలిత గారు
*********
1
కవితా గానం.
విశ్వంభర
*******""*
మల్లనార్యుడు
బుచ్చమాంబల
యెదలు పొంగగ
నవ్వులు ఏరులై పారంగ

ఆ మట్టి మనుషులు
ఒట్టి చేతుల
మన్ను పిసికి
మణులజేసెడి

ఇంట పూచెను
గడ్డి పువ్వు
మల్లె వాసన మంచి గంధం
పరిమళాలను వెద జల్లుతూ

వీధి బడిన ఉర్దు నేర్చి
పట్నం ఒడిలో తెలుగు ఇంగ్లీషు
ఔపోసన పట్టి ,,విశ్వ విద్యాలయం లో
ఆచార్యా! నీవు భలే గడసరి సినారె.

పల్లె నీకు పాట నేర్పి
పట్న మెమో మాటనేర్పగ
నీకు తోడుగ నిలిచె వాణి
కావ్య రచనలో అమ్మగా

వాణి నిన్నే ఆవహించి
ఖండాంతరాల వినిపించింది నీ వాణి
మురిసి పోయిన హంసవాహిని
శారదాంబై మోసుకెళ్ళి, నిన్ను జ్ఞానపీఠమెక్కించి తెలుగు ఖ్యాతిని
నలుచెరుగుల వినిపించె, సినారె

దొరుకునా నీవు లేకుంటే
తెలుగు తల్లికీమకుటం
తెలుసునా ఎవరికైనా
ఈ మట్టి (విశ్వంభర) రహస్యం

వీణ తంత్రులు మీటుతూ
మదిని రాగాలల్లుతు
అంగారాన్ని శృంగారాన్ని
వియోగాన్ని విప్లవాన్ని
పాటై పల్లవించు సినారె

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు. 28721
2
సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం (సీజన్ 2) కవితా సుమహారం
అంశం: సినారె జయంతి
    
 *సాహితీ* *పిపాసకుడు* 

విశ్వంభరతో వినుతికెక్కి
జ్ఞానపీఠం ఎక్కి
అక్షర జ్యోతి వెలిగించి
అమరుడయ్యె సినారె!

తెలంగాణ మాగాణి
తెలుగుదనానికి మూర్తిమత్వం
కప్పి చెప్పు కవిత్వం
విప్పి చెప్పు గద్యము
ప్ర'పంచపదులతో పదవిన్యాసము
గౙల్ గేయాలు 
రాగయుక్త సరిగమలు

మట్టి మనిషి ఆకాశం
అస్తిత్వానికి కాలానికి
అనుసంధాన గమనము
రామప్ప గుడి రాగిణి నాగిని కాంతులు
తెలుగు జాతి గర్వించిన
రాయలసీమ గడ్డ
చరిత్ర తెలియజేసిన
తెలంగాణ బిడ్డ!!

శృంగార వీణ రాగాలు
కర్పూర వసంత రాయలు
వినువీధిలో విపంచిక
విజ్ఞాన దీపికలో మయూఖ సినారె గీతిక
ముక్తకాల రుబాయిల
పద్య గద్య వచన రూపకల్పన సినారె గనుక!
సంప్రదాయానికి ప్రాణం పోయు
కవిత్వానికి హారతి పట్టి ఆరాధించు సినారెకు నీరాజనం!
     ***

      హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు ప్రసారం కాని ప్రచురణ కాని కాలేదు అని నేను హామీ ఇస్తున్నాను.

//సయ్యద్ జహీర్ అహ్మద్//
3

అంశం:సినారేజయంతి
శీర్షిక:సాహితీశిఖరం సినారే
సినారే సాహితీక్షేత్రంలో విరబూసిన కుసుమం
అయనొక సాహితీశిఖరం
ప్రాధమికవిద్య ఉర్దూలో చదివితే
ఉస్మానియా విశ్శవిద్యాలయంలో ఎమ్ ఏ తెలుగు చేశారు
తెలంగాణ జానపద జీవితమంటే మక్కువెక్కువే
చిన్ననాటినుండి జానపదకళారూపాలు వింటూ పెరిగారు
వివిధసాహితీప్రక్రియలలో రచనలు చేశారు
గజల్స్ రాయడం స్వంతంగా స్వరగానంచేసేవారు
విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు పొందిన రెండోవ్యక్తి గా పేరుపొందాడు
చలనచిత్రగీతాలతో ఎందరిహృదయాలనో దోచుకున్నారు
అత్యున్నతపదవులెన్నింటినో అలంకరించారు
రాజ్యసభసభ్యునిగా రాణించారు
మంచివక్తగా ఉపన్యాసుకునిగా పేరుపొందారు
తెలుగుభాషాచరిత్రలో అయనదొక సువర్ణాక్షారలతో
రాయదగిన అంశం
మరువలేము మరువజాలము ఆ మహనీయుని సాహిత్యప్రకాశము!

