నిర్వహణ,:
శ్రీమతి శివునూరి లలితాకృష్ణ author of vennela shilpam,
వీరా గుడిపల్లి
*****************"****
1.పరాంకుశం రఘు నారాయణ గారు
2.డా.ఆంజనేయులు గారు
3.కొముర వెల్లి అంజయ్య గారు
4.దీపక్ న్యాతి గారు
5.కోరాడ గారు
6. సర్ఫరాజ్ అన్వర్ గారు
7.కొలచన విజయ భారతి గారు
8.మర్రి జయశ్రీ గారు
****
1
*కవితాగానం*
*అంశం: గణతంత్ర దినోత్సవం*
*కవిత శీర్షిక గణతంత్రం- పాలనా మంత్రం*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలనా సౌలభ్యం!
డాక్టర్ అంబేద్కర్ మార్గనిర్దేశనంలో..,
రాజ్యాంగం పరిపూర్ణం!
భిన్న సమస్యలకు పరిష్కారం మన రాజ్యాంగం !
రాజ్యాంగపు ఆనవాళ్ళు !
గణతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు!
సార్వభౌమాధికారం దిశగా...,
అభివృద్ధి చెందుతున్న దేశాలలో నొకటిగా..,
విశ్వానికే విజ్ఞానాన్ని చాటిన దేశంగా...,
మన గణతంత్ర రాజ్యపాలనo అమోఘం !
శాంతి ప్రపంచపు శాస్త్రీయ కోణం!
పరాంకుశం రఘు నారాయణ మహబూబాబాద్
2
దేశం మేఘన మైనది బహు భాషలు వేషాలు ఉన్న నా దేశం కంటే ఘనమైన ఏదీ లేదు
సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్యం లౌకిక భారత అవనిలో ప్రజలంతా క్షేమదాయకం గా ఉండడమే జాతికి మూలధనం
సకల జనావళికి సౌభ్రాతృత్వము తో స్వేచ్ఛతో కలిసిమెలిసి జీవించడమే భారతావని సౌభాగ్యం
భరతజాతి ఉపఖండం జగతికి కొత్త వెలుగు ఆదర్శ విలువలతో మానవీయత నిలుపుకుంటూ ప్రపంచానికి నూతన భారతం ఐక్యమత్యంగా జీవించడమే ఘనకార్యం
భారతావని స్ఫూర్తి ఆదర్శం
కలలుగన్న గాంధీజీ ఆ ఆ ఆశయం రామ రాజ్యం
కలలుగన్న సామ్యవాద సమాజం విలసిల్లి పేదల సంక్షేమమే పరమావధిగా
అప్పుడే దేశం సకల రంగాలలో అభివృద్ధి
జై జవాన్ జై కిసాన్ అంటూ సాగిన ఈ దేశ నినాదం వారి క్షేమాన్ని కోరి నప్పుడే అసలైన భరతావని ఆశయం నిజమవుతుంది
సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
3.
కొమురవెల్లి అంజయ్య
అంశం.. గణతంత్ర దినోత్సవం
శీర్షిక..బాగు చేసుకుందాం
గొర్లు ,గోదల్లెక్క బతుకొద్దని
కోతుల్లా ఊర్లమీద పడొద్దని
పందుల్లా బాటలపై మలినాలు వేయొద్దని
నక్కల కుట్రలు ,పులుల దాష్టీకం కింద నలుగొద్దని
రాతలు రాసుకొని
దేశం గోడలకు పూతలు పూసుకున్న దినం
తెల్లారక ముందే బడిపిల్లల్ని లేపి
గల్లీ గల్లీలో నినాదాలు నింపి
ఏడాదేడాది ఎరుక చేసుకుంటున్నాం
పెద్దోళ్లందరూ జెండాలు ఎగరేసి జై అంటే
జాతెలా ఉండాలో గీతాలు పాడుతున్నం
మిఠాయిలతో సరిపెట్టుకొని ఇంటితోవ పడుతున్నాం
ఏడాదంతా ఏమైందో, ఎటు పోయిందో
ఎందరిని మంట్లె కలిపిందో
ఎందరిని ఏరు దాటించిందో
కాపలా కుక్కలు ఎందరిని కరిచాయో
గడచిన పద్దును తిరిగేసినమా
నడిచే ఖాతా నవ్వులపాలు కాకుండా చేసినమా
ఏడాదికోసారైనా లెక్కలు చూసుకుందాం
దేశం దశదిశ బాగుచేసుకుందాం
............... ........................
