Skip to main content

శ్రావణమాసం పౌర్ణమి నగదు పురస్కారాల కవితలు

నిర్వహణ
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet

శివునూరి లలితాకృష్ణ
మెరుగు మధు
ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని
*********************
కవివరుల జాబితా
✳️✳️✳️✳️✳️✳️✳️

శ్రావణ మాసం పౌర్ణమి పు toరస్కారాల పోటీకై స్పందించిన కవి వరుల జాబితా 
1.డాక్టర్. రామక కృష్ణ మూర్తి గారు 
2.డాక్టర్. మహమ్మద్ షరీఫ్ గారు 
3.భూపతి గారు 
4.డాక్టర్. పాండాల మహేశ్వర్ గారు 
5.పాల్వంచ. హరికిషన్ గారు 
6.సత్య నీలిమ గారు 
7.కోరాడ నరసింహారావు గారు 
8.స్వర్ణ సమత గారు 
9.రమాదేవి కులకర్ణి గారు 
10.అయిత.అనిత గారు 
11.శ్రీహరి. ఏలే గారు 
12.శివలక్ష్మి. రాజశేఖరుని గారు 
13.శ్రీలక్ష్మి గారు 
14.సతీష్ కుమార్ గారు 
15.కంచి. రవికుమార్ గారు 
16.జల్లిపల్లి. బ్రహ్మం గారు 
17..డాక్టర్. బల్లూరి ఉమాదేవి గారు 
18.ధనాశి ఉషారాణి గారు 
19.అపరాజిత్ గారు 
20.సాసుబిల్లి. తిరుమలతిరుపతి రావు గారు 
21.అభిరామ్ గారు 
22.గంజాం. భ్రమరాంబ గారు 
23.మర్రి. జయశ్రీ గారు
24.సంధ్యా శర్మ గారు 
25.సుంకర. శ్రీలత గారు 
26.వురిమళ్ళ. సునంద గారు 
27.కందూరి. సుజాత రాణి గారు 
28.గుండ్ల. రాజు గారు 
29.M.Tస్వర్ణ లత గారు 
30.ఇంద్రవత్. రాహుల్ గారు 
31.ముడుంబ తిరువెంకటాచార్యులు గారు 
32.వల్లాల. విజయలక్ష్మి గారు
**************************
Google forms
33.నారాయణం భాగ్యలక్ష్మి
34.పోలా కిషోర్ కుమార్ గారు
**********************--

✳️✳️✳️✳️✳️✳️✳️✳️

[03/08, 8:00 PM] Ramaka: 🌊కవితా గానం🌊

*శ్రావణ పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీ*
**************************
1
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:3-8-2020
అంశం:భగవద్గీత(గీతాపఠనం)
ప్రక్రియ:వచనకవిత్వం
శీర్షిక: అంతర్వాహిని
**************************

పరమాత్మ ప్రవచించిన కర్మయోగము
సకలవేద సారమై విలసిల్లినది.
నిగూఢార్థనిధియై మానవజీవన
గమనానికి మార్గదర్శకమైనది.
భగవంతుని గుణ,ప్రభావ,
రహస్యాలతో సమగ్రమై,
సదుపదేశభరితమైనది.
గీత సుగీతయై మానవాళి
దుఃఖహేతువులను నివారిస్తుంది.
పరమగతిని పొందుటకు‌ సాధనమై,
కర్తవ్యోన్ముఖులుగా సాగుటకు సాధకమైంది.
జన్మసార్థక్యమే అంతిమలక్ష్యమై
ఆత్మజ్ఞాన ఆవశ్యకతను నేర్పుతుంది.
సమస్యలను అధిగమించడానికి,
దుఃఖాలను దూరం చేయడానికి
ఉపకరణమై,మార్గమై కనిపిస్తుంది.
నీవు శరీరము కాదు,ఆత్మవను
అవలోకనమిచ్చి,
బాధలు,కష్టాలు,దుఃఖాలు
శరీరానికే కానీ ఆత్మకు కాదను
సందేశమిచ్చి,సంతృప్తి పరుస్తుంది.
నిన్ను నీవు తెలుసుకుంటూ
విజయమార్గంలో నడవడం నేర్పిస్తుంది.
చేయిపట్టి జ్ఞానపథం వైపు నడిపిస్తుంది.

హామీపత్రం:
పై వచనకవిత నా స్వంత రచన.దేనికీ అనువాదం,అనుకరణ కాదు.'శ్రావణపౌర్ణమి'పోటీల కోసమే ప్రత్యేకంగా వ్రాయబడినది.
2
[03/08, 8:00 PM] Sharief Sir: -:కవితాగానం- శ్రావణమాస "పౌర్ణమి" నగదు పురస్కారాల- కై :-
 శీర్షిక: భగవద్గీత (గీతాపఠనం)
ఉప శీర్షిక: "జీవన మార్గం"
1కం:
కర్మ,జ్ఞాన, విభూతియు
కర్మాసన్యాసయోగ గమనము
                               చూడన్!
మర్మము గీతా పఠనము
నిర్మలమగు జీవితాలు 
                నిరతము చదువన్!
2కం:
గీతా సారము నెప్పుడు
నీతిగ జీవించు మనెడి 
           నియమము దెలుపున్!
భూతలమందున మనుజుల
చేతలలో మార్పు వచ్చు 
                     చింతలు దీరున్!
3కం:
మదిలో యనుమానమ్ముల
ముదమారగ తీర్చి, జెప్పు
                 మూలము తోడన్!
నుదయము సాయంకాలము
చదువుడి గీతామృతంబు 
                 సద్గతి దొరుకున్!
4ఉ:
పుట్టుట మానవాళిగను పూర్వము జేసిన పుణ్యకర్మ నే
గిట్టుట తప్పదెవ్వరికి గీతను మార్చగరాదునమ్ము లో
గుట్డును విప్పె గీత మరి గొప్పలు జెప్పుట మానుమింక నీ
పుట్టుక కారణమ్ముగని పుణ్యము జేయము మోక్షమబ్బురా
5మ:
భగవద్గీతను ప్రీతితో చదువగా
భాగ్యమ్ము జేకూరు నా
భగవన్నామము దీర్చు సంకటమలన్,భద్రమ్ములన్నింటికిన్
తెగటార్చున్ మది పాపముల్
చిటికెలో దెచ్చున్ శుభాలన్నియున్
సుగుణమ్మేమిము గాచు చుండు నిలలో శోభాయమానంబుగన్
6చం:
స్థిరములు కావు ప్రాణములు,
సింధువు నందలి యాటుపోటులే
నిరతము నాశపాశములు నింగికి నేలకు జాలువారు నే
వరముగ దల్తు గీత,కడు వాస్తవ యోగము లన్నిదెల్పగా
కరముల నెత్తి మ్రొక్కెదను కర్మము దెల్పును మానవాళికిన్

                    "ప్రతిభారత్న"
                  డా.మహ్మద్ షరీఫ్
                         సంగారెడ్డి

     ఈ పద్యాలను కవితాగానం
పౌర్ణమి నగదు పురస్కారాల కొరకు వ్రాశాను.ఇవి దేనికి అనుకరణను, అనుసరణను
కాదు ఇది ఇప్పటివరకు యేసమూహంలో, పత్రికలలో
ప్రచురింపబడలేదు దీనిపై సర్వ హక్కులు నావే నని హామిఇస్తున్నాను
                   " ప్రతిభారత్న"
                  డా.మహ్మద్ షరీఫ్
                          సంగారెడ్డి
                      9866560527
3
[03/08, 8:03 PM] Bupathi Sir: ..........భగవద్గీత......

నర నారాయణులవీక్షణ లో
కర్మ ఫలా ల ప్రవేశిక భగవద్గీత..
సర్వ దర్శనానికి మార్గం,
ముక్తి మార్గాలకు నిదర్శనం..
మానవ జీవన ప్రకంపనలు 
మదించ గల మహోన్నత వ్యక్తిత్వ వికాసం భగవద్గీత...
జీవిత సారాన్ని ఉగ్గు గా 
మార్చి మానవాళి కి
అందించి న అమృత భాండం
భగవద్గీత....
సమస్యల క్షేత్రం లో జ్ఞాన బాండగారం గీత.....
భువి కి దిగిన దై వ దేదీప్య
మానం భగవద్గీత...
పాపాగ్ని నుండీ విముక్తి
నందించ గల మహా శక్తి
మంత్ర యోగం భగవద్గీత....
విన్న వారికి విన్నంత, దరి
చేరిన వారికి కొరినంత,
జీవన ప్రదాయిని
భగవద్గీత.....
పారాయణ  తో కవితా గానం
చేసి తరించే వారికి ఎప్పుడూ
ఆహ్వానమే....

ఏ.భూపతి...
4
[03/08, 8:04 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: *** గీతామృతం ***
                             ✍️డా.పాండాల.

సకలకర్మలు నిత్యంబు సలుపువాడు
సతత గీతార్థ సారాన్ని చదువువాడు
మర్త్యుడవనిలో మోక్షంగ మాన్యతొప్పు
పుణ్యజన్మమౌ పుడమిలోధన్యుడౌను1

పరమ తత్వార్థ పరిశీల ప్రగతి నెంచ
ధర్మ కర్మాల మర్మంబు నిర్మలంబు
గీతసారాన్ని హృదియందు పోతపోయ
వాసుదేవుండు లోకాన  వాసిగూర్చు!2

దేహమునుకంటె శ్రేష్ఠమే యింద్రియాలు
ఇంద్రియముకంటె మనసేమొ
హెచ్చు త్రోచు
మనసునకు బుద్దికర్మలే మంచిదౌను
అధికమగు బుద్ధికంటెను ఆత్మశుద్ది...3

కర్మయోగంబుచే సర్వకర్మలుడిగి
జ్ఞాన శంకలు తొలగంగ సాధనెంచి!
ఆత్మ సందర్శనంబైన వారికెపుడు
కర్మపాశంబు చేతను కట్టువడడు..!4

దేహముత్పత్తి హేతువీ త్రిగుణములును
తెలుసుకొన దేహశుద్దత్వ దీప్తి గాంచు
జన్మమరణాల దుఃఖాగ్ని
జయముగెల్చు
సత్యచిత్తుడై నిత్యంగ కృత్యమెంచు!5

భరత దేశాన వెలసిన భవ్యగీత
విశ్వశ్రేయమై విక్రాంత విమలమెంచు!
నిర్మలాజ్యోతి హృదికిచ్చి నీతి పంచు
విశ్వ సౌబ్రాత్ర గుణముతో ఇగురమిచ్చు!6

✍️డా.పాండాల మహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి
9912180054
5
[03/08, 8:06 PM] పాల్వంచ హరికిషన్: కవితా గానం  
శ్రావణ పౌర్ణమి కవితల పోటీ 
అంశం: గీతా పఠనం 
శీర్షిక: కర్మ యోగ కథనం

దేవకీ తనయ గోపాలా 
వేణుగోపాలా.. మురళీలోలా 
వెన్నదొంగా నల్లనయ్యా శ్రీకృష్ణా 
వసుదేవునీ అష్టమ పుత్రా 
కాళీయ మథమణిచిన మాత్రా 
అష్టమికి అర్థమిచ్చిన విశ్వనేత్రా
పుడుతూనే పూతన పుట్టి ముంచి 
వేడుకతోడ వెన్నముద్దలు పంచి 
మన్ను తిన్న నీ నోటిలోనే 
యశోదకు జగతిని చూపించి 
గోవర్ధన గిరిని గోటిన ధరించి 
మామ కంసుని హతం గావించి 
దేవకి మదిన సంతోషం నిలిపి 
గోపాలుడిగా గోపికల వలచి 
పిలిచిన పలికే అన్నగ నిలిచి 
కుచేల స్నేహం చిరునామగ మలచి
మహాభారత రథసారధిగా నిలిచి 
గాండీవికి గీతాసారం బోధించి 
జీవిత సత్యాన్ని నిర్వచించిన
గీతాగోవిందం అల్లరి కృష్ణారవిందం.. 
అనుసరణీయమీ గీతా పఠనం.. 
జీవన గమ్య కర్మయోగ కథనం.. 
కృష్ణం వందే జగద్గురుమ్..!  
చరితం జగతికి దిశా నిర్ధేశనం..!! 