ఇది నా స్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం,శ్రీకాకుళంజిల్లా
చరవాణి7780594995.
4
[28/07, 8:21 pm] +91 90594 38068: కవితాగానం 
అంశం: సినారె పై కవిత
...
నాలుగెకరాల పొలాన్ని 
సేద్యం చేస్తూ బతకాలని 
కోరుకున్నది సినారె తల్లి

సాహితి క్షేత్రాన్ని 
కలంతో దున్ని 
కవితా కుసుమాలు పండించి
సాహితి ప్రియులకు పంచిన 
కవితా సాహిత్య సేద్యకారుడు సినారె

ఉర్దూ మాధ్యమంలో చదివినా 
తెలుగు సాహిత్యంలో 
డాక్టరేటు పట్టా పొంది 
ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించి
ఎన్నో కావ్యాలు రచించి
విశ్వంభర కావ్యానికి 
జ్ఞానపీఠం అవార్డు పొందిన 
సాహితీ శిఖరం

పాలనురుగు వంటి 
తెల్లటి ధోవతి లాల్చీలో 
తెలుగు వైభవానికి 
నిలువెత్తు సంతకం సినారె 

అక్షర శిల్పికి 
అక్షర నీరాజనాలు 
...
గజవెళ్ళి శ్రీనివాసాచారి
కాజీపేట హన్మకొండ జిల్లా
5
*జంపని శ్రీనివాసమూర్తి* ( *జలజ* )🦜
గుంటూరు
28 - 7 - 2021
80742 97465

అంశము: సినారె.( జయంతి సందర్బంగా)
శీర్షిక: *అక్షర ప్రేమికుడు*

అందమైన అక్షర హిమబిందువులా
చినుకు చినుకుగా మారి
అందాల చిరు జల్లుగా కురిసి
సన్నని సెలయేరుగా పారి,
జలపాతమై ఉరుకలేస్తూ
పరవళ్ళు త్రొక్కుతూ....
ముందుకు సాగి,...

సాహిత్యంలో కాంతులు
ప్రసరించిన ఓ *విశ్వకవన మూర్తీ!*
శబ్దమనే జ్యోతి అంబరం అంతా
వెలుగులు వెదజల్లకపోతే ముల్లోకాలు
అల్లకల్లోలమై కటిక చీకట్లో అలమటిస్తూ వుంటుందనే నానుడిలా,

కవితే మీ శ్వాసగా,
నిరంతర సాహిత్య సేవయే ధ్యేయంగా
కీర్తి గడించిన తపస్వీ *కర్పూర వసంతరాయా*!
సరస సాహిత్య చతుర్ముఖా!

అమ్మచేతి తాలింపు కమ్మదనంలా
విశ్వ మనస్సుల్లో ముద్ర వేసుకున్న
ఓ *విశ్వంభర మూర్తీ*!
నవరస రుచితములైన *కవిత్వం, వ్యాస, గేయ నాటికల - సినిమా పాటల, సంగీత రూపకాల, పద్య - గద్య కావ్య నృత్యాల గజల్స్* లతో
 సాహిత్య వంటలు చేసి,  జాతి ప్రజలకు
మృష్టాన్న భోజనముగా అందించిన ఓ *సినారే* అక్షర ప్రేమికా!

మీకు దోసెడు పారిజాత అక్షర సుమాలతో
అభిషేకం చేస్తున్నాము స్వీకరించవయ్యా ఓ సరస్వతీ పుత్రా🦜
----------------------------------------------------
6
అంశము:-" సినారెగారి జయంతిసందర్భంగా:-

చిత్రంబళారెవిచిత్ర మనుచుచిత్రగీతము
మధురమైగీతమోగ

ఏపాటనైనను నేపద్యమైనను
మనసినారెకవితయని మనకుదెలుపు

మూగజీవులలోని మూగభావాలను
వినగలిగినంత వినగదెలుపు

ముద్దబంతిపలుకు మూగవేదనకూడ
మనసుకు హత్తగ మనకు జెప్పు

తోటలోరాజంత తొంగిచూడంగాను
నీటిలోనవ్వించు నీవుమురియ

నేనులో ఏముంది నీవులో ఏముందనుచు ప్రశ్నలు వేసినను
తానేసిన ప్రశ్నలకు తానెజవాబిచ్చు

పాటలరచయిత పదునుబెట్టినగీతాలు
పదిమందిగాయకులు పాడగాను
మధురమైనపాటలు మరిపించు వేదనలు

పాటలెకాదు పద్యాలైన గజల్లె కాదు
రామప్పమొదలగు కావ్యాలైన
రమ్య మైనభావాలు కదలాడుచుండు

సాహిత్య రంగాన సత్కీర్తిగాంచి
విశ్వంబరుడుగాను వినుతికెక్కె

జ్ఞానపీఠమునకు ఖ్యాతిదెచ్చెసినారె
ఈసినారె కెవరు యిలనుసాటి!!
         తరణికంటి సూర్యలక్ష్మి.
7
                  ------------
---
సింగిరెడ్డి నారాయణరెడ్డి.
సాహితీ రంగంలో వెలిగించెను బుడ్డి
సాంస్కృతికోద్యమ ప్రతీక
తెలుగునాట కీర్తి ప్రతాక
మహాకవి గా పేరొందె
మదురవక్త గా వాసికెక్కె
సద్విమర్శకునిగా రాణించె
సినీగేయ రచయిత గా ప్రసిద్దుడాయె
బహుముఖ ప్రజ్ఞాశాలి యని కీర్తి గడించె

విశిష్ట అధ్యాపకుడతడు
విశేష పరిపాలకుడు

కవితాయాత్ర లో ఎన్నో మైలురాళ్ళు
సాదించాడెన్నో మేలురాళ్ళు

నలబై కి పైగా కావ్యాలు
వందల సంఖ్య లో గేయాలు

ఆధునికాంద్ర కవిత్వం
నాగార్జున సాగరం
మద్యతరగతి మందహాసం
మరెన్నో యద్భుత రచనలు
 'విశ్వంబర'కు జ్ఞానపీఠ
మారుమ్రోగె ప్రతినోట సి.నా.రె మాట

