Skip to main content

నేతాజీ జనవరి 232021

 నిర్వహణ శివునూరి లలితాకృష్ణ

వెన్నెల శిల్పం కవయిత్రి

****************

1.పరాంకుశం రఘు నారాయణ గారు

2.శాడ వీరా గుడిపల్లి వీరారెడ్డి గారు

3.మన్నె లలిత గారు

4.డా.బల్లూరి ఉమాదేవి గారు

5. కోరాడ నరసింహారావు గారు

6.డా.పాండాల మహేశ్వర్ గారు

7.కట్ల శ్రీనివాస్ గారు

8.సునంద వురిమళ్ళ గారు

9.అయిత అనిత గారు

10.విజయ లక్ష్మి యాదాద్రి భువనగిరి

11. మర్రి జయశ్రీ గారు

12.ప్రమోద ముని మడుగు గారు

13.బండి సూర్యా రావు గారు

*********

1

[23/01, 6:53 PM] Lalita Sister:

సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా

ప్రత్యేక కవితలకు ఆహ్వానం పలుకుతుంది

*మన కవితాగానం*


ఎనిమిది నుండి తొమ్మిదిన్నరవరకు

అంశానికి కవితలతో స్పందించగలరు.


ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.

1

✳️✳️✳️✳️✳️✳️

[23/01, 7:51 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితాగానం*

  🍁🍁🌼🌼🍀🍀


*నేటి అంశం; సుభాష్ చంద్రబోస్*


*కవితాశీర్షిక ! త్యాగ శీలి- నేతాజీ*


*గొప్ప స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ !*


*ఓ సాయుధ పోరాటయోధుడు నేతాజీ !*


*రాజీపడని మనస్తత్వం నేతాజీ స్వంతం!*


 *పోరుబాటను నమ్మిన సిసలైన వ్యక్తి నేతాజీ!*


 *పదకొండుమార్లు తాను నమ్మిన సిద్ధాంతం కోసం !*


*చెఱసాలలో  మగ్గినా..,*


*పోరాటాన్ని వదలని యోధుడు వీరనేతాజీ!* 


*తిరుగుబాటు పోరాట యోధుడు నేతాజీ*!


*జాతీయ సైన్యం రూపశిల్పి ఆయన!* 


*ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు!*


 *భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో..*,


 *చురుకైన పాత్ర పోషిస్తూనే..*,


 *భారత స్వాతంత్ర్య సంగ్రామ పోరాటంలో...,*


 *అనునిత్యo తనదైన పాత్ర పోషించాడు*!


 *ఆయన సేవలను భారతజాతి యావత్తు స్మరిoచాలి!*


*ఆయన త్యాగాన్ని  సదా గుర్తుంచుకోవాలి!*


*ఇదే ఆయనకు మనం ఇచ్చే ఘననివాళి!*


-పరాంకుశo రఘు నారాయణ

     మహబూబాబాద్

2


[23/01, 8:10 PM] Veera Reddy Shada: *అమరుడా! వందనం*

      (మణిపూసలు)

