Skip to main content

online lessons



నిర్వహణ
శివునూరి లలితా కృష్ణ
వీరా గుడిపల్లి
*******
1.డా.బల్లూరి ఉమాదేవి గారు
2.ధనాశి ఉషారాణి ,చిత్తూరు గారు
3.తాతపూడి సోమశేఖర శర్మ గారు
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
********

[03/07, 8:26 pm] Lalita Sister: 

కవితాగానం

నేటి అంశం
03.07.2021

ఆన్లైన్ పాఠాలు

ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు
అంశానికి కవితలతో
స్పందించగలరు.

ఆ సమయంలో ఎలాంటి
ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.
1

❇️❇️❇️❇️❇️❇️
[03/07, 8:43 pm] Balloori Umadevi Poetess: కవితా గానం
డా బల్లూరి ఉమాదేవి
అంశం:ఆన్లైన్ పాఠాలు
శీర్షిక:ఆన్లైన్ చదువులు 

 మహమ్మారిలాంటి కరోనా రాకతో 
 చదువంతా అతలా కుతలమయ్యె
 కంటి చూపుతో శాసిస్తూ 
 కమ్మని విద్య నేర్పే గురువులు 
 కంటి ముందే కనిపిస్తున్న 
 పిల్లలను అదుపులో పెట్టలేని స్థితి వచ్చె
 చేత సుద్దముక్క పట్టే గురువులంతా 
 ఆన్లైన్ పంతుళ్ళైరి బలవంతంగా
 ఉన్న వారికే చదువు అన్నదొకప్పటి మాట  
 చర్విత చర్వణమయ్యె నేడు
 సెల్ఫోనో కంప్యూటర్లో ఉన్నవారికే
  చదువు పరిమితమయ్యే
 రెక్కాడితే డొక్కాడని బడుగు జీవుల  
  వారికీ ఆన్లైను చదువు ప్రశ్నార్థకమే 
  బడిలో గురువు చెప్పిన పాఠాలే
  అర్థం కాని వారికి ఆన్లైన్ పాఠాలు 
   అర్థమయ్యేదెలా
  ఫోను చూడకండి అంటూ చెప్పాల్సిన
  పెద్దలే ఫోను చేతికిచ్చి చదివించే
  దుస్థితి దాపురించే ఇంటింటా
  సిగ్నల్  అందక ఆరుబయట చెట్లెక్కి
   ఫోనో  కంప్యూటరో పట్టవలస వచ్చె   
 పిల్లల సందడి లేక బడులన్నీ బోసిపోయె 
  రిక్షాలు ఆటోలలో పిల్లలను బడికి  
 తీసుకెళ్ళు వారి బ్రతుకు తెరువు కరువయ్యె
 బడి లాంటి గుడికెళ్లి నేర్చుకోవాల్సిన విద్య
 చెట్ల నెక్కి మిద్దె లెక్కి చదవవలసి వచ్చె  
 విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకమే అయ్యే  
 ఎన్నాళ్ళో ఎన్నేళ్ళో చెప్పు వారలెవ్వారో?
2
[03/07, 8:48 pm] +91 70755 17538: శీర్షిక.ఇన్లైన్ పాఠాలు
......

పెరిగిన సామాజిక మాధ్యమాల
మాయాజాలములో చిక్కి
బంధాలు దూరమైపోయి
బాధ్యతలు తరిగిపోయి
యాంత్రికమైన నేటి యువతను
పట్టిపీడిస్తున్న  మాయారక్కసిగా
నిత్యము సేల్ఫోన్లో మునిగి తేలుతూ
ఫేస్ బుక్ వాట్సాప్  యూట్యూబ్ అంటూనే
నిత్యము వినోదపూరిత గేమ్స్ లోమునిగి

కాలక్షేపముకి చిరునామాలా
మిగిలిపోతున్న నేటి చదువులు
పత్యక్ష తరగతులు తరిగిపోయి
పచ్చనోటు కోసము పేదలను పీడిస్తూ
కార్పోరేట్ వారి ఖజానాను నింపుతున్న ఆన్లైన్ పాఠాలు
విద్యార్థి గురువు మధ్య సంబంధములను తెంచి
విలువలు దిగదార్చుతూన్న నేటి చదువులు
కరోనా మాయతో తెరపైకి వచ్చిన
నేటి ఆన్లైన్ పాఠాలు బడికి దూరము జేసి
మధ్యతరగతి బతుకులను చిత్తు చేస్తున్నది
పెద్దలు పనులు మునిగి పిల్లలుకు అందని ఫోన్లుతో ఆన్లైన్ పాఠాలు ప్రయోజనము శూన్యము
బడి చదువులు ముద్దు భవితను దిద్దవు ఇన్లైన్ పాఠాలు

ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
భాకరాపేట
3
[03/07, 9:10 pm] తాతపూడి సోమశేఖర శర్మ: కవితాగానం 
అంశం.. ఆన్లైన్ పాఠాలు 
శీర్షిక.. తప్పనిసరే కదూ !