'గుహనుండి మహలు దాకా
నడక నుండి రోదసీనౌక దాకా
అమ్ముల నుండి అణ్వస్త్రాల దాకా
దివిటీల నుండి విద్యుద్దీపాలదాకా'

విశ్వంబర లో సి.నారె చెప్పిన
మానవుని ప్రగతిపదం
ఏమని చెప్పను ఆ పదవిన్యాసం
లోతైన ఆ వాక్య గాంభీర్యం
అది ఆ పద్మభూషణునికే చెల్లు
అందుకే ఆయన అవార్డు ల హరివిల్లు

తెలుగు నాట సి.నా.రె జన్మము
తెలుగు వారు చేసిన పుణ్యము
 తెలుగు ను వెలిగించి న మహా కవి
జనహృదయాలను గెలిచిన మదురకవి
 జోహార్ సి.నా.రె
అమర్ రహే సి.నా.రె
..........
ఇది నా స్వీయరచన.
....మద్ది. పుల్లారావు
నందిగామ
9951287113
8
అంశం: సి.నా.రె.
పేరు: నాశబోయిన నరసింహ(నాన)
ఊరు:చిట్యాల, నల్గొండ
చరవాణి:9542236764
🌾🎋🌾🎋🌾🎋♦️🌾🎋🌾🎋🌾🎋
*తెలుగు గజల్ రారాజు*
~~~~~~~~~~~~~
నిండు కండువా పంచె కట్టు 
తెలుగు తనం తొణికిస లాడగ 
లక్షల అక్షర మెదళ్లకు ప్రేరణగా 
సాహితీ చెలక చదునుగా దున్నేసి                                                         
టన్నుల కొద్దీ కవన సిరులు పండించిన                                                   
భళారే!తెలుగు గజల్ రారాజు సినారె! 

ఎగురలేని అక్షర పక్షులకు 
రంగు రంగుల రెక్కలు తొడిగి 
మేరు వన్నె మెరుగుల సొబగు లద్ది 
విశ్వమంతా విరజిమ్మే తెలుగు తేజం  
రెపరెప లాడే విశ్వంభర విజయ ధ్వజం 
భళారే!పద్మ విభూషణ సినారె! 
                                 
ఉరక లేసే గజల్ జల పాతాలతో
ఆరని జ్వాలల విప్లవ వేడి రాజేసి                                                    
సృజనాత్మక భావుకత సమపాళ్ళలో
చమత్కార రసాత్మకాలు రంగరించి                      
సామాజిక రుగ్మత శస్త్ర చికిత్సకారీ                                                                       
భళారే!జ్ఞానపీఠ కీర్తి కిరీటి సినారె!! 

సగటు మనిషి ఆలోచనాంకురం నుంచి 
తాత్విక సిద్ధాంత ప్రయోగకర్త దాకా 
శ్రమ జీవన సౌందర్యావిష్కరణతో 
వెలిగించే మనోవికాస చైతన్య దీప కళిక                                  
విశ్వ మానవ హృదయాంతర్య శోధకా                                   
భళారే!నిత్య సత్య ఆచార్య సినారె!                                     
                             
మది దోచే మధుర సినీ గీతాలైనా
ఆణి ముత్యాల కావ్య రాసులైనా                                          విలసిల్లిన కవితా శిల్ప సౌందర్యం             
శబ్ద లయల హొయలొలికించే విశ్వగీతి  
అద్భుత అజంతా సుందరి సుచిత్ర శిల్పి  
అక్షర నివాళి!కవిలోక నారాయణ సినారె!
🌀🌀🌀🌀🌀♦️♦️🌀🌀🌀🌀🌀

*హామీ పత్రం*: ఈ కవిత నా స్వీయ రచన. దేనికీ అనువాదం అనుసరణ కాదనీ హామీ ఇస్తున్నాను.ధన్యవాదాలు.
✍️ *నాన*
9

డా బల్లూరి ఉమాదేవి
శీర్షిక:విశ్వంభరుడు


ఆ.వె:జగతి జనులు  మెచ్చు సాహితీ వేత్తవు

      పగలె వెన్నెల యని పరవశింప

        చేసి తీవు గాదె చిత్తముల నిలను

      మరువ శక్యమౌనె మాన్యచరిత.

2.ఆ.వె:తెలుగుభాషలోని తీయందనమునెల్ల

    పాటలందె గూర్చి వాసిగాను

    తెలుగు వారి మదిని దేదీప్యమైవెల్గు

    జ్ఞాని వయ్య నీవు కవికిరీటి.

3.ఆ.వె:బుర్రకథలనెన్నొ భువిలోన రచియించి

     ఖ్యాతి నందినట్టి ఘనుడవీవె

    పద్యనాటికలను గద్యములో కూడ

   వ్రాసినావటండ్రు  బాల్యమందె .

4.సీ:విశ్వంభరను వ్రాసి విశ్వము నందున

  జ్ఞానపీఠ వరసన్మానితుండ

వనుచు నిను సినారె యను ముద్దు పేరున

   మెత్తురయ్య జనులు మేలటంచు

భక్తి పాటలనైన రక్తిపాటలనైన

నవలీలగావ్రాసి యవని జనుల

చిత్తములనలర చేసిన కవివీవె

పదవులెన్నో నిన్ను వలచి వచ్చె

ఆ.వె:లాలి లాలి యనుచు జోలపాటలు వ్రాసి
