Skip to main content

వెలుగు పూలు Feb 6,2021

 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ

****************

కవివరుల జాబితా

1. భరద్వాజ గారు.

2.కోరాడ గారు

3. గుమ్మన్న గారి బాల సరస్వతి గారు

4.విజయ దుర్గ గారు

5.పరాంకుశం రఘు నారాయణ గారు

6. వల్లాల విజయ లక్ష్మి గారు

7. మర్రి జయశ్రీ గారు

8.డా.బల్లూరి ఉమాదేవి గారు

9.

10.వురిమళ్ళ సునంద గారు


*******

[06/02, 8:02 PM] Lalita Sister: ✳️✳️✳️✳️✳️✳️

కవితాగానం

నేటి అంశం

06.02.2021

*వెలుగు పూలు*

ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు

అంశానికి కవితలతో స్పందించగలరు.


ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెలపకుండా సహకరించగలరు.


✳️✳️✳️✳️✳️✳️

1

[06/02, 8:15 PM] భరద్వాజ గారు: ✳️🌞🌻🌼✳️🌞🌻🌼🌞

 కవితాగానం

అంశంః‌వెలుగుపూలు

శీర్షికః‌ఆనందాలకు ఆనవాలు

**************************

సమస్యలతోరణం జీవితం

కష్టాలతోనే‌ప్రయాణం అనుక్షణం

ఆశే అతని ఊపిరి-

ప్రయత్నిస్తాడు‌సాధించటానికి కష్టపడి-

ఎప్పుడో వచ్చేటి సుఖాలు-.

అనుకోకుండా‌తీరే కోరికలు

అయాచితంగా‌వచ్చే అదృష్టాలు

అతని చీకటి బ్రతుకున‌చల్లు తాయి‌వెలుగుపూలు-

వెదజల్లు తాయి ఆనంద పరిమళాలు-

ఆపూల‌పరిమళం కోసం పడతాడు తాపత్రయం-

ఆకాశం లో‌చుక్కల్లా-

ఎడారి‌ఒయాసిస్సులా-

అతన్ని ఆక్షణాలు‌తీరుస్తాయి సేద-

మర్చిపోతాడు గుండెల్లోని‌బాధ

***************************#************#*************

ఇది నాస్వీయరచన

భరద్వాజ రావినూతల🖍️

2

[06/02, 8:34 PM] Korada: కవితాగాన0

అంశం :-🔥వేలుగుపూలు🔥

     కోరాడ నరసింహా రావు..!

           "పూసే దేప్పుడో".....!!

             *************

ఈ మస్తిష్కపు చీకటి తోటలో

వేలుగుపూలు పూసేదేప్పుడౌ!?

దారులు చక్కగతేలిసేదేన్నడో?!

గమ్యం హాయిగ చేరే దప్పుడే !!

అగ్నానపు చీకటి తో...నిండి పో యిందీ తోట....!

ఆ గ్నాన భాస్కర కిరణాలు ....

యేనాటికి సోకునో...!

ఈ అవివేకపు బురదచేమ్మ...

యేనాటికి యింకి ఆరునో...!!

మోలకేత్తు తున్న గ్నాన బీజాలు... మోలకల్లోనే...

కుళ్ళు తున్నవి....!

ఈ చీకటి మస్తిష్కతోటలో...

వేలుగు పూలు పూసే దేన్నడో

గమ్యానికి దారులు చక్కగ

తోచేది ఏప్పుడో....!!

 **********************

     ..............కోరాడ.

3

[06/02, 8:46 PM] Gummannagari Balsaraswati: అంశం

వెలుగు పూలు...

*కవితా గానం* సమూహం కోసం..

*********************

వినీలాకాశంలో

బంగారు కాంతులు విరజిమ్మే

తారా సమూహాలు

విశ్వంభరునిచేవెదజల్లబడిన

నందనోద్యానంలో

అందంగా విరబూసిన

స్వర్ణ పుష్పాలు కాక మరేమిటి..?

అవి ఎన్నెన్ని యుగాల నుండి

మన మస్తిష్కాల తళుకు లకు

కారణమైనాయి కదా..!!


