Skip to main content

సాంత్వనము 20/2021

 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ

author of vennela shilpam

*******

✳️✳️✳️✳️✳️✳️

1.కోరాడ నరసింహారావు గారు

2. విజయభారతి గారు

3. పరాoకుశం రఘునారాయణ గారు

4. సుధారాణి కృష్ణంరాజు గారు

5. సుజాతారాణి గారు

6. ఉమాదేవి గారు

7. మన్నె లలిత గారు

8. గుమ్మన్నగారిబాల సరస్వతి గారు

9. ప్రమోదగారు

10. Ch . విజయలక్ష్మి గారు

11. అపరాజిత్ గారు

12. వల్లాల విజయలక్ష్మి గారు 

.13 వురిమళ్ళ సునంద గారు 

14. మర్రి జయశ్రీ గారు 

✳️✳️✳️✳️✳️✳️

[20/01, 7:41 PM] Lalita Sister: కవితాగానం


నేటి అంశం


*సాంత్వనము*

 

ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు

అంశానికి కవితలతో స్పందించగలరు.


ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.


✳️✳️✳️✳️✳️✳️

[20/01, 8:01 PM] Korada: కవితాగానం

       అంశం :-  సాంత్వనము

    కోరాడ నరసింహా రావు....!

  * హాయిగామనగలుగుతావ్ *

      *********************

తల్లి కడుపునుండి...నేల పై...

పడ్డ నాటి నుండే.....,

ఆరాటాలు,బతుకుపోరాటాలు

ఎన్నెన్ని ఆటుపోట్లు...!

ఎన్నెన్ని ఎదురు దెబ్బలు...!!

అన్నీ సమస్యలే...!

అసలు...సమస్యలను ఛేదించు

కుంటూ...సాగి పోవటమే కదూ

జీవితమంటేను...!!

ఈ స్పీడు ప్రపంచంలో...ప్రతి

దానికీ పోటీ పడవలసిందేగా!

విసిగి వేసారిన మనసు....,

అలసి-సొలసిన తనువు....!

అలజడి,ఆందోళనలతో...బరువెక్కి...లయతప్పుతున్నగుండే

ఈ మనిషికి...ఈ మనసుకీ...

సాంత్వన కలిగే దెన్నడు...!?

ఎప్పుడు....?!

          ఎందుకలా....బేజారై 

పోతావు మిత్రమా....!

నువ్ కావాలనుకున్నావని...

ఏవీ నీ దరికి రావు....!

నువ్వొద్దంటున్నావని...నీవి

ఎన్నడూ నిన్ను వీడి పోవు !!

కానున్నది...కాక మానదు !

జరగవలసిందిజరిగేతీరుతుంది

సత్యాన్ని గ్రహించు...!

ఈ మానవ జన్మే... ఓ గొప్ప

యోగమోయ్...!!

"మన యేవ మనుష్యణామ్

బంధ-మోక్ష కారకం"

ఆ మనసుకు నీవు బందీవి

కాకు...అప్పు డిక అది లోన

బుద్దిగా కూచుంటుంది...!

ఆశించినా... ఆశించక పోయినా వచ్చే ఫలితాలకోసం

నీకెందుకంత బేజారు...!?

కర్తవు నీవే ననుకుని నువ్

కర్మల నాచరించినా....,

నిష్కాముడవు కావోయ్...!

అప్పుడిక...నీకీ అలుపు,అల

సట లుండవు...!!

సాంత్వన అనే ఆలోచనకే....

ఇక తావుండదు...!

నిత్య సంతుష్టుడవైపోయిన

నీవు...ఆనందమే...నీ స్వరూపమే...హాయిగా....

ఈ భూమిపై నీవున్నంతకాలం

జీవన్ముక్తుడవై...

మనగలుగుతావ్.....!!

    *******************

        .......కోరాడ.

[20/01, 8:02 PM] కొలచన విజయ భారతి Poetess: కవితా గానం

పేరు:కొలచన  విజయ భారతి

హైదరాబాద్

అంశం:సాంత్వనము

తేదీ:20-1-2021

*********************

ప్రియా!

