నిర్వహణ: శివునూరి లలితాకృష్ణ
************************
1.
2.కొలచన విజయ భారతి గారు
3.కోరాడ నరసింహారావు గారు
4.కొలచన విజయ భారతి గారు
5.డా.సి.హెచ్ ఆంజనేయులు గారు
6.దీపక్ ప్రాతి గారు
7.ధనాశి ఉషారాణి గారు
శీర్షిక: మమతల లోగిలిలో..
*********************
మమతల లోగిలిలో విరిసిన మల్లె కొమ్మ
మానవతా పరిమళాలు వెదజల్లిన పూల రెమ్మ!
పతినేర్పిన చదువుకు
పరోపకార విలువలను అద్దుకున్న పంతులమ్మ!
అక్షరమే విజ్ఞానాభివృద్ధికి దీపమని తెలుసుకున్న సరస్వతమ్మ!
ఆధిపత్య అవరోధాలను ఆత్మస్థైర్యంతో అధిగమించి
అణగారిన వర్గాల బాలికలకు
అక్షరామృతం పంచిన చదువులమ్మ!
భర్త అడుగుజాడల్లో నడిచి
కులమతాలకు అతీతంగా
సమాజ శ్రేయస్సుకై పరితపిస్తూ
మూఢనమ్మకాలను నిరసించి
సతీసహగమనాన్ని వ్యతిరేకించి
వితంతు పునర్వివాహాలను జరిపించిన
సంఘ సంస్కర్త నీవమ్మా!
ఆనాటి నీ సాహస ప్రయాణం
అంటువ్యాధని తెలిసీ
ప్లేగు వ్యాధి బిడ్డను అక్కున చేర్చుకున్న మహోన్నత వ్యక్తిత్వం
మహిళా సాధికారత కోసం నీవు చేసిన ప్రయత్నం..
నాడు నేడు ఏనాడూ
ప్రపంచమే గర్వించదగ్గ మూర్తిమత్వం నీదమ్మా!
ఉపాధ్యాయ మహిళా లోకం
ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన వెన్నెలమ్మా!
జ్యోతి బా ఫూలే సహధర్మచారిణివైన
సావిత్రి భాయి ఫూలే !
నీవే మాకు స్ఫూర్తి ప్రదాతవమ్మా!
2
[07/01, 2:14 PM] Lalita Sister: శీర్షిక:
*అజరామరం*
రచన: గుమ్మన్నగారి బాలసరస్వతి, సిద్దిపేట
******************
*ఆమె...*.
నిత్యజాగృతీత్వానికి ప్రతీకమౌ సూర్య కిరణ ప్రవాహ సమమైన
చైతన్య మూర్తి...
తన మస్తిష్కంలో మెరిసిన
ప్రతి ఆలోచనా.. ఓ కాంతి పుంజమై...
శతాబ్దాల నాడే..
మూఢనమ్మకాల గాఢాంధకారయవనికలను
సమూలంగా నిర్మూలిoచేదిశగా
వెలుగుజిమ్మింది...
అందుకేనేమో..
ఛాందసవాదులు కప్పే అడ్డుతెరలు..
సూర్యుని కమ్మే మబ్బు పొరల్లా..
పారిపోయాయి..
*ఆమె..*.
నిస్స్వార్థపు టాలోచనలను
నిరంతరo తరంగించే
కరుణారస సింధువు...
అన్యాయంగా బలయిపోతున్న
బాలికా వితంతువులకు
ఆలంబనమై, ఆదరణ తో
బతుకుకు ఆధారాన్నీ చూపిoది...
ఆ *సింధువు* ముందు
మూఢత్వం పరాకాష్ట ను చేరిన
కర్కశహృదయుల కుచేష్టలు
నీటి మడుగులై
కనుమరుగై పోయాయి..
అన్నిటికీ మించి.. *ఆమె..*.
"సవిత్రి"ని పేరులో ఇముడ్చుకున్న
మూర్తీభవించిన
*అమ్మదనానికి* నిలువెత్తు ప్రతిరూపం...
సహ్యాసహ్యాలతో ప్రమేయం లేకుండా
తనపరభేదం చూపకుండా..
