Skip to main content

మ్రోగిన బడి గంట Feb 2021

 నిర్వహణ : శివునూరి లలితాకృష్ణ

*************

1.డి.ఉషారాణి గారు

2.కోరాడ గారు

3.దేవినేని అరవింద రాయుడు గారు

4. భరద్వాజ గారు

5.డా.సి.హెచ్. ఆంజనేయులు గారు

6.అపరాజిత్ గారు

7. కోమటి మత్స్యగిరి గారు

8.మన్నె పిన్నక లలిత గారు

9.సుధారాణి కృష్ణం రాజు గారు

10.పరాంకుశం రఘు నారాయణ గారు

11.కెసి నరసయ్య గారు

12.డా.బల్లూరి ఉమాదేవి గారు

13.శ్రీకాంత్ కడార్ల గారు

14.దీపక్ న్యాతి గారు

15.మర్రి జయశ్రీ గారు

16.సునంద వురిమిళ్ళ గారు

17.ఉదయశ్రీ ప్రభాకర్ గారు

18.సి.హెచ్.విజయ లక్ష్మి గారు బీర్కూర్

19.కొలచన విజయ భారతి గారు

20.విజయ లక్ష్మి విల్లాలు గారు


********

1

[02/02, 7:34 PM] Lalita Sister: ✳️✳️✳️✳️✳️✳️


కవితాగానం

02.02.2021


నేటి అంశం

మ్రోగిన బడిగంట 


ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు

అంశానికి కవితలతో

స్పందించగలరు.


ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందన లు తెల్ప కూడదు.


✳️✳️✳️✳️✳️✳️

1

[02/02, 8:04 PM] +91 70755 17538: శీర్షిక.మ్రోగినబడిగంట

................

ఆడిపాడే అల్లరి పిల్లల

అమ్మలోగిలి పాఠశాలకు

సుదీర్ఘ విరామం చెప్పి

కరోనా కల్లోలములో

దూరమైన చదువులకు

నేడు కొత్త ఆశలు తోడిగి

ఆన్లైన్ మయాజాలములో చిక్కి

చితికిపోయిన  స్వచ్ఛమైన ప్రేమలకు జీవము పోస్తూ

కోటి ఆశల ఆట పాటల్లో

అలా మునిగిపోవడము కోసము

మ్రోగింది బడిగంట 

బతుకులకు

రాచబాటను వేస్తూనే

కులమత బేధాలు లేని

రంగుల ప్రపంచములోకి చేరింది

పసిడి నవ్వుల ప్రపంచము


డి.ఉషారాణి

చిత్తూరు జిల్లా

2


[02/02, 8:07 PM] Korada: కవితా గానం

అంశం:- * మ్రోగిన బడి గంట *

   కోరాడ  నరసింహా రావు...!

"ఆసీర్వచణము లందించే...!"

*************************

మూగబోయిన బదిగంట....

పిల్లల పాలిట గుడి గన్టై....

గణ-గణ మంటూ 

మ్రోగింది....!

వాడిపోయిన బడి తోట....

నూతన చివురు తో మోగ్గ

తోడిగి...మరలా వికసించింది !

బుడి-బుడి అడుగులు....

వడి-వడి నడకలు...,

రంగు-రంగుల తో... రక-రకాల

బడి దుస్తుల్లో... ముఛట గోలిపే

బాల, బాలికలు...!

నూతనోత్సాహ ఉరుకు లతో

ఆనందపు మోమూల ఉపాధ్యాయులు...!

బడి ప్రాంగణమంతా... కల-కల

లాడుతు కళ కట్టింది...!

సారే జహాఁసే అచ్చ అంటూ...

మా తేలుగుతల్లికి.... మల్లేపూదండని..,వందే....

మాతరమంటూ... బారులు దీరీ,చేసే ప్రార్ధనలు... వేద ఘోష లా.... వినిపిస్తోంది....!!

ఆ చదువుల తల్లి... సరస్వతమ్మ ను కోలువగ

చేరిరి తరగతి గదులు...!

విల-విల లాడే మోములు

అన్నీ... కల-కల లాడుట

గాంచిన విద్యా దేవత....

