Skip to main content

చినుకు

నిర్వహణ
శివునూరి లలితా కృష్ణ
వీరా గుడిపల్లి
**********************
కవివరుల జాబితా
శివునూరి లలితాకృష్ణ
1.RVV raja garu
2.తాతపూడి సోమశేఖర శర్మ గారు
3.కె.వి.రమణా చారి గారు:
4.దారల విజయ కుమారి గారు
5.కవిత వెంకటేశ్వర్లు గారు
6.మన్నె లలిత గారు
7.మద్ది పుల్లారావు గారు
8.తరణికంటి సూర్య లక్ష్మి గారు
9.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
10.ధనాశి ఉషారాణి గారు మ
11.దార స్నేహలత గారు
12.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
13.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
14.డా.సిహెచ్ ఆంజనేయులు గారు
15.కెసి నరసయ్య గారు
16.డాక్టరు బల్లూరి ఉమాదేవి గారు
17.అన్నాప్రగడ వేంకట నరసింహారావు గారు
18.జక్కిడి వెంకటరెడ్డి గారు
19.అపరాజిత్ గారు
20.జల్లిపల్లి బ్రహ్మం గారు
21.ధనాశి ఉషారాణి గారు
22.మన్నె లలిత గారు
23.బేతి నాగ లక్ష్మి గారు
**********""
అంశం :చినుకు 

అవిరైన సంద్రపు ఆశలచిట్టాను
మూట కట్టుకున్న మేఘాలు
ఆర్చడానికి దాల్చిన  రూపు

మొట్టి కాయలతో ..
మట్టి పరిమళాన్ని పంచుతూ
అల్లరి  పిల్లకాయల నేస్తమైన
గట్టి చినుకులగర్వం తెలియని దెవరికని..?

తీగలకు ఊగులాడుతూ..
ఊచలకు ఊసులు చెప్తూ....
ముత్యపు చినుకులకెంత దర్పం 
దోసిట్లోకి రమ్మంటే ససేమిరా... అంటూ ..

పరంధామునికి 
పత్రం పుష్పం తో పాటు అర్ఘ్యమివ్వాలన్న ఆరాటంతో అట్టి పెట్టుకున్న భక్తి ఆనవాళ్ళు

శిఖరకొసలనుండి జారుతూ..
కడలి ఒడికి చేరుతూ..
 మళ్ళీ మబ్బయ్యే 
క్రమం లో
చిందించే విలాసమది


మేఘసందోహాలలో
వెండి దేహమై 
ఆకాశానికి నేలకు అనుసంధానమైన
జననమరణచక్రాల
జలతారు ....

********శివునూరి లలితాకృష్ణ

1
[10/07, 8:01 pm] +91 90594 92795: తేదీ :10-07-21
అంశం :చినకు చిద్విలాసం
శీర్షిక :ఆకుపచ్చ విలాసం
******************************
మబ్బులింటినొదిలి ఎప్పుడు
బయలుదేరావో ఎన్ని ఆవరణాలు దాటిన 
ప్రయాణమో ఎన్ని వాయు ఘాతాలను
భరించావో.. అలసిన ఓ.. చినుకా..!

ఇలా రా..                                                   నేల మేనుపై వాలు
ఆకు చెంపపై రాలు
నది నొసటపై పారు.. మరి 

మోడు గోడు విన్నావా
బీడు బీట కన్నావా
రైతు దైన్యం చూసావా...మరి

నీవు మోహరిస్తేనే మోడు మేను
చివుళ్ళ చిలకైపోద్ది నీవు స్పర్శిస్తేనే బీడు
ఒడ్ల బిడ్డల తల్లయి పోద్ది నీవు వచ్చేస్తేనే       రైతు ధైర్యం సేద్యమైపోద్ది...

నీ చిద్విలాసమే భూమి పెదాలపై
మెరిసే ఆకుపచ్చ దరహాసం
నీ ఆగమనమే రైతు ముఖాన 
బతుకు మెతుకు విలాసం..
**********************************
ఆర్. వి. వి. రాజా, శృంగారాయునిపాలెం
తూ. గో.జిల్లా,9059492795.
2
[10/07, 8:30 pm] తాతపూడి సోమశేఖర శర్మ: కవితా గానం (సీజన్ 2)
అంశం.. చినుకు చిద్విలాసం 
శీర్షిక.. ప్రకృతి వరం 
తాతపూడి సోమశేఖర శర్మ 
యానాం..533464
చరవాణి.. 8328079336

