Skip to main content

గెలుపు మంత్రం Jan 2021

 నిర్వహణ శివునూరి లలితాకృష్ణ

******************************

1.సుధారాణి కృష్ణంరాజు గారు

2. అయితఅనిత గారు

3. కోరాడ నరసింహారావు గారు

4. డాక్టర్. బల్లూరి ఉమాదేవి

5. అపరాజిత్ సర్

6. ఉరిమళ్ళ సునంద గారు

7. విజయభారతి గారు

8. పరాంకుశం రఘునారాయణ గారు

9. Ch. ఆంజనేయులు గారు

10. మన్నె లలిత గారు

11. సంధ్యా శర్మ గారు

*12.వెంకట కృష్ణ ప్రగడగారు*

13.వల్లాల విజయలక్ష్మి గారు

14. మర్రి జయశ్రీ గారు

*15. దండమూడి శ్రీచరణ్ గారు*

స్పందించిన కవి మిత్రులందరికీ ధన్యవాదాలు

🙏🙏🙏🙏🙏🙏

1 కవితాగానం

నేటి అంశం

*గెలుపుమంత్రం*

ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు

అంశానికి కవితలతో స్పందించగలరు.


ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.

1

✳️✳️✳️✳️✳️✳️

[21/01, 8:01 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏

🙏 సుధారాణి కృష్ణంరాజు🙏

*నేటి అంశం*గెలుపు మంత్రం*

21-01-2021(గురువారం)

మనం చేసే పని ఏదైనా

దీక్షా దక్షత తోడైనప్పుడు

చేయాలని పట్టుదల ఉంటే

దానికి తగిన కార్యాచరణ రూపొందించుకుని అడుగు

వేస్తే గెలుపు ఖాయం

మంత్రాల కు చింతకాయలు ఎలా రాలవో కష్ట పడకుండా

గెలుపు పొందాలని అనుకోవడం అత్యాశే అవుతుంది

ఆత్మస్థైర్యం తో వేసే ప్రతి అడుగు విజయానికి సోపానం

అవుతుంది

నిరాశ నిస్సత్తువతో అనుమానం తో చేసే ప్రతి పని

అపజాయానికి సంకేతం

జుగుప్స ఈర్ష్యా అసూయ ద్వేషాలు కలిగితే ఎదుటి వారి

చెడును. కోరి గెలుపు పొందాలని అనుకోవడం అవివేకం

వేసే ప్రతి అడుగు నలుగురికి మార్గదర్శకం కావాలి కాని

ఆలోచనలు అదుపు తప్పితే

మనపై మనకు నమ్మకం లేకుండా పోతే గెలుపు అసాధ్యం

గెలుపు ను. పొందాలంటే కార్యదీక్ష చేసే పనియందు

గౌరవం ఉంటే విజయాలు

మన దగ్గర కు వెతుక్కుంటూ

వస్తాయో ఇదే గెలుపు పొందుటకు అసలు సిసలైన

గెలుపు మంత్రం🙏🙏👍

2

[21/01, 8:01 PM] Anitha Aitha Poetess: *కవితా గానం*

శీర్షిక: *గెలుపు పిలుపు*

మలుపు మలుపులో 

ఎన్ని తలపులో..?

ఒక్కో మలుపులో

తలుపు తట్టి పిలిచే ఎన్ని గెలుపులో!

నిస్సారమైన జీవనదారిలో

సారమైన అనుభూతే మూలమలుపు !

అనుభవమేదైనా మలుపు ఒక గుణపాఠమే!!

నూతనోత్తేజాన్నిచ్చే సురపానమే!!

బతుకదారిలో గతుకులను పూడ్చేసి

ఆలోచనా సరళిలో గులకరాళ్లను ఏరేసి

నవలోకానికి నాందిపలుకేది మూలమలుపే!

