Skip to main content

Vaartha December 2021

 నిర్వహణ శివునూరి లలితాకృష్ణ

**********

1.కోరాడ నరసింహారావు గారు

1.సుధారాణి కృష్ణం రాజు గారు

2.బల్లూరి ఉమాదేవి గారు

3.వల్లాల విజయ లక్ష్మి గారు

4.డా.ఆంజనేయులు గారు

5.ప్రమోద ముని మడుగు గారు

6.విజయ లక్ష్మి సి హెచ్ గారు

7.మర్రి జయశ్రీ గారు

8.మన్నె పిన్నక లలిత గారు

9.పరాంకుశం రఘు నారాయణ గారు

10.సునంద వురిమళ్ళ గారు

11.శ్రీ లక్ష్మి చివుకుల గారు

**********

1

కవితాగానం                           

అంశం :-      *  వార్త  *

      కోరాడ నరసింహారావు...!

       @ ఒక అవగాహన @

           *************

ప్రతిస్పందన ను కలిగించే....

స్పందనే.....* వార్త * !

అనుకోకుండా జరిగే... సంఘటనలే కదూ...వార్తలంటే!

 మిత్రులు, చుట్టాలు బంధువులనుండి వచ్చేవార్తలే

సుఖదుఃఖాల రూపంలో మనలను అతిగా ప్రతిస్పందింప జేస్తాయి...!

మనం రోజూ చదివేవి...

టీ వీ లలో చూసేవి...వార్తలు

లోకజ్ఞానాన్ని పెంపొందింప

జేస్తాయన్నది నిర్వివాదాంశం!

వార్తలు...అటు ప్రభుత్వాలకు

ఇటు ప్రజలకు వారధులు...!పాలనను సక్రమంగా నడిపే ...

సారథులు....!!

 సెల్ ఫోన్ లొచ్చి...వార్తల జోరూ....పెరిగింది...,పుకార్ల

షికార్లూ పెరిగాయి...!

వార్తాంటే....ఉన్నది ఉన్నట్టుగా

ప్రసార రచారాలు జరగక....ఉన్నవి లేనట్టు...,

లేనివి ఉన్నట్టు కల్పనలతో...

ప్రజలను ఎడత్రోవ పట్టించడం

దుర దృష్టమే....!

మాటకు సత్యమేకదా ప్రాణం!

అసత్య ప్రచారం అన్యాయమే

కాదు...మహాపాపం...!!

వార్తలు అంటే విషయాన్ని ఉన్న

ది ఉన్నట్టుగా తెలియ పరచి...

ఆలోచింప జెసి....సరైన అభిప్రాయాలను ఏర్పరచుకునేందుకు దోహదపడాలి ! పాఠకులను అయోమయంలో పడేసి ....

తప్పుదోవ ను పట్టించి....

నిప్పులాంటి సహజతత్వమున్న వార్తలను 

బ్రష్టు పట్టించకండి...

వార్తాహరు లారా....!!

   *****************

     ........కోరాడ.

2

[09/01, 9:10 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏

🙏సుధారాణి కృష్ణంరాజు🙏

*నేటి అంశం*వార్త*

09-01-2021(శనివారం)

వార్తలు చదవనిది విననిది

రోజు గడవదు

నిత్య కృత్యాలలో ఈ వార్తా పఠనం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది

