నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ ,
వీరా గుడిపల్లి
**********
కవి వరుల జాబితా
1.కోరాడ గారు
2.డా.బల్లూరి ఉమాదేవి గారు
3. సుధారాణి కృష్ణం రాజు గారు
4.భరద్వాజ గారు
5.ధనాశి ఉషారాణి గారు
6.డా.సి.హెచ్. ఆంజనేయులు గారు
7.చెన్నా విజయ లక్ష్మి గారు బీర్కూరు
8.మన్నె పిన్నక లలిత గారు
9. సునంద వురిమళ్ళ గారు
10.సంధ్యా శర్మ గారు
11.మర్రి జయశ్రీ గారు
*********
1
[17/02, 8:16 PM] Korada: కవితాగాన0
అంశం :- * సంకల్పం *
కోరాడ నరసింహా రావు....!
* సత్సంకల్పమే... శుభం *************************
సంకల్పం బలమైనదైతే.....
యేంతటి ఘన కార్యాల నైనా
సాధించ వఛని...నిరూపిస్తూ సముద్రాన్నేలంఘించి సీత జాడకనుగోన్నాడు హనుమ!
శబరి, అహల్యల సంకల్పాలు
ధ్రుడ మైనవి కాబట్టే... రాముని
దర్శించి ధన్యులు కాగ లిగారు కదూ...వారు...!
మనం దేన్ని సాధిన్చాలన్నా...
దాన్ని పోంది తీరాలనే ధ్రుడ
సంకల్పం మనలో ఉండి తీరాలోయీ....!
యేనాడూ నీమదిలో... చేడు
ఆలోచనలకు తావీయకు...!
చేడుకు లోంగదీసుకునే బలం
యేక్కువ... యేలాగైనా పోందాలనే ఆ ఆలోచనకు బలం చేకూరి... అది నీలో ధ్రుడ
సంకల్పం గా బలపడి... నీకు దుఖాన్నే మిగిలిస్తుంది....!
సత్సంకల్పాలేనోయీ....
సత్ఫలీతాలనీఛేదీ...!
మంచికి మోదట కష్టాలే...
కావఛు...., గానీ గేలీచేదీ...
నిలిచేదీ...శాంతి, సవుఖ్యాల
నంది0చేవీ....బలమైన మంచి ఆలోచనలే.... ఆశలే... ఆశ యాలే.....!!
*********************
........కోరాడ.
2
[17/02, 8:17 PM] Balloori Umadevi Poetess: కవితా గానం
డాబల్లూరి ఉమాదేవి
అంశం: సంకల్పం
అనుకున్నది సాధించడానికి
ఉండాలి మదిలో సంకల్పం
కార్యసిద్ధికై చేయాలి శ్రమ నిరంతరం
కాకూడదు అది మాటలకే పరిమితం
కూర్చుకోవాలి మానసిక బలం
పుడమిలో మొలకెత్తిన బీజం
ఎండ వానలకు ఏమాత్రం జడియక
సంకల్పబలంతో అవుతుంది మహావృక్షం
కావాలి మానవాళికి అదే ఆదర్శం
దృఢ సంకల్పంతో ధ్రువ ప్రహ్లాదాదులు
పొందారు శ్రీహరి కరుణా కటాక్షం
సంకల్పబలంతో శివుని మెప్పించి
గంగను భువికి తెచ్చాడు భగీరథుడు
తల్లి కోర్కెను తీర్చగ కైలాసం ఎత్తాడు
దృఢ సంకల్పంతో రావణాసురుడు
దేశ మాత శృంఖలాలను త్రెంచగ
దృఢ సంకల్పం పూనాడు బాపూజీ
ఆయుధం లేక సాధించాడు ఘనవిజయం
మానవ యత్నం దైవ బలం చేకూర్చును
దృఢ సంకల్పానికి ఘన విజయం.
