నిర్వహణ శివునూరి లలితాకృష్ణ
వెన్నెల శిల్పం కవయిత్రి
************
నేటి అంశం
*మౌనరాగం*
1. చివుకుల శ్రీలక్ష్మి గారు
2. వినీల గారు
3. ధనాశి ఉషారాణి గారు
4. పరాంకుశం రఘునారాయణ గారు
5. మన్నె పిన్నకలలిత గారు
6.కోరాడ నరసింహారావు గారు
7. విజయభారతి గారు
8. గుమ్మన్న గారి బాలసరస్వతి గారు
9.వై.కె.సంధ్యశర్మ
10. అయితఅనిత గారు
11. సుధారాణి కృష్ణంరాజు గారు
12. మర్రి జయశ్రీ గారు
13.ప్రమోద మునిమడుగు గారు
14.వురిమళ్ల సునంద ఖమ్మం గారు
15.వల్లాల విజయలక్ష్మి గారు
ఆలేరు
16.భరద్వాజ గారు
17.డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి గారు
18.చెన్నా విజయలక్ష్మి గారు
అంశానికి స్పందించిన కవి మిత్రులకు ధన్యవాదాలు
*************************************************
1
శ్రీ లక్ష్మి విజయనగరం: కవితా గానం
తే. 07-01-2021
అంశము: మౌనరాగం
పేరు: చివుకుల శ్రీలక్ష్మి
ప్రియా! ప్రియా! మాట్లాడవా!
కన్నుల బాసలు తప్ప
కమ్మని కబురులు లేవా?
ఈ వెన్నెల వేళల్లో....
మనసు విప్పి పలుక వేల?
మౌనరాగమెందుకు?
సాగరతీర సమీపములో
అడుగులో అడుగు వేసి
చేతిలో చేయి వేసి
నడిచే మధుర క్షణాలలో
మనసు విప్పి పలుక వేల?
మౌనరాగమెందుకు?
నింగి నంటు అలలన్నీ
తీరానికి కొట్టుకొచ్చి
ఫేనమయే వేళలో
ఓడిన ఆ కెరటాల చూసి
మనసు విప్పి పలుక వేల?
మౌనరాగమెందుకు?
కడలి నుండి ఉదయించిన చంద్రునిగని
నవ్వే నీ పలువరుస కాంతి చూసి
ఓడితినని జాబిల్లి సిగ్గిలి
మబ్బుల మాటున దాగిన వేళ
మనసు విప్పి పలుక వేల?
మౌనరాగమెందుకు?
ప్రియా! ప్రియా!
హృదయాలొకటై నీవే నేనై
మనసా వాచా కర్మణా
ఒకరికి ఒకరై జీవన పర్యంతం
దేహాలు రెండై ఒకటే అంతరంగమై
మౌనరాగమాలపించువేళల
మాటలేల??
2
[07/01, 8:58 PM] Vineelamma: కవితాగానం
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : మౌనరాగం
కవితా సంఖ్య: 41
తేదీ: 07/01/20
కనులు కనులు కలిసిన
తరుణాన
మెరిసే మెరుపుల ఎరుపులు
ఎదలో మోగే తరంగాలు....!!
తొలిప్రేమ జాడలలో
ఉక్కిరిబిక్కిరి ఊపిరి నిట్టూర్పులలో
శ్వాసించే మధురిమల పరిమళం
నీ నవ్వుల కులుకులు....!!
పారేసుకున్న మనసు
కలతతీరని కానుకలా
నిదురను మింగిన కాలమై
నీ ఊసుల ఊటలలో ఊరుతూ
మురిసినది....!!
మెదిలే ప్రేమభావాలు
పలుకలేక ఎదను దాచలేక
మలిసంధ్యా గీతమై
పల్లవించు మౌనరాగమై నీకోసం....!!
3
శీర్షిక. మౌనరాగము
........
