Skip to main content

సప్త స్వరాలు Jan 2021

 నిర్వహణ: శివునూరి లలితాకృష్ణ

*******************

1.సుధారాణి కృష్ణంరాజు గారు

2.కోరాడ గారు

3. కందూరి సుజాతా రాణి గారు

4.డా.ఆంజనేయులు గారు

5.ధనాశి ఉషారాణి గారు

6.డా.బల్లూరి ఉమాదేవి గారు

7.

8=

9. మన్నె లలిత గారు

10. భరద్వాజ గారు

11. శ్రీ లక్ష్మి చివుకుల గారు

12.పరాంకుశం రఘు నారాయణ గారు

13. అపరాజిత్ గారు

14. కొలచన విజయ భారతి గారు

15.మర్రి జయశ్రీ గారు

16.సునంద వురిమళ్ళ గారు

***************

1

[19/01, 7:52 PM] +91 80748 15328: కవితాగానం


నేటి అంశం

*సప్త స్వరాలు*


మీదైన శైలి ప్రతిబింబించేలా

సప్తస్వరాలను పలికించండి.

(టెక్స్ట్ లో )

 


ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు

అంశానికి కవితలతో స్పందించగలరు.


ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.


✳️✳️✳️✳️✳️✳️

1

[19/01, 8:00 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏

🙏సుధారాణి కృష్ణంరాజు🙏

*అంశం*సప్త స్వరాలు*

19-01-2021(మంగళవారం)

ఇంద్ర ధనుస్సు లోని ఏడు రంగులు మానవ జీవితంలో

విరాజిల్లే సప్త వర్ణాలు

స్వరములు ఏడు సప్త స్వరాల

సంగీతం విన్నప్పుడు పులకించని మది ఉండదు

ఏడడుగులు బంధం తో ఒకటైన భార్య భర్తలు తమ జీవితాలను సప్త స్వరాలతో

పోల్చుకున్నప్పుడు అన్ని విషయాలు మధుర స్వరాలను

పలికించే సంసార వీణలా

సాఫీగా సాగి పోవాలను

కుంటారు

సప్త స్వరాలలో ఏస్వరం లోనైనా అపశృతి పలికితే

సంగీతం ఎలా నీరు కారి పోతుందో

సంసార మనే సప్త స్వర వీణలో

అపశృతి పలికితే జీవన వీణ

తీరం చేరలేదు

సంసారాన్ని స్వరంతో పోల్చితే

సప్త స్వరాలను సంసార వీణలో అన్నింటిని సమానంగా

కష్టాలకు కుంగక సుఖాలకు పొంగక

సంసార వీణను సప్త స్వరాలు

పలికించాలి జీవిత గమ్యాన్ని చేరుకోవాలి🙏🙏👍

2

[19/01, 8:02 PM] Korada: కవితాగానం

అంశం :- @ సప్తస్వరాలు @

  కోరాడ నరసింహా రావు.....!

    * సప్త సాగరమ్ములే......!!*

       *******************

స-రి-గ-మ-ప-ద-ని.........

కోటి రాగాలు పలికించ గలుగు

సప్త స్వరము లివి.....!

ఒకొక రాగమూ...ఒకో భావ

ప్రేరక మై...మనసును దోచు...

 నాద స్వరములివి...!!


సాక్షాత్ ఆ సర్వేశ్వరుని ఆనంద

తాండవ సమయమున....

ఆతని కాలి అందియలు తెగి

పడ గా....వినిపించిన ఆ మువ్వల సవ్వడి సప్తస్వరము లుగ వినిపించె నహో....!

స-రి-గ-మ-ప-ద-ని......!!

నిప్పును ఉట్టించ గలవివి....

నీటిని కురిపించగలవివి....

నాట్యమునకు ఆలంబానయై

నవి...!

రోగాలను పోగొట్టగలుగునివి!!

జంత్రవాద్యముల...గాత్ర గమ

కముల...శాస్త్రపద్దతులచాతుర్యముతో...నవ్యరీతులను

పలికించగలవు...!నవరసమ్ములను ఒలికించ గల వు..!రాగ-భావ విన్యాసముతో

రాళ్లనైన కరిగించగలవు...!