అందమైన పిల్లలు 
ఆనందమైన నడకతో 
అందరి కలయికలతో 
అటు ఇటు చూసుకుంటూ 
అందరిని పలకరించుకుంటూ 
అపురూపమైన మడత డ్రెస్సులతో 
అలంకరణతో సుందరoగా 
ఆహ్లాదాన్ని అందిస్తూ 
ఆబడికి పోయే పిల్లలు మీకు 
ఆరోజులే మధురానుభూతులు
అవి మరువలేము మరపురాదు 
అనునిత్యం ఆదేవుని ప్రార్థిస్తాం
అవే మాకు కావాలని..........  అదురుబెదురులేకుండా........ 
అమ్మఒడికి చేరాలని.............. అమ్మలాంటి బడిని....  తనివితీరచూడాలని... చూడాలని 

ప్రపంచమంతా వచ్చింది 
కరోనా మహమ్మారంట 
స్వేచ్ఛ మాకు లేదంది 
భయముతో ఉండమంది 
చదువు లేదు సంధ్యలేదు 
పాఠశాల అసలు లేనేలేదు 
గురువులేడు గుణిజంలేదు 
మాస్టారే చూపు కరువాయే 
ఇంటి దగ్గరే మేము 
ఆన్లైన్ పాటలతో 
భయము భక్తి లేకుండా 
ఏదో మొక్కుబడికి వింటున్నాo
అమ్మ నాన్న చూసినప్పుడు 
వినినట్లుగా నటిస్తున్నమేము 
భవిష్యత్తు ఊహించుకొని 
బెంగతోనే వుంటున్నాము              ఆన్లైన్ లోని పాఠాలు మాకు 
అసలు అర్ధమగుటలేదు 
వింటున్నాo కంటున్నాo 
కాలక్షేపం చేస్తున్నాo

భగవంతుని దయవలన 
బడిలోకి  వెళ్లేరోజు 
తొందరలో రావాలని                    స్వేచ్చ ప్రసాదించమని 
ప్రతిరోజు ప్రార్ధిస్తున్నాo
కరోనా అంతమయ్యేలా 
కనికరించు కల్పవల్లీ !
చదువులమ్మ సరస్వతీ !

ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం, 8328079336
4
[03/07, 9:11 pm] +91 83099 20625: ఆన్ లైన్ క్లాసులు
-----------------------

అనుకోని ప్రమాదం
అంటుకున్న రోగం
విస్తరించిన సమయం
లాక్డౌన్ వచ్చిన కాలం

బళ్ళన్ని మూతబడే
తాళాలు వేయబడే
పిల్లలకు సెలవులాయే
పంతుళ్లకు జీతాలు లేవాయే

చదువులు లేకపాయే
పిల్లల ఆటలు ఎక్కువాయే
అల్లర్లు మితిమీరిపోయే
ఇంట్లో గలాటలు హెచ్చాయే

అందుకే పెట్టిరి ఆన్ లైను
కూర్చోబెట్టిరి క్లాసులను
చేతికొచ్చే సెల్లులు
విడువక పట్టుకొనిరి పిల్లలు
తల్లిదండ్రులకు వచ్చే తలనొప్పులు!!
           కవిత వేంకటేశ్వర్లు
కర్నూలు   8309920625
పై కవిత నా స్వీయ రచన అని
హామీ
[03/07, 9:15 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ: 03-07-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: ఆన్లైన్ పాఠాలు తప్పదు మరి...
******************
ప్రతి క్షణం భయపెట్టిస్తూ
పాపిష్టి కరోనా వైరస్
అగమ్యగోచరంగా
బంగారం లాంటి బాలల భవిష్యత్తు..
గురువులు  సన్నిధిలో
గురుతుగా నేర్వలేని చదువు..