     -- పాల్వంచ హరికిషన్ 
        రామన్నపేట 
        9502451780
6
[03/08, 8:08 PM] కె. సత్యనీలిమ 

వృత్తి : ఉపాధ్యాయురాలు ప్రవృత్తి :: *కవితాగానం*
*శ్రావణపౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీకి*
*అంశంః భగవద్గీత లేదా గీతాపఠనం*

నారాయణుడే నరుడై
అవనిపై అవతరించి
కురుక్షేత్ర రణరంగంలో
రక్తం ఏరులై పారేసమయంలో
ఉపనిషత్తుల సారము నెల్ల
వసుదేవసుతుడు ప్రసాదించెను
మనకు గీతామృతముగా

పద్మనాభుని ముఖ కమలము నుంచి
ప్రభవించిన ప్రణవనాదమై
భక్తితో పఠన చేసిన వారికి
పాపప్రక్షాళన చేసే
గీతా సుదర్శనాన్ని
అందించెను వేణు గోపాలకృష్ణుడు

నిరంతర అధ్యయనము
చేయుట నీవంతు
నిన్ను కష్టాలకడలి నుండి
బయటపడవేసి కాపాడుట
నావంతని మనస్ఫూర్తిగా
చెప్పి గీతారక్షను రక్షణగా నిలిపెను
మురిపాల మువ్వల ముకుందుడు

నిరాషానిస్పృహలు ఆవరించినపుడు
సందేహాలు తీర్చగ
ఉపాయాలెన్నో సృజించేలా
గీతార్థసార నిఘంటువును
వరముగ ఇచ్చె గోవర్ధనగిరధారి..

వలిపే సత్యనీలిమ
వనపర్తి

హామీ పత్రము:ఈకవిత నాస్వీయరచన. కేవలం పోటీకి మాత్రమే రాసినది.
7
[03/08, 8:09 PM] Korada: కవితాగానం
      పౌర్ణమి పోటీలు
అంశం:-భగవద్గీత *
కోరాడ నరసింహా రావు;సత్ఫలితముల
 నెన్నొబొందవోయి...!
      ************
కురుక్షేత్ర రణ భూమి మధ్యన...పురుడో సు కున్న.... ప్రబోధ రత్నమది !
నర జాతి సమస్తానికీ 
కరదీపికయై....,తన
జ్ఞానప్రకాశమునదారిని జూపు చున్నది !

జగతి జనుల నుద్ధ రింప...సర్వేశుడె కృష్ణుడై...పార్ధుని నిమిత్తముగజేసి
జన్మమర్మమెరిగించి...సన్మార్గమునజూపించినఆదిగురువుగానిలిచినట్టి....ఓగీతాచార్యా...!నీకుశతాధికముగా జ్యోతలిడుదు....!!
      
      జన్మకి కర్మయే...
మూలమని,చావు,పుట్టుకలుచక్రభ్రమణ
మనీ...నిష్కామునిగా  జీవించమనీ...
నీ వపుడే ముక్తుడ వౌదువని...ప్రబోధించినపరమాత్మా..! నీవే కులము నకూ
చెందనివాడవు !అన్నిమతములకు 
ఆధారము నీవే !
వర్ణ,వర్గ వైషమ్య  ములక తీ తు డవు. 
ఈ ప్రాంతమాప్రాంత మనక...పరిమితముగాని,అపరిమితుడవుఅంతటనిండియున్నవాడవు ఆత్మ ప్ర బోధజ్ఞానప్రకాశమె నీవు!
వారెవరైనగానీ...మనిషైనవారు ఈ భగ వద్గీతనుభక్తి ,శ్రద్దలతో అధ్యయనము జేసి,ఆచరించిన...,జరామృత్యు,భయ,శోక సంకటములనుండి
విముక్తినొందుదురిది 
నిజము...నిజమూ 
ముమ్మాటికినిది...
నిజము....!!

గీతను కేవల హస్త భూషణము జేసికొని ననూ...పదునెనిమిదిఅధ్యాయములనూ టీకా తాత్పర్య  సహితముగ కంఠస్థ ముజేసి...సభలూ సమావేశములలో...
గాన,పారాయణములుగావించినను...
ఆచరణన్నదిలేకపోయెనా...వ్యర్ధమది,
నిష్ప్రయోజనమ్ము  !
చదివి చదివి చదివి 
చావంగనేటికి చావు లేని చదువు చదువ వలయు...!  వేమన జెప్పినది వినిపించు కొనవోయీ ....!
ఆత్మశుద్ధితోడ ఆచ  
రించీ నీవు.... సత్ఫలితములనెన్నొ
 బొందవోయి...!!
"అన్యధా శరణంనాస్తి
త్వమేవశరణంమమ
యని...సర్వధర్మముల పరిత్యజించి  అతనినె శరణు వేడిన  వారికి అన్నీ తానై కాచి బ్రోచును!
*****************
.... ..కోరాడ నరసింహా రావు
సెల్:7981327110.
8
[03/08, 8:16 PM] Swarna Samatha Poetess: *కవితా గానము*
03/08/2020

   *గీతా మృత సారము*

జీవితాన్ని మలిచే ఓ గ్రంథం
కర్మ యోగానికి,జ్ఞానమార్గానికి
దిక్సూచి,
తామరాకు పై నీటిబిందువులా
ఉండాలని గీత బోధిస్తుంది,
గృహస్థ జీవితము గడుపుతూ
భగవద్ సాన్నిధ్యము
పొందమంటుంది,
పరివారము ముఖ్యము కాదు,
పర్యా వసాన మే పరిష్కార
మార్గమని నిర్దేశించి,
నుదుటి రాతను మార్చే
గీత,
ధర్మాన్ని ,న్యాయాన్ని వీడకుండా
ఉండమని బోధించింది,
కష్టాల్లో, దుఃఖము లో
సంతోషాన్ని వెతుక్కోవాలి
అని చెప్పింది,
సర్వ దుఃఖాలకు హేతువైన
ఆవేదనను మరిచి,
ఆలోచనలో ఆదర్శంగా
జీవించాలని తెలిపింది,
నాతో ఉన్నవారిని
నేను రక్షిస్తాను,
నన్ను మరిచిన వారిని
శిక్షిస్థాను అనేది 
గీతా మృత ము.

*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
9
[03/08, 8:17 PM] Rama Kulakarni Hyderabad Poet: కవితా గానం 
శ్రావణ పొర్ణమి పురస్కారం 
అంశం భగవద్గీతా గానం 
రమాదేవి కులకర్ణి 
హైదరాబాద్ 
8985613123
-------------------------------------------

       శ్రీ గీతాగానం -వ్యక్తిత్వవికాసం 


మనిషి పుట్టుకకొక పరమార్థం 
శరీరంతో బాటు మేధో నిర్మాణం 
ఆలోచించి అడుగువేయడానికి 
అందరిలో అధికుడవ్వడానికి 
దోహదమయ్యేది సోదరా... 
డబ్బుకాదు, మానసిక స్థితి సుమా.. !!
మానవ మనుగడరీతులు 
మసలుకును పలు దిక్సూచులు 
మార్గగామి శ్రీ భగవద్గీత 
విశ్వజనులకే కరదీపిక 
అడుగుఅడుగున సమస్యాయుతం 
మానవజీవితం ప్రశ్నలమయం
ఓ మనసా... సమస్య ఏదైనా 
సమాధానం ఒక్కటే గీతా పారాయణం...!!
 సవ్యసాచిని సాకుగా చేసి 
మాధవుడు మానవుడి కందించిన 
పథనిదర్శనం గీతా పారాయణం 
కాదు కాదు ఎన్నటికి మత గ్రంథం 
ఇది నిర్ధిష్ట నియమ జీవనసారం 
సర్వజనమత హిత బోధకం..... !!
10
[03/08, 8:20 PM] Anitha Aitha Poetess: *కవితాగానం*

*పౌర్ణమి నగదు పురస్కారాల పోటీకై*

అంశం: భగవద్గీత/గీతా పఠనము
శీర్షిక: *జీవనసారం*

మహాభారత సంగ్రామంలో మహిమాన్వితంగా ఉద్భవించిన మార్గదర్శక సూత్రం..!
శ్రీకృష్ణపరమాత్ముని జిహ్వనుండి జాలువారిన ప్రవచనాగీతం..!!

ప్రేమపాశాన్ని త్యజించలేక అయోమయస్థితిలో నిరాశమేఘం కమ్మిన మదిమాయను తొలగించిన తేజోమయూఖం..!
అర్జునుని పాశపుపొరలను చీల్చిన జ్ఞానకరవాలం..!!

బంధాల నిశిలో నిదిరుస్తున్న మస్తిష్కాన్ని ప్రక్షాళన చేసి
కార్యోన్ముఖునిగా రూపుదిద్దిన స్ఫూర్తి కలం..!
సకల వేదసారమై సదాలోచనలకు నాందివాచకం..!!

మహాభారత ఇతిహాసం నుండి వెలువడి
భగవద్గీతగా వెలుగొందిన పదునెనిమిది అధ్యాయాల కర్మ,భక్తి,జ్ఞాన సిద్ధాంతం..!
ఇహల బాధలను బాపు ఆనందనందనం..!!

గాంధీ మహాత్మున్ని అహింసామార్గంలో నడిపించిన మహోన్నత
మార్గదర్శకత్వం!
విశాలభావాలను హృదయాలకు పూతపూసిన పవిత్రలేహ్యం..!!

శ్రవణం  మననం  పఠన కీర్తనల ద్వారా
ఆత్మజ్ఞానాన్ని ప్రభోదించే గురుతత్వం..!
సర్వాంతర్యామి సూచించిన సహేతుక సాధనం..!!

ప్రాపంచిక మిథ్యల నుండి విముక్తిని ప్రసాదించి తనను తాను తెలుసుకొనే దిశగా మార్చే సందేశాత్మక సంకేతం..!

కృష్ణార్జునుల సంవాదమై 
మానవజాతికి సురపానమై
అపరవేదంగా ప్రభవించిన జీవనపాఠం భగవద్గీత పఠనం..!