        నాన్న మనసు చూడ వెన్న యనుచు
      తల్లి కన్న గొప్ప దైవమే లేదని
     చాటి చెప్పినట్టి మేటి వీవె.

   5 ఆ.వె:వీధిబడిని చదివి విశ్వ విఖ్యాత్యుడౌ

     విజ్ఞుడీవె గాదె విమలచరిత

     జ్ఞానపీణఠమంది జ్ఞానియై వెలిగిన

    సూరివర్య నీకు జోతలివిగొ.
౧౦.
                 

          శీర్షిక:     "సినారె" 


సింగిరెడ్డి నారాయణ రెడ్డి..
"సినారె" గా తెలుగుసాహితీచరిత్ర లో సువర్ణాక్షరాలతో లిఖించిన పేరు !
అధ్యాపకుడి గా తన తొలి ఉద్యోగజీవితాన్ని ప్రారంభించి..
ఎందరో తెలుగు విద్యార్ధులకి తేటతెలుగు తేనెలతీయదనాన్ని పరిచయం చేసిన తెలుగుసాహితీవేత్త ! 
"నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని.." అంటూ గులేబకావళి చిత్రం లో తొలి పాట వ్రాసి ..
"నీ ధర్మం.. నీ సంఘం.. నీ దేశం.. నువు మరవద్దు
జాతిని నడిపి.. నీతిని నిలిపిన.. మహనీయులనే మరవద్దు " 
అంటూ సమాజ హితాన్ని కాంక్షిచే ,స్ఫూర్తిని రగిలించే కమనీయ గీతాలెన్నో రచించి ..
"అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించిన అర్థమున్నదా..
జగమే పలికే శాశ్వత సత్యమిదే.." అంటూ అమ్మగొప్పతనాన్ని కమ్మగా వర్ణించి..
తెలుగుసినీకళామతల్లి కి అక్షరనీరాజనం చేసిన గీత రచయిత !
"నాగార్జున సాగరం" "స్వప్నభంగం" "కర్పూర వసంతరాయలు" వంటి కవితాసంకలాలు మనకి అందించి ..
తెలుగు ప్రజల హృదయాలలో నిత్యస్మరణీయుడు ..మహనీయుడు మన సినారె !
నిలువెత్తు మంచితనం..మూర్తీభవించిన మానవత్వం ..
మాటలలో చిరుహాస్యం ..కుల,మత,ప్రాంతాలకు అతీతంగా..
అశేష తెలుగు ప్రజల హృదయతంత్రులను "సమ్మోహన నవ్యగేయమై.." 
మీటిన అక్షరసేనాని అతడే.. సినారె !  
పద్యం,గద్యం , గేయం , గజల్ , పాట , బుర్ర కథ..వంటి విభిన్న సాహితీ ప్రక్రియల్లో..
తెలుగుసాహితీక్షేత్రం లో..ఆయన కలం చేసిన అక్షరసేద్యం అసామాన్యము ... 
"విశ్వంభర" కావ్య రచన తో ..
సినారె జ్ఞానపీఠాన్ని అందుకోగా,విశ్వమంతా తెలుగుఖ్యాతి వర్ధిల్లగా..
"తెలుగు తల్లి" తనముద్దుబిడ్డని చూసి మురిసే ! 

 
 : గొర్రెపాటి శ్రీను ( 9652832290 )
౧౧
అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు Poet Vizag: 
శీర్షిక:-
సరస్వతీ పుత్రులు సి.నా.రె
..................................
సాధారణ రైతు కుటుంబంలో  జన్మించినా
అసాధారణ ప్రతిభ చూపి
జానపదాల నుంచి జ్ఞానపీఠం వరకు హిమాలయమంత ఎత్తు ఎదిగిన సి .నా. రె.
మీ కివే శతకోటి వందనములు......!!

బాల్యంలోనే సుశీలమ్మను
ధర్మపత్ని గా స్వీకరించి
నలుగురు కుమార్తెలకు 
గంగ, యమున, సరస్వతి మరియు కృష్ణవేణి అని నామకరణం చేసి  ఆర్షధర్మమే నా ఆదర్శం
అని చాటిన సి.నా. రె.
మీకు శతకోటి వందనములు.......!!

విశ్వంభర కావ్యంతో
జ్ఞానపీఠం పురస్కారాన్ని పొంది విశ్వానికే తెలుగుభాష మధురిమను అందచేసిన మహనీయులు.
భారతదేశాభాషలలోనే గాక
పాశ్చాత్య భాషలలో మీ రచనలు అనువదింపబడటం తెలుగుజాతికే గర్వకారణం.
స్రవంతి సాహిత్య మాసపత్రిక సంపాదకునిగా
సేవలందించిన సాహితీమూర్తులు.
పద్మశ్రీ, పద్మభూషణ్, కళాప్రపూర్ణ ,అత్యున్నత జ్ఞానపీఠ  వంటి ఎన్నో ఎన్నెన్నో పురస్కారాలకే
వన్నె తెచ్చిన  సి.నా. రె
మీకివే శతకోటి వందనములు......!!

భారతమాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు అన్న,
నన్నుదోచుకొందువటే వెన్నెల దొరసాని అన్న,
అన్నయ్యసన్నిధి అదేనాకు పెన్నిధి అన్న
అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం  అని
మూడువేల సినీగీతాలను వ్రాసి సినీప్రపంచంలో రారాజు గా నిలచిన
సి.నా. రె.మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. సాక్షాత్తు సరస్వతీ పుత్రులే .అందుకోండి
