నిర్వహణ :శివునూరి లలితాకృష్ణ
కవితా గానం నిర్వాహకులు
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
*************************
*కవితాగానం*
13.02.2021
*జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా...*
ప్రత్యేక కవితలకు ఆహ్వానం పలుకుతుంది
మన సమూహం.
ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు.
ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.
✳️✳️✳️✳️✳️✳️✳️✳️
కవివరుల జాబితా
1.సంధ్యా శర్మ గారు
2. డాక్టర్ ఆంజనేయులు గారు
3.మన్నె పిన్నక లలిత గారు
4.పరాంకుశం రఘు నారాయణ గారు
5. కందూరి సుజాత గారు
6. కె.సత్య నీలిమ గారు
7.డా.బల్లూరి ఉమాదేవి గారు
8.సునంద వురిమళ్ళ గారు
9. సుధారాణి కృష్ణం రాజు గారు
10.కె.ఇ.నిలమంగై గారు
11. చెన్నా విజయ లక్ష్మి గారు బీర్కూరు
12.వల్లాల విజయ లక్ష్మి గారు
13. మర్రి జయశ్రీ గారు
****************-
1
[13/02, 8:15 PM] Sandya Sharma Poetess: జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
💐💐💐
*మహిళ*
౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭
దోసిళ్ళలో దాచుకున్న శౌర్యమంతా
మంచు మొగ్గలై రాలిపోతున్నా
దారి కాచి పోగేసే ముళ్ళన్నీ
దురాగతాలకు వంత పాడుతున్నా
ఆక్రోశం పెదవులపై రగిలినా
పొత్తిళ్ళకు గాయాలైనా
గుండెల్ని పిండి చేసే మాటల ఈటెలు
దూసుకు వచ్చినా......
తలదించని నేస్తపు స్వగతాలను నెమరువేస్తూ...
ఆత్మవిశ్వాసపు చిగుళ్ళు తొడుక్కుని...
స్వార్థపు తెగులు
నిలువునా నీరుకార్చినా...
నిశ్శబ్ధపు పగుళ్ళు
నిరంతరం వెంటాడినా...
నిర్భయమే ధీరత్వమై
ఆయుధం లేని ఆమనిలా
అకుంఠిత దీక్షతో తలపడుతూ
జాత్యహంకారం రెక్కలిప్పినా
సాముహిక దాడులతో గర్జించినా
గంధకం నింపిన చూపుల్లో బంధించినా
మూల సంస్కృతికి మూల్యం
చెల్లించుకోక తప్పదని....
అణువణువూ ఆశయాన్ని ఒంపి
అమరత్వం నిండిన ఆత్మసౌందర్యమే...
అతివకు అణ్వాయుధమై...
నిరంతరం ఆలోచనా తరంగాలను...
వెల్లువెత్తుతూనే...
ముదితల్ నేర్వని విద్య గలదాయనే
వాక్కుకు అహరహం ప్రాణ ప్రతిష్ట చేసే
సాయుధం...నిలువటద్దంలో ప్రతిధ్వనిస్తూనే
వుంటుంది...!