దగ్గరివారేదూరంగా పారిపోయే
జబ్బున్న వారిని..
అక్కునచేర్చుకున్న
*అమృతమయి.*..
అకుంఠిత దీక్షతో సాగిన
ఆమె సేవా విధానం..
అనితర సాధ్యం..
అమ్మదనానికి విలువ ఉన్నన్నాళ్లూ
ఆకాశంలో సూర్యకిరణ ప్రకాశం ఉన్నన్నాళ్ళూ..
ఆమె స్ఫూర్తి.. ఆదర్శవంతం!!
ఆమె కీర్తి.. *అజరామరం..
3
కవితాగానంంశం:-సావిత్రీబాయ్ పూలే
కోరాడ నరసింహా రావు...!
* జయము...జయము....
జయము తల్లీ...!*
*****************
దళిత మహిళగ అవతరించిన
దేవతవు నీవమ్మ తల్లీ....!
లెక్కలేని ఆంక్షల సంకెళ్లతో....
మహిళల ననగద్రొక్కే దురా
చారం రాజ్యమేలే రోజులు...!!
మహిళాభ్యుదయముకొఱకు
నీవు భువికి దిగిన సాక్షాత్ సరస్వతీస్వ రూపానివే తల్లీ...!
ఎవ్వరేమన్నా...నిన్నెన్ని రీతుల
అవమా నించినా....,పట్టుసడ
లని లక్ష్య సాధన....!!
వెంట ఎవరూ రాని వంటరివే
నీవైపోయినా....,భర్త సహకార
మునె నీవు మేరు నగ ధీశాలి వై
సాధించి నిలిచి... మహిళా లో కానికే మార్గదర్శివి...
ఐనావుతల్లీ!!
వివక్షతో...నిరాదరణకు....
కుమిలిపోయే మహిళల
లెన్దరో...
నీ ఆదరణకు నోచుకొన...ఆ మోడువారిన మోముల చిరు
నవ్వు పువ్వులె పూచె తల్లీ !
నేడన్ని రంగాలలోను స్త్రీలు
మగవారి కేమాత్రమూ...
తీసిపోరని... నిరూ పించగలిగే
పటిమ నీదు కృపయే ...
నిజమమ్మా...!!
గెలిచి...గెలిపించే ఘనత...
నీదే... నిజము... నిజమిది ముమ్మాటికినీ....!
ఏమిచేసీ...మహిళ లెల్లరు...
నీదు ఋణమును దీర్చుకొన గలరు...!?
జయము నీకు...సావిత్రిభాయి
పూలే.,జయము...జయమమ్మ
*************************
..........కోరాడ.
4
సావిత్రీబాయి పూలే
********************
నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా
శ్రీ జ్యోతి రావ్ పూలే సహచర సహధర్మచారిణి గా పేరొందిన మహోన్నత గురువు
శ్రీమతి సావిత్రి బాయి పూలే
ఆధునిక విద్య ద్వారానే
స్త్రీ దాస్య విముక్తికి సాధ్యపడుతుందని స్త్రీల పాఠశాల ప్రారంభించి
స్త్రీల విద్యాభివృద్ధికి పాటుబడిన
మహా మనీషి
తాను నిరాక్షరాసురాలైనా
భర్త సహకారంతో
అక్షర జ్ఞానం నేర్చుకున్న
ధీర వనిత
ఉన్నత వర్గాల వల్ల వేధింపులకు గురియైనా
ధైర్యంగా సవాళ్ళను ఎదుర్కొన్న ధీశాలి ఆమె
సూద్రుల ,అస్ప్రుస్యు మహిళల హక్కుల కోసం
ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడిన మహోన్నత వ్యక్తి ఆమె
ఆధునిక భారతదేశంలో
మొట్టమొదటి మహిళా
ఉపాధ్యాయురాలు
సావిత్రి బాయి పూలే
ఆమె సేవలు అనంతం
ఆమె సుగుణాలు
సదా చిరస్మరణీయం
🌹🌹🌹🌹🌹
కొలచన విజయ భారతి
హైదరాబాద్
5
జ్యోతిబాపూలే సహచరి
బ్రాహ్మణీయ భావజాలం ఎదుర్కొన్న మహనీయులు నిమ్నవర్గాల అజ్ఞాన నివారణ కోసం పాటుపడిన మహాయోధులు
వారి కోసం ప్రత్యేక మంచి నీళ్ల బావి నిర్మించిన దాతలు వాళ్ళు
అట్టడుగు వర్గాలకు తొలి మహిళా గురువు సావిత్రిబాయి పూలే
చాందసవాదులు ప్రదర్శించిన దాడులను ఎదిరించి పోరాడాలి
అని చెప్పి స్త్రీ విద్యకు
అట్టడుగు కులాల పిల్లలకు భోజన కేంద్ర ఏర్పాటు చేసిన అన్నదాతలు
