నిర్వహణ శివునూరి లలితాకృష్ణ
**********-
1.మన్నె లలిత గారు
2.విజయభారతి గారు
3.భరద్వాజగారు
4. *నిలమంగై గారు*
5.డాక్టర్. బల్లూరి ఉమాదేవి గారు
6.కోరాడ నరసింహారావు గారు
7 *రమాదేవి కులకర్ణి గారు*
8.సుధారాణి కృష్ణం రాజు గారు
9.ఆంజనేయులు గారు
10.మర్రి జయశ్రీ గారు
11.ప్రమోద గారు
12. వురిమళ్ళ సునంద గారు
రాముని సేవలో తరించిన
కవిమిత్రులందరికి ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏
1
[22/01, 7:39 PM] Lalita Sister: ✳️✳️✳️✳️✳️✳️
కవితాగానం
నేటి అంశం
*రామునిసేవలో*
ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు
అంశానికి కవితలతో
స్పందించగలరు.
ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలర
1
[22/01, 8:22 PM] +91 74168 63289: కవితా గానం
తేదీ :22/1 /21
పేరు :మన్నె పిన్నక లలిత
హైదరాబాద్
అంశం: రాముని సేవలో
శీర్షిక :శ్రీరామ జయ రామ జయజయ రామ
రాముని సేవలో తరించిన వారెందరో
పితృ భక్తి ,మాతృభక్తి ,భ్రాతృ భక్తి ,ఏకపత్నీ వ్రతం,
ఒకే బాణం ఇవి రాముడి సుగుణాలు
రాతిని నాతిని చేసి, శబరీ ఆశలు తీర్చి
సర్వ మత సహనం చూపి,ప్రజల మాటే వేదవాక్కు
మాటకోసం స్వపర భేదాలు లేక
భార్య గర్భిణి అని ఎంచక
ప్రజల కోసం అడవులకు పంపిన రాముడు
భార్య వియోగంతో అడలి పోయిన శ్రీరామచంద్రుడు
హనుమంతుడు భక్తుడై విభీషణుడు స్నేహితుడై
శత్రువైన రావణుని దగ్గర రహస్యాలు విని
సర్వులకు ఆనందాన్నిఇచ్చి
ఇలవేల్పు అయిన రాముడు అందరికీ ఆదర్శవంతుడు
2
[22/01, 8:32 PM] కొలచన విజయ భారతి Poetess: కవితా గానం
పేరు:కొలచన విజయ భారతి
ఊరు:హైదరాబాద్
అంశం:రాముని సేవలో
శీర్షిక:తరించనిదెవ్వరు
తేదీ:22-1-2021
*********************
రాముని సేవలో తరించని వారెవ్వరు ఇలలో
రామనామామృతము
గ్రోలని వారెవ్వరు అవనిలో
హనుమను మించి రాముని
దాసుడెవరు పుడమిలో
శబరిని మించి భక్తి పారవశ్యం
ఉన్నదెవరికి భువిలో
పక్షి యైన రాక్షసునడ్డగించి
ప్రాణత్యాగము చేయలేదా
సీతను వెదుకగ సాయం చేసిన
కోతి మూక కెంత రామభక్తి
సేతువు కట్టగ చిట్టి ఉడుతకు
ఎవరిచ్చారా శక్తి
భద్రాద్రి రామాలయం నెలకొల్పి
సేవించిన రామదాసు కెంతటి పుణ్యమో
సంకీర్తనల గానము సల్పి
రాముని కీర్తించిన త్యాగరాజెంటి ధన్యుడో
అయోధ్యలో నెలకొను
రామ మందిర నిర్మాణమునకు
చేతనైన సాయము చేద్దాము