టీవీలు కంప్యూటర్లు సెల్ ఫోన్లు కట్టిన వారధిలో
చదువుల సంద్రాన్ని ఈదేందుకు
ఇస్తున్న శిక్షణ!

ఆన్ లైన్ పాఠాలు వీక్షించమనీ
అడుగున బడిన పాఠాలను
అంతర్జాలంలో వినేందుకు
ఏర్పాటు చేసిన ఆన్ లైన్ పాఠాలు!

మధ్య తరగతి ప్రజలకు తలకు మించిన భారమై
రెక్కాడితే డొక్కాడని పేదకు
అద్దంలో చందమామై ఊరించే
ఆన్ లైన్ పాఠాలు..
కూలివారి పిల్లలకు అందని ద్రాక్ష పండ్లే...

నెట్టుండదు రీచార్జ్ కు నోటుండదు
 ఆశల తీరం చేరేందుకు అన్ లైన్  పాఠాల అగచాట్లకు అంతుండదు...

 తప్పదు మరి..
ఉన్నది మర్చిపోకుండా చేసేందుకు
చేస్తున్న చిరు ప్రయత్నం!

 *వురిమళ్ల సునంద,ఖమ్మం*
[03/07, 9:29 pm] మన్నె లలిత గారు కవయిత్రి: కవితాగానం 
 మన్నె లలిత
 అంశం ఆన్లైన్ పాఠాలు
 
 బడిలో చదువు పోయి
 ఇల్లే  బడియై
  చరవాణులు లో
 చదువుకుంటూ
 తల్లిదండ్రులను మోసగిస్తూ
 చదువు మానేసి బొమ్మలు చూస్తూ
 కాలక్షేపం చేస్తున్న పిల్లలు
 చరవాణులు లేని పేదవారు అప్పులు చేసి
 తిప్పలు పడి ఫోన్ కొనిస్తే
 సినిమాలు చిత్రాలు చూస్తూ
 చెడిపోతున్న పిల్లలు
 విద్యార్థులను అయోమయంగా ఆన్లైన్లో చూస్తూ
 శ్రమ ఎక్కువైన ఉపాధ్యాయులు
 ఆన్లైన్ చదువులు ఆన్ లైన్ పరీక్షలు
 దేశ భవిష్యత్తు కే గొడ్డలిపెట్టు
 పరీక్షలు  రాయ కనే ఉత్తీర్ణత చేస్తున్న ప్రభుత్వాలు
 భవిష్యత్తులో ఇంజనీర్లే నిర్మించే కట్టడాలు
 రోగులకు ఏవో మందులు ఇచ్చే డాక్టర్లు
 లెక్కలు తెలియని విద్యార్థులు
 ఇదే రేపటి భవిష్యత్తు వేరే రేపటి భావి నిర్మాతలు
[04/07, 8:11 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం( సీజన్‌ 2 )
4/7/2021/ ఆదివారము
అంశము:-" ఆన్లైన్ పాఠాలు "

సీ!  విశ్వమంతయు మారి  విరివిగ చెలరేగ
లాక్ డౌను జాగ్రత్త  లమలు జరిపె

బడులు మూయంగాను  బాలల భవితకు
వెలుగుబాటెరుగక  వెనుక బడిరి

ఆ ల్లైను పాఠాలు  నమలుజరుపగాను
నవగాహన మొకటి  నవసరపడు

గురువుయెదురుగున్న  గురిగ చదువు గాని
ఆన్లైను పాఠము  లసలువినరు

ఆ!  ఆనులైనుచదువు  నందుబాటె వరికి
బీదవారికెట్లు  చదవ గలరు
సెల్లునెరుగ కుండ  సెల్‌ఫోను చదువులేల
మార్గమొకడిచూడు మారి తొలగ!
            తరణికంటి సూర్యలక్ష్మి.
                        ---------
[04/07, 8:12 pm] తిప్పావఝల నరసింహ మూర్తి Poet Nellore: కవితా గానం
శీర్షిక: ఆన్లైన్ పాఠాలు
తిప్పా వఝల నరసింహమూర్తి
బుచ్చి రెడ్డి పాలెం.నెల్లూరుజిల్లా

కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థను చేసింది విచ్ఛిన్నం
పాఠశాలలు తెరవలేని దుస్థితి.
తరగతి గదిలో పాఠాలు చెప్పలేనివిపత్కర స్థితి.
ప్రత్యామ్నాయంగా ఐనాయి ఆన్లైన్ పాఠాలు గతి.
తరగతి బోధన సాంప్రదాయ వివాహం.
ఆన్ లైన్ ‌బోధన తూతూమంత్రంపు పరిణయం.
బోధనలో ముఖ్యం ఉపాధ్యాయ, విద్యార్థి కృత్యాలు.
సామర్ధ్యసాధనకు ఉపాధ్యాయుడు సంధిస్తాడు
అవసరమైన ప్రశ్నలు.
ఆలోచనలు రేకెత్తింపజేస్తాడు
విద్యార్థులమదిలో.
రాబట్టిన జవాబులేసోపానాలుగా
నిర్మిస్తాడు పాఠమనేసౌధం.
ఆన్లైన్ తరగతులలోఎలారేకిత్తించ గలంఆలోచనలు?
అర్థం చేసుకున్నదాన్నిసొంతమాటలలోచెప్పడానికి ఎక్కడుందిఅవకాశం?
విద్యార్థులపరిశీలనతో పాఠంపై పెడతారు దృష్టి.
ఆన్లైన్ తరగతులు లలో ఉంటుందా ఏకాగ్రత?
మూల్యాంకనంతో తెలుస్తోంది సామర్థ్యాలసాధన ఫలితం.
ఆన్లైన్ తరగతులలో లేదుఈఅవకాశం ఏమాత్రం.
నిరంతరసమగ్రమూల్యాంకనంతోనే ప్రగతిమదింపు సాధ్యం.
ఆన్లైన్ తరగతులలో ఉండదు ఈ అవకాశం.
ఆన్లైన్ పాఠాలు తరగతిగది బోధనకు కానేకాదు ప్రత్యామ్నాయం.
తరగతిగదిపాఠాలు ఆహారం,
ఆన్లైన్ పాఠాలు ఉపాహారం.
ప్రస్తుతపరిస్తులలో ఇంతకంటే లేదు మరో మార్గం.
[04/07, 8:29 pm] Venkat Reddy Math Sa Csdo: *ఆన్లైన్ పాఠాలు *
    --జక్కిడి వెంకటరెడ్డి .
    ఆన్లైన్ పాఠాలతో అలుపెరగని పోరాటం
    అటు పిల్లలకి, ఇటు ఉపాధ్యాయులకూ...
    నిత్య సమరమే నేటి బడి పిల్లలది 
    చదువు సాగాలంటే ఇప్పుడు 
    సమస్యలతో సహవాసమేనాయె 
    ఇల్లిల్లు తిరిగి చూస్తే ...ఏముంది 
    అంతటా అవే కథలు ...
    డబ్బా ఫోనని బాధను దిగమింగుతాడోకాడ 
    స్మార్ట్ ఫోనున్నా ...తండ్రికి అది లేనిదేళ్లదని 
    రోదన చెందే పిల్లాడింకోకాడ... 
    ఫోనిచ్చినా డాటా ఉండదాయే ...
    కంప్యూటర్ ,లాప్టాప్ జాడే కనబడదేడా...
    లేని కాడ లేకున్నా 
    ఎక్కువ మంది ఇండ్లలో 
    టి వి ఉందని సంబర పడదామన్నా 
    పనిచేస్తలేదోకాడ.. చేసినా ...
    కేబుల్ సమస్య దానేంటనే ఉంది ఇంకోకాడ ...
    కమ్యూనిటీ సెంటర్లో టి వి చూడటం 
    కత్తిమీద సామేనాయె .....
    అధికారుల ఆదేశాలు ఆవేదనతో కూడినవే ....
    కనీస పాఠాలైనా పిల్లకాందిద్దామని ..
    దానితో ....
    ఉపాధ్యాయుల ఉరుకుల పరుగులు ...
    కరోనా కాలంలో తల్లిదండ్రుల 
    వ్యక్తిగత సమస్యలు కూడా కలిసి...
    పిల్లల చదువులకు అడ్డుకాలేస్తుంటే 
    చదువులకేమో గ్రహణం బట్టే 
    అత్తెసరు చదువులతో 
    పిల్లల భవితపై నీలినీడలాయే... 
    ప్రభత్వం,అధికారులు& ఉపాధ్యాయుల 
    గురుతర బాధ్యత ఎట్లా నెరవేరునో ...
     కాలమే సమాధానం చెప్పాలి ....
    -----జక్కిడి వెంకటరెడ్డి ,
          యాదద్రి భువనగిరి ...
[04/07, 8:37 pm] +91 88015 26321: అంశం:ఆన్ లైను పాఠాలు
శీర్షిక: ఎక్కడి కెళుతున్నాం మనం
   బి నాగేశ్వరరావు వైజాగ్ 

ఎక్కడికెలుతున్నాంమనం!
ఏమైపోతుందీ యవతరం!