కొమురవెల్లి అంజయ్య
సిద్దిపేట
4
*కవితా గానం*
పేరు : డా.దీపక్ న్యాతి
తేది : 26-01-2021
అంశం : గణతంత్ర దినోత్సవం
శీర్షిక : సర్వశక్తి సంపన్నం
ఉత్సవం ఉత్సవం దేశమంతా
జరుపుకునే దేశ ఉత్సవం
ఒకటి స్వతంత్ర దినోత్సవం
మరోటి గణతంత్ర దినోత్సవం
విదేశాలనున్న భారతీయులు సైతం
పరవశించి జరుపుకునే ఉత్సవం
నేడు గణతంత్ర దినోత్సవం
సస్యశ్యామలం తోపాటు
సర్వసత్తాక దేశం భారతదేశం
స్వశక్తితో నిలదొక్కుకున్న దేశం
పొరుగు దేశాలకు ధీటైన పోటీ
ఇవ్వగల సర్వశక్తి సంపన్నమైన దేశం
స్వతంత్రంగా సాహసించ గల దేశం
విజ్ఞుల విరివిగా గన్న గణతంత్ర దేశం
గగనయానాన సాటిలేని మేటి దేశం
కుళ్ళుకునే దేశాలపై కళ్ళెర్రజేసే దేశం
శాంతియుత ప్రపంచ పెత్తనానికి
సత్తా చాటుకునే చెవి చూపిన దేశం
ఐక్యమత్యాన్ని ఆదర్శంగా చూపిన దేశం
దేశదేశాలకు అగ్రదేశం కావాలన్నా
గణతంత్రాన్ని చెరుపుకోక నిలుపుకోవాలి
అహం వదిలి కలిసుండాలి మనం
డా.దీపక్ న్యాతి
హైదరాబాద్
5
కవితా గానం
అంశం :- గణతంత్ర దినోత్సవం
కోరాడ నరసింహా రావు ...!
* పండుగ చేసు కుందాం....! *
********************
ఈ మానవ జీవన ప్రస్థానంలో
ఎన్నెన్ని దశలు....?!
మనిషికి ఊహ తెలిసి....
ఆహారాన్వేషణ తో మొదలైన
జీవితం....,
సంచారం...సేకరణ ల నుండి...
స్థిర నివాసం...వ్యవసాయం...
ఇదో గొప్ప మలుపే కదూ...!
మనము-మనది అని బ్రతికి
నన్నాళ్ళూ బ్రతికి...నేను-నీవు
నాది-నీది అంటూ... ఎవరికి వారై...బ్రతకాలనుకున్నవాళ్ళు
అలానే బ్రతకొచ్చుగా....!
ఎవరిది వారు దాచుకున్నంత
వరకూ...సరే...!
ఒకరిమీద పడి... ఇంకొకరు
దోచుకోవడం తోనే... వచ్చింది
చిక్కు...!!
పరస్పర సాకారం కోసం...పని
విభజన,వ్యవస్థలు సరిపెట్టుకోలేక...స్వీయ నియంత్రణ చేతగాక....,అధికారాన్ని శక్తి ,
యుక్తి ఉన్నవారికి కట్టబెట్టి...
రాచరిక వ్యవస్థకు అవకాశాన్నిచ్చాం...!
ఈ మానవ మహాయంత్రపు
బుర్రలో....ఎన్ని తంత్రాలు!?
ప్రాంతీయాధికారాలతో తృప్తి
చెందక...సామ్రాజ్య కాంక్షతో
అనేక యుద్దాలి...రక్తపాతం!
చిన్న-చిన్న సామంత రాజ్యాల
అఖండ భారత సామ్రాజ్యం...
సాగింది ఎన్నాళ్ళు...?!
పరస్పర విబేధాలు...కలహాలు
యుద్దాలు...అనైక్యత...ఇవే
కదూ...విభజించి పాలించే...
వలసవాడులకవకాశమిచ్చాయి...!
శతాబ్దాల కాలం...పరతంత్ర
పీడన...!
కళ్ళు తెరిచిన భారతీయం !
సుదీర్ఘ పోరాటాలు...దేశభక్తుల
బలిదానాలు...,!
వదిలింది...పరాయి పీడ...!
పోయింది...పరతంత్ర చీడ..!!
రాచరికాలు వద్దని...
పక్షపాతాలు రద్దని....
సమన్యాయం,సమధర్మమని...
సకలజన సంక్షేమమేముద్దని
పరతంత్ర విధానాలు రద్దుచేసి
మనల్ని...మనమే పాలించకునే
గణతంత్రంరూపొందించుకుని..
సర్వ సత్తాక సంక్షేమ స్వరాజ్యం
గా...ప్రకటించుకుని...స్వ పరి
పాలనకు శ్రీకారం చుట్టిన....
జనవరి.26...! ఇది మనకో
గొప్ప పర్వ దినం...!కుల,మత.
ప్రాంత బేధాలను విడచి....
భారత దేశ ప్రజలందరం...
మన జాతీయజెండాను...
ఎగుర వేద్దాం....! జాతీయగీతాలు ఆలపిద్దాం !!
ఆనందంగా...పండుగ చేద్దాం!!!
గతానుభవాలు తలచుకొని...
చేసిన తప్పులు తెలుసుకుని...
సౌభ్రాత్రుత్వం తో...శాంతి, సౌఖ్యాలు విలసిల్లు నటుల
మనలను మనమే పాలించుకుందాం...!
