నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ
**************†***********
1.ధనాశి ఉషారాణి గారు
2.దీపక్ న్యాతి గారు
3.అపరాజిత్ గారు
4.భరద్వాజ గారు
5.కెసి నరసయ్య గారు
6.సుధారాణి కృష్ణం రాజు గారు
7.డా.పాండాల మహేశ్వర్ గారు
8.మన్నె పిన్నక లలిత గారు
9.ప్రమోద మునిమడుగు గారు
10.డా.ఆంజనేయులు గారు
11.డా.బల్లూరి ఉమాదేవి గారు
12.మర్రి జయశ్రీ గారు
13.పరాంకుశం రఘు నారాయణ గారు
14.సునంద వురిమళ్ళ గారు
15. వల్లాల విజయ లక్ష్మి గారు
***********
06/01, 8:11 PM] Dhanasi Usha Rani Poetess: శీర్షిక.ఆశాకిరణాలు
.........
మనుసును గుచ్చుకున్న
గాయపు ముల్లులో
కన్నీటి దారలను ఓదార్చుట ఎవరితనము కాదు
నమ్మించి మోసము చేసిన
మనిషిలో ఊసరవెల్లి రంగుల మాటున మాయను
ఎదురుక్కోగా గాయపడిన
మనిషి మదిలో గాయమును
కాలగమనము తుడ్చుతుంది
అవమాన ముల్లు మనిషిని
అలా అమాంతముగా గుచ్చినపుడు
గెలుపు జెండాను ఎగురవేసి
విజయాల బాటలో సాగడమే
నిజమైన బతుకు ఆశాకిరణము
ప్రతి క్షణము ఎదో సాధించాలనే
తపనలో నూతన తేజస్సుతో
బతికి ఆశలను చిగురిపచేసుకోవడమే
బ్రతుకున నిజమైన ఆశాకిరణము
ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
2
[06/01, 8:18 PM] దీపక్ న్యాతి: కవితా గానం
పేరు : డా.దీపక్ న్యాతి
తేదీ : 06-01-2021
అంశం : ఆశా కిరణాలు
శీర్షిక : విధానం
నడిచే నేటికి వచ్చే రేపు ఆశాకిరణం
అంధః కారానికి వెలుగుకు ఆశాకిరణం
జీవాత్మ కు జీవం ఆశా కిరణం
అండానికి పిండం ఆశాకిరణం
పిండానికి శ్వాస ఆశాకిరణం
విత్తుకు చినుకు ఆశాకిరణం
అంకురానికి రవి కిరణాలు ఆశాకిరణం
కలలకు సహకారం ఆశాకిరణం
ఊహలకు ఉనికి ఆశాకిరణం
భక్తి ముక్తి ఆశాకిరణం
యుక్తికి శక్తి ఆశాకిరణం
ఆనందానికి తృప్తి ఆశాకిరణం
మమతకు అనురాగం ఆశాకిరణం
ప్రేమకు ఆత్మీయత ఆశాకిరణం
స్నేహానికి బంధం ఆశాకిరణం
దయకు దానం ఆశాకిరణం
రాగానికి స్వరం ఆశాకిరణం
వర్ణానికి చూపు ఆశాకిరణం
సేవకు గౌరవం ఆశాకిరణం
స్త్రీకి అమ్మతనం ఆశాకిరణం
మగాడికి సంతానం ఆశాకిరణం
కవనానికి అక్షరాలు ఆశాకిరణాలు
డా.దీపక్ న్యాతి
హైదరాబాద్
3
[06/01, 8:22 PM] Aparajith: తిరగబడు!
వేయి ఫిరంఘులు
ఒకేసారి పేల్చితే
లెచిపోయే ప్రాణాల మాదిరి!
మనస్సుకయిన గాయాలు
తిరగదోడుతున్నా కొద్ది
హృదయంలో అగ్నిగుండలెన్నో!
వేదన సంవేదనల సాక్షిగా
హృదయ లోతుల్లో
సల సల మండే ఎర్రని రక్తం!
ఎగబడి తిరగబడాలని
నమ్మిన జీవన శైలిని
మున్ముందు అమలుచేయాలని
కాంక్ష కళ్లల్లో రగులుతుంటే!
ఎన్నాళ్ళని రోదిశ్తావ్
మూన్నాళ్ల బ్రతుకు పుటల్లో
రక్తాక్షరాలు ఎన్నని లిఖిస్తావ్!