రచన
అయిత అనిత
9885348424
జగిత్యాల

హామీపత్రం
ఇది నా స్వీయరచన
7....repeated
[03/08, 8:30 PM] Korada: దివ్యమైనఔషధము 
*****************
ఖేదము బాపే....
బోధనామృతము
గీతాసారము !
తెలిసిఅధ్యయనము  
గావించిన నది...
సకల శోకములు బాపు నట్టి దీ....
దివ్యమైన ఔషధము
గీతా సారము...!
*****************
.....కోరాడ
11
[03/08, 8:35 PM] Sreehari Ale: కవితా గానం 
శ్రావణ మాస పౌర్ణమి పోటీలు 

అంశం : భగవద్గిత 
పేరు : శ్రీహరి. ఏలె
ఊరు : నల్లగొండ 
శీర్షిక : భగవద్గీత - ప్రభ 

*******************************

భారతీయ తత్వజ్ఞాన పరిమళమే
 సమగ్ర ఉపనిషత్ సారాంశమే 
మన ఘన భగవద్గీత 

మహాభారతం లోని భీష్మ పర్వం లో 
గీత ప్రాశస్త్య  ప్రస్తావన 

మూడు జీవన మార్గములు 
గల త్రివేణి సంగమ క్షేత్రం 

కర్మను ప్రబోధించిన కర్మయోగం 
భక్తిని ప్రసాదించిన భక్తి యోగము 
జ్ఞాన పరిమళాలను వెదజల్లిన జ్ఞాన యోగం 

మహా భారతపు సమగ్ర సారాంశ సౌరభం 

సత్యమైన జీవనమే ఆత్మ జ్ఞానం 
దీన్ని మనకు విశద పరిచేదే గీతా పఠనం 

భారతీయ సంస్కృతి, సంప్రదాయం 
విశ్వ వ్యాప్తి జేసె కాంతి పుంజం 

భక్తి, కర్మ, జ్ఞాన మార్గంలో 
భగవంతుణ్ణి చేరవచ్చన్నదే గీతా 

గీతా అధ్యయనం చేయువాడు 
భగవంతుణ్ణి సేవించ వచ్చు 

ఆనందాన్ని, జ్ఞానాన్ని పొందే వేదిక 
భారతీయ తాత్విక జీవన గీతిక 

గాంధి ఆలోచనలకు ఇది స్ఫూర్తి 
ఇతిహాస, పురాణాలకు శాశ్వత కీర్తి 

జననం, మరణం - ఒక జీవన చక్రంలో ఒక అధ్యాయం 

భగద్గీతలో భగవంతుని తత్వం, ఆత్మ జ్ఞానం, 
జీవన గమ్యం తెలిపే ఆధ్యాత్మిక వాహిని 

ఇది నేటి ఒక కర్తవ్య నిర్వహణ ప్రభోధిని 

శంకరాచార్యులు, వివేకానంద 
రామకృష్ణ పరమహంస బోధనలు దీని శాఖలే 

నేటి మానవీయ విలువలకు దారి దీపం 
నిత్య పఠనమే  - గీతా పఠనం 

హామీ పత్రం  : 

ఈ నా కవిత స్వయం లిఖితం. ఇది దేనికి అనుకరణ, అనువాదం గాని కాదు.
12
[03/08, 8:37 PM] Lakshmi Chamarthi Khammam: కవితా గానం
 పౌర్ణమి నగదు బహుమతులు పోటీకి
 రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి
 అంశం: భగవద్గీత
 శీర్షిక: గీతాసారం


 విశ్వవ్యాప్తమైన పరమాత్మ తత్వాన్ని
 విప్పి చెప్పిన భక్తి యోగ భాష్యం

 రాగద్వేష క్రోధ భయాల ఆత్మతత్వాన్ని
 భావోద్వేగాల భవబంధాల రహస్య సారాన్ని
 తేటతెల్లం చేసిన గమ్యసాధనా యోగం

 కాలుడుతానే కాలము తాననే
 నిరాకార నిర్గుణ సర్వవ్యాపక బ్రహ్మతత్వం

 సందేహాలమాయమౌ  జీవనయానాన
 జ్ఞాన శంకలు తొలగే గమ్యసాధనా యోగం

 దుష్టశిక్షణ శిష్టరక్షణ అనే పరమాత్మ తత్వానికి
 నిష్కామకర్మ మార్గాన్ని చూపిన ఆత్మజ్ఞాన సిద్ధాంతం

 కోర్కెల కడలిలో తలమునకలై నిరాశ కమ్మిన వేళ
 తేల్చుకోలేని విషయవాంఛల
 తెంచుకోలేని బంధాల గుట్టు విప్పి
 కర్తవ్యోన్ముఖులుగా చేసే స్ఫూర్తి సందేశం

 యుగాలు మారినా కాలాలు మారినా
 మనిషి పుట్టుక పరమార్థం గుట్టు విప్పిన పథనిర్దేశం

 జ్ఞానకరవాలముచే చీకటినుంచి వెలుగులోకి నడిపించిన
 భగవద్గీత సంవాద సారాంశం

ఈ కవిత నా స్వీయ రచన. ఈ పోటీ కోసమే రాయబడింది.
13
[03/08, 8:38 PM] శ్రీ లక్ష్మి విజయనగరం: కవితా గానం
శ్రావణ మాస పౌర్ణమి పోటీలు
తేది: 03-08-2020
అంశము: భగవద్గీత పఠనం
పేరు చివుకుల శ్రీలక్ష్మి 
కవితా శీర్షిక:
      గీతా యజ్ఞం
భగవద్గీత తెరిచిన పుస్తకం 
జనన మరణాల మధ్య
మానవ ప్రవర్తనను నిర్దేశించు
గీతా పఠనం కాదది గీతా యజ్ఞం
జ్ఞాన-ధ్యాన-కర్మ-భక్తి యోగ 
సాధనలు తెలిపే జ్ఞాన యజ్ఞం
కురుక్షేత్ర సంగ్రామ ఆరంభ సమయాన 
యుద్ధ పరిణామాలకు తల్లడిల్లు కిరీటిని కర్తవ్యోన్ముఖుని చేయ వినిపించిన దివ్యవాణి!
అష్టాదశ అధ్యాయాలలో సప్తశత శ్లోకాలలో
గీతను వినిపించుటయే కాక 
విశ్వరూపమును చూపించిన కరుణమూర్తి!
మత గ్రంథము కాదిది 
మానవ వికాసం కలిగించు శాస్త్రము!
సన్యాసులకు కాదిది 
సకల మానవాళికి దారిచూపు దిక్సూచి!
నారాయణుడే నరునకు చేసెను కర్తవ్యబోధ
అరిషడ్వర్గములను అదుపులో ఉంచు మార్గం
సత్వరజస్తమో గుణముల స్వభావములు
తానుండు తావులు తన విశ్వరూప విన్యాసం
సమస్త ప్రాణులలో జీవశక్తి తానై 
నడిపించు విధానం
ఆత్మ పరమాత్మను చేరే ప్రయాణంలో
సందేహించే వేళల 
దారిచూపే ధర్మసూక్ష్మాలు!
చతుర్విధాన్నములు తీసుకోవలసిన తీరు
వాగ్రూపమున చేయు తపస్సు
ఎన్నెన్ని విషయాలను అవలీలగా తెలిపె!
జగత్తునంతా నిండియున్నది భగవానుడే!
నిమిత్త మాత్రులమైన మనము కర్మోపజీవులం!
శ్రవణం మననం ధారణం అభ్యసనం 
చేయువారికి ఇహ పరముల ముక్తిదాయకం!
మహనీయులెందరో పఠించి తరించిరి
అనుదినము గీతను పఠించు 
ఇహపరముల ముక్తిని పొందు.
         ***********
14
[03/08, 8:42 PM] Satish Kumar Palugula Poet: కవితా గానం -పౌర్ణమి కవితల పోటీ.
        అంశం: భగవద్గీత
*************************
భగవద్గీత-భవబందాల ముక్తి    
                ప్రదాత
                భవసాగరమునకు 
                ఈత
మనసు చేసే మాయాజాలమే
ఆనందం, విచారమని
మాయపొరలు మనసును కమ్మితె, కర్తవ్యం కనుమరుగవుతుందని
ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా
భగవదర్పణ బుద్దితో పనులను చేయమని
ఆద్యాత్మిక సాధనల ప్రయోజనం
ఆత్మశుద్ధి పొందడమని
అంత:కరణ పవిత్రతతో మనోనిర్మలత పొందవచ్చునంటుంది భగవద్గీత

భగవద్గీత-అహంకారాదులకు 
                కోత
                రాగద్వేషములకు
                మూత
'నాది' ' నేను' అనే భావనలవల్లనే, సుఖదుఃఖాలు
జయాపజయాలు అని
ఏది మంచో, ఏది చెడో విచక్షణతో ఆలోచించాలని
ఆకాశంలో మబ్బులు సూర్యుని
కమ్మేసినట్లే
మనుషుల మనసును అజ్ఞానమనే మేఘం కమ్మేస్తుందని
ఆకాశాన మబ్బులు తొలగితే సూర్యుడు ప్రకాశించినట్లే
మనుషుల మనసులలోని అజ్ఞానం తొలగితే
మానవుడే మాధవుడై ప్రకాశిస్తాడంటుంది భగవద్గీత

భగవద్గీత-దివ్యజ్ఞానమునకు 
                దాత
                దైవీసంపదకు నేత
మనిషి విజయానికి మనసే ప్రధానం అని
ధైర్యం లేని మనసు ఏ ప్రయత్నం చేయదని
విజయాన్ని సాధించలేదని
అన్యాయాన్ని ఎదుర్కోలేదని
ప్రియాన్ని మంచిని కలిగించేలా
మాట్లాడమని
జరిగిన దానిని గుణపాఠంగా
భావించి, భవిష్యత్తు విజయాలకు బాటలు వేసుకోవాలంటుంది భగవద్గీత

భగవద్గీత-పరమార్థదృష్టికి
               మాత
               దర్మామృతమునకు
               పోత
సమాజం నుండి నీవు ఏది కోరుకుంటావో, నీవే దానిని
సమాజానికి అందించాలని
సమస్త ప్రాణికోటిని ప్రేమించమని, వాటిలో దేవుడున్నాడని గుర్తించామని
ఆత్మజ్ఞానం కలిగితే మనిషి
ఆదర్శప్రాయుడవుతాడని
ఓర్పు, దయ, శాంతి,క్షమ ఉంటే  జీవితం ఆనందమయమంటుంది భగవద్గీత
భగవద్గీత-శ్రీకృష్ణ భగవానుని 
               దూత
               వ్యాసమునీంద్రుని
               వ్రాత.
------పలుగుల సతీశ్ కుమార్
      యాదాద్రి భువనగిరి.
15
03.8.2020.

'కవితా గానం'
శ్రావణ మాస పౌర్ణమి కవితల పోటీలు.

అంశం: భగవద్గీత,
శీర్షిక: *గీత*

నా కవిత్వం-227,
రవికుమార్ కంచి, ఉపాధ్యాయులు,
9494345594.

-----🔰-----

    జీవిత యుద్ధరంగంలో 
    ఎక్కడ ఉరకాలో ఎక్కడ నరకాలో 
    బోధిస్తది గీత

   బాధలు బంధనాలు కాదు
 స్థితప్రజ్ఞుడవై సమరం 
   సాగించాలంటది గీత

  ఆనాటి అర్జునుడికే 
 కాదు  
   ఈనాటి అర్జునలకిదే 
        గొప్ప  
  మనోవిజ్ఞానశాస్త్రం 
      మహా గొప్ప 
 నిర్వహణా గ్రంథం

   నిత్య గీతాపఠనంతో
  మన చెంత  
 కృష్ణుడున్నట్టే
     మన మదిలో నిత్య 
 స్ఫూర్తి రగిలించినట్టే 
     బతుకు పోరులో 
 విజయం    
     సాధించినట్టే.

