నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
***************₹₹₹₹₹
ఆషాఢ మాసం పౌర్ణమి పోటీకై స్పందించిన కవి వరులు
1.తిప్పావఝలనరసింహ మూర్తి గారు
2. పిన్నకనాగేశ్వరరావు గారు
3. తోట సులోచన గారు
4. కేశరాజు వేంకట ప్రభాకర్ గారు
5. తరణి కంటి సూర్య లక్ష్మి గారు
6.డాక్టర్. కమలాదేవి గారు
7.జక్కని గంగాధర్ గారు
8. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
9. గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు
10. సింహాద్రి వాణి గారు
11.ధనాశి ఉషారాణి గారు
12. ఆళ్ళ నాగేశ్వరరావు గారు
13. మద్ది పుల్లారావు గారు
14. గొర్రె పాటి శ్రీను గారు
15. పాల్వంచ హరికిషన్ గారు
16. గంగాపురం శ్రీనివాస్ గారు
17.దారల విజయ కుమారి గారు
18.కవిత వెంకటేశ్వర్లు గారు
19.తాతపూడి సోమశేఖర శర్మ: గారు
20.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
21. బినాగేశ్వర రావు గారు
22. కొంపెల్లి రామయ్య గారు
23.మొహమ్మద్ అఫ్సర వలీషా గారు
24. దోసపాటి వెంకటరామచంద్రరావు గారు
25.జంపని శ్రీనివాస మూర్తి గారు (జలజ)
26.RVV రాజా గారు
27.బొప్పెన వెంకటేశ్ గారు
28.మేకల రామస్వామి గారు
29.ముత్యం వెంకటేశ్వరరావు గారు
30.నాశబోయిన నరసింహ గారు (నాన)
31.వనపర్తి గంగాధర్ గారు
32.ఇంద్రావత్ రాహుల్ గారు
౩౩.ఏడెల్లి రాములు గారు
***************************
Vittubabu gari maata
**************************
అందరికీ నమస్కారం.
కవితాగానం – 2 సమూహంలో... ప్లవనామ సంవత్సరం ఆషాఢమాసం గురుపౌర్ణమి సందర్భంగా నిర్వహించిన కవితల పోటీకి స్థాయి నిర్ణయం (జడ్జ్) చేయవలసినదిగా నాకు బాధ్యతను అప్పగించిన సమూహ నిర్వాహకులకు ధన్యవాదాలు. అలాగే ఉత్సాహంగా పోటీలో పాల్గొన్న బృందసభ్యులకు అభినందనలు. విజేతలుగా నిలిచినవారికి ప్రత్యేకంగా మరోమారు అభినందనలు.
ముందుగా ఒక విషయం చెప్పాలి. ఇటువంటి పోటీలకు స్థాయి నిర్ణయం (స్థాయీనిర్ణయం అనాలేమో అన్న శంక అవసరంలేదు... స్థాయి అని హ్రస్వాంతమే..) చేయడం కత్తి మీద సాము లాంటిదే. మన నిర్ణయం ఎప్పుడూ 100 శాతం ఆమోదం పొందదు. అసంతృప్తి తప్పకుండా ఉంటుంది. నా అవగాహన మేఱకు, ఆ క్షణంలో నాకు అనిపించిన మేఱకు ఏవో కొన్ని స్వీయ మార్గదర్శకాలను ఏర్పాటు చేసికొని చేసాను.
ఇక కవిత్వం విషయానికి వస్తే... అందరికీ ఆలోచనలు వస్తాయి. కానీ వాటిని ఆకట్టుకునేటట్టుగా ప్రదర్శించాలని, ఆ భావాలకు అక్షర శరీరాలతో ప్రాణం పోయాలనీ అందరికీ అనిపించకపోవచ్చు. అలా అనిపించిందంటే మీలో భావుకత అనే ముడిసరుకు ఉన్నట్టే... ఇక దానిని ఏ అచ్చులో పోస్తే అందంగా తయారవుతుందో, సేల్(ఇక్కడ నా ఉద్దేశ్యం – ఎక్కువమంది పాఠకులలో చదవాలనే ఆకాంక్ష కలిగించగలగడం) అవుతుందో తెలుసుకోవడమే... అది అధ్యయనం ద్వారానే పట్టుబడుతుంది. అభ్యాసం ద్వారానే అలవడుతుంది. ఈ వాట్సప్ యుగంలో మనలో చాలామందికి లేనిది ఇదే... హడావుడిగా వచ్చిన ఆలోచనను పదాలలో పేర్చేసి ఎన్ని వాట్సపు సమూహాలకు పంపామా అన్నదే ముఖ్యమని మనలో చాలామందిమి భావిస్తున్నాం. అధ్యయనం, అభ్యాసం చేయడం మానేశాం.
నాకు తెలిసినంత వఱకు వచనకవిత వ్రాసి పాఠకులను మెప్పించడం చాలా కష్టమైన పని. వచనంతో పోలిస్తే పద్యం కొంత అభ్యాసం చేస్తే ఆకట్టుకునేట్టుగానే వ్రాయవచ్చు.... ఎందుకంటే దానికి ముందే నిర్ణయించబడిన ఒక ‘కొలత’ ఉంటుంది. గణాల లెక్క ఉంటుంది. వాటి సూక్ష్మం పట్టుబడి, వ్యాకరణ అవగాహన పెంపొందించుకుని కొంత పొందికగా పదాలను పేర్చి అందంగా భావప్రకటన చేయగలిగితే చాలు. కావ్య సృష్టి చేయలేకపోయినా, ఎబ్బెట్టుగా లేకుండా పద్యాలు కూర్చవచ్చు...
కానీ వచనకవిత అలా కాదు. ఎందుకంటే దానికి ఓ కొలత లేదు. ఎవరికి వారు ఎంత పొడవు వాక్యాలను వ్రాయాలనేది నిర్ణయించుకోవాల్సిందే... ఏ వాక్యాన్ని ఎక్కడ విరవాలో ఎన్ని పాదాలుగా (వరుసలుగా) పేర్చాలో అన్నది ఎప్పటికీ బ్రహ్మపదార్థమే!
అయితే ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి... మామూలు వాక్యానికీ, కవిత్వాత్మ నిండిన వాక్యానికీ తేడా కొంత అవగాహనకు రావాలి. ఉపదేశానికీ, వ్యాసానికీ, కవితకూ తేడా తెలుసుకోగలగాలి. మనం వ్రాసింది రెండోసారి జాగ్రత్తగా దాని రచయితగా కాకుండా పాఠకుడి దృష్టికోణంలో చదివితే తెలిసిపోతుంది. వ్యాసానికి విషయం విస్తృతంగా చెప్పగలిగితే చాలు... కానీ కవిత అలా కాదు... మామూలు వాక్యాలు వ్రాసినట్టు వ్రాయకూడదు. అది ఆకట్టుకోదు. కవిత్వంలో ఒక భావలయ ఉండాలి. వాక్యాలకు అలంకరణ చేయాలి. ఉతికిన వస్త్రాన్ని ఏదో నాలుగు మడతలు వేసి బీరువాలో పడేసేదానికీ, బాగా ఇస్త్రీ చేసి అందంగా మడతపెట్టి, పద్దతిగా బీరువా సర్దడానికీ తేడా ఉంది కదా!... వస్త్రం అదే! అమరికే వేఱు!! అలాగే కవిత కూడా. మరి ఇదంతా ఎలా తెలుస్తుంది... ఒకటే మార్గం పూర్వకవులవి బాగా చదవడమే... కృష్ణశాస్త్రివి చదవండి - మనసు ఎక్కడో తేలిపోతుంది. శ్రీశ్రీని చదవండి – ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఉదాహరణకు వీరిద్దరినీ ప్రస్తావించాను. పదే పదే ఉద్ధండుల కవిత్వాన్ని చదవడం వల్ల మన శైలి మెఱుగుపడుతుంది... చాలా ‘బోరు’ కొడుతున్నాను కదూ...!
సరే విషయానికి వస్తాను. ఒక సాధారణ పాఠకుడిగా మొహమాటానికి పోకుండా ఒక విషయం చెప్పదలచుకున్నాను. ఇందాక చెప్పినట్టు చాలా కవితలు నాకు వ్యాసాల లాగానే అనిపించాయి. అందమైన శైలి చాలా కవితలలో లోపించింది. అంతర్లయ ‘మిస్’ అయింది. మీఱందరూ వ్రాసినవి మళ్ళీ మళ్ళీ చదువుకోండి... ఆపై ఏవైనా వ్యాసాలు చదవండి... ప్రసిద్ధి పొందిన వారి వచన కవితలు ఓసారి పరిశీలించండి... తేడా మీకే అవగతమవుతుంది. వ్యక్తీకరణ, శైలుల మీద అందఱూ తప్పనిసరిగా అధ్యయనాభ్యాసాలను చేయాలి.