పులకిత మనసుతో...

ఆసీర్వచణము లందించే!!

*********************

       .....కోరాడ.

3

[02/02, 8:12 PM] Aravinda Rayudu: *మోగింది బడిలోని గంట*



కుదుట బడ్డ

గుండె తేరుకుని

బడిగంటై

"గణగణ"మన్నది


కొంతవ్యవధి

కునుకుతీసిన కాలం

కళ్ళు నులుముకుంటోంది


స్తబ్ధతకుబుసాన్ని

విదిలించుకున్న

బతుకునడక

మొదటి అడుగు

మళ్ళోసారి వేసింది


మధ్యలో ఎదురైన 

బాల్యంతో

చెట్టపట్టాలేసుకున్న ప్రగతి

ముద్దు ముద్దుగా

తప్పటడుగులువేస్తోంది


ప్యూపాదశను 

సడలించుకున్న

పాఠశాల

రంగురంగుల యూనిఫారం

ధరించిమురిసిపోతోంది


■                                                        *అరవిందరాయుడు దేవినేని*

4

[02/02, 8:12 PM] భరద్వాజ గారు: 🚹కవితాగానం♈ 

అంశం- మ్రోగిన బడిగంట  --!

శీర్షిక-  -----సంబరపడినగంట  !

పేరు-భరద్వాజరావినూతల 

కొత్తపట్నం 

రచన-46

********************************

%%%%%%%%%%%%%%%%%

*****************************

మూగబోయిన బడి విజయశంఖారావం చేసింది -

సంవత్సరం అక్షరరాగాలుపలికనిఅమ్మవీణ ఆనందరాగాలుపాడింది -

పలకరించేదిక్కులేక తలవూపని చెట్లు ఆనంద వీచికలు వీచాయి -

రాసేవాడు లేక శిలగా మిగిలిన నల్లబల్లనవ్వుకుంది -

బీరువా పొరలలో దాగిన సుద్దముక్క ఉలిక్కిపడింది -

అచేతనమైన పాలక ఆవులింతలు వదలిపెట్టింది -

మాస్టారిగారిబెత్తం  వళ్ళు విరుచుకు నిలబడింది -

పుస్తకంపులకించింది -

వచ్చేవిద్యార్థులకు గోడలుసలా ము అన్నాయి -

పాఠశాల ప్రాంగణం బద్ధకం వదిలించుకుంది -

మూగబోయిన ఘంట గట్టిగామోగింది -

సెల్ లో పాఠాలువిన్న చెవులు మాస్టారిబోధలకు ఆత్రుతపడ్డాయి -

చదువులమ్మ సంబరపడింది -

అక్షరంమానందపడింది -

ముఖాలకు మాస్కులు -

శానిటైజెర్లు -

వీడనిదూరాలు ఇబ్బంది పెట్టినా 

పట్టించుకోలేదు పిల్లలు -

తాపత్రయపడ్డారు ఆడు కోవాలని ఆటలు -

ఇదినాస్వీయరచన

✍️భరద్వాజ రావినూతల ((RB)🖍️

కొత్తపట్నం 

9866203795

5

[02/02, 8:16 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: Mrogindi బడిలో మ్రోగింది బడి అది అక్షరాల యానికి నిలయం ఇన్నాళ్లుగా వాళ్లంతా ఇంట్లో బంధించబడ్డ జైలు పక్షులు


ఏవో పనులకు వెళ్లి ఆ బాలలు

మొఖము వాచి ఉన్నారు


ఇన్నాళ్లుగా ఏవో కూలిపనులకు వెళ్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉన్నారు

బడిలో గంట మ్రోగగానే ఏరు దాటి వాగులు దాటి కొండ కోనలు దాటి బస్సులు ఆటోలు ఆగమేఘాల మీద బడి ఏ గుడి వైపు సాగిపోతున్నారు

మాస్కులు ధరించి సాగిపోతున్నారు 


శానిటేషన్ చేసిన బాలలు పాఠశాలలకు సాగిపోతున్నారు పక్షుల సాగిపోతున్నారు

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453

6

[02/02, 8:18 PM] Aparajith: విద్యాసంవత్సరం 


కరోనా కబంధ హస్తాల్లో 

కారుచీకట్లు కమ్ముకున్న విద్యావిధానం 

పల్లెల్లో నిరుపేద పిల్లలు 

దినసరి కూలీలుగా కాయాకష్టం చేస్తూ 

చదువుకు దూరమై 

కళ్లల్లో నిరాశా చీకట్లు కమ్ముకోగా 

భవిష్యత్ పై ఆశలొదులుకున్న పిల్లలు!