 _*-రవికుమార్ కంచి*_
   🙏🌷

^^
➖➖➖➖➖➖
🙏🌷

^^
➖➖➖➖➖➖
16

[03/08, 8:47 PM] +91 96428 92848: కవితా గానం
౼౼౼౼౼౼౼౼
అంశం:భగవద్గీత
శీర్షిక:'గీత' దాటొద్దు

అటా ఇటా!అదా ఇదా!
నిశ్చయించలేని నిస్సహాయ స్థితి
ధర్మం అధర్మం రాగం ద్వేషం
మధ్యలోనే అంతర్మథనం
ఇది ఎవరిదో కాదు నరుని స్థితి
ప్రతిక్షణం ఎదుర్కొనే పరిస్థితి

ఆశల అంబారీలో ఊరేగేవాడికి యుద్ధరంగం మధ్యలో నిలబడ్డామనే విషయం తెలియాలి
లక్ష్యం ఛేదించేవాడు అస్త్రసన్యాసం చేయకూడదు కర్తవ్యం కళ్ళముందున్నప్పుడు
తప్పించు కోవడం తప్పేకదా!
ధర్మం మనిషి మార్గమైనపుడు
జీవన రథాన్ని నడిపే వాడు నారాయణు డౌతాడు౹నీరసాన్ని వదిలించి వీరరసాన్ని నూరి పోస్తాడు౹విన్నవాడే విజయుడౌతాడు౹బలగం ప్రతి పక్షానికే అయినా౹బలం ధర్మానిదే౹
క్షేత్రం ఏదైనా విత్తుని బట్టేఫలం
కర్మను బట్టేఫలితం౹ధర్మం గీత దాటకుండా జ్ఞానంతో చరించే వాడు
ధర్మానికే రాజౌతాడు౹ ధర్మరాజౌతాడు అతడు౹ నిలిచిన ప్రదేశం ధర్మ క్షేత్రమౌతుంది౹

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
             జల్లిపల్లి బ్రహ్మం
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
17
[03/08, 8:51 PM] Balloori Umadevi Poetess: కవితా గానం శ్రావణ పౌర్ణమి నగదు పురస్కారం కవితల పోటీకి
పేరు డా బల్లూరి ఉమాదేవి
అంశం:భగవద్గీత.


ధర్మక్షేత్రమైనట్టి కురుక్షేత్రంబున
బోధించెను కృష్ణుడు పార్థునకు గీతను భగవద్గీతను:: 1

తనువు నదురు చున్నది ధనువు జారుచున్నది
రణము చెయలేను బావ రథము నాపు మనుచును
బంధుజనుల తోడ పోరు సలుప లేననుచున్న 
పార్థుతోడ పలుకుచు ప్రేమతో
బోధించెను కృష్ణుడు పార్థునకు గీతను:: 2

మూఢతనము వీడరా అడుగు ముందుకేయరా
జయము నొందు వేళ నీకింత జడుపు యేలరా
వ్యామోహమె వీడమంచు మర్మమే తెలిపెను
యుద్ధరంగమందు వలయు శౌర్యమంచు పలుకుచు
అస్త్ర సన్యాసమిపుడు ననువు గాదనుచు
బోధించెను కృష్ణుడు పార్థునకు గీతను::3

జగతియందు సర్వము భగవదాధీనము
భగవంతుని యర్చించుటె భక్తుల ధర్మము
విశ్వరూపమనునది వేదాలకు దొరకనిది
దానాలకు యాగాలకు తపముల కగుపించనిది
భక్తితోడ కొలుచువారి కిది సాధ్యమనుచును
బోధించెను కృష్ణుడు పార్థునకు గీతను.::4

శోకమును వీడుము స్థైర్యమును బొందుము
వీరత్వమును చూపి విజయమునే గాంచుము
తనువు స్థిరము గాదురా ఆత్మయొకటె నిత్యము
జీర్ణవస్త్రమట్లు నదియును మరొక తనువు చేరుననుచు
నేను నాది యనునది కూడదంచు పలుకుచు
బోధించెను కృష్ణుడు పార్థునకు గీతను::5

ఆత్మ కాలబోదురా నగ్నిలో నెప్పుడూ
నీరు తడుప బోదటంచు నెరుగవయ్య మదిలోన
వాయువార్ప బోదురా వసుధలో నాత్మను
శాశ్వతంబైనదీ యాత్మయే ననుచును
బుద్ధితోడ నెరుగ మనుచు బోధించెను
కృష్ణుడు పార్థునకు గీతను భగవద్గీతను::6

నేను నాది యనునదేది నీ స్వంత మవదురా
కామరహితమైనట్టి పనులనే చేయరా
నిష్కామంబు వలన జ్ఞాన ముద్భవించురా
సత్త్వగుణము పెంచుకొనుచు సాగుమురా ముందుకనుచు
బోధించెను కృష్ణుడు పార్థునకు గీతను::7.
18
[03/08, 8:58 PM] ధనాసి ఉషారాణి తలకోన: కవితా గానము
   అంశము.గీతా పఠనము
పౌర్ణమి నగదు పురస్కారాలు
..... ....... ......
శ్రీకృష్ణుని మేధస్సు నుండి జాలువారిన తియ్యని సుమధుర భావ పరిమళం
కర్మచేయి జనుల అహింసా మార్గములో నడుపు జ్ఞానబాoడాగారము
కళ్లకు కప్పిన మాయపు పొరలు తొలిగించు జ్ఞానతేజస్సు
బందముల ఉచ్చులో నలిగిన  మనిషికి విమోచక మంత్రము
విన్న కొద్ది  వినాలనుకునే ముక్తిగీతము
మోడుబారిన హృదయాలకు
నిత్య జీవపు  ఊట
మనిషికి నిండు హృద్యభావన పులకింపచేయి 
మహాభారత ఇతిహాసము నుండి ఉద్భవించిన  జగతి మంత్రము
నిర్మలమై నీతిని నేర్పు మనిషికి
కుచేలుడు చెలిమిలో లీనమై
గాoడివికి గీత బోధించినావు
వేదసారముతో  జగతికి వెలుగు నింపివ 
ఓ యాదవకులమున పుట్టిన 
బృందావన ప్రేమ లోలుడా
నేను నాదని స్వార్థము వదులుమా
కామరహితము పనులు చేయమని సెలవిచ్చినావు కృష్ణ
వ్యామెహము వీడమని మర్మము తెలిపినావు
మానవ జాతికి మణిరత్నమై
వెలిసిన భగవద్గీత పఠనము
మానవజాతికి నిండు మార్గదర్శo

  ధనాశి ఉషారాణి
భాకరాపేట. చిత్తూరు జిల్లా
  ఆంధ్రప్రదేశ్
19
[03/08, 9:00 PM] Aparajith: జీవిత పాఠం !

జీవితం ఓ ఆరాటం ఓ పోరాటం 
ఒక సమస్య వెంట ఇంకొకటి తయారు 
గీతా పఠనం, ధ్యానం దినచర్య చేసుకో 
పలువురు నీ ఓటమిని చూసి గెలిచేస్తున్నారని బాధపడకు !
ప్రశాంతంగా నీ వనుకున్న రంగం లో 
అలుపెరుగని శ్రామికునివై ఇష్టపడి కష్టపడు 
శ్రమే నీ ఆయుధం !
ఆ భగవంతుడు ఉన్నత శిఖరాలపై నిలబెడతాడు !!
నీవిక కోలుకోలేవని సంబరపడ్డ వాళ్లే నీ కోసం అర్రులు చాస్తారు !
కస్టపడితే జీరో నుంచి కూడా ఎదుగుతావ్ !
నీకు ఎవరూ సహాయం చేయరు 
నీకు నీవే తన్నుకుని గుద్దుకుని బయటపడాలి !
నిరంతరం భగవత్ ధ్యానం చేయ్ 
నీ మానాన నీవు దారిలో వెళ్తుంటే 
ఓ పది మంది పనిగట్టుకొని రాళ్లు విసిరితే 
పిరికి వాడైతే పారిపోతావ్ !
ధైర్యవంతుని వైతే ఎదురు తిరిగి రాళ్లు విసురు !
మేధావివైతే విసిరిన రాళ్లతో మేడ కట్టుకుంటావ్ !!
అన్ని వేళల జయం నీదేనని మిడిసిపడకు 
ఇప్పుడు నీవు తరువాత ఇంకొకరు !
నీ జీవితం నేర్పిన పాఠాలను మరువక వాళ్ళను మెచ్చుకో !!
ఈర్ష్య ద్వేషం వదులుకో !
మంచు కరిగినట్లు వయస్సుతరిగిపోతుంది !!
వృద్ధుడవైన నిరంతర విద్యార్థి గానే ఉండు !!
ఆత్మ నిర్మలంగా ఉంటే అన్నీ సుసాధ్యం !!? 

అపరాజిత్
20
[03/08, 9:08 PM] STTRao Kama Reddy Poet: కవితాగానం
శ్రావణ పౌర్ణమి పురస్కారం
గీతాసారం

భగవంతుడు అంతటా నిండియున్నాడు
నాలోను నీలోను ప్రతి జీవియందు కొలువైయున్నాడు
నీపని నీవుచేయు మిగిలినంత దేవునిపై భారముంచు
కష్టపడిన వాడికి తప్పకుండా
ఫలితము వస్తుంది
ఏదైనా కర్మానుసారమే జరుగుతుంది
మానవబంధాలతో అల్లుకుపోయి
సంసారమనే సాగరములో మునుగుపోతూ
అంతా నావాళ్ళు  అన్న మాయపొరలు కప్పి ఇహములో
బతుకుతూ దేహసౌందర్యము మీద
మోహము పెంచుకుంటూ జీవిస్తున్నాడు
జగమే మాయని అని తెలుసులోక
కొట్టుమిట్టాడుతున్నాడు
అహంకారమనే అంధకారములో
మిడిసిపడుతూ
క్షణికమగు సుఖాలుకోసము
అర్రులు సాస్తున్నాడు
మదమాత్సర్యములో మదముతో
నీటిబుడగవంటిది జీవితము
అని తెలుసుకోలేకపోతున్నాడు
నీలోవున్న అజ్ఙాననే చీకటితొలగి
నపుడే మానవతాపరిమళాలు
విరబూస్తాయి

సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి
21
[03/08, 9:17 PM] Abhiram Poet: కవితా గానం పౌర్ణమి పోటి కొరకు
పేరు :- అభిరామ్
అంశం :- గీతా మహత్మ్యం


                              *గీత ఒక మనసు ప్రవాహం*

చూడు మిత్రమా 
భయమేలా...!

చూడు మిత్రమా
బాధేలా...!

చూడు మిత్రమా
కంటతడేలా...!

చూడు మిత్రమా
అలజడి ఆవేదన సుడేలా...! 

భగవద్గీత సారం వినలేదా...! 

శక్తిలోంచే అడుగేసే సుసూక్తికి
సుసూక్తిలోంచి విరుచుకుపడే విరక్తికి
భక్తిలోంచే ఉదయించే ముక్తికి 
అన్నింటి మూలాలను మనసుపై గుమ్మరించే 
పూలబుట్ట కదా భగవద్గీత 

నమ్మకం, మోసం, దగా, కుట్రా,
త్యాగం,భోగం,రోగం,రాగం అన్నీ 
కర్మయాగంలో సమిదలేగా 
ఆ కర్మను  ఉత్తమనడవడికే 
ఎప్పుడూ మోక్షఫలమన్నది గీతాసారం కదా...
దిగులేలా మిత్రమా...

మన జీవనగీతే భగవద్గీత
మన బుద్ధే కృష్ణుడు 
మన మనసే అర్జునుడు 
మన ఆలోచనల సతమత సంగ్రామమే 
కురుక్షేత్రం 
దీన్ని గెలవమని చెప్పే బహిరంగ కృష్ణ కటాక్ష ఆశీస్సులే 
గీతాసారం 

రాత మార్చే అక్షరకరవాలం గీత 
వేదన కోత తీసే జ్ఞాన పూత గీత 
గీతనాధారం చేసుకునే టెక్నాలజీ జీవం పోసుకుంది
మానవ మనగడను మసి చేసే మహమ్మారి అసురులొచ్చిన చైతన్యం ప్రసాదించే భోదనశాల గీత
ఎప్పటికీ మనసుకైన గాయాలను తీసే మందు గీత 

ఈ గీతలోంచే ఎందరో రాత మార్చుకుని 
విజయాలను చేతబట్టింది 

ఆర్షాధర్మమానికే కాక అవనికే  అవరోధాలను తొలగించే 
జ్ఞాన దీపకాంతి గీత 

ఆరిన దీపాలనే కాదు 
వెలుగుతున్న అజ్ఞాన ప్రాణదీపాలను ప్రక్షాళన చేసే వడపోత గీత 

వర్ణణాతీతమైన గీతను నమ్ముకో మిత్రమా 
అరిషడ్వర్గ కోతలు ప్రశాంత పిందెకు పూలే రాలిపోతాయి

                                  *అభిరామ్*
22
[03/08, 9:21 PM] Ganjam Bhramaramba: 3-8-2020
శ్రావణ పౌర్ణమి
కవితా గానం
భగవద్గీత.. అంశం

*సర్వోత్కృష్ట వ్యక్తిత్వ వికాస గ్రంథం*

గంజాం భ్రమరాంబ
తిరుపతి

భగవద్గీత...
ఒక మత గ్రంథం కాదు సుమా
వేల సంవత్సరాల నాటి
సర్వోత్కృష్ట వ్యక్తిత్వ, మనో వికాస గ్రంథం
చెప్పిన వాడు సామాన్యుడు కాదండోయ్
బాలుడు.. గోపాలుడు కాదు అతను...
శిష్ట రక్షకుడు..దుష్ట శిక్షకుడు..
లోకాల పాలుడు..