చేదు సంఘటనలను తీపిగా మారుస్తూ

ఒరుసుకున్న గాయాలను గేయాలుగా ఆలపిస్తూ

నిరాశలో చిగురాశను సృష్టిస్తూ

నూతన ఆశయాల తొవ్వను చూపే

మార్గదర్శి మలుపే!


మార్పును ఆహ్వానిస్తే

మనోవ్యథలు మాయమై

కొత్తగాలి జోలల్లో

మది ఓలలాడుట ఖాయమే!!


రచన

అయిత అనిత

జగిత్యాల

3

[21/01, 8:06 PM] Korada: కవితాగానం :- గెలుపుమంత్రం

 కోరాడ నరసింహా రావు....!

       * ఆత్మ స్థయిర్యమే * 

          **************

అది...యుద్ధమైనా...ఆటైనా...

జీవిత మైనా....,

గెలుపు-ఓటమిల రెంటినీ...

చవి చూపిస్తాయి....!

ఆ ఇద్దరిలో....కేవలం ఒకరే

కదా గెలిచేది....!

 ఓడిపోయిన వారు ఎందుకలా

కుమిలి పోవటం....!!

నీ ఓటమి.... నీ లోని పట్టుదల

ను రెట్టింపు చెయ్యాలి...! 

 గెలుపు నీ దృఢ సంకల్పం ఐతే

నీ లక్ష్యము-ధ్యేయమూ అదే ఐ

గట్టిగా...ప్రయత్నిస్తావు....!!

అనుకున్నది సాధించే వరకూ

ఎన్నిమారులైనా...పట్టు విడవకు...!ఇలాంటివి...చరిత్రలో ఎన్ని 

ఉదా హరణ లు లేవు...!?

నిరుత్సాహపడకు....,ప్రయత్నాన్ని విరమించకు....!

  విజయం. నిన్ను వరించి....

  తీరుతుంది.!విజయీభవ...!దిగ్విజయీభవ!!

 ************************

     ....... కోరాడ.

4

[21/01, 8:28 PM] Balloori Umadevi Poetess: 21/1/21

కవితా గానం

పేరు:డా.బల్లూరి ఉమాదేవి

అంశం:గెలుపు

గెలుపంటే విజయం

గెలుపంటే కాదు ఆషామాషీ

భూమిమీద పడ్డ ప్రతి క్షణంనుండి

గెలుపుకై ఆరాటం,పోరాటం ఆరంభం

బిడ్డ పాలకొరకు ఆరాటపడుతుంది

త్రాగాక గెలిచినట్టు సంబరపడుతుంది

శ్రమించకుండా గెలుపు దరికి రాదు

సాధించాలన్న తపన వుండాలి

కార్యసాధనకై దేయింబవళ్ళూ

కష్ఢపడాలి ఆకష్టానికి తగిన ప్రతిఫలం

లభిస్తుంది  అదే అదే "గెలుపు"

కాలభ్రమణంలో ప్రతివ్యక్తికి

కష్టసుఖాలు,గెలుపోటములు

ఆటుపోట్లు ఎదు రించక తప్పదు

ఈనాటి ఓటమి రేపటి గెలుపుకు

సోపానం కావాలి

ఓటమిలో క్రుంగి పోక నిరాశతో వడలి పోక

పట్టుదలతో కృషిచేస్తే

గెలుపు తథ్యమిది నిజం

ఆయువున్నంతవరకు

ఆఖరిక్షణం వరకు

ఆరాటంతో పోరాడాలి

గెలుపునుసాధించాలి

సహనం విశ్వాసం

చెంత నుండ చింత వలదు

జంకు కొంకు లేక సాగు ముందు

గెలుపు వచ్చి వాలును నీముందు.