ఈనాడు, ఉదయం, ఆంధ్ర భూమి, ఆంధ్రజ్యోతి ఈ పత్రికలు ఉదయం లేవగానే

ఇంటిముందు ఈనాడు దర్శనం

ఇచ్చేది

వార్తలు మంచి వార్తలు వస్తే సంతోషం చెడు వార్తలు వస్తే

వాటిని పక్క వారికి చదువు

రాని వారికి చదివి వినిపించడం

ఈ విధంగా వార్తాపత్రికల ద్వారా విషయాలు తెలుసుకుంటూ ఉండేవారు

రాను రాను సాంకేతిక పరిజ్ఞానం పెరిగి వార్తాపత్రికల

ద్వారా ఈరోజు విషయాలు

రేపటికి కానీ తెలిసేవి కాదు

ఈ చానల్స్ ద్వారా ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్

రావడంతో నిమిష నిమిషం

వార్తలు తెలుసుకునే అవకాశం

అన్ని విషయాలు రాజకీయ పరమైనవి, ఆర్థిక పరమైనవి, సినిమా రంగానికి సంబంధించి నవి 

దేశ విదేశాల్లో జరిగిన వార్తలు

అంతర్జాతీయ వార్తలు క్రికెట్ కు

సంబంధించినవి అన్ని విషయాలు ఈ వార్తలు ద్వారా తెలుసుకుంటున్నాము

ఈ మధ్య కాలంలో మొబైల్ ఫొన్ ద్వారా అన్ని వార్తలు

తెలుసుకునే సౌలభ్యం ఉంది

దీనిని బట్టి తెలుస్తోంది మనం

సాంకేతిక పరంగా ఎంత ముందుకు వెళుతున్నామో

అయితే ఈ వార్తలు ప్రచురణ

చేసేటప్పుడు వాస్తవంగా ఉన్న

వార్తలకు పత్రికలకు, చానల్స్ కు ప్రజాదరణ ఎప్పుడూ ఉంటుంది🙏🙏👍

3

[09/01, 9:13 PM] Balloori Umadevi Poetess: 9/1/21

కవితా గానం

డా.బల్లూరి ఉమాదేవి..

అంశం: వార్తాపత్రికలు


ఆ.వె:ప్రజలనాడి దెలుపు పత్రికలిలలోన

       వాస్తవములు దెల్పు వాసిగాను

      క్రీడ లైనగాని క్రీనీడలే యైన

      జగతి ముందు బెట్టు జంకు లేక.


ఆ.వె:వార్త,జ్యోతి,భూమి వంటిపత్రికలెన్నొ

       గలవు తెలుగులోన ఘనముగాను

      జంకు కొంకులేక సరియైన సమయాన

      వార్తలందచేయు వసుధయందు.


ఆ.వె:వయసదేది యైన వార్త పత్రికనెల్ల

      వాసిగాను చదువ వలయుననెడి

       కాంక్షహెచ్చు చుండు గడప గడపలోన

     తెలుగు పత్రికెపుడు తిరుగుచుండు.


ఆ.వె:ఉదయవేళలందు నుర్విలో జనులకు      

         నందుచుండు పత్రికనుదినమ్ము

        వేడి కాఫితోడ వేగముగా దీని

         చదువు చుందురెల్ల చక్క గాను

4

[09/01, 9:15 PM] విజయ లక్ష్మి యాదాద్రి: *వార్త*

******

తెలియని విషయాన్ని తెలిపే 

ఆసక్తికర కథనాలు *వార్తలు*

అవంటే తెగ ఆసక్తి అందరికీ

వార్తలోకెల్లా శుభవార్తలె ప్రియం ఎల్లరికీ


తెలిసిన వార్తలను చిలువలు పలువలుగా

ప్రచారం చేయడం అలవాటు ఎందరికో

చూపిన వార్తలనే పదిసార్లు తిప్పితిప్పి 

చూపెట్టటం ప్రచార ఛానళ్ల తంతు


ఒక్క డి ఏ మంజూరును పదేపదే ప్రకటించి 

ప్రచారం చేయటం ప్రభుత్వం పత్రికల వంతు

అది ఉద్యోగస్థులను బద్నాం చేయు తంతులు

సంచలనవార్తలకై సోషల్ మీడియా పిచ్చిగంతులు


ఒకరికి శుభవార్త లయిన విశేషాలు 

ఇతరులకు దుర్వార్థ కాకుంటే మేలు

నూతన వత్సరం అందరికీ శుభవార్తలనే

అందిస్తుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షి ద్దాం


వల్లాల విజయలక్ష్మి

ఆలేరు

5

[09/01, 9:18 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: వార్త

విశ్వమంతా సాగి వచ్చే సమాచారం అంతా వార్త

పూర్వం పెద్దలు అన్నారు కదా vipula చ పృద్వి

కాలం చుట్టూరా


అద్భుతమైన అంశాలు అన్నీ

విషాదాలు ఆనందాలు రాజకీయాలు ప్రపంచ విజ్ఞానమంతా కళ్ళముందు కదలాడింది చేసేది వార్తాపత్రిక మాత్రమే