✍️వై.కె.సంధ్యశర్మ
2
[13/02, 8:16 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: భారత కోకిల
నైటింగేల్ ఆఫ్ ఇండియా
భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు
డాక్టర్ సరోజినీ నాయుడు
గాంధీజీ ఆదేశంపై దక్షిణాఫ్రికా జన సేవ చేసిన మహిళా మణి ఆమె మహనీయురాలు
ఆమె చిరకాలం తెలుగు నాట కాదు యావత్ భారతం లో
జాతీయ మహిళా మణి గా నిలిచిపోయింది
ఆమె కుమారుడు జయసూర్య
పద్మజా నాయుడు
గోవిందరాజు నాయుడు
సతీమణిగా ఆమెకు స్వేచ్ఛని ఇచ్చిన మహనీయుడు
గోల్డెన్ త్రెషోల్డ్ స్థాపించి
సాహితీ సేవలను అందించిన
మహిళా ఉపాధ్యాయురాలు
ఆదర్శ మహిళా శక్తి
తొలి మహిళా గవర్నర్ గా అమోఘ సేవలందించిన
మహనీయురాలు
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
3
[13/02, 8:17 PM] మన్నె లలిత గారు కవయిత్రి: పరదాల చాటున లేకుండా
జాతీయోద్యమంలో ఉరికిన ఉవిదలు
రణ రంగాన శత్రువులను
చీల్చి చెండాడిన చండీలు
అన్నిటా తానై నిలిచిన
మహిళామణులు
'వంటింటి కుందేలు' పులయైి
తిరగబడ్డ రోజులు
చట్టసభలలో న్యాయం కోసం
పోరాడిన వారు
ఎండ కన్నెరుగని వారు
నిద్రాహారాలు మాని ఎండా వాన లెక్కచేయక
స్వాతంత్ర పోరాటంలో సింహాలై ఉరికిన వారు
విజయలక్ష్మీ పండిట్ సరోజినీ నాయుడు ఊటుకూరి
మొదలగు ఎంతోమంది
స్వరాజ్య సముపార్జన కోసం
స్వశక్తిని ధారపోసి ఉద్యమంలో పాల్గొని
జైలుశిక్ష అనుభవించిన వారు
భారతదేశ మొట్టమొదటి మహిళా గవర్నర్
భారత కోకిల సరోజినీ నాయుడు గారి జయంతిని
జాతీయ మహిళా దినోత్సవంగా
స్ఫూర్తి మంత్రంగా జరుపుకునే ఈరోజు
మహిళలందరికీ ఆదర్శప్రాయమైన రోజు
ఆనాటి జాతీయ మహిళలను తలుచుకుందాం
వారి దారిలో నడుచుకుందాం.
4
[13/02, 8:38 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: కవితా గానం
తేది:23/2/2021
(జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని)
*కవితాశీర్షిక : మహిళాభివృద్ధిని కాoక్షిద్ధాo!*
మనదేశంలో అనాదికాలం నుండి ,
సాంస్కృతిక వారసత్వ కోణంలో పరిశీలిస్తే,
మహిళలకు ఓ..ప్రత్యేకస్థానం ఇవ్వబడింది!
గొప్ప ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్యమున్న మనదేశంలో
మానవ ప్రగతి అసాంతం మహిళా సహకారo లేనిదే!
సాధ్యము కాదన్నది నగ్నసత్యం !
మహిళలు పురోగతి సాధిస్తేనే,
దేశం పురోగమిస్తుంది!
శాస్త్ర సాంకేతికాభివృద్ధిలో,
మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు!
నేడు పురుషులతో సమానంగా..,
అన్ని రంగాలలో స్త్రీలు రాణిస్తున్నారు !
అయినా నిరక్షరాస్యతా కారణమో!
స్త్రీ అబల అన్న చులకన భావమో,
ఇంకా.. , లింగ వివక్షత రాజ్యమేలుతున్నది!
ఆర్థిక అసమానత కొనసాగుతున్నది!
విద్యావకాశాలు సన్నగిల్లుతున్నవి !
*సమాన పనికి సమాన వేతనం*!
అనే నానుడి కాగితాలకే పరిమితమైంది!
రాజకీయరంగంలో స్త్రీ పాత్ర *నామ్ కేవాస్తే* అయ్యింది !
భ్రూణహత్యలు కొనసాగుతున్నాయి!
వరకట్నపు చావులు నిత్య సత్యాలైనవి!
స్త్రీలపై అశ్లీలత తాండవిస్తున్నది!
మానవీయ కోణం ఆవిష్కరించబడాలి!
స్త్రీసమాజోద్దరణకు నడుం కట్టాలి !
మహిళా సాధికారతకై కృషి చేయాలి !
పరాoకుశం రఘు నారాయణ
మహబూబాబాద్
5
[13/02, 8:52 PM] కందూరి సుజాత Poetess: అంశం... మహిళ
శీర్షిక.... 🌷అతివ 🌷
.......... .......... ..........
అతివను నేను అనుబంధాల
మమతను నేను .
