[30/01, 8:08 PM] Lalita Sister: ✳️✳️✳️✳️✳️✳️✳️✳️
కవితాగానం
నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ (వెన్నెల శిల్పం సృష్టి కర్త)
**********"""
కవి వరుల జాబితా
1.డా.పాండాల మహేశ్వర్ గారు
2..పరాంకుశం రఘు నారాయణ గారు
3.సుధారాణి కృష్ణంరాజు గారు
4.అభిరాం గారు
5.కొలచన విజయ భారతి గారు
6.సంధ్యా శర్మ గారు
7.కె.ఇ.నిలమంగై గారు
8.కోరాడ గారు
9.అయిత అనిత గారు
10.ఇంద్రవత్ రాహుల్ గారు
11.మన్నె పిన్నక లలిత గారు
12.సునంద వురిమళ్ళ గారు
13.మర్రి జయశ్రీ గారు
14.విజయ లక్ష్మి విల్లాలు గారు
*********
నేటి అంశం
గాంధీయిజం
ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు
అంశానికి కవితలతో
స్పందించగలరు.
ఆ సమయంలో ఎలాంటి
ఇతరస్పందనలు తెల్పకూడదు.
✳️✳️✳️✳️✳️✳️✳️✳️
1
[30/01, 8:25 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: *** గాంధీగిరి***
✍️ డా.పాండాల .
మహాత్మ గాంధీ బహుముఖ చిత్రం
మరపురాని మహనీయ చరిత్రం
కరం చంద్రుదే వెన్నెల భారతీ
తరతరాల విధాతయె గాంధీ....!
జాతికి పితగా వెలిగిన వైనం
జాతిగౌరవం పెంచిన సుగుణం
దాస్యశృంఖల పరాయి పాలన దొరలను తరిమిన దివ్య స్వరూపం
సమూలాగ్రముగ శాంతినాదముతో
గాంధీ గిరిగా సర్వజనుల్లో
స్వతంత్ర కాంక్షకు పాదులు వేసిన
బంధ విముక్తపు శక్తియే గాంధీ...!
సత్య అహింసల పునాదులేసి
నిరసన ధర్నా రాస్తా రోకోలు
నిరహార దీక్షలే నిజాల యిజముగ
పరిష్కారపు పరిణతి గాంధీ...!
గీతాపఠనం జ్ఞాన ప్రభోదం
సర్వశ్రేయము సమాదరణము
ఖద్దరు పోగుల స్వదేశీ సంస్కృతి
కొల్లాయిగట్టిన పరిపూర్ణత్వం...
అధికారానికి అర్రులు చాచని
అపర మహాత్ముని అణుకువ సుగుణం
పైసా మే పరమాత్మ స్వరూపం
ముసిముసి నవ్వుల మోహనదృశ్యం...
✍️డా.పాండాల మహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి.
2
[30/01, 8:34 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితా గానం*
అంశం : గాంధీయిజం
*కవితా శీర్షిక: గాంధీమార్గం*
గాంధీజీ అహింసా సిద్ధాంతంతో!
ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాలతో!
శాంతి ప్రబోధ సందేశాలతో!
మౌనపోరాటమే శరణ్యమనే క్రమంలో!
నిరాహారదీక్ష యజ్ఞాలతో!
శాంతి చర్చలతో పోరు నడిపించిన,
అశేష జనాలను కదిలించిన,
వ్యక్తిశీల నిర్మాణాన్ని పెంచిపోషిస్తూ..,
విశాలభావ సందేశాన్ని సమన్వయపరుస్తూ ..,
సంస్కార భావాల్ని రూపొందిస్తూ....,
నీతి నియమాల కట్టుబాట్లతో!
పోరుబాటను నడిపించిన శాంతికాముకుడు!
గాంధీయిజమే ఓ..శాంతి చర్చల కార్యనిర్వహణoగా!
గాoధీయిజమే! అహింసా పోరుమార్గంగా!
ఎట్టకేలకు ఈయిజంతోనే కదా ! స్వాతంత్ర్యవిజయం!!
గాంధీజీయిజమే స్వాతంత్ర్య ఫలం!!