మనవంతు తృణమో పణమో
భక్తిమీర సమర్పించుకుందాము
ఆ అయోధ్యా రాముని సేవలో
తరించే భాగ్యం పొందుదాము
🙏🙏🙏🙏🙏
3
[22/01, 8:32 PM] భరద్వాజ గారు: ☂️🌼🌞🌻✳️🍁🌼కవితాగానం
శుక్రవారం
అంశం-రామునిసేవలో
శీర్షిక--సేవాభాగ్యం
పేరుఃభరద్వాజ
9866203795
********************************************************
రాముడు
తండ్రి మాటజవదాటని తనయుడు-
ఒకేభార్య ఒకేబాణంఅన్ననీతి సూత్రానికి కట్టు బడ్డవాడు-
కడుపునబుట్టిన బిడ్డనుగారాబంగా
కంటికి రెప్పలా సాకిన ఆయన ప్రేమలాలిత్యం లో సాగిపోయాడు-
ఆయనఅన్నదమ్ములందరూ ఆయనసేవలో తరించిన పుణ్యమూర్తులు-
భర్త అనురాగపు సేవలో తరించిన ఇల్లాలు సీత-
భర్తమాటజవదాటని కారుణ్య మూర్తి-
ఎంగిలి పళ్ళు పెట్టి భక్తి పరమార్ధాన తరించిన శబరి-
నదిని పడవ లో దాటించిసేవ చేసినగుహుడు-
పరులఎత్తుక పోతున్న సీత జాడ చెప్పిసేవ చేసినజటాయువు-
తన రాజును స్నేహితుడ్నిచేసి
తన సేవనుపెంచుకున్నభక్తా ఆంజనేయుడు-
సీత జాడ తెలిపి ధన్యత పొందాడు-
రామ కాలాన రాముని సేవలో తరించనివారెవ్వరు-
పులకించి ధన్యులుకాని జీవులెవ్వరు--!
********************************************************ఇదినాస్వీయరచన
✍️భరద్వాజ రావినూతల(RB)✏️
4
కవితా గానం
అంశం: *రాముని సేవలో*
తేది:22/01/2021
*వచన కవిత్వం*
రమ్యమైన రామనామం రంజిల్లచేయునుల్లములను..!
భక్తితో,యుక్తితో ,ప్రేమతో కొలిచి తరించిరి..!
జఠాయువును తండ్రిగా భావించి కర్మ కాండలను చేసిన కర్మజీవి..!
నరునిగా జన్మించి వానరులతో,బోయవారితో,రాక్షసులతో,వృద్ధ స్త్రీతో,పక్షులతో చెలిమి చేసిన స్నేహశీలి రఘువంశ తిలకుడు..!
రామబంటు హృదయ సింహాసనంపై కొలువున్న కోదండ రాముడు..!
రావణుని రాజనీతి కోవిదతకు మెచ్చి విని ఆచరించిన మహామనీషి..! శరణంటే రక్షిద్దామని ఎదురు చూసి అవకాశాలనెన్నిటినో ఇచ్చి చివరికి సంహరించిన దయాశీలి..!
హితుడిగా,స్నేహితుడిగా,భర్తగా,తండ్రిగా,బిడ్డగా,రాజుగా,అన్నగా విధవిధ పాత్రలను పోషించి మెప్పించిన దయాసముద్రుడు..!
రామ రాజ్యం కాంక్షించేలా రంజిల్ల చేసిన రమణీయ,కమనీయ రూపుడు..!
తరించిన వారెందరో,మనం తరిద్దాం రామ నామ జపంతో,రామమందిర నిర్మాణం చేసి తరిద్దాం..!
ధన్యులమౌదాం...!!!!
పేరు: కె.ఇ.నిలమంగై
కలం పేరు:నీలా రంగనాధం
ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.
చరవాణి సంఖ్య:8897155600.
