నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
*********
కవి వరుల జాబితా
1.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
2.ధనాశి ఉషారాణి గారు
3.సునంద వురిమళ్ల గారు
4.దారల విజయ కుమారి గారు
5.గొర్రెపాటి శ్రీ ను గారు
**********
1
[17/07, 9:16 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం (సీజన్ 2) నిర్వహించు కవితల సమాహారం
అంశం: నిశ్శబ్ధం
పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి: 9505152560
*********************
*భయానకం*
నిశ్శబ్దానికి శబ్దానికి మధ్య మౌనం సాధుగుణం!
మాట శబ్దం ఆకస్మాత్తుగా ఆగిపోయిన మూగవేదనకు సంకేతం!
అలజడులు ఆందోళనలు అవని మీద విజృంభించి
ముగిసిన తక్షణం
నిశ్శబ్ధం తాండవిస్తుంది
కల్లోలిని ఉప్పెనై ఎగసిన తీరమెంతగా
ఓర్పు సహిస్తుంది..
యుద్ధం ఎంత చెలరేగిన
గెలుపు ఓటముల
అనంతరం వాతావరణం భయంకరం..
నిశ్శబ్ధం వైరాగ్యం వంటిదే
మరణం తరువాత సంభవం
స్మశానం వనము ఒక వింత అనుభవం!
మౌన శబ్దం గర్విస్తూ ప్రశాంతతను ఇనుమడిస్తుంది
నిశ్శబ్ధం నిశ్చింత కాదు భయానకం!
***
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు ప్రసారం కాని ప్రచురణ కాని కాలేదు అని నేను హామీ ఇస్తున్నాను.
//సయ్యద్ జహీర్ అహ్మద్//
2
[17/07, 9:28 pm] +91 70755 17538: శీర్షిక.నిశ్శబ్దం
............
హోరుగా వానజడి కురిసేముందు
చుట్టూ ఒసారిగా నిశ్శబ్దము చుట్టిముట్టును
మనిషి విజయాలు సాధించే
మునుముందు తెరచాటున
నిశ్శబ్ద మంత్రము పాటించేరు
మేధావులు ఎప్పుడునూ
ఓ మౌనపు మంత్రము పటించేరు
విజయానికి తొలిమెట్టు
నిజమైన గెలుపు బాటగా
మనిషి నిజముగాను
భువిలో ఎదిగి ఓదగాలి
నిశ్శబ్దము మనిషికి
నిజమైన ప్రశాంత ఇచ్చును
మనిషికి నిజమైన గౌరవము ఇచ్చేను
మానసిక ఆరోగ్యము ఇచ్చేను
నిద్రలేచిన నిశబ్దము
ఎన్నో విజయాలు ఇచ్చేను
భవితను ఇచ్చేను
ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
3
[17/07, 9:30 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ:17-07-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: నిశ్శబ్దం
******************
అస్సలు నమ్మొద్దు
ప్రశాంతతను మోస్తున్న తుఫాన్ లాంటిది..
హఠాత్తుగా పులిలా దాడి చేయనూ వచ్చు
ఆత్మ విమర్శ చేసుకుంటూ
భళ్ళున విస్ఫోటించనూ వచ్చు!
నిశ్శబ్దాన్ని మోసే రేయికి తెలుసు
మెత్తని కత్తిలా ఎలా కాలాన్ని కోస్తుందో
విరబోసుకున్న నీడలతో
ఎలా చెలరేగి పోతుందో...
అంతరంగ క్షాళనం చేసే మౌనం ముందు
నిశ్శబ్దమెప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది!
శబ్ధ తరంగాలతో
సజీవ చైతన్యమయ రూపమైన
విశ్వంలో
విజ్ఞాన తృష్ణకు బీజంగానో
అంతిమ మజిలీ రూపంగానో
ఉనికి పతాకనెగరేస్తుంది!
*వురిమళ్ల సునంద, ఖమ్మం*
4
[17/07, 9:30 pm] దారల విజయ కుమారి Poetess: కవితా గానం సీజన్2
అంశం : నిశ్శబ్దం
శీర్షిక : గడ్డకట్టిన లావా
17-7-2021
***************
అలా
నిశ్శబ్దాన్ని మోసుకు తిరగటం
ఎందరో చూసారు
మాట మాటకూ మధ్య
నిశ్శబ్దాన్ని తెరలుగా కడుతుండటం
నేనూ చూసాను
పట్టెడు మౌనాన్ని
పకడ్బందీగా అమలు చేస్తూ..
పక్క నుంచీ నడిచెల్లు తుంటే..
మర్మమేదో ఒదిలినట్టు
మోము పలక పై ఏదేదో రాసున్నట్టు చూసాను
ఏంటో
ఆ కళ్ళనిండా మాటలే
వినబడీ వినబడనట్టు
అర్ధమయ్యీ కానట్టూ..
మట్టిలా..మంచులానే ఉంటుంది
లోలోపలే ప్రకంపనలు..అగ్ని పర్వతాలు
ఇప్పుడు తెలుస్తోంది
ఆ నిశ్శబ్దం.. ఘనీభవించిన లావా అని
దారల విజయ కుమారి
5
[17/07, 9:31 pm] +91 96528 32290: శీర్షిక : నిశ్శబ్దం
రచన : గొర్రెపాటి శ్రీను
తేదీ : 17.07.21
మనిద్దరి మనస్సులు ఒక్కటైన క్షణాన
మన మనస్సులు పలకరిచుకున్న ఆ చిన్ని మాట ఏమై వుంటుందనుకుంటున్నావు!?
నిశ్శబ్దం .. !
నీ నయనాలు పలికిన ఆ చిన్న మాట మౌనమే కదా !!
ఆ నిశ్శబ్ద భావన నా హృదయన్ని నేరుగా హత్తుకొనగా
ఎదలో నువ్వు పంచిన ,సరికొత్తగా పరిచయం చేసిన
మౌనరాగాలు అల్లరిగా ఆటపట్టిస్తున్నాయి.. !
ఇదంతా కలో నిజమో అర్థం అవ్వని సంధిగ్ధంలో నేనుండగా..
నీ చిరునవ్వుల సరిగమలు మాత్రం నా యదలో ఇంకా మౌన సందేశాలనేవో పల్లవిస్తున్నట్లుగా అలరిస్తుంటే..
ఎప్పటిలా నేను..
నిశ్శబ్ద తీరాలను చేరి ..నీ రాకకై నిరీక్షిస్తున్నాను !
ఈ రచన నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను .
- జి.శ్రీను
Comments
Post a Comment