గుండెల్లో గూడుకట్టుకున్న
గుట్టువిప్పలేని బాధలెన్నో
ఉప్పెనగా ఉప్పొంగు తున్నవేళ
నా అన్నవారు వెన్నుపోటు పొడిచినవేళ
చెప్పలేని భావావేశములు మదిని క్రుంగతీస్తూవుంటేను
కల్లనుండి కారే కన్నీటి దారలను
ఆపేవారెవ్వరూ గుండెనుండి ఉప్పొంగే బాధను తీర్చేవారెవరు
కన్నప్రేగు బంధము వెన్నుపోటు పొడిచినవేళ
గుండెల్లో బాధను తీర్చేవారు
ఎవ్వరూ
కాలమనే నావలో మనిషి మౌనరాగమును జపించి
బతుకు సాగిస్తున్న బ్రతుకులు ఎన్నో
గుండెల్లో దాగిన గాయాలతో బ్రతుకు ఏడుస్తున్న వారు ఎందరో
ధనాశి ఉషారాణి
భాకరాపేట
చిత్తూరు జిల్లా
4
అంశం: మౌనరాగం
సమస్యల సాధనలో...,
పరిష్కారం దిశలో....,
మౌనరాగానిదే !పైచేయి!
నిశ్శబ్దం ఒక్కోసారి
విప్లవమై,
పెను తుఫానును సృష్టిస్తుంది!
ప్రశాంత సంద్రంలో సైతం!
అలలుప్పొంగినట్లుగా..,
సగటు జీవి జీవనoలో..,
ఆటుపోట్లు సహజమే కదా!
ప్రతి సమస్యకు పరిష్కారం !
ముంటుందన్న సకారాత్మక ఆలోచనలతో..,
ముందుకు వెళితే!?
నీ జీవితమే గొప్ప విజయం!
విజయానికి చక్కని దారి మౌనం !
మౌనవ్రతమే పురోగమనం!
తద్వారా జీవనం ప్రశాంతం!
ప్రతి హృదయం తేజోమయం!!
పరాంకుశం రఘు నారాయణ
మహబూబాబాద్
5
తేదీ 7/1/ 2021
అంశము: మౌనరాగం
పేరు :మన్నె పిన్నక లలిత
అంశము: మౌనరాగం
కరోనా కాలంలో ప్రపంచమంతా
మౌన రాగం పలికి మూగ అయినది
ప్రేమించిన హృదయాలు రెండు
పరవశమై మౌన రాగాలు పలికిస్తున్నవి
ప్రాణం ఉన్న చెట్టు పలికే భాష లేక
మౌనరాగం పలికిస్తోంది
కమ్మగా పాడే కోయిల
నిస్తేజమైన మనుష్యులను చూచి
పాడటం మర్చిపోయి మౌన రాగాలు తీస్తోంది
పేద తల్లిదండ్రులు కలో గంజో తాగి
ప్రాణ ప్రదమైన పిల్లల్ని చదివించి ప్రయోజకుల్ని చేస్తే
రెక్కలు వచ్చి ఎగిరినపిల్లలకు
తల్లిదండ్రులను కనుచూపుకు దూరం చేసుకుంటే
ఆ తల్లిదండ్రులు రోదనలోనే మౌన రాగాన్ని ఆలపిస్తారు
6
[07/01, 9:23 PM] Korada: కవితాగానం
అంశం :- మౌన రాగం
కోరాడ నరసింహా రావు ...!
* రాగాలవి ఎన్నో...ఎన్నెన్నో! *
*********************
మాట లాడక పోవటమే.....
మౌన మని ...ఎవరన్నా అంటే
వాళ్లు పప్పులో కాలేసినట్టే...!
అసలు...మౌనమే ఎక్కువ
మాట్లాడుతుంది....!!
భూత,భవిష్యద్వర్తమానాలన్నీ
కలబోసి...మధించి...నిగ్గు తే లుస్తుంది...!మౌనం... సప్తస్వర
భావాలనూ...ఆలపిస్తూ...మనసును ఆస్వవ్వాదింప జేస్తుంది!
మనసుతో వాదించి....
నిలదీసి...నచ్చజెపుతుంది !
బోధించి....బుజ్జగిస్తుంది...!!
మనసును సేద దీర్చి...శాంతిని
ప్రసాదిస్తుంది....!
మౌనం ఆలపించే....రాగాలవి
ఎన్నో...! ఎన్నెన్నో...!!
************************
.............కోరాడ.
7
[07/01, 9:23 PM] కొలచన విజయ భారతి Poetess: కవితా గానం
పేరు: కొలచన విజయ భారతి
ఊరు: హైదరాబాద్
అంశం:మౌనరాగం
తేదీ:7-12-2021
********************
ప్రియా!