ఇక పద్యాల విషయానికి వస్తే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ కూడా పాదాలలో పదాలను విఱిచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తాలు, కందాలు మొదలయినవి ఒక నిర్ణీతమైన లయతో ఉంటాయి. వాటిలో పదాలవిఱుపు అందంగానే ఉంటుంది (ఇక్కడా ఏపాదానికి ఆ పాదంలో పదం ముగించడం చేసేవారూ ఉన్నారు. అవసరాన్ని బట్టీ పదాలను పాదాలలో విఱిచి పేర్చేవారూ ఉన్నారు. కొందరైతే వృత్తాలలో ఒకపాదం చివర ఒక పదాన్ని ప్రారంభించి తరువాత పాదంలో కొనసాగించడం తప్పనిసరి అని భావించేవారూ ఉన్నారు... ఇదొక వైచిత్రి) ... కానీ తేటగీతి, ఆటవెలది, సీసము మొదలైన దేశీయ ఛందాలలో పదాలను ఇష్టం వచ్చినట్టు విఱిచి పాదాలలో పెట్టడం అందమైన శైలి కానే కాదు. చదివించే శైలీ కాదు. ఏపాదానికి ఆ పాదంలో పదాలు ఉంటేనే బాగుంటుంది.
అదండీ విషయం.. మరీ ఎక్కువ చెప్పాననిపిస్తే మన్నించండి... స్వీకరించదగ్గ విషయం ఉందని అనిపిస్తే గ్రహించండి. విషయమే లేదనిపిస్తే తూచ్! అనుకొని విడిచిపెట్టేయండి
ఇక ఉంటాను.
ధన్యవాదాలు
సెలవు
విట్టుబాబు
**************************************************
results
1st Prize.
దారలవిజయకుమారి గారు
D.V.K
వారథి
(10 second prizes)
. అఫ్సరవలీషాగారు
(అలుపెరుగనిశిల్పి
ఇంద్రావత్ రాహుల్ గారు
.గురువే మార్గం
R . V. V. రాజా గారు
R.V.V.R.బతుకు బెత్తమే
గంగాపురం శ్రీనివాస్ గారు
(కవిత: దైవదర్శిని)
తిప్పావఝల నరసింహ మూర్తి గారు
.గురుపూజ
డాక్టర్. కమలాదేవి గారు
జ్ఞాన జ్యోతి
కేశరాజు వేంకట ప్రభాకర్ గారు
.గురువు
సింహాద్రి వాణి గారు
.సీసపద్యం తే. గీ
పిన్నక నాగేశ్వర్ రావు గారు
.తేటగీతి పద్యాలు
వనపర్తి గంగాధర్ గారు
ఆచార్య దేవోభవ
*************************************
1.
కవితా గానం
ప్లవనామ సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి నగదు బహుమతుల పోటీకి
అంశం:గురుపౌర్ణమి
శీర్షిక: గురుపూజ
తిప్పా వఝల నరసింహమూర్తి
బుచ్చి రెడ్డి పాలెం.నెల్లూరుజిల్లా
ఆదర్శం దైవం శ్రీరాముడు/
శిరసావహించాడుగా విశ్వామిత్రునిఆదేశం/
గీతాచార్యుడు శ్రీకృష్ణుడు/
చేసాడుగా సాందీపుని శిష్యరికం/
భగవత్ స్వరూపులు శంకరులు
పరిరక్షించారుగాహైందవధర్మం/
ద్రోణుని భిక్షేగా పార్థునివిలువిద్యానైపుణ్యం/
సమర్థరామదాసు చలవేగా
శివాజీ విలువల మహోన్నతం/
చాగంటి, సామవేదంల ప్రవచనామృతం /
తెచ్చిందిగా జీవనశైలిలో పరివర్తనం/
గురువు నైతిక విలువలబోధనతో/
పారత్రోలుతాడు సామాజిక రుగ్మతలు/
జీవననైపుణ్యాల ఉపదేశంతో/
పెంపొందిస్తాడు మానవతా విలువలు/
అందరి జీవితాలలో నింపుతాడు వెలుగులు/
గురువు సమాజానికి తలలో నాలుక/
సామాజిక పరివర్తనా వేదిక/
ఎక్కడగురువులు పూజించబడతారో/
అక్కడ పరిఢవిల్లుతుంది దైవత్వం/
మన జీవితాల్లో వెలుగులు నింపే గురుపూజకు/
గురుపౌర్ణమి తగిన సందర్భం/
గురుపరంపరను పూజిద్దాం,/
ప్రైవేటు టీచర్లను ఆదుకొందాం
వారి జీవితాల్లో వెలుగులు నింపుదాం/
2.
[23/07, 3:49 pm] Veera Gudipally: కవితా గానం (సీజన్ 2). 23--7--2021.
పిన్నక నాగేశ్వరరావు.
ఆషాఢ శుద్ధ పౌర్ణమి పోటీ కవిత.
అంశము :-- గురు పౌర్ణమి.
1. తే.గీ.
నేటి యాషాఢ శుద్ధ పూర్ణిమను యందు
రు గురు పౌర్ణమి యనుచు; గురువుల నేడు
పూజ చేయ త్రిమూర్తుల పూజ చేసి
నంత పుణ్యఫలము దక్కునని తలంచి
సత్కరించి కానుకలతో సవినయముగ
తీసుకొందురు వారల దీవెనలను.
2. తే.గీ.
మానవాళి కంతయు ప్రథమ గురువైన
వ్యాస భగవాను డుద్భవమందె నేడు
నా మహానుభావుని పేరుపైన నిదియు
వ్యాస పౌర్ణమిగా కూడ వాసికెక్కె.
3. తే.గీ.
వ్యక్తి మొదటి గురువు తల్లియైన, రెండ
వ గురువగు నొజ్జ మంచి చెడుగులఁ నేర్పి
జ్ఞాన జ్యోతులు పంచి యజ్ఞాన తిమిర
ములను పార ద్రోలును గురువులను వారు.
4. తే.గీ.
వేదకాలపు సంస్కృతిన్ వేదములలొ
నాల్గు భాగాల సంకలనమ్ము చేసి
వ్యాసు డాధ్యాత్మికమ్మగు వారసత్వ
మును మిగిల్చ మానవులకు ఘనముగాను
వేద వ్యాసుడని పిలువ పేరుగాంచె.
5. తే.గీ.
శివుడు సప్తర్షులు బోధ చేయు రోజు
శిష్యులకును దత్తాత్రేయ చెప్పు రోజు
విభజనన్ జేసె నీ రోజు వేదములను
సత్యవతి శంతనులకు వ్యాస భగవాను
డుద్భవించిన రోజిది యుర్వి పైన.
**************************************
3
[23/07, 4:09 pm] Lalita Sister: కవితా గానం (సీజన్ -2)
అంశం. గురు పౌర్ణమి
శీర్షిక . వేద వ్యాసుని జయంతి
వశిష్ట మహర్షికి మునిమనుమడై, పరశర మహర్షికి, సత్యవతికి
నారాయణాంశ తో వ్యాస మహర్షి జన్మించే
వేదములను నాలుగు భాగములుగావిభజించి నందున
వేద వ్యాసుడై, జన్మ తోనే విజ్ఞానియై, బదరికాశ్రమం లో
ఏకాంతముగా ధ్యానములో నుండెడి వారు
కాలవేగ స్వభావాన్ని గూర్చి, భూత భవిషత్ వర్తమానముల గూర్చి
దివ్య దృష్టితో గ్రహించి, మానవులకు హితం చేయుటకు
పంచమ వేదంగా మహా భారతాన్ని రచించే
అష్టా దశ పురాణాలను, భాగవతమును రచించిన మహా జ్ఞాని
ఆధ్యాత్మిక విషయాలను వివరించిన గురువు వేదవ్యాసుడు
అజ్ఞాన తిమిరమును పారద్రోలి జ్ఞాన జ్యోతిని వెలిగించిన
వారే గురువులై, నింగిలో సూర్య తేజంతో ప్రకాశించే
వ్యాస మహర్షి జయంతిని గురుపూర్ణిమ గా నిర్వహించెదరు
ఆషాఢ పౌర్ణమి రోజే వ్యాసుడు జన్మించడం వలన
ఆ రోజును గురుపూర్ణిమగా, గురువును, వ్యాసుని పూజిం చేదరు
తోట సులోచన
నెల్లూరు
చరవాణి 9490173053
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతమని హామీ యిచ్చు చున్నాను
తోట సులోచన
4
23/07, 4:09 pm] Lalita Sister: ఆషాఢ మాసం పౌర్ణమి నగదు బహుమతుల పోటీకై
కవితా గానం సీజన్..2
అంశం.. గురు పౌర్ణమి.
శీర్షిక.... గురువు. (1)
*"*************
ప్రాగ్దిశారుణ మయూఖ రేఖల
నులివెచ్చని స్పర్శకు పులకించిన
పుడమి పురుడు పోసుకొని
సమస్త చరాచర జగత్తును
తన ఉడుకు ఒడిలో ఉద్దీపన లందించి బతుకు విద్యలనేర్పేటి
విశ్వ గురువు అమ్మలగన్నయమ్మ
మాయమ్మే
మానవేతిహాసంలో మనిషిమతిన
విద్యను నాటేసి సేద్యంచేసి విజ్ఞానపు కాంతి పుంజాల పంటపండించే వాడే గురువు
విద్యను గరిపి వివేకం నెరిపి
మానవ జాతికే మానవత్వం
నేర్పి నవసమాజ నిర్మాతే గరువు
వేదవేదాంగాల నిర్వచించి విజ్ఞాన
కాగడాలు వెలిగించి అజ్ఞానాంధకారాన్ని తరిమి కొట్టిన
వేదవ్యాసుడు ఆయనే కృష్ణ ద్వైపాయనుడు , విశ్వ గురువు
అష్టాదశ పురాణములు భాగవత
మహాభారతం గీతామృతం లోకానికి తాగించిన జగన్మోహినుడే బాదరాయణుడు
" కృష్ణం వందే జగద్గురుం"
********************
స్వీయ రచన :::కేశరాజు వేంకట ప్రభాకర్ రావు. 23/7/2021.