గూటిలోని దీపంలా గుడిలోని దేవతలా కొలిచి వలచిన కోమలిని.
సమాజన శాంతిని గగనాన ఖ్యాతిని.
చరిత్రలకు ఆది నీ సాంప్రదాయ గీతిని. మగువను మమకారపు మంచును.
ఆరు గజాల చీరతో గౌరవాన్ని నడిపిస్తూ అలవోకగ అస్త్రశస్త్రాలు సాధిస్తూ
ఒక చేతన సుకుమారం మరొక చేత సూరత్వం
ఒక కంట ప్రణయము
మరొక కంట పరివారమూ
నవరసాల సంసార రథముకు సారధిని అతివను ఆణిముత్యాల తెలుపును .
సమస్యలకు జడవని అపజయాల తలవంచని
పొగడ్తలకు జారని పరిపక్వ పడతిని .
చేయుతకు దళపతినీ
ఆప్యాయత సోపతినీ .
సుఖదుఃఖాల లో వెన్నంటే నీడలాంటి నీతిని.
అతివను అనుబందాల మమతనూ.
కందూరి సుజాతారాణి
రాజేంద్రనగర్, హైదరాబాద్
9392162822🌷
6
[13/02, 9:15 PM] కె. సత్యనీలిమ
వృత్తి : ఉపాధ్యాయురాలు ప్రవృత్తి :: *కవితాగానం*
*అంశం:మహిళ*
మమతను పంచి
మంచిని పెంచి
అనురాగాన్ని కలబోసి
మమతను రుచిచూపించి
కళ్ళలో కరుణను నింపుకుని
గుండెల్లో బాధను దాచుకుని
చిరునవ్వును పెదవిపై ఉంచుకుని
అందరినీ ఆదరిస్తూ
అందరికీ అన్నీ సమకూరుస్తూ
అవమానభారాన్ని మోస్తూ
అభిమానాన్ని కాపాడుకుంటూ
అంబరమంత ప్రఖ్యాతి గాంచుతూ
ఓర్పులో అవనిలా
నేర్పులో దేవతలా
ప్రేమకు ప్రతిరూపంలా
సహనానికి నిలువెత్తు నిదర్శనమై
కళకళలాడే సిరిమహాలక్ష్మి
ప్రతిఇంటి గృహలక్ష్మి మహిళ....
*సత్యనీలిమ*
వనపర్తి
7
[13/02, 9:18 PM] Balloori Umadevi Poetess: /2/21
కవితా గానం
డా.బల్లూరిఉమాదేవి
అంశం:మహిళ
శీర్షిక :అనురాగ దేవత
సహనానికి మారు పేరు మగువ
ఇంటా బయట పనులు చేయ గల
సామర్థ్యం ఆమెకే సొంతం
ప్రతిఫలాపేక్ష లేకుండా నేను నాది అనక సర్వస్వం కుటుంబం కోసం అర్పించే త్యాగశీలి
రెండు చేతులా ఆర్జించినా
పగలు రాత్రి కష్టపడిన తనకంటూ
ఏమి మిగుల్చుకోని నిస్వార్థ జీవి
మనవు చెప్పిన షట్కర్మలలో
నాలుగు పనులు సమర్ధవంతంగా
అలుపు లేక నిర్వహించే నారీమణి
"కార్యేషు దాసి" లా భర్తకే కాదు
ఇంటిల్లపాదికి సేవచేయడం నిత్యకృత్యం "కరణేషు మంత్రి" లా అవసరం ఉన్నప్పుడు సలహాలివ్వడం ఆమె సహజ గుణం
"భోజ్యేషు మాత"లా ఎంతమంది కైనా
ఏ వేళైనా వండి వడ్డించడం ఆమెకే సొంతం
"క్షమయా ధరిత్రి' లాఅన్నింటినీ భరిస్తూ నిస్వార్థంతో శ్రమించే అనురాగదేవత మగువ.
8
*కవితా గానం*
తేదీ:13-02-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా...