5

[21/01, 8:31 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: చేసేయ్ కవితా గానం

గెలుపు మంత్రం దీక్షా గెలుపు మంత్రం నిక్షిప్తమై ఉంది నీ అక్షరాల గుండెల్లో

[21/01, 8:32 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఆహారం ఆహార్యాన్ని అక్షరాల్లో పలికించే పరిమళభరితమైన మనసును కలిగించే దీక్షా బద్ధమైన ఏ అక్షరమైన కవిత ధ్యానమై దీక్ష మై మై

[21/01, 8:34 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: భావాల ప్రపంచంలో మనిషి కొత్త ప్రపంచంలోకి సాగిపోతున్నాడు


ప్రపంచమంతా విజ్ఞాన విహార యాత్రలో సాగిపోతుంది

కొత్త భావనలలో కొత్త తపస్సులో విశాల విశ్వంలో అందరూ కొత్త వెలుగులను ఆవిష్కరిస్తారు కొత్త కాంతులను ప్రకటిస్తారు

నిలిచిపోయే మనిషిగా మానవీయ ప్రపంచాన్ని తెలపడమే రాగం ఉంది


వెలుగు వెలుగు వెన్నెల్లో ఆనంద విహారం

6

[21/01, 8:46 PM] Aparajith: జీవితం!

నా యవ్వన వడిలో 

తల్లితండ్రి మాట పెడచెవిన పెట్టి 

జీవితానికి మచ్చ తెచ్చే పోకడలు పోయి 

జీవితం నరకతుల్యం చేసుకున్నా!

చేతులు కాల్చుకున్నాక చేసేదేముంది!

అందంగా ప్రారంభమైన జీవితం

నరకతుళ్య శాపగ్రస్తమయింది!

ఉన్నత శిఖరాలెక్కాల్సిన జీవితం

చేజారి దుఖసాగరమయ్యింది!

అప్పటి వరకున్న స్నేహితులందరు 

అభ్యున్నతంగా ఎదిగారు!

నా మనస్సుకు అంటిన మసి 

అంత తొందరగా వదలదు గదా!

తేరుకుని చూస్తే యవ్వనం గతించి 

అంధకారంలో కీచురాయి నయ్యాను!

అందుకే నేనంటాను!

అదనులో శ్రమ చేయనిది వృదా 

యవ్వనంలోనే భవిష్యత్ మెట్లు నిర్మించుకోవాలి 

జవసత్వాలు ఉన్నపుడే సాధనకు సాధ్యం 

అవకాశాలన్నీ చేజారాక చూస్తే 

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం!

అహరహం శ్రమించి ఉన్నత లక్ష్యాలు సాధించాలి 

వెనక్కి లాగేవాళ్లను తోసుకుని ముందుకెళ్ళాలి!

యవ్వనంలో జీవితం వడ్డించిన విస్తరిలా పొరబడడం సహజం 

సునిశిత కుశాగ్రబుద్దితో ఆలోచించి అడుగేయ్ 

విజయ తీరాలు చేరడం ఖాయం!

ఆపరాజిత్

7

[21/01, 8:49 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*

తేదీ:21-01-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: గెలుపు మంత్రం.....

********************

చెదిరిన కల చుట్టూ ఆవరించిన దుఃఖ మేఘాలు

ఓటమి కన్నీళ్ళతో  మనసును తడుపుతుంటే

రెక్కలు విరిగిన సంతోషాలు

వేదనతో కుమిలి పోతుంటాయి!


కృషి కొలిమిలో దేహాన్ని కరగ దీసుకుని

సంకల్ప నమ్మెటపై లక్ష్యం అనేకానేక రూపాల్లో మారుతుంటే

శ్రమైక జీవన సౌందర్యం 

గెలుపు సంతకం చేస్తుంది..


పంచాక్షరిలా

పెదవులు ఉచ్చరించే గెలుపు మంత్రం

పంచేంద్రియాలకు ఇచ్చే నవనవోన్మేష చైతన్యం ...


బతుకు యవనికపై 

కీర్తి బావుటా ఎగురవేసే స్ఫూర్తి మంత్రం అవుతుంది..


చేదు అనుభవాల గరళాన్ని  సంయమనంతో భరిస్తూ వేసుకున్న సోపానాలు

విజయాల శిఖరాగ్రాన నిలిపి..