సెల్ ఫోన్. 8497924605
భద్రాద్రి కొత్తగూడెం.
5
[23/07, 4:09 pm] Lalita Sister: కవితాగానం ( సీజన్ 2 )
ప్లవనామ సంవత్సరము
ఆషాఢమాసం పౌర్ణమినగదుపురస్కారాలు
తేది:- 22/7/2021/ గురువారము
అంశం:- " గురుపౌర్ణమి "
(1)
సీ! పూర్ణమితిధియెంత పుణ్యము జేసెను
పుణ్యపురుషులంత పుట్టెనిలను
ఆషాఢ పౌర్ణమి నానంద మందించె
మహనీయులందరు మనకుదొరకె
గురువులవతరించె గురుపూర్ణిమందున
చంద్రుడొసంగెను చల్లదనము
పూజ్యుడు వ్యాసుడు పూర్తిభారత మంత
నందించెజనులకు నతడుగురువు
ఆ! గురువుదైవమనుచు గురువును పూజించు
గురువునందుభక్తి గురిగ జూపు
ఎందరున్నగురువు లందరుపూజ్యులే
చేయువందనాలు చేతులెత్తి!
(2)
సీ! ఉత్తమగురువుకు వుత్త మశిష్యడు
గురువులభాగ్యము నెరుగ వచ్చు
తగినశిష్యుడనుచు తగురీతిబోధించు
అన్నివిద్యలయందు నారితేర
ఓర్పునిగ్రహమంత వొనరగనేర్పును
వినయవిధేయత విధిగ నెరుగ
శిష్యునిమేధను చిలుకుచు గురువులు
మెదడును పదునుగ బెట్టుచుండు
ఆ! గురువునాశ్రయించ తీరుతెన్నులెరుగు
బ్రతుకుతెరువుమార్గ మనగదెలియు
భక్తి ముక్తి యుక్తి భుక్తిమార్గమరయ
తెలివితోడబతుక తెలివినేర్పు!
తరణికంటి సూర్యలక్ష్మి.
-------------
6
[23/07, 4:09 pm] Lalita Sister: గురుపూర్ణిమ సందర్భంగా నాకవిత
పేరు : డా.కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
చరవాణి : 9871096566
అంశం : గురువు
శీర్షిక : జ్ఞానజ్యోతి
"జ్ఞానమూలం గురురూపం
పూజామూలం గురుపాదం
మంత్రమూలం గురుర్వాక్యం
మోక్షమూలం గురుకృప"
గురుభ్యోనమః, ఆచార్యదేవోభవ
అసామాన్యుడు, అసాధారణ వ్యక్తి గురువు
బ్రహ్మవిష్ణుమహేశ్వర రూపం గురువు
శిలలను శిల్పాలనుచేసే శిల్పి
విద్యార్థి మొక్కలను సంరక్షించు తోటమాలి
ముడిబంగారాన్ని అలంకారంగా తీర్చిదిద్దే స్వర్ణకారుడు
రాతిముక్కను సానబెట్టి వజ్రంగా రూపుదిద్దే కళాకారుడు గురువు
సభ్యతా సంస్కారాల బీజాలనునాటేమహనీయుడు
మంచి స్నేహితుడు, మార్గదర్శి
బతుకుబాటను వేయువాడు
అజ్ఞానాంధకారాన్ని తొలగించువాడు
జ్ఞానదీధితులనందించువాడుమంచినడత , నడవడికల నలవర్చువాడు
ఆదర్శప్రాయుడు,
ఆరాధ్యదైవం గురువు.
"తస్మైగురవే నమః"
7
పైకవిత నాస్వంతం. అనుకరణ అనువాదం కాదు
[23/07, 4:11 pm] Lalita Sister: *కవితా గానం (సీజన్ - 2)...*
పౌర్ణమి నగదు బహుమతుల పోటీకై...
అంశం: *గురుపౌర్ణిమ...*
తేది: *21.7.2021*
————————————
పేరు: జక్కని గంగాధర్
ఊరు: ముంబాయి
చరవాణి: 90763 52347
————————————
శీర్షిక: *గురవే నమః...*
వశిష్టులవారి మనవడైన పరాశరుడు సత్యవతికి జన్మించిన పుత్రుడే వ్యాసుడు...
వేదాలను విభజించి వెలుగులోకి తెచ్చిన మహానుభావుడు...
ఋగ్, యజు, సామ, అథర్వణ వేదాలను వ్యాప్తింపజేయు మహాకార్యమును తన శిష్యులు పైలుడు, వైశంపాయణుడు, జైమిని, సుమంతుడను నలుగురిచే లోకమంతటా ప్రచారం చేయించెను...
అది ఆషాడపూర్ణిమ రోజు అనగా వ్యాసుడు జన్మించిన రోజే జరిగినది...
అందువల్ల ఈ రోజును ఆషాడపూర్ణిమ, వ్యాసపూర్ణిమ, గురుపౌర్ణిమి గా వ్యవహరిస్తాము...
వేదాంత శాఖకు చెందిన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, మహాపురాణాలు, ఉపపురాణాలు, పద్దెనిమిది పర్వాలతో మహాభారతాన్ని మనకందించినాడు...
ఇది కేవలం వ్యాసునకే చెల్లింది...
గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ! అని గురువును పూజించవలెను...
గురువు కంటే వేరే బ్రహ్మపదార్థములేదు...
21.7.21
————— 8 —————
పై వచన కవిత నా స్వంత రచన అని హామీ ఈస్తున్నాను.
,8
[23/07, 4:17 pm] Lalita Sister: కవితాగానం(సీజన్ 2)
అంశం:-
గురు పూర్ణిమ
శీర్షిక-
వ్యాసాయ వేదస్వరూపాయ
.................................
భరతభూమి వేదభూమి
సనాతన సంప్రదాయల నిలయం.
వేదప్రమాణమే ఆదర్శమానవ జీవన విధానం. ఆషాఢపౌర్ణమి
వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, పంచమవేదమైన మహాభారతాన్ని, అష్టాదశపురాణములను ,
మనకందించిన వేదవ్యాస మహర్షి జన్మదినం.
వేదాలను అనుసరిస్తే ధర్మాన్ని అనుసరించి మానవ జీవితం ఆదర్శమై
రామరాజ్యం ఏర్పడును.
వ్యాసపూర్ణిమ నే గురుపూర్ణిమ అని గురువు అంధకారమనే అజ్ఞానాన్ని
తొలగించి జ్ఞానమనే జ్యోతిని వెలిగిస్తారు
మానవుని మాధవునిగా
మార్చి ముముక్షత్వం వైపుకు చేర్చే సాధనమే సద్గురువు.
వ్యాసాయ విష్ణురూపాయ
వ్యాసరూపాయ విష్ణవే
త్రిమూర్తి స్వరూపమే గురువు.
గురుపూజ ఉత్సవం సాక్షాత్తు పరమేశ్వర ఆరాధనే .
మానవత్వం నుంచి ముముక్షత్వంనకు దారి చూపిన వ్యాసులు
సదా స్మరణీయులే
వారికి శతకోటి వందనములు........!!
.........................
లోకా సమస్తా సుఖినో భవంతు.
................................
పేరు:-
అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
9963265762
..............................
హామీపత్రం:-
ఇది నా స్వీయకవిత దేనికి అనువాదం
..................................
9
[23/07, 4:17 pm] Lalita Sister: కవితాగానం(సీజన్ 2)
ఆషాఢ శుద్ధ పౌర్ణమి పోటీ కవిత
గజవెళ్ళి శ్రీనివాసాచారి కాజీపేట
అంశం: గురు పౌర్ణమి
శీర్షిక: వ్యాస పౌర్ణమి
...