వార్తలను సేకరించి రిపోర్టర్స్ ఎడిటర్ల సహకారంతో


పత్రికా లోకంలో ఆరోజు జరిగిన వార్తలన్నీ టెలిప్రింటర్ పైన ప్రింటింగ్ మిషన్ పైన 12 గంటల తర్వాత ప్రచురింపబడ్డ 


తెలుగు పత్రికలు

ఆంధ్ర భూమి ఆంధ్ర ప్రభ ఆంధ్రజ్యోతి విశాలాంధ్ర వెలుగు


మనం మన తెలంగాణ నమస్తే తెలంగాణ ఇట్లా లెక్కలేని పత్రికా ప్రపంచమంతా మన ఇంటి ముంగట సైకిల్ గుర్రాలెక్కి

మంచులో చలిలో వర్షంలో


వార్తా పత్రికలు వెదజల్లే బడతాయి అవి పక్షుల మన ఇంటి ముంగట వచ్చి వాలుతాయి



పత్రికా లోకం అంటేనే

రాజ్యాంగంలో ఎస్టేట్

రాజ్య విషయాలు అసెంబ్లీ వార్తలు ఇంటర్వ్యూలు ఎన్నో కళ్ళముందు అద్భుత అంశాలు కదిలాడుతాయి


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453

5

[09/01, 9:24 PM] +91 90002 51604: తె ల తెల వారుతూనే....మామయ్య కళ్ళు వెదుకుతాయి...పేపర్ అబ్బాయి వేసిన పేపర్ లోని వార్తల గురించి...

వంటింట్లో పనులు చేస్తూనే..ఓ చెవి ఇటు పడేసే అత్తగారు ఆత్రంగా ఉంటారు టీవీ లో వచ్చే వార్తల గురించి ..

ఈ మధ్య వచ్చిన కరోనా మహమ్మారి ...వల్ల

దినదిన గండం ... నూరెళ్ళయిష్షు గా ఉంది

ఏ వార్త ఎక్కడనుంచి వస్తుందో అని...

గుండెలో గుబులే ఐనా ఆశగా..ఎదురు చూస్తూ..వాక్సిన్  గురించిన వార్త కోసం

వలస కూలీగా వెళ్లిన భర్త దగ్గరినుంచి క్షేమసమాచారం    కోసం

దేశ భద్రత కోసం వెళ్ళిన జవాను విజయ కేతనం గురించి

విదేశాల్లో ఉన్న పిల్లల ఎప్పటికప్పుడు సమాచారం కోసమై....వృద్ధ తల్లిదండ్రుల ఎదురుచూపు

టెక్నాలజీ పెరిగింది

పావురం నుంచి  మొదలైన ప్రస్థానం.....క్షణాల్లో వార్తను తెలిపే సామాజిక మాధ్యమం సాక్షిగా

ప్రపంచ వార్తలన్నీ...అరచేతిలో ఇమడగా..

ఆనందం విషాదం జ్ఞానం,విజ్ఞానం...

ఎదైనా సరే..ఇట్టే ఇట్టే అందించే..వార్తలు....

మన మనుగడ కే ఆనవాళ్లు...

తరతరాల వారధులు

అందుకే ఉండాలి వార్తలు..నికార్సైన నిజాలై..