శీర్షిక: నారీ శిరోమణుల స్ఫూర్తిగా
*********************
వాళ్ళు చూపించిన దారిలో
ముళ్ళ కంచెల్లాంటి మాటలను దాటి
ఆధిపత్యఫు ఆంక్షలను ఎదిరించి
అకుంఠిత దీక్షతో
వంటింటి నుండి వినీలాకాశంలో
అస్తిత్వ పతాకను ఎగరేసిన
నారీ శిరోమణుల స్ఫూర్తిగా
ఇందు గలదందు లేదని రీతిలో
ప్రగతి పథంలో
సాగుతోంది నేటి మహిళ..
సృష్టికి ప్రతి సృష్టి చేసే బ్రహ్మగా
మానవ జాతి మనుగడకు
ప్రాణం పోసిన స్త్రీ మూర్తి
9
[13/02, 9:26 PM] Komandoori Neela Poet: కవితా గానం
అంశం: *మహిళ*
తేది:13/02/2021
వచన కవిత్వం
అమ్మలా,అత్తలా,ఆలిలా,చెల్లిలా,వదినలా,అక్కలా,బిడ్డలా ఎన్ని పాత్రలో..!
భూదేవిలా సహనాన్ని,అమ్మలా వాత్సల్యాన్ని,భార్యలా ప్రేమని,బిడ్డలా అనురాగాన్ని పంచుతూ..,
వలపుల మాలికై,పెనవేసుకున్న మల్లె తీగలా..,
అనవరతం,నిరంతరం నిత్య చైతన్య శీలియై..,
ఇంటా,బయటా తలలో నాలికలా..,
అన్నీ రంగాలలో మేటిలా..,
సాటిలేని మహిళయై..,
నిరంతర స్రవంతిలా..,
నదిలా పరవళ్ళు తొక్కుతూ..,
ఎందులోనూ తీసిపోమనే ధీమాని అందిస్తూ..,
అందాల పూదోటలో పూలమొక్కలై..,
పుట్టింటికీ,అత్తింటికీ వారధులై..
సారథ్యం వహించే సారధులై..,
కదులుతువ్నారిలా సంద్రపు తరంగాలలా...!!!!!
పేరు: కె.ఇ.నిలమంగై
కలం పేరు:నీలా రంగనాధం
ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.
చరవాణి సంఖ్య:8897155600.
*ఈ పై కవిత ఈ సమూహం కోసం రాసినదేనని హామీ ఇస్తున్నాను.*
10
[13/02, 9:26 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో🙏
🙏🙏కవితా గానం🙏🙏
🙏సుధారాణి కృష్ణంరాజు🙏
*అంశం*మహిళలు మహరాణులు*
13-02-2021(శనివారం)
మహిళ శక్తి స్వరూపిణి
సంసార వీణను లయ తప్పకుండా నడిపించే
ఉత్తమ ఇల్లాలు పిల్లలకు జన్మనిచ్చే విషయం లో తనకు
పునర్జన్మ అని తెలిసిన ప్రాణాలు లెక్క చేయకుండా
ప్రసవ వేదనను భరించి జన్మనిచ్చే త్యాగమయి
అనురాగ మయి మహిళ
వరకట్నం కోసం వేధింపులు
భరించిన కుటుంబ పరువు
కోసం ప్రాణమైన ఇవ్వగల
ధీర వనిత మహిళ
తన మాన ప్రాణాలను కాపాడే
విషయంలో ఎదురొడ్డి పోరాడే
చండిక మహిళ
సాంకేతిక పరిజ్ఞానం లోను తన
పరిజ్ఞానం చూపించుటలో మగువ తెగువకు ఎదురులేని
జ్ఞాన ఖని విజ్జాన విదుషీమణి
మహిళ
ఉపాధి రంగం లో రాణించడానికి ఆన్ లైన్ వ్యాపారంతో కుస్తీ పడగలదు
పరిసరాలు అందంగా తీర్చిదిద్ది
బిడ్డలను చదువు సంస్కారం నేర్పించటంలో మహిళలకు
సాటి ఎవరు
పోటీ ప్రపంచంలో పాప పంకిలమైన సమాజంలో అనునిత్యం జీవిత చదరంగంలో ఆయుధాలు