*************************

*ఆజాదు హిందు ఫౌజు*

*ఏర్పరిచిన మారాజు*

*సుభాష్ చంద్ర బోసు గారి*

*జన్మదినము ఈ రోజు*


*పరతంత్ర్యమునోర్వలేక*

*బానిస బతుకొప్పుకోక*

*ఎదురుతిరిగి ఎగురవేసె*

*తిరుగుబాటు జయపతాక*


*పోరాటమె శరణమనెను*

*జైహిందని నినదించెను*

*మాతృభూమి స్వేచ్ఛ కోరి*

*మరణానికి వెరువననెను*


*రక్తాన్నివ్వండి నాకు*

*స్వతంత్ర్యమిస్తాను మీకు*

*అని చాటిన నేతాజీ*

*ఆరాధ్యుడు భరత ప్రజకు*


*జనహితమే తన చేత*

*ఘన గుణముల కలబోత*

*ముష్కరాధమాంగ్లేయుల*

*నెదిరించిన యువ నేత*


     -శాడ వీరారెడ్డి

3

[23/01, 8:18 PM] +91 74168 63289: కవితాగానం 

తేదీ :23/1 /21

 పేరు :మన్నెపిన్నక లలిత

హైదరాబాద్ 

అంశం :సుభాష్ చంద్రబోస్

 శీర్షిక :ఆశల సూరీడు


 మాతృదేశ దాస్య శృంఖలాలను తెంచి పోరాడిన

 పోరు సింహం

 బ్రిటిష్ ను గడగడలాడించిన నేతాజీ 

 ఎందరికో ఆదర్శం మరెందరికో స్ఫూర్తి 

అహింసా వాదం కొనసాగించక 

సాయుధ పోరాటమే మార్గమని 

అజాద్ హింద్ ఫౌజ్ స్థాపన కర్తయై 

ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన వీర నేతాజీ 

విదేశాలలో విఖ్యాతి పొంది 

ఉద్రేకంలో ఉత్సాహాన్ని నింపుకుంటూ

 స్వాతంత్ర్యమే లక్ష్యంగా 

ముందుకు సాగిన వీరకిశోరమా  ! 

కెప్టెన్ లక్ష్మీలో  స్పూర్తి నింపి

రాణి ఝాన్సీ " రెజిమెంట్ "నేతా !

చిత్తరంజన్   శిష్యుడా! 

తెల్లదొరల సింహ స్వప్నమా!

  మీ జై హింద్ నినాదం అప్పటికీ ...ఇప్పటికీ .....ఎప్పటికీ.... భారతదేశ ప్రణవనాదంగా 

వినిపిస్తూనే ఉంటుంది  

పరాయి పాలన సాగిన భారత దేశం కాదని 

గగనంలో  అదృశ్యమైన ఆశల సూరీడు

 భారతీయ విశ్వాసం నిలుపుకున్న ప్రతి జీవి మరువదు

 జై హింద్!!

4

[23/01, 8:27 PM] Balloori Umadevi Poetess: 23/1/21

కవితా గానం

డా.బల్లూరి ఉమాదేవి

అంశము:

నేతాజీ సుభాష్ చంద్రబోస్



ఆ.వె:భరత దేశమందు బానిసలుగ ప్రజ

   బ్రతుకు చుండ గాంచి బాధతోడ

  పోరు వల్ల మనము పొందగలము స్వేచ్ఛ

   ననుచు బోసు చాటె నవని యందు



ఆ.వె:వైరి జనుల కెల్ల వణుకు పుట్టెను నాడు

 బోసు బాబు యున్న బుగులు హెచ్చె

  శాంతి మాట కన్న సాయుధ సమరమే

సక్రమంబ టంచు సాగె ముందు


ఆ.వె:భరత మాత వెతను  బాపద లచువారు

     పోరు చేయు నెంచ పుడమియందు

     అనుచు జనుల పిలిచె  ఆజాదుఫౌ జున

     సైన్యమందు చేర జవము గాను


ఆ.వె: తెల్లవారినింక దేశమునుండియే

   తరుమ వలెనటంచు తలచి కూర్చె

     సైన్యము నొకచోట సాయుధ పోరాట

      మాచ రించ నెంచి నవనియందు


ఆ.వె:దేశమాత యొక్క దీనత్వమును బాప 

  సైన్యమిలను కూర్చి చక్కగా ను

 సమర మాచ రించ సాగుచు నేతాజి

 గగనవీధి యందె కన్ను మూసె.

5

[23/01, 8:29 PM] Korada: కవితాగానం 

అంశం :- సుభాష్ చంద్ర బోస్ 

   కోరాడ నరసింహా రావు...!

     * స్ఫూర్తి ప్రదాయకం *

        ***************

నేతాజీ జీవితం...దేశభక్తి

ప్రపూరితం....!

బ్రతిమాలితే... బానిసత్వం

పోయేది కాదని...సాయుధ

పోరాటమే...సరైన సమాధానమని....సివిల్

సర్వీసెస్ ను విడచి...దేశం

కోసం...జాతీయోద్యమంలో

చేరి...మన శత్రువుకు శత్రువు

మనకు మిత్రుడన్న రాజనీతి

ని అనుసరించి...రష్యా,జర్మనీ,జపాన్ వంటి అనేక దేశాలు తిరిగి

ఆఖరికి జపాన్ సాయంతో...

స్వతంత్ర పోరాట పటిమను

ఆజాద్ హింద్ పౌజ్ పేరుతో

నెలకొల్పి...ఆంగ్లేయులతో 

అవిశ్రాన్త పోరుజరిపిన ధీశాలి మన చంద్ర బోస్....!