నలుగురికి ఆదర్శంగా

వెలుగుల వ్యక్తిత్వమై ప్రకాశిస్తుంది.

.8

[21/01, 8:56 PM] కొలచన విజయ భారతి Poetess: కవితా గానం

పేరు:కొలచన విజయ భారతి

ఊరు:హైదరాబాద్

అంశం: గెలుపు మంత్రం

శీర్షిక:ప్రయత్నమే దాని తంత్రం

తేదీ:21-1-21

*********************

అనుకున్నది కాలేదని

అనుకోని ఆపద ఎదురైందని

నిరాశా నిస్పృహలతో కృంగిపోయి అలుముకున్న 

చీకట్లను తిడుతూ కూర్చోకు

ఆత్మ స్థైర్యమనే చిరుదీపాన్ని

వెలిగించు


చేపట్టిన ప్రతి పనిలోను

ఓటములే ఎదురౌతున్నాయని

నిరాశ పడుతూ దిగులు చెందకు

ఆత్మ విశ్వాసమనే గెలుపు మంత్రాన్ని పఠించు

నిన్నటి ఓటమి  రేపటి గెలుపుకు బాటవుతుంది

ఏదీ తనంత తాను

మన దరికి రాదు

పట్టుదలతో శోధించి సాధించాలి

అపుడే గెలుపు మంత్రం నీ వశమౌతుంది

       🌹🌹🌹🌹🌹

9

[21/01, 9:09 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితాగానం*


 *అంశం: గెలుపు మంత్రం* 


కష్టపడటమే విజయం!

     శ్రమ పడటమే ఫలం !!


నిరంతర ప్రయత్నమే జయం!

     శ్రమ జీవనమే సౌందర్యం!!


 తొలిమెట్టు అపజయం! 

   మలిమెట్టు విజయo!!


  నాణ్యతా ప్రమాణాలే ప్రయోజనాలు!

    లక్ష్య సాధనమే విజయసోపానాలు!!


 ఫలితం ముందు ఆశించకు!

     శ్రమకు ఫలితం విజయమని మరువకు!!


ఆలోచన పదునుతోనే విజయం తథ్యం!

    శ్రమైక జీవనమే గెలుపు మంత్రం!! 


పరాంకుశం రఘు నారాయణ

 మహబూబాబాద్

10


[21/01, 9:17 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: గెలుపు ఎప్పుడు మంత్రం అది ఫలితం ఆశించడం మానవ లక్ష్యం శ్రమించడం మన కర్తవ్యం మన ఆలోచనలు ఎప్పుడు విజయపథం వైపు సాగించడం మన ధర్మం అందుకు కృషి మన ప్రధాన ఆయుధం


మనిషి గెలుపు మంత్రాన్ని పఠించాలి అంటే నీవు నిరంతరం దీక్షతో

తపస్సుతో తీవ్ర కృషి చేయాల్సిన అవసరం ఉంది


మనిషి నిరంతర అ ఆశయ ఆదర్శ సాధనలో

జీవన గమ్యం చేరుకోవడమే ధర్మం అందుకు సదా

నవ్య దీక్షకు ఫోను కో


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453

11

[21/01, 9:23 PM] +91 74168 63289: కవితా గానం 

 తేదీ :21/1/21 - గురువారం

మన్నె పిన్నక లలిత

 అంశం :గెలుపు మంత్రం

   శీర్షిక :గెలుపు గుర్రం

***********************

  సమరంలో ఓటమిపాలై నప్పుడు

 తంతెనాభము( సాలెపురుగు)ను మదినినిలుపుకో

 శ్రమ పడకుండా   వచ్చే మంత్ర తంత్రము లకు

 దాసోహమని ధనవ్యయం చేయకు

 "మంత్రాలకు చింతకాయలు రాలవు "అని తెలుసుకో!