మేల్కొన్న వాస్తవాన్ని
ఇపుడైనా దేదీప్యంగా వెలిగించు!
వర్తమానంలోనే దారులు వేసుకో
గతం చీకట్లు చీల్చుకో
ఆకాశంలో ఎగిరే పక్షుల్లా
సంతసంతో ఆత్మను
గాలిలో తేలియాడనీ
విరిసిన పూల పరిమళాల్లా
ఆనంద డోలికల్లో మునకలువేయి!
చేదు జీవితాన్ని కాల్చి బూడిద చేయి
మున్ముందు అన్నీ విజయ శిఖరాలే
ఆశ నిరాశలు సహజం
నిరాశ నీడగా మిగలనీ
అదిగో వేగుచుక్క పొడిచింది
నవోదయ వెలుగులు రాబోతున్నాయి!!
ఆపరాజిత్
4
[06/01, 8:29 PM] భరద్వాజ గారు: 🔱కవితాగానం🦚🦚🦚🦚🦚
బుధవారం
అంశం-ఆశాకిరణాలు
శీర్షిక-బ్రతుకుకు చుక్కాణి
నాగుండెలోతుల్లో పుట్టిన ఒక శ్వాస ఆశ -
ఎంతనిదురపుచ్చినా మేలుకుంటుంది -
ఎన్నిసార్లు తీర్చినా మరోసారంటుంది -
నే బ్రతుకుతున్నది దానికోసం -
దాన్నితీర్చడంకోసం -
కష్టాలుపడ్డాను -
కన్నీళ్ళుకార్చాను -
ఎన్నోమెట్లుఎక్కాను -
జీవితపు చివరిఅంచులలో విహరించాను -
ఆశ తీరలేదు -చావలేదు -
అదినన్నుఆడిస్తుంది -
నన్నుశాసిస్తుంది -
నన్ను బ్రతికిస్తుంది -
నాతోనే నశిస్తుంది -
ఆకిరణాలునాజీవితగమనాన్నినడిపిస్తాయి-
నాకోరికలకు ఊతమిచ్చి -
నాలోప్రవహించే ఆశా నీకునమస్కారం -
నన్నుపెట్టకుతిప్పలు -
ఊపిరిఉన్నంతవరకూ నాతోవుండు -
నాకు చుక్కానివిగానిలబడు
ఇదినాస్వీయరచన
భరద్వాజా రావినూ-తల(RB)🖍️
కొత్తపట్నం
9866203795
5
[06/01, 8:52 PM] KC Narsaiah KS 26: కవితా గానం
అంశం ఆశా కిరణాలు
కేసి నరసయ్య
చెత్తకుప్పల్లో
వెతుకులాట
సందు గొందుల్లో
జీవన పోరాటం
అందమైన బాలలు
అందని పండు కోసం
ఆరాటం లేని పోరాటం
పాలకుల నీతి వాక్యాలు
పారుతున్న నీటిలో
పాకురు బండలు
సూర్య చంద్రుల
గమనంలో
ఎదురీదుతున్న
అనాధ బాలలు
అమ్మానాన్నల
రూపం కోసం
మబ్బుల చాటున
ఆలోచనల పరుగులు
భవిష్యత్ తరాల ఆశా కిరణాలు
6
[06/01, 8:52 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏
🙏 సుధారాణి కృష్ణంరాజు🙏
*అంశం*ఆశాకిరణాలు*
06-01-2021(బుధవారం)
ఆశలు అడియాశలు అయితే
నాలో ఏవో ప్రకంపనలు
నిలబడనీయవు అనుక్షణం
తీరని వేదనతో మనసు పడే
ఆవేదనతో ప్రతి నిమిషం
ఒక యగంలా గడిచినా
మనసులో ఏదో ఒక వైపు
చిన్న ఆశ కిరణమై నా మదిలోని భావాలను అర్థం
చేసుకుని నేనున్నాను అనే
భరోసా ఇచ్చి నన్ను ముందుకు
నడిపించేది ఆశలు అనే
వెలుగు కిరణాలే
ఆశ నిరాశలు దాగుడు మూతలు ఆడినప్పుడు జీవితమే ఒక చదరంగం
సంసారమనే రణరంగంలో
నిత్యం యుద్ధం చేసి అలసి
పోయిన నా మనసు భావోద్వేగానికి లోనైనప్పుడు
ముందు ముందు మంచి రోజులు వస్తాయని మనసుకు
కలిగే గొరంత ఆశ జీవితం లో
కొండంత వెలుగును నింపేవి
ఈ ఆశా కిరణాలే🙏🙏
7
[06/01, 9:03 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: ***ఆశయే సత్యం***
✍️ డా.పాండాల.