అంధకారబంధురం అస్తవ్యస్తం

నేటి విద్యావ్యవస్థ!

డిజిటల్ క్లాసులు ఉన్నోళ్ళ పిల్లలకే 

చదువుకున్న తల్లిదండ్రుల పర్యవేక్షణలో!

డబ్బున్న పిల్లలు రోడ్లవెంట ఆకతాయిల్లా 

అల్లరి చిల్లర ఆటలు ఆడుతూ!

సెల్ ఫోన్లు గెలుకుతూ వెకిలి చేష్టలు!

కళ్ళున్న కాబోదుల్లా ఉపాద్యాయులు!

తొమ్మిదవ తరగతి నుంచి పైబడిన తరగతులు ప్రారంభం 

వీళ్లు ఇప్పుడు మళ్లీ ఒకటో తరగతి నుండి చదివినట్లు!

విద్యావ్యాసంగాన్నే కోల్పోయిన పిల్లలు 

ముదిమి వయస్సు పిల్లల జ్ఙానం కూడా కరువు!

జ్ఙానం ఉన్న పిల్లలు ధుఖితులై రోదిస్తున్న వైనం!

ఈ తప్పు ఎవరిది?

చదువుల బడులు బోసిపోయిన గుళ్లు!

కరోనా మహమ్మారి ఇంకా ఎన్నెన్ని అవస్తలు పెడుతుందో!

ఇటు గురువులను అటు పిల్లలనూ భయంగొల్పుతూ!

ఎన్నాళ్ళకి ప్రారంభం కావాలి ప్రాధమిక తరగతులు!?

వ్యాక్సిన్ వచ్చింది వేష్తున్నామంటున్నారు 

ఎవరికి?ఎక్కడ వేస్తున్నారు!?

అయినా చిన్నపిల్లలు ఈ వ్యాక్సిన్ తీసుకోవద్దంటున్నారు 

మరి విద్యాసంవత్సరం కొనసాగేదెలా?

ఎప్పుడు తెరుచుకోవాలి పాఠశాలలన్నీ!?


ఆపరాజిత్

7

[02/02, 8:32 PM] కోమటి మత్స్యగిరి: 

అంశం:

మ్రోగిన బడి గంట


శీర్షిక:

 *ఊరికి కళ వచ్చింది...* .



భుజాన పుస్తకాల సంచీ వేసుకుని

ఇంటి గడప దాటి

వీధుల వెంట నడిచొస్తున్న విద్యార్థుల్ని చూసి...

పల్లె.....

పట్నం....

పరవశించాయి.

పది నెలలుగా

అచేతనమైన

 *బడి* గంట తనను తాను సింగారించుకొని

మ్రోగటానికి మోకరిల్లి

విద్యార్థులని

స్వాగతించగా...

తన ఒడి చేరిన పిల్లల్ని

కన్నతల్లి వోలె అక్కున చేర్చుకుంది బడి.

ఆన్లైన్ తో మరుగున పడ్డ

తరగతి గది

బోధనలు విద్యార్థుల సందడికై..

నల్లబల్ల సుద్ద ముక్కని సిద్ధం చేసింది...

నేస్తాలంతా మాస్కులతో ఎదురు పడి ...

బడి లోకి సాగగా....

నిజంగా బడికే కాదు

ఊరూరికీ కళ వచ్చింది..



✍️కోమటి మత్స్యగిరి (ఛత్రపతి)

8

[02/02, 8:34 PM] +91 74168 63289: 

కవితాగానం 

తేదీ :2/2/ 21.

 నేటి అంశం :మ్రోగిన బడిగంట .

 శీర్షిక: బడికి.

పేరు :మన్నె పిన్నక లలిత.