ఏల నాకీ ఎదురు చూపుల 

విరహపు బాధ

నీవు జాగు చేయు ప్రతి నిమిషం

నాకొక యుగమై తోచుచున్నది

చంద్రునికై చకోరిలా వేచియున్నాను

నీ వెన్నెల జల్లులు కురిపించి

నా మది చల్లబరచవా

నీ పాద అర్చనకై సుమమునై

పూచియున్నాను

నీ కరుణాకటాక్ష వీక్షణాలతో

సాక్షాత్కరింపవా

మనం ప్రతినిత్యం కలుసుకునే

సంకేత స్థలమున అభిసారిక పై

వేచియున్నాను

విరహపు బాధతో వేసారిన 

నా హృదయాన్ని 

నీ దర్శన స్పర్శలతో

సాంత్వన పరచవా

నీ రాక నా అలకను జయిస్తుంది

నీ గాఢ పరిష్వంగనము

నా తనువు సాంత్వనము

చేకూరుస్తుంది

      ☘️🌹☘️🌹☘️

[20/01, 8:04 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితా గానం*


 *కవితా శీర్షిక: సాంత్వనము*


 మహిళా సాధికారత దిశగా చేయూత నిద్దాం!


 విద్యా పరమావధి విజ్ఞాన సముపార్జనమని


 ఉపాధి మార్గ కాదనియూ


యువతకు మంచి ఉపదేశమిద్దాం!


వృద్ధాప్య దశలో మన తల్లిదండ్రులకు చేయూతనిస్తూ..,


 వారికి కొండంత ఆసరా ఇద్దాం!


పేద వారికి మన వంతు సహకారం అందిస్తూనే..,


వారి ఉన్నతికి తోడుపడదాం!


 బాలకార్మికులుగా మారడాన్ని వ్యతిరేకిస్తూనే..,


 వారికున్న విద్యావకాశాలపై...,


 జీవన ప్రమాణాలపై...,


 అవగాహన కల్పిద్దాం!


శ్రామికుల్లో నైపుణ్య కౌశల్యతను,


 పెంచేక్రమంలో తగు సూచనలిద్దాం!


 దివ్యాంగులకు మన సహకార హస్తాన్ని మెండుగా అందిద్దాం!


 మనిషి మహామనిషిగా మన ఘనతను చాటుకోవడానికై..,


 ప్రతి వ్యక్తిలోనూ సాంత్వనము కల్పిద్దాం !


సాoత్వనము వ్యక్తి అభివృద్ధికి అమిత దోహదకారి అని నిరూపిద్దాం!


- పరాంకుశం రఘు నారాయణ మహబూబాబాద్

[20/01, 8:06 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏

🙏సుధారాణి కృష్ణంరాజు🙏

*అంశం*సాంత్వనము*

20-01-2021(బుధవారం)