3
[17/02, 8:20 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితాగానం🙏🙏
🙏సుధారాణి కృష్ణంరాజు🙏
*నేటి అంశం*సంకల్పం*
17-02-2021(బుధవారం)
సంకల్పం గొప్ప దైనపుడు
సాధించలేనిది ఏమీలేదు
సంకల్పమే నీబలం
సాధనే ఆయుధం
చేసెయ్ మరుక్షణం
విజయమే నీ పథం
చేసే పని ముందు ఎన్నో
అవరోధాలు వచ్చిన
సంకల్పం ముందు అవేవీ
నిలబడవు
మనం వేసే ప్రతి అడుగు
పట్టుదల కఠోర దీక్ష దృఢ సంకల్పం ఇవన్నీ ఆయుధాలు
అయితే చివరకు విజయం
మనదే
కర్తవ్యం మాత్రమే మన ముందుండి ఫలితం ఆశించకుండా నిరంతరం
అడుగు వేసి నపుడు
ఆశించిన దానికన్నా రెట్టింపు
ఫలితాలు మనకు రావడం
తథ్యం🙏👍
4
[17/02, 8:20 PM] భరద్వాజ గారు: 🦚🚹కవితాగానం ☂️♈
అంశం- సంకల్పం
శీర్షిక- మనోబలం --- !
పేరు-భరద్వాజరావినూతల
కొత్తపట్నం
రచన-52
********************************
%%%%%%%%%%%%%%%%%
*****************************
సంకల్పం
మనిషిని బ్రతికించే మనోబలం -
జీవితం పెరగటానికి ఆయూర్దాయం -
సంకల్పం లేనిమనిషిఉండదు -
సంకల్పమేనడిపిస్తుంది ముందుకు -
విజయాలు సాధించేందుకు -
సంకల్పం తోసాధించనిదిలేదు -
సంకల్పా లుండబట్టే ఎందరో ఎందరో గొప్పవారిగా -
ఎందరినో చేసింది మహనీయులుగా -
సంకల్పసిద్దచే మహాత్ములైనవారు ఎందరో -
సంకల్పం మనిషిజీవితాని కి ఆయువుపట్టు --
సంకల్పం ఉంటె పట్టవచ్చుఎంతైనా పట్టు -
అదిఎక్కిస్తుంది విజయాల మెట్టు
*******************************
********************************
ఇదినాస్వీయరచన
✍️భరద్వాజ రావినూతల ((RB)🖍️
5
శీర్షిక. సంకల్పము
......
అవమానపు తూటాలుతో
మనిషి చితికిన వేళ
నేనున్నాను అంటూ
విజయ కెరటాల లోగిలిలో నిలిపి
మనిషిని మునుముందుకు నడిపించును
పట్టువిడవక మునుముందుకు నడుపు
దివ్యమైన శక్తిస్వరూపము
పదుగురి ముందు నిలిపేటి
నిజమైన విశ్వరూపము
బంధాలు విడిచినా
అలుపెరుగక మనిషిని
నడిపే నిజమైనది సంకల్పం
6
సంకల్పం
మనిషి ఇ సంకల్పం నిరంతరం ఎవరికైనా నా సంకల్పం
సంకల్పం లేనిదే మన మార్గం బయటికి సాగదు
ఎవరైనా అడుగు కు ముందు వెయ్ లేడు నిరంతరం మన శక్తిని చూపి అవిశ్రాంతంగా
అవిశ్రాంతంగా సాగి పోవడమే
తమ శక్తిని ప్రదర్శిస్తూ సంకల్ప దేశంతో మాట్లాడు కోవడమే సంకల్ప దీక్ష సర్వదా అది ఉపయోగకారి
సంకల్పముతో ముందుకు సాగిపోతే విజయం
సంకల్పం ముఖ్యము దీక్ష ముఖ్యం
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
భాకరాపేట
కొత్తపట్నం
9866203795
7
కవితా గానం
తేది :17-02-2021
చెన్నా విజయలక్ష్మి, బీర్కూర్
అంశం :సంకల్పం
శీర్షిక :తిరుగులేని ఆయుధం
*******************************
బలీయమైన కోరికకు చేయూత
దృఢ చిత్తంలో మొలకెత్తిన ఆశకు పునాది
అనుకున్నది సాధించాలనే పంతానికి ఊపిరి
కష్ట నష్టాలను ఎదుర్కొనే ధైర్యమనే ఆలంబన
ఎంతటి త్యాగానికైనా సిద్దపడగలిగిన దృఢమైన మనస్సు
అకుంఠిత దీక్షా, పట్టుదలలకు తోడూ నీడా
అదే అదే సంకల్ప బలం
సంకల్పం బలమైన దైతే సాధించలేనిది ఉంటుందా !
