నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ (వెన్నెల శిల్పం సృష్టి కర్త)
******************
కవివరుల జాబితా
1.శ్రీ కోరాడ నరసింహారావు గారు
2.శ్రీయుత డాక్టర్ సి హెచ్ ఆంజనేయులు గారు
3.గుమ్మన్న గారి బాల సరస్వతి గారు
4.డా.దీపక్ న్యాతి గారు
5.వల్లాల విజయ లక్ష్మి గారు
6.మన్నె పిన్నక లలిత గారు
7.సునంద వురిమళ్ళ గారు
8.మర్రి జయశ్రీ గారు
9. సి.హెచ్ విజయ లక్ష్మి గారు
10.డా.బల్లూరి ఉమాదేవి గారు
************
1
[16/02, 8:15 PM] Korada: కవితాగానం
అంశం :- అంతరంగం
కోరాడ నరసింహా రావు....!
* ఆత్మసుద్ది *
********
అంతరంగంలో...ఆలోచనలు
యే రకమైన అలజడులు...
సృష్టిస్తూన్నా...విచక్షణను కో ల్పోక... ఈర్ష్యయే కలిగినా...
ద్వేషమే రగిలినా... క్రోధం రేచ్చ
గోడుతున్నా...,సభ్యతను గుర్తే రిగి...సయ్యమన0తో...సాంఘిక జీవనానికి అంతరాయాల నేర్పడనీక... సంబంధాలు చేడనీక... ప్రవర్తిల్ల గలవారే...
వివేకవంతులోయి....!
రాగ-ద్వేషాలను జయించిన వారికి యిదంతా... ఈత నేర్చిన వారు... నదిలో విహరించి నట్టే....!!
సాధన తో... అంతరంగాన్ని
శుద్ది గావిఁచు కున్న వారు...
స్వచ్ఛమైన మేలి ముత్యమై...
మఛలేని వజ్రంలా ప్రకాసిస్తా రోయి....!!
వీరేపుడూ...మదిలో తలచిందే
బయటికి చేబుతారు... యేమి చేప్పారో... అదే చేస్తారు...!
వీరిమదిలో యేట్టి అలజడు లకూ...ఆందోలనలకూ...
ఆస్కారమే ఉండదు...!
అశాంతికి తావే లేదు...!!
ప్రశాంతంగా నిత్యానంద స్వరూపులై భాసిస్తారు...!!
అంతరంగ నైర్మల్య0 లేని
జీవితంలో సహజత్వం శూన్యం
బతుకంతా... తప్పనిసరి నటనే
ఐపోతుందోయి...!
నిజ నిర్మలానందానికిక తావేక్కడ....!?
అందుకే... అంతరంగంలో...
యేట్టి మాలిన్యాలనూ చేర నీక
సుద్దమ్గా...ఉంచుకో వోయీ...!!
*******************
......కోరాడ.
2
[16/02, 8:17 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: అంతరంగం
అంతు లేని సముద్రం అంతరంగం
దాని లోతు కొలవడం ఎవరికీ తెలియదు
సముద్రమంతా గంభీరమైనది అంతరంగం
ఎన్నో రహస్యాల నిధి
అంతరంగంలో
అద్భుతమైన ఆలోచనలు నిక్షిప్తమైపోయాయి
ఆనంద విషాదాల పేటిక అది అన్నిటికీ అది ప్రేరణ
మనిషి ఇ అంతరంగంలో ఎన్నో దాచుకున్నాడు
అంతరంగం ప్రేరేపిస్తే ఎన్నో కార్యక్రమాల సమూహాన్ని చేస్తూ ఉంటాడు
అంతరంగం ప్రేరణ శక్తి
ఏ మనస్తత్వవేత్త కు దొరికి దొరకని నాడీ అంతరంగం
ప్రపంచంలోని అద్భుతాలను దాచుకుని దృశ్యాలు ఎన్నో ఉంటాయి
అంతరంగం అంటే మర్చిపోలేని మెమరీ సెంటర్
అంతరంగంలో చిత్రాలు
కలకాలం నిలిచే ఉంటాయి
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 77025374553
3
శీర్షిక: అంతరంగం..