చరిత్ర పదములో
సత్యశోధక సమాజం నిర్మాతలు
భర్తకు ఎన్నో ప్రేమ లేఖలు రాసి అతని ఘనతను చాటిన మహనీయులు నిమ్నవర్గాల అజ్ఞాన నివారణ వేదిక వారు స్త్రీలకు మహార్ లకు
అజ్ఞాన విముక్తి గావించిన ఈ శతాబ్దపు గొప్ప గురువులు
కరువు బారిన పడిన
పేదల పాలిట పెన్నిధి
శాస్త్ర విజ్ఞానం
ఆ రోజుల్లోనే ఒంటబట్టించుకున్న
మహా జ్ఞాన దాతలు భరతభూమి వారికి గుర్తింపు నిచ్చి తపాల బిళ్ళను వేసింది ఉత్తమ ఉపాధ్యాయుని
నాయక రాలు సావిత్రిబాయి పూలే
సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453
6
[07/01, 2:17 PM] Lalita Sister: పేరు : డా.దీపక్ న్యాతి
అంశం : సావిత్రి భాయి
శీర్షిక : ప్రేరణా మూర్తి
దాదాపు రెండు శతాబ్దాలకు పూర్వమే
భరతావనిన పరిమలించిన పుష్పం
సావిత్రిబాయి జ్యోతిరావు పూలే
ఆచార్య జ్యోతిరావు పూలేను
వివాహమాడింది ఆచార్యం రీత్యా
అది ఆమె కందిన అదృష్టం కాదు
సందర్భాన్ని మలచుకునే నైపుణ్యం
బడుగు బలహీన వర్గాల జీవ జ్యోతులను
ప్రకాశవంతమైన సుఖశాంతులతో వెలిగించాలని
సంఘ సంస్కర్త పూలేజీ ఆశయాలకు
సహకారాన్ని అందించింది సహధర్మచారిణిగా
సావిత్రిబాయి ప్రతిభాపాటవాలను గుర్తించి
ఆమెను చదివించాలన్న సంకల్పానికి
సంతుష్టురాలై ఆనాటి అందని
మహిళా విద్యను అభ్యసించి...
జ్యోతిరావు పూలే మనోభీష్టం మేరకు
మహిళలందరికీ విద్యను బోధించే
బృహత్తర కార్యాన్ని భుజస్కంధాలపై ఎత్తుకొని
మహిళలకు విద్యా విజ్ఞానాన్ని నేర్పింది
భారతీయ చరిత్రలో మొట్టమొదటి
మహిళా ఉపాధ్యాయురాలుగా కీర్తి గడించింది
మహిళా అభ్యుదయానికి ప్రేరణగా నిలిచింది
నమోనమః సావిత్రిబాయి పూలే
డా దీపక్ న్యాతి
సీని రచయిత దర్శకుడు
నంది పురస్కార గ్రహీత
హైదరాబాద్
[07/01, 2:17 PM] Lalita Sister: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..సావిత్రీ బాయి పూలే
శీర్షిక..మహిళా రత్నం
తొమ్మిది సంవత్సరాల వయసులోనే వివాహం
ఆదర్శాల కోసం
భర్తతో కలిసి అడుగులేసిన తొలితరం ఉద్యమ కారిణి
నిరక్షరాస్యురాలైనా
తొలి గురువు జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతోనే చదువు నేర్చుకొని ఉన్నతస్థాయి పొందిన భారతదేశపు తొలి ఉపాధ్యాయుని
ఆధునిక విద్యతోనే స్త్రి జాతికి విముక్తి సాధ్యమని నమ్మిన సృజనశీలి
బాలికలకోస0 మొదటిపాఠశాల నెలకొల్పిన
భారతీయ సంఘ సంస్కర్త
కులమతాలకతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి
సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో
ఆనాటి సమాజపు కట్టుబాట్లను ఛేదించుకొని
ఆత్మస్థైర్యమే ఆయుధంగా
నూతన వ్యవస్థకోసం ప్రాణాలనే పణంగా పెట్టిన ధీశాలి
ఫ్లేగు వ్యాధిగ్రస్థులకు నిస్వార్థ సేవలందించిన మహిళా రత్నం
చైతన్యవంతమైన రచనల దీప్తి
సంతానం కోసం తపించక సమాజ శ్రేయస్సే లక్ష్యంగా సేవలందించిన నిస్వార్థ సేవకురాలు
జ్ఞాన జ్యోతియైన
సావిత్రీ బాయి పూలే జీవితం
నేటి మహిళకు ఆదర్శం.