నీ చిలిపి కనులు పలికే మౌనరాగం
నా మది వీణియ తంత్రులను
మీటి ప్రణయ రాగం పలుకుతోంది
ఏదో తెలియని మధుర భావన
గుండెలలో తొణుకుతోంది
నీ తలపుల జడివాన లో
ననిలా తడిసిపోనీ
నీ ఒడిలో నను ఒదిగిపోనీ
కదిలే కాలం ఇలాగే ఆగిపోనీ
నీ ప్రేమ సాగరంలో
నా బతుకు నావ సాగిపోనీ
నీవాలపించే మౌనరాగంలో
నా జీవన మాధుర్యం
అలలై ఉప్పొంగనీ
8
[07/01, 9:23 PM] Gummannagari Balsaraswati: నేటి కవిత..
అంశం: మౌనరాగం...
శీర్షిక: *మౌనం*
రచన: *గుమ్మన్న గారి బాలసరస్వతి*
**************"*"
నేస్తమా!
సూర్యోదయపు వెలుగు రేఖల తోనే
నా తలపుల స్వరాలు
నీ హృదయంలో
సుమధుర రాగాలను ఆలాపిస్తాయనీ,
ఉషోదయం తోనే
నా ఊహల తలుపులు
నీ మదిలో
తెరుచుకుంటాయనీ
చల్లటి పిల్ల తెమ్మెర వంటి
నా పలకరింపు ను
నీ హృదయం
ఆశిస్తుందనీ ,నాకుతెలుసు...
కానీ....
ఎందుకో నేస్తం...!!
నీతో భావాలను పంచుకున్న మరు క్షణం
నా హృదయం...
గుబాళింపు లను వెదజల్లే
మల్లెపూవు లను చేజేతులా రాల్చుకున్న
సన్న జాజి తీగలా బోసిపోయి,బేలగా
"ఈ రోజు కింతే"అన్న నిర్లిప్తత ను
చెప్పకనే చెప్తుంది...
మళ్లీ శోభ పునరా వృత్తి కోసం,
పూచే "ముచ్చట్ల"పూవులకోసం
రేపటి దాకా ఎదురు చూచేకంటే,
విచ్చుకున్న భావాలను
నాలోనే పొదివి పట్టుకుని
తనివిదీరా
ఆఘ్రానించడమే నయం...
అందుకే చెలీ......నా ఈ మౌనం....
9
వై.కె.సంధ్యశర్మ
:మౌనరాగం*
ముడి వేసిన మమతల కోవెల మధ్య
మనసు మూలాలను తడుముకుంటూ
తలపుల తపనల మధ్య తనో
మౌనరాగమే...
ఘనీభవించిన పిలుపులన్నీ
గుండె గూటిలో దాచేస్తూ
నిశి వేళ వెన్నెల తాపడమద్దే
తాపసిలా....
కొనకనుకుల్లో ప్రోగేసే
కలువల మధ్య తనో మౌనరాగమే
మనసు మాగాణిపై మల్లెల పరిమళాలు
చిలకరించే చిరునవ్వుల సొగసులన్నీ
మునుపంటి కింద హత్తుకునే
సిరినగవుల మధ్య తనో మౌనరాగమే...
నెలవంకపై అలవోకగా విసిరిన
నక్షత్ర సుమాలను అణువణువూ
పొదువుకున్న అక్షర కాంతుల మధ్య
తనో మౌనరాగమే..!✍🏻✍🏻
10
అంశం : మౌనరాగం
శీర్షిక: *మౌన రాగం*
మదికెప్పుడూ
చింతల ఆతిథ్యమే!
మాటేసిన అసూయాకత్తుల
మిడిసిపాటు వేటుతో!
మింగుడు పోని
నిజాలెప్పుడూ నిష్టూరమే!
మీరిన కష్టాల మిద్దెల మీద
బతుకెప్పుడూ గందరగోళమే!!
ముంగారు వానలో
మురిసిన బాల్యం ఎరుగని వెతల్లో
ఓలలాడిన వైనం!
జీవన వృక్షానికెప్పడూ
మూలమవును సడలని సంకల్పం!!
మృగాల వంటి సహచరులు
తేనెపూసిన బాకులై
మెల్లగా గొంతును నులుముతుంటే
మేలు కోరే వారే లేక ఒంటరి
మైనా లా రోదిస్తున్నా!
మొదలైన పరీక్షల ప్రహేళికలో
మేధస్సును మథిస్తూ సమస్యలను అధిగమిస్తూ
మోదమును గుండెలకు పులుముకొని
మౌనరాగాలాలపిస్తున్నా!