చిక్కని చీకటిలో

దట్టమైన పొదలపై ఎగిరే

చిట్టి మిణుగురులు

ప్రకృతి ఒలకబోసిన

పరిమళాలను గుమ్మరించే

వెలుతురు పూలు కాక మరేమిటి..?

ఆకారం చిన్నదైనా..

అంధకారాన్ని చీల్చగలమని చెప్పే

స్ఫూర్తికి కారణమైనవే కదా..!!


భాష 

అక్షరాకృతి దాల్చిన నాటినుండి

తాళపత్రదశ నుండి

తెల్లని పత్రదశ దాకా...

జాలువారిన పద్య గద్య రచనలలోని పదాలన్నీ

కవులు ఆరబోసిన 

వెలుతురు పూలు కాక మరేమిటి..?

మెదళ్ళలోని జాడ్యం  తొలగించి

జాగృతీత్వానికి

దారి చూపినవే కదా...


__గుమ్మన్నగారి బాలసరస్వతి

సిద్దిపేట*

4

[06/02, 9:04 PM] Vineelamma: కవితాగానం

పేరు: విజయదుర్గ

కవితా శీర్షిక : వెలుగు పూలు

కవితా సంఖ్య: 42

తేదీ: 06/02/21


ఎక్కడో ఓ నిశ్శబ్దం భళ్ళున

పగులుతూ శకలాలను విసిరితే

గతాలన్నీ మొరాయిస్తూ

ఏరుతున్నవి....!!


రెక్కలను చాచి రాతిరి

సవారీ చేస్తూ

హృదిగుమ్మాలకు సవాల్ విసిరితే

కన్నీటి పాటలు పాడేను....!!


ముత్యమంత వెలుగుపూలు

ప్రశాంతంగా పరుచుకుంటూ

తిమిరాన్ని మింగుతూ

ఆశల చుక్కలను పేర్చేను....!!


మనిషి ఆశాజీవి

ప్రతి అడుగులో ఓనమ్మకం

ఆనమ్మకమే నడిపించు

కోటిపున్నమిల వెలుగులతో.....!!



                               🌹వినీల🌹

5

[06/02, 9:28 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితా గానం* 


    అంశం:వెలుగుపూలు


 *కవితా శీర్షిక: బాలలు భావి భారత  వెలుగు పూలు*


 బాలల్లో దేశభక్తిని నింపుదాం!


 బాలల్లో దైవభక్తిని పెంచుదాం!


 బాలల్లో గురుభక్తిని ప్రేరేపిద్దాం!


బాలల్లో సామాజికస్పృహ కలిగిద్దాం!


బాలల్లో గుణశీలతను పెంపొందిద్దాం!


 బాలల్లో సృజనాత్మక భావాలు పెంపొందిoద్దాం!



 బాలలకు మాతృప్రేమ ఘనతను తెలియజేద్దాం!


 బాలలకు భవిత పట్ల అవగాహన కల్పిద్దాం!


 బాలలకు భావి భరోసా నిద్దాం!


 బాలలకు నైతిక విద్య నేర్పిద్దాం!


బాలలు భావి భారత వెలుగు పూలు!


 వికసించే పరిమళ మందారాలు!!


 పరాoకుశం రఘు నారాయణ

        మహబూబాబాద్

6

[06/02, 9:28 PM] విజయ లక్ష్మి యాదాద్రి: *వెలుగు పువ్వులు*

*****************


బొమ్మాబొరుసుల నాణె0 చందం

చీకటి వెలుగుల మనిషి జీవితం

ఆటుపోట్ల మధ్యన

సముద్రయానమే జీవన0


జీవితాన సంతోషసంతాపాలు సగపాళ్లు  

*హరితజ్యోతుల*కే తప్పవు                                                  

ఆకురాల్చు కాలాల గాలివిసుర్లు !

మనకు తప్పుతాయా కష్టనష్టాలు?


సుఖదుఃఖాలను సమానంగా

స్వీకరించగలిగిన వారే వివేకులు

జయాపజయాలను సమదృష్టితో

చూడగలిగిన వారే విజేతలు!