[07/01, 2:21 PM] Lalita Sister: కవితగానం కవిసమయం
****************
పేరు:గాజుల భారతి శ్రీనివాస్
ఊరు:ఖమ్మం
జిల్లా:ఖమ్మం
చరవాణీ: 9849788108
అంశం:సావిత్రి బాయి పూలే
శీర్షిక: విద్యతోనే మహిళకు విముక్తి
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు
శ్రీ సావిత్రి బాయి పూలే
నిమ్న జాతి అభ్యున్నతి కోసం కృషి చేసిన నారి శిరోమణి
మహిళల హక్కులే మానవ హక్కులని నినదించిన ఉద్యమకారిని
ఆనాటి కట్టుబొట్లను,మూఢ నమ్మకాలను ఎదురించి
ఆధిపత్య వర్గాలను ధిక్కరించిన ధీర వనిత సావిత్రి బాయి పూలే
పీడిత,తాడిత ప్రజల పక్షపాతి
విద్యాభివృద్ధికి కృషి చేసిన మహా మనిషి
విద్య ఉద్యమమే ఊపిరిగా పోరాటం చేసిన తొలి తరం మహిళ
మనువాదుల చేతిలో ఎన్నో అవమానాలను భరించి
స్త్రీ వ్యతిరేకతను,పితృ స్వామ్య వ్యవస్థను వ్యతిరేకించి
స్త్రీ స్వీచాభివృద్ధికి పునాది వేసిన
మహానీయురాలు శ్రీ సావిత్రి బాయి పూలే
పూలే బాటలో పయనిద్దాం
ప్రగతి పథంలో నిలుద్దాం
******************
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
7.
తొలి గురువు సావిత్రీ బాయ్
.......
సమాజ ఉద్దరణకు ముందుకు నడిచి
అనాగరిక సమాజములోన
అణగారిపోయిన బ్రతుకుల్లో
వెలుగు దీపమైన నిలిచింది సావిత్రమ్మ
పురుష ఆధిపత్యమును అమాంతముగా తుంగలోన తొక్కి
ఒక్కఅడుగును ముందుకు వేసినట్టి
గుండెనిబ్బరము కలిగిన నాయకురాలు
వితంతువులను చేరదీసి
బాల్యవివాహాలకు అడ్డుగా నిలిచి
విప్లవమును రేకెత్తించిన వీరనారి
కోటివెలుగులు తేజస్సును ప్రజల గుండెల్లో నిలిపి
వెలుగు దీపమును నిలిపిన నాయకి
అణగారిన బ్రతుకుల్లో విప్లవకెరటముగా
ఓనామాలు దిద్ది బ్రతుకులు బాగుచేసి
ప్రగతిపదములో బ్రతుకును నడిపి
భారత చరిత్రలో సువర్ణ అధ్యాయమును లిఖించిన
సావిత్రీ మాత తొలిమహిళాగురువుగా నిలిచింది
ఉపాధ్యాయ లోకానికి పూజ్యనీయురాలుగా నిలిచింది
జోహార్ తల్లీ సావిత్రీ బాయ్ జిహార్
ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
భాకరాపేట
Comments
Post a Comment