ప్రకృతి మనకిచ్చిన వరం 
భూమాత ఆకాశం గాలి నీరు 
వీటితోనే మానవ సుఖజీవనం 
ఇవిలేనట్లయితే మానవజీవనంలేదు 

పచ్చని పైరు పొలాలు 
పొలాల్లో రైతుల బారులు 
చేలు మధ్యలో మట్టిగట్లు  
రంగురంగులతో చేలో ఆడపిల్లలు 
వరి కట్టలు విడివిడిగా వేసినకట్టలు 
వూడ్చుచున్నారు అమ్మాయిలందరు        వారిసుకుమారమైన అందాలచేతులతో 

దగ్గరుండిరైతు అందరితోఅందముగా 
పనివారితో చేయిoచుచున్నాడు పని 
నాటినమొలక తేడావస్తే నచ్చ చెప్పి 
మరల వాటిని నాటించుచున్నాడు 
కామందు చెప్పినట్టుగా ఆస్త్రీలందరు 
వరి మొక్కలను పూడ్చుతూ  వున్నారు 

రైతన్నకి భయము భ్రాంతియై వుండు వర్షదేవత కరుణ మాపై చూపించాలని 
కరుణించమ్మా కాపాడమ్మా మమ్ము ఓ మేఘమాలా !
మా వందనము అందగ  రావయ్యా...  వరుణదేవుడా! వానదేవుడా !
3.
[10/07, 8:45 pm] +91 94904 14273: *మబ్బు మాట్లాడితే*
వసుధమ్మతో వాన మాట్లాడుతే
ప్రకృతి పరవశించి పోతుంటె
కూలన్నకు కేకిలు రెండు పూటల గంజి కై
రైతన్న పొలము సాగు సన్నద్ధత కై
జీవులన్నిటికీ  జవసత్వాలు  నింపుటకు
పశుపక్ష్యాదుల జంటల వెచ్చదనానికి
కొత్త దంపతులు నువెచ్చని  కౌగిలి కై
అవనిపై పడ్డ విత్తన మొలక కై
మొక్కగా పెరిగే జీవానికి
తొలకరి మబ్బు తొంగి చూస్తే
ప్రకృతి పరవశించి
నేల పులకరింప చేస్తే సుగంధమే పరిమళాలు వీరభూ స్తుంది

రచన కే వి రమణ చారి
తెలుగు పండితులు
నిజామాబాద్
4
[10/07, 8:45 pm] దారల విజయ కుమారి Poetess: కవితా గానం సీజన్2
అంశం : చినుకుల చిద్విలాసం
శీర్షిక : అల్లరి జల్లులు
10-7-2021
........................
మట్టి మొరను విన్నాయేమో
ఎండిన నేల ఎదపై 
చల్లగా మోపిన
చినుకుల పసి పాదాలు

మేఘాల ఒడి వదిలి
అవని ఆటస్తలంగా
ఆడి పాడిన
తొలకరి అల్లరులు

చేయీ చేయీ కలుపుకుని
కురిసిన చినుకులు
పిల్లకాలవలై..పల్లానికి పరుగెత్తెయ్యాయి..
మబ్బులు గా మారే..రేపటి నదికోసం

తడిసిన ఆకుల వలువలను
ఆరబెట్టుకుంటూ..చెట్లు

మట్టి పరిమళాన్ని మూటగట్టుకుని..
ముసిముసి గా నవ్వుతూ..తిరిగిన పైరగాలి

నేల పలవరింతలు
నింగికి చేరాయి
భూమి కలలిపుడు ఫలించాయి

దారల విజయ కుమారి

వాయుదేవుడా కాపాడయ్యా 
తుఫానుల బారిన పడనీకయ్యా 
పంట భాగ్యం మాచేతికి అందించు 
లక్ష్మీదేవికటాక్షము కలుగనియ్యి!మేము నిన్ను ఆరాధింతుమయ్యా!
అన్నదాతను కరుణించగ రామ్మా !
ఓ వర్షదేవతా ! నీ చిద్విలాసాన్నిమాపై చూపించమ్మా ! రైతును కాపాడమ్మా!