పరాంకుశం రఘు నారాయణ మహబూబాబాద్
3
[30/01, 8:41 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏🙏సుధారాణి కృష్ణంరాజు🙏
*నేటి అంశం*గాంధీఇజం*
30-01-2021(శనివారం)
*పుణ్య భూమి జన్మభూమి భరత భూమి మనదేశం
అలాంటి పవిత్ర భారతావనిలో
జన్మించిన మహానుభావులు ఎందరో కానీ ముఖ్యంగా స్మరించు కోవలసిన వ్యక్తి సంపూర్ణ శక్తి భారత మాత శృంఖలాలను తొలగించి భారతీయులను తెల్లదొరల అరాచకాల నుండి విముక్తి
కలిగించి దేశమాతను పరాయి
పాలన నుంచి స్పేచ్చా వాయువు లు అందించుటకు
నిరంతరం కృషి చేసిన మహాత్మా గాంధీజీ గారు చిరస్మరణీయులు
సహాయ నిరాకరణ ,ఉప్పు సత్యాగ్రహం విదేశీ వస్తువులను బహిష్కరణ మొదలైన ఉద్యమాలతో భారతీయులను
చైతన్య పరిచిన అహింసవాది, సత్యం, ధర్మం మొదలగు సాధనాలతో స్వరాజ్యం తెచ్చిన లోక హితమే తనహితంగా భావించి
జాతికే తండ్రి వంటివాడు
జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారు
సత్యం, అహింస, శాంతి నే
ఆయుధాలు గా చేసుకుని
చరిత్రపై చెరగని ముద్ర వేసిన
జాతిపిత అడుగు జాడలు
మానవాళికి మార్గ దర్శకాలు
ఆయన చెప్పిన అహింస విధానాలు జీవితంలో ఏదైనా
సాధించవలెనంటే సంతృప్తి అనేది ప్రయత్నం లో తప్ప సాధనలో ఉండదు
ఎప్పుడైతే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరిగినప్పుడు
మనం పొందే విజయం కూడా
పూర్తి స్థాయి లోనే ఉంటుంది
అని చెప్పిన జ్ఞాని
అవమానాలు,కోపం ఇతరుల వలన ఎదురైనప్పుడు మన సమాధానం చిరునవ్వే కావాలి
దాని ముందు ఎంత పెద్ద ఆయుధాలను ఉపయోగించి నా తక్కువే
ఇతరులకు నీతులు చెప్పే ముందు మనం వాటిని పాటిస్తే నే వాటికి విలువ ఉంటుంది అని చెప్పిన మేధావి
అందుకే మహాత్మా గాంధీ గారిపేరు చరిత్ర లో చిరస్థాయిగా భూత, భవిష్యత్తు, వర్థమాన కాలాలలో కూడా మిగిలి పోయిన శాసనాలు🙏🙏👍
4
[30/01, 8:55 PM] Abhiram Poet: *బహూశా...అంతేనేమో...*
నేడు నోటుపై నవ్వే తాత వెళ్ళిపోయిన రోజటా...
ఔనులే...ఆయనతో పాటే ఆశయాలు పోయాయిగా
మనకు ఎందుకు గుర్తుంటుంది...
నేడు నడిరోడ్డుపై నిలబడిన బక్కమనిషి వెళ్ళిపోయిన రోజటా...
ఔనులే... ఆయనతోపాటే కలలు కరిగిపోయాయిగా
మనకు ఎందుకు గుర్తుంటుంది...
నేడు పోలీసు స్టేషన్ లో కనిపించే ఫోటోలో ఋషి వెళ్ళిపోయిన రోజటా...
ఔనులే... ఆయనతోపాటే అహింసవాదం ఆవిరైందింగా...
మనకు ఎందుకు గుర్తుంటుంది...
కర్రతో...కళ్ళజోడుతో...సూర్యుడు అస్తమించని తెల్లోడిని తెల్లమొహం వేయించిన ముసలాయన నేలలోకి వెళ్ళిపోయిన రోజటా...
ఔనులే... ఏరు దాటాక తెప్ప తగలెట్టే మనకు ఎందుకు గుర్తుంటుంది...