*ఈ పై కవిత ఈ సమూహం కోసం రాసినదేనని హామీ ఇస్తున్నాను.*
5
[22/01, 8:39 PM] Balloori Umadevi Poetess: 22/1/21
కవితా గానం
పేరు:డా.బల్లూరి ఉమాదేవి
అంశం: రాముని సేవలో శబరి
ఆ.వె:తరణి రాకకొరకు తమ్మి చూచెడిరీతి
వేచియుంటిననుచు వెలది పలికి
పరమ ప్రీతి తోడ పరిచర్యలను చేసి
రాము కరుణ బడసె రహిని బొంది
ఆ.వె:అవనిజనువెదకుచు నడవులచనుచుండ
నాశ్రమమ్ముగాంచి నరిగిరచట
నెదురు చూచుచుండె నెంతొ కాలమునుండి
శబరకాంతయైన చాన యోర్తు
ఆ.వె:దాశరథిని గాంచి తడబడు యడుగులన్
సాధరముగ చేయ సపరిచర్య
సంతసించి మదిని సాకేతరాముండు
కూర్మి తోడ ఫలము గొనియె తాను
ఆ.వె:నగుచు స్వీకరించె నాతియొసగినట్టి
ఫలము లెల్ల తాను ,వనము నందు
భక్తి తోడ నొసగు ఫలమారగించుచు
ముదమున శబరి కట ముక్తినొసగె .
6
[22/01, 8:40 PM] Korada: కవితాగానం
అంశం:- రామునిసేవలో
కోరాడ నరసింహా రావు...!
* మరల చూడ గలుగుతాం *
**********************
ఆ శ్రీరాముని సేవలో... తరించిన వారెందరో...!ఎందరెం
దరో...!!తమ్ముడు లక్ష్మణుని తరువాతే కదా వారెవరైనా !!
ఈవిషయంలో...ఆంజనేయు
డేం తక్కువా...సేవకుడంటే...
హనుమయే...అనిపించు కోలేదూ...!
పడవనడిపిన వాడూ...పక్షి
సైతం...రాముని సేవలో తరించిన వారేకదా...!
పాదుకలకు పట్టాభిషేకం చేసిన
భరతుడేం తక్కువ...!!
చెదరని విశ్వాసం తో వేచి చూసిన సబరిని మరచిపోగలమా...!
గుడి కట్టిన కంచర్ల గోపన్న...
రామదాసు గా ప్రసిద్ధుడు కాలేదూ....!!
ఆఖరికి...ఉడుత సైతం తన
శక్తి వంచన లేకుండా సేవించి
తరించ లేదూ....!
అక్షర నీరాజనాలతో....ఆ శ్రీరాముని త్యాగరాజు వంటి
భక్తకవులెందరు సేవించి తరించ లేదు...!
అప్పటి వాళ్ళే... కాదండీ...
ఇప్పుడు మనమూ...ఆ శ్రీరా ముని...సేవించి తరిన్చ వచ్చు
గా...!
ఆ శ్రీరాముని సేవించట మంటే
ప్రతిమలను పూజిన్చడం కాదండోయ్...! తినని ప్రతిమలకు నైవేద్యాలు సమర్పించడమూ కాదు...!!
ఆత్మ శుద్ధి...మనసు నిలకడా
లేని నామ భజనలూ కాదు!
రాముని సేవించడ మంటే...
నీ ధర్మాన్ని నువ్ తప్పకుండా
బ్రతకడం...!రాముడు అంటే
ఒక ఆదర్శ తనయుడు...!
ఒక పూజ్యనీయుడైన భర్త!
ఒక ఆత్మీయుడైన సోదరుడు!
ఒక ఆదర్శ మిత్రుడు...!
ఒక అత్యుత్తమ పాలకు డైన
ప్రభువు...!వెయ్యేలా.....
రామో విగ్రహవాన్ ధర్మః
అనలేదూ...!!
తు చ తప్పకుండా...ఆతని
అడుగు జాడల లో నడవడమేనండీ...రాముని
సేవించడం అంటే...!!
అప్పుడే కదా...మనం మరల
ఆ రామ రాజ్యాన్ని చూడ
గలుగుతాం....!!జై శ్రీరామ్ !
**********************
...........కోరాడ.
7
[22/01, 8:49 PM] Rama Kulakarni Hyderabad Poet: పూజనీయుడు రాముడు
అవనిలోన అన్ని గుణాలకు
అగ్రగణ్యుడు రాముడు కదా ...!