మీకివే మా శతకోటి వందనములు......!!
..............................
పేరు:-
 కవిమిత్ర, సాహిత్యరత్న
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
రసాయనశాస్త్ర విశ్రాంత శాఖాధిపతి.
విశాఖపట్నం
చరవాణి:-9963265762
................................
౧౨

అంశం:: సి.నా.రె. జయంతి
శీర్షిక:: విజ్ఞాన విశ్వ0బరా

పుట్టింది హనుమాజీ పేట
పట్టింది సాహిత్యపు బాట
బుచ్చమ్మ మల్లారెడ్డి పుణ్య
దంపతుల నోముల పంట
ఉదయించే కవి సవిత రైతు ఇంట

చదువుతూనే యతి ప్రాసలు 
తెలియకనే వ్రాసే సీస పద్యాలు
శ్రద్ధగా ఆలకించే జానపదాలు
హరికథలు
అభ్యసించే ఉర్దులో ఉన్నత చదువులు!!

ఎన్నో ఉన్నత పదవులు చేపట్టిన
ఎన్నో వేల గీతాలు లిఖించిన
పద్యాలు గద్యాలు గజల్లు
వ్యాసాలు గేయ నాటికలు
సంగీత రూపకాలు 

సినీగీతాలకు సింగారాలు జేస్థివి
బంగారం లాంటి పాటలు
అందిస్థివి
జనం నాలుకలపై నాట్యమాడిస్థివి 
చలన చిత్రాలలో చిరస్థాయిగా
నిలిస్తివి

పంచకట్టులో తెలుగుదనం
పాళీలో తెలుగు కవనం
తెలుగుకే గర్వకారణం
తెలుగు జాతికే కంఠభరణం

"విశ్వ0భర"తో విశ్వానికే పరిచయం
"జ్ఞానపీఠ0"తో జగతికే అలంకారం
యువకవులకు నిఘంటువు
సి.నా.రె
అక్షరాలను ఆకాశంలో విహరింప జేసినావు భళారే!!
               కవిత వేంకటేశ్వర్లు
కర్నూలు.    8309920625
పై కవిత నా స్వీయ రచన అని
హామీ
౧౩
అతనొక విశ్వంభరమంత జ్ఞానపీఠం...!
_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం
చరవాణి:7032504646
అతనొక విశ్వంభర మంత  జ్ఞానపీఠం
అతనొక కర్పూర వసంత రాయలు రాజసం
అతనొక సాహితీ పద్మ భూషణం
అతనొక సుశీల గుణ సంపన్నం...!

అతని కలం విభిన్న కృతులకు సాక్ష్యం
అతని గళం గజళ్ళ గజరాజస గాంభీర్యం
అతని బలం భూగోళమంత  మానవత్వం
అతని దళం కలిసి నడిచే వ్యక్తిత్వం...!

అతని పద్య గద్య కావ్యాలు రాగ ఝరీ  తరంగం
అతని హృదయం గంగ యమున సరస్వతి కృష్ణవేణి ల సంగమం
అతని వర్ణన అజంతా సుందరి యవ్వన సౌందర్యం
అతని చలన చిత్ర గీతాలు తేనె తీయని మధురాతి మధురం...!

అతని తపస్సు వసుధైక కుటుంబమంత సంక్షేమం
అతని తేజస్సు అక్షర మాలల ఉషాకిరణం
అతనే...
మల్లారెడ్డి బుచ్చమ్మ ల ముద్దు బిడ్డ పౌర్ణమి నాటి చంద్రుడు
సింగిరెడ్డి నారాయణరెడ్డి సి నా రే  నామధేయూడు...!
హామీ పత్రం
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
౧౪

శీర్షిక: సాహితీ సంపన్నుడు 

తెలుగు జాతికి వన్నె తెచ్చిన తెలుగు తేజం 
చల్లని గాలులతో సరసమాడి 
పండు వెన్నెలమ్మతో ముచ్చడించి 
గల గలా సెలయేరులా పారే ఆయన కలం 
అందమైన ప్రవహించే ఒక జీవనది 
తేట తెలుగును చిలికించి చక్కని కమ్మని 
మధురమైన భావాలతో
వెండితెరకు అద్భుతాలు సృష్టించిన సినారె రచనలు 
అఖిలాంధ్ర ప్రేక్షకుల హృదయాలలో 
చిరస్థాయిగా నిలిచిపోయే మధుర స్మృతులు 
తెలంగాణ సంస్కృతిని నలుమూలలు చాటి 
చలనచిత్ర పరిశ్రమకు తెలుగామృతం 
అందించి,విశ్వంభర కావ్యానికి 
జ్ఞానపీఠ్ పురస్కారం అందుకున్న డా.సినారె
సాహితీ వనంలో సుగంధాలు పూయించి
తెలుగు భాషకు గత వైభవాన్ని తీసుకొచ్చిన సినారె 
తెలుగును వెలుగు భాషగా జగతికి 
చాటిన గొప్ప దార్శనికుడు సినారె 
తేనెలూరే తేట తెలుగును ప్రపంచానికి 
పంచిన మహానుభావుడు సినారె 
ఆయన సాహితీ సేవలను స్మరించుకుందాం!
*************************
ముత్యం వెంకటేశ్వరరావు 
గురజాల, గుంటూరు జిల్లా 
చరవాణి: 7997840591 
హామీపత్రం: ఈ రచన నా స్వీయ రచన ఎటువంటి అనువాదం కానీ అనుకరణ కాదని హామీ ఇస్తున్నాను
౧౫

*******************************
*శీర్షిక:విశ్వనరుడు*

రైతు కుటుంబంలో పుట్టిన కైతల రైతు సినారె