రెక్కలు కట్టుకుఎగరాల్సినతరుణం!
కరోనా తుఫాను తాకిడికి అయిపోయారు
రెక్కలు తెగిన పక్షుల్లా సొంతగూటిల్లో
బందీల్లా ,నిస్తేజంగా నిర్వీర్యంగా

భక్తుల్లేని దేవాలయాల్లావిద్యాలయాలు
దర్శనం రద్దయిన భక్తుల్లా విద్యార్థులు
ఉత్సవ విగ్రహాలైన ఉపాధ్యాయులు

బ్రతుకువేదం ,విజ్ఞాన ప్రవచనం
ప్రత్యక్షంగా వినలేక కనలేక 
చరవాణీ శరణు కోరిన విద్యార్థులు
ఆన్లైన్ పాఠాలకు ఆహ్వానం పలికి
అరకొర జ్ఞానాన్ని అందుకొంటున్నారు

నాణ్యత ,నైపుణ్యం అందని ద్రాక్షలై
దొరకని ప్రావీణ్య ఆకలితో ఉసూరుమంటూ
చరవాణి మాయాజాలం లో చిక్కి
దారి తప్పుతున్నారు పెడదారి పడుతున్నారు
ఏమి కానున్నారోఈ దేశపు భావి పౌరులు?

ఇదే అదనుగా ప్రభుత్వాలాదేవాలయాలను
మూసుకుంటూ పోతున్నారు!
భాషా నాలుక కోసుకుంటూ పోతున్నారు!
పేదవాడిని కార్పొరేట్ కాల సర్పాల కాటుకు
బలి చేసి చేతులు దులిపేసుకుంటున్నారు!

ఇది స్వీయ రచన ఎవరికి అనుసరణ అనుకరణ కాదని తెలియజేయుచున్నాను
          బి నాగేశ్వరరావు
[04/07, 8:38 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ:04-07-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: ఆన్ లైన్ పాఠాలు
******************
ప్రకృతి ఒడిలో
పాఠశాల తోటలో హాయిగా ఆనందంగా
చదువుల మధువును గ్రోలాల్సిన 
సీతాకోకచిలుకల్లాంటి బాలలు
రెక్కలు విరిచినట్లయి
ఇంట్లో బంధీ అవ్వాల్సిన పరిస్థితి...
 వారం వారం స్లిప్ టెస్టులు
బాగా రాశారు చదివారనే గురువుల ప్రశంసలు కరువైన వేళ
అక్షర సుమాలై విరియాల్సిన మొగ్గలిప్పుడు
ఆన్ లైన్ పాఠాల్లో భవిష్యత్తును వెతుక్కుంటున్నాయి!

వారి మేథస్సుకు ఇంధనంగా
బడిలో చదివిన చదువుకు కొనసాగింపే ఆన్ లైన్ పాఠాలు!
అవకాశాలను అందిపుచ్చుకుని
కరోనా  కష్టాలు త్వరగా తొలగాలనీ
బడి మళ్ళీ పిల్లలతో కళకళలాడాలనీ కోరుకుందాం అందరం!

 *వురిమళ్ల సునంద,ఖమ్మం*
[04/07, 8:46 pm] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఆన్లైన్ పాఠాలు

జీవిత విలువలను నేర్పే జ్ఞానాలు విద్యార్థులు 
నేర్చుకోవలసిన జ్ఞాన ప్రపంచం విద్యార్థి ఇ నేడు నేర్చుకుంటేనే రేపటికి బావి మేధావిగా మారుతాడు విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు ఆన్లైన్ పాఠాలు


అక్షరమాల విరుస్తాయి

ప్రతి అక్షరము జ్ఞానము

ఈమాట విజ్ఞాన ధనము ఈ ఈ గురువు యొక్క పాఠాలు నేర్చుకున్న అప్పుడే మహా విజ్ఞాన అవుతావు విదేశాల్లో బంధువుగా తోడ్పడేది విజ్ఞానం మాత్రమే అక్కడ నీ తోడుగా వచ్చేది విజ్ఞానం మాత్రమే