*కలత పడిన మనసు కోరుతోంది అయిన వారినుండి

సాంత్వనము లభించాలని

కల్లొలమైన మనసుకు ఊరట

లభించేది కావలసిన వారి ప్రేమ

అభిమానం ఆత్మీయత ఆప్యాయత అనురాగాలతో

కూడిన మంచి మాటల ద్వారా

ఎదుటి వారికిఆనందం కలిగినపుడు సాంత్వనము

చేకూరినట్లే

వృద్దాప్యం లో ఎంతో కష్టపడి పెంచి‌ పెద్ద చేసిన పిల్లలు తమకు మేమున్నాము అని

భరోసా ఇచ్చినపుడు తల్లిదండ్రులకు మానసిక

ఆనందం తో కూడిన సాంత్వన ము లభించినట్లే

మానవ సంబంధాలు చాలా

గొప్పవి డబ్బు తో దొరకని

సంతోషం తమ ఉదార స్వభావంతో పొందవచ్చు

ప్రతి వారికి ఓదార్పు కావాలి

కోటి రూపాయలతో సాధించలేని ఓదార్పు గొరంత

ప్రేమను వేదన కల వారికి అండగా ఉన్నప్పుడు పంచే

మమకారం ద్వారా సాంత్వన ము కలిగించ వచ్చు

పసి ప్రాయం లో లేత బుగ్గలపై

కన్నీరు కారుస్తూ అభద్రతా భావంతో ఉన్న పాలు గారే

పసి పాపలకు తల్లి పాడే జోల

పాట సాంత్వనము కలిగిస్తుంది

జీవితంలో తిమిరంతో సమరం

చేయ వలసి వచ్చినపుడు

ఆ చీకటి ని తొలగించి కాంతులను వెలిగించే మిత్రులు

తమ బాధలను పంచుకుని

కష్టాల కావడి భారాన్ని మోయడానికి సహకరించి

మిత్రులు ఇచ్చే చేయూత తో

సాంత్వనము లభిస్తుంది

సంసార పంజరంలో చిక్కుకొని

ఏటికి ఎదురీద లేక అలసి పోయిన వారికి కుటుంబం యొక్క అండదండలు సాంత్వనము చేకూర్చి కొండంత దైర్యం ఇచ్చేదిగా

ఉంటుంది🙏🙏👍

[20/01, 8:11 PM] కందూరి సుజాత Poetess: అంశం.. సాంత్వనము

శీర్షిక...🌷ఊరట 🌷

............  .............  .........

కార్య దీక్షకు విజయం దక్షణ .

కాలం తీర్పుకు జ్ఞానం రక్షణ. 

శుభదారులు హృదికి ఊరట .


రాగి వేప మానుల గలగలలు 

గుడి ఘంటల ప్రచోదనముల  

ఆలయ ప్రాంగణము

అలసిన మనసుకు పరిపూర్ణ ఊరట.


 జైత్రయాత్ర కానించిన 

జగతిని పాలించిన 

జనని పొత్తిళ్ల ఆప్యాయత 

మదికి హత్తుకునే ఊరట.


నేలను చీల్చుకొని మొలక పైరు పంట 

గాదెల నిండగ

ఆహార కొరతను తరిమి సుభిక్ష తీరమున 

బతుకు ఊరటలో మురవంగా. 


శాంతి సహనమునకు చేరువ ఊరట. సుఖదుఃఖాల లో ఆత్మీయ హస్తమే  ఊరట .

కడలి చేరువనున్న 

కడవ నీరు దాహం తీర్చు. 

ఉన్నంతలో అడుగిడడం ఉన్నత సాంత్వనము.


యంత్ర  రెక్కల విమానం 

సప్త సముద్రాలు దాటిగా ఊరటయోగం 

చిగురించిన ఆశ చంద్ర ప్రయాణం  .

ఊరటలోంచి ఉజ్వల కిరణం జననం. 


"వాస్తుకు దిక్కులు మూలం

ఊరటకు ఓదార్పు ముఖ్యం"


కందూరి సుజాతారాణి 

రాజేంద్రనగర్, హైదరాబాద్ 

9392162822🌷

[20/01, 8:11 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: మనిషి కష్టాలనుండి ఇ సాంత్వన నేర్చుకోవాలి

ఇబ్బందులకు గురి చేసే ఎన్ని అంశాలు ఉన్న నా హృదయాన్ని నేర్పుతో ఓర్పుతో సాంత్వన పరచుకోవాలి