ఆషాఢ శుద్ధ పౌర్ణమి
ప్రపంచానికి పున్నమి
గురు పౌర్ణమి
సనాతన ధర్మంలో
గురువు త్రిమూర్తి స్వరూపుడు
శిష్యునిలో అజ్ఞాన తిమిరాన్ని తొలగించి
జ్ఞాన జ్యోతులను వెలిగించేది గురువు
మానవాళికి
గీతనందించిన కృష్ణుడు జగద్గురువే
వేదాలను నాలుగు భాగాలుగా
విభజించిన వ్యాసుడే
వేదవ్యాసుడాయే
శిష్యులు గురువులను
భక్తిశ్రద్ధలతో పూజించి
సేవించి, గౌరవించి
విద్యనభ్యసించె సత్సంప్రదాయం
శిష్యుల బుద్ధిని వికసింపచేసేది
వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే శిల్పి
విద్యతో పాటుగా
సంస్కారం నేర్పేది కార్యోన్ముఖుడిని చేసేది గురువు
ఆ గురువులకు వందనాలు
10
[23/07, 5:26 pm] Lalita Sister: కవితా గానం (సీజన్ 2)
23--7--2021
ఆషాఢ శుద్ధ పౌర్ణమి పోటీకి
రచన:--సింహాద్రి వాణి
ప్రక్రియ:--పద్యం
ఊరు:--విజయవాడ
చరవాణి:--7569820872
అంశం:-- గురు పౌర్ణమి
సీసపద్యం. అజ్ఞానతిమిరమ్మునంతమొందింపగా
పౌర్ణమి దినమున ప్రభవ
మొంది
విజ్ఞాన వెన్నెలన్ విశ్వమందున నింపి
వాణీ వరసుతుడు వరలె భువిని
నాల్గు వేదములను నాణ్యంగ విభజించి
జ్ఞాన బోధన జేయు జ్ఞాని యతడు
భాగవతము కూడ బహు రమ్యముగ వ్రాసె
ముక్తి మార్గము చూప భక్తులకును
ఆ.వె. భారతమ్మె గాక పదునెనిమిది పురా
ణములు వ్రాసినట్టి ప్రముఖమైన
సంస్క్రత కవి వ్యాస సత్కవి తాపసి
యయ్యె చరిత లోన యమర కవిగ
తే.గీ. రమణ మాషాఢ శుద్ధ పూర్ణిమ దినమున
గురువులను కొల్చి, పూజించి, గౌరవించె
దరు మిగులు భక్తితోడను, గురువులు భగ
వంతునికి భక్తునికి మధ్య వారధు లిల.
11
శీర్షిక.గురుపౌర్ణిమి
.........
జగతికి వెలుగుచ్చిన వేదవ్యాస మహర్షి
మహామనిషి పేరుతో చేసేటి గొప్పవేడుక
మది లోగిలిలో జ్ఞానాన్ని వెలిగించును
గుండెల్లో అజ్ఞానాన్ని తొలిగించేటి గురువు
మానవజాతికి నిజమైన వెలుగునిచ్చేను
భక్తి నిష్ఠలతో సత్యనారాయణ వ్రతమును ఆచరించి
గురు దేవుణ్ణి షిరిడీ సాయి బాబను గుండెల్లో నిలిపి
అష్టాదశ పురాణాలను గుండెల్లో ధ్యానించి
మనసాక్షిగా భక్తి పారవశ్యముతోను
గురువును ధ్యానించేటి నిజమైన పండుగ గురు పౌర్ణమి
పరమశివుని ప్రణవ నాధము నుండి వెలుబడిన
నిజమైన రూపమునుగాను
భువిలో వెలిసిన నిజమైన గురుపౌర్ణమ
మానవ జాతికి మంగళకరముగా
నిజమైన శుభములిచ్చు శుభకరముగా
నిలిచింది భువిలో నిండుగాను
జనుల గుండెల్లోనూ మెండుగాను
గురుపౌర్ణమి ఆనoదాల వేడుక పండుగలోను
ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
భాకరాపేట
12
ఆళ్ళ నాగేశ్వరరావు గారు
కవిత *
శీర్షిక;
"" ప్రత్యక్ష దైవాలు ""
జ్ఞాన జ్యోతులను వెలిగించి
అజ్ఞాన తిమిరాన్ని తొలగించి
విజ్ఞాన సుమాలను వికాశింప చేయువాడు గురువు!
గురువు లేని భోధనాలయం
దైవం లేని దేవాలయం
జీవం లేని దేహం లాంటివి!
పశు పక్ష్యాదులు ప్రకృతి వరప్రసాదితాలని
పరహితం కోసం వాటిలా పాటు పడమని
మనుష్యులకు గురు స్థానంలో ఉండి
అనుదినం చేసే హితబోధ!
దేవతలు సైతం ఆయా
గురువుల వద్ద విధ్యనేర్చిన వారే
గురుదక్షిణాలు చెల్లించిన వారే!
ఇటు ప్రకృతికి
అటు దైవానికి
వారధులై నిలిచిన
గురువుల స్తానం జగతిలో పధిలం
జన హృదిలో పవిత్రం!
సర్వజనులకు గురువే పూజ్యనీయం
ఇదియే గురుపౌర్ణమి భోదించే శుభ సందేశం!
13
మద్ది. పుల్లారావు
జిల్లా *
కృష్ణా
ఫోన్ నంబర్ *
9951287113
సమూహం పేరు: *
కవితాగానం
కవిత *
ఆషాఢ పౌర్ణమి
.................
ఆషాడ పౌర్ణమి యద్భుత మగు దినము
వ్యాస భగవానుడుదయించిన దినము
భారతదేశం ఆధ్యాత్మికతకు గురువు
అష్టాదశ పురాణాలు,వేదాలు,మహాభారతం
రచించిన తపోసంపన్నుడీ పరాశరతనూజుడు
గురువనే పదానికర్ధం కృష్ణద్వైపాయనుడు
నారాయణుని ఒక అంశయే సత్యవతీ పుత్రుడు
అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసేవాడు గురువు
జీవితాలకు మార్గనిర్దేశం చేసేవాడు గురువు
ముక్తిమార్గాన నడిపించేవాడు గురువు
తరతరాలను తరింపజేసేవాడు గురువు
గురువులను గౌరవించు సంస్కృతి
భారతీయుల నరనరాల్లోయున్నది
ఆ సంస్కృతి ని ప్రతిబింబించేదే వ్యాస పౌర్ణమి
నేటి గొప్ప గురువులను గూడా వ్యాసుని వారసులుగా
గౌరవించి,పూజించుట మన కర్తవ్యం
షిరిడీ సాయి, వీరబ్రహ్మేంద్రస్వామి
జ్ఞాన బోధ చేసిన మహా గురువులే
గురువులనుగౌరవిద్దాం..సంస్కృతులు పాటిద్దాం
హైందవ సంస్కృతులు వర్ధిల్లు గాక
...........
ఇది నా స్వీయరచన
14.
[ముని పుట్టినరోజు వడం ఈ రోజు కున్న ప్రత్యేకత !
" గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః "
అంటూ గురువు ని కీర్తిస్తూ పూజించడం
భారతీయ సంస్కృతిలో భాగం !
అజ్ఞానాధకారంతో నిస్సహాయస్థితిలో
వెలుగుకై ఎదురుచూస్తున్న విద్యార్థికి..
జ్ఞానం అనే తేజస్సుని పరిచయం చేసి
సత్ ప్రవర్తన అలవర్చుకునేలా మార్గనిర్దేశం చేసి
శిష్యుడి జీవితాన్ని సన్మార్గంలో నడిపించిన గురువులు గొప్పవారు !
ప్రతి ఒక్కరి జీవితంలో తల్లి తొలి గురువైతే..
తల్లిదండ్రుల తర్వాత ..
మనల్ని అంత గా ఇష్టపడి ప్రేమించి..
విద్యాబుద్ధులు నేర్పించి
సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు
అందుకునే అవకాశాన్ని ,అదృష్టాన్ని కల్పించిన గురువులని స్మరించుకోవడం..
సన్మానించుకోవడం ఎంతో అవసరం !
మనలో విజ్ఞాన బీజాలు నాటిన గురువులకి
సదా కృతజ్ఞులమై వుందాం !
వారు సూచించిన మార్గంలో నడుస్తూ
ఉత్తములుగా బ్రతుకు పయనం సాగిద్దాం !
రచన : గొర్రెపాటి శ్రీను
15
పాల్వంచ హరికిషన్
జిల్లా *
యాదాద్రి భువనగిరి
ఫోన్ నంబర్ *
9502451780
సమూహం పేరు: *
కవితాగానం
కవిత *
శీర్షిక: ఓ గురువర్యా..!
నిగ్రహానికే నిలువెత్తు రూపం..
విగ్రహానికే లేదా దైవ బావం..
అమ్మా నాన్నల మించిన అభయహస్తం !
పిల్లల ప్రపంచమే అతడి సమస్తం !!
చిన్నారుల ఆత్మీయతలకు బంధీయై
బడినే తన ఇల్లుగ బావించి..
దుఃఖం వచ్చినా కనపడనివ్వక..
సంతోషం కల్గిన పొంగిపోక..
ఇఛ్ఛగా నవ్వలేక.. స్వేఛ్ఛగా తిరుగలేక..
పిల్లల చూపుల పహారాలో..
నిరంతరం బుద్ధిగ మసలుతాడు !
తనను నిత్య విద్యార్థిగ భావిస్తూ..
ఆదర్శంగా మెలుగుతాడు !!
మంచిని కరుణను జ్ఞానమొసగుటలో..
ప్రవక్త.. ఏసు.. బ్రహ్మ అవుతాడు !
గుండెను బడిలో వదిలి వెళ్ళి..
దిశ..దశలకు మార్గదర్శకుడై
కలకాలం మదిలో నిలిచిపోతాడు !!
మాతృదేవోభవ.. పితృదేవోభవ..
గురు దేవోభవ అని పలికే సూక్తికి
నిత్య సత్య నిదర్శనంగా నిలిచే
ఓ గురువర్యా.. ఆపాదమస్తకం
చేస్తున్నాం మీకు ప్రణామ్యహం.. !!
[] హామీ పత్రం []
ఇది నా యొక్క స్వీయ రచన అని ఎక్కడా కాపీ చేయబడలేదని, ఎక్కడా ప్రచురణకు కూడా పంపలేదని హామీ ఇస్తున్నాను.