***********
(గేయ కవిత)
*గుమ్మన్నగారి బాలసరస్వతి సిద్దిపేట*
ఎందుకనో ఇట వెతికెదవు..
దొరుకకనే వేసారెదవు..
బాహిరమందున దొరకని దానిని --వెతుకనేల.. వేసారగనేల.. ??
1. దేవాలయమును చేరెదవూ..
దేవతలకు కై మోడ్చెదవు..
వెతికిన దొరకని విషయముకై.. పలు.. మారులు మఱిమఱి కోరెదవు..
బాహిరమందున దొరకని దానిని అడుగుతు నిష్ఠుర పడనేలా...
2. కొండా కోనలు తిరిగెదవు..
చెట్లూ చేమలు తడిమెదవు
తిరిగి తడిమినా అగుపడలేదని
దిగులుపడుతు నువు వగచేవు...
బాహిరమందున దొరకని దానికి తిరుగుతు తిప్పలు పడనేలా..
3.అంతర్నేత్రము తెరిచి చూడు.. నీకవసరమైనది అగుపడదా..
హృదయ తీరమును తరచి చూడు.. నీ కవగతమైనది సరిపడదా..
అంతరంగమే పాలసంద్రమై, శాంత మంద్రమై వినపడదా.
4.
[16/02, 8:40 PM] దీపక్ న్యాతి: *కవితా గానం*
పేరు : డా.దీపక్ న్యాతి
తేది : 16-02-2021
అంశం : అంతరంగం
శీర్షిక : అహము ఆహారము పరము
అంతరంగం మేలైన అద్దం లాంటిది
విచక్షణ గుర్తుచేసే శాశ్వత నేస్తము
నీ మంచిని కోరే నీ శ్రేయోభిలాషి
దివిటీ తో దారి చూపే దిక్సూచి
కర్తవ్య బోధన చేసే గురువు
సత్కర్మల మార్గం చూపే మార్గదర్శి
కీర్తి సంపదల నందించగల భాగ్యము
నిత్యం దర్శించవలసిన దైవం
చరిత్రను నెమరు వేసే సహచరి
భవితను సాక్షాత్కరింపజేసే దూరదర్శిని
ఎన్నటికీ విడనాడని నీ నీడ
గౌరవిస్తే జీవిత గీటు రాయి అవుతుంది
కోరితే కనురెప్పల కాపలా కాస్తుంది
ఆహ్వానిస్తే ఆహార్యం అవుతుంది
స్వీకరిస్తే మస్తిష్క మకుట మౌతుంది
అనుసరిస్తే అన్వేషి ని చేస్తోంది
అధికారమిస్తే తీర్చిదిద్దే శిల్పి అవుతుంది
నువ్వని అది అని వేరు వేరు కాదు
నువ్వే అది అదే నువ్వు
నేను అనే నీ అంతరమే అంతరంగం
డా.దీపక్ న్యాతి
హైదరాబాద్
5
[16/02, 8:41 PM] విజయ లక్ష్మి యాదాద్రి: కవితశీర్షిక:*అంతరంగస్పందన**
----------********************---
ఆలోచనా బీజాలను
పత్ర క్షేత్రాల్లోన కలమను
చిన్నిహలం సాయంతో వేయటం
కవితాలతలను పెంచటం
కవనవిరుల సుమింప చేయటం
'భావఫలాల'ను పండించటం
ఆ సుమధుర *పరిమళాల* ఆస్వాదనం
కొందరు అక్షరాస్యుల అదృష్టం
*అంతరంగపు స్పందన**ను
మాటల్లో వ్యక్తపరిచే కన్న
అందంగా అక్షరీకరించుటే మిన్న
*అర్థవంత పదనిధులే కోట్ల కన్న మిన్న*
అనుక్షణం ఎదలో మెదిలేస్పందన
అద్భుతమైన అక్షరాలైన వేళ
పర్వదినమే భావకవి హృదయానికి
అక్షరాలు నేర్పటమూ సార్థకమే జీవితానికి
మన అంతరంగాన మానవత్వం
మన పదాల్లో నూతనత్వం ఉన్న
నిలుచును కదా మన అక్షరాలు
పరిమళభరిత పారిజాతసుమాలై
శాశ్వత పరిమళం విద్యాసుమాలది
పేదల తొలితరం పిల్లలు దిద్దేఅక్షరాలు
వాళ్ళజీవితాల్లో శిలాక్షరాలై నిలుచు
అక్షయపాత్రలై తర్వాతి తరాల కాచు
నేనుసైతం విద్యాగoధాలు అద్దుతున్నా
విద్యాదాతనై మనస్ఫూర్తిగ మురుస్తున్న
చదువులమ్మ తల్లిఒడిలో జీవిస్తున్నా
పిల్లలతో చేరి అనంతంగ హశిస్తున్నా
వల్లాల విజయలక్ష్మి
ఆ లే రు
లోననె దాగిన ప్రశాంత వీటికి
వెతుకనేల.. వేసారగనేలా... ?