విజ్ఞానాన్ని నేర్చుకో నీ భవిష్యత్తు ఉజ్వల వెలుగును పొందు అప్పుడే నువ్వు జ్ఞాన kanivi అవుతావ్



మర్చిపోకు మిత్రమా తోటల్లో కూర్చొని విన్న ఇంట్లో కూర్చొని విన్న మంచి యూనిట్ టెస్ట్లు ప్రతివారం బాగా రాసి చదివినా గురువు నిన్ను ప్రశంసిస్తూ నే ఉంటాడు నీవు మొక్కగా విరిసి పువ్వు గా చేయాలి ఆవిష్కరింప బడాలి పదిమందికి అందించాలి జ్ఞాన ఫలం గా


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు భువనగిరి కోట ఖమ్మం 7702537453
[04/07, 8:54 pm] Aalla Nageshwar Rao Poet: అంశం:  ఆన్లైన్ పాఠాలు
శీర్షిక;"" అందని ద్రాక్ష ""

అనుకోని అతిథిగా వచ్చిన
కల్లోల కరోనా రాకతో
అన్ని వ్యవస్థలతో పాటు విద్యావ్యవస్థ కుంటు పడింది
విద్యాసంస్థలు మూతపడేలా చేసింది!
విద్యా సంవత్సరం అర్ధభాగం ముగిశాక
 ఆన్లైన్ తరగతులంటూ ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా తిరిగి ఆరంబించింది విద్యాలయాలను
భయబ్రాంతులకు గురి చేసింది
విద్యార్థుల తల్లిదండ్రులను!
మొన్నటి దాకా సెల్ఫోన్ వాడకం
నివారణకు కృషి చెసిన పెద్దలకు
నేడు పిల్లలకు దానిని కొనివ్వక 
తప్పని పరిస్థితులు!
నల్లబల్లకు స్వస్తి చెప్తూ
శుద్ధముక్కకు వీడ్కోలు.చెప్తూ
ప్రత్యక్ష గురుబోధనకు.తిలోదకలిస్తూ
పరోక్ష బోధనల కు.శ్రీకారం చుడుతూ
నేర్పే విజ్ఞాన తరగతులు
బీదవారికి అందని ద్రాక్షే!
కాలంతో.పాటు మారాలంటూ
సంకేతికను అందిపుచ్చుకోవాలంటూ
మాటలు చెప్పడం తెలికే
ఆచాటించడమే.అసాధ్యం
దానిని సుసాధ్యం చేసేందుకు
కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ జరిపించి
ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు సౌకర్యాలు కల్పించి
ఆర్ధికంగా వెనుకబడిన  విద్యార్థులకు ఉచితంగా లాప్ టాప్ లు అందించి
ఆన్లైన్ తరగతుల నిర్వహణకు
తగిన వనరులు  సమకూర్చి
విద్యావ్యవస్థను పునర్నిర్మాణం గావించాలి
విద్యావ్యవస్థ బలోపేతానికి 
ప్రభుత్వం కృషి చేయాలి!
...........................................
రచన
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం
సెల్ నెంబర్.7416638823
......................................
ఫై వచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.
[04/07, 8:55 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం (సీజన్ 2) నిర్వహించు కవితల సమాహారం

అంశం: ఆన్లైన్ పాఠాలు

పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి: 9505152560
*************************
 *ప్రత్యామ్నాయ విద్య*

అల్లి బిల్లి కలలాగే
అచ్చిక బుచ్చికలాడే
కరోనా కలకలం
విద్యాలయాలు తేనె తుట్టెకు రక్షణ బంధం
ముసుగెట్టినట్టు తలుపులు బిగించుకొనగ

చదువుల తల్లి విస్తుపోయింది
చదువుకునే విద్యార్థికి బుర్రబండబారి పోయింది.
సాంకేతికత అభివృద్ధి చెందిన కాలంపై
కరోనా కుయుక్తులు సాగకుండా
దూరదర్శన్ లాగే శ్రద్ధాసక్తులతో చదువు సాగాలి

వాణి విశ్వరూపంలో
ఆన్లైన్ లో విద్యకు నాంది పలికింది...

చతికిలబడే చదువుకు ఊతమిచ్చే బహు చక్కని విద్యావిధానం!