లేకుండా యుద్ధం లౌక్యం గా
చేయగల శక్తి స్వరూపిణి
మహిళ
ఒక సోదరునికి చెల్లోగా అనురాగం పంచే భర్తకు భార్య గా పిల్లల ఆలనా పాలనా చూసే మాతృ మూర్తి గా
తల్లి తండ్రుల ను గురువులను
అతిథులను ఆదరించే విశిష్ట
వ్యక్తి త్వం గల పడతిగా
వృత్తి ని దైవం గా భావించి
అన్ని రంగాల్లో దూసుకు
పోతున్న సంఘటిత శక్తి
మహిళే
అధ్బుతం చేయగలదు అనురాగం కురిపించగలదు
అందుకే మహిళలు మహరాణులు భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల లో సరిలేరు మీకెవ్వరూ🙏🙏👍
11
[13/02, 9:27 PM] Vijayalakshmi Ch KS 38: కవితా గానం
తేది :13-02-2021
చెన్నా విజయలక్ష్మి, బీర్కూర్
అంశం :అంతర్జాతీయ మహిళా దినోత్సవం
శీర్షిక :సాటి మనిషిగా చూడు
**********************--*
ఓ పురుష పుంగవా !
ఓ మహాను భావా !
మహిళా దినోత్సవం అంటూ
మహిళా !నీవే మహోన్నతమంటూ
వట్టి మాటలు కట్టి పెట్టోయ్
జననం నుండీ మరణం వరకూ
వనిత లేనిదే క్షణం గడచునా !
క్షణక్షణం నీ వెంట ఉండునే
కుటుంబ శ్రేయస్సే ప్రాణంగా నెంచునే.
ఆమె సహనం భూమి కి సమం
ప్రేమ, సేవలే ఆమెకు ప్రియం
నిలువెత్తు త్యాగానికి రూపం
నిస్వార్ధమే ఆమెకు ప్రాణం
ధైర్యం ఆమెకు ఆయుధం
నీ చేయూత నందిస్తే ఎదుగుతుంది గగనం దాకా
మాటలు చాలవు పొగడగ
ఋణం తీరదు ఏమిచ్చినా
బిడ్డగా, భార్యగా, కోడలిగా
అమ్మగా, అమ్మమ్మ గా
పోషించు నెన్నెన్నో పాత్రలు
జీవన సంగ్రామ రంగాన
ఎంతో చాక చక్యంగా, సమర్ధ వంతంగా
ఆమె గుణాలను వర్ణించడం నీకు శక్యమా !
ఆమెను ఆకాశాని కెత్తనక్కరలేదు
గుడులు గోపురాలు కట్టక్కర లేదు
దేవతగా పూజించక్కర లేదు
మణులు మాణిక్యాలు అక్కరలేదు
మిద్దెలు మేడలు అవసరం లేదు
తోటి మనిషిగా గుర్తించు
కొంచెం ఆప్యాయత చూపు
12.
[13/02, 9:28 PM] విజయ లక్ష్మి యాదాద్రి: కవితాశీర్షిక: *నేటి మహిళను*
--------------------**************-----
*మహి* లను నేటి మహిళను
కవి రాయలేని సత్కృతిని
రవి చూడలేని ప్రకృతిని
ఆదిశక్తిని ఆగమవర్తిని.
మానవజాతి మనుగడకు మూలాన్ని
మమతానురాగాలకు మారురూపాన్ని
సహనానికి శాశ్వత నివాసాన్ని
సహృదయతకు సహవాసాన్ని
అంతెరుగని అనురాగనిధిని
కడ లేని కరుణాకడలిని
కమనీయ అభిమానగనిని
క్షమాగుణం ప్రేమధనాల కావడిని
కుటుంబవ్యవస్థ కోసం నాకు నేనే అమీబానై
అబలలా కనబడే మనోధైర్య సబలను
వ్యక్తిత్వమున్న తరుణిగ ఎదిగేందుకై
ప్రతిక్షణం ప్రయత్నిస్తున్న దానను
పుణ్యస్థలి మాతృగర్భాన్ని మరుభూమిగ
మార్చి నను హతమారుస్తున్నా...