హామీ పత్రం 
                  ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం, 8328079336
5
కవితా గానం (సీజన్ - 2 )
అంశం... చినుకు చిద్విలాసం
శీర్షిక... రైతుకు పరవశం
పేరు... కవిత వేంకటేశ్వర్లు
ఊరు...కర్నూలు
సెల్.....8309920625

పంచభూతాలతో మన కలయిక
తీరుతుంది మన కోరిక
వాటితోనే సహజీవనం
సాగుతుంది సుఖప్రయాణ0

చినుకులు పడితే చింత వుండదు 
వర్షమైతే బాదుండదు
పొలాల్లో నీరు పారితే
రైతు కళ్ళల్లో వెలుగు

విత్తిన విత్తనాలు మొలకెత్తితే
వర్సధార కమతాలలో పచ్చగా
కనబడితే
అతివృష్టి లేక అనావృష్టి కాక
సమతుల్యంగా వానలు పడితే
పంటలు పుష్కలంగా పండితే
దిగుబడి దిల్ పసందుగా వస్తే
కవిత వేంకటేశ్వర్లు
పై కవిత నా స్వీయ రచన అని
హామీ

6
కవితాగానం సీజన్ 2 
 అంశం చినుకు చిద్విలాసం
 పేరు   మన్నె లలిత 
 హైదరాబాద్

 చినుకు చినుకు పడింది
 చింతలెన్నో తీర్చింది

 బడి లేని పిల్లలకు
  బహుమతినే ఇచ్చింది
 చినుకు చినుకు మధ్య  చిందు లాటలు
 వాన కాలవల్లో కాగితపు పడవ ప్రయాణాలు
 కేరింతల్లో పిల్లల సయ్యాటలు

 చిన్నబోయిన  రైతన్న మోములో 
 చిక్కని నవ్వు ఏరువాక సాగ వచ్చని

   దుఃఖార్తితో నెర్రెలిచ్చిన  బీడు భూమి
 హర్షాతిరేకంతో నోరు తెరుచుకుని
 చినుకు చినుకును  ఆస్వాదిస్తుంది

  చినుకు చిద్విలాసంగా
 చంపకాన్ని చెక్కిలితడిమి
 మందారాన్ని ముద్దు పెట్టుకుని
 మల్లెల సౌరభాన్ని  ఆఘ్రాణించి
  పువ్వు పువ్వునుా మురిపిస్తూ
 ప్రకృతిలో పరవశించింది
అప్పులు అనాయాసంగా తీరితే
ఎంతో కొంత చేతికి డబ్బు వస్తే
రైతుకు ఆ రోజు పండుగే
ఆ యింట్లో అందరికి ఆనందమే

అలా రైతులంతా సంతోషంగా
అప్పులు లేక ఆనందంగా
జీవితాలు హ్యాపీగా సాఫీగా
సాగిపోవాలి సంవత్సరాలుగా
******

కవితాగానం సీజన్ 2 
 అంశం చినుకు చిద్విలాసం
 పేరు   మన్నె లలిత 
 హైదరాబాద్

 చినుకు చినుకు పడింది
 చింతలెన్నో తీర్చింది

 బడి లేని పిల్లలకు
  బహుమతినే ఇచ్చింది
 చినుకు చినుకు మధ్య  చిందు లాటలు
 వాన కాలవల్లో కాగితపు పడవ ప్రయాణాలు
 కేరింతల్లో పిల్లల సయ్యాటలు

 చిన్నబోయిన  రైతన్న మోములో 
 చిక్కని నవ్వు ఏరువాక సాగ వచ్చని

   దుఃఖార్తితో నెర్రెలిచ్చిన  బీడు భూమి
 హర్షాతిరేకంతో నోరు తెరుచుకుని
 చినుకు చినుకును  ఆస్వాదిస్తుంది

  చినుకు చిద్విలాసంగా
 చంపకాన్ని చెక్కిలితడిమి
 మందారాన్ని ముద్దు పెట్టుకుని
 మల్లెల సౌరభాన్ని  ఆఘ్రాణించి
  పువ్వు పువ్వునుా మురిపిస్తూ
 ప్రకృతిలో పరవశించింది
               