  పది నిమిషాలు ఉండే విరామ గంట

 పది నెలల సమయం తో మోగింది గంట

 దేవుడి గుడిలో గంటలా

  బడి గంట మోగుతుంటే

 చదువుల సరస్వతి పిలుస్తుంటే 

పది నెలలు చదువుకు దూరమైన బిడ్డలను

 తిరిగి  బడిలో వదిలి వెళ్తున్న తల్లిదండ్రులు

 బొట్టు బొట్టు దాచి దాహార్తిని  తీర్చుకున్నట్టు

  అక్షరం అక్షరం  మదిలో నిక్షిప్తం చేసి

తీర్చుకోండి విద్యా దాహం

 అమ్మ దగ్గరకు వెళ్లే పిల్లల్లా

 ఆవు దగ్గరకు వెళ్లే బుజ్జాయిల్లా

 స్వాగతిస్తున్న ఉపాధ్యాయుల వద్దకు

 నవ్వుల పువ్వులు రువ్వు కుంటూ

తెలి మల్లె పువ్వుల్లా

 పరుగులు పెడుతూ వెళ్తున్న బాలలు

  బిడ్డ దూరమైన తల్లి వద్దకు

  తిరిగి వచ్చిన బిడ్డను చూచినట్లు 

ఆనందంలో ఉపాధ్యాయులు

 తల్లి బిడ్డలు, గురు శిష్యులు

 కలిసిన శుభవేళ

 చాలా కాలం తర్వాత  

బడి గంట మోగిస్తున్నందుకు

 ఆనందంగా మా యాదయ్య మోగించాడు

 ఆగకుండా బడిగంటను గణగణ గణగణ గణగణ మంటూ

9

[02/02, 8:37 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏

🙏సుధారాణి కృష్ణంరాజు🙏

*నేటి అంశం*మ్రోగిన బడిగంట*

02-02-2021(మంగళవారం)

బడిగంట మ్రోగ గానే ఉరుకులు

పరుగులతో ఉత్సాహంగా ‌బడికి పోయే విద్యార్థుల పాలిట కరోనా మహమ్మారి

శాపంగా మారింది

శానిటైజర్ల్,మాస్క్ లతో సహవాసం

ప్రాణ మిత్రులకు దూరం ఇంట్లో

ఉండటం వల్ల వారికి ఈ పరిస్థితుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనవలసి

వచ్చింది ఎవరింటికి వెళ్ళాలన్న

భయం ఎవరు ఇంటికి వచ్చిన

భయం చాలా కాలంగా బడికి

దూరమై ఆన్ లైన్ క్లాస్ లతో

ఎన్నో కష్టాలు సిగ్నల్ రాక

చెప్పే పాఠాలు అర్థం కాక 

బడి ఎప్పుడు తెరుస్తారో తెలియని గందరగోళం పరీక్షలు

పెడితే ఎలా రాయాలి రాయక

పోతే భవిష్యత్తు తమకు ఎలాంటి పరిణామాలు తెచ్చి

పెడుతుంది అనే విషయం లో

తేల్చుకోలేక  ఇప్పుడు ఇప్పుడు

కొద్దిగా గుండె దిటవు చేసుకుని

కరోనా మహమ్మారి ని దరిచేరనీయకుండా జాగ్రత్తలు

తీసుకుంటూ ఉంటున్న తరుణంలో మళ్ళీ బడిగంట

మోగడం కొంత సంతోషం

మరోవైపు ఆందోళన ఎట్టకేలకు

బడి గంటను మ్రోగించారు ఆ గంట అందరి జీవితాలలో గుడిగంటగా మారాలని

కరోనా పారిపోయి మరిచి

పోయిన అక్షరాలను గుర్తు

చేసుకునే అవకాశం విద్యార్థులకు కలిగించాలని

కరోనా మహమ్మారి ని వదిలి

పొమ్మని ప్రాదేయ పడుతూ

బడి గంట తిరిగి పిల్లల భవిష్యత్తు బంగారు బాట

వేయాలని ఆశిద్దాం🙏👍

10

[02/02, 8:37 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితా గానం* 


   అంశం: మ్రోగిన బడిగంట


 *కవితా శీర్షిక : భావిపౌరులకూ..ఆనందమే!*


 కరోన విజృంభణతో!