ఇప్పటికే స్మార్ట్ ఫోన్ లలో 
గేమ్స్ ఆడుకునే పిల్లలకు షార్ట్ టర్మ్ వినోదంలా పాఠాలు
చెప్పించడం
చదువుల తల్లి ఉపదేశించిన 
సరిక్రొత్త సిలబస్ ఎక్కడా లోపం లేదు!

చదువులో వెనుకంజ
పిల్లలకు ఉత్తీర్ణత అర్హతకు పరిధి 
ప్రత్యామ్నాయ విద్య
ఆన్లైన్ విధానం!!
బోధకులలో శ్రద్ధ
విద్యార్థుల్లో ఆసక్తి పుట్టేలా
కరోనా కాలం కరిగిపోయేలా లీనమై
పోవాలి
భయానక గిజగిజ వణికిపోక
సాహసించినపుడు
తలవంచుతుంది
ఏ విద్యయైన!
     ***
         హామీ పత్రం
     ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు ప్రసారం కాని ప్రచురణ కాని కాలేదు అని నేను హామీ ఇస్తున్నాను.

//సయ్యద్ జహీర్ అహ్మద్//
[04/07, 9:09 pm] +91 99087 06218: [x] కవితాగానం సీజన్ 2
[ ] తేదీ 4 . 7 .21.
[ ] అంశం:  ఆన్లైన్ పాఠాలు.
[ ] శీర్షిక: బడి యే మా ఘరానా...
[ ] -----------------------------------------_
[ ] రచన: ‌కే దేవికారాణి రత్నాకర్ తెనాలి
[ ] -----------------------------------------------+--
[ ] చంద్ర బింబం ముఖాలకు వెన్నెల పౌడర్లు
[ ] సంస్కారాన్ని యూనిఫాం చేసి సాక్సు,షూ ల ష్టైళ్ళు
[ ] ముద్దుగా తల దువ్వి హద్దుగా బుక్స్ బ్యాగ్ తగిలించుకుని
[ ] ఎల్లలు మరచి కల్ల లు లేని ప్రపంచంలో ఓలలాడుతూ బాలలు
[ ] బ్రతుకు పాఠాలన్నీ అందంగా నేర్పుతారు గురువులు
[ ] స్వేచ్ఛ ప్రేమల కెపుడూ ఆలయాలు వీరు
[ ] పిల్లల కేరింతల్లో అల్లరాటపాటల్లో
[ ] ముద్ద తో పాటుగా ముద్దు మురిపెమందిస్తూ
[ ] ముచ్చటగా చదువు నేర్పు విజ్ఞాన జ్యోతులు
[ ] క్రమశిక్షణ చదువు సంధ్య---ఆట పాట సాంఘిక విలువ
[ ] రాజ్యాంగపు విలువలను పౌర హక్కులు బాధ్యతలను
[ ] సఖ్యంగా నేర్పించే లలితమైన టీచర్లు
[ ] బడి యే ఒక సంఘంగా బ్రతుకుటెట్లొ   నేర్పించి
[ ] భావి జీవితానికిని   పురోగమిం చడానికిని
[ ] బాటలు వేసే టి  ఈ బంగారపు బడికి వచ్చింది వినాశనం
[ ] ప్రపంచమొక మహమ్మారి చేతబడికి బలిదానం
[ ] కరోనా వైరస్సట.... బాలల భవితవ్యానికి అదియే
[ ] ఒక మైనస్సట
[ ] మనిషికి మనిషే దూరం-- పిల్లలు బడికే దూరం.
[ ] చదువుకు ఇక తిలోదకం.... భవితవ్యం అంధకారం
[ ] పిల్లల సైకాలజీ, తత్వ శాస్త్ర అధ్యయనం,
[ ] బోధనా పద్ధతులు ,బోధనలో మెలుకువలు
[ ] ప్రత్యక్షపు బోధనలో అంతులేని ప్రయోజనం
[ ] ఉన్నప్పటి రోజులే పోయాయిక హతవిధీ!
[ ] ఆన్లైన్లో పాఠాలట___పేద పిల్లల దైన్య మట
[ ] సెల్ఫోను కంప్యూటర్__టీవీలు స్మార్ట్ఫోన్లు
[ ] లేని పిల్లల గతి ఏమిటి? చదువుకునే   దారేమిటి?
[ ] కడలిలోని అలల్లాగ ఎగసి పడే పిల్లలు
[ ] స్తబ్దుగా  ను   కూర్చుండి శ్రోతల్లా వింటారా?
[ ] అవగాహన అంటారా? లెక్చర్లా సాగే ఆ ఆన్లైన్ లో పాఠంలా
[ ] విసుగు వచ్చి..... నిద్ర వచ్చి.... నేర్చుకునే బుద్ధి చచ్చి...
[ ] ఎన్నాళ్లీ చరవాణి... విద్యార్థుల' చెర 'బాణీ...
[ ] డేటా లో ప్రాబ్లం.. రీఛార్జీ ప్రాబ్లం.. సిగ్నల్ లో ప్రాబ్లం
[ ] మాకొద్దీ ప్రాబ్లం లు... రైలు పరుగు పాఠాలు....
[ ] మా బడియే మాకు ముద్దు... టీచర్ లే మాకు నచ్చు..
[ ] పో పో వే     ....కరోనా......
[ ] బడీ యే మా ఘరానా!!!
[ ]