నాయంతరంగాన నా చింతనములోన
ఆశయే శ్వాసగా అడుగులేయు!
బ్రతుకంత తీపిగా భవితంతభాగ్యంగ
కష్టాలుఇష్టాల కలిమినెంచు!
కర్తవ్య కన్నీళ్ళుకార్చినా సరెగాని
జీవితంసుఖమంటు చిత్తమందు!
తాత్త్వికా తపమిచ్చి సాత్త్వికా గుణమిచ్చు
త్రికరణా శుద్దులా కీర్తిగూర్చు!
ఆశకిరణమై తనువుకుఅందమిచ్చు
ఆశ కోరికై సఫలంగ సత్యమిచ్చు!
ఆశ మనుగడై మనిషికి మమతకూర్చు
ఆశ నిత్యమై ముత్యమై అందమిచ్చు!
✍️డా.పాండాల మహేశ్వర్
యాదాద్రి జిరసం.
8
[06/01, 9:06 PM] +91 74168 63289: కవితా గానం
పేరు :మన్నె పిన్నక లలిత
తేదీ:6/1/ 2021
అంశం : ఆశా కిరణాలు
శీర్షిక :కిరణం
ఓటమిలో గెలుపు ఆశాకిరణం
తల్లిదండ్రులు తమ కష్టాలు మరిచి
పిల్లలను పెంచి పెద్ద చేసి
జీవితంలో స్థిరపడితే
కష్టాల చీకటిలో సుఖమే ఆశాకిరణం
బతుకు అంచు చివర ఉన్న మనిషిని
వైద్యుడు నీకేం కాదు అన్న మాటే
రోగికి ఆశాకిరణం
ఉపాధి లేక సంసారాన్ని పోషించలేక
కలో గంజో తాగుదామన్నా చేతిలో డబ్బులు లేక
బతుకు ముగించుదాం అనుకున్నప్పుడు
అనుకోని అదృష్టం కలిసి వస్తే ఆశాకిరణమే
అంధకారాన్ని చూస్తూ
వెలుగు కిరణం కోసం చూస్తున్న అంధునికి
నేత్రదాత కళ్ళు అమరిస్తే
ఆ కళ్ళల్లో కనిపించేది ఆశా కిరణాలే
విద్యార్థికి ఉపాధ్యాయుడు ఆశాకిరణమే
నేటి ఆశ రేపటి భవిష్యత్తు కోసం
ఆశా కిరణమై వెలుగుతుంది
9
[06/01, 9:08 PM] +91 90002 51604: జీవితం అందకారబందురమైన వేళ
జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త ఆకస్మిక మరణం
కన్నీళ్ళే....ఆమె కష్టాలను చూసి భయం తో కనుమరుగయ్యాయి
పాలుగారుతున్న వయస్సులో ఉన్న ముగ్గురు ఆడపిల్లల తో ..ఆమె .
యవ్వనంతో....పరిపూర్ణ స్త్రీత్వాన్ని సాక్షి గా ఆమె.
నా అన్న వాళ్ళు పరాయివల్లైన వైనం
పరాయి వాళ్ళు..... సూదుల్లాంటి లాంటి మాటల తో మనసు పై చేసే గాయాల పుండ్లు తో ఖేదం
చేతిలో చిల్లి గవ్వలేదు...
ఒంటరి జీవితం...
పిల్లల జీవితం అగమ్య గోచరం.
ఎటు పాలుపోని స్థితి
ఏ ఆధారమూ లేని ఆమెకు
జీవితం కారు చీకటి మయం
అదుగో...అప్పుడు విరిసింది ఓ ఆశా కిరణం
అదే ఆమె పాలిటి కామధేనువు
అదే ఆమె సగర్వంగా తలెత్తుకు తిరిగే
ఆత్మ విశ్వాసాల పట్టుగొమ్మ
అదే ఆమె చదువుకున్న .."చదువు"
పదిమందికి విద్యను అందించి
మొప్పోద్దులా..పట్టెడన్నం తినిపించింది
ఆ చదువే దారి చూపే... వెలుగయ్యిన్ది
ఆ చదువే ఆమె జీవితాన్ని నిలబెట్టే దిక్కయ్యింది
ఆ చదువే ...ఎందరో జీవితాలకి..ఆశా కిరణమై
ప్రపంచాన్ని..నడిపించే శక్తి అయ్యింది..