-- పాల్వంచ హరికిషన్
రామన్నపేట, యాదాద్రి జిల్లా
9502451780
16
గంగాపురం శ్రీనివాస్
జిల్లా *
సిద్దిపేట
ఫోన్ నంబర్ *
9676305949
సమూహం పేరు: *
కవితా గానం
కవిత *
కవితా గానం కవితల పోటీ కొరకు
అంశం: గురు పౌర్ణమి
*దైవ దర్శని*
°°°°°°°°°°°°°°°°
పాల కడలి లాంటి ప్రకృతి ధర్మాలను పాటిస్తూ,
ఆత్మను, పరమాత్మతో అనుసంధానించే
సారథి, వారధి, పెన్నిధి, సన్నిధి సద్గురువే!
పదునైన కాలం కత్తులకు గురికాకుండా
ఓర్పుగా ఒరలో ఇమిడిపోయే స్పూర్తిని నేర్పిస్తూ,
ధర్మం పాదాలు పడనివ్వని జ్ఞాన స్తంభం గురువు!
దేవుడున్నాడా? లేడా? ప్రశ్నకు రెండు జవాబులు!
గురువున్నాడా? లేడా? అంటే ఒకటే!
సద్గురువు జ్ఞాన ఊడల ఉజ్వల విద్వత్తుతో
విశ్వ జగత్తు పిడికిలి బిగిలో నిక్షిప్తం!
ఊడలు విడిచిపెడితే జీవితం పరిసమాప్తం!!
ప్రకృతి నేర్పే పాఠాలను ఔపోసాన పట్టిస్తూ,
మనోబలం, మనోధైర్యం, మనోనేత్రంతో
గురువు చూపిన సొరంగ మార్గాన్ని అన్వేషిస్తే,
సనాతన పునాదుల మీద అధునాతన ఆవిష్కరణలే!
వ్యాసాయ విష్ణు రూపాయ, శంకరం ఆది శంకరం!
గురువెవరైనా ప్రబోధంలో పరబ్రహ్మస్వరూపులే!
దైవదర్శనాన్ని సంప్రాప్తించే త్రిమూర్తులే!
మోక్ష మార్గాన్ని అన్వేషించే త్రిభువన రూపులే!!
దార్శనికతతో దైవిక ఆనవాళ్ళ గూళ్ళను చూపిస్తూ,
పరమార్థికతతో ప్రకృతి ధర్మాలను పాటిస్తూ,
ధ్యానం, యోగ నిష్ఠతో కర్మయోగిలా మారుస్తూ,
ప్రకృతి నిచ్చెననెక్కించి దైవ సన్నిధిని చేర్చే
గమ్యం తెలియని బాటసారికి ఏకైక దిక్సూచి గురువు!
హామీపత్రం:
గురుపౌర్ణమి కవితల పోటీ నిర్వాహకులకు నమస్కారం.
పై కవిత "దైవదర్శని" నా యొక్క స్వీయరచన.
ఎలాంటి అనువాదం కాని అనుకరణ కాని చేయలేదని,
ఎక్కడ ప్రచురితం కాలేదని,
కేవలం పోటీల కొరకు మాత్రమే రాశానని
హామీ ఇస్తున్నాను.
17.
కవితా గానం
ప్లవ నామ సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి పురస్కారాలు
అంశం : గురుపౌర్ణమి
శీర్షిక : వారధి
23-7-2021
*********************
నాలుగు వేదాలను రంగరించి
ఆథ్యాత్మిక జ్ఞానపు పరిమళాలను సద్గుణాలను
సంస్కృతి సంప్రదాయాల్ని విలువలను
సమభాగాలుగా చేసి పంచిన గురువులు వ్యాసుని కొనసాగింపులే
నీకొక చిరునామా ఏర్పడేందుకే
అక్షరంలోంచి అభ్యాసంతో నీలోకి ప్రయాణం చేసాడు
గురువు సహకారం..సామీప్యతల వెల్లువలో
నీ అజ్ఞానాంధకారం కొట్టుకుపోయింది
కొత్త వివేచనా..వెలుగులేవో నీలో వచ్చిచేరాయి
నీ ఉద్వేగాలకు నిలకడను
ఆవేశాలకు సామరస్యాన్ని
నీ నిర్ణయాలకు స్థిరత్వాన్ని నేర్పింది తనే
నిన్ను..తన శిక్షల పుటం లోకి వేసాకే నీ జీవనం మెరుపులీనింది
మనసు జోలెను విప్పి నీ సవాళ్ళను
తన ముందు కుమ్మరించినపుడంతా
జవాబులతోనే నీ జోలె నిండేది
జీవితపు ఎత్తూ పొడవులకు నిర్ధిష్టమైన నమూనాలను నీ సంచిలో తాను వేసే ఉంచాడు
చీకాకుల చీదరలు ఎన్ని సార్లు నిన్ను ఆపేసినా
పరిష్కారాల పచ్చని తివాచి తానయ్యాడు
భవిష్యత్తులో కి దూసుకుపోతున్నపుడు
నీ ముక్తి మార్గానికి..ముందుండి నడిపింది తనే
వెనకుండి వెన్ను తట్టిందీ తనే
నీవనే ఉనికి..ఉన్నతికి గురువే ఓ పెద్ద నేపథ్యం
నీ అడుగుల కోసమే..నడిచి వచ్చిన దారి తాను
నీవనే శిలలో ఒక కళారూపాన్ని దర్శించి
భగవంతునికి నీకు మధ్య వారధి తాను
నిన్ను..నీకంటే దగ్గరగా చూస్తూ నీ భావి జీవితాన్ని బేరీజు వేసిన
గురువుకు..ఏ కానుకలనివ్వగలవు..?
ఏ రీతిగా కొలవగలవు..కైమోడ్పులవ్వడం తప్ప !
దారల విజయ కుమారి
ఆర్యా
ఈ కవిత నా స్వంత రచన.అనువాదం కాదు ఎక్కడా ప్రచురితం కాదు.
ఇట్లు
తమ విధేయురాలు
దారల విజయ కుమారి
18.
అంశం..గురువు
శీర్షిక ... గురుబ్రహ్మ
గురువు లేని విద్య గుడ్డి విద్య
గురువు నేర్పిన విద్య గట్టి విద్య
గురువే జ్ఞాన హేతువు
ఇహ పరాలకు సేతువు
జనించిన ప్రతి ఒక్కరు
చదువు చెప్పి బాగుపరచును మాష్టారు
విద్య వలన బుద్ధి వికసించును
బుద్ది వలన వివేక జ్ఞానం విస్తరించును
దురాలోచనలను దుష్టబుద్దులను
దూరము చేయును గురువు
సద్బుద్ధిని సత్ప్రవర్తన నేర్పించును
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి చేర్చువాడు గురువు
ధనాన్ని దోచుకునేవాడు ఉంటాడు కానీ
విద్యను దోచుకొనేవాడు కానరాడు ఎక్కడైనా కాని
పంచిన కొద్ది పెరుగును చదువు
ఒదిగిన కొద్ది దీవించును గురువు!!
కవిత వేంకటేశ్వర్లు
కర్నూలు. 8309920625
పై కవిత నా స్వీయ రచన అని
హామీ
19
Tatapudi somasekhara sarma
జిల్లా *
Yanam, puduchery state
ఫోన్ నంబర్ *
8328079336
సమూహం పేరు: *
కవితాగానం సీజన్ 1
కవిత *
గురుపూర్ణిమ
***********
అన్నదాత గుండెల్లో గురుపౌర్ణమి
ఆషాఢమాసంలో సేదతీర్చేపండుగ
ఆనందం పొందే అందాల పండుగ
అదే అదే ఈ అనుభూతులపండుగ
ఆషాఢమాసంలో నిండైన పూర్ణిమ
శ్రీవ్యాసునిజయంతే ఈ గురు పౌర్ణిమ
గురువులఋణం తీర్చుకునే పూర్ణిమ
గురువుజన్మతరించే ఈమధురపూర్ణిమ
గురువు దైవం నిలుచుంటే
గురువు పాదమే దైవపాదం
దైవ పాదాలను పూజించు
దైవసమానగురువు ఆశీసులు పొందు
గురువు మాట భవితకుబాట
గురువుపూజ ఈశ్వరపూజ
గురుపూర్ణిమ రోజున పూజ
గురువేభగవంతుడు ప్రసన్నం
20
సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
కవిత *
గురు పూర్ణిమ:-
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం
మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ కలగలిసిన దైవస్వరూపం గురువు!
గురువును పూజించుట శిష్యధర్మము
గురువులకు కానుకలు బహుమతులు
సమర్పించిన త్రిమూర్తులు అనుగ్రహించు!
ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు గురు పూర్ణిమ
వ్యాస మహర్షి సత్యవతీ శంతనులకు జన్మించిన దినం
కృష్ణ ద్వైపాయనుడుగ నామధ్యేయం
ఋక్, యజుర్, సామ, అధర్వణ వేదాలు
విభజించిన కారణం వ్యాసపూర్ణిమగా
నామకరణం
ఆధ్యాత్మిక గురువు భగవంతునికి సంధాధకర్త
మోక్షప్రాప్తికి గురువు ఆదేశాలే స్ఫూర్తి!