మంచిని పెంచేది, సమాజానికి మేలు చేసే ఏ కార్యానికైనా
దైవబలం తోడై సహకరించదా !
మొదలు పెట్టిన పనిని సాధించే దాకా పరిశ్రమించడమే కదా
సంకల్పానికి పరమార్ధం
నిరుపేదలైనా ఉన్నతంగా ఎదగడానికి
అవయవ లోపాన్ని జయించి కీర్తి శిఖరాలను చేరడానికైనా
తాము ఎన్నుకున్న రంగంలో విజయ పథంలో సాగడానికైనా
అడ్డంకుల ముళ్ళ ను అధిగమించి స్త్రీలు అన్ని రంగాలలో
తమ ప్రతిభ చాటు కుంటూ జయ కేతనం ఎగురవేసినా
సంకల్పాగ్నికి ఆత్మ విశ్వా సాజ్యం తోడైతే
ఆశయాలు పంట పండి గమ్యం చేరువై కల సాకారమవడం తథ్యం
గంగను దివి నుండి భువికి దింపిన భగీరధుడు
సాగర మథనం చేసి అమృత భా0డాన్ని
దేవతలు సాధించడం
ఘోర తపస్సుతో దేవతలనుండి వరాలు పొందడం
భక్తి పథంలో నడచి మోక్షం పొందిన భక్తా గ్రేసరులు
స్వాతంత్ర్య మే ఊపిరిగా ప్రాణాలనర్పిం చి సాధించిన పోరాటయోధులు
అందరూ సంకల్ప బలానికి తార్కాణాలుగా నిల్చిన మహానుభావులే
విజయ సాధనలో సంకల్పానికి మించిన ఆయుధం లేనే లేదు
పట్టు వదలకుండా ప్రయత్నించా లంతే
8
కవితా గానం
తేదీ 17/ 2/21 బుధవారం
పేరు .మన్నె పిన్నక లలిత.
అంశం .సంకల్పం.
శీర్షిక .దృఢసంకల్పం
మనోబలంతో సంకల్ప సిద్ధి కై
కష్టసుఖాలు లెక్కచేయ క
దృఢ సంకల్పంతో అనుకున్న పనిచేసి
విజయాన్ని సాధించాలి
సంకల్ప సిద్ధికై దీక్ష వహించిన
గాంధీజీ శాస్త్రీజీల పంథాలో నడవాలి
సంకల్ప సిద్ధితో రుద్రమ్మఝాన్సీ రాణి లను
ఆదర్శంగా తీసుకొని
కష్టసాధ్యమైనా ఆలోచనను
ఆచరణలో పెట్టాలి
సంకల్ప సిద్ధికి ఉరితాడులను ముద్ది డి
ఉరికంబం ఎక్కిన వారిని
ప్రాణ త్యాగాలు చేసిన వారిని
స్మరించి
మనకు ఉన్న పరిస్థితుల్లో
మన సమస్యలు చిన్నవే నని భావించి
ఆనాటి వీరులను తలచుకొని సంకల్పసిద్ధి తో
విజయ పథంలో ముందుకు సాగాలి
శక్తియుక్తులతో సాధించలేనిది
ఏదీ లేదని తలవాలి
9
*కవితా గానం*
తేదీ:17-02-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: సంకల్పం
******************
మది ప్రమిదలో నింపుకున్న ఆశయాన్ని
మనో విశ్వాసంతో వెలిగించుకున్న ధృడమైన ప్రేరణా దీపం!