తన అభిప్రాయాలను మిత వాదులు వ్యతిరేకించిన...

లక్ష్యపెట్టక...వచ్చిన అత్యుత్తమ పద వు లనుసైతం

త్యజించి...అనేక మార్లు జైలుపాలైనా చలించక...దేశం

కోసమే బ్రతికిన...నిజ దేశభక్తుడు...ఆతని జీవితం

భావితరాలకు ఆదర్శం!

జయహో....నేతాజీ సుభాష్ చంద్ర బోస్...జయహో...!!

  ******************

    .....కోరాడ.

6

[23/01, 8:42 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: *** త్యాగ స్ఫూర్తి ***

                       ✍️డా.పాండాల.


దాస్యశృంఖలాలు దండిగా తెగతెంప

హిందు ఫౌజునేత హితము నెంచి!

మడమతిప్పకుండ మరిపోరు జేసినా

దేశభక్తి దీక్ష దీప్తియతడు!


జాతివాదమెంచి దార్శనికుడిగాను

స్వేచ్ఛ కాంక్ష ప్రియుడుస్వీయచరిత!

నడవు డిల్లియంటు నాదంగ జైహిందు 

యువత దక్షతెంచి యుక్తిబెంచె!


ప్రాణ త్యాగస్ఫూర్తి ప్రణవంబుగాచాటి

ప్రగతి దారిచూపె ప్రతిభుడతడు!

దేశ అవధిదాటి దేదీప్య మానంగ

పోరు సల్పినట్టి పొగరు తనది!


వీరపుత్రులకును విలువిచ్చె మనదేశ

హిందుధర్మవన్నె విశ్వహితము!

ఇచ్చ దీర ప్రభుత వీర పరాక్రమ

ఘన సుభాసు జన్మదినము మెరిసె!


✍️డా.పాండాల మహేశ్వర్ 

యాదాద్రి జిరసం.9912180054


హామీపత్రం: 

నా స్వంతరచన.దేనికీ

అనువాదంకాదు,అనుకరణ కాదు.

7

[23/01, 8:46 PM] కట్ల శ్రీనివాస్ Rajanna Siricilla: పేరు : కట్ల శ్రీనివాస్,

గ్రామం : రాచర్ల తిమ్మాపూర్,

రాజన్న సిరిసిల్ల జిల్ల

శీర్షిక : *మరోశివాజి*



భారతమాత నుదిటి సింధూరమై కానవచ్చిన నేత,

తల్లికై జీవితాన్ని ధారపోస్తూ, 

అందరిని తల్లి సేవలో భాగం చేసిన అధినేత.

ఆజాదు హిందు ఫౌజు దళపతైన మన నేతాజి,

అఖండ భరతజాతి కన్న మరోశివాజి.

బానిస సంకెళ్లను తెంచుటకు ఉక్కు దేహలుగా మార్చ తలచి, 

శాంతితో సాగితే విజయం దరిచేరదని తలచి,

పోరాటమే విజయానికి మార్గమని వివరించి,

ప్రతిఒక్కరిని సైనికుడవమని ప్రోత్సహించి.

దేశసేవకే తమ ప్రాణాలను అర్పించాలని భోదించి,

తల్లికి ఎదురువచ్చిన రక్కసులను ఎదిరించి,

ఆంగ్లేయవాధులను ఆమడదూరం తరిమి,

ఎదురొడ్డి నిలచిన యువనేత అతడు.

రక్తాన్ని నాకు ఇవ్వండి స్వతంత్యమిస్తానని

చాటిచెప్పిన జననేత మన నేతాజి.

గగన సీమలకెగసి తను కనుమరుగయిపోయాడు.

అతనే మన నేతాజి

భరతమాతకు పుట్టిన మరో శివాజి..

8

[23/01, 8:56 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*

తేదీ:23-01-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: సుభాష్ చంద్రబోస్

*******************

ఆయనొక చైతన్యం

ఆయన సాహసం యువతకో సందేశం

స్వాతంత్ర్య సమరం కోసం

సివిల్ సర్వీసు ఉద్యోగాన్ని

తృణ ప్రాయంగా వదిలేసిన

దేశ భక్తి హృదయం...