కర్తవ్య విమూఢుడు అర్జునుడే కాదు
బంధుప్రీతిని వదులుకోలేని సామాన్యులు కూడా
వస్తు ప్రపంచాన్ని దాటి దృష్టి సారిస్తే
సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరవచ్చు
భక్తి, కర్మ, ధ్యాన జ్ఞాన మార్గాలలో
భగవంతుని చేరుకొనే విధానాన్ని
18 అధ్యాయాలలో సామాన్యులకు
పదిలంగా అందించడానికి
పురుడుపోసుకుంది భగవద్గీత
నిత్యకురుక్షేత్రంలో పరుగుల జీవితంలో
అనవసరపు ఆరాటాన్ని తగ్గించి
తనను తాను తెలుసుకుని
నిష్కామ కర్మలు చేపట్టి
ఫలితం మీద కన్నా కర్తవ్యం మీద దృష్టి పెట్టి
ఈ ప్రపంచానికి మనిషిగా వచ్చినందుకు
కాస్త మంచిని ఇచ్చిపొమ్మని
మనసున్న  మనుషులకు
విశదీకరించి కృష్ణ మాయనుంచి
మనసును మళ్ళిస్తుంది భగవద్గీత

గంజాం భ్రమరాంబ
తిరుపతి
9949932918
23
[03/08, 9:22 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..భగవద్గీత పౌర్ణమి పురస్కారాల పోటీ కోసం.

శీర్షిక..ప్రవచనామృతం

మహాభారత ఇతిహాస0లో భీష్మపర్వం
కురుక్షేత్ర సంగ్రామంలో
కృష్ణా ర్జునుల సంవాదం
అయోమయ పొరలు కమ్మిన అర్జునుడికి వెలుగు చూపిన జ్ఞానకాంతి పుంజం
వేద వేదాంత యోగ విశేషాలను తెలిపే గీతోపనిషత్తు
భగవంతుని తత్వం,ఆత్మతత్వం,జీవన గమ్యం,గమ్యసాధనా యోగములు బోధించిన ఆధ్యాత్మిక గ్రంధం
నిరాశా సందేహాలు చుట్టుముట్టిన వేళ
ఆశా కిరణములు గోచరించిన వేళ
మహాత్ముని ఓదార్చి
అహింసామార్గంలో నడిపించిన మార్గదర్శి
పద్మనాధుని ముఖకమలమునుండి ప్రభవించిన ప్రవచనామృతం
భవబంధాలను బాపే
కర్మ భక్తి జ్ఞాన సిద్ధాంతాల సారం
ప్రతి నిత్యం పఠించిన పవిత్రమవును మది
కొత్త అర్థాన్ని బోధించి కార్యోన్ముఖులను చేసే జీవన సూత్రం
సత్వ రజస్తమో గుణాలచే నిండియున్న బంధం నుండి విముక్తి కలిగించు ప్రత్యేక గ్రంధం
జీవన సత్యాన్ని తెలిపే మహిమాన్విత సూత్రం
అదే అదే భగవద్గీత సారం.
24
[03/08, 9:26 PM] Sandya Sharma Poetess: శ్రావణ పౌర్ణమి కవితా గానం పోటీ
వై.కె.సంధ్యశర్మ
అంశం:
భగవద్గీత పఠనం గీతా సారం
శీర్షిక: దివ్యౌషదం!


రాతను తుడిపే గీతను భోదించి
అమృత బాంఢం కొలువుంచి...
జ్ఞానసుధను సర్వ కాల సర్వావస్థలయందు
విశ్వఖనిలో నిగూఢించి
కర్తకర్మక్రియలకు భాద్యులెవరో
బంధీలెవరో.... సర్వమెవరో...
యుగాలకతీతంగా....
అగాధాన్ని నిర్మూలించే
నిష్కల్మష దివ్య గ్రంథం....

కురుక్షేత్ర సంగ్రామమే జన్మస్థలమై
అనంతుని అంతరంగమున ఉద్భవించిన
అమృత రసవాహిని....

అనుష్ఠానచందంలో మహా పురుషుల సాంగత్య జ్ఞానసంపదతో ఈర్ష్యాద్వేష వివర్జియై
చతుర్విద పురుషార్థాల అవపోసనలో
ముక్తి మార్గాన్వేషణకు ఆచరించే దివ్యౌషదాన్ని
ఒంపిన గీతా సారం...

ఆత్మస్థైర్యపు బీజం అవలోకించి
బుద్ధిబలంతో సంసిద్ధమై
నేటి అర్జునులు సైతం
ఆచరించే ఆయుధం భగవద్గీతా సారం.....

నిరాశ నిశ్పృహల జాడ్యమై నిండిన
మస్తిష్క వలయాలు ప్రక్షాళన
చేసి కార్యోన్ముఖులు చేసే సకల వేద సారం
పదునెనిమిదిఅధ్యాయాల గీతా ప్రబోధం..

విశ్వమానవాళి ధర్మ సంస్థాపనా ధ్యేయమై
మానవ మనుగడే మాధవ సేవయని
'యథేచ్ఛసి తథాకురు'యనే ఆఖరి వాక్యమై
అజ్ఞానాంధకారాన్ని వీడే మేథో మార్గదర్శనం
శ్రీ కృష్ణార్జున సంవాదం సారం...!
ఆచరణీయం...సదా... నిత్య స్మరణీయం!!
25
[03/08, 9:26 PM] Sunkara Sreelatha KS 21: అంశం:గీతా పఠనం
కవిత: కృష్ణం 
               వంద జగద్గురుమ్
రచన:సుంకర శ్రీలత
🍀🍀🍀🍀🍀🍀🍀
కురుక్షేత్రంలో  జరిగిన
ధర్మ పోరాటంతో
మొదలైయ్యే గీతాపాటం
ఆద్యంతమూ 
కర్తవ్యదీక్షాప్రభోధమే!

భగవద్గీత!
గురువాణియైఅష్టాదశ 
అధ్యాయాలతోనేటి
సమాజానికి అవసరమైన
ఆహారవిహారాదులఆచరణ
సూత్రాలఉపనిషథ్ సారం!

గీతా శ్రవణం!
చిత్తమాలిన్యాలను
చిత్తుగా శుభ్రంచేసే
భాగీరతీ ప్రవాహం.

గీతా పఠనం!
శక్తి జనక యంత్రమై
మనలోఆత్మవిశ్వాసాన్ని
ఉద్దీపన చేస్తుంటే
దాన్నో విషాదగీతంగా
చూడటం నిజంగావిడ్డూరం.

గీతాచార్యుడి ఆలోచన
అర్జునుడిఆచరణతో
సాధించిన విజయంతో
సప్తశతశ్లోకాలతో
సాగే గీతాగానం
కృష్ణం వందేజగత్ గురుం
అంటూ ప్రపంచానికే
దిశా నిర్ధేశం చేస్తున్న
వ్యక్తిత్వ వికసన గ్రంధం!
26
[03/08, 9:42 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*
తేదీ::03-08-2020
 పేరు :వురిమళ్ల సునంద,ఖమ్మం
శ్రావణ పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీకి
అంశం:: భగవద్గీత లేదా గీతా పఠనం
 శీర్షిక:: 
నిత్య పఠనీయం. జీవన సారం
**********************
కర్తవ్యం వైపుకు నడిపించేందుకు
భగవంతుడే స్వయంగా పూనుకున్న అద్భుతమైన సన్నివేశం!

బంధాలు బాంధవ్యాల ముళ్ళకంచెలో 
ఇహలోక బంధాల పాశాలతో  చిక్కుకున్న మనసును 
విడిపించి మోక్షం వైపు మరలించే
మహోన్నత  బోధనా సారం!

 ఆత్మానాత్మ వివేచన చేయించి
సృష్టి స్థితి లయ కారకుడైన
శ్రీ కృష్ణ భగవానుడు విశ్వరూపం చూపించి
అర్జునుని కర్తవ్య పాలన చేయించే 
శ్లోకాల సారం!

మనిషి జీవితాన్ని నడిపించే మూలశక్తి తానేనని 
విషాద యోగం నుండి ఆత్మ తత్వాన్ని చెబుతూ
స్థితప్రజ్ఞత సాంఖ్య యోగ తాత్వికతను తెలియపరుస్తూ

జనన మరణ చక్ర బంధంలో కట్టుబడి
చేసే పనుల కర్మ యోగాల 
పరంపరతో మానవుని 
ఆత్మ పరమాత్మ జ్ఞాన పరమార్థాన్ని
ఎరుక పరుస్తూ
చేసిన యోగ బోధనా సారమే భగవద్గీత!

తమో రజో గుణాల బంధనాలు తెంచుకుని
సత్వ గుణ సంపన్నుడై సత్కర్మల నాచరించి ముక్తి పొందేందుకు..

 ప్రతి మనిషి చదివి  
భగవంతుని తత్వము తెలుసుకుని
గమ్య సాధనా యోగం వైపు అడుగులు వేసేందుకు  ఉపకరణమే
భగవంతుడు చెప్పిన భగవద్గీతా ప్రబోధం!
ప్రపంచ మత గ్రంథాలలో సర్వోత్తమ గ్రంథం!

అమెరికాలో చికాగో నగరంలో
వివేకానందుని వివరణతో
విశ్వ మానవ సమూహాన్ని అబ్బుర పరిచిన  మహా గ్రంథం!
ఆకళింపు చేసుకుని ఆచరణలో చూపించేదే గీతాసారం!

నిరాశ నిస్పృహలు కలతలు కష్టాలు
చుట్టుముట్టినప్పుడు
 నిత్యం ఓ శ్లోకాన్ని పఠిస్తే చాలు
 సమస్త చింతనలు మటుమాయమై
 పెదవులపై చిరునవ్వులు పూయించే
 వ్యక్తిత్వ వికాస గ్రంథం!