7
[11/07, 8:12 pm] +91 99512 87113: చినుకు చిద్విలాసం
                    - ----------------------
పర్యావరణాన్ని పట్టించుకోని ఫలితమా
గుట్ట లు, మెట్ట లు ఆక్రమించుకొన్న శాపమా
గ్రీష్మ తాపానికి అలసిన దేహాలెన్నో
చినుకు జాడకై నిరీక్షిస్తున్నాయ్
వరుణుని కరుణ కై అర్ధనిమీలిత నేత్రాలతో
జాలి చూపులు చూస్తున్నాయ్
ఎండిన నూతులు, భీటలు వారిన నేలలు
మా మిత్రుడు రాడేమంటూ
ప్రక్రుతి మాతను ప్రార్థిస్తున్నాయ్
ఉష్ణోగ్రతలు ఐదుపదులకు చేరుకుంటుంటే
వడదెబ్బకు ఒడలు హూనమవుతుంటే
పాపం ముదుసలులు
యమపురికి పయనమవుతున్నారు వరుణా¡
అయినా కొన్ని దశాబ్దాలుగా నీవు
గతి తప్పావులే
ఎక్కువ సమయాన్ని మార్తండుని పాల్జేసావులే
నీ నేస్తాలయిన వ్రుక్ష జాతిని అంతమొందిస్తున్నారని
మానవజాతి పట్ల అసహ్యమేసింది కదూ¡
పూర్వులు వలె కాక ఆధునికులు
ప్రక్రుతి నియమాలకు తిలోదకాలిస్తున్నారు కదూ¦
మానవుడన్నిటా విచక్షణ కోల్పోయి
వన్యాలను, మన్యాలను చిదిమేస్తున్నాడు కదూ¦
కొందరి దురాగతాలకు అందరికీ శిక్ష పడుతోంది
పశు, పక్ష్యాదులు సైతం కకావికలైపోతున్నాయ్
నీడనిచ్చే చెట్లు లేక మాడు పగిలిపోతోంది
పర్యావరణాన్ని కాపాడుకుంటాంగానీ
ఓ వరుణా¦
త్వరగా విచ్చేసి
భూమాతకు జలాభిషేకం చేయవయ్యా¦
పర్యావరణ పరిరక్షణ కు ప్రతినబూనుదాం
ప్రక్రుతి మాత రక్షణ లో సేదదీరుదాం
.................................................. 
.................... మద్ది. పుల్లారావు, ఉపాధ్యాయుడు.
.......
ఇది నాస్వీయరచన.
8
[11/07, 8:24 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్ 2 ) 11/7/2021/ ఆదివారము
ఆంశము:- " చినుకుచిద్విలాసం "

సీ!  చినుకు పడంగానె  చింతలు తొలగును
కర్షకులకనుల  కాంతి నింపు

మోడైనమానులు  మోరెత్తిచూడగ
ఆకాశమే ఘాలు  నాశచూపె

బీడువారినభూమి  బిక్కమొగము వేయ
ధరనుకురిసెవాన  దయనుచూపి

తొలకరివానల,  యిలలోని రైతులు
పొలముపనులజూడ  పోయిరంత

ఆ!  ఏరువాకసాగ  యేటికష్టముతీరు
తిప్పలన్నిపడగ  తిండిదొరకు
నవని విత్తులన్ని  నందించె పంటను
" చిద్విలాస మంత చినుకుదెచ్చె " !
              తరణికంటి సూర్యలక్ష్మి.
                           ------------
9
[11/07, 8:58 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవన గానం (సీజన్ 2) నిర్వహించు కవితల సమాహారం

అంశం: చినుకు చిద్విలాసం
పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి:9505152560
***********************
       *దిగులు మేఘం*

వేసవి దాటి ఏరువాకలో పడినా
ఏరు వంక నిండ లేదు
చినుకు చిటపటలు
మమ అని సరిపుచ్చుతున్నాయి!

తలెత్తిన దిగులు ముఖం
నింగి చూపులు అతికించినా
దోషమంతా ధరణిదేనని
ధరా పుత్రుల విచారం!

నిన్న మొన్నటి వరకు
జన్మనిచ్చిన తల్లి దేహం
వట్టిబోయిన పగుళ్ళతో సంక్షోభం తలబోస్తూ వుంది...

విత్తులు జల్లిన మాగాణి మొలకెత్తక పోతుందా?
పంట సిరులు కురిపించక పోతుందా?
తన ఆక్రోశం అంతా కురవని ఆకాశంను వగచి
అవని మీదనే దృష్టి
తను నమ్ముకున్నది కృషి ఒకటే
చినుకు చిద్విలాసంగా చిత్తడి చేసి
మట్టి సువాసన ఆఘ్రాణితం ఆస్వాదితం...