 యాంత్రికతతో బందీఐన!


 వ్యవస్థoతా,చిన్నాభిన్నమైంది !


సర్వరoగాలు కుదేలైనాయి!


 విద్యారంగం అటకకెక్కింది!


 ఇప్పుడిప్పుడే బడిగంట మ్రోగింది !


పుస్తకాల సంచి భుజాన చేరింది!


బూజు పట్టిన బళ్ళన్నీ!


 ఇక తేజస్సుతో వెలగనున్నాయి! 


జ్ఞానo పంపిణీకి సర్వం సిద్ధమైనాయి!


 బావి భారత పౌరుల్లో కొంత ఊరట కలిగింది !


గతకాలపు చేదు అనుభవాలను!


నేమరేసుకోవడం కన్నా..,


 ప్రస్తుత తాజా,పరిణామాలపై..,


 విద్యాప్రమాణాలపై దృష్టిని కేంద్రీకరించడం!?


 బాధ్యత గల ప్రతి 

పౌరునిదీనూ!!


పరాoకుశo రఘు నారాయణ

      మహబూబాబాద్

11

[02/02, 8:41 PM] KC Narsaiah KS 26: 

కవితా గానం

అంశం: మ్రోగిన బడిగంట

పేరు: కెసి నరసయ్య

7981814784

అంశం: ఆప్యాయతల పలకరింపులు



కనపడని క్రిమికి

ఖంగుతిన్న మానవాళి

అస్తవ్యస్థమైన వ్యవస్థలు

ముక్కు నోర్లకు

చిక్కాలు తగిలించుకుని

బడులు గుడులు

మసీదులన్నీ మూసుకున్నాం

మనస్సులలో

నింపుకున్న ఆత్మస్థైర్యం

శవాల గుట్టలయిన మానవత్వం

జయమో? అపజయమో?

బలహీనపడిన కరోనా!

మూతేసినవన్నీ తెరుచుకున్నాయి

బడిగంటలు గుడిగంటలు మ్రోగాయి!

రెక్కలు కట్టుకున్న అల్లరి పిల్లలం

మోయలేని బరువులులతో

జనగణమన గీతాలాపనలలో 

తడిసి ముద్దలై ప్రతిజ్ఞతో

నల్లబోర్డుకు సుద్ద ముక్కలయినాం

గురువుల ఆప్యాయతల పలకరింపులతో

సర్కార్ బడులలో సంబరపడి పులకరించాం!

12

[02/02, 8:46 PM] Balloori Umadevi Poetess: 2/2/21

కవితా గానం

డా.బల్లూరి ఉమాదేవి

అంశం:మ్రోగింది బడి గంట


మ్రోగింది గుడిలోని గంట ఆనందోత్సాహం తో

మ్రోగుతోంది బడిలో గంట

చదువులమ్మ చెంతకు రా రమ్మని పిలుస్తూ

 ఏడాదిగా మూగవోయిన బడిగంట

గణగణా మ్రోగుతూ రా రమ్మని పిలుస్తోంది

 మాయదారి కరోనా రాకతో అంతా అతలాకుతలం

బడికి దూరమైన బాలలదిగదిగో

ఆన్లైన్ చదువులతోబడి గంటకు దూరమై

నిర్లిప్తంగా  నిస్తేజంగా మారారు పిల్లలు

అందమైన పాఠశాల ప్రాంగణం వేలాడుతున్న పొడవైన బడిగంట 

ఎదురు చూస్తున్నాయ్ పిల్లల కోసం

ముఖాలకు మాస్కులతో

భుజాలకు సంచులతో వడివడిగా వస్తున్న బాలల కోసం ఎదురుచూస్తోంది పాఠశాల

 ఆగకుండా మ్రోగుతుంది బడిగంట

13

[02/02, 9:03 PM] శ్రీకాంత్ కడార్ల Poet: *కవితాగానం*

అంశం: మ్రోగిన బడిగంట

పేరు: శ్రీకాంత్ కడార్ల 



మ్రోగిన బడిగంట

ఆనందం నింపెను తుదికంట...