గురువులగు షిర్డీ సాయిబాబా దత్తాత్రేయ స్వామి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
రాఘవేంద్రస్వామి పౌర్ణమి రోజున ఆరాధ్యులు
మందిరాలలో క్షీరాభిషేకం పంచామృతాభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యప్రాప్తం
అరటిపండ్లు, శెనగ గుగ్గిళ్ళు నైవేద్యాలు సమర్పణ ప్రసాద వితరణ ఈతి బాధలకు విమోచన! సుఖసంతోషాలకు దీవెన!!
21
[23/07, 10:14 pm] Lalita Sister: కవితా గానం సీజన్2
ఆషాడ మాసం పౌర్ణమి కవితలపోటీ
అంశము: గురుపౌర్ణమి
శీర్షిక: గురుపౌర్ణమి విశిష్టత
రచన: బి నాగేశ్వరరావు వైజాగ్ 8801526321
పెద్దలను గౌరవించడం మన సంస్కృతి
సమాజాభివృద్ధి సారధులను పూజించడం
మన సంప్రదాయం!
తరతరాలుగా ఆ విలువల్ని పాటించడం
మన సంస్కారం
ఆ ఆచార పర్యవసానమే గురుపౌర్ణమి పర్వదినం!
విజ్ఞాన భాండాగారాలు, ఆద్యాత్మిక నిధులయిన
వేదాలను ప్రాచీన భారత సమాజాని కందించిన,
బోధించిన ఉత్తమ గురువు వేదవ్యాసుడు!
ఆయన జన్మదినం ఆషాడ శుద్ద పౌర్ణమి
అయ్యిందిగురువులను గౌరవించుకునేపండుగ
గురుపౌర్ణమి , గురుపూజోత్సవ దినం!
'గు' అంటే చీకటి,'రు' అంటే దూరం చేయడం
మనిషి లోని అజ్ఞానాంధకారం తొలగించి
విజ్ఞానం అందించే వాడే గురువు
అతడిని గౌరవించుకోవడం మన కర్తవ్యం!
అనాదిగా వస్తున్న ఆచారం
తల్లి తండ్రుల తరువాత మన క్షేమం కోసం
శ్రమించే దైవం వంటి వాడు గురువు
ఆయనను పూజించడం ఒక పండగ
అందుకే గురుపౌర్ణమికావిశిష్టత!!
ఇది నా స్వీయ రచన అని తెలియజేయు చున్నాన
22
[23/07, 10:15 pm] Lalita Sister: అంశం: గురు పౌర్ణమి
శీర్షిక:గురువు
_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ) ఖమ్మం
అజ్ఞాన తమస్సు తొలగించే వికాస మూల స్థంభమై
విజ్ఞాన ఉషస్సు కలిగించే శాశ్వత తేజస్సు కిరణమై
చిత్త భ్రమ, విభ్రాంతులను పారద్రోలే జ్ఞాన దీపమై
నిత్యం సత్యమై దారి చూపే దివ్య చైతన్య స్ఫూర్తి గురువు...!
అజ్ఞానాంధకారాన్ని తొలగించి శిష్యుల అంతఃకరణాన్ని శుద్ధి చేస్తూ
జ్ఞాన శక్తితో ఉదాత్తమైన యుక్తితో శిష్యగణ సందేహాలను నివృత్తి చేస్తూ
విద్యార్థుల అభ్యున్నతిని అహర్నిశలు ఆకాంక్షిస్తూ
సమస్త మానవాళికి సహితం విజ్ఞాన మస్తక పుస్తకమైన త్రిమూర్తుల ఆకృతి గురువు...!
తమ జీవితానికి మార్గ నిర్దేశం చేసి ముక్తి వైపు నడకలు నేర్పిన ప్రతిఫలంగా
ఆషాఢ శుద్ధ పౌర్ణమిన అంబరమంత సంబరంగా గురుపూజోత్సవం జరిపి
కానుకలు బహుమతులు భక్తి తో సమర్పించిన శిష్యులకు
ఆశీర్వచనాలు ఇచ్చి దీవించే మహాత్మ స్వరూపుడు గురువు...!
కృతా యుగంలో పరమ శివుని జ్ఞాన గురువు దక్షిణామూర్తిగా
త్రేతా యుగంలో యోగ ఆధ్యాత్మిక విద్యలను అందించిన దత్తాత్రేయుడుగా
ద్వాపర యుగంలో అమూల్యమైన వేదరాశిని సంస్కరించి నాలుగు వేదాలు గా విభజించిన వేదవ్యాసుడు గా
కలియుగంలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రభోదించిన జగద్గురు ఆది శంకరాచార్యులుగా
సువర్ణాక్షరాల చరిత్ర పుటల్లో వెలుగొందిన గురువు...!
మేధ శక్తి, ధర్మ దీక్ష,ఆధ్యాత్మిక పరిణతి జ్ఞాన పటిమలతో
సనాతన సంప్రదాయ సారస్వత విజ్ఞానాన్ని పరిపుష్టం చేసి
సిరివెన్నెల వెలుగులతో ఆర్ష ధర్మాన్ని ,ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని దీప్తిమంతంగా ఆవిష్కరించి
తాను దర్శించిన బ్రహ్మ తత్వాన్ని ,బ్రహ్మ సూత్రాలుగా ప్రకటించిన వ్యాస మహర్షి గురోర్గురువు...!
చతుర్విధ పురుషార్ధాల సాధన కోసం
పంచమ వేదమైన మహా భారతాన్ని సృజించి
భారత జాతికి అమూల్యమైన కానుక అనుగ్రహించి
నాలుగు ముఖాలు లేని బ్రహ్మగా
రెండు చేతులే ఉన్న విష్ణువుగా
ఫాలనేత్రం లేని పరమేశ్వరుడిగా
గురు పరంపరకు ప్రతి నిధిగా వ్యాసుడు గురువులకే గురువు...!
హామీ పత్రం
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
23.
కవిత *
కవితా గానం (సీజన్ 2)
పౌర్ణమి కవితల పోటీ
అంశం...గురు పౌర్ణమి
శీర్షిక...అలుపెరుగని శిల్పి
ఆనాడైనా ఈనాడైనా
అలుపెరుగని నిరంతర శిల్పతను.....
ఓ రాముడినో ఓ అర్జుడినో
ఓ గాంధీనో ఓ అంబేడ్కర్నో ...
ఓ అబ్దుల్ కలాంనో ఓ మదర్ థెరిస్సానో
ఓ సచిన్నో ఓ హిమ దాస్ నో....
శరం నుండి శరవేగంగా వదిలిన
విల్లులా పరిణతి చెందించి....
పదుగురికి ఆదర్శంగా నిలపడానికి
గురువు ఎప్పుడూ ....
శ్రమల గూడు క్రింద
ఆనందాల స్వేద బిందువుల్ని ...
అలవోకగా జార్జి
అలసటను గుండె గవాక్షం లో దాచి
తన మేధా పరిశ్రమలో
తనను మించిన శిష్యుని ..
అంబర మెత్తున నిలిపి
సంతోషాల చప్పట్ల జడివాన లో....
తడిచి ముద్దవ్వాలనే
ఆశలకు పూరేకులను
అడుగడుగునా ఆశించేవాడు ....
గురువు ఆనాడైనా ఈనాడైనా
ఆశయాల సాధనకు
ఆకాశమంత నిచ్చెన వేసి ...
అంబరాన తారలా మెరిసే
శిష్యుని పురోగతికి ...
నిరంతరం వెలుగు నింపడానికి
ఉషస్సు దుప్పటిని కప్పు కొనేవాడు .....!!
హామీ....ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను సార్ 🙏
మొహమ్మద్ .అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ గో జి)
24
కవితాగానం సీజన్2
అంశం:పౌర్ణమి
శీర్షిక:ఆషాడపౌర్ణమి
ఆషాడమాసపౌర్ణమి గురుపౌర్ణమిగా ప్రసిద్ది
వ్యాసమహముని జన్నదినము ఆషాడపౌర్ణమి
పౌర్ణమి అంటేనే వెలుగులు జిమ్మెరోజు
గురుపూర్ణిమ జ్ఞానప్రదాత జన్మించినరోజు
వ్యాసమహముని ఆదిగురువుగా పెర్కొనినరోజు
వేదాలను విభజించి వేదవ్యాసడైనాడు
అష్టాదశపురాణలందించాడు
మహభారతగాధలో తానోకముఖ్యపాత్రధారుడై నడిపించాడు
దృశరాష్ట్ర పాండురాజు విదురలకు పితృదేవుడు
గాంధారిగర్భవిచ్చితిని నూరుగురుగా చేసి కురవంశ్శాన్ని నిలబెట్టాడు
భారతదేశ గురుపరంపరలో తనదే అగ్రస్థానము
ఆషాడపౌర్ణమి కేవలం వ్యాసునికేకాక
గురువులందరికి పండుగే
అజ్ఞానతిమిరాలను తొలగించి విజ్ఞానకాంతిపుంజాలను వెదజల్లెవాడేగురువు
ఆదిశంకరులు ఆ పరంపరలోనివారే
శ్రీకృష్ణభగవానుడు జగద్గురువు
రామకృష్టపరమహంస గురువే
స్వామివివేకానందుడు తాత్వికగురువు
గౌతమబుద్దుడు కూడా ఆధ్యాత్మికతసాధించి గురవయ్యాడు
గురుపూర్ణిమనాడు గురువులందరిని సత్కరించుకుందాం!