ఆశల చిరుదివ్వెల వెలిగించి

అజ్ఞాన చీకట్ల తొలిగించ 

విజ్ఞాన వెలుగుపువ్వుల 

కాంతిపరిమళాలు ఆస్వాదిoచు"మనేదే

వెలుగుపువ్వుల దివ్యసందేశం 


విధిని మాత్రమే నమ్ముకోకుండా

ప్రయత్నాన్ని కొనసాగిద్దాం విడువకుండా


:వల్లాల విజయలక్ష్మి

ఆలేరు

7

[06/02, 9:42 PM] Lalita Sister: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశము..వెలుగు పూలు



ఆటుపోట్లను ఎదుర్కొటూ

ఆవేదనగా సాగిపోయే జీవితాల్లో వెలుగు పూలు విరిసేది ఎపుడో

పేదరికంలో మగ్గిపోతూ

ప్రతినిత్యం మదనపడే బతుకుల్లో  వెలుగుపులు వికసించేది ఎప్పటికో

ఎన్ని పథకాలు చేపట్టినా

ఎన్నెన్నో ఆలోచనలతో

నూతన ప్రణాళికలు రచించినా

తీరని ఆశలు

నెరవేరని లక్ష్యాలు

అట్టడుగున మగ్గిపోయే బడుగుజీవుల ఆకలి కేకలు తిరిపోయే శుభదినం కోసం ఎదురు చూడడం తప్ప

ఏమి చేయలేని స్థితి

మారాలి  సమాజం

స్వార్థపు ఆలోచనలు అంతమవ్వాలి

అందరి మోములో ఆనందం వెల్లివిరిసి

వెలుగు పూలు పూయాలి 

వేదనలు దూరమయ్యి 

వేడుకలు జరగాలి ప్రతినిత్య

8

[06/02, 9:52 PM] Lalita Sister: పేరు: డా. బల్లూరి ఉమాదేవి

అంశం: వెలుగు పూలు


అంధకారంలో బ్రతికిన జనాలకు

ఇప్పుడిప్పుడే అగుపిస్తున్నాయి

వెలుగు పూలు తావులు విరజిమ్ముతూ 

ఆనందాన్ని పంచడానికై

భయం గుప్పిట్లో ఇన్నాళ్ళుగా ముడుచుకుపోయిన ఆశల పూలు 

రెక్కలు విప్పుకుంటూ వెలుగులు చిమ్మగా చిన్నగా సమాయత్తమవుతున్నాయ్

 కరోనా భయం తో కాళ్ళు కదప లేక 

ఎవరికి వారే అజ్ఞాతంలో ఉన్నట్టు గా భావిస్తూ ఉన్నవారందరూ నేడు

విప్పారిన మోముతో 

9

*కవితా గానం*

తేదీ: 06-02-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: వెలుగు పూలు

*******************

 వెలుగు పూలను కోయాలంటే

చీకటి ముళ్ళను ఒడుపుగా తప్పించాల్సిందే...


నిశ్శబ్దం ఆవరించిన నిరాశ కొమ్మలపై 

ఇంకా  విచ్చని వెలుగు మొగ్గలు

వేదనల అగ్నిలో రాలిపోకముందే

చెట్టు లాంటి మనసును అమాంతం 

హృదయానికి హత్తుకుని

 కాసిన్ని ఆశల ఎరువు జల్లాలి!

మొగ్గలు వెలుగుల కాంతులు విరజిమ్మేలా చేయాలి!


మనీషీ తనం ఇలాంటప్పుడే

తన విశ్వరూపాన్ని చాటేది!

మానవత్వం దైవత్వమై కనిపించేది...

వేయి కన్నులతో ఎదురు చూస్తూ స్వేచ్ఛావాయువులను పిలుస్తూ ఒక్కరొక్కరుగా ఇప్పుడిప్పుడే ప్ర

పీలుస్తూ  వెన్నెల వెలుగులో

 వెలుగుపూల నాఘ్రాణిద్దాం రారండీ

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...