నిత్యం క్రొంగొత్త జీవన విశ్లేషణతో
అర్థ సంపద  పెంచుకోవచ్చన్న 
గాంధీ మహాత్ముడి హృదయాన్ని ఆవిష్కరింప జేసిన భగవద్గీత
నిత్య పఠనీయం...జీవన పానం!
27
[03/08, 9:43 PM] కందూరి సుజాత Poetess: కవితాగానం
అంశం.. భగవద్గీత 
శీర్షిక...🌷.జ్ఞానదీపిక 🌷
*******  *******  *******
భగవద్గీత జ్ఞానదీపిక/ 
భగవత్ శాసనము శోకావిముక్త గీతాక/
భగతానుసారంన కర్త కర్మ క్రియల - సమన్వయం మాలిక /
కురుక్షేత్ర సంగ్రామమున -
సపరివారములను  సంహరింపక- శోకాయుక్తమైన అర్జునునకు -
వేద ఉపనిషత్తుల సారముతోకూడీ - 
శ్రీకృష్ణభగవాన్ ఉపదేశమున పూరించిన 
జ్ఞానశంఖారావమే భగవద్గీత/

చావు పుట్టుకలు ఆత్మసృజనలు /
ఆత్మీయ అనుబంధాలు దేహ లేపనాలు/ 
ఆశించు ఫలము అందీ అందకున్నా -
కర్మానుసారం జీవి కక్ష్యలో తిరిగి -
ఆత్మయోగిగ మారి అంతరించు /
జగద్గురు పరమాత్మ పలికిన భగవద్గీత/

కామ క్రోధ మదంచేత కూర్చున్న కొమ్మను నరికినట్లు  గుణహీనం అవకా -
నాదీఅను మిథ్యనొదులూ/
శోకపీడిత హంపశయ్యను మదివొదిలీ-
జ్ఞానకణిక ప్రజ్వరిల్లగా పరిశోధించీ -
న్యాయ ధర్మ శాంతి దయలతో  - పక్వరించటమే -
జన్మ కర్మల సందాన సాక్షమే భగవద్గీత/

పంచభూతములు  సప్తఋషులు
కాలస్వరూపం నింగినేలా సర్వం విష్ణుమయం/ 
సహన అసహనాలు- మూలస్తంభాలు/ పాపపుణ్యాఃల మీమాంసలో అధర్మాన్ని పోషించకా-
సంధించు కార్యసాధనల -
సాధించు కర్త పాలనల -
ఆలంభనయే భగవద్గీత/

గుడిగంట  ప్రచోదరవములకూ-
గుండె స్పందించు తీరుగా-
భగవద్గీతా పఠనం-
బాహ్యంతరాలను నిక్కపొడిచీ- ఉక్కుచేయు / 
కష్టసుఖాలు బతుకును భాగించి 
శేష అశేషాలు కర్మానుపలమై కనువిప్పు చేయు /
గీతా పారాయణం జపతపములై/ దానధర్మములు కవ్వింప చేయు  /
ఆత్మఃసౌందర్యం ఆర్జింపచేయూ/ 
అఖండ జ్యోతిగా  జగతిన జ్వలించు- జ్ఞానదీపిక  భగవద్గీత/

కందూరి సుజాత రాణి 
రాజేంద్రనగర్  హైద్రాబాద్ 
9392162822🌷
*******  ********  ******

హామీ.. ఈ కవిత 
నా యొక్క స్వీయరచనా.
28
[03/08, 9:53 PM] Gundla Raju Sir: *కవితాగానం*
*శ్రావణ మాసం పౌర్ణమి* పోటీలకై..
అంశం : *భగవద్గీత*
శీర్షిక : *గీతా సుగీతా*

పరమాత్మ ముఖారవిందం నుండి వెలువడిన దివ్యవాణి *భగవద్గీత*
కర్తవ్య నిర్వహణయే సకలార్థసాధకులకు విజయదీపికయని ప్రభోధించిన
పరంధాముని వాణి *భగవద్గీత*
కర్మలు చేయుట యందే అధికారము కలదు కానీ వాటి ఫలితములందు ఆశలుండకూడదని ప్రవచించినదీ  *భగవద్గీత*
సృష్టిలోని ప్రతి అణువులో ఆ పరమాత్ముడుప్రతిష్ఠితమై యున్నాడని విశ్లేషించినదీ *భగవద్గీత*
జనన మరణాలు సహజప్రక్రియయని శరీరము ఆత్మకు తొడుగు వంటిదని మంత్రోపదేశం చేసినమహిమాన్విత మకరందం *భగవద్గీత*
మోహపరవశుడై అనురాగ బంధంలో బందీయైన అర్జునునికి ధర్మక్షేత్రములో ధర్మ సంస్ధాపనాచార్యుని గీతోపదేశం *భగవద్గీత*
నారాయణుని విశ్వరూప సందర్శనం....
పరిత్రణాయా సాధునామ్ వినాశాయచదుష్కృతామ్ సంభావామి యుగే యుగే!!..


*గుండ్లరాజు*
29
[03/08, 9:53 PM] Swarna Latha Poetess: శ్రావణ పౌర్ణమి పోటీకై
అంశం...గీతా పఠనం
పేరు..యం.టి.స్వర్ణలత
ఊరు ...మంచిర్యాల
శీర్షిక.... కర్తవ్య ప్రభోదం

హిందువుల పరమపవిత్ర గ్రంథం
భారతీయ జీవన విధానాన్ని 
ప్రభావితం చేస్తూ...
మానవులందరినీ ఉద్దేశించి చేసిన ప్రభోదం
కర్మయోగం జ్ఞానయోగం భక్తియోగాల 
సారం గీతా పఠనం తెలుపుతుంది 
సత్ స్వరూపాన్ని తెలియజేస్తూ కర్తవ్యం బోధిస్తుంది
గీతను పఠించుట ద్వారా చేకూరు స్థితప్రజ్ఞత
మానసిక పరిణతి ద్వారా ఆలోచనాసరళితో
ఒక్కొక్కరు ఒక్కోరకంగా అర్థం చేసుకోవచ్చు
ఆత్మజ్ఞానం అహాన్ని తొలగించడంతో
అర్పన భావం నిస్వార్దపరత్వం 
నిష్కామ కర్మ  అలవడదా
చావు పుట్టుక మధ్య విలువైన జీవితమందు
విలువైన పనులు చేయ ప్రోత్సహించదా
జీవితాన్ని అందంగా అద్భుతంగా 
ఆదర్శవంతంగా స్ఫూర్తిదాయకంగా
జీవించుట అలవడునంటే అతిశయోక్తి కాదు
కర్తవ్య ధీక్ష పెరుగుతుంది అది దేశానికి
వెన్నుదన్నుగా నిలుస్తోంది
అనన్య భక్తి ఆధ్యాత్మిక జ్ఞానంతో అలవడును
యువకులు చదివి ఆచరిస్తే దేశం ఉన్నత స్థానంలో నిలుస్తుందనటంలో సందేహం లేదు
ఆలోచన ఆచరణ ఉంటే విజయం తధ్యం


హామీ...ఈ కవిత నేను స్వయంగా పోటీ కోసం రాసినది
30
[03/08, 9:54 PM] Indravat Rahul Poet Ks 11: *అందరికి నమస్కారం*
 ➖➖➖➖➖➖➖➖
🌕🌷🌕🌷🌕🌷🌕🌷🌕


 *కవిత గానం పౌర్ణమి పోటీలు*
 ★★★★★★★★★★★★★★



అంశం  :  భగవద్గీత
రచన తేది : 03/08/2020
వారం :  సోమవారం 
 మాసం :  శ్రావణ మాసం 
  శీర్షిక : నా దేశం భగవద్గీత
      🌕  *పౌర్ణమి*🌕




      🇮🇳 *నా దేశం భగవద్గీత* 🇮🇳



 సమస్త వేదాల సారం గీత
 నా దేశం భగవద్గీత
నా దేశం అగ్నిపునీత సీత
నా దేశం సంస్కార గంగ
అన్నారో మహాకవి 
నిజమే  ప్రేమానురాగాలకు పుట్టినిల్లు నా దేశం
సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం నా దేశం
అపరిచితులైన అయినా అక్కున చేర్చుకుని ఆదరించి
ఆశ్రయమిచ్చు దేవాలయం నా దేశం
వేడి వస్తే శత్రువుకైనా నీడనిచ్చే రక్షిస్తుంది నా దేశం
మనిషిని వ్యక్తి మనుగడకు తోడ్పడే దిక్సూచి గీత
సన్మార్గంలో పయనింప చేసిన అద్భుత జ్ఞాన బండారం గీత
 జీవిత పరమార్ధాన్ని తెలియజేసే మహోన్నతమైన అవకాశం గీత
 గీతని చదివి అర్ధం చేసుకొని 
 ఆచరించడం వల్ల కలిగే మార్పు అంతా ఇంతా కాదు
 పామరున్ని  సైతం పండితుని
చేయగల శక్తి గీతది 
 సమస్త ప్రశ్నలకు సమాదానం అందించే ఏకైక గ్రంధం శ్రీ భగవద్గీత
 మనలో ఉన్న అజ్ఞానపు తెరని
 తొలగించి వెలుగును ప్రకాశింప జేస్తుంది గీత
 మనిషిలో ఉండే నిరాశ ఆందోళన భయం కోపం  దుఃఖం అహంకారం
 ప్రతీకారం ఈ లక్షణాలన్నీ  దూరం చేయును
 మనిషిని మంచి మనిషి చేసేది గీత
అందుకే అందరూ ఆచరించాలి.. 




*హామీ పత్రం*: ఈ కవిత నేను స్వయంగా రాసాను... అని హామీ ఇస్తున్నాను.... 

          ధన్యవాదములు.. 🌷



      🎯 *కవి పరిచయం*🎯
 ★★★★★★★★★★★★★


కవి పేరు : ఇంద్రవత్ రాహుల్ 
ఊరు : కొత్తపేట్ 
జిల్లా : ఇందూర్ /నిజామాబాద్ 
మండలం : ఇందూర్ /నిజామాబాద్ 
చరవాణి : *9848054079*


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
31
[03/08, 9:56 PM] Tiru Venkatacharyulu Ks6: కవితాగానమ్ 
శార్వరీ"శ్రావణ"పౌర్ణమీ. 
ము డుంబ తిరు వేంక టాచార్యులు, వరంగల్. 
03-08-2020. 
భగవద్"గీతా"పఠనం. 
"కర్మణ్యేవాధికారస్తే".

ఏదీ శాశ్వతం కాదు, 
జనన మరణాలు, సుఖదుఃఖాలు, జయాపజయాలు, లాభనష్టాలు, .... 
నీవేమీ తేలేదు, పట్టుకుపోయేదేమీ లేదు, కర్మలను త్రికరణశుద్ధిగా చెయ్యి, కర్మఫలాలను ఆశించకు, ఎలా అని కర్మలను చేయడం మానకు, 
యావత్ రొదశినిపడార్తమావరించి ఉన్నట్టే ప్రతి సజీవ ప్రాణిలో"ఆత్మ" ఉన్నది, అది యావత్ శరీరంలో వ్యాపించి ఉన్నది, "దేహమే క్షేత్రం, దేహి(ఆత్మ) క్షేత్రజ్ఞుడు, లోకమే క్షేత్రం, పరమాత్మయే క్షేత్రజ్ఞుడు," వివేకులు జననమరణాల గురించి యోచించరు, 
పూలవాసన గాలిని అంటిపెట్టుకుని ఉన్నట్టు ఇంద్రియాలు, మనస్సు ఆత్మను అంటిపెట్టుకుని ఉంటాయి, నీటిలోని అలలు ఒకదానితో ఒకటి కలిసి సాగిపోవడమో, కుదించుకు పోవడమో జరిగినట్లే, మన కర్మలు మనకు ఆలోచనలను, ఫలితాలను ఇస్తాయి, 
"ప్రాయశ్చిత్త0తో ముగిసే జీవితం, తదుపరి పయనంలో ఆత్మ స్వభావానికి నాంది". 
దేహానికే తప్ప ఆత్మకు తల్లీ,తండ్రీ లేరు, 
ప్రకృతే దేహెంద్రియాల ఉత్పత్తికి హేతువు, సుఖదుఃఖాలను అనుభవించేది పురుషుడు. 
"గుణాలపట్ల ఆసక్తి, ఆత్మకు తదుపరి పయనాన్ని నిర్దేశిస్తుంది",
పరమాత్మసంకల్ప ఆవిష్కారమే ప్రకృతినియమం. 
"హారానికి దారం వలె, సమస్త జగతికి పరమాత్మయే ఆధారం." 
పరమాత్మ ప్రేరిత సత్త్వరజస్తమో గుణాల ప్రభావం వల్ల జగమంతా భ్రమ చెంది, పరమాత్మను గుర్తించ లేకున్నది, 
ఈ త్రిగుణాత్మక మాయను అధిగమించడానికి పరమాత్మయే ఆశ్రయం, "భగవత్ సంకల్పమే ప్రకృతి, పరమాత్మయే నియమం". 
జీవిత సంక్లిష్టత లన్నిటిలో నడిపించే శక్తి భగవంతుడే, బుద్ధిమంతుడు నియుక్త కర్మలాచరిస్తోనే, కర్మ విముక్తవైరాగ్యంలో ఉంటాడు, "వాంఛలను వదలి కర్మలు సాగాలి", 
సమస్తకర్మ లు జ్ఞానంలో నే పరిసమాప్తం ఔతాయి, కోరికల నుండి విముక్తు డ వైతె,కర్మవిముక్తుడవు, పాపరహితుడవు కాగలవు, జ్ఞానాగ్ని సకలకర్మలను భస్మాంచేస్తుంది, 
" కర్మలనుంకాడు, కర్మాఫలాలను వదిలిపెట్టు, ఫలాపేక్ష లేకుండా కర్మలు చెయ్యి, పిదికిత పట్టిన ఇసుక, వ్రేళ్ళ సందుల్లోంచి జారిపోయినట్టే కర్మత్యాగమనే నియమం, మనస్సును బలంగా కోరిక వైపుకు లాగుతుంది, 
ఉత్తములు చేసే పనులనే లోకం అనుసరిస్తుంది, దాన్నే ప్రమానీకరిస్తుంది, కామ,క్రోధ,లోభాలే నరకద్వారాలు, వాటిని విడిచిపెట్టు. .
*******@@@****** ఈ నా స్వీయరచ న అముద్రిత0.
32
[03/08, 9:59 PM] విజయ లక్ష్మి యాదాద్రి: *గీతా పఠనం*