చుక్కా చుక్కా జారి
సైజులో ధారయై భుక్తాయాసం తీర్చుకుంటే
సస్య శ్యామలమైపోవాలని
మట్టి పుత్రుని ఆక్రందన!
   ***
      హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు అని నేను హామీ ఇస్తున్నాను.
          ఇట్లు మీ
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.
10
[11/07, 9:06 pm] +91 70755 17538: అంశము.చినుకుల చిద్విలాసo
..........
మానవుడి మితిమీరిన
తెలివి తేటలతోను
విలవిలలాడుతున్న భూమాత
భూతాపముతో గుండెలు చీల్చుకోని
రోధిస్తున్న భూమాత గర్భశోకము

పంట సాగు కోసము
ఎదురుచూస్తూ చుక్కనీరు లేక
ఏరుసాగక బతుకు ముందుకుసాగక
చితికిపోయి దిగులుగా రోదిస్తూ

బతుకులు చితికిపోతూవుంటే
విత్తు జల్లేoదుకు ఎదురుచుస్తూనే సాగిపోతూ
ఆగిపోనీ రైతన్న నిరీక్షణలో
భావి జగతి నిండుగా మురిసిపోయెను

ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
11
[11/07, 9:30 pm] +91 98499 29226: కవితా గానం సీజన్ @2
చినుకు చిద్విలాసం
శీర్షిక : చిరుచినుకు ఆనందతాండవం 

నిoగినున్న చినుకుముత్యం
దాగెనులే మబ్బుకడుపున
వర్షరుతువున పురుడోసుకుని
పుడమిన ఉదయంచి
పచ్చని చిగురాశల
అంకురార్పణకు శ్రీకారం
చుట్టే చిద్విలాసమే 
చిరుచినుకు ఆనందతాండవం 

 నవ్వుల పగడాలు
తరువులపై జల్లుతూ 
చేయు జాలాభిషేకం
తొలకరి తొలినడకల
నవవసంతాన్ని ఆదుర్దాగా 
ఆహ్వానిస్తున్న తరుణం

పశుపక్ష్యాదుల తనువులు
తనివితీరా తడిచేట్లు
తీరని గ్రీష్మ దాహాన్ని తీర్చి
జీవరాగాలకు ఆయువు పోసే 
 నీటిపూల ఆవిష్కరణయే
చిందేసిన చినుకు చిద్విలాసం


పేరు : దార. స్నేహలత
ఊరు : గోదావరిఖని
హామీ పత్రం : ఇది నా స్వీయ రచన. దేనికి అనువాదం కాదు.
12
[11/07, 9:39 pm] Aalla Nageshwar Rao Poet: అంశం; చినుకుల  చిద్విలాసం
శీర్షిక: 
  '" ప్రకృతి పరవశం""

భానుని ఉష్టతాపానికి గురైన పుడమితల్లి
వరుణుడి తొలకరి జల్లులకు 
పులకించి
కర్షకులు చల్లే విత్తనాలను అంకురింప చేసి
సకాలంలో సరైన వర్షాలను కురిపించి
హాలికుల హృదిలో హర్షపుజల్లులను కురిపించి
హరితవర్ణపు చీరను ప్రకృతిమాతకు బహుకరించి
పచ్చదనమును విచ్చుకునేలా చేసి
పసిడి పంటలను పండింప చేసి
సకల జనులను మోదంతో రంజింప చేసి
సుఖఃశాంతులను వరాలుగా  ప్రసాదించేవి తొలకరి జల్లులు!
..........................................
రచన
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్....రాష్ట్రం
సెల్ నెంబర్.7426638823
పై మినీ వచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.
13
కవన గానం (సీజన్ 2) నిర్వహించు కవితల సమాహారం

అంశం: చినుకు చిద్విలాసం
పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి:9505152560
***********************
       *దిగులు మేఘం*

వేసవి దాటి ఏరువాకలో పడినా
ఏరు వంక నిండ లేదు
చినుకు చిటపటలు
మమ అని సరిపుచ్చుతున్నాయి!

తలెత్తిన దిగులు ముఖం
నింగి చూపులు అతికించినా
దోషమంతా ధరణిదేనని
ధరా పుత్రుల విచారం!

నిన్న మొన్నటి వరకు
జన్మనిచ్చిన తల్లి దేహం
వట్టిబోయిన పగుళ్ళతో సంక్షోభం తలబోస్తూ వుంది...

విత్తులు జల్లిన మాగాణి మొలకెత్తక పోతుందా?
పంట సిరులు కురిపించక పోతుందా?
తన ఆక్రోశం అంతా కురవని ఆకాశంను వగచి
అవని మీదనే దృష్టి
తను నమ్ముకున్నది కృషి ఒకటే
చినుకు చిద్విలాసంగా చిత్తడి చేసి
మట్టి సువాసన ఆఘ్రాణితం ఆస్వాదితం...