అవును...చదువే.. ఆశాకిరణమయ్యిన్ది
జీవితమనే రణరంగంలో.....చదువే ఓ ఆయుధమయ్యింది
...ప్రమోద మునిమడుగు
10
[06/01, 9:10 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఆషా కిరణాలు
మనిషి ఆశయంతో రేపటి పై ఓ ఆశ తో బ్రతుకుతాడు
రేపటి పై ఆశలు ఉన్న వాడే మానవుడు
ఆశతో మమత గూర్చు మానవుడే నిత్యమై సత్యమై భావమై నవ జీవన గీతిక అవుతాడు
నిరంతరం భావన మమతల మానవీయ భావన ఆశగా భావన వెలిగే కాంతి గీతికలు
మనిషివి కోసమై వికాసము చెంది
స్నానము వెలుగుల జ్యోతులు వెలిగిస్తూ ఉషోదయపు వెలుగు
ఎదలు ఎదలు
ఎద లో సొద లన్ని నింపి
కిరణాల ధారగా
సుధలు గురించే సమత మమత సౌందర్య గీతిక రాత్రి వెలుగు
వెన్నెల సోయగాల వెల్లివిరిసే పూల వాన గా ప్రతి రాత్రి ప్రతి పగలు ప్రపంచానికి సంతోషాన్ని
ఈ ప్రపంచానికి వెలుగు కాగడాను వెలిగించండి
అంబరం పై విశ్వములో ఎందరో త్యాగధనులు మహనీయుల ప్రమోదం లో ప్రమాదం కలగకుండా ఆవిర్భవించే
మానవతా పరిమళాలు వెదజల్లే
లోకానికి త్యాగానికి అనురాగానికి సాగని నవ రాగాల గీతమై
నిలిచే ప్రపంచ ఆశాకిరణం
ఉత్తేజంగా ఉల్లాసంగా సాగని
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
11
[06/01, 9:18 PM] Balloori Umadevi Poetess: 1/21
కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి
అంశం: ఆశాకిరణాలం
మానవ జీవితాలకాలంబనం ఆశ
రేపటిపై ఆశే నడిపించే చుక్కాని
అంతులేని ఆశలవలయంలో చిక్కి
శ్లేష్మం లో పడ్డ ఈగల్లా బయటకు రాలేక
అందులో తచ్చాడే వారు కొందరైతే
కష్టాలు కడలిలో ఆశలపడవలో
జీవనయానం చేసే ప్రభాత వేళలో
తీరం చేరుకునే పడవ గల్లంతై తే
పెంచుకొన్న ఆశలు చిత్తై పోవా?
స్వశక్తితో స్వంత కాళ్ళపై నిలబడాలని
కన్నవారి కలలు పండించాలి
కోటి కలలు కంటూ ఆశతో ప్రయత్నాలు
ఆపక చేసిన ప్రయత్నాలు వమ్మైపోతే
బ్రతుకు శూన్యం అని అనిపించే తరుణంలో
చీకటిలో చిరుదీపంలామినుకు మినుకు మనే
ఆశా కిరణం ఆసరాతో రేపటిపై భరోసాతో
పడ్డవాడెప్పుడు చెడ్డవాళ్ళు కాదంటూ
పట్టువదలని విక్రమార్కుడిలా అడుగు ముందుకేస్తూ
ఆగకుండా సాగుతూ విజయాన్ని అందుకో
ఆశల శిఖరాన్ని అవలీలగా అందుకో
12
[06/01, 9:28 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..ఆశాకిరణాలు
శీర్షిక.రేపటి వెలుగులు
చిన్నారి బాలలు
చిరునవ్వుల దివ్వెలు
కల్లాకపటం ఎరుగని
కడిగిన ఆణిముత్యాలు
స్వేచ్చగా ఎగిరే విహంగాలు
సమతా మమతను పంచే
మానవతా సుమపరిమళాలు
కలతలెరుగని నిర్మల ప్రతిరూపాలు
జాతి ఐక్యతకు చిహ్నాలు
భారతమాత మెడలో మెరిసే రత్నాలు
మంచితనపు సుగంధం వెదజల్లే మల్లెలు
ఆదర్శ మార్గంలో పయనించే
విజ్ఞాన విపంచికలు
భవితకు వారధులు
కువ కువ రాగాలు తీసే గువ్వలు
గాలిలో ఎగిరే పతంగాలు
నింగిన ఎగిసే తారా జువ్వలు
పిల్లల నవ్వులతోనే సంతోషము నిండును జగమంతా
వారే రేపటి ఆశాకిరణాలు
13
[06/01, 9:31 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితాగానం*
*కవితా శీర్షిక:ఆశాకిరణాలు*
మనిషిలో నిత్యం సకారాత్మక ఆలోచనలే..,
మునుముందుకు నడిపిస్తాయి !