తననే మరిచిపోయిన నేటి తరపు వారిని చూసి
స్వతంత్ర స్వేచ్ఛకై పోరాడి పుడమిలోకి చేరిన గాంధీ గారు ఏమనుకుంటున్నారో నేడు...
తనను సైతం మరచిపోయేంతలా అభివృద్ధి చెందిన దేశాన్ని చూసి ముక్కున వేలేసుకుని ఉండి ఉంటాడు బహూశా...
*అభిరామ్ 9704153642*
5
[30/01, 8:59 PM] కొలచన విజయ భారతి Poetess: కవితా గానం
పేరు:కొలచన విజయ భారతి
ఊరు: హైదరాబాద్
అంశం: గాంధీయిజం
శీర్షిక:నేడది పూజ్యం
తేదీ:30-1-2021
**********************
ఓ మహాత్మా!
భరతమాతను తెల్లదొరల
దాస్యశృంఖలాల నుంచి
విడిపించిన భరతమాత
ముద్దుబిడ్డవు
సత్యాగ్రహాలు సలిపావు
సత్యమే ఆయుధంగా దేశానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రసాదించావు
కొల్లాయిగుడ్డ కొట్టావు
విదేశీ వస్త్రాలను తిప్పికొట్టావు
తెల్లదొరల దాష్ఠీకాన్ని
దేశ ఎల్లలకు తరిమికొట్టావు
అహింసయే నీ నైజం
నీ గాంధీయిజం నేడు పూజ్యం
నీయిజం సహించలేని
దుర్మార్గ తూటాలకు
నేలకొరిగి అసువులు బాసావు
ప్రతి భారతీయుని కంటిధార
నీ త్యాగనిరతిని తడుపుతూనే
ఉంటుంది
తమ గుండెల్లో నీ జ్జాపకాలను
నిలుపుకునే ఉంటుంది
🙏🙏🙏🙏🙏
6
[30/01, 9:01 PM] Sandya Sharma Poetess: కవితాగానం
అంశం:మహాత్మా గాంధీ
౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
చీకటి ఖండానికీ
వెలుతురు దీపాల వరుస
పేర్చడంలో అమర్చుకున్న శాంతి కిరీటపు
ఆనవాళ్ళు...
తెగి పడ్డ మూలాల వాకిళ్ళను
దోసిట్లో తడుముకుంటూ...
జాత్యాంహంకారంతో వెలివేస్తున్న
కాలాన్ని సచ్ఛీలతా యోగంతో
ఒకే తాటిపై...నడిపిస్తూ
మనో స్థైర్యానికో ప్రయోగశాలగా ...
అడుగులో ఆత్మ నిబధ్ధత
ఆశయంలో న్యాయ సంకీర్ణత
సాధనతో... ఆచరణాత్మకమై
కన్నీటి శిల్పాల్ని చెక్కుకుంటూ..
అహింసా విత్తు నాటి
ఐక్యతా చిగుళ్ళు తొడిగిస్తూ
భిన్నత్వంలో ని ఏకత్వ పరిమళమై
అస్పృశ్యత వడగాల్పులకు
స్వాంతనా లేపనాలద్ది
నిరంతర అక్షర సేద్యంలో మమేకమై
ఆరోగ్య రక్షకుడై..వెన్నెల తాపడంతో
సంజీవుడయ్యె...
పట్టుగొమ్మలే ప్రగతి రథ సారధ్యాలని
వాక్ఫటిమతో....
వడబోసిన జీవితాన్ని
లాంతరు మసిలో కొడిగట్టిన
చరఖాల చక్రం తిప్పి
మువ్వన్నెపతాకంలోని అశోక చక్రంలా
అలుపెరుగక నడయాడిన
ఓ జాతి పితా...
మరో వెయ్యేళ్ళ చరితకు ఘనతకు
పునాది రాయిగా... భరతమాత సిగలో మెరిసే నక్షత్రం నీవు...
ఆనాటి తరగళ్ళలో జోల పట్టిన
సౌబ్రాతృత్వం కరువై
కులపు కర్కశంలో కుళ్ళుతున్న కవాతులమై...