సకల సత్గ్రందాల సారం *గీత*
సకల శాస్త్రాల ప్రయోగఫలం
మానవుల తలరాతను మార్చే గీత
ఔత్సాహికులకు స్ఫూర్తి మంత్ర

దైవం నిజాయితీపరులకిచ్చిన భరోసాలపర్వం
ఓటమివేళల ఓదార్పునిచ్చు నైతికబలం
దుఃఖించేవేళల కన్నీటిని తుడిచే స్నేహహస్తం
విడువని నేస్తం పరమాత్మ 'అనిచాటే విశ్వదర్శనం

జగద్గురువు సృష్టించిన
మనోవిశ్లేషణగ్రంధం
మానసిక చికిత్సాశాస్త్రానికి ఆధారం
కర్మ*ను అనుభవించమనేది కాదు లక్ష్యం
ధర్మాన్ని నెరవేర్చమనేదే మార్గదర్శి కర్తవ్యం

పాపభీతిని పెంచే పరమ ఉత్కృష్టకార్యం
పుణ్యచరితుల పెంచే ఆదర్శశిక్షణాలయం
అపూర్వ అమూల్య సాహితీసుగందభరితం
మధురాతిమధుర పరిమళ కృష్ణప్రవచనాగీతం

కర్తవ్యం మన వంతు 'అని ప్రవచించే ప్రేరణo
భగవంతుడు మంచిని గెలిపిస్తాడనే ధైర్యం
జననమరణ పాపపుణ్యాల చిక్కుముడివిశ్లేషణ
అంతుచిక్కని తత్వవిచారణకు అధ్బుతశ్లోకరూపం

*గీతా పఠనం* ఉత్తమాభిరుచికి నిర్వచనం
గీతాశ్రవణం విషాదసమయానికో వృద్ధాప్యానికో
పరిమితం కావడం దురదృష్టకరం
*గీతాపఠనం* అన్నివేళల నడిపించే అదృష్యహస్తం

హమీపత్రం. ఇది నా సొంత రచన

:వల్లాల విజయలక్ష్మి
ఆలేరు
*************************
[06/08, 2:15 PM] Veera Gudipally: కవితా గానం సమూహం హైదరాబాద్
Google forms ద్వారా వచ్చినవి
18 responses
Accepting responses
17
of
18
Responses cannot be edited
కవితా గానం సమూహం హైదరాబాద్
శ్రావణమాసం పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీ . అంశం ః భగవద్గీత లేదా గీతా పఠనం 03/08/2020
*

33
కాణిపాకం
District *
చిత్తూరు జిల్లా
కవిత
కవితా గానం
శ్రావణ పౌర్ణమి కవితల పోటీ
పేరు:నారాయణ భాగ్యలక్ష్మి
4.8.2020 అంశం: భగవద్గీత
కవితా శీర్షిక: ముక్తికి మార్గం గీతా సారం
----------------------------------------------------
జగతికి విజ్ఞాన సూచిక
సన్మార్గానికి ఆగమ కర దీపిక
దర్మం గాడి తప్పి
అదర్మం హెచ్చునప్పుడు
సంభవామి యుగే యంటు
వర్ణలకందని రీతిగా
అనన్య సామాన్య గతుల
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ
కర్తవ్య పాలనకై పుడమిపై
అవతరించిన యుగ పురుషుడు
అన్యధా నాస్తి శరణమనుచు
నిర్చల భక్తి తత్పరిత మనస్సులై
పుషం పత్రం పలం తోయం మినహా
అంబరాన్నంటే సంబరాల కతీతంగా నిరాడంబర నిర్మల చిత్తులై
నేను నాది నా వాళ్లనే భ్రమను వీడి తామరాకుపై నీటి బిందువు తీరుగా
సదా కర్మలను ఆచరిస్తు
భారం పలితం భగవంతునికి వదలి
నిష్కామ కర్మంలాచరించడమే
ముక్తికి మార్గం అదే భగవద్గీత సారం.
Submitted 8/4/20, 3:45 PM

.34
[06/08, 2:15 PM] Veera Gudipally: కవితా గానం
శ్రావణమాసం పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీ . అంశం ః భగవద్గీత లేదా గీతా పఠనం 03/08/2020
* Required
Name of the poet *
Pola kishore kumar
Gender *
Male
Female
Town *
New bowenpally
District *
Secundrabad-11
కవిత
సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్ముడు భోదించాడు కావున శ్రీమధ్భగవద్గీత అని అంటారు
భగవద్గీత ఉపనిషత్తుల సారమని గీతాపఠనం
కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని
హిందువుల నమ్మకం. కర్మయెాగం,భక్తియెాగం,
ఙ్ఞానయెాగం అనే మూడు జీవనమార్గాలు
భగవంతుని తత్వము,ఆత్మస్వరూపం ఇందులోని ముఖ్యమైన అంశాలు.
భగవద్గీతకు హిందూమతంలో విశిష్టమైన స్థానం కలదు గీత సమస్త మానవాళికి ఆచరణీయమైనది మరియు పూజనీయమైనది
శ్రీ కృష్ణ పరమాత్ముడు మహాభారత యుద్ధ సమయంలో అచేతనంగా ఉన్న అర్జునుడికి
కర్తవ్యాన్ని బోదించినదే భగవద్గీత
ప్రతి వ్యక్తి గీతను శ్రవణ, పాఠన, మనన ,
ధారణాదుల ద్వారా గ్రహించి ఆచరించినచొీ
వారి జీవితం ధన్యమగును
ఒక గ్రంథానికి జయంతి జరపడంలొీనే ఉంది గీత గొపపతనం అందుకే భగవద్గీత మనందరికి గీతామృతం
కృష్ణం వందే జగద్గురుం
Submitted 8/4/20, 5:32 PM

Google forms ద్వారా 18members sent poems
But only 2 new entries
________________________________
.1.శివునూరి లలితా కృష్ణ
2.సుంకర శ్రీలత గారు
3.జల్లిపల్లి బ్రహ్మం గారు
4.గంజాం భ్రమరాంబ గారు
5.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు (2)
6.సత్యనీలిమ గారు
7.ముడుంబ తిరు వేంకటాచార్యులు గారు
8.ధనాశి ఉషారాణి గారు
9.కందూరి సుజాతా రాణి గారు (3)
10.రమాదేవి కులకర్ణి గారు
11.వురిమళ్ళ సునంద గారు
12.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
13.గుండ్ల రాజు గారు
14.నారాయణ భాగ్యలక్ష్మి గారు
15.పోలా కిషోర్ కుమార్ గారు
****
Total 18 entries
********
సమీక్షలు
*********
1
:
1.డాక్టర్. రామకకృష్ణ మూర్తి గారు

*గీత సుగీత వలె* కర్తవ్యాన్ని ఉపదేశిస్తుంది.
ఆత్మ ధర్మాన్ని దర్శింపజేసి ఆత్మ సాక్షాత్కారజ్ఞానాన్ని అందిస్తుంది, చేయి పట్టి జ్ఞానపథాన్ని చూపిస్తుంది అనే భావనల ద్వారా డాక్టర్. రామకకృష్ణమూర్తి గారు *గీతఔన్నత్యాన్ని* ప్రకటించిన తీరు బాగుంది.
2
:
 2.డాక్టర్. మహమ్మద్ షరీఫ్ గారు

గీతామృతపానం జీవనమార్గగతిని మారుస్తుందని, మనసందేహాలను గీత నివారిస్తుందని, *చావుపుట్టుకల గుట్టు గీత వివరించిందని,* మానవ కర్మల మూలాలను తెల్పిన *భగవద్గీతకు అంజలి ఘటించిన*
డాక్టర్. మహమ్మద్ షరీఫ్ గారి పద్యాలు *ఆలోచనామృతంగా* సాగాయి.

3
: 3.ఏ. భూపతి గారు

జీవనాన్ని లెక్కించగల వ్యక్తిత్వ వికాసం భగవద్గీత అనీ, *ఉగ్గుపాలతో  పాటు జీవనవిధానం నేర్పిన *అమృతభాoడం గీత* అనీ, పాపాగ్ని నుండి విముక్తిని ఇచ్చేది గీత ఒక్కటే ననీ చాటి చెప్పిన *భూపతి గారి కవితారీతి బాగుంది*
4
:
4. డాక్టర్. పాండాల మహేశ్వర్ గారు

గీతార్థసారాన్ని సతతము మననం చేసేవారు *గీతలోని భావజాలాన్ని* *ఒడిసి పట్టిన వారు*
 ఆత్మ దర్శనం చేసిన వారు, కర్మ పాశాలకు పట్టుబడరు అనీ *భరతభవ్య గీత విశ్వశ్రేయస్సును* అందించింది.
5

5.పాల్వంచ. హరికిషన్ గారు

*కృష్ణుని సంబోధనలతో ప్రారంభించి, కృష్ణ లీలలను వర్ణించి,*
 చివరికి కృష్ణుడిని జగద్గురువు గా మార్చిన *హరికిషన్ గారి *కవితా రీతి  కృష్ణ తత్వాన్ని* ప్రతిబింబించింది.
6

 6.సత్యనీలిమగారు

*రక్తపాతంజరగాల్సిన చోట గీతా గానం పుట్టిందనీ,*
గీత విచారణ కష్టాలను తొలగిస్తుందనీ *గీతా సత్యాన్ని దర్శింపజేశారు*
సత్య నీలిమ గారు
7

7.కోరాడ. నరసింహారావు గారు

నరజాతికి కరదీపిక గీతఅనీ, *గీతాచార్యునికి జోతలిడి, నిష్కామ కర్మ ఉత్తమ మార్గమనీ* గీతను ఆచరించడమే పరమ ధర్మమనీ *అత్యున్నతభావాలు వెలువరించారు* కోరాడ నరసింహారావు గారు
8
[
: 8.స్వర్ణ. సమత గారు

*తామరాకుపై నీటి బిందువు లా* సంసారం లో*ఉంటూనే దైవంపై చిత్తం నిలపాలని అదే గొప్ప యోగమనీ, కర్తవ్యం మరువకుండా కర్మ చేస్తూ *ఫలాపేక్ష వదిలితే అదే కైవల్య మనీ* స్వర్ణ సమత గారు విశ్లేషిoచారు.
9
: 9.కంచి. రవికుమార్ గారు

గీత మనో విజ్ఞాన శాస్త్రమనీ,
*గీత నిత్యస్ఫూర్తి దాయక నినాదమనీ,*
స్థితప్రజ్ఞ లక్షణం గీతా మార్గంలో ఉందని రవికుమార్ గారు *ఆధునిక కోణంలో ఆవిష్కరించిన తీరు* బాగుంది.
10
: 10.వురిమళ్ళ. సునంద గారు

దైవం స్వయంగా *కర్తవ్యబోధ చేసిన* *సన్నివేశం గీత అనీ,* విశ్వరూపంలో విశ్వ   తత్త్వా న్ని గీత దర్శింపజేసిందనీ,
*ఆత్మ నాత్మ వివేకం అందించేది గీత అనీ* సర్వోత్తమ విశ్వగ్రంథం గీత అనీ,
గాంధీ, వివేకానందుల నాలుకలపై నర్తిoచేది గీత అనీ *సునంద గారు *గీతా తత్త్వాన్ని వివేచించారు.*
11
: 11.సుంకర శ్రీలత గారు

గీతాశ్రవణం గంగాప్రవాహమనీ, ఆది *విషాద గీతం కాదని,* *విశ్వానికి దిశా నిర్దేశం* చేసే సాధనమనీ *
*శ్రీలత గారు *భావించిన తీరు ఆలోచనాత్మకంగా* ఉంది.