ఇది నా స్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం,శ్రీకాకుళంజిల్లా
7780594995.
25.
[24/07, 9:42 pm] Lalita Sister: *కవితాగానం సీజన్2*
*ఆషాఢమాస పౌర్ణమి కవితా పోటీలు*
*జంపని శ్రీనివాసమూర్తి* ( *జలజ* )🦜
గుంటూరు
24 - 7 - 2021
అంశము: గురుపౌర్ణమి
శీర్షిక: *చీకటి నుండి వెలుగుకు*
" *గు* కారశ్చంధకారస్తు *రు* కారస్తన్నిరోధకః "
పొత్తిళ్ళ బిడ్డకు స్తన్య క్షీరమునిచ్చి
లేగదూడల మాలిన్యములను శుభ్రపరిచే
గోమాత తాదాత్మ్యముతో అమృత వాక్కులతో జ్ఞానశిల్పముగా మార్చిన అమ్మకు *తొలి గురువుగా వందనం సమర్పిస్తూ*
కడలి కెరటాల కల్లోలిత చీకట్లలో
ఆలంబనగా, వేదరాశిని విభాగాలుగా చేసి
భారత భాగవత అష్టాదశ పురాణాలతో
విష్ణుసహస్ర, భగవధ్గీత, బ్రహ్మసూత్రాలను
జాతికి శ్రేయో తోరణాలుగా పంచిన
*ఆషాడ శుద్ధ పౌర్ణమి నాడు జన్మించిన*
*వ్యాసాయా విష్ణురూపాయా వ్యాస రూపాయా విష్ణవే*
*నమోవై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమోనమః*
పవిత్ర ఆషాడ శుద్ధపౌర్ణమి వెలుగుల్లో
శివుడిచే జ్ఞానబోధ పొందిన సప్తర్షుల,
దాత్తాత్రేయుల వారిచే జ్ఞానబోధ పొందిన శిష్యుల శ్రేణీ ముఖమండల మెరుపులు
*గోరింట కాంతులు* యై తరతరాల నుండి
అజ్ఞానాంధకారాన్ని తొలిగిస్తూ నడిపిస్తూ.
హాయగ్రీవ ఆదిశంకరాచార్య సాయిబాబా
గురుపరంపరలుగా విద్యాసద్బుద్ధి నేర్పే ప్రకృతిలోని ప్రతి జీవికి *గురుభ్యోనమః*
--------------------------------------------------
*హామీ* నా స్వీయ రచనగా తెలుపుతూ🦜
26
[24/07, 9:43 pm] Lalita Sister: తేదీ 24-07-21
అంశం :గురువు
శీర్షిక :బతుకు బెత్తమే..
******************************
చేసిన తప్పే మళ్ళీ
తప్పటడుగేయనియలేదు
క్రుంగదీసిన ఓటమే
గెలుపు పీఠం దిగనీయలేదు
కరిగిన క్షణమిచ్చిన సమీక్షే
ప్రయత్నం మాననీయలేదు..
నీజీవితమంత జగద్గురువు
నీకెవరుంటారు .. ఎదురు దెబ్బల
సహాధ్యాయుల మధ్య విధినెదిరించే
విద్య నేర్పింది బతుకు బెత్తమే..
నీ అవకరం నీ బలహీతను వివరించిదా
నీ అవమానం నీ బలాల్ని వెదికి తెచ్చిందా
నిన్ను నీవు అక్కున చేర్చుకొని చెక్కుకుంటే
నిన్ను నీవు ద్రోణుని ప్రతిమను చేసిబోధించు కొంటె ఏకలవ్యుడై బతుకుభారతం గెలుస్తావు...
సమస్యలెపుడూ పరిష్కారానికే ఆష్కారమిస్తాయి లక్ష్యాలెపుడూ గురి కోసమే
ఎదురు చూస్తాయి అందుకే నిన్ను నీవు గురి చేసుకుంటే నీకు నీవే గురువు అవుతావు నీపాదాలు చేరే గెలుపు పంధాలకు నీవె మార్గదర్శి అవుతావు...
****************-********************
ఆర్. వి. వి రాజా, శృంగారాయునిపాలెం
తూ. గో. జిల్లా,9059492795
27.
అంశం : గురుపౌర్ణమి
కవిత శీర్షిక : గుర్తెరిగి!
విశ్వగురువు వ్యాసుని జన్మతిథి అయ్యేను గురుపౌర్ణమి /
శిష్యుల జీవితంలో పౌర్ణమి లాంటివాడు గురువు/ గురువు అజ్ఞానాలకు నశింపు వెలుగుల ప్రకాశింపు/ బ్రతుకు గాడిని విజయ పట్టాలెక్కించే చోదకుడు/ చీకటి కూడలిలో దారి చూపే వెలుగుల దివిటీ/ అంతరంగ అరిషడ్వర్గాలను హరించే శ్రీరంగడు/ ధూర్తత్వాన్ని దహించి వేసే ధీరోదాత్తుడు / రంగ మేదైనా అంతరంగాన్ని సృజించే సృజనశీలి/ ప్రేరణ ప్రోత్సాహాల నిత్య సుకర్మాగారం/ తరువుకు మల్లే గురువు ఇరువురు స్వప్రయోజనాలు ఆశించరు/ చిరిగిన చొక్కను రంగురంగుల కోటుగా నేసే అక్షరం నేతగాడు/ ఆ ల నుంచి అంతరిక్షం వరకు గురువే ఆదెరువు లేదంటే బ్రతుకు బడి బరువు/ ఆధ్యాత్మిక బోధలు నైతిక విలువలకు ఆలవాలమైన ఆలయాలు నేటి నాగరిక సమాజంలో అసలే కానరావు/ అంతా వ్యాపారం మోహమయిన వేళ/ ఎక్కడున్నాయో ఆనాటి గురు మర్యాదా విలువలు/ గురువును దైవంగా నెంచ్చిన సమాజంలో నేడు గురువుల పైనే హాస్యం ప్రలాపాలా..?/ గురుతర బాధ్యత నెరిగి వినయంతో ఉన్నప్పుడే కదా గురుశిష్యుల విలువ / అజ్ఞానం అహంకారం తొలగడమే గురుపూజకు అర్థం/
అలా కానినాడు అన్నిపూజలుకూడా వ్యర్థం/
పేరు : బొప్పెన వెంకటేష్
జిల్లా: సిద్దిపేట్
చరవాణి : 9866584062
హామీ పత్రం: నేను రాసిన నా కవిత దేనికి అనువాదము అనుకరణ కాదు, నా సొంతం అని హామీ ఇస్తున్నాను.
28.
శ్రీ గురుభ్యో నమః
****************
సీసము
********
విద్యాసుబుద్ధులు విశదమౌ రీతిన
విఙ్నానమందించు విశ్వసృజులు
చదువు సౌశీల్యత చతురిమ బోధన
విఙ్నానమందించు ఆఙ్నయుతులు
లోకయుక్తంబగు లోచనాల్ సంధించు
విఙ్నానమందించు విభుదవరులు
వ్యక్తిత్వ వికసనం వ్యవహార శైలులన్
విఙ్నానమందించు ప్రాఙ్నమతులు
ఆ"వె"
మారుతున్న జగతి మార్పుల గైకొని
తెలివితేట పెరుగు తీరు దెలుపు
కన్నబిడ్డలోలె కనిపెట్టు గురువులు
నిత్యవందనీయ సత్యరథులు
*******************************
కందము
********
విజ్ఞాన వెలుగు రేఖలు
సుజ్ఞానము తోడపంచి సుమతుల జేయన్
అజ్ఞానము తొలగించగ
ప్రజ్ఞానిధులై వెలిగిన పేరును పొందున్
కందము
*******
వినయ వివేకము నొందను
సునిశిత సుజ్ఞానమిచ్చి సొక్కపు రీతిన్
అనునయమ్ముగనేర్పిన
కనపడుదైవమనితండె ఘనమగు పగిదిన్
*****************
మేకల రామస్వామి-చెన్నూర్
*******************************
పౌర్ణమి కవితలపోటీ నిమిత్తము
29.
గురుపౌర్ణమి శుభాకాంక్షలు
శీర్షిక: జ్ఞాన ప్రదాత గురువు
మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ
వేదవ్యాస మహర్షి జన్మదినాన్ని
వ్యాస పూర్ణిమనే గురు పూర్ణిమ అంటారు
కాలజ్ఞానమనే కాలచక్రంలో..