జయహో....భారత్....!
జయ...జయ హో.....
గణతంత్రదివస్.....!!
*********************
..........కోరాడ.
6
🌸 *గణతంత్ర దినోత్సవం..*🌸
అమరవీరుల రుధిర ధారలు
నిరంకుశ బ్రిటీష్ రాజ్యంలో ఏరులై పారితే
నూనూగు మీసాల యౌవనం
ఈ మట్టిలో పౌరుషమై పొంగిపొర్లింది
స్వరాజ్యకాంక్ష ప్రతి గుండె
స్వాభిమానమై స్పందిస్తే
బానిస సంకెళ్ళ ఛేదనయే
ప్రతిహృదయ వేదనయై ఆవేదన చెందింది
స్వాతంత్ర్య సాధనయే సంవిధానమై
అహింస రణతంత్రం నినాదమై సాగితే పరిపాలన హృదయమైన రాజ్యాంగం డా౹౹ అంబేద్కర్ ద్వారా ఆవిష్కృతమైతే గణతంత్ర రాజ్య స్వప్నం సాకారమయ్యింది..
*సర్వసత్తాక* రాజ్యపు సొబగులు
ఈ నేలపై దిద్దబడితే
*సామ్యవాదం* పరిమళించిన సౌరభాలు
ఈ స్వేచ్ఛావాయువులో కలిశాయి
*లౌకికత్వం* భిన్నత్వంలో ఏకత్వమే
అసలైన మానవత్వమనీ చాటితే
*ప్రజాస్వామ్యం* ఈ దేశ ప్రజల
అమూల్యఆస్తిపాస్తులై పరిఢవిల్లి
పర్యాప్తమైన సందర్భంలో నా దేశం
*గణతంత్ర దేశంగా* ప్రపంచపటంలో
సగర్వంగా నిలబడ్డ శుభసందర్భంలో..
*గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో..*
🌸🌸💐💐🇮🇳🇮🇳
*సర్ఫరాజ్ అన్వర్..*✍🏻
7
కవితా గానం
పేరు :కొలచన విజయ భారతి
శీర్షిక: స్వాతంత్ర్య కీర్తి పతాక
తేదీ:26-1-2021
*********************
బానిసత్వపు శృంఖలాల నుండి స్వేచ్ఛా వాయువులు పీల్చిన భారతావనికి
నిలకడైన స్థితి ఏర్పడిన
మహనీయ ఘట్టం
స్వతంత్ర భారతంగా
ఆవిర్భవించిన ప్రజాతంత్ర గణతంత్ర దినోత్సవం
కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ వస్తున్న
సుదీర్ఘ రాజ్యాంగం
ఐరావత సదృశ మానమై
వెలుగొందిన రాజ్యాంగం
బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి రూపశిల్పులచే
రూపొందించిబడి ఘనకీర్తి
పొందిన రాజ్యాంగ శిల్పం
ఎందరెందరో మహానుభావుల
కీర్తి ప్రతిష్టలను గౌరవించే దివసం
భారతీయ కళలన్నీ ఒకే వేదికపై
కనువిందుగా అలరించే సుదినమీదినం
డెబ్బది రెండు సంవత్సరాలుగా
పలు రకాల సవరణలు చట్టాలతో రూపుదిద్దుకున్న
రాజ్యాంగం ప్రజానీకానికి
మరిన్ని సంస్కరణలు చేపట్టి
ప్రగతిపథంలో నిలుస్తుందని
ఆశిద్దాం
🙏🙏🙏🙏🙏
కొలచన విజయ భారతి
హైదరాబాద్
గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కవిత
8
కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..గణతంత్ర రాజ్యం
బానిస సంకెళ్ళను తెంచుకున్న భారతావని స్వేచ్చా స్వాతంత్ర్యాలు సాధించుకున్న వేళ
పరిపాలనా సౌలభ్యం కోసం
ఆదర్శ రాజ్యమై వెలిగేలా
మహామహులు రూపొందించిన
అతిపెద్ద లిఖిత రాజ్య0గం
మహాత్క్రుష్టమైన గ్రంథం
ప్రజాస్వామ్య దేశంలో
ప్రజా సంక్షేమం కోసం కూర్చిన రాజ్యాంగం
ప్రభుత్వానికి ఆత్మ సదృశ్యం
దిశా నిర్దేశం చేసే మార్గదర్శి
అధికరణలు,షెడ్యూల్ లు
హక్కులు,విధులు,ఆదేశిక సూత్రాలతో అమరిన పరిపాలన గ్రంథం
భారత దేశాన్ని నిలిపినది
సర్వ సత్తాక,సామ్యవాద,లౌకిక,ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా
,భిన్నత్వంలో ఏకత్వంలా భారత కీర్తి పతాకం ఎగురవేసి
ప్రపంచానికే ఆదర్శంగా
మహనీయులు సాధించిన విజయంతో
స్ఫూర్తి పొందాలి నవ యువత.
Comments
Post a Comment