 ఓటమి లోనే గెలుపు

 గెలుపు తంతులు ఎక్కాలంటే 

 తంత్రము తెలిసిన వాడవై

 ఆత్మస్థైర్యంతో  అడుగు ముందుకు వేసి

   ఆధిపత్యాన్ని చేజిక్కించుకో!

 అమావాస్య వెంబటి పౌర్ణమిలా

 నీ కష్టం వెనుక సుఖం

 "శ్రమయేవ జయతే"

 గెలుపు మంత్రం నీ వశమై

 నిన్ను పసిడి తంతెలు ఎక్కించి

 గెలుపు గుర్రమై పరుగులు తీస్తోంది.

12

[21/01, 9:23 PM] Sandya Sharma Poetess: కవితాగానం


అంశం:గెలుపు మంత్రం


శీర్షిక:నిరీక్షణ


౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪


నిశీధిలో నిప్పు రవ్వలు చిమ్మి

నిర్లిప్తత నిద్దురలోకి పొగమంచు

తెమ్మెర తీసి...

అడుగడుగునా అవహేళనా

ముల్లులు పచ్చిగా  గుచ్చుకుంటూనే

వున్నా......

పగుళ్ళు వారిన  గుండెను చీల్చుకుని


మట్టి బతుకుల్లో

ఆధారం లేని అంకురాన్ని 

మొలకెత్తించటానికి

రాటుదేలిన గునపానికి

రక్తమోడుతున్నా

రవ్వంతైనా కోల్పోని

ఆత్మవిశ్వాసాన్ని  అరువిచ్చి

ఎదురు దెబ్బల

రుచి చూడాల్సిన సమయాన్ని

అరచేతిలో....ఒంపుకుని...

లేలేత చిగుర్లు తొడిగించే

ఆశలకు ప్రాణం పోస్తుంటాను......

నిరాడంబర పచ్చికబయళ్ళను వెంటేసుకుని

వెన్నెల వెలుగుల్లో ఒంటరి పక్షినై

విను వీధిలో నిశ్చలతకు పహారా కాస్తూ

గెలుపు మంత్రాన్ని ఉపదేశించే

గురుభోధకై నిత్యం అన్వేషిస్తూ

ముగింపు పేజీలో చివరి వాక్యమై

జ్ఞాన గరిమనవ్వాలని... నిరీక్షిస్తున్నాను... 


౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪

వై.కె.సంధ్యశర్మ

చిత్తూరు

13

[21/01, 9:26 PM] వేంకట కృష్ణ ప్రగడ,విశాఖపట్నం 

కలం  : "కృష్ణ" కలం: కవితా గానం

వేంకట కృష్ణ ప్రగడ

విశాఖపట్నం 

21.01.2021

అంశం : గెలుపు మంత్రం


శీర్షిక : " గెలుపు అది తెలుపు "


గెలుపు కోసం చేసే

అర్ధం లేని కొలువులు

వాటి వెంట 

అడ్డంగా పరుగులు 


అవకాశాలు విడిచి

కష్ట సాధన మరచి 

అడ్డదారుల మురిసి


అలా గెలిచే

ఆ ముఖాల గెలుపు

నిజానికి అదో ముసుగు 


గెలుపు ఱంకెల

గర్వం తలపుకి

గుండె తప్పు అని చెప్పినా 


మూగ పలుకే అది

గెలుపు పంతం వంతు

ఆ గొంతుకను నొక్కడంతో 


గుండె ఓటమే తెలుపు

ఆ నిజాయితీ తెలుపు 

అది అంకెలు తెలుపని

ఆ నిజం తెలుపు 


గెలుపు పిలుపు

అదో మలుపు

రహదారి తెలుపు

అసలు గెలుపు తెలుపు 



         ... ✍ "కృష్ణ"  కలం

14

[21/01, 9:29 PM] విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక:;***గెలుపు మంత్రం****