బడిలో ఉండాల్సిన బాల్యం

వత్సరం బాటు   దూరం అయింది..


రోజు మోగాల్సిన బడిగంట

సప్పుడేమి లేకుండా చిన్నబోయింది


మాయదారి కరోనా వల్ల

పిల్లల మమతలను దూరం చేసింది..


ఎలాగైతేనేమి  తల్లికాలం ఒడిలో

కొన్ని నెలలు అలా ఒదిగిపోయాయంతే


కాని

యద సప్పుడు తో సమానమైన ఆ బడిగంట మళ్లీ మోగింది


నవతరాన్ని తయారుచేయ గల

ఆ సప్పుడు ఇప్పడిది కాదు కదా


తరతరాలుగా తరాలకు సరిపడ

విద్యా సంపత్తిని అందించగల స్వయం ప్రతిపత్తి గల బడిని గాడిన పెట్టించ గల


ఈ గంట మోగ్రాలి     పిల్లల అల్లరితో

పాఠశాల ప్రాంగణం తులతూగాలి...



టన్ టన్ టన్....  అంతా రన్ రన్ రన్

మనమంతా విన్ విన్ విన్...


తొలి పొద్దు గంట పరుగులు పెట్టిస్తే

మలిసంధ్య గంట పరమానందాన్ని

పంచి పెడుతుంది...



ఆ చల్లని నీడలో రెక్కలు వచ్చి

ఆకాశాన్ని ముద్దాడగలిగే    చిన్నారులు ఎందరో

ఆ గంట మాత్రం అక్కడే

ఆ గంట మాత్రం అలానే


కొత్త వారికి పద్ధతులను నేర్పుతూ

 అలానే ఉండిపోతుంది...


మోగాలి బడిగంట తుదకంట

మోగాలి బడిగంట యదనిండా

14

[02/02, 9:12 PM] దీపక్ న్యాతి: *కవితా గానం*

పేరు : డా.దీపక్ న్యాతి

తేది : 02-02-2021

అంశం : మ్రోగిన బడిగంట

శీర్షిక : శుభ మంటూ మ్రోగింది


పరమాత్మ నుండి జీవాత్మ

రూపొందించుకోవడం విజ్ఞానం

రూపుదిద్దుకొన్న జీవిది జన్మ

జన్మించిన క్షణాన జ్ఞాన లేమి

జాగాన జీవ ప్రయాణం సాగించ

చచ్చే వరకు జీవి జీవించ

ముందు తరాలకు జీవమివ్వ

జీవికి జ్ఞాన విజ్ఞాన వివేకాలవసరం

అందునా మనిషికి అనివార్యం

విజ్ఞానాన్ని పంచి పెంచే వేదికలు

విద్య నేర్పే ఆశ్రమాలూ బడులే

అభివృద్ధి భవిత కుంటుపడకుండా

కష్టకాలాన్ని నిష్ఠగా ఎదుర్కొని

విపరీత వాతావరణాన్ని ఎదురొడ్డి

అంటురోగాలకందక నిల్చొని

మహమ్మారి మాటున పడకుండా

మారణహోమాన్ని ధిక్కరించి

భావితరాల మనుగడ సాగించ

విద్యార్థుల ఓదార్చి విద్యను నేర్ప

సుఖ సంతోషాలనందించ

శంఖంలా మ్రోగింది బడి గంట

ఢమరుకంలా మ్రోగింది బడి గంట

శుభమంటూ మ్రోగింది బడి గంట


డా.దీపక్ న్యాతి

హైదరాబాద్

15

[02/02, 9:13 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..మ్రోగిన బడిగంట