మతోన్మాద కుహరంలో మూగబాసలమై
మగ్గుతున్న మౌన శోఖితులం
నివురు గప్పే నిజాలను ఇజాలతో
కప్పెడుతున్న... సమాజంలో
పాప పంకిలాన్ని మోస్తున్న యేసులమే మేమంతా....
అమానవీయ అసమానతలను.... తక్కెడలో తూస్తున్న
నిరాయుధులం...ప్రజాస్వామ్యాన్ని పలకరించలేని
పర దేశీయులం...
వైష్ణో జన హితమై.....
శాంతి వర్షించు నీ కళ్ళతో...
మళ్ళీ ఓ స్వాతంత్ర్యాన్ని తెచ్చి పెట్టవూ...
గుప్పెడు పచ్చని శ్వాసల్ని విచ్చుకునేట్టు...
గుండె ఆర్థ్రతల్ని తడిమేట్టు..
ఓ బాపు మళ్లీ పుట్టవూ.....!
౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪
*వై.కె.సంధ్యశర్మ*
7
[30/01, 9:01 PM] Komandoori Neela Poet: కవితా గానం
అంశం: *గాంధీయిజం*
తేది:30/01/2021
వచన కవిత్వం
ఒత చెంప పగుల కొడితే మరు చెంప చూపమన్న తత్వం గాంధీయిజం..!
అహింసే ఆయుధమై స్వాతంత్య్ర పోరాటపు గతినే మార్చిన నైజం..!
సత్యమేవ జయతే అంటూ సత్యపథాన నడచిన ధీరత్వం..!
స్వదేశీ వస్త్ర ధారణే ముద్దని,విదేశీ వస్తువు నిరాకరణ చేసిన వీరత్వం..!
చైతన్య వారధై ఉప్పు సత్యాగ్రహానికై దండుగా కదిలిన దండి మార్చి నాయకత్వం..!
చేతి నైపుణ్యాన్ని చూపి చరఖాపై దారం వడకిన నిరాడంబరత్వం..!
వెరసి బ్రిటీష్ పాలకుల గుండెలో బెరకును కలిగించిన బోసి నవ్వుల బాపూతత్వం..!
భారత జాతంతా గర్వంగా జాతిపిత అని పిలిచి ప్రేమను చూపిన విశాలత్వపు చిత్రం..!
మోహన్ దాస్ కరంచంద్ నిర్మల హాసం.. !!!!
పేరు: కె.ఇ.నిలమంగై
కలం పేరు:నీలా రంగనాధం
ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.
చరవాణి సంఖ్య:8897155600.
*ఈ పై కవిత ఈ సమూహం కోసం రాసినదేనని హామీ ఇస్తున్నాను.*
8.
[30/01, 9:07 PM] Korada: కవితా గానం
అంశం :- గాంధీ యిజ0...!
కోరాడ నరసింహా రావు.....!
* యిదా...యిదా....! *
****************
.... సత్య మహిమ్సల స్వాతంత్ర్య మే తేఛి... మనకందించేను గాంధీజీ...!
సుఖము-శాంతి సమ సవుఖ్య ముల స్వ రాజ్యాన్ని స్తాపించు కోమ్మని...!
అహింస విడిచేను... హింస
పేరిగేను...!దవుర్జన్య0,దుర్మార్గం స్వైర విహారం చేస్తుండే నహో...!!
మహిళకు రక్షణ పట్ట పగలే
కరువు....!
ఆ తేల్ల వాడి యేదురు పోటు
కన్నా... మనవాడి వేన్నుపోటు
మరింతభరించ లేని.... బాధాకరం...!!
యిదా.... యిదేనా.... గాంధీయిజ0....!?
యిందు కేనా... యేందరో...
దేశ భక్తులు ...చేసిరి ప్రాణ
త్యాగం....!!
వీడ లేరా.... స్వార్ధం...ఆ దుర్మార్గ మార్గం...!
మేల్కోనదా....మీలో...
యింకా... మానవత్వం...!
దారితప్పి అగమ్య గోచరమయి న... ఈ యావత్ప్రపంచ మానవ సమాజానికి....
గాంధీ మార్గమే శరణ్యం...!
అనుసరించండి గాంధీ మార్గం
సౌభ్రా త్రు త్వం తో... పంచండి
శాంతి... సవుఖ్య0....!!