ప్రమోద మునిమడుగు

6

[09/01, 9:26 PM] Vijayalakshmi Ch KS 38: కవితా గానం 

చెన్నా విజయలక్ష్మి 

అంశం :వార్త 

శీర్షిక :విజ్ఞాన ఖని 


నాలుగు దిక్కులయందు జరిగే విశేషాల, దృష్టాంతాల సమాహారం 

సేకరించడానికి పత్రికా విలేఖరులు పాటు బడతారు అనుక్షణం 

పత్రికా సంపాదకులు ప్రచురించి అందిస్తారు 

పాఠకుల ఇంటివద్దకే సూర్యునితో పోటీ పడుతూ 

కలుగజేస్తారు  ప్రజలకు విజ్ఞాన వినోదాల 

పంటలు పండిస్తూ 


విశాల ప్రపంచంలో మూల మూలల్లో జరిగే వింతలు, విశేషాలు 

విజ్ఞానాన్ని అందించే శాస్త్ర విశేషాలు 

నిరుద్యోగులకు ఆశా దీపాలైన ఉద్యోగవిశేష వార్తలు 

అతివలు మెచ్చే అలంకార, అందాలను పెంచే చిట్కాలు 

ప్రేరణనిచ్చేవిజయాలు సాధించిన వారి విజయగాధలు 


జాతీయ అంతర్జాతీయ రాజకీయ వార్తలు 

విశద పరచని విషయం లేదు, అందించలేని అంశం లేదు 

సత్యా సత్యాలను నిగ్గు తేల్చి 

నీతి నిజాయితీలను పాటిస్తూ 

రవిగాంచనిచోటుకు కూడా కలం కిరణాలతో చొచ్చుకు పోయి 

ప్రాణాలకు తెగించి నిజాలను

వెలికి తీసే మహోన్నత రంగం వార్తా ప్రపంచం 


పత్రికా విస్తరణ కోసం కాకుండా 

నిజ నిర్ధారణ కోసం పరిశ్రమించే 

పత్రికా రంగం నిలుస్తుంది కలకాలం 

సమాజంలో ప్రజల మానస సింహాసనం పైన 

మకుటాయమానమై దేదీప్య మానంగా వెలుగుతూ అజ్ఞాన అంధకారాన్ని తొలగించే 

సూర్య కిరణాలై కాంతులు వెదజల్లుతుంది.

7

[09/01, 9:29 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..వార్త

శీర్షిక..అద్దాలు


సమస్త విశ్వ సమాచారం అందిస్తూ

మనుషులను స్పందింపజేసే వార్తా పత్రికలు

ప్రపంచానికి అద్దాలు

ఎంతో వేగంగా ప్రయాణించే వార్తలు

కల్పితాలు కాకుండా

వాస్తవాలు వెలికి తీస్తూ

సమాజానికి మార్గం చూపే దిక్సుచి

ప్రభుత్వానికి ప్రజలకు వారధి

విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించేలా దోహద పడుతూ

నిప్పులాంటి నిజాలను బయట పెడుతూ

ఉప్పెనలై ఎగిసే సంఘటనలను సహితం చల్లార్చే శక్తివంతం వార్తా పత్రికలు

శాస్త్ర సాంకేతికత పరిఢవిల్లిన నేటి తరుణంలో 

వార్తలు దుష్ప్రచారమై 

సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా 

యువతను వక్ర మార్గంలో పయనింప జేయడం విచారం

ఒకరి విషయాలు ఒకరు తెలుసుకోవడం వార్తలే

మనుషుల మధ్య అనుబంధాలు మెరుగుపరిచే వార్తలు ఎప్పటికీ సజీవాలు

చైతన్య దీపాలు

8

[09/01, 9:29 PM] +91 74168 63289: కవితా గానం   తేదీ 9/1 /21 పేరు మన్నె పిన్నకలలిత

 అంశం వార్త

 పూర్వం పక్షుల ద్వారా ,ఆంతరంగికల ద్వారా వార్తలు 

 వార్త తెలియజేయు విశ్వ ప్రపంచాన్ని

 వార్తతో జగము వెలుగునిచ్చు

 అక్షర కుక్షులకు వార్త విందు భోజనంబు

 అక్షర ప్రపంచానికి అక్షర సూరీడు వార్త

  వార్త తోడ వెలుగు అఖిల జగము

 ఆనంద విషాదాలు ,రాజకీయాలు ,కథలు, కవితలు 

ఆబాల గోపాలానికి అంది వచ్చే వార్తలు 

ఆనందాన్నిచ్చే వార్తలు

 వార్తలు తెలియజేసే రోజువారీ పత్రికలు

 పక్ష పత్రికలు, మాస పత్రికలు ,త్రి మాస పత్రికలు

 తెలుపుతాయి ఎన్నో వార్తల సమాచారాలు

 ఉత్తరాలు,  చరవాణి , అంతర్జాల,  దూరదర్శన్

 వీటి ద్వారా కూడా వార్తల సమాచారం తెలుసుకోవచ్చు

 అందులో కూడా వార్తలు తెలుసుకునే విశ్వ ప్రపంచాన్ని వీక్షిస్తారు

8

[09/01, 9:30 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితాగానం* 

నేటి ఆధునిక ప్రపంచంలో వార్తా సాధనాలు కొత్త రూపం దాల్చాయి!