సముద్రాన్ని దాటడం ఎంత కష్టమో జీవితాన్ని ఈదడం అంతే కష్టం


ఎన్ని ఎదురు దెబ్బలు తగిలిన

గుండె ఎన్ని గాయాలైనా

జీవితం కష్టసుఖాల మయం

కన్నీళ్లు సముద్రం

నిరాశలు చుట్టుముట్టిన

స్నేహంతోనే సాగిపోవాలి


ఆచరణలు లేని ఆత్మీయతలు అనవసరం కాక మరేమిటి


ఆదర్శాల పల్లకి జీవితం చివరి అంచు దాకా సాగిపోవడం

స్వాంతన పంచుకుని శక్తిని పుంజుకోవడానికి ఎన్ని 

ప్రణాళికలు ఆలోచనల మార్గాలను అలవర్చుకోవాలి


నేస్తం సాంత్వన పంచుకో నీ మనసును నీ హృదయాన్ని


ఆశయాల దారిలో ఆదర్శాల పాటలు పల్లవిగా ఆలపించు


మనసు ఉ గుర్రం లాంటిది

ఎక్కడికి ఎల్లా పరిగెత్తిన కళ్లెం వేసి ఇ బంధించు


శాంతివనం లో సాంత్వన పంచుకో

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453

[20/01, 8:23 PM] Balloori Umadevi Poetess: 20/1/21

కవితా గానం

డా.బల్లూరి ఉమాదేవి

శీర్షిక:సాంత్వన


అమ్మ పలకరింపుతోడ మొదలౌను మమకారం

అదియెపెంచు మమతలననుక్షణం

మౌనదరహాసమే మొదటి పలకరింపైతే

మధురమైన మాటపెంచు మంచి స్నేహమిలలో

ఇంతింతై మరిఅంతై పెరిగి పెరిగి 

వటవృక్షమైపంచుతోంది నలుదెసల

స్నేహపరీమళం నిరంతరం

అక్కా అత్తా పిన్నీ అంటూ

వరుసకలిపి సాగించే

ఇరుగుపొరుగువారి పలకరింపు

పెంచుతోంది అనుబంధం

కానీ

నేడు పాశ్చ్యాతీకరణమోజుహెచ్చి

అడుగంటెనీ పలకరింపుల పర్వం

చరవాణే సర్వస్వం

దూరదర్శనాదలతో మమేకమై

పలకరింపులకు సమయంలేక

ఔతున్నాం మానసికంగా ఏకాకులం

పైసా ఖర్చులేని పలకరింపు

ఇస్తుందెంతో మానసికబలం

ప్రయాణాలలో పలకరింపులతో

మొదలైన పరిచయం

ఇస్తొదెంతో అనుభవం

బాధల్లో ఆవేదనలో

ఆత్మీయుల పలకరింపు

కూరుస్తోంది మానసిక సాంత్వనం.

[20/01, 8:23 PM] +91 74168 63289: కవితా గానం పేరు 

 తేదీ 20/1/ 21

 పేరు:మన్నె పిన్నక లలిత 

హైదరాబాద్ 

అంశం :సాంత్వనము


 వైద్యశాలలోని రోగికి వైద్యుని మాటలే  సాంత్వనము  

 బతుకు బాటలో  విసిగి వేసారి మరణం  అంచుచూడాలనుకునే మనిషికి

 ఆపద్బంధువై పలికే ఆదరణ  వాక్యాలే  సాంత్వనము

 మనసు ప్రశాంతతకు మధు వనమే సాంత్వనము

 ఉషా కిరణాలు  విరిసి విరియని పుష్పంపై  ప్రసరించి

 మంచు ముత్యాలు మెరుస్తుండేలా ప్రతిఫలించినప్పుడు

  హృదయం ఉల్లాసభరితమై  సాంత్వన చెందుతుంది

[20/01, 8:58 PM] Gummannagari Balsaraswati: కవితా గానం...

తేదీ:20/01/2021

అంశం: సాంత్వనం...

*గుమ్మన్నగారి బాలసరస్వతి సిద్దిపేట*

*******************

శీర్షిక:    *నీ పిలుపు*.....!!


చెలీ...!!

భానుతప్త

విశుష్క

 గ్రీష్మ కాంతకు

ప్రఫుల్ల పల్లవాంకురద

వసంతానూహ్యాగమనంలా..


కృష్ణపక్ష నీరవ నిశీధిన

నిశ్వాస దీర్ఘ వృంతాలతో

నిరీక్షించే చకోరానికి

అప్రకటిత శుక్లపక్ష

కుముదరుచిరకాంతిప్రసారంలా..


సప్తవర్ణ ప్రభాంచిత

కర్పర కవాటులను తెరిచిన

ముత్యపుచిప్పకు

హేమంతంలో స్వాతిచినుకులా...


అగ్నిశిఖా సమానోష్ణాన్ని

వెలువరిస్తున్న మౌనపు సైకత మైదానంలో

 సుదీర్ఘ ప్రయాణంతో అలసిన 

బాటసారికి

ఎదురైన అమృతపు ఒయాసిస్సులా...