**********************
.........కోరాడ.
9
[30/01, 9:08 PM] Anitha Aitha Poetess: *కవితా గానం*
శీర్షిక: *మళ్లీ రావా బాపూ..!*
శాంతి సహనం నీదగ్గరే నేర్చుకున్నాం!
ఎందుకో మరి
వాటికి విలువేలేదు నేటిసమాజంలో..!
ధర్మం..సత్యం
నీ ఆచరణ ద్వారా తెలుసుకున్నాం!
మరెందుకో
కనుమరుగయ్యాయి ఇప్పుడు!
అప్పుడు
ఆంగ్లేయుల పై సంధించిన
ఆ...అహింసా అస్త్రాలు
ఇప్పుడెందుకో పనిచేయడమేలేదు!
హింసతోనే అధికారాలు
అవినీతితోనే పదవులు
రాజ్యమేలుతున్నాయి!
కుట్రలు కుంతంత్రాలే నెగ్గుతున్నాయి!
మంచితనం అణచివేయబడుతుంది!!
ఆడది అర్థం రాత్రి కాదు
పట్టపగలే స్వేచ్ఛగా తిరగలేకపోతుంది!!
కక్ష్యలు కార్పణ్యాలే ఎక్కడ చూసినా!
బాపూ!
మళ్లీ ఒక్కసారి రావా?
నీతి..నిజాయితీల విలువేంటో
ఈ సమాజానికి రుచి చూపించవా?
నివురు గప్పిన నిజం ఎలా ఉంటదో తెలియజెప్పవా!
సత్యనేవజయతే అని మల్లొక్కసారి నిరూపించవా!!
రచన
అయిత అనిత
10
꧁༺ *"కవిత గానం"*༻꧂
· · • • • ✤ • • • · ·
*అంశం :* గాంధీయిజం
*తేది :* 30/01/2021
*శీర్షిక :* అహింసనే ఆయుధం
🇮🇳 *అహింసనే ఆయుధం🇮🇳*
అహింసాయుధంతో భారతావని
బానిస సంకెళ్ళను తొలగించిన
శాంతి దూత
సత్యమేవ జయతే నినాదాన్ని
సర్వజగత్తుకు చాటిచెప్పిన నేత
శ్రమ విలువను పెంచుతూ స్వదేశీ
వస్త్రాలను రూపొందించిన జాతిపిత
సహనానికి హద్దులు లేవని సాధించు లేదా మరణించు
అనే సందేశంతో
జనజగృత పరిచిన స్ఫూర్తి ప్రదాత
అసలు సత్యం అంటే ఏమిటి?
సత్యంకు ఎందుకు ఈ ఘనత?
సత్య జ్ఞానము అంటే అంతా బ్రహ్మ..
సత్యమేవ జయతే అని...
సత్యమే సాధనకు ఆలంబనం అని..
సత్యమే సద్గుణము...
సత్యమే పరమాత్మ...
నిజాయితీ నాయకులు గాంధీ తాత
జనాహితమే పరమావధిగా
జాతి ఐక్యతకై
దేశమంతా నడిచిన దైవదూత
మాతృ భూమి సంరక్షణ కొరకు
మహిలో అమరత్వాన్ని
పొందిన మహాత్మాగాంధీ
మతం కంటే మానవత్వమే ప్రధానమని
సర్వ మతాల సారాంశం ఒక్కటేనని తనువును బలిదనమిచ్చిన త్యాగ దాత
పల్లె పరిమళం లోనె దేశ సంస్కృతి కొలువైందని ప్రపంచానికి చాటి చెప్పి
గ్రామ స్వరాజ్యనికి పునాదులువేసిన
నవ భారత జాతి నిర్మాత..
*హామీపత్రం*: ఈ కవిత నా స్వీయరచన... ✍️
ధన్యవాదములు..🙏🌹
*ఇంద్రావత్ రాహుల్✍️*
నిజామాబాద్
*9848054079*
11
కవితా గానం
అంశం గాంధీయిజం
శీర్షిక: బాపూ! పునర్జన్మించు.