చుక్కా చుక్కా జారి
సజల ధారయై భుక్తాయాసం తీర్చుకుంటే
సస్య శ్యామలమైపోవాలని
మట్టి పుత్రుని ఆక్రందన!
   ***
      హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు అని నేను హామీ ఇస్తున్నాను.
          ఇట్లు మీ
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.
14.
చినుకు

చినుకు కోసమే కళ్ళు కాయలు కాచే టట్టు 

ఎదురు చూశాను ఎన్నాళ్లు
భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి

బోరుబావులు వేసిన పడుతలేదు

పాతాళం లోతులోకి నీరు లాక్కుపోయింది
నేడు జల జూదాలు

ప్రజలంతా నీటి కోసం

నీటి కోసం నల్లా దగ్గర 


నగరానికి మంజీరా నీళ్లు రావట్లేదు


జలం జీవ జలం

అది 

నేలకు బలం బలం తడి దనం మొక్కలు పొలాలు మళ్లీ మంచి పంటలు రావాలన్నా


కాళేశ్వర్ ఆలు సీతారామ ప్రాజెక్టులు మల్లన్న సాగర్ లు రావాల్సిన అవసరం


ఆకుపచ్చ హరితహారం గ్రామాలను
15

కవనజ్యోతి 
13-7-2021
కవిపేరు: కెసి నరసయ్య 
అంశం: చినుకు 
శీర్షిక: హర్షించిన జనం 


దాహంతో ధరణి
నెర్రెలు బారిన నేల
మోడు బారుతున్న తరులు

అడుగంటుతున్న జలాలు
చుక్క నీరందని బోరుబావులు
ఎండమావుల వెంట పరుగులు 

తల్లడిల్లుతున్న
పల్లెలు పట్టణాలు నగరాలు
నీటి కోసం పక్ష్యాదుల వేట

ఆకాశం కేసి
రైతన్నల ఎదురు చూపులు 
చినుకు జాడ కోసం జనం పడిగాపులు

మబ్బుల చాటున మేఘాలు
ఉరుముల వెంట పరుగులు
వర్షించిన మేఘం హర్షించిన  జనం


అందుకే
ఉంటాను పల్లెలు ఆకుపచ్చని చీరలు కట్టుకోవాలని అప్పుడే పంటల గాథలు నిండుతాయి
16.
[13/07, 8:58 pm] Balloori Umadevi Poetess: కవితా గానం
డా బల్లూరి ఉమాదేవి

అంశం: నేనే వానచినుకు అయితే

నేనే చినుకు నైతే 
 రైతన్నల అసలు తీరుస్తా 
 ప్రకృతి నంతా హరిత భరితం చేస్తా 
 నీటి కొరతను ఆపేస్తా
  తొలకరిలా మొదలై అందరి మనసులో  
  ఆనందపు సిరి జల్లౌతా 
 విశాల గగనం నాదేనంటూ 
 అన్ని చోట్ల విహరిస్తూ 
  ఎండిన నేలను తడిపేస్తా
 అవని తల్లి మురిసేలా 
 చినుకు చినుకులా రాలి 
 యేరులు చెరువులు నింపేస్తా
   చెట్లన్ని చిగురించేలా చూస్తా
 పంటలు చేతికి అందేలా చూస్తా
   బావుల్లో ఇంకని ఊటనవుతా 
  ఎడారిలో సైతం చిరుజల్లులతో 
    పువ్వులు పూయిస్తా 
     వాన వాన వల్లప్ప అంటూ
     పగలు రేయి పిల్లలు ఆడేలా చేస్తా 
      ఆనందాల హరివిల్లు అందరికీ అందిస్తా 
      మళ్లీ మళ్లీ వస్తుంటా
 మాయని మమతానురాగాలను అందిస్తా
17
[13/07, 8:59 pm] +91 93900 99056: పేరు.. అన్నాప్రగడ వేంకట నరసింహారావు
ఊరు..నరసరావుపేట
అంశం..చినుకు
శీర్షిక..ఎప్పుడు వస్తావో ఎప్పుడు వెళ్తావో..

కారు మబ్బులు దేవుని రథంపై పయనం సాగిస్తూ..
ఉరుములు చెవులను చేరుతూ..
మెరుపుల చెమకులతో ఆకసము అందాన్ని వొలకబోస్తున్నవేళ..

నా ఇంటి పెరటిలో పరచిన మన్ను సుగంధవాసనలు వెదజల్లుతూ నసికము చేరాలని..
నా ఇంటి గోడలపై అందమైన చారలు అబ్బాలని..
నా ఇంటి ముంగిట నీవు కళ్ళాబి చల్లాలని..