ఆనందమునే కలిగించగలవు!!

పశువులు,పక్షులు,పాములు,పిల్లలు...ప్రాణులేవైన పరవ సించునీ సప్త స్వరములకు...!

సప్త సాగర సమములే....

ఈ సప్తస్వర సంగీతఝరులు!!

ఆ ఝరులలో తడిసి ముద్దవగా....పరితపించు గద

రస హృదయం...!

   *********************

       -..........కోరాడ.

3:

 అంశం... సప్త స్వరాలు 

శీర్షిక... 🌷సంగీత భూషణం🌷

................  .........  .........

సప్త స్వరములు సంగీత సౌధం మూల స్థంభాములు. 

సరిగమపదనిస లు సంగీత ఆకాశ గోపురములు.

సనిదపమగరిస లు సంగీతా ఆళంబన పీఠములు.

సంగీత చకోరములు సప్త స్వరములు.


పిల్ల తెమ్మెర గాలి సవ్వడిలో 

పాల నురుగుల అలల ఉరవడిలో 

ఉరుము మెరుపులలో 

పంచభూతాలలో హొయలొలుకు 

సప్త స్వరములు .


నాగు బుసలలో    ఆవు అరుపులో

మానవ స్వరంలో    కోకిల గానంలో 

ప్రాణికోటి పలుకులలో కులుకులొలుకు

సప్త స్వరములు. 


వాయిద్యాలను ఆశ్రయించి నిరాకార తాండవమున సంగీత విందు చేయు... స్వరాన్ని మథించి గానామృత 

తుషారముల గుమ్మరించు 

సప్త స్వరములు.


నవరసాలలో   సుఖదుఃఖాలలో 

చీకటి వెలుగులలో 

జనన మరణములలో అనునిత్యం 

సప్తస్వర భూషిత సంగీతం వెన్నంటి ఉన్న దైవ కుటీరం. 

 

పన్నాగ భూషిత అర్ధనారీశ్వరం 

లోకాలను బ్రోచు .

సప్తస్వరాల భూషిత సంగీతం 

లోకాన వీచు.


కందూరి సుజాతారాణి 

రాజేంద్రనగర్, హైదరాబాద్ 

9382162822🌷

4

[19/01, 8:05 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: శబ్ద స్వరాలు

ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో సప్తస్వరాల జాలి మ్రోగెను


అబ్బ గుడిలో నాగిని లను


స్వరమై గుండెలో మ్రోగనీ

ఎందుకో రస రాగ భావాల వీణపై మ్రోగనీ సప్తస్వర మంజరి


ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453

5

[19/01, 8:12 PM] Dhanasi Usha Rani Poetess: సప్త స్వరాలు

.............

బతుకు దారిలోన

అనుకోని సంఘటనలు 

భవితకు పునాది వేస్తే

బతుకు సప్తస్వరాల సంగమమే


నులివెచ్చని  సరిగమలు

పలికేటి తొలిప్రేమలో

తియ్యని నిజాయితీ

మనసు లోగిలిలో సప్తస్వరాలు పలికించు

 