------------******----------

జీవితాన్ని నిత్య పోరాటమని భావించి 

నిరంతరం శ్రమిస్తే ఘన విజయమే


జీవితాన కోరిన గెలుపు శిఖరాధిరోహణకు               

త్రికరణశుద్ధిగా ప్రయత్నిoచిన వారు యువకిశోరమే


జీవితాన్ని పద్మవ్యూహంలా యెంచి 

అలుపేరుగక పోరాడితే అర్జునులమే


సమోన్నత ఆశయాన్ని పెట్టుకొని 

పరిక్రమిస్తే ఛత్రపతి వారసులమే


లక్ష్యాన్ని నిర్దేశించుకొని మనోరథాన్ని 

సక్రమంగా నడిపిస్తే మహారథులమే


ఆరని వెలుగులకై సదా చిన్ని

ఆశాజ్యోతులు వెలిగిస్తే ఆదిత్యులమే


సాధనలోని సంతోషసౌరభం 

ఏ సుమంలోనయినా మృగ్యం

*గెలుపు* లోని మ(హ)త్తు

 ఏ వ్యసనంనందయినా శూన్యం


గెలుపు మంత్రం ఇచ్చు బలం

నడుపును జీవన యంత్రాన్ని

జయానికై చేద్దాం నిజాయితీ యత్నాలు

గెలుపుగుర్రాలపై చేద్దాం విజయయాత్రలు


:;*వల్లాల *విజయలక్ష్మి**

*ఆలేరు*

15

[21/01, 9:31 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..గెలుపు మంత్రం

శీర్షిక...శ్రమయే ఆయుధం



పుట్టినది మొదలు గిట్టేవరకు

చేసే జీవితపోరాటంలో

ఎదురయ్యే ఒడిదుడుకులెన్నో

చుట్టుముట్టే సుడి గుండాలెన్నో

అన్నింటిని అధిగమిస్తూ

లక్ష్యంతో ముందుకు సాగుతూ

గమ్యం చేరే వేళ

వరించును గెలుపులెన్నో

భరించే ఓటములెన్నో

ప్రతి గెలుపు జీవితాన మలుపు

ఎదురయ్యే ఓటమి బోధించు అనుభవ పాఠాలు ఎన్నో

గెలుపు ఓటములు సమంగా స్వీకరిస్తూ

శ్రమ అనే ఆయుధంతో చేదిస్తూ

గెలుపు మంత్రంతో సాగడమే 

నిశీధిలో వేదనలో కూరుకుపోకుండా

ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేస్తూ

లక్ష్య సాధనలో విజయశిఖరాలు అందుకోవడము తథ్యం

అదే జీవితానికి అర్థం,పరమార్థం

16


[21/01, 9:31 PM] Dandamudi శ్రీచరణ్: శీర్షిక:గెలుపు మంత్రం

  *పల్లవి:*

నవ్వేస్తే పోలా బాలా

పువ్వులు పూసేలా

కన్నీళ్లే రావాలా ఏల

తుడిచెయ్ నాలాగా

*అనుపల్లవి:*

లైఫ్ అంటే షార్ట్ ఫిల్మ్ గనక

ఎంజాయ్ చెయ్యాల

నీ షాడో నీతో రాదు

ఎండ్ కార్డ్ పడినాక

*చరణం 1:*

డ్రీమ్సంటూ ఏవో కొన్ని

నీలో ఉండాల

ఏముంది భై రివర్స్ ఐనా

దూసుకుపోవాల

సక్సెస్ కు దారెపుడూ

సూటిగ ఉండదుగా

రిస్కైనా నీ రూటేదో

నువ్వే వెతకాల

నీ ట్యూనుకి దునియా మొత్తం

స్టెప్పులు వెయ్యాల

కాకున్నా అది ఏం నష్టం

సర్దుకుపోవాల

చేసేసేయ్ ఓ ఫీటు

మార్చేసేయ్ నీ ఫేటు

ఆకాశమే నీ ఆశలకు

టార్గెట్ కావాల

ఈ లోకమే నీతో కలసి

డ్యూయెట్ పాడాల

//పల్లవి//

--దండమూడి శ్రీచరణ్

9866188266

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...