మానవ జీవితంలో కష్టసుఖాలు షరా మామూలే !
కష్టాలకు దడవకుండా..,
సుఖాలకు పొంగిపోకుండా..,
అన్నిటినీ బేరీజు వేసుకుంటూ..,
సర్దుబాటు గుణంతో నడచుకుంటూ...,
ఆశావహ దృక్పథంతో ముందడుగు వేయాలి!
అన్ని సమస్యలకు పరిష్కారాలుoటాయనీ..,
పూర్వానుభవాలను నెమరేసుకుంటూ..,
వయో భేదాలకు తావులేని ,
జీవిత చరమాంకం వరకూ..,
నిత్య పోరాటశీలురుగా ...,
సమస్యల సుడిగుండాలను ఎదుర్కొంటూనే...,
ముందుకు వెళ్ళడమే మన పరమావధి!
అదే విజయసోపాన రహస్యం!
ఆశావహ దృక్పథమే మనిషి ఉన్నతికి ఉత్తమ మార్గం!!
- పరాంకుశం రఘు నారాయణ మహబూబాబాద్
14
[06/01, 9:33 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*
తేదీ:06-01-21
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: ఆశా కిరణాలు
******************
పల్లవించే తరానికి
పసినవ్వులే ఆశా కిరణాలు..
ఇంటింటా కాంతులు వెదజల్లే
కల్మష రహిత హృదయాలు!
మలి పొద్దు జీవితానికవి
మమతల పరిమళాలు
తూరుపు ఎదపై పారాడే
బాల భానుడి వారసులు!
పశుపక్షి మనుష్యుల కవే
అమ్మతనపు ఆనవాళ్లు!
పవిత్రతను సంతరించుకున్న
హృదయ దేవాలయాలు!
కల్లలు ఎల్లలు ఎరుగని
సమతా మమతల దివ్వెలు
స్వచ్చమైన మనసున్న
చల్లని వెన్నెల నిలయాలు!
విశ్వ జనీన ప్రేమకు చిహ్నాలు
విరితోటలో గుబాళిఃచే పువ్వులు
మదిలో చిరాకులను తొలగించే
మంచి గంధపు లేపనాలు...
15
[06/01, 9:50 PM] Lalita Sister: *ఆశా కిరణాలు*
*************
చెప్పుకోలేని భావంలా
మౌనంగా నేనున్నపుడు
నాతో మాటాడేది ఆశల ఊసులే
నిండుస్నేహాన్ని పొందలేక
శూన్యంలో చూస్తున్నపుడు
నా నిజనేస్తాలయ్యేవి ఆశలహస్తాలే
ప్రాణాధార బందాలేవో తెగి
మది కృంగి దుఃఖిస్తున్నపుడు
ఓదార్పులయ్యేవి ఆశలతూర్పులే
తోటి వారి కన్నీళ్ళకు కరగని జనం
సముద్రఘోషను"జాలి"గ చూస్తుంటే
నిరాశాసoద్రాన మునగకుండా రక్షించేవి ఆశలతెడ్లె
ఆంక్షల వడగాలులకు మనసు
వాడిపోతుండగ మౌనినైనపుడు
సమీరాలై సంరక్షించేవి ఆశావాయువులె
కృత్రిమ నవ్వులు సంభాషణలు రువ్వుతుంటే
తుఫానులో చిక్కిన పావురమై వణికేప్పుడు
చక్కని పునరావాసాన్నిచ్చేవి ఆశా కామoచి లె
పరిస్థితులు ఎదకు గాయాలు చేస్తున్నా
మోడైన మదిమానును చిగురింపజేస్తూ
గేయాలు రాయిస్తున్నవి ఆషాకిరణాలే
సగటుజీవినైనా ఆశావహురాలను
మనుషుల్లో మంచినే గాంచే ముద్దరాలను
ప్రకృతిమాత ఒడిని కోరే పసిమనసు బాలను
ఆశలకిరణాలతో చైతన్యమయే సగటుజీవిని
:వల్లాల విజయలక్ష్మి
ఆలేరు
Comments
Post a Comment