పసిడి నవ్వుల కేరింతలు

జీవిత దారిలోన

తియ్యని నవ్వులు పలికించు

సప్త స్వరాల లోగిలి


బతుకుదారిలో  ప్రేరణ

మనసును వసంత ఆమనిలా

నిలిచి సప్తస్వరాలు పలికించును


స్నేహములో తియ్యని మధురిమలు మనిషిలో

సప్త స్వరాలను పలికించు


జీవితమే అణువణువు

సప్త వర్ణాలను చిలికేటి

సప్తస్వరాల సంగమము


 ధనాశి ఉషారాణి

  చిత్తూరు జిల్లా

  భాకరాపేట

6

[19/01, 8:17 PM] Balloori Umadevi Poetess: 19/1/21

కవితా గానం

డా.బల్లూరి ఉమాదేవి

అంశం: సప్త స్వరాలు


మావిచిగురు తిన్న కోయిలమ్మ 

ఆమని రాకతో గళమెత్తి పాడితే

చదువులమ్మ మెడలో వడివడిగా

కవితా సరం అలంకరించాలని

కవితాగానం సుస్వర కంఠంతో

 సప్తస్వరాలు తొడిగించి ఆలపించాలని

కవి హృదయం తహతహతో ఎదురుచూస్తూనే ఉంది

 కవి మనో వీణియాపై ఆలపించిన

సరిగమలు మదిని ఉవ్వీళ్ళూరిస్తుంటే

ఎదలో సరికొత్త భావనలు పోటీపడి పుట్టుకొస్తుంటే రవి కాంచనవి సైతం

కవి మనోనేత్రంతో దర్శించి అక్షర రూపం కల్పిస్తూ వినిపించాలని తపనతో ఎదురుచూస్తోంది నిరంతరం

పశు పక్ష్యాదులను  ఆకట్టుకోవడం 

సు స్వరాలకే స్వంతం  విన్న వారి వీనులు ధన్యంఆ గానామృతం 

విన్న వారి వీనులు ధన్యం


డా.బల్లూరి ఉమాదేవి

7

[19/01, 8:24 PM] Dhanasi Usha Rani Poetess: శీర్షిక .తియ్యని మాటలు


........

మానవత్వం మరిచి

అమాయకపు ఆడపిల్లలను

తియ్యని మాటల గాలాలతో 

బంధించి కరెన్సీ నోటుతో

బేరీజు వేస్తూనే

మనసును ముక్కలు చేస్తూ

తేడా మాటలతో గాయాలు చేస్తూ

వ్యామోహం తీర్చుకుంటూ

సాగిపోయే మృగాలకు లేదు చరమగీతము



అవసరానికి కన్నీటి చుక్కను

ఏరను వేస్తూ మాటలతో

మనిషిని నమ్మిస్తూ వెన్నుపోటు

పొడిచేటి నేటి స్వార్థపూరిత సమాజములో

ఎవ్వరిని నమ్ముట కష్టమే సుమా

తియ్యని మాటల వెనుక కపటప్రేమ దాగుందని

గ్రహించు లోపే బ్రతుకులు

ఆంధకారములో మునిగిపోవు

వివేకముతో బతుకులో ముందుకు సాగిపో నేస్తామా



ధనాశి ఉషారాణి

 చిత్తూరు జిల్లా

8

[19/01, 8:25 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: సప్తస్వరాలు

వీణపై సప్తస్వరాలు మ్రోగించాలని


మధురమైన భావాలను పలికించడం


ఉయ్యాలలో గించడం

సప్తస్వరాల మధుర భావాలు

పలికిన వేళ హృదయం ఉప్పొంగుతుంది


అది సంగీతం లో తబలా

గుండె గూగుల్ ఆ రాగాల

మనసుకు హాయి గొలిపే


సప్త స్వర మంజరి

నవరాగ సుందరి


హృదయవీణ పై ప్రణయ రాగం పలికించనా


మనసు 



మమతల కోవెల లో ఈ రాగాలు పలికించి ఆకాశ విహారం చేయని నక్షత్ర వీణపై నవనవోన్మేష మధుర భావాలు


ఈ రేయి నీ గీతం నన్ను అలా గానమై పలకని


రామప్ప నాగిని బొమ్మలు మీటితే సరాగాల సప్తస్వరాలు

పలుకుతాయి


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453


 జుమ్మని మ్రోగనీ

9

[19/01, 8:25 PM] +91 74168 63289: కవితాగానం 

తేదీ :19/ 0/21

 పేరు  :మన్నె పిన్నక లలిత 

అంశం: సప్తస్వరాలు 

  శీర్షిక :సుస్వరాలు

*****************************************

  శుకము పలుకును  సుస్వరములు

 షడ్జమం పలుకును క్రేంకారం

 గాంధర్వం  పలుకును మకారం

  క్రౌంచ పక్షి కూత, కోకిల స్వరం ,ఏనుగు ఘీంకారం

   పక్షి కూతల నుండి  జనించిన సప్తస్వరాలు

 "స రి గ మ ప ద ని"