ఒక్క మాట ఒక్క బాణం ఒక్క భార్య గా
ప్రపంచానికే దిక్సూచి రాముడు కదా ...!
సార్వభౌముడై ఉండికూడాపత్నివియోగాన
సన్యసించిన సాధుపుంగవుడు రాముడు కదా...!
తల్లిదండ్రుల, తోబుట్టువులకై నిలిచిన
కుటుంబ బంధాలకు సూత్రధారి రాముడు కదా ..!
సుపరిపాలనకు ప్రజారక్షణకు
వ్యవస్తీకృతుడు రాముడు కదా ...!
మర్యాద పురుషోత్తముడు మహిలోన
ధర్మనిరతుడు మార్గగామి రాముడు కదా ...!
సంయమనానికి,సహనానికి,ధీరతకు
నిగ్రహ విగ్రహము రాముడు కదా ...!
రాముడి సేవ అన్న అది జాతి సేవకదా...!
జీవన విధానానికే మార్గగామి కదా....!
*గడప గడప కు పూజనీయుడు రాముడు కదా* ...!!!
*రాముడి సేవ అన్న అది జాతి సేవకదా...!
రమాదేవికులకర్ణి
కవయిత్రి/ రచయిత్రి
మోటివేషనల్ స్పీకర్ @ ఈటీవీ
హైదరాబాద్
8985613123
[22/01, 9:14 PM] సుధారాణి Krishnam Raju
8
Poetess: 🙏🙏కవితా గానం🙏🙏
🙏సుధారాణి కృష్ణంరాజు🙏
*అంశం*సకల గుణాభి రాముని సేవలో*
22-01-2021(శుక్రవారం)
శ్రీరామ రామ అంటేనే పాపము లు తోలగును ఆ కోదండరాముడు రఘుకులాబ్ది
సోముడు పరందాముడు
శ్రీరాముడే
ఒకే మాట ఒకటే భాణం
ఒకే పత్ని సిద్దాంతాన్ని పాటించిన రాముడు సకల
గుణాభి రాముడు
తండ్రి కోరిక మేరకు రాజ్యాన్ని
పదవిని వదిలి పెట్టిన రాముని
శీల సంపద ఎంత పొగిడినా
తక్కువే
రాముని వంటి భర్త సీత వంటి
పరమ పవిత్రమైన ఇల్లాలు
లక్ష్మణుని వంటి సోదరుడు
హనుమంతుని వంటి భక్తుడు
ఎక్కడ కనిపించరు
రాముని సేవలో తరించిన శబరి హనుమంతుడు భద్రుడు
చివరకు ఉడుత కూడా రాముని సేవలో తరించి
రామ నామాలను పొందిన
ధన్యజీవి
రామాయణం విన్నా రాముని
సేవలో తరించిన వారి జన్మలు
ధన్యం🙏🙏👍
9
[22/01, 9:22 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: శ్రీరాముని నీ నామము మరువము
రామ రఘుకుల సోమ
రాముని సేవకు తరలి పోదాం
ముక్తిని పొందుతారు
రామా రఘుకుల సోమా నయన మనోహర సౌందర్య అభిరామ
సదా హనుమని సేవలో మునిగి నమ్మినబంటుగా మారెను రా మా మా
రామాయణం వాల్మీకి విరచితము
మొల్ల అ గోనబుద్ధారెడ్డి
ఆధ్యాత్మిక రామాయణమును
తందనాన రామాయణం విశ్వనాధవారి రామాయణ కల్పవృక్షము తిక్కన నిర్వచనోత్తర రామాయణము
విశ్వవ్యాప్తం వ్యాపించెను రాముని కధ
జగదబి రామా రఘురామా
నిన్ను స్మరిస్తే పాపములన్నియు తొలగి
ముక్తి లభించును
రామనామమును జపించిన బ్రతుకు సార్థకత
సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
10
[22/01, 9:23 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..రాముని సేవలో
శీర్షిక..సకల గుణాభిరాముడు
దుష్టశిక్షణ,శిష్ట రక్షణ కోసం భువిపై అవతరించిన అవతార పురుషుడు
సకల గుణాభిరాముడు
తల్లిదండ్రుల యెడల భక్తి
సోదర యెడల ప్రేమాభిమానాలు
గురుభక్తి పరాయణుడు
స్నేహితుల యెడల ఆదరాభిమానాలు కలిగిన హితుడు
పితృవాక్య పాలన
ఒకటే మాట,ఒకే బాణమన్న ఏకపత్ని వ్రతుడు
అంతటి దివ్యమూర్తి సేవలో తరించని వారెవరు
పవిత్ర రామ నామాన్ని జపించని జిహ్వ ఉంటుందా
శత్రువునైనా చేరదీసే దయామయుడు
రామ బంటు హనుమ
ఎన్నో ఏళ్ళు రాముని కోసమే వేచియున్న శబరి
వారధి నిర్మాణంలో తోడైన వానర సైన్యం
అతిచిన్న ప్రాణి ఉడుత అందరూ రాముని సేవలో తరించిన వారే
మానవతా విలువలకు ప్రతిరూపం రాముడు
ఎన్ని యుగాలకైనా ఆదర్శనీయుడు
రాముని సేవలో తరించి చరితార్థులమవుదాం.