సామాన్య కుటుంబంలో జన్మించిన అసామాన్యుడు
సరస్వతమ్మ ఒడిలో అక్షరాలతో ఆడుకున్న అక్షరశిల్పి
ఎన్నో మహా కావ్యాలకు శిల్పాక్షరాలు దిద్దిన చిత్రకారుడు

'పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికంటూ'
మనిషిలోని స్వార్థాన్ని ప్రశ్నించిన నిస్వార్థవాది
నల్లని రాళ్లలో గుండె సవ్వడిని ఆలకించినవాడు
సమతా భావన కోసం అక్షరాలు సంధించిన అభ్యుదయవాది

సమాజపోకడలపై కవితాక్షరాలను సంధించిన సవ్యసాచి
అతని కలానికి రెండు వైపులా పదునే ఒకటి ప్రణయమైతే రెండోది హృదయం
వచనమైన పద్యమైనా సంధించడమే తెలుసు
అది శరాఘాతమో ,పూలవర్షాన్నో కురిపించేది

మానవత్వ విలువలను కావ్యాలుగా మలచి
కమ్మని కోయిల పాటల ఝంకారాన్ని ఆలపించాడు
సినారె సింగిడి అందం నీ కావ్యాలు
నవరస భరితం నీ అక్షర అమృతాభిషేకాలు

తెలుగు ఉర్దూ ఉభయ భాషా పండిత ప్రావీణ్యుడవు
ప్రపంచపదులను నాగార్జున సాగరమై పరవళ్ళెత్తించావు
సాహితీ జగత్తులో పున్నమి రేడువై వెలిగావు
ప్రవహించే అక్షర కవితా ఝరివి,నిత్య చైతన్యశీలివి

నీ కలంలో గజల్ అమృతధార లొలికిస్తూ
మానవ జీవిత ఇజాలను, నిజాలను ఆవిష్కరించావు
మట్టీ,మనిషి ,ఆకాశమే నీ హద్దు
విశ్వానికి విశ్వగీతి పాడిన విశ్వనరుడవయ్యావు

సినీ వినీలాకాశంలో విరిసిన గీతాల సంగీత రసధునివి
సినీ గీతాలకు వన్నెతెచ్చిన  వన్నెగాడివి
నువ్వో ఆచార్యునివి జ్ఞానానికే వెలుగు నిచ్చిన విజ్ఞానివి
నీ గానం సప్త స్వరాల  సవ్వడి

తెలంగాణా మాగాణంలో అక్షరాలు చల్లి
కవన సేద్యం చేసిన రైతు కవివి
సాహితీ లోకానికి పద్మ భూషణుడివి

తెలుగు భాషకు తేనె సుధలొలికించిన
తెలుగు భాషామ తల్లి ఒడిలో మణిహారం
ఆధునికాంధ్ర సాహిత్యాన్ని గగనసీమలో
విహరింప చేసిన కళాప్రపూర్ణుడివి

ఓ తెలంగాణ ముద్దు బిడ్డ నిన్ను మరువదు ఈ గడ్డ
బహుముఖ ప్రజ్ఞాశాలివి అతిరథ కవితా విశారధుడివి
విశ్వానికి వెలుగు రేఖై విశ్వతరాలలో విశ్వంభరుడవయ్యావు
నిత్య జ్ఞానివయ్యావు,జ్ఞానపీఠా నివయ్యావు
ఓ సింగిరెడ్డి నీకు వంగి దండాలర్పిస్తున్నాము


*పేరు:వనపర్తి గంగాధర్*
ఊరు:హన్మకొండ
చరవాని:9440146435
తేదీ:28.07.2021


హామీపత్రం:ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
౧౬
తాతపూడి సోమశేఖర శర్మ: కవితా గానం సీజన్ 2
అంశం.. సినారె జయంతి
శీర్షిక..అభినవ సాహిత్య ధ్రువతార 
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336

హిందూ సాంప్రదాయపు పంచెకట్టు
కుర్తా ఫైన వ్రేలాడే అంచు కండువా
తెలుగుతనం తొనికిసలాడే వేషధారణ
ఎన్నిఎన్నెన్నిపాటలు ఎన్నో లెక్కలేనన్ని

పగలు వెన్నెల కాయించాలన్నా
జగమంతా ఊయలగా మలచాలన్నా
రెక్కలు తొడిగి రెప రెపలాడించాన్నా
కోరికను రివ్వు రివ్వు మనిపించలన్నా
సాటి నీవేగదా! నారాయణా! సినారే!

ఎప్పడుచెరగని ఆంధ్రులఅభిమానం
ఎన్నటికి ఎవరూ వీడని అనందగీతం
ఏనాటినుండో గుండెలోతుల్లో గీతిక
ఏశుభాకార్యక్రమమైన వినాయకుడు
సినారెప్రక్కప్రక్కస్థానాల్లో నిలబడతారు
ఆ అందాల మంచి పాట ఈనాటి కైనా
ఏనాటికైనా నూటికినూరుశాతంమంచే
భలే మంచి రోజు పసందైన రోజూ.....
వసంతాలు పూచే నేటి రోజూ.......
సూర్యచంద్రులున్నoతకాలం పాడుకునే
అద్భుత ఆనంద లావణ్య శుభ గీతం..

అభినందన మందారమాలతో......
అభినవ నారాయణుడిని చిరంజీవిగా
అందరం ఆరాదిద్దాం ప్రతి నిత్యం
ఆరాధనతో నారాయణగీతాలతో
ఆకలింపు చేసుకుంటూ శ్రవణానందం
అనుభవిస్తూ హాయిగా విహరిద్దాం.

ఈ కవిత నా స్వీయ రచన అని హామీ
ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
౧౭

   
""   తెలుగుతల్లి ముద్దుబిడ్డ  ""

బుచ్చమ్మ మల్లారెడ్డిల ముద్దు బిడ్డవు
మా మదిలో ముద్దుగా సినారెవు!