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

పౌర్ణమి 052022 జాతీయ పతాకం

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ********************** కవివరుల జాబితా 1.కోరాడ నరసింహారావు గారు 2.తాతపూడి సోమ శేఖర శర్మ గారు 3.జోషి పద్మావతి గారు 4.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 5.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 6.శివ చరణ్ నాయుడు తరాల 7.గొర్రెపాటి శ్రీ ను గారు 8.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు 9.డా.కమలా దేవి గారు 10.అపరాజిత్ గారు 11.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 12.డా.తంగిరాల నాగ లక్ష్మి గారు 13.కవిత వెంకటేశ్వర్లు గారు 14.డా.బల్లూరి ఉమాదేవి గారు 15.డా.వేమూరి సత్యవతి గారు 16.బొప్పెన వెంకటేశ్ గారు 17.తిప్పా వఝల నరసింహ మూర్తి గారు 18.మద్ది పుల్లారావు గారు 19.టేకుమళ్ళ విజయ లలిత గారు 20.పిన్నక నాగేశ్వరరావు గారు 21.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 22.దారల విజయ కుమారి గారు 23.మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు 24.పొర్ల వేణు గోపాల్ రావు గారు 25.సింహాద్రి వాణి గారు 26.వురిమళ్ళ సునంద గారు 27.తరణికంటి సూర్య లక్ష్మి గారు 28.తోట సులోచన గారు 29. వేదాంతం సురేష్ బాబు గారు 30.మన్నె లలిత గారు 31.గజవెళ్ళి శ్రీనివాసా చారి గారు ************************ 1 వైశాఖమాసం పౌర్ణమి కవితల పోటీకి :-  అంశం :- భ...

పర్ణశాల 27052022

నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ***************** కవితా గానం సీజన్ 3 నేటి అంశం 27.05.2022 *పర్ణశాల* రాత్రి ఎనిమిది నుండి  తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆసమయంలో ఎలాంటి ఇతర స్పందనలు  తెల్పకుండా సహకరించగలరు. కవి వరుల జాబితా 1.ఆపరాజిత్ గారు 2.కవిత వెంకటేశ్వర్లు గారు 3.కోరాడ నరసింహారావు గారు 4.ఏడెల్లి రాములు గారు 5.వురిమళ్ళ సునంద గారు 6.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు 7. కందూరి సుజాతా రాణి గారు 8.వేమూరి సత్యవతి గారు 9.తాతపూడి సోమ శేఖర శర్మ గారు 10.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 11.తంగిరాల నాగ లక్ష్మి గారు 12.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 13.వీరా గుడిపల్లి 14..శివునూరి లలితా కృష్ణ గారు ************** 1 పర్ణశాల కఠోర దీక్షా సంపన్నులు రామ లక్ష్మణ సీతా తపోదనులు సత్పురుషులతో సీతామాత సాంగత్యం కడు రమణీయం రామలక్ష్మణులు అరణ్యవాసంలో తగు జాగరూకతతో నిర్మించుకొనిరి పర్ణశాల దుష్ట దుర్మార్గ పన్నాగంలో భాగంగా బంగారు మాయలేడితో రామలక్ష్మణులను దారిమళ్లించి రావణాసురుడను రాక్షసుడు సీతమ్మపై కన్ను మిన్ను కానని కండకావారంతో కామం ఎంత బలీయమైనదో అంతటి విధ్వంసానికి దారితీస్తుంది ఆ ద...