కరోన చిమ్మిన కాలకూట విషంతో

అన్ని రంగాలు కుదేలైన వేళ

మూగబోయిన బడిగంట

సుదీర్ఘ విరామంతో

నీరసించి పోయిన విద్యార్థుల్లో

కొత్త ఆశలు చిగురింప జేస్తూ

మ్రోగింది గణ గణ మంటూ

పాఠశాల ప్రాంగణమంతా

నూతనత్వాన్ని సంతరించుకొని

ఆహ్వానిస్తుంది అభిమాన విద్యార్థులను

తన ఒడిలోకి చేరిన పిల్లలను చూసి

బడిలోని ప్రతి కొమ్మ, రెమ్మలు ఆప్యాయంగా పలకరిస్తూ

ఊగిపోతున్నాయి సంబరంతో

నిర్మానుషమై నిద్రపోయిన తరగతి గదులన్ని 

ఉలిక్కిపడి లేచి 

స్వాగతించాయి

చిన్నారుల మోమున చిరునవ్వులు వెలిగాయి

భావిభారత పౌరులు మరిచిన అక్షరాలను నెమరు వేసుకుంటూ

పదకొండు నెలలు కలుసుకోలేని నేస్తాలను కళ్లారా చూసుకుంటూ

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ

కోటి ఆశలతో 

ఆకాంక్షలు నెరవేర్చుకోవాలన్న తలంపుతో

 బడి బాట పట్టిన పసి హృదయాలను శుభమని దీవిస్తూ 

కర్తవ్యాన్ని బోధించే బడి గంట

ఉపాధ్యాయులకు ఊరట నిచ్చి

బాధ్యతతో సాగిపొమ్మని భరోసా ఇచ్చింది.

16

[02/02, 9:24 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*

తేదీ: 02-02-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం; మ్రోగింది బడి గంట

********************

మౌన తపస్సు వీడిన  బడిగంట

గణగణమని  సవ్వడుల  నవ్వులను ఒలక బోస్తుంది..


చిరునవ్వుల మెరుపుల తుళ్ళింతలతో

తన చెంత చేరిన గంటతో తీయని కబుర్ల పొంత అయ్యింది..


 గంట చేసే శబ్దాన్ని

చెవులు రిక్కించి విన్న తరగతి గదులు

పిల్లల సామ్రాజ్యంలోని మాటల ప్రపంచంలో 

హాయిగా విహరిస్తున్నాయి!


ఆచ్ఛాదన లేని బాలల పాదాలను 

పచ్చిక చేతులతో హత్తుకొని

మెత్తదనాన్ని   ప్రసాదిస్తూ

 అడుగులకు మడుగులు ఒత్తుతున్నాయి...


నిర్జీవంగా  ఉన్న బడిప్రాంగణం

బడి గంటతో

ఉపాధ్యాయుల ప్రేమాభిమానాలు పలకరింపుతో 

సజీవత్వాన్ని సంతరించుకుంది

17


[02/02, 9:24 PM] ఉదయ శ్రీ ప్రభాకర్ Poetess: కవితా గానం

పేరు. ఉదయశ్రీ ప్రభాకర్

అంశం.మ్రోగిన బడి గంట


 *రేపటి వెలుగు కిరణాలు..* 


గ్రహణం విడిచిన చంద్రోదయంలా

వెన్నెల జల్లులన్నీ జగతిని మురిపించినట్లు..

చదువులమ్మ లోగిళ్ళలో విద్యార్థుల అడుగుల సవ్వడి వీణా నాదంలా వినిపిస్తుంది..


పాఠశాల పొలంలో..

అక్షరాల అంకురాలు మొదలై

రేపటి భవిత పచ్చగా చిగురిస్తుందని..మది పులకరిస్తుంది..తొలకరి జల్లులకు తడిసి ముద్దైన..పుడమితల్లిలా


గంట మ్రోగింది..

నిద్రణమైన జనజీవనాన్ని తట్టిలేపింది.. సూర్యుడి కిరణాల తాకిడికి చైతన్యమైన సకల జీవన జీవికల్లాగా