తేదీ 30/1/21
పేరు మన్నె పిన్నక లలిత
అమ్మ కి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి
"చెడు వినకు, చెడు చూడకు ,చెడు మాట్లాడకు"
మూడు సూత్రాలు పాటించిన మహాపురుషుడు
యోగా నేత
పరాయి పాలన సహించక
అహింసా ఆయుధంతో
పుట్టిన 'పోరు'బందరు పేరు నిలిపి
బ్రిటిష్ వారితో' పోరు' చేసిన నిరాయుధుడు
'సత్యమేవ జయతే 'అని
దండి సత్యాగ్రహం
విదేశీ వస్త్ర బహిష్కరణ
చరక వడకటం
చేనేతను ధరించటం
ఆడది అర్ధరాత్రి ఒంటరిగా ఇల్లు
చేరటమే స్వాతంత్ర్య మని
మహిళాభ్యుదయానికి పాటుపడటం
మౌన పోరాటాలు
నిరాహార దీక్షలు చేసిన బాపూజీ
ఆడంబరాలు లేక కొల్లాయి గట్టి
సత్యాగ్రహ ఆశ్రమం ఏర్పరిచి
భారత జాతిని ఏకతాటిపై నడిపించి
ఆంగ్లేయులను గడగడలాడించి
స్వాతంత్రం తెచ్చిన మహానుభావా!
గాడ్సే తూటాకు బలైన ఓ మహాత్మా!!
ప్రస్తుత తరుణంలో ఎందరో గాడ్సే లు
మరెందరో అవినీతిపరులు
బాబు నువ్వు కలలు కన్న రాజ్యం
12
*కవితా గానం*
తేదీ: 30-01-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: గాంధీ యిజం
*********************
బాల్యం నుంచి నేర్చుకున్న విలువల పాఠం
కన్నతల్లి నుండి తెలుసుకున్న
మహనీయుల గాధల సారం
మానవతా విలువలతో ఎలా ఉండాలో చేసిన ఆత్మ శోధనం
ఈ ప్రపంచానికి భగవంతుడు ఇచ్చిన వరం
మహనీయుడైన గాంధీజీ జననం!
ఆశయాలను ఆచరిస్తూ
సత్యం శివం సుందరంల గొప్ప తనాన్ని కళ్ళకు కట్టిస్తూ
అహింస ఆయుధంగా
సత్యం అహింసలతో సాధించిన స్వాతంత్ర్యం
ప్రపంచానికి పరిచయం చేసింది
గాంధీ యిజం అంటే ఏమిటో..
భారతీయుల ఐకమత్యాన్ని
ఒక్కతాటిపై నడిపించిన నాయకత్వాన్ని
అందరూ నివ్వెర పోయేలా
చేసింది గాంధీ యిజమే..
తుది గెలుపు సత్యానిదేననీ
శాశ్వతమైనది నిబద్ధత కలిగిన
క్రమశిక్షణయేననీ
కుల మతాతీతమైనది
హృదయ సంస్కారమే వ్యక్తిత్వ నిలయమని చెప్పింది గాంధీ యిజం!
రామ రాజ్యం రావాలంటే
నువ్వు మళ్ళీ పుట్టాలి
పునర్జన్మించాలి.
13
కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..గాంధీ యిజం
భారతావని బానిస సంకెళ్ళు తెంచిన స్వేచ్ఛా భానుడు
పరపీడనలో నలిగి పోయే జాతికి బాసటగా నిలిచిన మహాత్ముడు
సత్యం, అహింసా,శాంతియే
గాంధీజీ మార్గాలు
పదునైన మూడు ఆయుధాలతో
పరదేశీయులను తరిమిన ఘనుడు
జీవహింసకు తావివ్వని పవిత్రమూర్తి
పదవులు ఆశించని పావన కీర్తి
అంటరాని తనాన్ని
అస్పృశ్యతను రూపుమాపిమ జాతీయవాది
ఆగ్రహావేశాలు దరి చేరనివ్వని స్థితప్రజ్ఞుడు
భారతమ్మ ముద్దుబిడ్డ
గ్రామ స్వరాజ్యేమే దేశ సౌభాగ్యం అని
పల్లె ప్రగతికే పట్టం గట్టిన రారాజు
14
నా కవితా శీర్షిక:*గాంధీమార్గం*
----------------------************-----
ఓ బాపూ!నువ్వేమి భోధించావో నే తెలుపగలనా?!