నా *సాంత్వన తృషాకుల* హృదికి..

నీ సౌహార్దసులలితాత్మీయమైన

తీయని పిలుపు...!!

[20/01, 9:04 PM] +91 90002 51604: కవితా శీర్షిక: సాంత్వనము

ప్రమోద మునిమడుగు


అతను.బ్రతికాడు.....

మరణం  అంచు వరకు వెళ్లి....మళ్ళీ అతడు బతికాడు

 అతడి కళ్ళల్లో.....జీవకళ తొణికిస లాడుతుంది

కాన్సరు రక్కసి తన ప్రతాపాన్ని చూపించినా

కీమో పేరుతో శరీరం నరకం అనుభవించినా

పోగొట్టుకున్న అందమైన..రూపం తిరిగి రాకపోయినా

గాధాంద కారాన్ని చీల్చుకుని వచ్చే వెలుగు రేఖ లా

నేలను చీల్చుకువచ్చిన చిట్టి మొక్కలా..

తనువంతా ఆత్మ విశ్వాసం నింపుకుని...

 అవును

మళ్ళీ అతడు బ్రతికాడు

కంటికి రెప్పలా తనను కాపాడు కుంటున్న

ఆ కుటుంబపు ఆత్మీయతా సాంత్వనము తో

అమ్మలా పునర్జన్మ ప్రసాదించిన వైద్యులందించిన సేవా సాంత్వ నముతో

రెట్టింపైన నమ్మకంతో

చావును జయించి....అతను...మళ్లీ బతికాడు

[20/01, 9:21 PM] Vijayalakshmi Ch KS 38: కవితా గానం 

తేది :20-01-2021

చెన్నా విజయలక్ష్మి, బీర్కూర్, కామారెడ్డి 

అంశం :సాంత్వన 

శీర్షిక :

*********-*****************

మండుటెండలతో అల్లాడిన అవనిపై 

కురిసిన వానలా 

కష్టాలకడలిలో మునిగిన వారికి దొరికిన పరిష్కారనౌకలా 


బాధల సుడిలో కొట్టుకుపోయే వారికి సంతోషాల చేయూతలా 

అజ్ఞాన అంధకారంలో పయనించే వారికి 

జ్ఞాన దీపికలా 


మమకారం ఆత్మీయత తెలియని మనసుకు 

ప్రేమ సుగంధపు లేపనంలా 

ప్రేమ, పగ లంటూ ప్రతీకార యుద్ధంలో అలసిన మందికి 

అనుబంధాల రుచి చూపించే బంధంలా 


ఓడి పోయిన వేళలో 

గెలుపు దారి చూపి 

అయోమయంలో పడిన అంతరంగానికి 

చిక్కులు తీర్చే దిశగా 

చిక్కు ముడుల సమస్యల్ని 

చిటికెలో పోగొట్టి 

మార్గనిర్దేశనం చేస్తూ 

పలికే హితపు పలుకులు 

చూయూత నిచ్చే స్నేహ హస్తాలు 

మధురమైన బంధాలు 

వీడిపోలేని అనుబంధాలు 

తోడుండే ఇతర అనురాగాలు 

ఆప్యాయత అనురాగాలు 

మకరందపు రక్త సంబంధాలు 

జీవితానికి సాంత్వన నిచ్చే 

మరుపు రాని అమూల్య మైన రత్నాలు  


ఇది నా స్వీయ రచన. కాపీ కాదు. చెన్నా విజయలక్ష్మి, బీర్కూర్. ☘️

[20/01, 9:28 PM] Aparajith: హృదయలయలు!


పగిలిన గుండె 

గాయాలకు గేయాలు లెపనమై!

పగిలిన అద్దం 

ఒక్కటొకటిగా అతుక్కుని దర్పణమై!

మ్రోడువారిన చెట్టు 

లేత చిగుళ్లు తొడిగి సంధ్యా వందనమై!

ఆశలుడిగిన కాయం 

ప్రాణం పోసుకుని జీవమై!

ఖండ ఖండాలైన మనస్సు 

ఔషధ సేవనతో సేద దీరి నవోపేతమై!