ప్రేయసిలా నావైపు  వస్తున్నావని ఆశతో తలచి మోసపోయా..

చూస్తుండగానే నీవు నీరుజల్లావు ఆ సాగరంపై..

నీవు నీరు చల్లాలిసింది ఆ ముద్ది శరీరంపై పగుళ్ళలా బీడువారిన పొలాలపై..
ఎండుబారిన ఆ మొక్కలపై..
వేడితాపాన్ని ఆవేదనతో భరిస్తున్న ఆ పుడమిపై..
నోరుతెరచి ఎదురుచూస్తున్న ఆ బోరుబావులపై..
మా జీవుల ఆశలపై..
ఇపుడు నీకోసం ఎదురుచూసి చూసి మా నేత్రాలుకూడా ద్రవించి ఎండిపోనారంభించినవి..

మరల నీవు ఎప్పుడొస్తావో ఎప్పుడెళ్తావో..మరో నిరీక్షణ..

✍️అన్నాప్రగడ
9390099056


సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453 కుండలు బిందెలతో కొట్లాడుకుంటున్నారు జరుగుతున్నాయి
18
*చినుకు* 
  --జక్కిడి వెంకటరెడ్డి .
.....      ......    ......
గాలిమేఘం గమ్మత్తుగ 
చల్లబడి చినుకైంది..
చినుకు చిన్నదే 
అంతాకలిసి 
అవనిని తడిపి 
అత్తరు వాసనలతో 
పుడమిని పుత్తడి చేసి 
పచ్చని జీవంతో 
పంచరంగులద్ది
కాలచక్రానికి...
 కాళ్లే కాదు...
కళ్లూ.... తానైంది 
ఆ చిట్టి చినుకు.....
19

వర్షాకాలం 

ఎండాకాలపు వడగాలులు 
జర చల్లబడి 
వర్షపు తుంపరల సవ్వడులు 
శరీర తాపం చల్లారుస్తూ 
తేమతో నిండిన చల్లని గాలులు 
ఉండుండి ఉరుముల మెరుపుల పిడుగుల 
ఈదురు గాలులతో వానల ఉరవడి !
నెర్రెలు బాసిన నేలల నిండా వర్షపు నీళ్ళు 
వాగులు వంకలు కొత్తనీళ్ళతో పరవళ్లు 
ఎండల మంటలు ఒక్కసారిగా తగ్గుముఖం !
గుండెల మంటల రైతన్న 
తన క్కన్నీళ్లలో వాన నీళ్ళు కలిసి 
ముసురుకొస్తున్న మబ్బులవైపు 
చేయి పైకెత్తి కన్నెత్తి చూశాడు!
తరాలు యుగాలు కాలాలు మారినా 
రైతు జీవన శైలి మారలేదు!
పండిన పంటలు దళారీల పాలు 
బదులుకున్న దళారీల మోసం ముందు 
రైతు గోస ఎవరికి పట్టదు!
నేపథ్యం ఏదైనా ఎవరో నాయకుడన్నట్లు 
వ్యవసాయం వల్ల లాభం లేదు!
తినే అన్నం బదులు 
కెమికల్ బువ్వ ఏదైనా పర్లేదు 
శాస్త్రవేత్తలూ,,,,,,,ప్రత్యామ్నాయంగా తయారు చేయండి సార్లు!!

ఆపరాజిత్
20

కవితాగానం
----------------
అంశం:చినుకు చిద్విలాసం
పేరు:జల్లిపల్లి బ్రహ్మం
ఊరు:గుమ్మడిదల
చ.వా:9642892848
★★★★★★★★★★★★

రెప్పపాటు జీవితంలో
ఎన్ని జలపాతాలో
అగాధాలను
తుషారాలుగా
విరజిమ్మే ఆవరణలో
పైకి ముత్యమై మెరుస్తున్నా
ఆంతర్యంలో
ఎన్ని విడదీయరాని చిక్కుముడులో
విశ్లేషిస్తే
ఎన్ని విభిన్న కథనాలో

అణిచి వేస్తె బిందువై
విస్తరిస్తె సింధువై
బాధల్లో ఓదారుస్తు
ఆనందాలను ఆరబోస్తు
చెక్కిలిపై ఎన్ని విన్యాసాలు చేస్తుందో
ఈ తడి

నింగి ముత్యాలను రాలిస్తే
పుడమి రత్నాలను పూయిస్తుంది
మధ్యలో పిల్లగాలి
నవ్వుల పువ్వులను విసురుతుంది
ఒంటికి చల్లని స్పర్శగా
గుండెలో తీపి జ్ఞాపకంగా
జారిపోయె జాన
ఈ వాన

ఇది వేరుచేసేది కాదు
వేరులో చేరి
వెన్నెలలను పూయించేది
వికసిత సుమాలపై 
అలరి
ఆకులపై అల్లరి చేసి
ఆనవాలు లేకుండా జారి పోతుంది
అందమైన జీవితం అంతే!