నా ఆత్మస్థైర్యమే
నా ప్రగతి సౌధానికి పునాదిగా
అలుపెరుగక పయనిస్తున్నా!
పలుకరిస్తున్న విజయాల మేనలో!!
రచన
*అయిత అనిత*
11
🙏 సుధారాణి కృష్ణంరాజు🙏
*నేటి అంశం*మౌనరాగం*
07-01-2021(గురువారం)
మౌనముగా చెలియ
చూసిన చూపులు ప్రియుని
మదిలో పలికించే మౌనరాగాలే
కోపంతో చూసిన సంతోషంగా
చూసిన వాటిలో మంచిని మాత్రమే గ్రహించి ఎదుటి వారిపై గల ప్రేమ ను మనసుతో
పాడే వేణుగానంలా వినిపిస్తుంది తప్ప అది మౌనం
అని పించదు
అమౌనం లోనే కోటి వీణలు
ఒక్క సారిగా చెవులకు మౌన
సంగీతం గా వినిపిస్తాయి
తీయగా పాడే కోయిల పాటలు
కూడా ప్రేయసి మౌనం గా మనసులో పాడిన పాటల
ముందు బలాదూర్
పసి పిల్లలు కూడా మౌనం గానే
వారి భావాలను చిరునవ్వు తో
వివరించాలని ప్రయత్నం చేస్తారు
మౌనరాగం మనసెరిగిన రాగమై
భావాలను పలికించి నపుడు
మౌనరాగం అనేక రాగాలు పలికిస్తుంది🙏👍
[07/01, 9:28 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..మౌన రాగం
జీవన పయనంలో
ఎన్నో అటు పోట్లు
ఏ మనిషిలో ఏమి దాగి ఉందో
ఎవరికి అంతుచిక్కని రహస్యం
గుండెకు తగిలే గాయాలు
చెప్పలేని భావాలు
ఎదను పిండేస్తుంటే
మాటల్లో చెప్పలేకపోతూ
మౌన రాగమే ఆలపిస్తుంటే
కంటి నుండి జాలువారే నీటిబొట్లే తృప్తి నిచ్చునులే
భారమైన మనసును తేలిక పరుచును
స్వార్థం రాజ్యమేలే లోకంలో
శ్రేయస్సు కోరే వారే కరువైన వేళ
ఆత్మస్థైర్యమే ఆయుధం
లక్ష్యం వైపు పయనించడమే ధర్మం
గమ్యం చేరుకోవడమే కర్తవ్యం
అభివృద్ధికి ఆటంకం కలిగే ముళ్ళదారులను ఛేదించుకుంటూ సాగిపోవడమే
కాలమొక్కటే ఇక సమాధానం
12
కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి
అంశం: మౌనరాగం
శీర్షిక: మౌనరాగం
వినగలిగిన మనసుంటే
వినిపిస్తోంది మొగ్గల మౌనరాగం
చిన్న మొలక పెరిగి మారాకు తొడిగి
సడిలేక మొగ్గుల నిచ్చే తరుణం
ప్రతి కొమ్మాసన్నాయి రాగంతో
తలలూపుతూ పరవశింపజేస్తూ
అందమైన ఆడపిల్ల లేత సిగ్గులా
విచ్చుకోవడానికి సిద్ధమైన మొగ్గ
మాటలకందని మనోహర దృశ్యం
కొమ్ము వూయల లూగుతూ
పై పై కెగబాకుతూ గగనంలో పతాకంలా
నవమాసాలు మోసి జన్మనిచ్చేందుకు
సిద్ధపడ్డ తల్లిలా పూర్ణ గర్భంతో
కనువిందు చేస్తూ ముడుచుకొన్న
మొగ్గ సుందరమైన పుష్పంగా
అరవిచ్చుకుంటూ సుందరమైన
నవజాత శిశువులా తాకితేనే కందేంత
సుకుమారంగా సున్నితంగా విరబూసి
పూజకు సిద్దమైన వేళ వినిపించే
సరాగాలు సప్తస్వర సమ్మేళితాలు.
13
శీర్షిక: మౌన రాగం
నా మది పాడిన మౌన రాగం నా "నీ "గుండెను చేరిందా
అందుకేనా.. ఇలా.రెక్కలు కట్టుకుని వాలావు
అవును మరి
నీ రాకకై ఎంత నిరీక్షణ,ఎన్ని నిట్టూర్పులు
నా కనురెప్పల మాటున నీ ప్రతిబింబం...