 భారతీయ సంగీతం  సాంప్రదాయక సంగీతం

  సామవేదకాలం నాటి నుండి ఉన్న 

రాగాల మూల భావాలు

 సప్తస్వరాల మేళవింపు రాగాలు

 ఒక రాగం లో నిబంధన ఐదు స్వరాలు

 బాలమురళి పాడారు నాలుగు స్వరాలు

 చతుర్ధ రాగ కూర్పు సంగీత ప్రపంచానికి ప్రత్యేకత

 స్వరాలకు శృతులు ఆధారమై

 22 శృతుల ధ్వని విశేషమై తారస్థాయికి చేరుకుని

  గళాలలో అమృతం  నింపి 

సప్తస్వరాలు ఒలికించిన

ప్రపంచ ప్రఖ్యాత మంగళంపల్లి గారు

 ఘంటసాల గారు ,బాలు గారు

 అసంఖ్యాక సప్తస్వరాల  గాన కోవిదులు

 సప్తస్వరాల సుస్వరాలతో

 సంగీత ప్రపంచంలో సామ్రాట్టులై

 వీనుల విందు చేస్తున్నారు

10

[19/01, 8:45 PM] భరద్వాజ గారు: కవితాగానం 

అంశం- సప్తస్వరాలు --!

శీర్షిక-  .మూలం  !

పేరు-భరద్వాజరావినూతల 

కొత్తపట్నం 

రచన-36

********************************

%%%%%%%%%%%%%%%%%

సప్తస్వరాలు -

సంగీతానికి ప్రాణం -

స్వరాలులేకుండా నడవదు సంగీతం -

ప్రతిస్వరం ఓపలుకై -

ప్రతి జతి పాట కుప్రాణమై -

నడుస్తుంది -

హరివిల్లులో  ఏడురంగులు -

పెళ్ళిలో ఏడడుగులు -

ఋషులలో ఏడుగురు

 ఎంతప్రాధాన్యమో -

సంగీతానికి సప్త స్వరాలూ అంతే ప్రాధాన్యం -

స్వరం పాటకు -

శృతి లయలు గీతాలకు జీవమై నడుస్తుంది సంగీతం -

మనిషిజీవితంలో 

ప్రేమ,అభిమానం.ఆప్యాయత ,అనురాగం ,ఆనందం -

మమకారం -మనసు అనేసప్తస్వరాలు ఉంటేనే -

జీవితం నడుస్తుంది హాయిగా -

*****************************

*******************************

ఇదినాస్వీయరచన

✍️భరద్వాజ రావినూతల ((RB)🖍️

కొత్తపట్నం 

9866203795

11

[19/01, 8:52 PM] శ్రీ లక్ష్మి విజయనగరం: కవితా గానం 

తేదీ: 19-01- 2021  

అంశము: సప్తస్వరాలు 

పేరు: శ్రీలక్ష్మి చివుకుల


సృష్టి ఆరంభం ఓంకార నాదం!

శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః

జంతువుల అరుపులు పక్షి కూతలతో 

ప్రకృతిని ఓలలాడించిన సంగీతం!

మయూర క్రీం కారాలూ, ఎద్దు రంకెలూ

మేక అరుపులూ, క్రౌంచ పక్షి, కోయిలల కూతలూ గుర్రపు సకిలింతలూ, ఏనుగు ఘీంకారాలూ 

స రి గ మ ప ద ని సలై

ఆహత అనాహత నాదాల నడుమ

సకల జన సమ్మోహనమై

ఆరోహణ అవరోహణల నడుమ 

స్థాయీ భేదాలతో సాగు సంగీతానికి

గీతం వాద్యం తధా నృత్యం

త్రయం సంగీత ముచ్యతే!