ఓ మహాత్మా!నువ్వు ఎన్నెన్ని సాధించావొ వివరించగలనా?!
ఓ జాతిపితా!ఎలా జయించావో వర్ణించగలనా?
ఓ అహింసావాదీ!నీ సన్మార్గాన సాగుతూ ధన్యతనొందగలను.
సాధారణ మానవుడిగా పుట్టి
అసాధారణ మహాత్ముడిగా జీవించావు
స్వతంత్రపోరాటాన కాలు పెట్టి
తెల్లొల్లనే వెళ్ళగొట్టె దారి చూపిoచావు
స్వదేశీఉద్యమాన్ని ప్రజల అభిమతం చేసి
సత్యాగ్రహఆయుధాన్ని శక్తివంత0 చేశావు
అహింసను మించిన ఆయుధం లేదు-
సత్యాన్ని మించిన సాధనం వలదన్నావు
కర్తవ్యమే మానవహక్కులకు మూల0-
మానవత్వమనే గ్రంథపుటలు తెరవమన్నావు
ఉత్తమ భారతతత్వచింతనకు కొత్త వర్ణాలద్దావు
స్వాభిమానసంపాదన స్వయంకృషితొ సాధ్య0-
సధాలోచనల పరిణామమే పరిపూర్ణనరుడన్నావు
ఓటు సత్యాగ్రహం ప్రజల ఆయుధాలు-
ఐక్యతా బలముంటెనే పోరాటం సఫలమన్నావు
సత్యాగ్రహ జీవితసౌధానికి
సత్యం ప్రేమలే పునాధులన్నావు
ఇతరులనెలా ఆకట్టుకోవాలొ గాక
ఎలా ప్రేరేపించాలో యొచించావు.
ఆత్మను చంపే తాగుడువ్యసనం
పాముకాటు కన్న ప్రమాదమన్నావు
సనాతన హిందుధర్మం-
సకల మతాల సమ్మతం
హిందూమత ఔన్నత్యం-
అంటరానితన నిర్మూలన0...
వంటి విరుద్దభావాల రైలుపట్టాలపై
నీ మానవతాబండిని సమర్థవంతంగా నడిపావు
అవినీతిసంపాదన
సౌశీల్యంలేని వ్యాపారం అరాచకమన్నావు
ఉగ్రవాదం దేవుని సృష్టిలో పాపo-
కుష్టువ్యాధి దేవుని శాపం కాదన్నావు
మానవత్వంలేని శాస్త్రజ్ఞానం నిష్ఫల0 -
రామరాజ్యమంటి ప్రజాపాలన కావాలన్నావు
ప్రకృతిని ప్రేమిస్తూ వాతావరణమార్పుల గమనించాలన్నావు
శాకాహారాన్నిభుజిస్థూ మూగజీవాల రక్షించమన్నావు
అబద్దమూ హింసే- దాన్ని మానెయమన్నావు
*నా జీవితమే నా సందేశం* * అని త్రికరణశుద్ధిగా
భావించి ఆదర్శంగా జీవించిన ఈ యుగ గౌతమా!
నీ పాదముద్రలను జగమంత వేసిన సత్యసందాతా!
ఒక్కవ్యక్తి ఇంత బహుముఖ శక్తివంతుడా!
అని ఆశ్చర్యపరిచే అద్బుత వ్యక్తిత్వశీలుడా !
నీ సత్యవచనం సత్ప్రవర్తన ఆచరణ ధృఢసంకల్ఫాలు అపూర్వాలు
నీ త్యాగధనం ప్రేమగుణాలు అమూల్యాలు
నీ సత్యమార్గాన సాగే మనుషులే ధన్యులు.
:*వల్లాల విజయలక్ష్మి* (టీచర్)*,,ఆలేరు పట్టణం,,
యాదాద్రి భువనగిరి జిల్లా
మహాత్ముడు
ప్రపంచ దేశాలకే ఆదర్శ పురుషుడు
జాతిపిత మార్గం సదా అనుసరణీయం.
Comments
Post a Comment