నిద్రిస్తే ఎక్కడ మాయం అవుతుందో నని
గుండె గుడిలో భద్రం గా ప్రతిష్టించా
మనసునే ...మంత్రపుష్పం గా నీకై నే అర్పించా
నా నిర్మలమైన ప్రేమతో నిన్ను అర్చించా
నీ గాఢ పరిష్వంగనం లో...ప్రకృతి నే నేనై..పరవశించా
ఇన్ని రోజులుగా..నిన్ను చూడని నా కనులు..
.ప్రతి క్షణం నీకై తపించే నా హృదయం
నీ చిలిపి గారాల ముచ్చట్ల కు నోచుకోని నా మనసు
"నీ"..నా..ప్రశాంతమైన సాన్నిహిత్యపు మధురిమ ల జాడలులేక.....
ఈరోజు భారమైన హృదయంతో
ఎన్నో ఊసులతో....ఇంకెన్నో...మధుర జ్ఞాపకాల సాక్షిగా.....నిట్టూరుస్తూ
..నా మది పాడిన మౌన రాగం....నీ హృది నీ చేరినట్టుంది..
అందుకే నా ఇలా రెక్కలుకట్టుకు వాలావు
........ప్రమోద మునిమడుగు
14
తేదీ:07-01-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: మౌన రాగం
******************
ప్రాంగణమంతా
నిశ్శబ్దంతో యుద్ధం చేస్తుంటే
పలకలు బలపాలు దుమ్ము ధూళిలో పొర్లుతూ
తడిపొడి ముద్దులతో శుద్ధి చేసి
ఆత్మీయంగా ఆలింగనం చేసుకునే
చిన్నారుల కోసం కలవరిస్తున్నాయి...
గేటు లోపలి చెట్లన్నీ
నిత్య వసంతమై విరబూసే పసినవ్వుల గతాలను నెమరేసుకుంటూ...
గలగలల సవ్వడి లేని ఎడారుల్లా తరువులు
వేదనతో మౌన రాగం ఆలపిస్తున్నాయి...
గది గోడలు రిక్కించి రిక్కించి
పసి మనసుల గుసగుసలు వినేందుకు
మౌనంగా నిరీక్షిస్తూ ఉన్నాయి!
15
మనసులోని భావాలను
మనసైన వారికి చెప్పలేక
చెప్పకుండా ఉండలేక గుండెలో
పలికే ప్రేమగీతమే మౌనరాగo
పే)మించు హృదయానికి వీనులుంటే
మౌనమే మృదురవమై వినబడు
కొన్ని పలుకబడిన పదాల కన్నా
మాటలుగా మారని మౌనాలే మిన్న
మౌనం ప్రపంచభాషల కూడలియే
మౌనభావనలోతు మించేను కడలినే
*మౌనరాగం* తాకేను చల్లగా గుండెను
మధురభావమై ఉండేను మదికి అండగా
ఇరు ఎదలు పరస్పర అభిమానులైతే
వాటి సంభాషణ హృదయoగమమమే
హృదయాల మధ్య అనుసందానం వీలైతే
ప్రేమను తెలుప అనవసరం అనువాదాలే
:వల్లాల విజయలక్ష్మి
ఆలేరు
16
నేటిఅంశం- మౌనపోరాటం
పేరుఃభరద్వాజ
ఊరు-కొత్తపట్నం
శీర్షిక - మౌనం నిజంగా మౌనమే ..!
నిశిరాత్రి చేస్తుంది పోరాటం-
చీకటివదిలించుకునేందుకు -
మౌనంగా వీస్తుంది గాలి తన వంతు కర్తవ్యంగా -
నిశబ్దం రాజ్యమేలుతుంది జగతిలో
రేపటి ఉషోదయం కోసం -
గతాలనిన్నను మరచి మౌనంగా నిదిరిస్తున్నాడు మనిషి -
రేపటిఆశల వె లుగుకోసం పోరాటం చేస్తూ -
ప్రపంచానా ప్రతిదీ మౌనంతోనే సాగుతుంది -
శబ్దం నిశ్శబ్దాన్ని భేదిస్తే -
పారిపోతుంది మౌనం -
గుండెకు మాటల గాయం అయినపుడు
మౌనం గా రోదిస్తుంది గుండె -
కన్నీటి బొట్ల సంకేతాలను చిమ్మి -
మౌనంఅర్ధాంగీకారం అయినా -
ఇష్టంలేని జవాబు అది -
బంధాలను బాధ్యతలను తెలుసుకుంటే -
మౌనంకంటే హాయి ఏముంది -
మునులకు మౌనం అలంకారం-
స్వాతంత్రానికి అదే మూలం -
మౌనం తెలియని మనిషి
చెట్టు ఉండవు -
ఒక్కోసారి మౌనం మాట్లాడుతుంది
మౌనానికి సహనం పోతే ప్రళయమే ..!