న కార ద కార సంయోగములతో

భూనభోంతరాళాలు నిండిన నాదము

ఘనరాగ పంచకమై

సాంప్రదాయపు రీతుల రాగాల బాణీలో

నాద యోగుల వాగ్గేయకారుల సంగీతకారుల

వీణలో వేణువులో తంబుర లో

వాయులీనములో 

మృదంగ నాదం లో

జగతిని ఓలలాడించినది

ఆధునిక పాశ్చాత్య వాద్యపరికరాల హోరులో

ఎన్నెన్ని పోకడలు పోయినా

సప్తస్వరాల మేళవింపుతో కూడిన

భారతీయ సంగీతమే

ప్రపంచానికి ఆదర్శమై

నాదయోగి మహా శివుడే ఆదిగురువై వెలువరించిన

సప్తస్వరాలు వేదమంత్రాలైనవి.

సప్తవర్ణాల ఇంద్ర ధనుస్సుగా

భువిని అలరించినది

🌹🙏🌹

12

[19/01, 8:59 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితాగానం*


 అంశం :సప్తస్వరాలు 


*కవితా శీర్షిక : సప్తస్వర మహత్యం*


మనిషిని అహ్లాదపరిచేవి రాగాలు!

 

కొత్త జీవన గమన మనోనేత్రాలు! 


మనిషికి ఉత్సాహాన్నిచ్చే మధుర క్షణాలు!


 అపురూప శృతి లయ మధుర ఘట్టాలు!


 సప్తస్వర రాగ మంజీరాలు!


  మానసికోల్లాసం సంవృత సమ్మోహనాలు!


 ఆరోగ్యామృత దివ్య ఔషధం!


సత్కాలక్షేప సుందర కటాక్ష వీక్షణం !


సప్తస్వర రాగ సమ్మిలిత భాషణం!


 సప్త స్వరాల వీణామృతం!


 మనోవిశ్లేషణల భావావేశ సమాహారం!!


 పరాంకుశం రఘు నారాయణ మహబూబాబాద్

13

[19/01, 9:15 PM] Aparajith: సరిగమపదనిసల జీవితం !


ఈ రేయి తెలవారదు 

ఈ చీకట్లు విడిపోవు 

దిన దిన గండం నూరేళ్ళ ఆయిస్సు !

ఈ ఆలాపన ఓ విషాద గీతం !

ఏభై వసంతాలు ఇట్టే విడిపోయాయ్ 

మది నిండా ఏవో వింతభావాల రొద 

మూగ బాసల దైన్యం నిండిన కళ్ళు !

ఈ ప్రయాణమెపుడు ముగుస్తుందో తెలియని ఆవేదన 

జీవితం మనసు గారడీ లో చిక్కుకుని 

బ్రతుకుటద్దం పగిలి ముక్కలైన వేళ !

ఈ ఈదురు గాలి ఎటు వీస్తుందో తెలీదు 

ఈ గాలితో పాటు కొట్టుకునిపోతే బావుణ్ణు !

పుస్తకం తీస్తే గుడ్ల నిండా కన్నీళ్లు 

వేదన శృతి మించితే రాగాలు గతి తప్పుతాయి 

మానవ మృగాల చేతిలో బ్రతుకు కీలుబొమ్మ 

ఏ మృగం ఎటువైపునుండి దాడిచేస్తుందో తెలీదు 

పగ ప్రతీకారం ఎరుగని జీవితం 

కను కొలుకుల్లో పడ్డ రాయి 

నిశ్చల కొలనులో పడ్డ రాయి చందం !

వేదాంతుల ఎన్నెన్నో విశ్లేషణలు జీవితం పై 

ఏ లొసుగుల్లేని జీవితం పగబట్టినట్లు ఓ పీడ కల 

విగత జీవుల ఆక్రందనలు ఎవరికీ పట్టవేల !? 

కొమ్మపై కోయిల రాగాలు తీస్తోంది !

తీయని గొంతుల్లో విషాద గీతాల హాయి 

జీర్ణించుకోలేని కొన్ని చేదు నిజాలు 

విజ్ఞతకే వదిలేయాలి వాటిని !