6
కవితాగానం
తేదీ 16/ 2 /21
అంశం: అంతరంగం
శీర్షిక :అహం వదిలి...
ఆలోచనల అంతరంగం
సాలెగూడు
ఆచితూచి అడుగు వేసి
అల్లకల్లోల మనో సాగరాన్ని
కడకంటా ఈది, ఆనంద
ఆణిముత్యాలు తెచ్చి అందరికీ పంచాలి
అంతరంగ అద్దాన్ని మరకలు లేకుండా చేసి
స్వచ్ఛమైన సమాజం కోసం పాటుపడి
మానవత్వంతో ముందుకెళ్లాలి
అంతరంగ వృక్షాన్ని
దయావటవృక్షం చేస్తే
సమాజం సుభిక్షం మవుతుంది
ఇంటి శుద్ధిలా అంతరంగ శుద్ధి
నిరంతరం చేయి.
7
*కవితా గానం*
తేదీ:16-02-2921
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: అంతరంగం
*******************
ప్రతి క్షణం ఎగిసిపడే ఆలోచనల అలల సంద్రం
అంతుపట్టని భావోద్వేగ స్పందనల బడబానలాలను దాచుకున్న అనంత సాగరం!
నురగల చిరునవ్వులను పెదాలపై అతికించుకుని
పడుతూ లేస్తూ తీరం చేరేందుకు తపించే కోరికలతో
ఘోషించే అంతరంగమొక
మహా సంద్రం!
చెలియలి కట్ట దాటిన ఆశలతో
పర్వవేళా తరంగమై పరవశమై మురిసే పయోనిధి..
ప్రేమాభిమానాలు అనురాగం ఆత్మీయతలను
గుండెల్లో దాచుకుని గుంభనంగా దాచుకునే జలనిధి!
*కవితా గానం*
తేదీ:16-02-2921
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: అంతరంగం
*******************
ప్రతి క్షణం ఎగిసిపడే ఆలోచనల అలల సంద్రం
అంతుపట్టని భావోద్వేగ స్పందనల బడబానలాలను దాచుకున్న అనంత సాగరం!
నురగల చిరునవ్వులను పెదాలపై అతికించుకుని
పడుతూ లేస్తూ తీరం చేరేందుకు తపించే కోరికలతో
ఘోషించే అంతరంగమొక
మహా సంద్రం!
చెలియలి కట్ట దాటిన ఆశలతో
పర్వవేళా తరంగమై పరవశమై మురిసే పయోనిధి!