కలియుగంలో అధ్యాత్మిక సిద్దాంతాన్ని
ప్రబోధించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు
మహాభారతంలో గీతోపదేశం
రామాయణంలో మహా కావ్యాలు
రచించి,జ్ఞాన జ్యోతులు వెలిగించి
జ్ఞానోదయాన్ని పంచిన శుక్రచార్యులైన
వేదవ్యాస మహర్షి సకల దేవతలకు గురువు
అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన సంపదను అందించి
విజ్ఞానమే అను విద్యా సుగంధాలు పూయించిన
ఉపాధ్యాయుడు మనందరికీ ఆదర్శ గురువు
అక్షరతోటలో మమతానురాగాలు పంచి
అనునిత్యం ఆరాధించే దైవం గురువు
గురువే ఆదర్శమూర్తి గురువే మార్గ నిర్దేశకుడు
గురువే పరమాత్ముడు గురువే లోకరక్షకుడు
విద్యార్థులను చైతన్యం పరచిన
గురువులందరికీ శతకోటి వందనాలు
*************************
ముత్యం వెంకటేశ్వరరావు
గురజాల, గుంటూరు జిల్లా
చరవాణి: 7997840591
హామీపత్రం: ఈ రచన నా స్వీయ రచన ఎటువంటి అనువాదం కానీ అనుకరణ కాదని హామీ ఇస్తున్నాను 🙏🙏
30.
*కవితా గానం ప్లవ నాన సంవత్సర ఆషాఢ మాసం పౌర్ణమి నగదు బహుమతుల కవితా పోటీ కోసం*..
అంశం: గురు పౌర్ణమి
కవి పేరు: నాశబోయిన నరసింహ (నాన),
ఊరు:చిట్యాల,నల్గొండ జిల్లా,
చరవాణి:9542236764
ప్రక్రియ: వచన కవిత
⚜️⚜️⚜️⚜️⚜️🙏♦️🙏⚜️⚜️⚜️⚜️⚜️
*వందే జగద్గురుమ్*
""""""""""""""""""""""""""""""""
ఆషాఢ శుద్ధ పౌర్ణమి శుభ దినం
వ్యాస మహర్షి పుట్టిన పవిత్ర రోజు
ఆధ్యాత్మిక గురువుల పూజించే వ్యాసపూర్ణిమ
గురు శిష్యుల అనుబంధ సుగంధం గురు పౌర్ణమి
గురువంటే జ్ఞానామృత మధుర ఫలం
జీవితానికి మార్గనిర్దేశం చేసే అపర మేధావి ధర్మం వైపు నడిపించే విశ్వ జగద్గురువు
కాల మహిమ ముందుగా పసిగట్టే నేర్పరి
సనాతన సంస్కృతి ప్రధాత వ్యాసుడు విశ్వగురువు
భారత భాగవత రచయిత సర్వ విద్యా ప్రవీణుడు
అవలీలగా అష్టాదశ పురాణాలు రచించిన ఘనుడు
అనురాగం పంచి అభ్యుదయం ఆకాంక్షించే
అమ్మా నాన్నలు ఆది గురువులు
లౌకిక విద్య బోధించే ఆచార్యులు
సత్యవాక్కుల మంత్రవిద్య నేర్పే ఆధ్యాత్మిక గురువు
శ్రీరామచంద్రుడి గురువు వశిష్ట మహర్షి
శ్రీకృష్ణునికి సాందీపుడు గురువు
రామకృష్ణ పరమహంస వివేకానందుని గురువు
రాకుమారులు సైతం పూజించే గురుకుల గురువుని
అనాదిగా కొనసాగుతున్న గురు పరంపర
నీలో దాగిన సృజన వెలికి తీసేది గురువు
సహాయకుడు సలహా దారుడు స్ఫూర్తి ప్రదాత
ఆజ్ఞాన తామసి తరిమే విజ్ఞాన వెలుగు కిరణం
ఈ దినం త్రిమూర్తుల తేజమా! వందే జగద్గురుమ్
🌀🌀🌀🌀🌀🙏🙏🌀🌀🌀🌀🌀
*హామీ పత్రం:* ఈ కవిత నా స్వీయ రచన. దేనికీ అనువాదం అనుసరణ కాదనీ హామీ ఇస్తున్నాను.ధన్య వాదాలు.
✍️ *నాన*
31.
కవిత *
శీర్షిక:ఆచార్య దేవోభవ
ఆషాడ శుద్ధ పౌర్ణమి
వ్యాస మహర్షి జన్మదినం
గురు పూర్ణిమగా ప్రసిద్ధం
గురువులకు ఆ దినం ప్రతిష్టానం
ఆదిగురువు వ్యాసుడు పూజలందుకొను దినం
అజ్ఞాన తిమిరాన్ని తరిమి
జ్ఞాన జ్యోతులు వెలిగించేవాడు గురువు
నీ బతుకు బాటలో
వెన్నెలలు వికసింప చేసేవాడు గురువు
కృష్ణ ద్వైపాయణుడుగా పొరొందిన
వ్యాస మహర్షి మహా జ్ఞాని సంపన్నుడు
మహాభారత ఇతిహాస రచనకు ఆద్యుడు
మహా తపస్సంపన్నుడు వ్యాసుడు
మానవ జాతికి ఆధ్యాత్మిక వారసత్వాన్ని
అందించిన త్రిమూర్తి స్వరూపుడు వ్యాసుడు
అష్టాదశ పురాణ కృతికర్త పరాశర పుత్రుడు
వేదాంగాలను అందించిన మహాజ్ఞాని వ్యాసుడు
వేదవ్యాసుడుగా పేరు గడించినవాడు
గురుపూజోత్సవానికి నీ జన్మదినం సుదినం
గురువులకు మనస్ఫూర్తిగా వందనం చేసేరోజు
గురుబ్రహ్మ,గురుర్ విష్ణు,గురు దేవో మహేశ్వర
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః
ఈ కవిత నా స్వీయ రచన
32.
*కవిత గానం*
=========
*పేరు* : ఇంద్రావత్ రాహుల్
*ఊరు* కొత్తపేట్
*జిల్లా* ఇందూర్/ నిజామాబాద్
*చరవాణి సంఖ్య* 9848054079
*కవిత శీర్షిక* గురువే మార్గం..
📖 *గురువే మార్గం*✒️
ఒక్క క్షణం కళ్లు మూసుకుంటే మనో గగనాన్ని పరికిస్తే
ఒక అద్భుత కాంతిపుంజం
ఆవిష్కృతమవుతుంది
అమృత శాంతి కలశం
ప్రత్యక్షమవుతుంది
ఆ దివ్య దీపమే గురువు
నిత్య చైతన్య స్వరమే గురువు
అనురాగాల చల్లదనాన్ని పంచే అమ్మ ఆత్మీయత కాంతులు పంచే నాన్న కరుణ అమృతాన్ని
నిరంతరం పంచి దైవం
ఆ మూడు రూపాయలకు ప్రతిరూపం అతడు.
ఆ చేతనాన్ని కదిలించే
నవ్య చైతన్య ప్రవాహం
అజ్ఞానాన్ని పారద్రోలే
అనంత కాంతి తరంగం
జ్ఞానానికి ప్రాణం పోసే దేవుడు
జాతి భవితను నిర్మించే శ్రామికుడు
తరిగిపోని జ్ఞాన సిరినిచ్చే మాంత్రికుడు
అజ్ఞాన చీకట్లను తొలగించే సూర్యుడు
హాస్యాన్ని పండించే ఇంద్రజాలికుడు
నకిలీ రౌద్రాన్ని చూపే నటసార్వభౌముడు
శుద్ధ ముక్కలతో జీవితాలు దిద్దు శిల్పకారుడు
నమస్కారానికి పొంగిపోయే అల్పసంతోషుడు
విద్యార్థులను మంచి మార్గంలో నడిపించే నావికుడు
విద్యార్థుల విజయానికి మురిసిపోయే నిస్వార్థపరుడు
అలాంటి గురువుకు వందనాలు పాదాభివందనాలు...
*స్వీయరచన...✍️*
ధన్యవాదములు..🌹
౩౩
*కవితా గానం
ఏడెల్లి రాములు
*గురు పూర్ణిమ*
కవితల పోటీ కొరకు
శీర్షిక*గురువులకు వందనములు 🙏🙏
అజ్ఞానాన్ని తొలగించి
జ్ఞాన దీపాలు వెలిగించి
లోకానికి సూర్య తేజం మీరు
చదువులకు సారమెల్లను మీరు
శాస్త్ర సాంకేతిక విద్యలందు
చక్కని శోధనా పటిమ మీరు
నిన్నా మొన్నా రేపటి బాటలు మీరు
గురువుకి అర్థం మారుతుంది
సత్యానికి జగతి దూరమౌతుంది
ఏకాగ్రత ఏకోపాసన జ్ఞాన
సముపార్జన అంతా గురువే
ఆశీస్సులు అభయం అనుగ్రహం
గురువే
వినుకుంటే రాశీభూత శీలం నీవు
వినకుంటే దుర్యోధనుని సంతతి నీవు
వినయం విధేయత సహనం
గురువు గారి సేవనలో లభ్యం
నీ దారంతా జాబిల్లి పరుచుకున్నట్లు
లోకానికి పరిమళ భరితం
గురువులను మించిన దైవం లేదు
గురువులను నమ్మిన వారు ఓడిపోలేదు
గురువొక అమృతమథన
జ్ఞానకలశం
గురువొక దైవాంశ సంభూతుడైన
వేదస్వరూపం
మన గురు పూర్ణిమ
వ్యాస పరంపర చరితం
భారతీయ తత్వం
ప్రపంచానికి ఆదర్శం
ఏడెల్లి రాములు ✍️
ది*24*07*2021(22*27)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి

Comments
Post a Comment