చెల్లని రూపాయిని పారేయాల్సిందే 

అందచందాల జీవితమెపుడు మరులు గొల్పే సంగీతం 

బాలు పాడిన సుందర శ్రావ్య గీతాల్లా !!


అపరాజిత్

14

[19/01, 9:15 PM] కొలచన విజయ భారతి Poetess: కవితా గానం

పేరు: కొలచన విజయ భారతి

ఊరు: హైదరాబాద్

అంశం:సప్తస్వరాలు

శీర్షిక: సంగీతానికి వరాలు

తేదీ:19-1-2021

**********************

సప్త స్వరాలు

సంగీత ప్రపంచానికి

భగవంతుడిచ్చిన వరాలు

సంగీత ప్రియులను

గమకాల మమకారాలతో

ఆలాపనల ఆత్మీయతలతో

అణువణువు ఓలలాడించే

సప్తస్వరాలు


స్వరజతుల శృతులతో

కర్ణాలకు విందులు చేసే

వర్ణాలతో

అబ్బురపరచే డెబ్బది రెండు

మేళకర్త రాగాలతో

సంగీతాన్ని పెనవేసుకున్న

సప్తస్వరాలు


భావ రాగ తాళ మధుర

సంగమంతో మనసును 

మైమరపించే

సుస్వరాల సరిగమలు

సప్తస్వర మధురిమలు


పశువులనైనా,శిశువులనైనా

ఊయలూగించే స్వరాలు

శిలలోనైనా,శిల్పంలోనైనా

ప్రకృతి లోని అణువణువునూ

దాగివున్న  స్వరమాధుర్యాలు

         🎼🎼🎼

15

[19/01, 9:30 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..సప్త స్వరాలు

శీర్షిక..శక్తివంతం



ప్రకృతిలో అణువణువు దాగివున్న మధురమైన సంగీతం

ఎలాంటి ఎల్లలు లేకుండా

ప్రపంచమంతా చేయు స్వైర విహారం 

మానవ జీవితంలో అంతర్భాగం

పశు పక్ష్యాదులను

పసిపిల్లలు,దేవతలను

మంత్ర ముగ్దులను చేసే శక్తివంతం

సప్త స్వరాలే సంగీతానికి ఆధారం

ఎన్నో రాగాలకు మూలం

శృతి లయలతో

వీనుల విందు చేస్తూ

బాధలను మరిపించే మత్తు

గాయపడిన మనసుకు లేపనం సంగీతం

జవసత్వాలకు ఉత్తేజ0

రోగాలనెన్నో నయం చేసే దివ్య ఔషధం

ఇంద్రధనస్సు లోని సప్తవర్ణాలు

వివహబంధంలో సప్తపది

ప్రేమ,ఆప్యాయతానురాగంతో కలిసిన సప్త స్వరాలతో

జీవితం ఆనందమయం

సర్వదా శ్రేయస్కరం

16

[19/01, 9:33 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*

తేదీ::19-01-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం:సప్త స్వరాలు

శీర్షిక::బతుకు వీణను మీటే..

*******************

ఆరున్నొక్క రాగాలతో

అలరించే సరిగమ పదనిసలు

బతుకు వీణను మీటే సుమధుర సురుచిర స్వరాలు..


ఆనందం పరమానందమై

హృదయాన్ని ఉత్తుంగ తరంగం చేసినప్పుడు

పాడుకునే ఆనందభైరవి..


నిత్యం దినకరుని ఆగమనాన్ని

ఆహ్వానిస్తూ పాడే భూపాల రాగం

మనసు కలత చెందిన వేళ ఊరట కలిగించే అనేకానేక రాగాలు

 సాంత్వన చేకూర్చే ఔషధాలు.

భారతీయ సంస్కృతిలో

జీవితంతో పెనవేసుకున్న ఈ సప్త స్వరాలు

అపూర్వ రాగ రంజితాలు..

సప్త సముద్రాలు సప్త ఋషులు

పస్త పదులతో..

సప్త స్వరాలతో మిళితం మానవ జీవన యానం..


Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...