జుగుప్సాకర ఉన్మాదపు చేస్థలతో
నిలువునా అభిమానధనాన్ని కాల్చేస్తున్నా
నేటికీ స్త్రీ పురుష సమానత్వ భావన. పగటికలగా మిగిలే ఉన్నా
మనసెంత క్షోభిస్తున్నా మారుతూనే ఉన్నా
మీ తప్పులను మన్నిస్తూనే ఉన్నా.
కొత్తసవాళ్ళు కొండచిలువలై చుట్టేస్తున్నా
వెనక్కిలాగే బంధనాలను తెంచుకుంటున్న.
కొత్త ఒత్తిళ్లు సైతానులై సతాయిస్తున్నా
పాతసమస్యలను చక్కబెడుతున్నా
సమస్యలు సశేషంగా సాధిస్తున్నా
ఆత్మవిశ్వాసం తోడుగ అహర్నిశలు
అస్తిత్వం కోసం ఆరాటపడుతూ ఉన్నా
ఇంటాబయట పోరాటం సలుపుతూ
ఆశావాదంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న-
స్త్రీని మనసున్న సాటిమనిషిగ చూసే రోజుకై
వివక్షాకలుపులు లేని వనాల కోసం.
సకల స్త్రీల సమున్నత స్థానం కోసం
సద్భావనా సుమ పరిమళాల కోసం
సమానతాఫలాల మాధుర్యం కోసం
మీరు యుగాలుగా వంచిస్తూనే ఉన్నా
మీ మంచికోసం తపిస్తూనే *నేనున్నా*
మీరు నన్ను ఎoతగా వేధిస్తున్నా..
నే సాధిస్తూనే ఉన్నాను-ఉంటాను
నేనుoటూనే మిమ్మల్ని ఉంచగలను
నేటిమహిళను నేను *మేటి మహిళను*.
వల్లాల విజయలక్ష్మి,,ఆలేరు
13
[13/02, 9:29 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..జాతీయ మహిళా దినోత్సవం
శీర్షిక...వెలుగు దివ్వెలు
ఆంక్షల ముల్లెన్నో గుచ్చుతున్న
కట్టుబాట్ల సంకెళ్ళు బంధించినా
ఆ చట్రాన్ని ఛేదించుకొని
ఆత్మస్థైర్యమే ఆయుధమై
అడుగు ముందుకు వేస్తున్న మహిళ
అవమాలెన్ని ఎదురైనా
అకుంఠిత దీక్షతో
ఆత్మవిశ్వాసంతో సాగుతూనే ఉంది
ప్రేమను పంచే అమ్మగా
అనురాగ మందించే ఆలిగా
సోదరిగా మమకార మందిస్తూ
కూతురిగా కంటి వెలుగై
మమతల సిరులెన్నో కురిపిస్తూ
అన్నింటా తమ శక్తిని ఋజువు చేస్తున్న మహిళా మణులు
అలుపెరుగని సేవా మూర్తులు
చెప్పలేని బాధలెన్నో మది నిండుగాభారమై బాధిస్తున్నా
మోమున చిరునవ్వులు చిందిస్తూ
అనుకువతోనే మెదులుతూ
అవసరమైతే ఆదిశక్తులయ్యే వీర మహిళలు
తమకు తామే స్ఫూర్తి పొందుతూ
సమాజాన్ని చైత్యన్య పరిచే వెలుగు దివ్వెలు.
తిన్నావా అన్న నీ చిన్న పలకరింపు చాలు
రవ్వంత నీప్రేమ అమృతం తనకు
నీ అండ కొండంత ధైర్యం తనకు
ప్రపంచాన్ని గెలవడానికి
రక్షణగా నిలబడు
స్నేహితుడవై నమ్మకాన్ని కలిగించు
ప్రాణమిస్తుంది ప్రణమిల్లుతుంది.
Comments
Post a Comment