మేధావులమౌనం దేశ వినాశనం -
సముద్రంకన్నా మౌనంగొప్పది -
మౌనపోరాటం ప్రతివానికి ఆచరణయోగ్యం -
ఇదినాస్వీయరచన
భరద్వాజరావినూతల (RB)🖍️
కొత్తపట్నం 9866203795
ప్రకాశంజిల్లా
17
: మౌనం రాగమయి మనసులో మౌన గానమై మౌన గానమై
మౌనం మంచి ఫలితాలనిస్తుంది
మంచిని మౌనంగా ధ్యానంగా
అమానుషత్వం పై మానవీయ రాగమై పలికిస్తుంది
మనపై పీడన చేసినప్పుడు
మహాత్ముని సత్యం అహింస
మౌనంగానే నాటి స్వాతంత్రోద్యమం నుంచి
మౌనంగా మంచి నీ చేకూరుస్తారు
మంచితనం ముందు మౌనం ఒక శిల్ప మై శిలను మీటితే రామప్ప లోని నవరస రాగాలను పలికించే
స రి గ మ ప ద ని స సప్తస్వర రాగాలను పలికించే నాగిని లు
మౌనమే మూగ మనసు
తలపులను ఎన్నోసార్లు పాడుతుంది కల్లలు కాగానే
కన్నీరు అవుతుంది
పాట గుర్తుకొస్తుంది మౌన సంగీతం విన్నప్పుడు మౌన ప్రయాణంలో ఎన్నో భావాలు మదిలోన వీణల రాగాలు పలికిస్తాయి లోలోన
మౌనంలోని ఎన్నో అంతరంగంలో పలికిస్తాయి ఎన్నో కలలను కనడానికి అంతరంగంలోని మౌనమే మూలం
నాది అప్పుడప్పుడూ మౌన ప్రయాణమే
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
18
కవితా గానం
చెన్నా విజయలక్ష్మి
అంశం మౌన రాగం
శీర్షిక రామబాణం
ఎవరన్నారు మౌనం మూగదని
మాట్లాడలేని అసమర్ధతని
మాటలు పలుకని భావాలెన్నో
పలికించును మౌనంగా
పాడలేను కావ్యాలెన్నో
విన్పించును శ్రావ్యంగా
వినగలిగిన మనసుంటే
అర్ధం చేసుకోవాలనే
ఆర్తి కలిగిన మది నీకుంటే
మౌనం మాట్లాడుతుంది
వేల భావాలు స్ఫురింప జేస్తుంది
బాధల సుడిగుండాలు మనసంతా
మబ్బులై ముసురుకుంటే
మౌనంగా కార్చే ప్రతి కన్నీటి చుక్క
చిత్రించేను అనేక చిత్ర భావాలు
జీవన గమనంలో కష్టాలు వరదలై
చుట్టు ముట్టే వేళ
వేదనలను దాటి
విజయ గమ్యం చేరే మార్గం
దైర్యమనే మౌనచుక్కానియే గాఁ !
మనస్పర్థలదారిలో పలికే
మాటలు తూటాలై పేలుతూ
మనసును గాయపరచి
ముక్కలు చెయ్యవా !
మౌనం పరిష్కరించును
అలాంటి ఉపద్రవాల నెన్నోన్నో !
మౌనం గొంతు దాటని మాటై
మది వీణను మీటి
అనేక అర్ధాలను విశ్లేషించే
రాగాలనాల పిస్తూ
మనసుల మధ్య కనిపించని
లక్ష్మణ రేఖను చెరిపి వేసే
అపూర్వ అద్వితీయ ఆయుధం
తిరుగులేని రామ బాణం
...చెన్నా విజయలక్ష్మి
Comments
Post a Comment