బ్రిటిష్ పాలకుల పాలనను

ఖండిస్తూ

ఆజాద్ హింద్ ఫౌజ్ నేషనల్ ఇండియన్ ఆర్మీ స్థాపించిన ధీరత్వం!

ముల్లును ముల్లుతోనే తీయాలనే ధృడ సంకల్పం! గడగడలాడించిన అపర చాణక్య తత్వం!

బ్రిటిష్ వారి గుండెల్లో గుబులు పుట్టించిన సింహ స్వప్నం!


యువతకు దిశానిర్దేశం చేసిన

నేతాజీ సుభాష్ చంద్రబోస్

భారతీయతకు నిలువెత్తు నిదర్శనం!

 వారి స్ఫూర్తితో ముందుకు సాగాలి మనమందరం!

9

[23/01, 8:58 PM] Anitha Aitha Poetess: *కవితా గానం*


అంశం : సుభాష్ చంద్రబోస్

శీర్షిక: *నేతాజీ*


దెబ్బకు దెబ్బే సమాధానంగా

ఆంగ్లేయులనెదించిన వీరుడతడు!


పరాయి పాలకుల

మోచేతి నీళ్లను తాగలేక

వారి ఆధిపత్యపు పాదాలను

విరచిన ధీరుడతడు!


యువతలో దేశభక్తి ని నింపి

వారిని సైన్యంగా మార్చిన మేధావిఅతడు!


మొక్కవోని గుండెధైర్యంతో

ఆజాద్ హిందు ఫౌజ్ 

రక్షణవలయాన్ని భారతికి అర్పించిన సైనికుడతడు!


సాయుధ పోరాటమే

స్వాతంత్ర సమరానికి ఆలంబనంటూ

ప్రతిగుండెలో పౌరుషాన్ని ప్రజ్వలించిన పరాక్రముడతడు!


యువశక్తిని ప్రేరేపించి

పోరుబాటన నడిపిన

భరతమాత ముద్దు బిడ్డతడు!


భరతజాతి గర్వించతగ్గ

సుభాష్ చంద్రబోస్ అతడు!


రచన

అయిత అనిత

8985348424


హామీపత్రం

ఇది నా స్వీయరచన

10

[23/01, 9:27 PM] 

విజయ లక్ష్మి యాదాద్రి: *నేతాజీ సు"భాస్*

*******  *********

సివిల్ సర్వీస్ ఉద్యోగిగా కన్నా

యువజన  కాంగ్రెస్ కార్యకర్తగా

ఉండుట మిన్న"అని భావించిన దేశభక్తుడు


జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 

రెండుసార్లు ఎన్నికైన సమర్థవంతుడు


గాoధీజీని బాపూజీ*గా పిలుచుకున్న

తొలినాళ్ళ మహాత్ముడి అభిమాని


స్వతంత్ర సముపార్జనకు సాయుధ పోరాటమే 

సరైన విధానమని నమ్మిన వీరుడు


మన శత్రువుకు శత్రువు మన మిత్రుడని 

భావించి జర్మనీ జపాన్ ల సాయం కోరిన రాజనీతిజ్ఞుడు


భారత జాతీయ సైన్యాన్ని ఉరకలెత్తించిన

ఫార్వార్డ్ బ్లాక్ స్థాపకుడు


మరపురాని త్యాగషీలుడు

యువతకు సదా స్ఫూర్తిదాయకుడు నేతాజీ


వల్లాల విజయలక్ష్మి

ఆ లేరు

11


[23/01, 9:30 PM] 

మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..సుభాస్ చంద్రబోస్

శీర్షిక..స్ఫూర్తి దాత



సాయుధ పోరాటమే న్యాయమని తలచి

స్వాతంత్ర్య సమర శంఖం పూరించిన బెంగాల్ యువతేజం

బ్రిటిష్ వారికి సింహస్వప్నమై

జైలు శిక్షలకు వెరువకనే

ఉద్యమ కడలిలో ఎదురీదిన  సాహస కెరటం

ఇండియన్ ఆర్మీని సృష్టించి ప్రతి భారతీయుడి మదిలో ఉత్తేజాన్ని నింపిన స్ఫూర్తి ధాత

పరపీడన విముక్తికోసం మతాల కతీతంగా ఐక్యతనే హితమని చాటిన నిజమైన జాతీయవాది

అనారోగ్యం లెక్కచేయక ఆంగ్లేయులపై పోరాడిన ధీశాలి

సివిల్స్ లో ర్యా0క్ సాధించినా వదులుకొని

ఉద్యమమే ఊపిరిగా జీవించిన నిజమైన ఉద్యమ నేత 

జయంతులే తప్ప వర్దంతులు లేని మహానుభావుడు

భారతమ్మ ముద్దు బిడ్డడు

ప్రతి మనిషి సైనికుడై ప్రాణత్యాగం చేయాలని

ఆజాద్ హింద్ ఫౌజ్ అంటూ సైనికులై కదలాలంటూ కర్తవ్యాన్ని బోధించిన సుభాస్ చంద్రబోస్

త్యాగానికి నిలువెత్తు నిదర్శనం

మరపురాని మహావీరుడు

12

[23/01, 9:50 PM] Lalita Sister:

 అంశం: స్ఫూర్తి దాత             జగదీష్ చంద్రబోస్                             ప్రమోద మునిమడుగు                 పాఠశాల స్థాయిలోనే ఎదురైన వివక్షతను తిప్పికొట్టిన బుడతడితడు.....

చదువులో చాకు.. ఏక సంతాగ్రహి ఈతడు...

 కలెక్టర్ పదవి కాలదన్ని జాతి స్వే ఈచ్ఛకై పోరాడిన యోధుడితడు...

ఆజాద్ హింద్ ఫౌజ్ తో..స్వతంత్ర సైన్యాన్ని ఆవిష్కరించి..

తెల్లదొరల ను ముప్పుతిప్పలు పెట్టిన యువ తేజం ఇతడు...

రాజీలేని పోరాటం తో

ఉక్కుపిడికిలి బిగించి...నిప్పులు చెలరేగే  హృదయంతో...జాతిరత్నం ...కుటుంబ నవ రత్నం ఈతడు

చిత్తరంజన్ దాస్ ప్రియ శిష్యుడు

భారత మాత సేవలో పునీతుడి తడు....

వ్యక్తిగత జీవితం కంటే.....

 స్వతంత్ర భారతావనే స్వర్గమని...ప్రతి భారతీయుడు....ఒక సైనికుడై

తల్లి సేవకై రక్త తర్పణం చేయాలని ఆశించిన అరుదైన దేశభ క్తుడితడు

...జయహో...జయహో... నేతాజీ

నీ గుండె ధైర్యమే మాకాదర్శం

చంద్ర బోసుడే...మా.. బాస్....

13

[23/01, 9:57 PM] Lalita Sister:

 సైన్యాధిపతి

**********

భారత జాతీయ

ఉద్యమ రథసారథి

స్వాతంత్ర్యోద్యమంలో

ముందు తరాల వారధి సైన్యాధిపతి

శ్రీ శ్రీ సుభాష్ చంద్రబోస్


అహింసా వాదమే

అరాధ్య మైనది కాదని

పోరు బాట తథ్యమని భావించిన

విశ్వసనీయ ప్రధాత భరత విద్యావేత్త

శ్రీ శ్రీ సుభాష్ చంద్రబోస్


ఆంగ్లేయులు తుర్రుమని

వెనుకకు తిరిగి వెళ్లుటకు 

ఆచరణలో యుద్ధ నౌక వీరుడు

ఆజాద్ హింద్ ఫౌజ్ విధాత స్థాపిత నేత

శ్రీ శ్రీ సుభాష్ చంద్రబోస్


మీ రక్తాన్ని ధార పోయండి

మీకు స్వాతంత్ర్యాన్ని నిస్తానన్న నేత

కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు

ఉద్యమానికి ముద్రలు పరిచిన సూర్యుడితడు

శ్రీ శ్రీ సుభాష్ చంద్రబోస్


మనకు, మన ముందు తరాలకు ప్రధాత

జననం తెలిసిన మరణం తెలియని నేత

ఉద్యమ స్ఫూర్తిగా నిలిచిన  మనందరి బ్రాత

శ్రీ శ్రీ సుభాష్ చంద్రబోస్ జై హింద్... జై హింద్.....


బండి సూర్యారావు,9490681815

****************************************

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...