స్తబ్ధతను విదిలించుకున్న హృదయ విహంగం చేతనాకాశంలో గిరికీలు కొడుతూ దూసుకుపోయే లక్ష్య సాధన...
కృషి సానపై పదును పెట్టుకున్న ఆశా కరవాలంతో
అకుంఠిత దీక్ష ప్రారంభాన్ని నడిపించే విజయాల బాట..
.
నిస్తేజాలకు కొత్త ఊపిర్లు ఊది
ఉత్తేజాన్ని వెలుగుల దివ్వెగా చెక్కుకునే ప్రయత్నమే సంకల్పం...
సత్సంకల్పమే
వ్యక్తిత్వాన్ని పచ్చని తరువును చేసి
సమాజ యవనికపై ఆదర్శంగా నిలబెడుతుంది!
10
[17/02, 9:27 PM] Sandya Sharma Poetess: కవితాగానం
అంశం :సంకల్పం
శీర్షిక: ఆశల పరిమళం
౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧
రెక్కలొచ్చిన మనసులో
వేదనా తీగలను అల్లించక
రెప్పపాటు మౌనంలో
దాగున్న గుబులు మేఘాన్ని సరిచేసి
రేణువులా మొదలైన ఆత్మస్థైర్యమనే
ఆయుధం.....
తుఫానుల్ని నింపుకున్న గుండె గూటిని
పదిలంగా ప్రత్యామ్నాయపు పగ్గాల వైపు పరుగుతీయించి...
కన్నీటి ఆనవాళ్ళకు బానిసవ్వక...
కాలం విసిరే సుడి గుండాలను...
పిడికిట్లో రగిలే బుద్దిబలంతో
ఎదుర్కొంటూ...
విషపు ముల్లుల సంకేతాలకు సాత్వికంగా
తిలోదకాలిస్తూ...
వేకువనే అణువణువూ తారసపడే
అవకాశ గుమ్మాలు తెరచుకుంటూ...
మలుపు మలుపుకో గాయాల రేగడి నిలదీసినా
చెక్కుచెదరని మనో విశ్వాసపు బీడులో
సంకల్ప బలమనే బిందు సేద్యంలో
ఏకాగ్రతా శ్వేత పత్రంలో
లక్ష్య సాధనా ఫలాలను
సీతాకోక చిలుకలుగా ఆవిష్కరిస్తూ...
నిర్భయ సాధకులుగా నిర్ధేశికలై...
నలు దిశలా ఆశల పరిమళాలు
వెదజల్లుతాను...!
౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧
✍️వై.కె.సంధ్యశర్మ
11
[17/02, 9:28 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..సంకల్పం
శీర్షిక...అమృతం
స్వార్ధపు బంధాలెన్నో వీడి పోయినా
నేనున్నానని
అక్కున చేర్చుకొని
మనో బలాన్నిచ్చి
ముందు నడిపించే మహా శక్తి
ధైర్యం కోల్పోతున్న వేళ
ఊపిరి పోసే అమృతం
పడిపోకుండా ఆసరా నిచ్చే కంభం
సంకల్పమే విజయాలకు మూలం
సంకల్పం లేనిదే సాగదు ఏ కార్యం
మహనీయులుగా మార్చేమహాశక్తి మంత్రం
మనో వేదనలకు ఔషధం
సామాన్యుడిని మహనీయుడు గా చేసే అత్యంత శక్తి సూత్రం
సంకల్పం బలముతో ముందుకు సాగాలి
చేరుకోవాలి ఉన్నత శిఖరాలను
Comments
Post a Comment