ఆలోచనలు సానపట్టాలని

ఓడిన నిన్నటిని దాటి గెలుపు దిశగా సాగుతుంది నేడు రేపటి వెలుగు కిరణాలు వెదజల్లుతూ


ఉదయశ్రీ ప్రభాకర్

02.02.21

18

[02/02, 9:26 PM] Vijayalakshmi Ch KS 38: కవితా గానం 

పేరు :చెన్నా విజయలక్ష్మి, బీర్కూర్ 

అంశం :మ్రోగింది బడి గంట 

శీర్షిక :ఆనందం కావాలి సొంతం 


ఆనంద మానంద మాయెనే 

బడి గంట శ్రావ్యంగా మ్రోగెనే 

కరోనా మహమ్మారి మట్టుపెట్టిన చదువు 

జూలు విదిలించి లేచింది చూడు 


దూరదర్శిని చదువు గుబులు రేపింది 

చరవాణి గుండెల్లో కలత కలిగించింది 

అర్ధం కాని చదువులతో ఆగమైన బిడ్డ 

ఆర్ద్రంగా చేరాడు అమ్మ ఒడి లోకి 


గురువు బోధన వినగ పరుగునొచ్చాడు 

అమృత పానము జేయ  అరుదెంచి నాడు 

విద్యార్థి లోకాన్ని కనిన నల్ల బల్ల 

కిల కిలా నవ్వుతూ మురిపెంగచూసింది 


బడిలోని ప్రతి తరువు నిలువెల్ల పులకించె 

బడి లోని ప్రతి గది కళ్ళు తడిపింది 

బల్ల బల్లా బిడ్డ తనువు తడిమింది 

విద్యార్థి ముఖమంత దీపమయ్యింది 


పిల్లల కేరింతలతో బడి మారు మ్రోగింది 

రెక్కలు తొడిగిన సీతాకోక చిలుకల్లా 

వికసించిన పువ్వుల్లా 

తప్పిపోయి తల్లిని చేరిన శిశువుల్లా 

కల్మషము లేని నవ్వులతో 

కరోనా ని దాటుకొని గురువు ను చేరారు 

విద్యాభిలాషా పేక్షతో 

నిబంధనలు పాటిస్తూ

19


[02/02, 9:29 PM] కొలచన విజయ భారతి Poetess: కవితా గానం

పేరు:కొలచన విజయ భారతి

ఊరు: హైదరాబాద్

అంశం:మ్రోగిన బడి గంట

శీర్షిక: ఆగకుండా సాగాలి

తేదీ2-2-2021

*********************

కరోనా రక్కసి కోర ల్లో

చిక్కుకుని

లాక్ డౌన్  సంకెళ్ళను విప్పదీసుకుని బెదురుతూనే

బడి గంట గణగణా మోగింది

బిలబిలమంటూ  బడి పిల్లలు

తరగతిలో అడుగులు పెట్టారు


అయినా ఇంకా స్వేచ్ఛగా

ఊపిరులు తీయలేని పరిస్థితి

ఆప్యాయంగా ఒకరినొకరు

కౌగిలించుకోలేని దుస్థితి


మాస్కులు  ఇంకా పెదవి విప్పనీయటం లేదు

కను రెప్పలు భయాల రెపరెపలు వీడటం లేదు

కరోనా భూతం ఇంకా

ఎక్కడో పొంచి ఉందేమోననే

అలజడి

మంచిరోజులు రావాలని

బడిగంట గుండె చప్పుడు

మనసారా కోరుకుంటోంది

గురు శిష్యుల తరగతి

అనుబంధం ఏ ఆటంకం లేకుండా నిరాటంకంగా

సాగిపోవా

భగవంతుని వేడుకుంటోంది

తనను మోగించే చేతులు

నిరంతరం చైతన్యవంతమై ఉండాలని  సంబరపడుతోంది

      ☘️☘️☘️☘️☘️

20

*మోగిన బడిగంట*

********* ********

మోగెను బడిగంట

ఊగెను చిన్నారి జగమంతా

ఉరికెను వడివడిగా చిన్నిపాదాలు

సందడేసందడి పాఠశాల ఆవరణ0త


ఎంత వద్దంటున్నా దగ్గరయ్యే

చిన్నారులు స్నేహమనే సూదంటు రాయికి ఆకర్షించబడే రేణువులు

బడికి అందం తెచ్చే సుమరేకులు


పసిపాదాల స్పర్శ

బడి బామ్మ వడికి

ఎంత జీవకళ తెచ్చిందో!

పిల్లల అల్లరి నవ్వులు

మన   విద్యాలయాలకు 

ఎంత అందమిచ్చిందో!


:వల్లాల విజయలక్ష్మి

ఆ లే రు

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...