12.
Y. K సంధ్యాశర్మ గారు

అగాధాలను నిర్మూలించే నిష్కల్మష గ్రంథం గీత అనీ, *కురుక్షేత్రంలో పుట్టిన రసవాహిని గీత అనీ, ఆత్మస్థైర్యానికి అంకురం గీత అనీ*
 సకల వేదసారమని, నిత్యస్మరణీయం గీత  అనీ సంధ్యా శర్మ గారు *ఆధునిక, ధార్మిక భావజాలసమ్మిళితమైన* విశ్లేషణనందించిన తీరు చాలా బాగుంది

13.
మర్రి జయశ్రీ గారు

 అయోమయ స్థితిలో *కాంతిపుంజం గీత అని,* సందేహాలు ఆశాకిరణ ప్రసారం గీతా ప్రబోధం అని,  *మనిషిని కార్యోన్ముఖునిగా చేసే  మహిమాన్విత సూత్రం* గీతాశాస్త్రమని
*జయశ్రీ గారు *అభివర్ణించిన తీరు ప్రశంసాపాత్రము.*

💐

14.గంజాం భ్రమరాంబ గారు

 *సర్వోత్కృష్ట గ్రంథం* భగవద్గీత అని
వస్తుప్రపంచాన్ని దాటించే
 కర్తవ్య మార్గం గీత అని,
 *నిత్య కురుక్షేత్రం నుండి ధార్మిక క్షేత్రానికి మళ్లించే* *మార్గం* గీత అనీ  *భ్రమరాంబ గారు వర్ణించిన తీరు బాగుంది*

15.అభిరామ్ గారు

మానసిక విశ్లేషణా  సాధనం గీత అని ఆధునిక జీవన *సమస్యలసమాహారానికి  పరిష్కార పూలహారం గీత అనీ*,   టెక్నాలజీకి మూలం గీత అని,
మనో గాయాలకు ఔషధమని అజ్ఞానానికి వడపోత గీత అని *సనాతన భావాలకు *ఆధునికత అద్దిన అభిరామ్ గారి కవిత గీతకు వ్యాఖ్యానంలా* ఉంది.

16.
తిరుమల తిరుపతి రావు గారు

  ఎవరి కర్తవ్యం వారికి బోధించి ఫలితాన్ని ఇచ్చే ప్రబోధం గీత అనీ,   *అజ్ఞానాన్ని తొలగించి జన్మకు సార్థకతను* అందించి ముందుకు నడిపే *శంఖనాదమే గీత* అని తిరుపతి రావు గారు చెప్పిన తీరు గీతకు దర్పణం
💐



17.అపరాజిత్ గారు

 జీవిత పాఠం అనే కవితలో అపరాజిత్ గారు  *యువతలో చైతన్యాన్ని నింపే మాటలు చెప్పారు*. నిరాశ వదిలి ఆశాభావంతో జీవించ మంటారు  *విసిరిన రాళ్ళను ఒడిసిపట్టి విజయహర్మ్యం  నిర్మించుకోమని*  దైవవిశ్వాసం వదల వద్దని చెప్పిన కవిత *ఆత్మ విశ్వాసానికి ప్రతీక.

18

: 18.ధనాషి ఉషారాణి గారు

 కళ్ళకు కప్పిన మాయ పొరలు గీత తొలగిస్తుందని,
 *గీత ముక్తి ప్రదాత అని జగతికి జాగృత మంత్రము గీత అని* మణిరత్నము  వలె  ప్రకాశించే గీత మానవజాతికి జ్ఞానదీపమని 
*ఉషా రాణి గారు చెప్పిన తీరు హృద్యం.*
19
: 19.
*డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు*

కృష్ణార్జునులు ఇద్దరు గీతలో ప్రధాన పాత్రలుగా చేసి *ధైర్యాన్ని, కర్మను,  ఫలితాన్ని చైతన్యవంతంగా ఆచరించడమే*
 దైవ మార్గం ఉత్తమమని *బల్లూరి  ఉమాదేవి గారు చెప్పిన విధం బాగుంది*

: 20
.జల్లిపల్లి బ్రహ్మంగారు

 *అంతర్మథనంలో నలిగే నరుని స్థితికి* *నారాయణుడు తోడై* గీతా మార్గం చూపించాడని,
దీనస్థితి పొందక *ఆశావహుడై*
దైవ సహాయంతో
ధర్మ మార్గంలో నడిచిన జీవునికి జయం అని ప్రబోధించిన
*బ్రహ్మం గారి కవిత కురుక్షేత్ర పతాక*
21
[: 21.సతీష్ కుమార్ గారు

 ఫలితం పట్ల ఆసక్తి లేక *భగవదర్పణ బుద్ధి నేర్పేది* గీత  అని, మనో నిర్మలత ఇచ్చేది గీత అని,  మనస్సుకు అజ్ఞానం కమ్మితే నిర్మూలించేది గీత అని,  *దివ్య జ్ఞాన దాత గీత అనీ*  *కృష్ణభగవానుని దూత గీత అని *సతీష్ కుమార్ గారు అభివర్ణించిన తీరు బాగుంది*
22
[: 22.చివుకుల. శ్రీలక్ష్మిగారు

 గీతా పఠనం కాదు
 గీత ఆచరణ యజ్ఞమని,   *కర్తవ్యోన్ముఖులను చేసేది  గీత అని,* మత గ్రంథం కాదు వికాస శాస్త్రమని ఎందరో మహనీయులకు దిక్సూచి అని గీతను  గురించి
*శ్రీలక్ష్మి గారు వెలువరించిన కవిత అక్షరసత్యమే.*

23
.రాజశేఖరుని శివలక్ష్మి గారు

   గీత యోగ భాష్యమని,  మానవ గమ్యసాధనా యోగం గీత అని,  *నిష్కామ కర్మ కు ఆత్మజ్ఞాన మార్గానికి అనుసంధాన సిద్ధాంతమని*, పరమార్థపథనిర్దేశంమని,
 *జ్ఞాన కరవాలమనీ* *వర్ణించిన శ్రీ శివ లక్ష్మి గారి రచన ప్రశంసాపాత్రం*.

: 24.ఏలే.  శ్రీహరిగారు

 భారతీయ తత్వజ్ఞాన పరిమళం  గీత అని
*భక్తి,  జ్ఞాన, కర్మ యోగాల సంగమం గీత అని,*
గీత తాత్విక జీవన గీతిక అని *శంకరుల,  రామకృష్ణుల,  వివేకానందుల బోధల మూలం గీత అని,  *శోధన చేసి శ్రీహరి గారి కవిత రమ్యంగా ఉంది*

: 25.అయిత అనిత గారు

 కృష్ణుని జిహ్వ  నుండి జారిన ప్రవచనా గీతం గీత అని,
*మాయను తొలగించే  తేజోమయూఖం గీత అని,*
 ఉత్తమ జీవనానికి నాందీ  వాచకం గీత అని,  *తనను తాను తెలుసుకునే దర్పణం గీత అని,  జీవన పాఠం, వేదాల సారం గీత అని అనిత గారు సుందరంగా వర్ణించే కవితలో*

: 26.
రమాదేవి కులకర్ణి గారు

 *ధనం కన్నా మానసిక ఔన్నత్యం మిన్న అని విశ్వజన కరదీపిక గీత అని* సమస్యలకు సమాధాన గీత అని,
 *సర్వ జనాళికి గీత జ్ఞాన మార్గదర్శిని*
అని రమాదేవి గారు గీత యొక్క శ్రేష్ఠతను కవితలో చూపించారు

: 27.కందూరి సుజాత రాణి గారు

*జ్ఞాన శంఖారావము*
గీత అని భగవద్గీత
ఆత్మ సౌందర్యాన్ని ఆర్జింప జేయు *జ్ఞాన దీపిక అని తమ కవితలో* *సుజాతారాణి* గారు*
*గీతా  రహస్యాలను*  *చూపించారు*.
: 28.
గుండ్ల రాజుగారు

 *పరమాత్ముని దివ్య వాణి గీత అని,*
సృష్టి రహస్యాలను అంతరంగానికి అందించే మకరందం గీత అని *జీవనమార్గ ప్రదాయిని గీత  అని రాజు గారు తమ కవితలో విశదపరిచారు*.

: 29.M.T స్వర్ణలత గారు

 భక్తి జ్ఞాన కర్మ యోగాల కలయిక  గీత అని,  *ఆలోచనల్లో పరిపక్వత కలిగించేది గీత అని, *అనన్య భక్తికి  ఆత్మ జ్ఞానాన్ని అందించే సాధనం గీత అనీ*
స్వర్ణ లతగారు తమ కవితలో భావించిన తీరు భక్తి మయం.
30
: 30.ఇంద్రవత్  రాహుల్ గారు

సంస్కార గంగను  అందించే పునీత గీత అని,  మనుగడకు తోడ్పడే దిక్సూచి గీత అని అజ్ఞానతెర తొలగించి
*సత్య దర్శనం చేయించేది గీత అనీ,  రాహుల్ గారు తమ కవితలో*
*దర్శింపజేశారు.*
31
31.తిరువేంకటాచార్యులు గారు

లోకం క్షేత్రం,
లోకేశుడు  క్షేత్రజ్ఞుడు అని *హారంలో దారంలా* పరమాత్మ జగతికి  ఆధారభూతుడు అని *గీతా   తత్త్వా న్ని తన* *కవిత్వం నిండా *చూపించారు*
*తిరు వేంకటాచార్యులు* గారు.*
32

32.వల్లాల విజయలక్ష్మి గారు

శాస్త్రాల ప్రయోగఫలం *స్ఫూర్తి మంత్రం గీత అని*,  విశ్వదర్శనం గీత అని,  నిరంతరం మార్గదర్శి గీత  గీత అని,
*మాధవ ప్రవచనాగీతం గీత అనీ  సార్వకాలిక* *మార్గదర్శిని గీత అనీ  విజయలక్ష్మి గారు తమ*కవితలో*  *వివేచన* *చేశారు.*



Comments

  1. ప్రతీ కవిత చదావాల్సిందే. ఒకో కవితలో ఒక స్పార్క్ ఉన్నది.అందరికీ అభినందనలు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...