8
కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..అంతరంగం
శీర్షిక..ప్రేరణ శక్తి
ఆలోచనలకు కేంద్రం
కొలవలేని అగాధం
అంతే దొరకని మహా సంద్రం
కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ
మనిషిని ముందుకు నడిపించే అద్భుత శక్తి
మంచి చెడుల వైరుధ్యం తెలిపే మిత్రుడు
ఎన్నో చెప్పలేని దృశ్యాలు నిక్షిప్తమైన రహస్య గని
భావోద్వేగాలను అదుపు చేస్తూ
వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ప్రేరణ శక్తి
సమస్యల సుడిగుండంలో చిక్కినా
ధైర్యం నూరిపోసే అంతరంగం
మనసు శరీరాల మధ్య వారధి
అనర్థాలు కలిగించే
స్వార్ధపు ముళ్ళు గుచ్చుతున్నా
ఆవేదనతో తల్లడిల్లితూ సున్నితమైన తన కవచాన్ని
దృఢంగా మలచుకొంటూ
మానవత పరిమళం వేదజల్లుతూ
ఉన్నతమైన వ్యక్తిగా నిలుపుతుంది
9
కవితా గానం
తేది :16-02-2021
చెన్నా విజయలక్ష్మి, బీర్కూర్
అంశం :అంతరంగం
శీర్షిక :అంతా తానే
****************************
వ్యక్తి నడవడికకు దర్పణం
మంచి చెడుల మథన వేదిక
నిరంతరసంఘర్షణల సమాహారం
నిర్ణయాల కిస్తుంది చేయూత
అనుభవాల ను రంగరించి
పాఠాలను నేర్పుతుంది
నిత్యం నీతోనే ఉంటూ నీలోనే ఉంటూ
ఆలోచనలకు పుటం పట్టి వ్యక్తి వికాసానికి బాటలు వేస్తుంది
మంచి బాటనడిపించే మార్గదర్శి తానే
అగాధంలో పడద్రోసే మూర్ఖత్వం తానే
నీ ప్రగతికి మురిసే బంధం తానే
నీ ఓటమిలో తోడై నిలిచే అనుబంధం తానే
నిన్ను అందలం ఎక్కించే నిచ్చెన తానే
పాతాళానికి త్రోసే జారుడు మెట్లు తానే
ప్రేమ, ఆప్యాయతలకు నిలయం తానే
ఈర్ష్యా అసూయలకు ఆజ్యం పోసేది తానే
మంచికి ప్రాణం పోయాలన్నా చెడును జయించాలన్నా
ఆశావాదం పెంచాలన్నా నిరాశలను త్రుంచాలన్నా
ఆదర్శ వాదిగా చిరస్మరణీయుడై సమాజాన నిలవాలన్న
స్వార్ధపరుడై సమాజానికి చీడపురుగై చీత్కారాల పాలైనా
అంతరంగ ఉద్భోధనే కారణం కాదా !
సద్భుద్ధిని పెంచుకొని ఆచరిస్తే మానవుడే మహనీయుడు కాడా !
పూజనీయుడై ప్రఖ్యాతి పొందడా !
పుణ్య మూర్తియై సద్గతులు పొందడా !
జీవన సాఫల్య మహిమ చూడడా !
10
16/2/21
డా.బల్లూరి ఉమాదేవి
అంశం: అంతరంగం
మనిషి అందానికి కొలమానం ఏదంటే
రంగూ రూపమూ ఒడ్డూ పొడుగు అసలే కాదు
బాహ్య సౌందర్యం బుద్బుద ప్రాయం
అంతరంగ సౌందర్యమే అసలుసిసలు అందం
మేడిపండు లాగా పైపై మెరుపులకు భ్రమ పడితే
పురుగులు కే పరిమితం కాక తప్పదు
మాలిన్యం లేని అంతరంగం లో తొంగి చూసే నేర్పుంటే
బాహ్యసౌందర్యపు భ్రమలు తొలగడం ఖాయం
కడుపు నిండా కుళ్ళును దాచి పెట్టే
మోముపై నవ్వు పులుముకొని
గొంతువరకు విషం నింపుకొని
నాలుకకు తేనె పూసే వారి కన్నా
హంగూ ఆర్భాటాలు లేని అంతరంగం
స్వచ్ఛమైన గంగాజలం మని గుర్తించు
కురూపులంటూ నిరసించక
ఆంతస్సౌందర్యాన్నారాధించు
అద్దంలాంటి స్వచ్ఛత నభినందించు.

Comments
Post a Comment