నీ ఆధునికాంధ్ర సాహిత్యం
సాహితీప్రియులకు పాఠ్యాంశం
నీకు నదీనదములన్న ఎంతో ఇష్టం!
నీ నలుగురు కుమార్తెలకు
వాటి.పేరడీ ముదమున సంతసించినావు
నన్ను దోచుకొందువటే అన్నావు
సాహితీప్రియుల మది దోచినావు
నీవు రాసిన విశ్వంభరము
తెలుగున అది రెండవ జ్ఞానపీఠము
పద్య, గేయ, వచన కవితలతో
గజళ్ళు,వ్యాసముల ముక్తకాలతో
విశ్వ విద్యాలయముల ఆచార్యత్వంతో
తెలుగుకు ఎనలేని ఖ్యాతి ఒసంగినావు
రాజ్యసభ సభ్యునిగా విశేష సేవాలందించినావు
ఘనంగా పద్మశ్రీ, పద్మభూషణ్ లు పొందినావు
తెలుగుతల్లి ముద్దు బిడ్డడవై
తెలుగుకు వెలుగు నచ్చిన
ఓ సినారే....నీవు భళారే!
.........................................
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం
చరవాని. 7416638823
..........................................
పై వచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.
౧౮
అనంతకోటిప్రణామములు🙏 
 🙏💐🙏💐🙏💐🙏
. వ్యవసాయక్షేత్రంలో పంటలు 
పండించే రైతు ఇంట బుట్టిన 
దివ్య సాహిత్య ఔషధమా.. !
నవ్వని పువ్వుతో మొదలైన 
మీ సాహితీ ప్రస్థానం... అనేక ప్రక్రియలతో అలరిస్తూ... నేటి 
గజల్స్ వరకూ.... మీ విశ్వ రూపాన్ని ప్రదర్శించింది !

ఓ బహుముఖ ప్రజ్ఞాశాలీ... !
మీచే అలరింపబడని కవన విధాన మేమున్నది... !?
సినీ వినీలాకాశంలో... మీ పాట 
లు  వేనవేల నక్షత్రాలై మెరియుచునే యున్నవి !

పద్మశ్రీ - పద్మ భూషణములు 
మీకు భుజకీర్తులు కాగా... 
అనేకానేక బిరుదములు మీకు భూషణములైఅలరారుచున్నవి 
అత్యంత ప్రతిష్టాత్మక జ్ఞాన పీఠము నెక్కి... కళామతల్లి కీర్తి 
కిరీటమునుదాల్చినమహోన్నత
సాహితీ నగము మీరు !!

ఊహ తెలిసినది మొదలు... 
వ్రాస్తూనే బ్రతికి... వ్రాస్తూనే 
భువిని వీడి... దివి కేగిన 
ఓ సాహితీ భాస్కరా.... !
ఆ దినకరుడు ఈ జగతికి వెలు గైతే...మీరీసాహితీ ప్రపంచానికే 
స్ఫూర్తి కాంతిని నింపిన దివ్య 
ప్రకాశము !
సాహిత్యమునకు ధన్యతను 
గూర్చవచ్చిన మీ జన్మము 
ధన్యాతి ధన్యము !
మీకివే... మా  అనంతకోటి 
ప్రణామములు !!
      *****************
   ...... కోరాడ.
19
 విశ్వంభరుడు ***
                            ✍️డా.పాండాల.
ప!! 
సింగిరెడ్డి వంశాంబుది చంద్రమా...
తెలుగు హృదయాల్లో 
నిలిచిన గుణసాంద్రమా..2!సిం!
చ:1
తెలంగాణ మట్టిలోన జ్ఞానపీఠ నీ జన్మం....
నారాయణ మంత్రమోలే నవ్యమాయె నీ నామం...
అచ్చతెలుగు పదసిరికి తేనెలొల్కు రసధునిగా...
పగలెన్నెల పూయించిన ప్రతిభకు తార్కాణమీవు...!సింగి!

చ:2
లకుమ త్యాగగేయ రాగ లాలిత్యపు రసికతలో....
సరిలేరు నీకెవ్వరు యిలలో నీ పద యుక్తికి ...
నన్ను దోచుకుందువటని ఆలుమగల ఆప్యాయత..
అనురాగపు సిరిపంచిన ఆహ్లాదపు ఎద జ్యోతలు...!సింగి!

చ:3
నళ్ళని రాళ్ళలో శిల్పపు నాగరికం నేర్పిస్తివి...
అమ్మను మించినదైవం అవనియందు లేదంటివి..
కడుపు తీపిలేని అమ్మ ఆటబొమ్మ యని యంటివి..
కష్టసుఖపు కన్నీళ్ళను కళ్ళలోన పారిస్తివి... !సింగి!

చ:4
సంప్రదాయ ప్రయోగాల సంస్కరణే 
ఆధునికం...
విశ్వంభర తత్వవేది వినూత్నాల
మానవతం...
మంటలు మానవుడంటు మందహాస
మధురత్వం...
నాన్నమనసు అమృతమని ఆలాపన జేసినట్టి...!సింగి!

🕉️డా.పాండాల మహేశ్వర్ 
గౌసుకొండ,పోచంపల్లి, యాదాద్రి
20
[డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: నారాయణ స్మరణీయుడు

ఆయన సినారే బహు భాషల 
గళముతో గజల్ రాసిన ప్రపంచ పదులు తో విన్యాసాలు చేసిన

కవిత్వం నా శ్వాస
జీవన తరంగాలు కవిత్వమై పలికే అతని చూపు

అక్షరాల గవాక్షాల తో ఆరంగేట్రం చేసిన

నడక నా తల్లి ఇంటిపేరు చైతన్యం భూమిక తో కొత్త భూమిక ను నిర్మించాడు

మట్టి మనిషి ఆకాశం పంచభూతాలను నిరూపించాడు