 పూర్వకాలంలో 

పావురాయితో వార్తలు పంపే..,


 ప్రక్రియ అనేక అనేక రూపాంతరాలు చెందింది !


శుభవార్తతో సంతోషించే వారు కొందరైతే!


 అనారోగ్యంతో వెళ్లి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వస్తున్న వార్తలు సంతోషాన్నిస్తాయి!


ఉపాధి మార్గంతో తలమునకలైన నిరుద్యోగులకు అందే ..,


అందే వా ర్తలు సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి!


 వార్త సుఖజీవనం సంకేతాలు! దివ్యజీవన సందేశాలు!!

 పరాంకుశం రఘు నారాయణ మహబూబాబాద్

9

[09/01, 9:32 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*

తేదీ:09-01-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: వార్త

********************

సమాజమైనా దేశమైనా  ఎక్కడైనా ఓ సంఘటన

అందరికీ చేర వేయడాన్ని భుజాలపై వేసుకున్న బాధ్యతా యుతమైన విషయమే.. వార్త.


 ప్రపంచం నలుమూలలా

ఉత్తర దక్షిణ తూర్పు పడమర

విషయాల సేకరణే వార్త 

ఇంగ్లీష్ లో న్యూస్ అంటూ పిలుచుకునే  వార్త

నేడు ప్రపంచానికి 

వేగుచుక్కతో పాటు 

పేపర్ బాయ్ ద్వారా అందిస్తుంది..


 సమాజంలో జరిగే అనేకానేక సంఘటనలకు

సాక్షి భూతంగా నిలిచి

అన్యాయం అక్రమాలను

లోపాలను వెతికి పట్టుకొని

ప్రజల ముందు పెట్టే వార్త

ప్రజా హితమై 

ఎన్నో సమస్యల్ని పరిష్కరిస్తుంది..


మరెన్నో వెలుగు చూడని రహస్యాలను ధైర్యంగా బయటకు తెచ్చే. వార్తలు..

ప్రజాస్వామ్య వ్యవస్థకు

పట్టుగొమ్మలు..

11

కవితా గానం 

తేదీ 09-01-2021 

అంశము వార్త 

పేరు శ్రీలక్ష్మి చివుకుల


వార్తయందు జగము వర్తిల్లుచున్నది

యదియు లేనినాఁడ యఖిలజనులు

నంధకారమగ్నులగుదురు గావున

వార్త నిర్వహింప వలయుఁ బతికి.

అలనాడు మయసభలో నారదుడు

ధర్మరాజు నడిగిన మాట!

గ్లోబల్ వార్తలకు ఆద్యుడాతడు!

పావురాల కాలికి ఉత్తరాలు 

కట్టిరి రాజులూ రారాజులు

పచ్చిమిరపకాయలతో

లేఖనంపిరి అల్లూరి సైన్యం!

రొట్టెల నడుమ వార్తలు నింపిరి

గూఢచారులు పట్టుబడిన వేళ

ఆత్మాహుతియే ఆనాడు!

అదియే కొనసాగించిరి ఉగ్రవాదులు ఎన్నాళ్ళో!

మెడలో సైనైడ్ కాప్స్యూల్ తో

హంస రాయబారాలు

చిలుక చిన్ని మాటలు మాయమయ్యే

టెలిగ్రామ్ లు మోర్సులూ

ఫోన్లూ మొబైల్ లూ

రేడియోలు టీవీలూ

క్షణక్షణానికి మారే సాంకేతికత

సకల ప్రజానీకం ముందర నిలిచే

సీసీ కెమెరాలతో ప్రత్యక్ష సాక్ష్యాలు

మసాలాలు దట్టించి

రాజకీయ రంగు పులిమి

వార్తలు విషయ సేకరణ గాక

రేటింగుల కై ప్రాకులాట

బజారు బ్రతుకాయె!

గుట్టు మట్టు లేని బ్రతుకులాయె!

అలనాటి శాంత జీవనమ్ము

మాకు ఇమ్మనుచు

విశ్వ ప్రజలు వేడుకొనుచుండిరిల!

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...