ఆరనిమంటల జీవితం 

శ్రమలానంతరం వెలుగుల దివ్వెయై!

మృగప్రాయ బ్రతుకు 

మానవత సంతరించుకుని ఆహ్లాద గేయమై!

ఆక్రందనల సుడిగుండాలు 

ఎకొన్ముఖంగా పయనించి దివ్య రాగమై!

వికృత ప్రెలాపణలు 

మనసుకు ఉజ్వల ఉత్ప్రేరితమై!

అగచాట్ల బ్రతుకు 

సుస్వర సవ్వడుల సంగీతమయమై!

చీకటి దేములాటలు 

వెన్నెలకంటి ఆనంద తాండవమై!

జీవితం ఆనంద అర్నవమై 

గోదారి కెరటాల జడిలో తడిసి ముద్దయ్యింది!


ఆపరాజిత్

[20/01, 9:33 PM] విజయ లక్ష్మి యాదాద్రి: *సాంత్వన*

***********

కష్టకాలంలో ఓ మాట

సమస్యల సమయాన

ఓ పరిష్కారమార్గం

అలసిన మనసుకు 

ఓదార్పు *సాంత్వన*


మనిషికి మనిషీచ్చే భరోసా

మనసుకు దొరికే నైతికబలం

వేడెక్కిన మదిని చల్లబరిచె

మమతా సమీరం సాంత్వన


పైసా ఖర్చు లేని సహాయం

ప్రాణాన్నైనా కాపాడు సహృదయం

సాటివారి పట్ల సద్భావం

తెలిసిన వారి వ్యథనైనా 

విని అర్థం చేసుకోగలిగిన సహనం

స్పందించు హృదయం

అందించును సాంత్వనం




:వల్లాల విజయలక్ష్మి

ఆలేరు

[20/01, 9:34 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*

తేదీ:20-01-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: సాంత్వనం

*******************

జీవిత సాయంత్రంలో అనాదరణ చీకటి అలుముకున్నప్పుడు..


యవ్వనం గతమై ముదిమి నట్టింట తిష్టేసుకుని కూర్చున్నప్పుడు..


విస్మరించిన కర్తవ్యం వెన్నుపోటు పొడిచి 

ఖండాంతరాలు దాటినప్పుడు..


అప్పటి వరకు జీవనదులై పారిన జీవితాలు

ఆర్ద్రత ఇంకి పొడిబారి పోతున్నప్పుడు..


చిటికెడు పలకరింపుల దీపం వెలిగిస్తే

అదే చివరి మజిలీకి కొండంత సాంత్వనం..


కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..సాంత్వనము



మానవ జీవన పరిణామ క్రమంలో మలి దశ

జీవన పయనంలో అన్ని దశలను సంపూర్ణం చేసుకొని

ఎన్నో అనుభవాలను గడించి

గుణపాఠాలెన్నో నేర్చుకొని

చేరుకున్న జీవిత చరమాంకం

పుడమి తల్లి గర్భానికే ఇక చేరడం

పెరిగే వయసుతో

మళ్ళీ బాల్యదశకు చేరిపోయి

దశలన్నీ వ్యతిరేకమైన వేళ

రోగ నిరోధక శక్తి తగ్గిపోయే స్థితి

కంటి చూపు,వినికిడి లోపించి

చురుకుదనం తగ్గడంతో

వృద్దుడ0టే వ్యర్థానికి ప్రతిరూపమని  అనుభవం లేని అమాయకులు గేలి చేస్తే

తల్లడిల్లిపోతూ

సంతోషం సన్నగిల్లి

ఒంటరితనంతో బాధపడిపోతూ

మానసిక సమతుల్యత కోల్పోయిన వేళ

మదనపడే వృద్ధులను పసిపాపల్లా కాపాడితేనే

ఆ పండుటాకులకు సాంత్వనము

కనిపెంచిన ఋణం తీర్చుకునేందుకైనా

కంటికి రెప్పలా కాచుకోవాలి

వృద్దాశ్రమాల దారి చూపకుంటే

అంతకన్నా మహాత్భాగ్యమేముంటుంది



Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...