అతడు హనుమాజీపేట లో పుట్టిన బిడ్డ సింగిరెడ్డి బుచ్చమ్మ మల్లారెడ్డి దంపతుల ముద్దుబిడ్డ


కొత్త చూపుతో కొత్త ఆలోచనలను ప్రతి కవితలో ప్రతి కవి లో ప్రోత్సాహం అతని చూపు

మంటలు మానవుడు తో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత

తియ్యని పలుకులతో 
వక్త అతడు కాలేజీలో పాఠం చెప్పిన త్యాగరాయగానసభలో మాట్లాడిన రవీంద్రభారతి లో మన భారతం చెప్పిన


కవన భారత మని అల్లుకొన్న
ఆంధ్ర సారస్వత పరిషత్

విశ్వంభరుడు ఐ జ్ఞానపీఠాన్ని తెలుగునాట తెలంగాణ 
మా గానం పై అందించిన
పద్మశ్రీ కళాప్రపూర్ణ పద్మభూషణ్ పద్మ విభూషణ్

అతనికి జేజేలు పలికాయి
ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయాలు ప్రయోగాల పుస్తకం విద్యార్థికి ఎమ్మెల్యే లో నిత్య సంప్రదింపు గ్రంథము గా విలసిల్లింది ఈనాటికి
సినారె ఆదర్శం అధికార పీఠం
పై రాజ్యసభలో వాజ్పేయి తో
మై ఎక్క వన్ సంకలనం ఆవిష్కరణ పొందాడు

అతడే సినారె పాటలు

లయాత్మక మై పగలే వెన్నెల జగమే ఊయల ఊహలకే కన్నులుంటే

పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా
జగమే మారినది మధురముగా ఈ వేళ

భలే మంచి రోజు పసందైన రోజు కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులు విరిసిన రోజు

ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెల్లో మ్రోగెను

మూడు వేల పైగా పాటలను పలికించిన కవి
నా పాటలో ఏముంది నా మాటలో ఏముంది
మా ఊరు మాట్లాడింది అని కరీంనగర్ యాసలో జానపదుల జీవ శ్వాసను ఆవిష్కరించి మధురముగా మనసు దోచిన కవి

సినారే కు జయహో

సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453
21
[ కవితా గానం (సీజన్1)
పేరు:కె.ఇ.నిలమంగై
కలం పేరు:నీలా రంగనాధం
ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.
శీర్షిక: *సినారె*    
తేది:28/07/2021
        వచన కవిత్వం
చరవాణి సంఖ్య:8897155600
 
సాహిత్య క్షేత్రాన అక్షర విత్తులను నాటిన కవన హాలికుడై. ,
తెలుగు భాషలో గజల్ మాలికలను పూయించిన కర్షకుడు..!

విశ్వంభరుడై బహుభాషా పండితుడై..,
నన్ను దోచుకొందువటే అన్నా..,
చరణ కింకిణులు ఘల్లుఘల్లుమనిపించి వీనులకు విందుచేసేలా సినీగీతాలను అలరించే పదవిన్యాసాలనందించిన జ్ఞానపీఠ విజేత..!

పద్మశ్రీ..,పద్మభూషణ బిరుదులనందుకొన్న సాహితీ నగధరుడు సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి)....!!!!

*ఈ కవిత ఈ సమూహం కొరకే రాసానని హామీ ఇస్తున్నాను.*

*నీలా రంగనాధం*
22
 కవితాగానం సీజన్ 1
 తేదీ :28/ 7/ 21- బుధవారం
 అంశం :సినారెగారి జయంతి సందర్భంగా..
 శీర్షిక :అక్షయ అక్షర చంద్రుడు 
పేరు  : మన్నె లలిత
 హైదరాబాద్
*********************************

" నెత్తిమీది నీలి తెర నుండి కాళ్ళ కింద ధూళి పొరకు"
సౌదామినిలా
"సింగిరెడ్డి"వారింటికొచ్చిందో కాంతి కిరణం 

గుడ్డి దీపపు వెలుగు దారిలో
 కన్నతల్లి చదువు ప్రేమ 
చదువురాని కన్నతల్లికి 
చదువుకున్న కొడుకు మురిపింపు

"మట్టిమనిషై" అక్షర సేద్యం చేసి
 మణులు పండించిన మహాకవి 
కరీంనగర్ ను కవితల నగరంగా 
మార్చిన కవితా రారాజు 
'హనుమాజీపేట'కు 'నారాయణ రెడ్డి పేట'గా
 గుర్తింపు నిచ్చిన  గురువిద్వన్మణి!
విజయకేతనంతో "విశ్వంభర"ను చుట్టివచ్చి 
సిరి గంధపు మ్రానై  , జ్ఞాన పీఠమెక్కి
కవితా సుగంధాలు వెదజల్లిన సి .నా .రె 
అక్షర నక్షత్రాలలో అభయం ఇస్తున్న 
"అక్షయ అక్షర చంద్రుడిలా" కనిపిస్తారన్న 
ఆశతో నింగికేసి చూస్తున్నాము.
**********************************

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...