★★★★★★★★★★★★
21
చినుకు.
.........
బతుకు బాటలో
మనిషి బతుకులో
చెరిగిపోనీ సంపదగా
నింగినుండి భువికి దూకేటి
అమృతపు చినుకులు

మనిషి బతుకును
బంగారు మయం చేసెను
మనిషి బతుకులో
మమతలు విరిసెను
22

కవన జ్యోతి
అంశం  చినుకు
 
 
 శీర్షిక : వర్షం కురిసిన  వేళ
 తేదీ :13/7/21- మంగళవారం
రచన   :మన్నె లలిత
 హైదరాబాద్ 
  చరవాణి సంఖ్య: 741 686 32 89
**********************************
  చినుకు పడిన వేళ  బడి పిల్లలకు 
ఎంతో సరదా 
బడికి డుమ్మా  కొట్టొచ్చు
 కాగితపు పడవలు చేసి  
వాననీటిలో  వదలవచ్చు

 రైతు వదనంలో   మోదము
 అరక  కట్టవచ్చు దుక్కి  దున్నవచ్చని
 ఊహల రాజ్యం లో వర్షపు  తెరలు
 కళ్ళముందు ఆశల కలల ''పంటలు"

 చినుకు మందారం పై పడిన వేళ మందారం
 విచ్చుకుంది హృదయాన్ని
 ఎర్రటి మోముపై ముత్యాల
 బిందువులు కురిపించి
 గిలిగింతలు పెట్టగా
  అబ్బా మోహన రూపంతో
 దేవుని  పాదాల చెంత వాలాలని ఎదురు చూస్తూ...

 పశువులు కాసే బుడ్డోడికి సరదా
 పశువులను మేతకు తోలుకు వెళ్ళనక్కరలేదని
 చలికి వణుకుతూ మూలన 
ముసుగేసుకొని కూర్చున్న వృద్ధులు
 పొద్దు కనపడకపోయినా 
బారెడు పొద్దెక్కినా పిల్లలు లేవలేదని
  సణుక్కుంటూ పనులు చేసుకునే  
అత్తా కోడళ్ళు
 చినుకులనే  చూస్తూ 
గుప్పుగుప్పున చుట్ట వెలిగించుకుని 
 తాదాత్మ్యం చెందుతున్న తాతగారు
 తాటాకు గొడుగు వేసుకుని వెళ్తున్న
 నాన్నగారు
 పాపాయికి చూరుకింద స్నానం 
చేయిస్తున్న బామ్మగారు
 నింగికీ నేలకు జలతారు  తెల్లటిపరదా కట్టి
 ఉదయపు నీరెండలో కురుస్తున్న  వర్షపు చినుకులు చూస్తుంటే
  ఎల్లరకు హర్షం🌸🌸


కమ్మని పంటలకు నిలయము
వెచ్చని లోగిలిని ఇచ్చేటి
ముత్యపు పందిరిగాను

ప్రకృతి మాతను పులకింపచేయును
మమతలు నింపు ఊయల
చినుకు తల్లి మనకు నిండు దేవుడు ప్రతిరూపము
23

కవన జ్యోతి 
అంశం. చినుకు 💧💧💧
బేతి నాగలక్ష్మి 
ఆలేరు 
💧💧💧💧💧💧💧💧💧

మండువేసవిలో
 నిప్పుల సెగ ప్రతాపం
 చూపించిన భానుడి వేడి చల్లారుస్తు 
తొలకరి చినుకులతో... 
ఆహా చల్లని హాయి  అంటే ఇదేగా అనుకునే 
మనస్సుకి మౌనంగా పిల్ల గాలిని 
ఆస్వాదించే శరీరానికి 
ఆనందంగా తిలకించే కనులకి 
కమనీయమైన చల్లదనానికి 
భూమాత పచ్చదనాల తివాచీల తో.... 
చినుకు, చినుకుల చిరుజల్లులతో... 
రైతన్న కన్నులలో ఆనందభాష్పాలే 
పంట పొలాల పసిడి సిరులై 

ఈ కవితా నా స్వియ  రచన 
🙏🙏

ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా


Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...