11
[22/01, 9:27 PM] +91 90002 51604: కవితా గానం అంశం: రాముని సేవలో ప్రమోద మునిమడుగు రండి రండి రండి రాముని సేవలో తరించ
కదలిరండి రండి శ్రీరాముని సేవలో తరించ
మనచా వాచా కర్మణా శ్రీరాముని సేవలో
తండ్రి ఆనతి తలదాల్చే తనయుడు
తల్లి కోరిక తీర్చ కదెలను కాలనమునకు
తృణ ప్రాయమైన సుఖముల వదలి
సర్వసంగపరిత్యాగి యై తాను....
బంధముల విలువ ను తెలిపి...ఆత్మ బందు వే ఈతడు
సర్వ లక్షణ సంపన్నుడితడు.....సకలజనుల పూజితు డితడు
సమస్త ప్రాణికోటి సమానమే నంటూ.....హనుమయ్య హృదయంలో కొలువున్న.... పురుషోత్తముడితడు
ఆ శబరి ఎంగిలిపండుతో..ఆకలి తీర్చుకున్న పరమాత్మ ఈతడు
పవిత్ర భక్తి కి దాసుడు ఇతడు
ఒకటే బాణం...ఒకటే పత్ని....ఒకే మాట....తన ఆభరణం
శ్రీరాముని సేవంటే నే
తన అడుగు జాడలో నడవడం...
తన ఆదర్శాలను....స్వీకరించడం
బంగరుభూమి ..మన భారత భూమిలో
అయోధ్యాపతి..మన రామ చంద్రుడు
కొలువు తీరగా.. కాంచెదమా....
శ్రీ రామ సేవకై...... తరెలదమా.....
12
[22/01, 9:29 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*
తేదీ:22-01-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: రాముని సేవలో..
************†*********
అనుబంధాల పొదరిల్లు
ఆత్మీయతకు చల్లని గొడుగు
అనురాగానికి చెరగని ముద్ర
అభిమానానికి ఆదర్శ రూపం
అందరికీ ఆయన జీవిత పారాయణం
ముక్తిని ప్రసాదించే దివ్య కావ్యం!
రామయ్యను తలుచుకుంటేనే
ఎదలో భక్తి భావం
మదిలో చైతన్య ప్రవాహం..
భువిలో వెలసిన శ్రీమన్నారాయణ స్వరూపం
జీవన పార్శ్వాలను తడిమే
సమున్నత వ్యక్తిత్వ నిలయం...
అలాంటి దివ్య మంగళ రూపమైన శ్రీరాముని సేవలో..
చిన్ని ఉడతా భక్తియే ప్రేరణగా
మన జన్మలను పునీతం చేసుకుందాం.. అమ్మహనీయుని మదిలో నిలుపుకుని
రాముని సేవలో తరించి పోదాం..
Comments
Post a Comment